Tag Archives: నో.వా.చే.రా – 002 ఒరేయ్! బాలుడా! జాగ్రత్తరోయ్! బోర్ వెల్ దగ్గరకెళ్ళేముందు ఈ ప్రశ

A second sequel to పవన్, సింహం, గడ్డం గీసుకోవడం, etc, etc.


నిన్న రాత్రి సింహం కల్లోకి వచ్చి ఈ పద్యం చదువుతూ, కళ్ళనీళ్ళు పెట్టుకుని ముక్కు చీదుకుంది.

గాడిని దప్పిన కొడుకును

గాడిద కొడుకంచు తండ్రి కటినము జూపన్

వీడా? నాకొడుకంచును

గాడిద యేడ్చెను గదన్న ! ఘన సంపన్నా !

‘ఎందుకా పద్యం చదువుతున్నావ్?’ అంటే ‘నా పరిస్థితీ పద్యంలోని గాడిద పరిస్థితిలాగే ఉందం’ది. ‘ప్లీజ్, ఎక్స్ప్లెయిన్,’ అన్నాను.
“అడవుల్లో ఉండే నేను ఇలా తప్ప ఎలా ఉండగలను? మీలా మాకు బుద్ధీ ,జ్ఞానం, సాంఘికజీవనం, మనోభావాలు, ఎట్సెట్రా డెవలప్ అయ్యే అవకాశం లేదు. అది తెలిసీ నా ఇమేజి డామేజ్ చేసెయ్యడం ఏం బాలేదు. ఇప్పుడు నా మనోభావాలు దెబ్బతిన్నాయ్. అయాం హర్టెడ్,” అంది. కంటిన్యూ చేస్తూ, ” పవన్ అంతటివాడు నాతో తనని కంపేర్ చేసుకుంటే ఎంత సంబరపడ్డానో, గాలి మొత్తం తీసేసావు. మీ సొసైటీలో పవన్, ఐ మీన్ గౌతమ్ నందా ఆఫ్ అత్తారింటికి దారేది ఎంత గొప్పో మా అడవిలో నేనూ అంతే. అడవికీ, సివిల్ సొసైటీకి వున్న  అంతరాన్ని దృష్టిలో వుంచుకుంటే నువ్వు నన్ను అసహ్యించుకునేవాడివి కాదు గదా! ఇప్పుడర్ధమైందా? పద్యంలో గాడిదదీ, నాదీ ఒకటే పరిస్థితని ఎందుకన్నానో,” అంది. కొంచెం అర్ధమైనట్టేవుంది ఐనా ఇంకొంచెం క్లారిటీకోసం, “గౌతమ్ నందా అర్ధం చేసుకున్నట్టుగా నేన్నిన్ను అర్ధం చేసుకోలేదంటావ్, అంతేగా,” అన్నాను. “ఎగ్జాక్ట్లీ,” సింహం కళ్ళలో మెరుపు. మళ్ళీ అన్నాను, ” కొందరు మనుషులకుండే మృగ లక్షణాలు సింహంలో ఉన్నాయి అంటే నీకేమన్నా అభ్యంతరమా?” ” అది కొంచెం నయం. అసలు ఈ కంపారిజన్ అవసరమా?”.
“స్ట్రిక్ట్లీ స్పీకింగ్ అవసరం లేదు కానీ ఏదో ఒక కంపారిజన్ వుంటే మనుషులకి బాగా అర్ధం అవుతుందని. నీ ఇమేజ్ డామేజ్ అవ్వదు, నేననుకున్నది కన్వే అవుతుంది. ఏమంటావ్? ”
“సరే, కానీయ్” అంటూ స్వప్నసింహం మాయమైంది.
గాంధీజీ దొంగచాటుగా మాంసం తిన్నప్పుడు ఆయన కలలో ఆ మాంసపు అసలు ఓనరయిన మేక చేసిందానికీ ఇప్పుడీ సింహం ఎమోషనల్ ఔట్-బర్స్ట్ కీ తేడా ఏమన్నా ఉందా అంటే, అది ఇదీ –
మేక గాంధీజీ’స్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ లో చోటు చేసుకుని చరిత్రలో నిలిచిపోయింది. పాపం ఈ సింహం ఈ బ్లాగ్ తో సరిపెట్టుకోవాల్సిందే. పవన్ తో కంపేరిజన్ లేకపోతే అదీ డౌటే. ఆబ్వియస్లీ, మేక ఈజ్ ఫార్ స్మార్టర్ దాన్ లయన్.

ఏదో ఆవేశంలో సింహం ఇమేజి డామేజ్ చేసేసాను గానీ ఇలాంటి కారెక్టర్ అసాసినేషన్ అవసరంలేదనిపించింది. ఇలా సింహం కారెక్టర్ కీ కాన్స్స్టన్టైన్ ది గ్రేట్ తో మొదలుపెట్టి అనేకమంది అనేకమతాల దురహంకారుల, కంసుడితో మొదలెట్టి హిట్లర్, స్టాలిన్, పోల్ పాట్, సద్దాంహుసేన్, గడ్డాఫీ, , కిమ్ జాంగ్ ఇల్, కిమ్ జాంగ్ యున్, ఫోదే శాంకో, …..లాంటి పొలిటికల్ షావినిస్టుల కారెక్టర్లకీ ఉన్న డిఫరెన్స్ అర్ధమైంది. అంతేకాదు కోతులుకాక సింహాల నుంచి మనుషులు ఇవాల్వ్ అయ్యుంటే ఇప్పటికంటే హుందాగా, దర్జాగా, డిప్లోమేటిగ్గా ఉండేవాళ్ళు మనుషులు? అనికూడా అనిపించ బోయి  ఎందుకో మానేసింది.

సో,  ఇప్పుడు నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే సింహాలు కొందరు మనుషుల్లా బిహేవ్ చేస్తున్నాయి. అవును, కొందరు మనుషుల్లోవుండే పొలిటికల్ షావినిజం, జెనోసైడల్ మెంటాలిటీ – రెండూ సింహంలో ఉన్నాయి. (ప్లీజ్ రీడ్ అడవి సింహం). అందుకే నాట్ జియో డాక్యుమెంటరీల్లో దాన్ని చూసి నప్పుడల్లా పై లిస్టులో చెప్పిన(పేర్లు గుర్తులేక చెప్పలేకపోయిన) కారెక్టర్స్ గుర్తొస్తాయి.
జెనోసైడల్ మెంటాలిటీకి అసలు కారణం వేరే జాతి అంటే పడకపోవటం కాదు, డైవర్సిటీ ఆఫ్ ఒపీనియన్ – విభిన్న దృక్పధం అంటే పడకపోవటం. తనకి దొరికిన కుందేలు నాలుగు కాళ్ళలో ఒక దాన్ని విరగ్గొట్టి మరీ దానికి మూడు కాళ్లే అని నిరూపించే నైజం. అప్పటికీ నమ్మనివాళ్ళని లేపేసే క్రౌర్యం.

(TO BE CONTD.)

ప్చ్! ప్చ్! ప్చ్! – ఒకటోసారి ;-)


>ఎక్కడో వేరే దేశంలో కుక్కపిల్ల పుట్టినా మనకి వార్తే. ఎక్కడో మునిసిపల్ కమిషనర్ పోయినా పెద్ద వార్తే?
>ప్రతీరోజూ ఎక్కడో ఒక చోట దేశనేతలు పోతూనేఉంటారు వాళ్ళందరికీ అసెంబ్లీ నివాళులివ్వడం భజన కాదా?
>పెద్ద లీడర్లకి నివాళి ఇవ్వచ్చు కానీ స్వర్గస్తులైన సినీప్రముఖులకీ ప్రభుత్వం నివాళి ఇవ్వాలి.
>ఇంకా నయం నివాళితో సరిపెట్టారు, సింగపూర్ వెళ్తాం అన్లేదు (P.N. పీ.ఎమ్, సీ.ఎమ్ ఇద్దరూ వెళ్తున్నారు)
ఇవి ఏపీ శాసనసభ సింగపూర్ మొదటి ప్రధాని లీ కువాన్ యూ నివాళులిచ్చిన సందర్భంగా ఓ తెలుగు వెబ్-జైన్ విమర్శ రాస్తే , దానిపై కొందరు పాఠకుల కామెంట్సు. వీటిలో పాఠకుల విజ్ఞత , విజ్ఞానం చూసి నవ్వాలా ఏడవాలాని తీవ్రంగా అలోచించి ఎటూ తేల్చుకోలేక చివరికీ టపా రాస్తున్నా.

విమర్శలు, వ్యాఖ్యానాలూ తప్పుకాదు కానీ బోడి గుండుకీ మోకాలికి ముడి పెట్టడం – అదీ గాంభీర్యత చూపాల్సిన విషయాల్లో – అసహ్యంగా ఉంది.
వెబ్-జైన్స్, సినిమాలూ, సెన్సేషన్ల మీద బతికేసేవి – ఇలాంటివాటిల్లో జర్నలిస్టిక్ స్టాండర్డ్స్ కోసం చూడ్డం, అవి ఫోర్త్ ఎస్టేట్ బాధ్యతలు నెత్తికెత్తు కుంటా యనుకోవడం బుద్ధి తక్కువే. But, కీర్తిశేషులైన వ్యక్తులని తక్కువ చేసి మాట్లాడ్డం అవసరమా ? వీళ్ళ కంప్లెయింట్ ఏంటంటే ఏపీ లో ఇప్పుడు పాలనంతా సింగపూర్ స్ఫూర్తితోనే నడుస్తోందిట, అందువల్ల ఏపీ ప్రభుత్వం ఓవరాక్షన్ చేస్తోందిట. అక్కడితో ఆపితే ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని వదిలేయచ్చు. ఆగలేదు. మనకి సంబంధం లేని వ్యక్తికి, భారత్ తో పరిచయంలేని వ్యక్తికి అంత ఎత్తున నివాళి ఘటించాలా అని ప్రశ్నించారు. ఈ పార్ట్ అత్యనవసరం. ఎందుకంటే లీ కువాన్ యూ అనే పర్సనాలిటీ ఇండియాలో ఉన్న ప్రతీ రాజకీయ పార్టీకి ఒకళ్ళు ఉండాల్సినంత పవర్ ఫుల్ పర్సనాలిటీ. గాసిప్స్ తో బతికే వెబ్-జైన్స్ కి అందనంత స్థాయి ఉన్న పర్సనాలిటీ. చిత్తశుద్ధి ఉన్న ప్రతీ మంత్రి, లేజిస్లేటరు, నాయకుడూ తప్పనిసరిగా స్టడీ చెయ్యాల్సిన ‘లీ’డర్. ‘లీ’డర్ ఎందుకంటే అనవసర రాజకీయాలు చేసేవాళ్ళకి, ఎఫిషియెన్సీ, డిసిప్లిన్ లేనివాళ్ళకి లీ అంటే డర్, హడల్!

>అవినీతి, రాజకీయ మాల్ ప్రాక్టీస్ లపై నోరెత్తడానికి భయపడే నిజాయితీపరులు
>ప్రజలతో టచ్ గానీ, సమస్యల పై ప్రత్యక్ష అవగాహనగానీ లేని లీడర్లు
>సినీగ్లామర్ వాడుకుని వోట్లు సంపాయించుకోవాలనుకునే పార్టీలు
>మతాలూ, దేవుళ్ళు, ప్రాంతీయత, భాష లాంటి సెన్సిటివ్ ఇష్యూలని కెలికి వోట్ బాంకుల్ని తయారుచేసుకునే ప్రజాప్రతినిధులు
ఈ టైప్స్ కన్నా కనీసం లక్ష రెట్లు గొప్ప పర్సనాలిటీ మిస్టర్ లీ. నాయకుడికి మంచితనంతోపాటు, అన్ని విషయాలపై అవగాహన, ఆచరణలో పెట్టగల సమర్ధత, తన పార్టీపై తిరుగులేని పట్టు ఎలా వస్తుందో ఆచరణలో చూపించిన యూనివర్సిటీ మిస్టర్ లీ.

మలయాకి 1965లో స్వతంత్రం వచ్చే సమయానికి ఆ దేశంలో అంతర్భాగంగా ఉన్న సింగపూర్ ని రాజకీయ కారణాలతో బయటికి వెళ్ళగొట్టినప్పుడు లీ కాక ఇంకే నాయకుడైనా ఆయన స్థానంలో ఉండివుంటే సింగపూర్ పరిస్థితి ఎలావుండేదో ఊహించడం కష్టం. ఏ విధమైన సహజవనరులు లేని, ప్రజల్లో చదువున్న వాళ్ళు ఎక్కువగా లేని(1965లో) అతి చిన్నదేశం, దేశంగా తన అస్తిత్వాన్ని యాభై ఏళ్ళపాటు నిలుపుకుందంటే లీ తీసుకున్న నిర్ణయాలు, అమలుచేసిన విధానం మూలకారణాలు.
నెహ్రూ అభిమానిగా ఆయన పాలిసీలని ఆదర్శం చేసుకుని తన దేశాన్ని మల్చుకుందామనుకున్నా త్వరలో ఆ అభిప్రాయం మార్చుకుని సోషలిస్టు విధానాలు లాంగ్ టర్మ్ లో పనికిరావని గ్రహించి దేశాన్ని తిరుగులేని అభివృద్ధి మార్గంలో నడిపిన దూరదృష్టి, అనుభవం, pragmatism (వ్యవహారజ్ఞానం) ప్రతీ లీడరుకీ ఉండవు.
తను ప్రధాని అయిన కొత్తలో బెంగుళూరుచూసి తన దేశాన్ని అలా గార్డెన్ సిటీగా తయారుచెయ్యాలనుకున్న ఆయన సంకల్పం ఇప్పుడు సింగపూర్ కి ప్రపంచమంతటా అభిమానుల్ని సంపాదించి పెట్టింది. ఇప్పటి బెంగుళూరు సంగతేమిటి? నాయకులకి టేస్టు, విజన్, డిటర్మినేషన్ లేకనే కదా అలా వుంది?

కొన్ని మంచిపనులు ప్రజలకి మొదట అంతగా రుచించకపోయినా వీలయినంత ఎక్కువగా వివిధ ఫోరాల్లో చర్చించి , చర్చించి అమలుచేసి మంచే జరిగిందని ఫలితాల ద్వారా ప్రజల్ని కన్విన్స్ చెయ్యగల ముక్కుసూటితనం, ఆత్మవిశ్వాసం ఆయన సొంతం.

పీ.ఎమ్, సీ.ఎమ్ ఇద్దరూ సింగపూర్ వెళ్తున్నారు. ఇద్దరికీ, ముఖ్యంగా ఏపీకి లీ కువాన్ యూ విధానాల అవసరం ఇప్పుడెంతో ఉంది. సింగపూర్ యాభై ఏళ్ళపాటు సహజవనరులు లేకుండా ఎలా ప్రపంచంలోనే అతి ఎక్కువ తలసరి జాతీయ ఆదాయం ఉన్న దేశంగా ఉందంటే ఇండియాకి సంబంధించి సింగపూర్ ప్రాధాన్యత ఎంతో ఉంది.
“Singapore is Asia’s future. It represents a level of excellence that even huge countries like India and China envy. And that is largely because of Lee who transformed what a British politician called a ‘pestilential and immoral cesspool’ into a glittering global city with the world’s highest per capita income as well as the highest percentage of home ownership,” అని రెడిఫ్ లో సునందా కే. దత్తా రే అన్నారు. (http://www.rediff.com/news/special/its-ok-lah-lee-kuan-yew-sleeping-now/20150325.htm)

దీన్నిబట్టీ సీ.ఎమ్, పి.ఎమ్ లు సింగపూర్ మోడల్ కి, దాన్ని తీర్చిదిద్దిన ఆర్కిటెక్టుకి ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పేమిటో ఆ వెబ్-జైన్ వాళ్ళకే తెలియాలి.

ఇవన్నీ తెలియకుండా (తెలిసినా తమకిష్టంలేనివాళ్ళని తిట్టడానికి తెలీనట్టుండి) ఆయన్నో అల్లాటప్పా మనిషిలా మర్యాదలేకుండా ఇంకెవరిపైనో చేసే విమర్శ లోకి తీసుకురావడం అవసరమా? భావ్యమా?
Please note, మంచి సాంప్రదాయమా అనట్లేదు ఎందుకంటే జర్నలిజంలో మంచి సాప్రదాయాలుంటాయని జనమూ, జర్నలిస్టులూ మర్చిపోయే ప్రాసెస్ వేగంగా జరిగిపోతోంది. మీడియా కమర్షియల్ అయిపోయి జర్నలిజం స్టాండర్డ్స్ అడుగంటుతున్నాయి.

మరి జనం సంగతీ? వాళ్లకి ఈ స్టాండర్డ్స్ ఏమిటో ఎందుకో తెలీని పరిస్థితి. ఐడియాలజీ తో పనిలేని కమర్షియల్ రాజకీయాలు + గాసిప్స్+సినిమా క్రేజ్ + కన్జ్యూమరిస్ట్ లైఫ్ స్టైల్ – ఇవి వాళ్ళ దృక్పధాన్ని డామినేట్ చేస్తుంటే విలువల అవసరం ఎలా తెలుస్తుంది? ప్చ్!

******

బాలి ఐలాండ్, మౌంట్ అగుంగ్ అగ్నిపర్వతం దగ్గరకి వెళ్ళే దారిలో ….


బాలి ఐలాండ్ లో మౌంట్ అగుంగ్ అనే అగ్నిపర్వతం వుంది. ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్న అగ్ని పర్వతాల్లో ఇదొకటి. 1963-64 లో పేలిన తర్వాత ఇప్పటి వరకూ శాంతంగానే ఉంది. లాస్ట్ డిసెంబర్లో బాలి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాం. దారిలో నాకు, నా మొబైల్ ఫోన్ కి కనిపించాయి ఈ ఫోటోలో కనిపించీ కనిపించకుండా ఉన్న …

Featured image

ఆ చిన్న పక్షులు పిచుకలు. ఇవాళ ఈ పోస్టులో కనబడతామని, ఇవాళ వాటి రోజని వాటికి తెలీదు. అమాయకంగా హాయిగా ప్రకృతి ధర్మం పాటించి ఎంత సింపుల్ గా లోకంలోకి వచ్చాయో అంతే సింపుల్ గా బ్రతికి వెళ్ళిపోతాయి. వాటి స్ట్రగుల్ ఫర్ సర్వైవల్లో డేగలు, కాకులతో ఇప్పుడు మనిషి కూడా భాగం పంచుకుంటున్నాడు. తెలియకుండానే వాటికి తను చేస్తున్న హానికి చిహ్నంగా వరల్డ్ స్పారోస్ డే ని కేటాయించాడు. స్పారోస్ డే పిచుకల కోసం ఏం సాధిస్తుందో కాలమే చెప్పాలి.

మన అమ్మమ్మలు, తాతలు ఇళ్లలో వరి కంకులు కట్టి, ఉదయాన్నే ఇంటి ముందు బియ్యం జల్లి , ఇంటి చూరుల్లో వాటి గూళ్ళు కట్టుకోనిచ్చి వాటి జీవన సమరాన్ని కొంత తేలిక చేసి, ప్రతీ రోజూ స్పారోస్ డే జరిపినట్టు మనంకూడా వాటి చిన్ని జీవితాలకి సాయపడగలమా? ఏమో! సంవత్సరానికి ఒక రోజు . సరిపోతుందా? మరో ఏమో!
బై ద వే, అమ్మమ్మల జెనరేషన్ పిచుకలకి చేసిన సాయాన్ని భూత యజ్ఞం పేరుతో మన ధర్మం ఎప్పుడో గుర్తించింది. హార్మనీ విత్ నేచర్ మన సంస్కృతిలో మొదటినుంచీ భాగమే.
“one small step for a man, one giant leap for mankind,”అని నీల్ ఆర్మ్-స్ట్రాంగ్ చంద్రుడిపై తన మొదటి అడుగు గురించి అన్న మాటలు పిచుకని రక్షించడానికీ అన్వయించుకోవచ్చు.
One small deed by every child to protect a sparrow is a potential revolution to save humanity in the most peaceful manner అని నేననుకుంటున్నాను.
ఈ చిన్ని పిచుక ఇవాళ నా చేత ఒక మంచి ఇంగ్లీష్ పోయెమ్ చదివించింది. Paul Laurence Dunbar (June 27, 1872 – February 9, 1906) అనే ఆఫ్రికన్-అమెరికన్ కవి రాసిన పోయెమ్ ఇదీ –
The Sparrow
A LITTLE bird, with plumage brown,
Beside my window flutters down,
A moment chirps its little strain,
Then taps upon my window-pane,
And chirps again, and hops along,
To call my notice to its song;
But I work on, nor heed its lay,
Till, in neglect, it flies away.

So birds of peace and hope and love
Come fluttering earthward from above,
To settle on life’s window-sills,
And ease our load of earthly ills;
But we, in traffic’s rush and din
Too deep engaged to let them in,
With deadened heart and sense plod on,
Nor know our loss till they are gone.

బావుంది కదా! దీనివల్ల ఎక్కడో ఒక చోట , ఎవరో ఒకరు పిచుకకి
కొన్ని బియ్యం గింజలు వేస్తారని
దాన్నో గూడు కట్టుకోనిస్తారని
పిల్లలకి దాన్ని పరిచయం చేస్తారని ఆశ పడుతున్నా.

SANYO DIGITAL CAMERA