Tag: స’శేషం’

కాఫీత్వంలోనె వుంది మనిషిజన్మ సార్ధకం … నైన్త్ కప్


kaafeetva7

ఐన్-స్టీన్ సిద్ధాంతాలు=కాఫీ. మరి భగవద్గీత? ఇది ఎనిమిదో కప్పు


ఫిజిక్స్ పాలిటి పరమాచార్యుడు, ఆల్బర్ట్ ఐన్-స్టీన్ కాఫీ గురించి ఏమన్నాడో తెలుసా ? (గణిత) శాస్త్రజ్ఞుడు అంటే కాఫీని సైన్సుసిద్ధాంతాలుగా మార్చే ఒక పరికరం అని. “A mathematician is a device for turning coffee into theorems.”  ఐనుస్టీనులవారు ఇలా సెలవిచ్చారంటే నమ్మనివాళ్ళు ఎలాంటివాళ్ళంటే – సపోజ్, ఫర్ సపోజ్! భగవద్గీత అంతావిని, ఆపైన విశ్వరూపం  చూసేసి కూడా  ఠాఠ్! నేను యుద్ధం చెయ్యనుగాక  చెయ్యనని అర్జునుడు  వెళ్లిపోయాడనుకోండి – అలాంటి అర్జునుడితో సమానులనమాట! అసలు ఐన్-స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ తన పూర్వ జన్మలో కాఫీ అన్న రియలైజేషన్ !!! వౌ! మైండ్ బాగ్లింగ్! ఇంకా నయ్యం! కృష్ణ పరమాత్మకి వెన్న పట్ల వున్న ఆబ్సెషన్ మనకి తెలుసు కాబట్టి సరిపోయింది + మహాభారత సమయానికి కాఫీ లేదు. ఐన్-స్టీన్ మాటలు పట్టుకుని భగవద్గీత ఈజ్ నథింగ్ బట్ ఏ కప్ ఆఫ్ కాఫీ అన్నా అనేస్తారు కాఫీని కుహనా సెక్యులరిజంతో కల్తీ చేసే కొందరు మేధావులు.

kaafeetva6

 

సప్తమ కప్పు – కాఫీలాంటి ఆనంద్..ఆనంద్ లాంటి కాఫీ


ఒక యూనివర్సిటీ పూర్వ విద్యార్ధులు కొందరు తమకి పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ గారింట్లో కలుసుకున్నారు. అందరూ తమ తమ కెరీర్స్ లో మంచి స్థాయిల్లో ఉన్నవాళ్ళే. అందరు యావరేజ్ ఇండియన్ మేల్స్ లాగే వీళ్ళూ ఉద్యోగాల్లో, డే-టు-డే లైఫులో పడుతున్న బాధలు, స్ట్రెస్సూ అంటూ ఇంకే టాపిక్కూలేనట్టు అదే సుత్తి కొడుతుంటే ప్రొఫెసరు గారికి చిరాకు పుట్టింది. కిచెన్ లోకి వెళ్ళిపోయి అందరికీ కాఫీలు కలుపుకొచ్చాడు. కాఫీ కప్పులు రకరకాలు – ప్లాస్టిక్, పింగాణీ, గ్లాసు, క్రిస్టల్ – ఖరీదైనవి, చీప్ గా వున్నవి, అందమైనవి, ఇలా వున్నాయి. అక్కడున్నవాళ్ళకన్నా ఎక్కువ సంఖ్యలోనే వచ్చాయి కాఫీలు. అందరూ కాఫీలు అందుకున్నారు. కొన్ని మిగుల్తాయి కదా! ప్రొఫెసరు మిగిలిన పోయిన కప్పుల్ని చూపిస్తూ అన్నాడు – ” మీరు గమనించారో లేదో అందమైన, ఖరీదైన కప్పులే మీరంతా తీసుకున్నారు. ప్లాస్టిక్ వి, పాతవి ఎవరూ ముట్టుకోలేదు. జీవితంలో బెస్ట్ థింగ్స్ కోరుకోవడం సహజమే కానీ ప్రాబ్లెమ్స్ అన్నీ ఆ కోరికలోనే వున్నాయి. మీరు తాగేది కాఫీ, కప్పు కాదు. అన్ని కప్పుల్లోనూ అదే కాఫీ వున్నా ప్రతీ ఒక్కరు ఖరీదైన కప్పే కోరుకున్నారు. పక్కవాడికి ఎలాంటి కప్పొచ్చిందా అని చూస్తున్నారు. నౌ, జీవితం కాఫీ అనుకుంటే ఉద్యోగం, డబ్బు, ఆస్తి, స్టేటస్ .. ఇవి కప్పులు. జీవితం గడపడానికి అవి సాధనాలు. అంతే! వాటి మీద ఫోకస్ ఎక్కువైతే జీవితం ఎంజాయ్ చెయ్యలేరు. కప్పులు కంపేర్ చేస్తూ కూచుంటే కాఫీ ఎంజాయ్ చెయ్యలేనట్టు,” అన్నాడు. తరవాతేమయిందో మనకి తెలీదు.

తెలుసుకోవడం కూడా అనవసరం. ఎందుకా? ఎందుకంటే జీవితం విషయంలో ప్రొఫెసర్ సలహా అవసరమే కానీ కాఫీ విషయంలో కాదు.

వై బికాజ్, పొజిషన్ కన్నా జీవితం గొప్పది.

కప్పు కన్నా కాఫీ గొప్పది.

దేర్-ఫోర్, జీవితం కంటే కాఫీ విలువైనది.

పిచ్చి లాజిక్కనిపిస్తోందా? ఇంకా పిచ్చిగా అనిపించే లాజిక్ కూడా వుంది. ప్రేమవున్నచోట లాజిక్ వుండదు అన్నప్పుడు కాఫీ వున్నచోట లాజిక్ అనే మాట కూడా వుండదు. అందువల్ల జీవితం కన్నా, ప్రేమకన్నా కూడా కాఫీయే విలువైనది అని తేలుతోంది. ఇలాంటి లాజిక్కుల ద్వారా తెలుసుకోవలసింది, ఇదీ –

 కాఫీ క్వాలిటీ బావుంటే ఏ కప్పులోతాగినా ఆనందం తప్పదు. దానికి మనమేం చెయ్యలేం. కానీ అందమైన కప్పుతోనో, ధగ ధగ మెరిసే స్టీల్ గ్లాసులోనో నురుగులు కక్కే ఫిల్టర్ కాఫీ తాగితే ఆ ఆనందం ఎక్స్పొనెన్షియల్ గా, ఎక్స్ప్లోజివ్ గా పెరిగిపోతుంది. 

చుట్టూ అందమైన వాతావరణం వుంటే ..

చక్కటి సంగీతం వింటూ వుంటే…

మంచి పుస్తకం చేతిలో వుంటే ….

దీనికీ ఏం చెయ్యలేం, ఎంత లెవెల్లో వీలయితే అంత లెవెల్లో ఆనందించడం తప్ప.

మంచి కాఫీ నిజానికి ఆనంద్ సినిమాలాంటిది. అందుకే శేఖర్ కమ్ముల తన ‘ఆనంద్’కి మంచి కాఫీ లాంటి సినిమా అని టాగ్ లైన్ పెట్టారు. హృషీకేశ్ ముఖర్జీ తన 1971 ఆనంద్ కి కాఫీ టాగ్ తగిలించకపోయినా ఆ సినిమా కూడా కాఫీలాంటిదే, బ్లాక్ కాఫీలా చేదైన ఆనందం ఇస్తుంది.

యూ కెన్ ఇమాజిన్ ఇట్, రైట్! సో, డోంట్ కాంప్రమైజ్ వెన్ ఇట్ కన్సర్న్స్ కాఫీ!

kaafeetva5

 

 

 స’శేషం’

గాంధీజీ చేత కాఫీ కలిపించిన కాప్రి + 6th cup of Kafeetva


సబర్మతి ఆశ్రమంలో వుండే ఎవరికైనా ఒంట్లో బావుండకపోతే వాళ్ళ ట్రీట్-మెంట్, తక్కిన అవసరాలు అన్నీ గాంధీజీ తనే స్వయంగా చూసుకునేవారు. ఒంట్లో బావుండక పడకేసినవాళ్ళది అదృష్టం అనుకునేవాళ్ళుట ఆశ్రమవాసులు. ఎందుకంటే అనారోగ్యంతో ఉన్నవాళ్ళని ప్రతిరోజూ గాంధీజీ వచ్చి చూసేవారు, మాట్లాడి, జోక్స్ వేసి ఉత్సాహపరిచేవారు మరి.

KAAFEETVA 4

ఒకసారి డిసెంట్రీతో మంచం పట్టిన ఒక తమిళ యువకుడు పథ్యాలతో విసిగి తనకిష్టమైన కాఫీ ఎప్పుడు తాగగలనా అని నిట్టూర్చుకుంటున్న సమయానికి గాంధీజీ పావుకోళ్ల టకటక వినబడింది. కాఫీ పోతేపోయింది బాపూజీ కబుర్లు వినొచ్చులే అనుకుని బెడ్ మీద లేచి కూచున్నాడు. ఇంతలో గాంధీ లోపలికి వచ్చి, “ఇవాళ బాగా కోలుకున్నట్టు కనిపిస్తున్నావు, ఆకలి కూడా ఇంప్రూవ్ అయ్యుంటుంది. నీకేం తినాలనుంది? ఉప్మానా? దోసె కావాలా?,” అన్నారుట. మనవాడు కాఫీకి మొహం వాచీవున్నాడు కదా, గాంధీజీ కాఫీ, టీలు తాగడం ఇష్టపడరని తెలిసీ అదే కావాలని అడిగేశాడు. ఆయనేమో, “ఓరి! పాపాత్ముడా! నీకు కాఫీయే కావాల్సొచ్చిందా?,” అని గట్టిగా నవ్వి, “సరే! నీకో కాఫీ పంపిస్తాను, లైట్ కాఫీ నీకు మంచిదే,” అని వెళ్ళిపోయారు. మన హీరో మహదానందంగా ఎవరో కాఫీ పట్టుకుని వస్తారు అని ఎదురు చూస్తుండగా మళ్ళీ పావుకోళ్ల టకటక వినబడింది. గాంధీజీ కాఫీ కాన్సిల్ చేసేశారేమో, అది చెప్పడానికి వస్తున్నారనే ఊహ కలిగి మొహం వేలాడేయడానికి రెడీ అయిపోయాడు. అంతలో గాంధీ తాత కాఫీ ట్రే పట్టుకుని లోపలికొచ్చారు. మనవాడు మళ్ళీ డీలా పడ్డాడు బాపుకి పని పెట్టానే అనే బాధతో. “బాపూ! ఎవరితోనైనా పంపకుండా మీరు తెచ్చారేంటి,” అని మొహమాట పడ్డాడు. “మొహమాట పడితే కాఫీ ఎంజాయ్ చెయ్యలేవు. కస్తూర్బా రెస్టు తీసుకునే టైము. ఆమెని డిస్టర్బ్ చెయ్యడం ఇష్టంలేక నేనే కలుపుకొచ్చాను. నా కాఫీ బావుందా లేదా చెప్పు,” అని, “కాఫీతో ఉప్మా, దోసెల కంటే టోస్ట్ బావుంటుందని అది కూడ తెచ్చాను,” అన్నారుట. అలా అని వెళ్ళిపోయారు. మన కాఫీ ప్రియుడు కాఫీ లైటుగా వుందే అనుకుంటూనే ఒక సిప్ చేశాడు అద్భుతంగా వుందిట. వుండదా మరి? కలిపింది మహాత్ముడయ్యె. ఎవర్నీ డిస్టర్బ్ చెయ్యకుండా వంటింట్లోకి వెళ్లి స్టవ్ వెలిగించి కాఫీ కలిపి, టోస్ట్ చేస్తున్న దృశ్యం ఊహించుకుని ఆయన్ని జాతిపితగా కాక కొడుక్కి ప్రేమతో కాఫీ కలిపిచ్చిన తండ్రిలా భావిస్తూ, ప్రపంచంలోనే అత్యంత విలువైన, అరుదైన కాఫీని ఎంజాయ్ చేశాడు.   

గాంధీజీ చేతి కాఫీ కోసం టైం మెషీన్లో కూచుని చరిత్రలోకి వెళ్లిరావాలని వుంది కానీ తిరిగొచ్చేటప్పుడు ఆయన దేశవిభజనని, అనంతర హింసని చూసి ఆయనపడ్డ బాధ రిపీటవ్వడం ఇష్టంలేక ఆ ఊహ వదిలేసుకున్నా.   

BTW, కస్తూర్బా తన కిచెన్ లో అతిధుల కోసం కాఫీపొడి, టీ ఉంచేవారు(ట), ముఖ్యంగా రాజాజీలాంటి వారికోసం. 

కాప్రి అంటే లియోనార్డో డి కాప్రి లాంటి కాప్రి కాదండోవ్ కాఫీ ప్రియుడు.

అలా కొంచెం కిందకెళ్ళి ఎడం వైపుకి తిరిగితే పాత కాఫీ పోస్ట్లు కనిపిస్తాయ్

ఫిఫ్త్ కప్ ఆఫ్ కాఫీత్వ> బాప్తిస్మం – బ్లాస్ఫెమీ – ఘర్ వాపసీ


బాప్తిస్మము

బ్లాస్ఫెమీ

ఘర్-వాపసీ

క్రూడాయిల్

వీటన్నిటి మీదా వాదించుకోడానికి, తి(కొ)ట్టుకోడానికి, యుద్ధాలు చేసుకోవడానికి చాలామందే వున్నారు. కొన్నాళ్ళయ్యాక పై టాపిక్స్ అన్నీ ఎగ్సాస్ట్ ఐపోతే కొట్టుకోడానికి కొత్తగా వాటర్ వార్స్ కాన్సెప్ట్ వుండనే వుంది. వాళ్ళు ఆ కార్యక్రమాలన్నీ యధావిధిగా నిర్వర్తిస్తున్నప్పుడు మనకెందుకు ఆ గొడవ? రాష్ట్రాల విభజనల పేరుతో విభజనలు ఐపోయాక కొట్టుకునే, కనీసం తిట్టుకునే, అవకాశాలు దండిగా సృష్టించుకునే నైపుణ్యంవున్న నాయకులు దండిగా వున్నారు.

కాఫీత్వలో తత్వ మీద ఉన్న ఇంటరెస్టు ఫత్వా మీద వుండదు. ఆ తత్వ కూడా అందరినీ సమదృష్టితో వేడిగా చూస్తూ, అందరిచేతా సమానంగా ప్రేమించబడే కాఫీకి సంబంధించిన తత్వ, సో, కాఫీత్వ ఈజ్ ఏ కంప్లీట్లీ, నాన్-కంట్రావర్షియల్ ఫిలాసఫీ. ఆ మధ్య ఒక స్కాలర్ అన్నారు – “జ్ఞాని అయినవాడు తన జ్ఞానాన్ని ప్రదర్శించడు, ప్రదర్శించేవాళ్ళెవరూ జ్ఞానులు కారు,” అని. ఈ సూత్రం కాఫీత్వానికి వర్తించదు. కాఫీ గురించి దాన్ని ప్రేమించే ఎవ్వరైనా హాయిగా మాట్లాడవచ్చు. ఇలా –

kaafeetva 3

కొంచెం కిందకెళ్ళి ఆకడున్న లెఫ్ట్ ఫేసింగ్ యారో క్లిక్ చేసారో  తక్కిన కాఫీత్వ పోస్ట్స్ కనిపించేస్తాయ్, జాగ్రత్త!! తరవాత మీ ఇష్టం. 🙂

 

టూత్-బ్రష్షూ కాల్గేట్ పేస్టూ ; లాప్-టాపూ కాఫీ కప్పూ …


పొద్దున్నే మొహం కడుక్కోవడం (పళ్ళతో సహా) ఐపోగానే …..

లైఫ్ ఈజ్ ఎ మైండ్ బాగ్లింగ్ ఇంటలెక్చువల్ టర్మాయిల్ …..

సోమపానం చేసిన వాళ్ళు ఆర్యులు, మరి సోమలత ఇప్పుడు దొరుకుతోందా?

kaafeetva 3

కాఫీత్వ – మూడో కప్పు, ఇట్’స్ హాట్ !!


ఒకప్పటి, యూఎస్ ప్రెసిడెంటు రోనాల్డ్ రీగన్ సినిమా రంగంనుంచి  రాజకీయాల్లోకి వచ్చాడు. అటు సినిమా ఫీల్డు, ఇటు పాలిటిక్సు తెలిసినందువల్ల ఆయనకి ఆ రెండు రంగాలపై కాఫీ ప్రభావం ఏమిటో ఎంతో తెలిసే అవకాశం ఉండే ఉంటుంది — కదా!!

Now enjoy ur latest cup of coffee _/\_ 🙂

kaafeetva 2

చట్టసభల్లో కునుకు తీసే ప్రైమ్ మినిస్టర్లు, ఎంపీలు

అసెంబ్లీల్లో బ్లూ ఫిల్ములు చూసే ఎమ్మెల్యేలు 

సినిమాలని మసాలా పాకేజిలు చేసేసిన కళామతల్లి ‘ముద్దుబిడ్డలు’

వీళ్ళందర్నీ భరిస్తూ తరిస్తున్న జనజీవన స్రవంతి 

– ఈ వర్గాలు లేకుండా ఈ పోస్టు సాధ్యపడేది కాదు. ఇది వారికే అంకితం. 

కాఫీత్వ – ఓ కప్పు కాఫీ, ఒక మాట & నేపాల్ భూకంపానికి అసలు కారణం!!


kaafeetva 1

కాఫీత్వ ఫాలోవర్స్ కి ఎప్పుడూ కూడా బ్రెయిన్ పని చేస్తూఉండాలి. అదీ పదునుగా.

అలా అని కాఫీ తాగేవాళ్ళంతా  షార్ప్-మైండెడ్ అనుకోరాదు.

మెదడుకి పని పెట్టడానికి, పదును పెట్టడానికి కాఫీ తాగేవాళ్ళే మెజారిటీ.

శ్రీశ్రీ మైండు షార్పు కనక ఆయనకి కాఫీ ఇష్టం.

నా మైండు షార్పు కానందువల్ల నాకు కాఫీ ఇష్టం.

అదన్నమాట కాఫీత్వ ఫిలాసఫీ, నో, ఫిలాకాఫీ 🙂

దేర్-ఫోర్ కాఫీత్వ ఫాలోవర్స్ కాని వాళ్ళెవరూ ప్రపంచంలో వుండరు.

వుండరు అంటాం, వుండరు అని నమ్ముతాం కనక ప్రమాదం లేదు.

వుండకూడదు అంటే కాఫీత్వ కాస్తా కా’ఫత్వా’ ఐపోగల్దు. కాఫీ విషయంలో కాంప్రమైజులు పనికిరావు. సో, కా‘ఫత్వా’ ఫీత్వ ఎలోన్ ఈజ్ రైట్!!

 

‘కాఫీ’త్వ


KAAFEETVA

ఈ పొద్దు, పవన్ కళ్యాణ్ యాదికి రాలే, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అనేటి …..


————————————————————————————————————————————

చూసినవా? చికెన్ బ్రెయిన్ పనిజేసుడు షురూ అయిపాయె. ఇంగ నేను జెప్పెడిది ఎట్ల సమజయితదిరా భయ్ నీకు? నీలెక్క సోంచాయించబట్టి ఇప్పుడు మనుషులందర్ దేవుని పేరు మీదిడిపోయి సంపుడో! సచ్చుడో ! అనే లెక్క కొట్టుకుంటుండ్రు. ఆళ్ళల్ల నువ్వొక్కనివి తక్కువైనవ్. కోడిదేవుణ్ణి బెట్టుకుని కోడి మతం తయారు జేసేటోడివే.

————————————————————————————————————————————

ఈపోస్టులను సహనంతోని చదివేటోళ్ళందర్కి మొదల్లనే కృతజ్ఞతల్ జెప్పాల్నని డిసైడ్ జేసుకున్న, గిప్పుడు జెప్తున్న. థాంక్స్ జెప్పుడెందుకంటె మేడమూ / సారూ! వేరే ప్రాంతాలోళ్ళకు ఈ యాసర్ధం జేస్కొని సదువుడు కష్టమైతదిగద! ఐనగూడ ఎట్లనోగట్ల సదువుతున్నరని థాంక్సు జెప్తున్న. ఏమో, నేను రాసెడి తీరు ఎట్లున్నదో ఏందో నాకైతే తెల్వదుగద. నోటికొచ్చింది వాగుడు, చేతికొచ్చింది రాసుడు. ఈ పొద్దు నాకు మైండుల, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అనేటి అమెరిక పెద్దమనిషి కనపడతుండు. కొద్దిగ ఆయన మాటలు జెప్పుకునేడిదుంది. ముందుగాల నాకైన ఓ ఎక్స్పీరియన్సు ఒకటి షేర్ జెయ్యాలె.

మూడు నాలుగు సమత్సరాల కిందటి మాట. ఒకనాటి రాత్రి పన్నెండుగంటలైతుండగ ఫోను మోగింది.  విజయవాడల నాతోని ఇంజనీరింగు జదివిన దోస్తొకడు మాట్లాడుతుండు అమెరికలుంటడు. మామూలిషయాలు మాట్లాడినంక, “భయ్! నీతొని ఒకిషయం జెప్పాలెనన్నడు.” “చెప్పుర భయ్!,” అని నేనుగుడ అనేసిన. “నీ పేరు జెప్పి ఒక పామును అడవిల ఇడిచిపెట్టొచ్చిన,” అన్నడు. నాకైతె ఏమర్దంగాలె. పామేంది, దాన్ని జూసి నా పేరు గుర్తొచ్చుడేంది అనుకున్న, గదే మాట వానినే అడిగిన. “భయ్! దిమాగ్ సరిగ పనిజేస్తలేదు. కొద్దిగ నువ్వెజెప్పరాదు? పామును జూసి నా పేరు జెప్పుడేంది,” అని అడిగిన. అప్పుడు నాకు యాద్ జేయించిండు. కాలేజి హాస్టల్లవుండెతప్పుడు ఆడ మాతో పాములు గూడ ఉండేటివి. రాతిరి టైముల వాకింగ్ జేస్తుంటే కప్పలను మింగనీకి దిరిగె పాములు కూడ మాతో వాకింగ్ జేస్తుండె. కాలేజి, హాస్టలు అన్నీ పొలాల మధ్యనుండె. ఒకనాడు వాకింగు టైముల బాట పక్కన కప్పను మింగుతున్న జెర్రి గొడ్డును జూస్తావుండగ నైటు వాచ్-మన్నొచ్చి కర్రతో ఫట్ట ఫట్ట గొట్టి పామును జంపిండు. కప్ప రక్తాలు కారుకుంట బత్కిపొయ్యింది. పాము కప్పను దిన్నట్టాయనా, ఎవర్నేంజేయ్యకుండ పోయేటిది. నా కంటబడనుగదా సారూ! దానికి సచ్చె సావొచ్చింది? నాకు మాత్రం బలే బాద. అప్పుడప్పుడే అడవులన్న, జంతువులన్న, పర్యావరనమన్న నాకు ఇంటరెస్టు ఎక్కువైతుండె. అప్పటి సంది ఎవడైన పాముల జంపనీకి పోతుండగ జూస్తే సాలు, కొంచెం లొల్లి జేసెటోన్ని. శబ్దమిన్న పాము ఆగుతాది? బర్ర బర్ర పాక్కొని పారిపోయి బతికేటివి. నా దోస్తులకు నా బిహేవియరు అస్సలు అర్ధం కాకుంకుంటుండె.  అప్పుడు నేను పర్యవరన, ప్రకృతి .. ఇట్లాంటిష్యాలపై క్లాసు పీకెటోన్ని. కొంతకాలానికి అర్ధమైందో ఏందో తెలవదు. ఇన్నేళ్ళయినంక ఈ రోజు ఫోన్ జేసి, “నువ్వప్పుడు జంతువులను రక్షించమనేటోడివి, ఈ రోజు మాఇంట్లకు పామొస్తే, నీ మాటలు యాదికొచ్చి దాన్ని చంపబుద్దెయ్యలే, కర్రతోని తోసుకుంటా మా శీనుగాని పేరుజెప్పి నిన్నొదిలి పెడతన్నా అని ఇంటి బయట అడవిలెక్కున్న చెట్లల్ల వదిలేసిన,” అన్నడు. సారూ/మేడమూ ! ఆ రోజు నాకెంత సంతోషమయిందంటే … ఈ వాక్యం పూర్తి జెయ్యనీకి రావటంలే.. అంత సంతోషమన్నట్టు. గిదంత ఎందుకు చెప్పిన్నంటే, ఇందనక మెన్షన్ జేసిన గద, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, ఆయనేమన్నడంటే –  “To know even one life has breathed easier because you have lived. This is to have succeeded,”   అన్నడు. నా దోస్తుజేసిన పనికి అసుంటి సక్సెస్ ల చిన్న నలకంత భాగం నాగ్గూడ దక్కిందిగద? ఈ ఎమర్సన్ సారు 1845లనే భగవద్గీత చదివిండంట. ఈయన రాసిన రాతలు సదివెటోళ్లకు ఆయన అద్వైతసిద్దాంతం నమ్ముతడా అన్నట్టుండెనంట. ఈ కిందున్నది ఎమర్సన్ సారు కొటేషనే! సూడున్రి –

We live in succession, in division, in parts, in particles. Meantime within man is the soul of the whole; the wise silence; the universal beauty, to which every part and particle is equally related, the eternal ONE. And this deep power in which we exist and whose beatitude is all accessible to us, is not only self-sufficing and perfect in every hour, but the act of seeing and the thing seen, the seer and the spectacle, the subject and the object, are one. We see the world piece by piece, as the sun, the moon, the animal, the tree; but the whole, of which these are shining parts, is the soul. 

అమెరికన్ల జీవనిదానంల భారతీయ విలువలుగాని కనపడినయంటే (నిజంగనే వున్నయంట), అది ఎమర్సన్ సారు సలవేనంట. మాజీ డీజీపి అరవిందరావు సారు చెప్తుంటిన్న. ఇది కొంచెం రాయనీకే కష్టమైంది ఇంక ఆపుత! ఇగ, కోడి మేక సంవాదంల మూడో బాగం సూడున్రి – kodi meka 03

పార్ట్ 2 > “మోడీ సారు, అమితాబ్బచ్చన్ వెజ్జు ఫుడ్డే తింటరంట; సెహ్వాగ్, పవన్ కళ్యాణులు గుడ వెజిటేరియన్సని …..” ఈడున్నది >> http://wp.me/p2uFNm-fm

పార్ట్ 1 > “రిచర్డ్ గెరె, హాలీవుడ్ల హీరో యేషాలేసేటోడు, ఇట్లన్నడు….” ఈడున్నది >> http://wp.me/p2uFNm-fd

స’శేషం’