సినిమాల్లో పవర్ స్టార్ = పాలిటిక్సులో పవర్ బాలెన్సింగ్ స్టార్ = పవన్ కళ్యాణ్ గోపాల గోపాలలో గోపాలకృష్ణుడుగా వెంకటేష్ పాత్రకి అండగావుండి ముందుకి నడిపించిన పికె ఇప్పుడదే పాత్ర రాజకీయాల్లో ధరిస్తున్నాడా? ధరిస్తే ఎవరికీ పికె (పొలిటికల్ కృష్ణుడు) సారధ్యం? 2019 వరకూ ఆయుధం చేపట్టకుండా, ఐ మీన్ ఎలక్షన్స్Continue reading “PK in PK = పవన్ కళ్యాణ్ ఇన్ పంచెకట్టు”
Tag Archives: యాన్ ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ బుడగ !
3138 B.C అక్టోబర్-మహాభారతయుద్ధం మొదలైనరోజు, ఎగ్జాక్ట్ డేట్ సరిగ్గా గుర్తులేదు….
“స్వామీ! ఆధునిక మానవజాతి, హోమో సేపియన్స్, కి అమ్మమ్మ….మ్మ అనదగిన లూసీ అస్థిపంజరం ఇథియోపియాలో దొరికింది. వానరాలకి మల్లే చిన్నదైన పుర్రె, మనుషుల్లా నిటారుగా నడవగల కాళ్ళువున్న లూసీ వానరాలనుంచి మనిషి పరిణామం చెందుతున్న దశలో జీవించింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఇథియోపియానే కాఫీకీ జన్మస్థలం. దీన్నిబట్టీ చాలా మంది కాఫీత్వవాదులు ఇలా అనుకుంటున్నారు – ఇథియోపియాలో ఆస్ట్రలో పితికస్ అనే వానరజాతిలో ఎలా పుట్టిందో అనుకోకుండా రెండుకాళ్ళపై నడవటం అనే ఫాషన్ మొదలైంది. ఖాళీ సమయాల్లోContinue reading “3138 B.C అక్టోబర్-మహాభారతయుద్ధం మొదలైనరోజు, ఎగ్జాక్ట్ డేట్ సరిగ్గా గుర్తులేదు….”
హెల్త్ బుక్ ప్రింటింగ్ మిస్టేక్ = కళ్ళకింద కారీ బాగ్స్; మరి మంత్రాలబుక్కులో అచ్చు తప్పులు=?
హెల్త్ బుక్ ప్రింటింగ్ మిస్టేక్ = కళ్ళకింద కారీ బాగ్స్; మరి మంత్రాలబుక్కులో అచ్చు తప్పులు=? ఈ మధ్య టీవీల్లో మంత్రోపదేశాలు, యంత్రతంత్రాల మీద పుస్తకాలు ఎక్కువైపోయాయి. దేవుణ్ణి ప్రత్యక్షం చేస్తామనే స్వామీజీల కెరీర్లు కూడా బాగా నడుస్తున్నాయి. ఓకే, కూటి విద్యలు కూటి కొరకే అని తెలుసుకదా! కూటి కొరకే అన్నది కోటి కొరకే అని అర్ధం చేసుకుని పాపం టీవీగురువులు, యంత్రతంత్ర గ్రంధాల రచయితలూ, దొంగస్వాములు వాళ్ళ శక్తి కొద్దీ సమాజానికి “సేవ” చేస్తున్నారు.Continue reading “హెల్త్ బుక్ ప్రింటింగ్ మిస్టేక్ = కళ్ళకింద కారీ బాగ్స్; మరి మంత్రాలబుక్కులో అచ్చు తప్పులు=?”
తెలుగువాణ్ణి కదా!ఇంగ్లీషులో చెప్తే బుర్రకెక్కింది /మీకు నేనక్కర్లేదు నా మేజిక్కులు,రాజకీయాలు,మూఢనమ్మకాలు ..
ఈ కప్పు కాఫీ స్వీకరించేముందు ఓ Coffee-Thought for the day : కందసామి పిళ్ళైతో కలిసి కాఫీ హోటలుకెళ్ళిన మహాశివుడు, మహాశివుడనే మనిషి కాదు అచ్చంగా లార్డ్ శివ, మొదటిసారిగా భూలోకపు అమృతం కాఫీని రుచి చూసాడు. ఆయన ముఖంలో సోమరసం తాగిన అనుభూతికి ఇంచుమించు సరిసాటి అయిన ఫీలింగ్ చూస్తున్న కందసామితో, “కందసామీ! ఈ కాఫీ పరిమళంలో, రుచిలో నీకు నా లీల కనబడుతోందా?,” అన్నాడు. “స్వామీ! నీ లీల కాదు నాకు హోటలు వాడి లీలContinue reading “తెలుగువాణ్ణి కదా!ఇంగ్లీషులో చెప్తే బుర్రకెక్కింది /మీకు నేనక్కర్లేదు నా మేజిక్కులు,రాజకీయాలు,మూఢనమ్మకాలు ..”
బాపూరమణీయం@వైకుంఠం
సారంగ సాహిత్య వార పత్రికలో నా అం’తరంగం’ click here -> బాపూరమణీయం@వైకుంఠం Picture courtesy : సారంగ సాహిత్య వార పత్రిక వైకుంఠంలో బ్రహ్మ సరస్వతితో కలిసి తల్లితండ్రులతో కబుర్లు చెపుతున్నాడు. ఇంతలో జయవిజయుల అనౌన్స్-మెంటు “బాపూరమణలు తమ దర్శనానికి వచ్చారు ప్రభూ,” అంటూ. “వాళ్ళని త్వరగా తీసుకురండి, ఆలస్యమెందుకు?” అన్నట్టు లక్ష్మీనారాయణులు చూసిన చూపులకి బ్రహ్మకి ఆశ్చర్యం వేసింది. ఎవరీ బాపూరమణలు? రామలక్ష్మణులు, కృష్ణార్జునులు, జయవిజయులు, అశ్వనీ దేవతలు, నారద తుంబురులు, … లాగా బాపూరమణలనే ఈContinue reading “బాపూరమణీయం@వైకుంఠం”
ఫత్వ-జడత్వ-మతతత్వ-పశుత్వ.Vs.తత్వ-అస్తిత్వ-వ్యక్తిత్వ-ఋజుత్వ-సమత్వ 27th Coffee
కప్పుకప్పుకీ కాఫీపానం మన్ని ఒక ఆధ్యాత్మిక అనుభవానికి దగ్గర చెయ్యట్లేదంటే దానర్ధం ఇదీ – మనం కాఫీత్వాకి ఎక్కువ దూరంగానూ, భూ- లోకంలో వున్న సవాలక్ష ఇతర ‘త్వా’ లకి – ఫత్వా, జడత్వ,మతతత్వ, పశుత్వ, వగైరా వగైరాలకి దగ్గర్లో కాకపోయినా తత్వ, అస్తిత్వ, వ్యక్తిత్వ, ఋజుత్వ, సమత్వ వగైరాల కంటే తక్కువ దూరంలో వున్నట్టు. పోనీ, ఆ రెండు రకాల ‘త్వ’లకీ సమానదూరంలో వున్నామనుకోవచ్చు. మనిషిక్కావాల్సింది రెండో రకం ‘త్వ’లకి దగ్గర్లో వుండడం. అలావున్నపుడు మనం ఏContinue reading “ఫత్వ-జడత్వ-మతతత్వ-పశుత్వ.Vs.తత్వ-అస్తిత్వ-వ్యక్తిత్వ-ఋజుత్వ-సమత్వ 27th Coffee”
కాఫీలో త్రిమూర్తుల అంశలు వున్నాయని ….. Coffee26
కాఫీ బ్రహ్మవిష్ణుశివాత్మకం. అందులో త్రిమూర్తుల అంశలు వున్నాయని కాఫీని జెన్యూన్ గా అంటే యదార్ధంగా, మనఃపూర్వకంగా, నిజాయితీగా ఆస్వాదించినవాళ్ళెవరైనా గ్రహించగలరు. ఒకవేళ గ్రహించలేదనిపిస్తే దానిక్కారణం కాఫీరసాస్వాదనలో మనసు ఆలోచనకి అతీతంగా అలౌకిక భావ జగత్తులోకి వెళ్ళిపోవడమే. మనసుని కాన్షస్ గా వుంచి కాఫీయొక్క గుణగణాలని గుర్తు చేసుకుంటూ మెల్లగా సేవిస్తే కాఫీ త్రిమూర్త్యాత్మకత అనుభవంలోకి వస్తుంది. అదో ఆధ్యాత్మికానుభవం. దానికి ముందు , బ్రహ్మజ్ఞానం సిద్ధించేముందు కొన్ని అతీతశక్తులు సిద్దించినట్టు, కాఫీత్వ సాధకుడికి, – యాస్పైరెంట్ కి –Continue reading “కాఫీలో త్రిమూర్తుల అంశలు వున్నాయని ….. Coffee26”
తెలుగు నేలపై వెలుగు ముఖ్యమంత్రులు – ఇరవయ్యో కప్పు కాఫీత్వ
బ్రిటీష్ సామ్రాజ్యానికి తెలుగు రాష్ట్రాలకి తేడాలాంటి సామ్యం లేక పోలిక లాంటి బేధం ఏంటో తెలుసా? బ్రిటీష్ సామ్రాజ్యంపై రవి అస్తమించడు. తెలుగు నేలపై చంద్రుడస్తమించడు. నిజానికి తెలుగుదేశానికీ వెలుతురుతో, సూర్యచంద్రులతోఏందో ప్రత్యేక సంబంధమే ఉన్నట్టుంది. టాపిక్ ఇంట్రెస్టింగా వుందా? అలాయితే కాస్త కాస్త సిప్ చేస్తూ ఈ ఇరవయ్యో కప్పు కాఫీత్వాన్నాస్వాదించండి. చిన్న చిరునవ్వు వచ్చినా కాఫీ బావున్నట్టే – ఈ పూట కాఫీ బ్రేక్‌కి కొంచెం లైట్ సబ్జెక్ట్ ఏమైనా ఉంటే బావుంటుంది కానీ అందరూContinue reading “తెలుగు నేలపై వెలుగు ముఖ్యమంత్రులు – ఇరవయ్యో కప్పు కాఫీత్వ”
కాఫీత్వం19 – ఇవన్నీ కైలాష్ సత్యార్ధికి, సునీతాక్రిష్ణన్ కి వదిలేయాల్సిందేనా?
సీఎం అంతటాయన చలించి తన కుటుంబ సభ్యురాలిగా చేర్చుకోవడంతో ప్రత్యూష కష్టాలు తీరిపోయాయ్. ప్రత్యూషకి సంబంధించినంత వరకు హృదయ పూర్వకంగా అందరూ సంతోషించాల్సిన సంగతి. హైకోర్టు సువోమోటో కేసుగా తీసుకున్నాక, ప్రతిపక్ష నేత ఆ అమ్మాయిని పరామర్శించాక జరగడంతో ఈ చలింపు రాజకీయ ‘చలి’ంపులా కనిపించొచ్చు. ఈయన ఇంతలా ‘చలిస్తారని’ ఊహిస్తే ప్రతిపక్షం ఇంకెంతగా ‘చలించేదో’ కదా? ఊహించుకుంటేనే మనసు ‘చలి’స్తోంది. ఏదేమైనా, politics apart! ప్రత్యూష వెంట ఇప్పుడు సీఎం కుటుంబం, హోమ్మినిస్టరు, హైకోర్టు, అధికార్లు ….. ఇన్నాళ్ళుContinue reading “కాఫీత్వం19 – ఇవన్నీ కైలాష్ సత్యార్ధికి, సునీతాక్రిష్ణన్ కి వదిలేయాల్సిందేనా?”
డౌట్లడిగే చికెన్ – మాట్లాడే మటన్ (1)
ఈ టపాకి టైటిల్ అలా పెట్టిన కారణం పోస్టు చివర్లో వుంది. పోస్ట్ మొత్తం చూడకుండా అది చదివేస్తే ఈ టపాకి హీరోలైన కోడి మేక బాధ పడతాయి. వాటి మనోభావాలు కూడా కాస్త అర్ధం చేసుకోవాలిగా మరి! సింగపూర్ చిన్నదేశం, సహజ వనరులు ఏవీ లేని దేశం కదా. ఎటు చూసినా బిల్డింగ్సే. చెట్లూ చేమలూ కనిపించినా అవన్నీ పార్కులూ, గార్డెన్లూ లేదా లాండ్ స్కేపింగ్ లో భాగంగా వుండేవే తప్ప సహజంగా, అడవి మాదిరిగాContinue reading “డౌట్లడిగే చికెన్ – మాట్లాడే మటన్ (1)”