ప్ర.ప్రొ.ప్ర.ప్ర.ప్ర.ప్ర.ప్ర.ప్ర – పుష్కరాల్లో ‘ప్రా’సక్రీడ పుష్కరాల తొక్కిసలాటపై జరిగిన ఒక టీవీ డిబేట్ లో మూడు ‘ప్ర’ లు దానికి కారణంగా తేల్చారు. ఇంకో రెండు, – ఒక ‘ప్ర’, ఒక ‘ప్రొ’ – మెన్షన్ చెయ్యకుండా వదిలేసారు. వదిలేసిన నాలుగో ‘ప్ర’ అంటే ప్రజలు. ప్రజల్నేమనాలో ఎలా అనాలో తెలీక, అనే ధైర్యం లేక వదిలేసారు. క్రమశిక్షణ తెలీని, అలవాటుపడని అనచ్చు కానీ ప్రజలే బాధితులు కనక ఇది సందర్భం కాదు అని వదిలేసారు అనుకోవచ్చు.Continue reading “ప్ర.ప్రొ.ప్ర.ప్ర.ప్ర.ప్ర.ప్ర.ప్ర – పుష్కరాల్లో ‘ప్రా’సక్రీడ 24th cup of Coffeetva”
Tag Archives: స’శేషం’
డౌట్లడిగే చికెన్-మాట్లాడే మటన్ (2)
డౌట్లడిగే చికెన్-మాట్లాడే మటన్ (1) ఇక్కడ –> http://wp.me/p2uFNm-j2 అరవింద్ అడిగ రాసిన ద వైట్ టైగర్ నవల అది ప్రింటయిన ఆరేళ్ళ వరకు నా చేత చదవబడలేక పోయింది. సముద్రతీరంలో నుంచుని అందులో వుండే సొరచేపలని, సునామీలని, అగ్నిపర్వతాల్ని, అంధకారపు అగాధాలని మర్చిపోయి నీలి కెరటాల సోయగాల్ని చూస్తూ వుండిపోయిన వాడికి సడెన్ గా అవన్నీ గుర్తొస్తే ఎలా వుంటుంది? అలా అనిపించింది. కొన్నిచోట్ల అరవింద్ మీద వొళ్ళు మండిపోతుంది. ఇండియాని మరీ దారుణంగా చిత్రిస్తున్నాడా అనిContinue reading “డౌట్లడిగే చికెన్-మాట్లాడే మటన్ (2)”
సత్యం=కాఫీ; మతం=ఫిల్టర్ అడుగున మడ్డి
పూర్వం ఎప్పుడో ఎక్కడో ఒక వూరుండేదిట. ఆ వూరిచుట్టూ చాలా ఎత్తైన పెద్ద ప్రహరీ గోడ. అవతల ఏముందో అందరికీ విపరీతమైన క్యూరియాసిటీ. అయితే ఎవరూ దాటి వెళ్ళరు, అది పడగొట్టనూలేరు. దాంతో గోడవతల వున్నదానిపై ఊరంతా ఊహాగానాలే కానీ, ఖచ్చితంగా ఏఁవుందో తెలిసినవాడు ఒక్కడూ లేడు. చాలా ఏళ్ళకి ఓ ముగ్గురు సాహసించి, అసాధ్యం అనుకున్న ప్రహరీ గోడ ఎక్కేసారు. అవతల ఏం అద్భుతం కనిపించిందో ఏమో ఒకడు అవతలి పక్కకి దూకేసాడు. ఇంకొకడు గోడ మీదేContinue reading “సత్యం=కాఫీ; మతం=ఫిల్టర్ అడుగున మడ్డి”
ప్చ్!ప్చ్!ప్చ్! – జైల్లోమూగజీవి జైలుబైట (దుర్)బుద్ధిజీవి
అది నలుగుర్ని చంపినందుకు పడిన శిక్ష. న్యాయానికి గంతలు కట్టి చట్టాన్ని పిల్లి మొగ్గలేయించడం చేతకాక ముద్దాయి బెయిల్ కోసం, విచారణ స్థలం మార్పు కోసం ట్రై చేసి బయటపడ్డానికి ట్రై చెయ్యకుండా తీరిగ్గా శిక్ష అనుభవించటానికి రెడీ ఐపోతే జనం ఊరుకోట్లేదు. ముద్దాయికి స్వేచ్ఛనిచ్చి వదిలెయ్యాలని ధర్నాలు, సత్యాగ్రహాలు మొదలెట్టారు. ఇంతకీ ఆ ముద్దాయి పేరు – పేరు : ఉస్తాద్ వయసు : ఎనిమిదేళ్ళు. పుట్టి పెరిగింది : రాజస్తాన్ లో. ఘనత : ఎనిమిదేళ్ళ వయసుకేContinue reading “ప్చ్!ప్చ్!ప్చ్! – జైల్లోమూగజీవి జైలుబైట (దుర్)బుద్ధిజీవి”
ప్చ్!ప్చ్!ప్చ్! – రెండోసారి
అది నలుగుర్ని చంపినందుకు పడిన శిక్ష. న్యాయానికి గంతలు కట్టి చట్టాన్ని పిల్లి మొగ్గలేయించడం చేతకాక ముద్దాయి బెయిల్ కోసం , విచారణ స్థలం మార్పు కోసం ట్రై చేసి బయటపడ్డానికి ట్రై చెయ్యకుండా తీరిగ్గా శిక్ష అనుభవించటానికి రెడీ ఐపోతే జనం ఊరుకోట్లేదు. ముద్దాయికి స్వేచ్ఛనిచ్చి వదిలెయ్యాలని ధర్నాలు, సత్యాగ్రహాలు మొదలెట్టారు. ఇంతకీ ఆ ముద్దాయి పేరు – పేరు : ఉస్తాద్ వయసు : ఎనిమిదేళ్ళు. పుట్టి పెరిగింది : రాజస్తాన్ లో. ఘనత : ఎనిమిదేళ్ళ వయసుకేContinue reading “ప్చ్!ప్చ్!ప్చ్! – రెండోసారి”
ఒకదాంట్లో మనిషి దేవుణ్ణి ఇరికిస్తే రెండోదాంట్లో మనిషిని మనిషే ఇరికిస్తాడు
కాఫీత్వం, కాఫీత్వజ్ఞానం వగైరా వగైరా పదాలు కాయిన్ చేసేసి ఏదో నోటికొచ్చిన వాగుడేనా ఇందులో ఏమైనా సబ్-స్టెన్స్ ఉందా? కాఫీత్వ అంటే ఇన్స్టెంట్-కాఫీయా, గౌర్మెట్ కాఫీయా అనే డౌటు పద్నాలుగు కప్పులు కలిపాక ఇప్పటికొచ్చింది నాకు. అది తీరక బుర్ర గోక్కుంటుంటే “పానశాల” గుర్తొచ్చింది. మనం ఒమర్ ఖయాం అంతటి వాళ్ళం కాకపోవచ్చుకానీ ఆయనకీ, మనకీ – తాగే పదార్ధం వేరే అయినా- తాగడం అనే కామన్ ఫాక్టర్ ఉంది కదా, అందుకే అది గుర్తొచ్చి వుంటుంది.Continue reading “ఒకదాంట్లో మనిషి దేవుణ్ణి ఇరికిస్తే రెండోదాంట్లో మనిషిని మనిషే ఇరికిస్తాడు”
అత్తాకోడళ్ళ నుంచీ అల్-కైదా వరకూ …13వ కప్పుకాఫీ
ఒరులేయవి యొనరించిన నరవర! అప్రియము తన మనంబున కగుఁదా నొరులకు నది సేయకునికి పరాయణము పరమ ధర్మపథములకెల్లన్ – (ఇతరులు మనపట్ల ఏ పని చేస్తే మనకిష్టం వుండదో ఆ పని ఇతరులకు చేయకపోవడం ఉత్తమ ధర్మం). ఈ పద్యం మహాభారతంలోదని మనకి తెలియకపోయినా పరవాలేదు కానీ పద్యం అర్ధం తెలిసి ఆచరిస్తే (అందరున్నున్నూ) ఇపుడు ప్రపంచంలో అత్తాకోడళ్ళ నుంచీ అల్-కైదా వరకూ వున్న చెత్త సమస్యలుండేవే కావు. ఇంజినీరింగ్, టెక్నాలజీ, మానేజ్-మెంట్ విషయాల్లో ఎలాంటి ప్రాబ్లంContinue reading “అత్తాకోడళ్ళ నుంచీ అల్-కైదా వరకూ …13వ కప్పుకాఫీ”
ఇంట్లో వంటంత టైం వేస్ట్ మరోటి లేదు(ట) – ఇతి శ్రీ ద్వాదశకప్పు కాఫీత్వః
చిన్నప్పుడు ఆంధ్రప్రభలో ఓ కార్టూన్ చదివాను. ఒకడు ‘ఉల్లిపాయలో సీ విటమిన్ వుందని కనిపెట్టానోయ్ పీ.హెచ్.డీ వచ్చింది,’ అంటే రెండో కారెక్టర్, ‘ఉల్లిపాయలో సీ విటమిన్ లేదని కనిపెట్టి నేను పీ.హెచ్.డీ కొట్టానోయ్,’ అని నవ్వుకుంటూ వుంటారు. కార్టూన్ నేపధ్యం అర్ధమయ్యేంత సీన్ అప్పుడు లేదు కానీ, పీ.హెచ్.డీ లు సంపాదించడమనేది ఏ కారణంచేతో హాస్యాస్పదం అయ్యింది అని మాత్రం తెల్సింది. తరవాత రోగాల విషయంలో డాక్టర్లు, కేసుల విషయంలో కోర్టులు, ప్రజా సమస్యల విషయంలో పార్టీలు ఒకదానికొకటిContinue reading “ఇంట్లో వంటంత టైం వేస్ట్ మరోటి లేదు(ట) – ఇతి శ్రీ ద్వాదశకప్పు కాఫీత్వః”
అందమే ఆనందం=ఖిల్తే హై గుల్ యహాఁ=Where Eagles Dare=11th cup
అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం .. పాడుకున్నప్పుడు, విన్నప్పుడు, అందులో ఏఎన్నార్ ఎక్స్ప్రెషన్స్ కి మురిసినప్పుడు చల్లగా రావేలా , మెలమెల్లగ రావేల, వినీలా మేఘమాలా … పాటలో బ్లాక్ & వైట్లో అందంగా పడే వర్షం చూసినప్పుడు మేరె సప్నోంకి రానీ కబ్ ఆయేగీ తూ .. చూస్తూ, వింటూ ఆ సీన్లోకి వెళ్ళిపోయి రాజేష్ ఖన్నాతో జీపులోనో, షర్మిలా టాగోర్ తో టాయ్ ట్రెయిన్ లోనో ప్రయాణించేస్తున్నప్పుడు … ఖిల్తే హై గుల్Continue reading “అందమే ఆనందం=ఖిల్తే హై గుల్ యహాఁ=Where Eagles Dare=11th cup”
ఫిలాసఫీ – ఋణమాఫీ – ఒక కాఫీ
ఫిలసాఫీ చదవని పాపము ఋణమాఫీ చెయ్యని నేరము ఒకకాఫీ త్రాగని దోషము అవి కాఫీత్వము చదివిన పోవును Note : చివరలో తధ్యము సుమతీ! యాడ్ చేసికూడా పై పద్యమును చదవవచ్చును.