రోజులో ఎనిమిది గంటలు ఎలా ప్లాన్ చెయ్యాలో తెలీదుగానీ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనేసి వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దేస్తారు – ఈ మాటలు నాగార్జున డిక్షన్ లో వెరైటీగా వుంటాయి. చాలామందికి సరిగ్గా ఈ డైలాగు లేకపోతే సందర్భాన్ని బట్టీ ఇలాంటిదే ఇంకోటి ఎవరో ఒకళ్ళ మీద వెయ్యాల్సిన అవసరం వస్తూ వుంటుంది. బైటికి అనలేక, అనే ధైర్యం ఉన్నా సరైన మాటలు పడక జనం కష్టపడుతున్న వైనం కనిపెట్టి త్రివిక్రమ్ శ్రీనివాసు “మన్మధుడు” నాగార్జునతోనే అనిపించినContinue reading ““మన్మధుడు” నాగార్జున డిక్షన్ లో రోజులో ఎనిమిది గంటలు ఎలా ప్లాన్ చెయ్యాలో తెలీదుగానీ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనేసి వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దేస్తారు”
Tag Archives: ప్చ్!
భూమి బల్ల పరుపుగా వుండును. గ్రహములన్నీ భూమి చుట్టూ తిరుగును. దేవుడు సమస్త ప్రపంచమును నాలుగువేల సంవత్సరాల క్రితం జస్ట్ వారం రోజుల్లో సృష్టించెను.
భూమి బల్ల పరుపుగా వుండును. గ్రహములన్నీ భూమి చుట్టూ తిరుగును. దేవుడు సమస్త ప్రపంచమును నాలుగువేల సంవత్సరాల క్రితం జస్ట్ వారం రోజుల్లో సృష్టించెను. పుష్కరాల్లో నదిలో మట్టి జల్లని వారిని కృత్య నాశనము చేయును. నదిలో కాలుష్యాలను కలుపు వారిని ఏమీ చేయదు. తన పేరు మీద యుద్ధములు, మతమార్పిళ్ళు, హత్యాకాండలు జరపమని దేవుడు కొన్ని మతములవారికి చెప్పెను. కిటికీలోంచి బద్ధకంగా డైనింగ్ టేబుల్ మీదకి ప్రసరిస్తూ, మామూలుగా కంటికి కనపడకుండా గాలిలో ఎగిరే ఏవేవో కణాలనిContinue reading “భూమి బల్ల పరుపుగా వుండును. గ్రహములన్నీ భూమి చుట్టూ తిరుగును. దేవుడు సమస్త ప్రపంచమును నాలుగువేల సంవత్సరాల క్రితం జస్ట్ వారం రోజుల్లో సృష్టించెను.”
షీనా బోరా మర్డర్ కేసు .Vs. ఫ్రెంచిమూవీ Le Couperet – ఆరోసారి ప్చ్!ప్చ్!ప్చ్!
Le Couperet – తెలుగులో ఎలా రాయాలో!?! లె కూపరె? లె కూపరె 2005 నాటి ఫ్రెంచి బ్లాక్ కామెడీ సినిమా.2012లో చూశా! రీ-సై‘కిల్డ్’ తెలుగు కామెడీలు, రీ-రీ సై‘కిల్డ్’ మాస్ ఎంటర్-టైనర్లు, లార్జర్ దాన్ లైఫ్ లయన్స్&లెజెండ్స్, ప్రేమ లేబుల్ తో నడిచే “ఇడియెట్”లాంటి కామసూత్ర కధనాలు -వీటన్నిటితో కార్బైడ్ వేసి పండబెట్టిన కాకరకాయల్లా తయారైన పెద్ద,చిన్న మెదళ్ళకి (మెజారిటీ తెలుగు సినిమాల్లో పదార్ధాన్ని,పర్పస్ ని పసి గట్టే కేంద్రం ఆ రెండు మెదళ్ళలో ఎందులోContinue reading “షీనా బోరా మర్డర్ కేసు .Vs. ఫ్రెంచిమూవీ Le Couperet – ఆరోసారి ప్చ్!ప్చ్!ప్చ్!”
!?!ఇంద్రాణీముకర్జియా స్టోరీతో సినిమా!?! ఆర్జీవీ కూడా…. (ఐదోసారి ప్చ్!ప్చ్!ప్చ్!)
ఇంద్రాణీ ముకర్జియా గారి సాహసకృత్యాలతో మీడియా మార్మోగుతోంది, దేశం అట్టులా ఉడుకుతోంది. వ్యాపమ్, లలిత్ మోడీ, ఓటుకి నోటు,… ఎట్సెట్రా కేసులు కూడా అట్లలాగే ఉడికి ఇంక ప్రజల దృష్టిలో మాడిపోతామేమోనని సదరు కేసుల సృష్టికర్తలు భయపడుతుండగా ఇంద్రాణీ ముకర్జియాగారు దైవదూతలా ప్రవేశించి అట్టు తిరగెయ్యడం జరిగింది. అసలే మనకి దేశసమస్యలు, రాజకీయాల మీద ఉన్న సీరియస్ నెస్ ఎలాంటిదంటే దానికీ, రైల్లో పేకాడుకుంటున్న బాచి దగ్గరకెళ్ళి తనుమాత్రం ఆడకుండా ప్రయాణం పొడుగూతా అక్కడే నుంచుని చూసి ఎంజాయ్ చేసేవాడిContinue reading “!?!ఇంద్రాణీముకర్జియా స్టోరీతో సినిమా!?! ఆర్జీవీ కూడా…. (ఐదోసారి ప్చ్!ప్చ్!ప్చ్!)”