బాలగణేష్ తెలుసా? ఇంకా తల్లిపాలు తాగుతున్న పసివాడు. కానీ ఉట్టుట్టి పసివాడు కాదు. వాడీమధ్య ప్రదర్శించిన లీలలో పెద్ద మెసేజి వుంది. (photo courtesy: wallpaperssfree.com) బాలగణేశుడు ప్రస్తుతం తిరుపతిలో సెటిల్ అయ్యాడు. వాడి సైజు, చేష్టలు ఇంకా తల్లిపాలు తాగే పసివాడే అని చెప్తున్నాయి. వాడుట్టి పసివాడు కాదు. పాపం! పసివాడు!! అనుకోకుండా బావిలో పడిపోయి మంద నుంచి విడివడ్డాడు. దురదృష్టం కొద్దీ తనవాళ్ళకి దూరమైనా గుడ్డిలో మెల్లలా నీళ్ళులేని బావిలో పడి ప్రాణాలతో బయటపడ్డాడు.Continue reading “ఏనుగుతలవాడి లీల – మాయ, మంత్రం కాదు! లక్షలీటర్ల…”
Tag Archives: సైంటిఫిక్ హిందూ – దేవుడిపై ఒక ఫిజిసిస్ట్ అభిప్రాయానికి కదిలిన అం’తరంగా’ల
సముద్రవసనే దేవీ! _/\_ నీరుకంటే బీరు తేలిగ్గా … :-( ప్చ్!ప్చ్!ప్చ్!
ఇంట్లో అమ్మ నెలకి సరిపడా (అనుకుని) జంతికలు, మిక్స్చరూ వగైరాలు తయారు చేసి డబ్బాల్లో పోసిపెడితే మనం రెండుమూడువారాల్లో లాగించెయ్యడం మామూలే. రెండు వారాల్లో ఖాళీ డబ్బాలు చూసుకుని నిన్నకాక మొన్న చేసినవి, అప్పుడే ఖాళీ చేసేసారర్రా!?! అంటూ పాపం అమ్మలు ఆశ్చర్యం, ప్రేమతో కొద్దిపాటి అసహనం కలిపి నిట్టూర్చడమూ మామూలే. (ఇది తెలుగువాళ్ళకి, భారద్దేశానికే కాదు అన్ని దేశాలకీ మామూలేననుకుంటా. ప్రింగిల్స్ పొటాటో చిప్స్ వాడి అడ్వర్టైజింగ్ స్లోగన్, “Once you pop, you can’t stop”Continue reading “సముద్రవసనే దేవీ! _/\_ నీరుకంటే బీరు తేలిగ్గా … 😦 ప్చ్!ప్చ్!ప్చ్!”
బాహుబలి రివ్యూ ఎంత వీజీనో రాష్ట్రపతికలాంపై తీర్పూ అంతే వీజీనా???
కలాం గొప్ప రాష్ట్రపతా కాదా అని పడక్కుర్చీ సైన్యాధిపతులు, అదేనండీ ఆర్మ్ ఛైర్ జనరల్స్ చాలామంది వాదోపవాదాలు చేసేసారు. ఇంకా చేస్తున్నారు. నాక్కూడా ఈ మహాద్భుత విద్వత్గోష్టిలో వెర్రి గొంతుక విచ్చిమ్రోయాలనీ, ఇలాంటి నిరర్ధక మేధోయజ్ఞానికి సమిధనొక్కటి ఆహుతివ్వాలనీ ఒకటే ఇది. మరోపక్క ఇదో తిలకాష్టమహిష బంధనం అని ఘోషిస్తూ లోపల్నించి అంతరాత్మ ప్రబోధం. ఏ విషయాన్నైనా రేషనల్ గా ఆలోచించగలగడం అనేది కాఫీపాన ప్రక్రియలోని స్వారస్యతని అనుభవించిన ప్రతివ్యక్తికీ అలవడే సుగుణం. అది సరిగా పనిContinue reading “బాహుబలి రివ్యూ ఎంత వీజీనో రాష్ట్రపతికలాంపై తీర్పూ అంతే వీజీనా???”
భారతం కాదు, బసవ పురాణం అంటే కోపం వచ్చింది + కోపం రాలేదు
తెలుగులో ప్రధమకావ్యం భారతం కాదు, బసవ పురాణం అంటే ఆంధ్రవాళ్లకు కోపం వస్తుంది(ట) 🙂 నేను అంధ్రవాణ్ని కాదు, తెలుగువాణ్ణి. అందువల్ల కోపం వచ్చింది 😡, కోపం రాలేదు కూడా 😐 కోపం ఎందుకొచ్చింది? తెలుగువాడైన ప్రతివాడికి కోపమొస్తుంది. “భారతం ప్రధమ తెలుగు కావ్యం కాదు,” అన్నందుక్కాదు. కవిత్వానికి, కావ్యాలకి రాజకీయరంగు పులిమినందుకు. ఈ కారణంగా కోపం రాలేదు అంటే వాడి తెలుగుదనంలో లు, గు తమ పొజిషన్లు మార్చుకున్నట్టే 😉 ఠాట్! పొజిషన్లు మార్లేదెహే! అని ఢంకాContinue reading “భారతం కాదు, బసవ పురాణం అంటే కోపం వచ్చింది + కోపం రాలేదు”
సితార సినిమాలో, భానుప్రియలా అస్తమించే సూర్యుడివైపు వెళ్తూ…
మన అన్-సంగ్ హీరో సుగుణాన్ని మొట్టమొదట గ్రహించిన భారతీయుడు త్రేతాయుగపు రాముడు. తనని అరణ్యవాసం మాన్పడానికి వచ్చిన భరతుడితో రాజు ప్రజలతో ఎలా వ్యవహరించాలో చెబుతూ – ” రాజు ప్రజలనుంచి పన్నులు వసూలు చేయడం తేనెటీగ పువ్వు నుంచి మకరందాన్ని తీసుకున్నంత సున్నితంగా వుండాల,”ని అంటాడు. ఇప్పుడేమో దేశాలని మార్కెట్స్ గా, మనిషిని మార్కెట్ ఫాక్టర్ గా (పౌల్ట్రీ ఫాం, అందులో కోళ్ళు) మార్చి డబ్బు దండుకోడానికి తప్ప ఎందుకూ పనికిరాకుండా చేస్తున్నారు. (ఎవరు? మనమే)Continue reading “సితార సినిమాలో, భానుప్రియలా అస్తమించే సూర్యుడివైపు వెళ్తూ…”