Tag: ఐన్-స్టీన్ చూసిన ఆదిశేషుడే శంకరుని స్పేస్-టైమ్ కంటిన్యువమ్ !!

ప్ర.ప్రొ.ప్ర.ప్ర.ప్ర.ప్ర.ప్ర.ప్ర – పుష్కరాల్లో ‘ప్రా’సక్రీడ 24th cup of Coffeetva


ప్ర.ప్రొ.ప్ర.ప్ర.ప్ర.ప్ర.ప్ర.ప్ర – పుష్కరాల్లో ‘ప్రా’సక్రీడ

పుష్కరాల తొక్కిసలాటపై జరిగిన ఒక టీవీ డిబేట్ లో మూడు ‘ప్ర’ లు దానికి కారణంగా తేల్చారు. ఇంకో రెండు, – ఒక ‘ప్ర’, ఒక ‘ప్రొ’ – మెన్షన్ చెయ్యకుండా వదిలేసారు. వదిలేసిన నాలుగో ‘ప్ర’ అంటే ప్రజలు. ప్రజల్నేమనాలో ఎలా అనాలో తెలీక, అనే ధైర్యం లేక వదిలేసారు. క్రమశిక్షణ తెలీని, అలవాటుపడని అనచ్చు కానీ ప్రజలే బాధితులు కనక ఇది సందర్భం కాదు అని వదిలేసారు అనుకోవచ్చు. మనం ప్రజలం కాబట్టి మనని మనమే విమర్శించుకోవాలి. రాష్ట్రాల్ని సింగపూర్లు చేసే ఉద్దేశంలో వున్నవాళ్ళూ, అయిపోతుందనుకునేవాళ్ళూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అది – సింగపూర్ అనే దేశం ఇవాళ సింగపూర్ గా వుందంటే ప్రజలు నయానో భయానో క్రమశిక్షణ పాటిస్తారు కాబట్టే. అది మనకి లేదు. సో, నాలుగో ‘ప్ర’ విషయంలో ఎప్పటికైనా ఏదో ఒకటి చేయాలి – ఏపీ సింగపూర్ లా అవ్వాలంటే.
ఇంక మిగిలింది తక్కిన అన్ని ‘ప్ర’ లు పట్టించుకోకుండా వదిలేసిందీ ‘ప్రొ’ – అంటే ప్రొఫెషనలిజం. ‘ప్రొ’ అనేది ‘ప్ర’ కి చాలా దగ్గర్లోనే వుంది కనక ప్ర లిస్టులో పెట్టచ్చు. జరిగిన చర్చలు, డిబేట్లలో ఎక్కడా ప్రొఫెషనల్స్, భద్రత నిపుణుల ప్రసక్తి వచ్చినట్టులేదు.
మాస్ ఈవెంట్స్ – కుంభమేళా, పొలిటికల్ రాలీలు, రిపబ్లిక్ డే పెరేడ్, ఏషియన్ గేమ్స్ లాంటివి – జరిగినపుడు, భద్రతా ఏర్పాట్లు చెయ్యడానికి కొన్ని శాస్త్రీయపద్ధతులుంటాయి. మొన్నటి పుష్కరాల్లో ప్రవచనకారులు ఏం చెప్పారనేదాంతో సంబంధం లేకుండానే కోట్లల్లో – కనీసం లక్షల్లో – జనం వస్తారని అంచనాలున్నాయ్. రద్దీ తట్టుకునేందుకు చాలా ఘాట్లు ఏర్పాటయ్యాయి. ప్రైవేట్ వాహనాలు దూరంగా ఆపి యాత్రికులు షటిల్ బస్సుల్లో ఘాట్ చేరుకునేలా ఏర్పాట్లు జరిగాయి. అర్ధంకాని విషయం మాత్రం – పుష్కర్ ఘాట్ అని పెరుపెట్టబడిన ఘాట్ దగ్గర రద్దీ అంతగా పెరిగిపోతుంటే జనాన్ని ఇతర ఘాట్లకి పంపించే ఏర్పాటు ఎందుకు జరగలేదు అనేది.
ఈ భద్రతా నిపుణులు (సేఫ్టీ స్పెషలిస్టులు) రంగంలోకి దిగివుంటే జాబ్ సేఫ్టీ ఎనాలిసిస్ (JSA) చేసి పుష్కరాలు జరిగిన పన్నెండు రోజుల్లో తలెత్తగల రిస్కులేమిటో గుర్తించి తగిన జాగ్రత్తలు, కావాల్సిన ఏర్పాట్లు సూచించేవాళ్ళు. పుష్కరాల నిర్వహణలో అది జరిగిందా? జరిగితే ఏ స్థాయిలో జరిగింది? దాని గురించి మాట్లాడకుండా
‘ప్ర’సార మాధ్యమాలు
‘ప్రొ‘ఫెషనల్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవలేదనే మాట వదిలేసి
‘ప్ర’జల కష్టాలకి
‘ప్ర’వచనకారుల్ని బాధ్యుల్ని చేసేసి
‘ప్ర’భుత్వాన్ని ఇరుకునపెట్టాలన్న
‘ప్ర’తిపక్షాల
‘ప్ర’యత్నాన్ని
‘ప్ర’క్కదారి…రి…రి…రీ……………………

ఒక అగ్నిప్రమాదం జరిగిందంటే దానికి మూడు ఫాక్టర్స్ తప్పనిసరిగా వుండాలి. ఒకటి మండే పదార్ధం, రెండు నిప్పు, మూడు మండడానికి అవసరమైన గాలి, అంటే ఆక్సిజన్. మూడిటినీ కలిపి ఫైర్ ట్రయాంగిల్ అంటారు. అంటే మూడూ ఒకేసారి ఒకేచోట ఉన్నాయంటే, అంటే త్రిభుజం పూర్తయితే, ఇంక అంతే సంగతులు.
మూడిట్లో ఏ ఒక్కటి మిస్సైనా ప్రమాదం జరగదు. మూడూ కలవకుండా చూసుకోవడమే సేఫ్టీ మానేజ్-మెంట్. అవి కలిసాయీ అంటే సేఫ్టీ చూసుకోవాల్సిన వాళ్ళ లోపం ఉందన్నమాట!

ఇలాగే, మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ లో వ్యక్తుల పొరపాట్లే, అక్కడ బాధ్యతలు నిర్వహించినవాళ్ళవే, కారణం అని తేలుతుంది. యాక్సిడెంట్లు వాటంతటవి జరిగిపోవు. అది పొరపాటు కావచ్చు, అజ్ఞానం కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, చాలా మటుకు ప్రమాదాలకి హ్యూమన్ ఎర్రర్ ప్రధానకారణం. అందుకే సేఫ్టీ మానేజ్-మెంటుకి Accidents do not happen, they are caused అన్న వాక్యం ముఖ్యసూత్రం అయింది.
ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ , రోడ్డు ప్రమాదాలు, పెద్ద ఎత్తున జనం గుమిగూడే సందర్భాల్లో జరిగే తొక్కిసలాటలు…. వీటన్నిటికీ కామన్ ఫాక్టర్ మనుషులు, ముఖ్యంగా ఆయా బాధ్యతలు నిర్వహించే అధికారులు, సిబ్బంది, ఆ తర్వాత అక్కడికి పనివుండో లేకో వచ్చినవాళ్ళు. ఏర్పాట్లు చెయ్యాల్సిన బాధ్యత నిర్వాహకులదైతే, వాళ్ళ సూచనలు పాటించాల్సిన బాధ్యత ప్రజలది.

అందువల్ల జరిగిందాంట్లోంచి ‘ప్రా’ఠాలు సారీ 😉 పాఠాలు నేర్చుకుని రాష్ట్రం నిఝ్ఝంగా సింగపూర్ అయిపోవాలని ఆకాంక్షిస్తూ వేడిగా ఇరవైనాలుగో కాఫీ లాగిస్తూ …. బై4నౌ _/\_ 🙂

సెంట్రలిండియామాహిష్మతిలో కన్నడబాహుబలి తెలుగు


సీన్స్ ఫ్రమ్ ట్రాయ్ + క్రిష్ + స్పైడర్/సూపర్ మాన్+మాడ్ మాక్స్ = బాహుబలి? I don’t think so.

Bahubali is just a precursor to what Rajamouli could deliver. రాజమౌళి తియ్యబోయే మహాభారతం ఎలా వుండ బోతోందో ఒక ఐడియా వచ్చేసింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హాలీవుడ్ స్థాయిలో ఆలోచించగలదు,సినిమా తియ్యగలదు. తెలుగు భాషని తెలుగులోనే మాట్లాడే యాక్టర్లు దొరికితే, దేశవాళీ కాన్సెప్ట్లని రియలిస్టిగ్గా తీస్తే బెన్-హర్, టెన్ కమాండ్-మెంట్స్, ఇండియానా జోన్స్ ఎట్సెట్రా క్లాసిక్స్ ఇచ్చే కిక్కు ఇవ్వగలదు.

భారతం చదివినా, మన పౌరాణికాలు చూసినా ధనుర్యుద్ధాలు మహాపేలవంగా వుంటాయి. యుద్ధవ్యూహాల ప్రస్తావన వుంటుంది కానీ అవి ఎలా వర్క్ అవుట్ అవుతాయో అస్సలు అర్ధం కాదు. బ్రాడ్ పిట్ నటించిన ట్రాయ్ సినిమా చూసాక తెల్సింది, మనవాళ్ళు మిస్సయినదేమిటో. రాజమౌళి ఆ లోటుని తీర్చినట్టే. ఫ్యూచర్లో యుద్ధతంత్రాల్లో భారతీయత మోతాదు పెంచవచ్చు. అంటే ముక్కు మీద బాణం పెట్టుకుని మంత్రంపెట్టి వదలడం కాదు. రీసెర్చ్ అవసరం.

రామాయణం,భారతం, గంగావతరణం, కుమారసంభవం, సుందరకాండ, 1971 ఇండో-పాక్ వార్, కృష్ణరాయని కధ – ఇలాంటివి ఈ టెక్నాలజీతో తీస్తే అద్భుతం. ఐతే టెక్నాలజీకి తోడూ భాష కూడా స్టాండర్డ్ గా వుంటే తెలుగువాళ్ళ పంట పండినట్టే.

Full marks for Sathyaraj as Kattappa with Rana all set to steal the show in the next such venture. Prabhas, could do far far better with a greater command on Telugu. His gurgling voice may be unique to him but it lacks the depth that is expected for a character like Bahubali.    

బాహుబలి, భల్లాలుడు డిజర్ట్ లయన్ ఒమర్ మక్తర్ (అంటోనీ క్విన్) లా కనిపించిన కట్టప్పనుంచి నేర్చుకోవాల్సిందేదో వుంది. బాడీ లాంగ్వేజ్? may be. భావోద్వేగాల వ్యక్తీకరణ? కావచ్చు.
కొంచెం ఎక్కువ స్క్రీన్ టైముంటేబాహుబలిని భల్లాలదేవుడు డామినేట్ చేసేవాడేమో – డైలాగ్ మాడ్యులేషన్ తో, యాక్షన్ లా కాకుండా సహజంగా కనిపించిన దర్పంతో
బాహుబలి తెలుగు టీవీ యాంకర్ తెలుగు కన్నా ఓ ట్వెంటీ పెర్సెంట్ నయం. సెంట్రల్ ఇండియన్ సిటీ మాహిష్మతిలో సెటిలయిన కన్నడ బాహుబలి తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోవడం అర్ధం చేసుకోదగ్గ విషయమే.

 అవంతిక యుద్ధాలు అక్బర్ లో ఐశ్వర్యారాయ్ చేసిన యుద్ధాల్లా వుంటాయనుకున్నా, సరిగ్గా కుదర్లేదు.

కాలకేయుల లాంగ్వేజ్, క్రియేటివ్ ఐడియా.

Trivia :

పాతికేళ్ళ నిర్బంధంలో దేవసేన వెయిట్ ఏ మాత్రం తగ్గకపోవడం వెనకనున్న రహస్యం ఏమిటో?
టెక్నికల్ కళ్ళతో చూస్తే శివలింగం ఎత్తిన విధానంలో ఏదో లోపం వుందా అనిపించొచ్చు.
మాహిష్మతి సెట్టింగ్స్ అద్భుతంగా వున్నా డెన్సిటీ ఆఫ్ బిల్డింగ్స్ ఎక్కువైనట్టనిపించింది
Overall, Bahubali is more about showcasing the talents of Tollywood than about the story and the characters. That may be the reason why it does not emotionally rivet your attention. The bold presentation, the grandeur of each personality and every moment did not allow the audience to connect with the movie in all its dimensions. But, that’s my personal view. _/\_ 🙂   

డౌట్లడిగే చికెన్ – మాట్లాడే మటన్ (1)


ఈ టపాకి టైటిల్ అలా పెట్టిన కారణం పోస్టు చివర్లో వుంది. పోస్ట్ మొత్తం చూడకుండా అది చదివేస్తే ఈ టపాకి హీరోలైన కోడి మేక బాధ పడతాయి. వాటి మనోభావాలు కూడా కాస్త అర్ధం చేసుకోవాలిగా మరి!
kodi meka 01

kodi meka 02

kodi meka 03

సింగపూర్ చిన్నదేశం, సహజ వనరులు ఏవీ లేని దేశం కదా. ఎటు చూసినా బిల్డింగ్సే. చెట్లూ చేమలూ కనిపించినా అవన్నీ పార్కులూ, గార్డెన్లూ లేదా లాండ్ స్కేపింగ్ లో భాగంగా వుండేవే తప్ప సహజంగా, అడవి మాదిరిగా పెరిగినవి వుండవు. జంతువులూ, పక్షులూ విషయానికొస్తే మాత్రం చాలా నయం. పూర్తిగా మానవ నిర్మితమైన నగరంలో ఉండగలిగిన పక్షి,జంతుజాతుల కన్నా ఎక్కువే వున్నాయి. వికిపీడియాలో Flora and Fauna of Singapore అని సెర్చ్ చేస్తే పెద్ద లిస్టే వుంది మరి.  ఐతే అక్కడివాళ్ళు పాడిపంట అనే పదాలకిఓ- అర్ధాలు అనుభవపూర్వకంగా తెల్సుకోవాలంటే మలేషియాకో, థాయ్-లాండ్ కో వెళ్లి చూడాల్సిందే. ఇంక చుట్టుపక్కల కోళ్ళు, మేకలు, ఆవులు లాంటి జీవులు దుర్భిణీ వేసి చూసినా, మైక్రోస్కోపుతో వెతికినా ఎక్కడా కనిపించవు. ఐ మీన్, స్వేచ్ఛగా, సజీవంగా తిరుగుతూ కనిపించే ప్రశ్నేలేదు. అందుకే సింగపూరియన్స్ జోక్ చేస్తారు,”మాకు తెలిసి  కోడిని కానీ, మేకని కానీ మేం దాన్ని మొదట చూసింది అది డైనింగ్ టేబుల్ మీదకి చేరిన రూపంలోనే అంటే చికెన్, మటన్ రూపాల్లోనే,” అని. సరే, అంత చిన్నదేశంలో ఆ పరిస్థితి తప్పదు. ఇప్పుడిప్పుడే కాకపోయినా ఒకట్రెండు దశాబ్దాలలోనైనా మనదేశంలో కూడా ఈ పరిస్థితి రావచ్చు. ఇప్పటికే అవి స్వేచ్ఛ అంటే ఏంటో మర్చిపోయాయి. వాటి జీవితాలకి డిగ్నిటీ కూడా లేకుండా చేసేస్తున్నాం. ఇరుకు పంజరాల్లో కుక్కేసి, సైకిళ్ళకి తలకిందులుగా వేలాడగట్టీ, హింసాత్మక పద్ధతుల్లో చంపీ ఇలా …

భవిష్యత్తులో వాటి అస్తిత్వం కోడిగా, మేకగా కాక చికెన్, మటన్ రూపాల్లోనే మిగులుతుందేమోననే చింతతో డౌట్లడిగే చికెన్ – మాట్లాడే మటన్ అని టపాకి పేరు పెట్టాను.

స’శేషం’

కాఫీత్వ – మూడో కప్పు, ఇట్’స్ హాట్ !!


ఒకప్పటి, యూఎస్ ప్రెసిడెంటు రోనాల్డ్ రీగన్ సినిమా రంగంనుంచి  రాజకీయాల్లోకి వచ్చాడు. అటు సినిమా ఫీల్డు, ఇటు పాలిటిక్సు తెలిసినందువల్ల ఆయనకి ఆ రెండు రంగాలపై కాఫీ ప్రభావం ఏమిటో ఎంతో తెలిసే అవకాశం ఉండే ఉంటుంది — కదా!!

Now enjoy ur latest cup of coffee _/\_ 🙂

kaafeetva 2

చట్టసభల్లో కునుకు తీసే ప్రైమ్ మినిస్టర్లు, ఎంపీలు

అసెంబ్లీల్లో బ్లూ ఫిల్ములు చూసే ఎమ్మెల్యేలు 

సినిమాలని మసాలా పాకేజిలు చేసేసిన కళామతల్లి ‘ముద్దుబిడ్డలు’

వీళ్ళందర్నీ భరిస్తూ తరిస్తున్న జనజీవన స్రవంతి 

– ఈ వర్గాలు లేకుండా ఈ పోస్టు సాధ్యపడేది కాదు. ఇది వారికే అంకితం. 

కాఫీత్వ – ఓ కప్పు కాఫీ, ఒక మాట & నేపాల్ భూకంపానికి అసలు కారణం!!


kaafeetva 1

కాఫీత్వ ఫాలోవర్స్ కి ఎప్పుడూ కూడా బ్రెయిన్ పని చేస్తూఉండాలి. అదీ పదునుగా.

అలా అని కాఫీ తాగేవాళ్ళంతా  షార్ప్-మైండెడ్ అనుకోరాదు.

మెదడుకి పని పెట్టడానికి, పదును పెట్టడానికి కాఫీ తాగేవాళ్ళే మెజారిటీ.

శ్రీశ్రీ మైండు షార్పు కనక ఆయనకి కాఫీ ఇష్టం.

నా మైండు షార్పు కానందువల్ల నాకు కాఫీ ఇష్టం.

అదన్నమాట కాఫీత్వ ఫిలాసఫీ, నో, ఫిలాకాఫీ 🙂

దేర్-ఫోర్ కాఫీత్వ ఫాలోవర్స్ కాని వాళ్ళెవరూ ప్రపంచంలో వుండరు.

వుండరు అంటాం, వుండరు అని నమ్ముతాం కనక ప్రమాదం లేదు.

వుండకూడదు అంటే కాఫీత్వ కాస్తా కా’ఫత్వా’ ఐపోగల్దు. కాఫీ విషయంలో కాంప్రమైజులు పనికిరావు. సో, కా‘ఫత్వా’ ఫీత్వ ఎలోన్ ఈజ్ రైట్!!

 

‘కాఫీ’త్వ


KAAFEETVA

“శ్రీవారిని దర్శించుకున్న (సినీ) ప్రముఖులు !!!” – శ్రీవారి ముందు ప్రముఖులెవరండీ అసలు?


తెలుగు న్యూస్ లో నాకు నచ్చని ఒకానొక (ఓకే ఒక కాదు) ఐటం ఇవాళ మళ్ళీ పేపర్లో పడింది. అది – “శ్రీవారిని దర్శించుకున్నప్రముఖులు (ఒకోసారి సినీ ప్రముఖులు)”. శ్రీవారి ముందు ప్రముఖులేంటండీ అసలు? పేపర్లవాళ్ళు అలా రాస్తారా ఈ ప్రముఖులు అలా రాయించుకుంటారా? ఫలానా దేవుణ్ణి దర్శించుకోడానికి వెళ్లాను అని నలుగురితో చెప్పుకోవటమే కూడదంటారు. అలా చెప్పుకుంటే దైవదర్శనం వల్ల మనలో ఏ మూలో వున్న కాస్తపాటి భక్తి, విశ్వాసం, దేవుడికి మన శరణాగతి, ఆ నమ్మకంవల్ల వచ్చే (లేక) రాబోయే జ్ఞానం – ఇలాంటి వాటి ఆరోగ్యానికి మంచిది కాదని అలా అంటారు. ప్రముఖులు అని పిలవబడుతున్నవాళ్లకి ఈ విషయం తెలీదు అనుకుంటే ప్రముఖులు అనే టైటిల్ సబబేనా?

శ్రీవారిని దర్శించుకునే రకరకాల ప్రముఖుల్లో సినీ, రాజకీయ, అధికారిక, ప్రభుత్వ ప్రముఖులే ప్రముఖులు. ఇందులో కొత్తగా చెప్పేదేంవుంది? ఏ తెలుగు పేపర్ చూసినా తెలుస్తుంది. కానీ కొత్తగా మనం చూడొచ్చు.

పైన చెప్పిన నాలుగురకాల ప్రముఖులకీ, ఇతర ఉత్తుత్తి ప్రముఖులకీ  తేడా ఏంటంటే అది కాంట్రవర్సీ. కుంభకోణం, రంభకోణం ఈ రెండు కోణాల్లో ఏ కోణంనుంచి చూసినా ఈ నలుగురూ అందులో చోటు చేసుకోవడానికి పోటీలు పడుతూ వుంటారు. అందువల్లే ప్రముఖులనే టైటిలూ దానికి టాగ్ లా భక్తి అంటే కొంచెం అదోలా అనిపిస్తుంది.

నవవిధభక్తుల్లో ప్రముఖభక్తి లేదు. ఇది దశమవిధ భక్తి. ఒక్క క్షణం, ఇప్పటి ప్రముఖ భక్తికన్నా చాలా రెట్లు అతిగా వుండే ప్రముఖ భక్తి , ఇన్ ఫాక్ట్, దశముఖ భక్తి రావణాసురుడు ప్రదర్శించి ఇరవై చేతులూ కైలాస పర్వతం కింద నలగ్గొట్టించుకుని శృంగభంగం అయ్యాక చివరికి పేగులతో(సొంతవి) రుద్రవీణ వాయించి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. కలియుగప్రముఖులకి రావణుడంత భక్తీ లేదు, మొండితనమూ లేదు, సాహసం అంతకంటే లేదు. సో, ప్రస్తుత ప్రముఖభక్తి పదోరకం భక్తిలో లోయెస్ట్ లెవెల్.

భక్తికి సరిపోయే క్వాలిటీ హ్యుమిలిటీ(అణకువ, నమ్రత, వినయము) ప్రముఖత్వం కాదు. ఈ విషయం పేపర్లకి తెలియదా? దేవస్థాన అధికార్లకీ, అర్చకులకీ తెలియదా? ప్రముఖులకి తెలియదా? ఎవరికీ తెలియదా? అదే నాకు తెలియదు.

నిజాయితీగా చెప్పాలంటే ఈ టాపిక్ లేవనెత్తడంలో నాక్కొంత సెల్ఫ్ డౌట్ లేకపోలేదు. ప్రముఖులందర్నీ ఓకే గాటన కట్టడం కరెక్టు కాదేమో, నేనంత బ్రాడ్-మైండెడ్ కాదేమో! ముందే చెప్పినట్టు ప్రముఖులు అని రాయించుకుంటారా? పేపర్లే రాస్తాయా? అన్నమీమాంస ఒకటి వుందికదా!
అదీకాక భగవంతుడికీ భక్తుడికీ అనుసంధానంగా అంబికా దర్బార్ బత్తీ తప్ప ఇంకెవరూ, ఏమీ వుండకూడదు, నేను కూడా. సో, నా ప్రశ్నల్ని జస్టిఫై చెయ్యడం ఎలా? వాట్నిఎవరాన్సర్ చేస్తారు? లాభం లేదు డైరెక్ట్ గా దేవుణ్నే ఆత్మారాముణ్ణే అడగాలి. అడిగేసాను ఈ ‘ప్రముఖ’ భక్తిని నువ్వెలా రిసీవ్ చేసుకుంటావు అని. అం’తరంగా’లుగా ఆయనిచ్చిన సమాధానాలివీ –

రాకెట్ లాంచింగ్ ముందు ఇస్రో చైర్మన్ శ్రీవారి దర్శనం చేసుకున్నారు అంటే ఏదో ఆయన వ్యక్తిగత నమ్మకం అని సరి పెట్టుకోవచ్చు. లాంచింగ్ ఫెయిల్ ఐతే అది దేవుడి ఫెయిల్యూర్ అని వాదించే వితండవాదులు ఇంకా తెరపైకి రాలేదు కనక ప్రస్తుతానికి వదిలెయ్యచ్చు. బట్, సినిమాల్లో సిగ్గూ లజ్జా లేని సీన్లు తీస్తూ, నటిస్తూ దేవుడికి పొర్లుదండాలు పెట్టే సినీ ప్రముఖుల్ని చూసి ఆ ‘సినీ’ భక్తిప్రపత్తులకి గుళ్ళో మూల విరాట్ మాయాబజార్లో ఎన్టీయార్ కృష్ణుడిలా తలపంకిస్తూ నవ్వుకుంటాడు. సామాన్యుల గుండెల్లో,బుర్రల్లో వుండే దేవుడు మాత్రం భ్రుకుటి ముడేస్తాడు. (భ్రుకుటి ముడెయ్యడం = frowning)

ఒక సుప్రీం కోర్టు జస్టిస్ తిరుపతో, శ్రీశైలమో వెళ్తే అదికూడా పర్సనల్ మేటర్ అని వదిలెయ్యచ్చు(వదిలెయ్యాలి) కానీ వేలకోట్ల కుంభకోణాలు చేసేసి కాలిబాటన కొండెక్కుతున్నా, కిరీటం తెస్తున్నా అంటే కొంచెం ఎబ్బెట్టుగా ఫీలౌతాడు మనలోవుండే అంతర్యామి. గుళ్ళోవుండే సర్వాంతర్యామి మాత్రం, “నా దృష్టిలో అందరూ ఒకటే,” అన్న పాలిసీ పెట్టుకోవడంవల్ల అదే చిరునవ్వుతో, అదే అభయహస్తంతో ప్రోటోకాల్ ఫాలో ఔతాడు.

ఓ అయ్యేఎస్ వీఐపీ దర్శనం చేసుకుని వస్తే ఆయనకుండే డ్యూటీలు, పని+రాజకీయ వత్తిళ్ళూ తెలుసు కనక యాక్సెప్ట్ చేసేస్తాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. కానీ ప్రజాసేవకులం అని ముఖాలమీద పోస్టర్లంటించుకు తిరిగేవాళ్ళు అందరితో క్యూలో నిలబడకుండా వీఐపీ దర్శనాలు చేసేసుకోవడం, వాళ్ళతో సాగదీసుకున్న మూతులతో అర్చకులు ఫోటోలు దిగడం… ఇలాంటివి చూస్తే ఆత్మారాముడికి నవ్వు, జాలి, చిరాకు ఒకసారే పుట్టుకొస్తాయి.

మరి మీడియా గురించేమంటావ్ స్వామీ అంటే అంతర్యామీ, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడూ ఇద్దరిదీ ఒకటే అభిప్రాయం. పూర్వం యుగాని కొకరో ఇద్దరో విలన్లు ఉన్నటైములో లోకకల్యాణానికై నారద మహర్షి నిర్వహించిన పాత్ర ని కలియుగంలో మీడియాకి హోల్-సేల్ గా ఔట్-సోర్స్ చేసేసార్ట. యుగధర్మం ప్రకారం లోకకళ్యాణం అనేపని లోకమంతా కాంట్రావర్సీమయంచెయ్యడంతో రిప్లేస్ ఐపోయిందిట. ఒకోసారి తెలిసీతెలియక కూడా మీడియా ఆ పాత్ర నిర్వహించేస్తూ ఉంటుందిట. ప్రస్తుత సబ్జెక్ట్ మాటర్ అలాంటిదేట.

మరి ఈ పరిస్థితిని మార్చే ఉద్దేశం నీకేమైనా వుందా స్వామీ అంటే – కురుక్షేత్ర యుద్ధం కానీ, వాగ్యుద్ధం కానీ ఆయుధం పట్టకూడదని పాలిసీట. అందులోనూ ఇది కలియుగం కనక అస్సలు కలగజేసుకోరుట. చట్టంలా తన పని తాను చేసుకుపోతూ కర్మసిద్ధాంతం ఉండనే ఉందిట. ఆ విషయం వాళ్ళిద్దరికీ తెల్సుట, నాకే తెలీదుట. సో ఫ్రెండ్స్, అల్ మై డౌట్స్ క్లియర్డ్, అల్ మై క్వెశ్చన్స్ ఆన్సర్డ్. నో మోర్ కంప్లెయింట్స్ ఫ్రమ్ మై సైడ్!! 🙂 _/\_

A second sequel to పవన్, సింహం, గడ్డం గీసుకోవడం, etc, etc.


నిన్న రాత్రి సింహం కల్లోకి వచ్చి ఈ పద్యం చదువుతూ, కళ్ళనీళ్ళు పెట్టుకుని ముక్కు చీదుకుంది.

గాడిని దప్పిన కొడుకును

గాడిద కొడుకంచు తండ్రి కటినము జూపన్

వీడా? నాకొడుకంచును

గాడిద యేడ్చెను గదన్న ! ఘన సంపన్నా !

‘ఎందుకా పద్యం చదువుతున్నావ్?’ అంటే ‘నా పరిస్థితీ పద్యంలోని గాడిద పరిస్థితిలాగే ఉందం’ది. ‘ప్లీజ్, ఎక్స్ప్లెయిన్,’ అన్నాను.
“అడవుల్లో ఉండే నేను ఇలా తప్ప ఎలా ఉండగలను? మీలా మాకు బుద్ధీ ,జ్ఞానం, సాంఘికజీవనం, మనోభావాలు, ఎట్సెట్రా డెవలప్ అయ్యే అవకాశం లేదు. అది తెలిసీ నా ఇమేజి డామేజ్ చేసెయ్యడం ఏం బాలేదు. ఇప్పుడు నా మనోభావాలు దెబ్బతిన్నాయ్. అయాం హర్టెడ్,” అంది. కంటిన్యూ చేస్తూ, ” పవన్ అంతటివాడు నాతో తనని కంపేర్ చేసుకుంటే ఎంత సంబరపడ్డానో, గాలి మొత్తం తీసేసావు. మీ సొసైటీలో పవన్, ఐ మీన్ గౌతమ్ నందా ఆఫ్ అత్తారింటికి దారేది ఎంత గొప్పో మా అడవిలో నేనూ అంతే. అడవికీ, సివిల్ సొసైటీకి వున్న  అంతరాన్ని దృష్టిలో వుంచుకుంటే నువ్వు నన్ను అసహ్యించుకునేవాడివి కాదు గదా! ఇప్పుడర్ధమైందా? పద్యంలో గాడిదదీ, నాదీ ఒకటే పరిస్థితని ఎందుకన్నానో,” అంది. కొంచెం అర్ధమైనట్టేవుంది ఐనా ఇంకొంచెం క్లారిటీకోసం, “గౌతమ్ నందా అర్ధం చేసుకున్నట్టుగా నేన్నిన్ను అర్ధం చేసుకోలేదంటావ్, అంతేగా,” అన్నాను. “ఎగ్జాక్ట్లీ,” సింహం కళ్ళలో మెరుపు. మళ్ళీ అన్నాను, ” కొందరు మనుషులకుండే మృగ లక్షణాలు సింహంలో ఉన్నాయి అంటే నీకేమన్నా అభ్యంతరమా?” ” అది కొంచెం నయం. అసలు ఈ కంపారిజన్ అవసరమా?”.
“స్ట్రిక్ట్లీ స్పీకింగ్ అవసరం లేదు కానీ ఏదో ఒక కంపారిజన్ వుంటే మనుషులకి బాగా అర్ధం అవుతుందని. నీ ఇమేజ్ డామేజ్ అవ్వదు, నేననుకున్నది కన్వే అవుతుంది. ఏమంటావ్? ”
“సరే, కానీయ్” అంటూ స్వప్నసింహం మాయమైంది.
గాంధీజీ దొంగచాటుగా మాంసం తిన్నప్పుడు ఆయన కలలో ఆ మాంసపు అసలు ఓనరయిన మేక చేసిందానికీ ఇప్పుడీ సింహం ఎమోషనల్ ఔట్-బర్స్ట్ కీ తేడా ఏమన్నా ఉందా అంటే, అది ఇదీ –
మేక గాంధీజీ’స్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ లో చోటు చేసుకుని చరిత్రలో నిలిచిపోయింది. పాపం ఈ సింహం ఈ బ్లాగ్ తో సరిపెట్టుకోవాల్సిందే. పవన్ తో కంపేరిజన్ లేకపోతే అదీ డౌటే. ఆబ్వియస్లీ, మేక ఈజ్ ఫార్ స్మార్టర్ దాన్ లయన్.

ఏదో ఆవేశంలో సింహం ఇమేజి డామేజ్ చేసేసాను గానీ ఇలాంటి కారెక్టర్ అసాసినేషన్ అవసరంలేదనిపించింది. ఇలా సింహం కారెక్టర్ కీ కాన్స్స్టన్టైన్ ది గ్రేట్ తో మొదలుపెట్టి అనేకమంది అనేకమతాల దురహంకారుల, కంసుడితో మొదలెట్టి హిట్లర్, స్టాలిన్, పోల్ పాట్, సద్దాంహుసేన్, గడ్డాఫీ, , కిమ్ జాంగ్ ఇల్, కిమ్ జాంగ్ యున్, ఫోదే శాంకో, …..లాంటి పొలిటికల్ షావినిస్టుల కారెక్టర్లకీ ఉన్న డిఫరెన్స్ అర్ధమైంది. అంతేకాదు కోతులుకాక సింహాల నుంచి మనుషులు ఇవాల్వ్ అయ్యుంటే ఇప్పటికంటే హుందాగా, దర్జాగా, డిప్లోమేటిగ్గా ఉండేవాళ్ళు మనుషులు? అనికూడా అనిపించ బోయి  ఎందుకో మానేసింది.

సో,  ఇప్పుడు నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే సింహాలు కొందరు మనుషుల్లా బిహేవ్ చేస్తున్నాయి. అవును, కొందరు మనుషుల్లోవుండే పొలిటికల్ షావినిజం, జెనోసైడల్ మెంటాలిటీ – రెండూ సింహంలో ఉన్నాయి. (ప్లీజ్ రీడ్ అడవి సింహం). అందుకే నాట్ జియో డాక్యుమెంటరీల్లో దాన్ని చూసి నప్పుడల్లా పై లిస్టులో చెప్పిన(పేర్లు గుర్తులేక చెప్పలేకపోయిన) కారెక్టర్స్ గుర్తొస్తాయి.
జెనోసైడల్ మెంటాలిటీకి అసలు కారణం వేరే జాతి అంటే పడకపోవటం కాదు, డైవర్సిటీ ఆఫ్ ఒపీనియన్ – విభిన్న దృక్పధం అంటే పడకపోవటం. తనకి దొరికిన కుందేలు నాలుగు కాళ్ళలో ఒక దాన్ని విరగ్గొట్టి మరీ దానికి మూడు కాళ్లే అని నిరూపించే నైజం. అప్పటికీ నమ్మనివాళ్ళని లేపేసే క్రౌర్యం.

(TO BE CONTD.)

పవన్-కళ్యాణ్ కీ,సింహానికీ గడ్డం గీసుకోడంకంటే ఎక్కువ తేడాలున్నాయనీ….A sequel


పవన్ పేరు, సింహం పేరూ వాడుకుని పోస్టు మొదలుపెట్టి వాళ్ళ గురించి అస్సలు రాయకపోతే ఎలా? ఇవాళ వాళ్ళ గురించే రాద్దామని మొదలుపెట్టాను. ఏం రాస్తానో ఎంతవరకూ రాస్తానో ఇప్పుడే మొదటిలైన్లోనే పిక్చర్ రాదు. “మా”ర్క్ -ట్వైన్ గురువుగారు చెప్పినట్టు మొత్తం రాసే దాకా నువ్వేంరాయాలనుకున్నావో నీకే తెలియదు. పూర్తయ్యాక కానీ రాయటం మొదలవదు. అందువల్ల పెద్ద పెద్ద ప్లాట్లు వెయ్యకుండా మామూలుగా రాసుకుపోతా.

పవన్ ? (or) సింహం? ఎవరితో మొదలుపెడదాం? నాకు పవన్ కంటే సింహం గురించే కాస్త ఎక్కువ తెల్సు. దాని తోటే ముందు మొదలెడతా. ఈ సింహం ఉంది చూసారూ? ఒక్క గడ్డం విషయంలో తప్ప పవన్ కళ్యాణ్ తో ఏ విధమైన పోలికా లేదు. సినిమా కాబట్టి , సింహానికి ఉన్న ఇమేజిని బట్టి ఆ డైలాగ్- గడ్డం గీసుకోవడంలో తప్ప మిగిల్నవన్నీ సేమ్ టు సేమ్- వేసేశాడుగానీ పీకే కి సింహం విషయం తెలీకకాదనుకుంటా. పవన్ తనని తను సింహంతో కంపేర్ చేసుకున్నాడూ అంటే ఆ సింహం చేసుకున్న పుణ్యమేంటో, అదెంత గొప్పదై ఉంటుందో అనుకునేవాళ్ళు త్రిలింగదేశంలో చాలామందే ఉంటారు. త్రిలింగదేశం అంటే అన్-డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ అనే- అని మాత్రమే- కవి హృదయం. త్రిలింగ అన్న పదం తెలంగాణాని మాత్రమే సూచిస్తుందని, తెలుగువాళ్ళున్న ఏరియా అంతటినీ అని, ఒక సామాజికవర్గం నివసించిన ప్రాంతం కనక ఆ పేరొచ్చిందని (తెలుగు అనే పదంకి దగ్గరగా ఉంటుందా సామాజిక వర్గం పేరు) రకరకాల థియరీలున్నాయ్ కానీ ఆర్యన్ ఇన్వేజన్ థియరీ వెర్సస్ ఆల్టర్నేటివ్ థియరీస్ లాగా ఇవి కూడా ఎప్పటికీ తెగేవికావు. తెగితే రాజకీయాలు ఆ మేరకి తగ్గి పోతాయి. సో, మనిషి మైండ్ లో రాజకీయ పురుగు బతికున్నన్నాళ్ళూ ఈ థియరీలు రాజ్యం చేస్తూనే ఉంటాయ్. సరైన పురుగుల మందు వాడితే తప్ప థియరీల ఆధారంగా రాజకీయాలు, వాటికి సంబంధించిన సకల దుష్పరిణామాలు తప్పవు. పురుగుల తీవ్రతని బట్టీ కొందరికి మందు నెత్తిన జల్లితే చాలు.
కొందరికి మాత్రం, అనకూడదు గానీ ,తాగించడమే దారి.
Let me return to the main topic, i.e. సింహం now. పవన్ ఎండార్స్-మెంట్ వల్ల గడ్డం గీసుకున్న సింహం టీ-షర్ట్స్ ఎవన్నా త్రిలింగ దేశంలో ఫాషన్ అయ్యాయేమో తెలీదు, తెలుగువాళ్ళు మరీ తమిళతంబిల్లా ఉండర్లెండి. ఇదే డైలాగ్ రజనీకాంత్ వేసుంటే టీ-షర్ట్స్, లుంగీలు + గడ్డం గీసేసిన సింహానికి ఓ గుడి రెడీ. మనకి, అంటే ఆర్డినరీ ఇండియన్ కి తెలిసిన సింహం కవిత్వాల్లో, రచనల్లో, సినిమా డైలాగుల్లో ప్రొజెక్ట్ అయిన, ఐమీన్ వర్ణించబడిన సింహం మాత్రమే. దాని వ్యక్తిగత జీవితం ఎవరికీ నాట్ జియో పాపులరయేదాకా తెలీదు. స్టింగ్ ఆపరేషన్స్ లో బయటపడ్డ ప్రముఖుల నిర్వాకాల్లా జుగుప్సాపూరితంగా ఉంటుంది.
> నంబర్ వన్ మేల్ షావినిస్ట్ & ఎక్స్టార్షనిస్ట్ ఇది. మేల్ షావినిస్ట్ పిగ్ అంటారుగానీ పిగ్ తీసేసి లయన్ అనడం న్యాయం. జీవితాంతం పెళ్ళాలతో పని చేయించడం, పిల్లల్ని కనడం, నిద్రపోవడం అంతే.
> ఫామిలీలో ఎదిగిన మగపిల్లల్ని తన్ని తగిలెయ్యడం, లేకపోతే చంపెయ్యడం
> వేరే మగ సింహాలతో సంపుడో-సావుడో బేసిస్ మీద పోట్లాడి, గెలిస్తే దాని ఫామిలీని సొంతం చేసేసుకోవడం. ఆపైన కొత్త ఫామిలీ లో అప్పటికే ఉన్న అడ, మగ పిల్లలన్నిట్నీ మర్డర్ చేసెయ్యడం.
ఇదీ మృగరాజు అసలు పర్సనాలిటీ. దీనిక్కారణాలు డిటైల్డ్ గా కావాలంటే నాట్ జియో వీడియోలు చూడాల్సిందే. ఆ కారణాలన్నిటికీ మూలం మాత్రం స్వార్ధం, కరుడుకట్టిన స్వార్ధం. తన జీన్స్ తప్ప లోకంలో ఇంకే సింహపు జీన్సూ , తన కొడుకులవైనా సరే, బతికిబట్టకట్టకూడదు. ఈ ఒక్క కారణం దాన్నో మేల్ షావినిస్ట్ పిగ్ గా బిహేవ్ చేయిస్తుంది. ఆడవి అష్టకష్టాలు పడి వేటాడిన జంతువుని సగం దాకా లాగించిగానీ వాటిని తిననివ్వదు. వేరే ప్రైడ్ ని టేక్-ఓవర్ చేసినప్పుడు అందులోని ఆడవి పిల్లలుంటే తనతో జతకట్టవనీ, ఫ్యూచర్లో తనకి పోటీ వచ్చే శత్రుసింహపు పిల్లలనీ వాటిని చంపేస్తుంది. బేసిగ్గా తను తప్ప ఇంకెవరూ కనిపించనివ్వని మాత్సర్యం . ఇంతటి సున్నితమనస్కమైన జంతువుతో పవన్, పోనీ అత్తారింటికి దారేదిలో హీరో-గౌతమ్ నందా, తనని పోల్చు కుంటే నాకు నచ్చలేదు. నేను పవన్ కళ్యాణ్ లాంటోణ్ణి, నేను డాన్సులు, ఫైట్లు చేస్తాను, అతను చెయ్యడు. మిగిలినవన్నీ సేమ్ టు సేమ్ అనేస్తే చాలు. సింహాన్ని ఎలివేట్ చెయ్యడం అనవసరం. అదో పవర్ఫుల్ యానిమల్. అంతేకాని ఉత్తమ గుణాలకి ప్రతీక కాదు.
నౌ, ద టైమ్ హాజ్ కమ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఐ యామ్ డ్రైవింగ్ ఎట్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ పోస్ట్. బై4నౌ 🙂

****

ఆ మెన్‌, ఆమెన్‌ చెరపట్టన్‌, మ్రోగెన్‌ నీ గన్‌, నా పెన్‌ ఆపెన్‌

నువ్వు రాయాలనుకున్నదేదో పూర్తిగా రాసాకగానీ నువ్వేం రాయాలనుకున్నావో క్లారిటీ రాదు, నిజానికి రాయటం అప్పుడు మొదలౌతుంది అని మార్క్ ట్వైన్ ఉవాచ. ఇదేదో ఆరుద్ర గారి ఫిలసాఫికల్ ఉవాచ – నేనెక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటు – కి లిటరరీ ఈక్వలెంటులా ఉందే అనిపిస్తోందా? యూ ఆర్ రైట్. ఈ ఆర్టికిల్ ఇంతకుముందు పోస్ట్ చేసినప్పుడు ఆరుద్ర గారి పద్యం ఆధారంగా మృగాళ్ళని తిట్టడం నా ఉద్దేశం. రెండ్రోజులాగి రీ-బ్లాగ్ చెయ్యబోతూ ఎడిట్ చెయ్యడంలో రూపు మొత్తం మారిపోయింది.This is a ‘great’ writing experience for my smaaaaall self. ఎంతచెట్టుకి మొక్కకి అంత ‘గాలి’ మరి.

ఆరుద్ర పద్యం ఇదీ –

మెన్‌
ఆమెన్‌
చెరపట్టన్‌
మ్రోగెన్‌
నీగన్‌
నా
పెన్‌
ఆపెన్‌ (త్వమేవాహం పుట 36-37)
Your gun shoots and my pen stops the molesters that are after the helpless woman -ఇదీ మీనింగ్ . నాకున్న భాషా పరిమితుల్తో ఇంతకంటే బాగా రాయటం కుదరదు మరి.
ఆరుద్రగారి త్వమేవాహంలోదిట ఈ పద్యం. ఇవాళ విశాలాంధ్రలో చదివాను. ( ఇక్కడ కొంచెం పిడకల వేట – “ట” అన్న ఒక్క అక్షరం ఎంతగొప్పదో ఇప్పుడర్ధం అవుతోంది. పెద్ద పెద్ద వాక్యాలతో ఎక్స్ప్లనేషన్లూ, డిస్క్లైమర్స్ రాయవసరంలేకుండా జస్ట్ ఒక్క “ట” యాడ్ చేస్తే చాలు. విషయం మన సొంతం కాదని, ఆ పరిజ్ఞానం అంతకంటే లేదనీ చదివేవాళ్లకి తెల్సిపోతుంది. తిట్లు, విమర్శలు, వ్యాఖ్యలు వగైరాలతో శ్రమ పడకుండా మన్ని పెట్టకుండా లైట్ దీస్కుంటారు. తెలుగుభాషలోని సౌలభ్యాల్లో ఇది ఒకటి. ఇతర సౌలభ్యాలేమిటో నాకు తెలిసాక రాస్తాను. అప్పటివరకూ గరికపాటివారి ఉపన్యాసాలు వింటూ తెలుగు నిజంగా నేర్చుకుంటా. చిరంజీవి ఒకసారి , “ఈ సారి పార్లమెంటు సభలకొచ్చినపుడు హిందీ మే హీ బాత్ కరూంగా,” అన్నాడే అలా అన్నమాట.)
1949లో నిజాం/రజాకార్లకి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణా సాయుధపోరాటం బాక్-గ్రౌండ్ తో త్వమేవాహం రాశారు. అని తెలుగు వికీపీడియాలో చదివి తెలుసుకున్నాను. ఈ డిస్క్లైమర్ ఎందుకంటే ఎవరైనా ఆరుద్ర గారిపై వ్యాఖ్యలు, చర్చలు మొదలుపెడితే ఇంక నా పని అంతే, అందుకే ఈ ముందు జాగర్త.
మరెందుకు ఈ రాయాలన్న దురద అంటే – ఇన్ ఫాక్ట్ నాకే అనిపిస్తుంది – writer’s itch అని ఒకటుంటుందిగా
When once the itch of literature comes over a man, nothing can cure it but the scratching of a pen. But if you have not a pen, I suppose you must scratch any way you can అని ~Samuel Lover, అన్న పెద్దమనిషి 1842లో అన్నాట్ట. పెన్ను కాకపోతే ఏదో ఒకదాంతో రాయమన్నాడుగా రాసేందుకు కీబోర్డు, రాయించుకునేందుకు బ్లాగు ఉన్నాయి కనక రాయడం అనిన్నీ,
An incurable itch for scribbling takes possession of many, and grows inveterate in their insane chests అని ఆంగ్లంలో జువెనాల్ అనీ, రోమన్ భాషలో డెసిమస్ లునియస్ లువెనాలి (Decimus Iunius Iuvenalis) అని పిలవబడ్డ రోమన్ కవి తన 2nd century AD బెస్ట్ సెల్లర్ the Satires లో అనటం వల్లనూ ఈ బ్లాగ్రచనా ప్రయత్నమను సాహసమునకు ఒడిగట్టితిని.

ఆరుద్ర గారి గురించే సరిగ్గా తెలియదు కానీ కొత్తగా శామ్యూల్ లవర్ & జువెనాల్ అంటూ పాత రచయితల్ని కోట్ చెయ్యడమేమిట్రా నీ మొహం తగలెయ్యా అంటే ఐ కాన్ట్ హెల్పిట్, రైటర్’స్ ఇచ్ ఇంత భయంకరమని నాకూ ఇప్పుడే తెల్సింది. అందుకే ఆల్ టైమ్ బెస్ట్ రైటర్ మార్క్ ట్వైన్ రచనాకండూతి గురించి ఏమన్నాడా అని గూగిలింపనంత ఈ క్రింది వాక్యముగానంబడియె –

The time to begin writing an article is when you have finished it to your satisfaction. By that time you begin to clearly and logically perceive what it is you really want to say అన్నాడు మార్క్ ట్వైన్.

ఆర్టికల్ మొత్తం చదివాక ఎక్జాక్ట్లీ గా (ఎందుకోగానీ కొందరలా అంటారు)అదే జరిగిందని పాఠకులు గ్రహింపగలరు. ఈ పోస్టు యొక్క మాతృక – ఇదీ ఆరుద్ర గారి పద్యానికి అర్ధం – చూడగలరు.

Now, ఎక్కువ టైము వేస్టవ్వకుండా డైరెక్టుగా పాయింటుకి వచ్చేస్తా –

పద్యం ప్రతిపదార్ధం కూడా కావాలా? ఐతే ఇదిగో :
= ఆ
మెన్ = మగవాళ్ళు (మృగాళ్లు అని చదువుకొన వలెను)
ఆమెన్ = చర్చిలో చెప్పే ఆమెన్ కాదండోయ్, ఆమెను అనగా ఆ స్త్రీని
చెరపట్టన్ = ప్రతీ సినిమాలోనూ దీనికి మీనింగు దొరుకును కావున ఇచట వ్రాయనవసరము లేదు.
నీ గన్ = ‘తుప్పా’ కి చేపట్టిన పోలీసులు (ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా)
నా పెన్ = పత్రికలూ, రచయితలూ, కవులు, నటీనటులు ,ఎట్సెట్రా సామాజిక బాధ్యతగల వ్యక్తులు
ఆపెన్ = ఆపెదరు
ఆ మగవాళ్ళు (మృగాళ్లు అని చదువుకొన వలెను) ఆమెన్ (చర్చిలో చెప్పే ఆమెన్ కాదండోయ్) ఆమెను అనగా ఆ స్త్రీని చెరపట్టగా ‘తుప్పా’ కి చేపట్టిన పోలీసులు (ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా), చట్టాలు చేసే నాయకులు పత్రికలూ, రచయితలూ, కవులు, నటీనటులు ,ఎట్సెట్రా సామాజిక బాధ్యతగల వ్యక్తులు (ఎంతమందికుందో డౌటు)ఆపెదరు (వీళ్ళందరూ పెన్ వాడతారు కదా)
ఇదీ తాత్పర్యం.

పద్యాలపై నా పరిజ్ఞానం సున్నాయే. అయినా పద్యంలోని విషయం మాత్రం మరిచిపోలేనిది. అలా మర్చిపోకుండా మనదేశపు పురుషాహంకారవరాహాలు (మేల్ షావినిస్ట్ పిగ్స్) రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నాయి కదా మరి. ప్రస్తుతబాధేంటంటే ఆరుద్ర గారు కీచకులపై గన్ మోగుతుందని, పెన్ దురంతాల్ని అపుతుందని రాసారు కదా. ఏ గన్నూ మోగట్లెదు, ఏ పెన్నూ సరిగా రాయట్లేదు. రాజకీయ తుప్పు పట్టి, లీగల్ టాంగిల్స్ లొ చిక్కుకుని వంగిపోయిన గన్ను సరే మోగదు. రాయాల్సిన పెన్నుకీ బద్ధకం పట్టుకుంది. సెన్సేషన్స్, గాసిప్స్ , పాలిటిక్స్ లొ మసాలా మరిగి, రాయాల్సినవి, జాతికి కావాల్సినవి రాయడం మానేసింది. ఇంకోటి, మంచిని చదివి దానిని వంటబట్టించుకోవల్సిన జనానికీ మసాలాలు అలవాటు చేసింది.

మంచిని చెప్పాల్సినవాళ్ళు, మంచిని రక్షించాల్సినవాళ్ళు, మంచిని పెంచాల్సిన వాళ్ళు – పెన్నూ, గన్నూ, మెన్నూ – ఎవరూ కవి వాక్యాన్ని నిలబెట్టరా?

{నిన్నటి న్యూస్, కలకత్తాలో కొందరు దరిద్రులు ఓ డెబ్భై రెండేళ్ళ వృద్ధురాలిపై ప్రతాపం చూపించారు. ఈ ఆర్టికల్ మీకు నచ్చితే, మానవత్వం మర్చిపోయిన ఆ రాక్షసులు-సారీ రాక్షసులకి మానవత్వం ఎందుకుంటుంది? – ఆ filthy beasts త్వరలో పెన్ & గన్ చేపట్టిన అసలైన మెన్ చేతుల్లో నశించాలని కోరుకోండి.ఇక్కడ చెప్పిన డెబ్భైరెండేళ్ళ నన్ పై జరిగిన దారుణం రాజకీయ రంగు వేసుకుంటోంది, మరో పక్క పేపర్లలో అత్యాచారాల న్యూస్ సీరియల్ లా ప్రతిరోజూ వస్తూనే ఉంది. ప్చ్!}

_/\_Hi! Than-Q 4 UR patience 🙂 UR  feedback helps me write better _/\_

ప్చ్! ప్చ్! ప్చ్! – ఒకటోసారి ;-)


>ఎక్కడో వేరే దేశంలో కుక్కపిల్ల పుట్టినా మనకి వార్తే. ఎక్కడో మునిసిపల్ కమిషనర్ పోయినా పెద్ద వార్తే?
>ప్రతీరోజూ ఎక్కడో ఒక చోట దేశనేతలు పోతూనేఉంటారు వాళ్ళందరికీ అసెంబ్లీ నివాళులివ్వడం భజన కాదా?
>పెద్ద లీడర్లకి నివాళి ఇవ్వచ్చు కానీ స్వర్గస్తులైన సినీప్రముఖులకీ ప్రభుత్వం నివాళి ఇవ్వాలి.
>ఇంకా నయం నివాళితో సరిపెట్టారు, సింగపూర్ వెళ్తాం అన్లేదు (P.N. పీ.ఎమ్, సీ.ఎమ్ ఇద్దరూ వెళ్తున్నారు)
ఇవి ఏపీ శాసనసభ సింగపూర్ మొదటి ప్రధాని లీ కువాన్ యూ నివాళులిచ్చిన సందర్భంగా ఓ తెలుగు వెబ్-జైన్ విమర్శ రాస్తే , దానిపై కొందరు పాఠకుల కామెంట్సు. వీటిలో పాఠకుల విజ్ఞత , విజ్ఞానం చూసి నవ్వాలా ఏడవాలాని తీవ్రంగా అలోచించి ఎటూ తేల్చుకోలేక చివరికీ టపా రాస్తున్నా.

విమర్శలు, వ్యాఖ్యానాలూ తప్పుకాదు కానీ బోడి గుండుకీ మోకాలికి ముడి పెట్టడం – అదీ గాంభీర్యత చూపాల్సిన విషయాల్లో – అసహ్యంగా ఉంది.
వెబ్-జైన్స్, సినిమాలూ, సెన్సేషన్ల మీద బతికేసేవి – ఇలాంటివాటిల్లో జర్నలిస్టిక్ స్టాండర్డ్స్ కోసం చూడ్డం, అవి ఫోర్త్ ఎస్టేట్ బాధ్యతలు నెత్తికెత్తు కుంటా యనుకోవడం బుద్ధి తక్కువే. But, కీర్తిశేషులైన వ్యక్తులని తక్కువ చేసి మాట్లాడ్డం అవసరమా ? వీళ్ళ కంప్లెయింట్ ఏంటంటే ఏపీ లో ఇప్పుడు పాలనంతా సింగపూర్ స్ఫూర్తితోనే నడుస్తోందిట, అందువల్ల ఏపీ ప్రభుత్వం ఓవరాక్షన్ చేస్తోందిట. అక్కడితో ఆపితే ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని వదిలేయచ్చు. ఆగలేదు. మనకి సంబంధం లేని వ్యక్తికి, భారత్ తో పరిచయంలేని వ్యక్తికి అంత ఎత్తున నివాళి ఘటించాలా అని ప్రశ్నించారు. ఈ పార్ట్ అత్యనవసరం. ఎందుకంటే లీ కువాన్ యూ అనే పర్సనాలిటీ ఇండియాలో ఉన్న ప్రతీ రాజకీయ పార్టీకి ఒకళ్ళు ఉండాల్సినంత పవర్ ఫుల్ పర్సనాలిటీ. గాసిప్స్ తో బతికే వెబ్-జైన్స్ కి అందనంత స్థాయి ఉన్న పర్సనాలిటీ. చిత్తశుద్ధి ఉన్న ప్రతీ మంత్రి, లేజిస్లేటరు, నాయకుడూ తప్పనిసరిగా స్టడీ చెయ్యాల్సిన ‘లీ’డర్. ‘లీ’డర్ ఎందుకంటే అనవసర రాజకీయాలు చేసేవాళ్ళకి, ఎఫిషియెన్సీ, డిసిప్లిన్ లేనివాళ్ళకి లీ అంటే డర్, హడల్!

>అవినీతి, రాజకీయ మాల్ ప్రాక్టీస్ లపై నోరెత్తడానికి భయపడే నిజాయితీపరులు
>ప్రజలతో టచ్ గానీ, సమస్యల పై ప్రత్యక్ష అవగాహనగానీ లేని లీడర్లు
>సినీగ్లామర్ వాడుకుని వోట్లు సంపాయించుకోవాలనుకునే పార్టీలు
>మతాలూ, దేవుళ్ళు, ప్రాంతీయత, భాష లాంటి సెన్సిటివ్ ఇష్యూలని కెలికి వోట్ బాంకుల్ని తయారుచేసుకునే ప్రజాప్రతినిధులు
ఈ టైప్స్ కన్నా కనీసం లక్ష రెట్లు గొప్ప పర్సనాలిటీ మిస్టర్ లీ. నాయకుడికి మంచితనంతోపాటు, అన్ని విషయాలపై అవగాహన, ఆచరణలో పెట్టగల సమర్ధత, తన పార్టీపై తిరుగులేని పట్టు ఎలా వస్తుందో ఆచరణలో చూపించిన యూనివర్సిటీ మిస్టర్ లీ.

మలయాకి 1965లో స్వతంత్రం వచ్చే సమయానికి ఆ దేశంలో అంతర్భాగంగా ఉన్న సింగపూర్ ని రాజకీయ కారణాలతో బయటికి వెళ్ళగొట్టినప్పుడు లీ కాక ఇంకే నాయకుడైనా ఆయన స్థానంలో ఉండివుంటే సింగపూర్ పరిస్థితి ఎలావుండేదో ఊహించడం కష్టం. ఏ విధమైన సహజవనరులు లేని, ప్రజల్లో చదువున్న వాళ్ళు ఎక్కువగా లేని(1965లో) అతి చిన్నదేశం, దేశంగా తన అస్తిత్వాన్ని యాభై ఏళ్ళపాటు నిలుపుకుందంటే లీ తీసుకున్న నిర్ణయాలు, అమలుచేసిన విధానం మూలకారణాలు.
నెహ్రూ అభిమానిగా ఆయన పాలిసీలని ఆదర్శం చేసుకుని తన దేశాన్ని మల్చుకుందామనుకున్నా త్వరలో ఆ అభిప్రాయం మార్చుకుని సోషలిస్టు విధానాలు లాంగ్ టర్మ్ లో పనికిరావని గ్రహించి దేశాన్ని తిరుగులేని అభివృద్ధి మార్గంలో నడిపిన దూరదృష్టి, అనుభవం, pragmatism (వ్యవహారజ్ఞానం) ప్రతీ లీడరుకీ ఉండవు.
తను ప్రధాని అయిన కొత్తలో బెంగుళూరుచూసి తన దేశాన్ని అలా గార్డెన్ సిటీగా తయారుచెయ్యాలనుకున్న ఆయన సంకల్పం ఇప్పుడు సింగపూర్ కి ప్రపంచమంతటా అభిమానుల్ని సంపాదించి పెట్టింది. ఇప్పటి బెంగుళూరు సంగతేమిటి? నాయకులకి టేస్టు, విజన్, డిటర్మినేషన్ లేకనే కదా అలా వుంది?

కొన్ని మంచిపనులు ప్రజలకి మొదట అంతగా రుచించకపోయినా వీలయినంత ఎక్కువగా వివిధ ఫోరాల్లో చర్చించి , చర్చించి అమలుచేసి మంచే జరిగిందని ఫలితాల ద్వారా ప్రజల్ని కన్విన్స్ చెయ్యగల ముక్కుసూటితనం, ఆత్మవిశ్వాసం ఆయన సొంతం.

పీ.ఎమ్, సీ.ఎమ్ ఇద్దరూ సింగపూర్ వెళ్తున్నారు. ఇద్దరికీ, ముఖ్యంగా ఏపీకి లీ కువాన్ యూ విధానాల అవసరం ఇప్పుడెంతో ఉంది. సింగపూర్ యాభై ఏళ్ళపాటు సహజవనరులు లేకుండా ఎలా ప్రపంచంలోనే అతి ఎక్కువ తలసరి జాతీయ ఆదాయం ఉన్న దేశంగా ఉందంటే ఇండియాకి సంబంధించి సింగపూర్ ప్రాధాన్యత ఎంతో ఉంది.
“Singapore is Asia’s future. It represents a level of excellence that even huge countries like India and China envy. And that is largely because of Lee who transformed what a British politician called a ‘pestilential and immoral cesspool’ into a glittering global city with the world’s highest per capita income as well as the highest percentage of home ownership,” అని రెడిఫ్ లో సునందా కే. దత్తా రే అన్నారు. (http://www.rediff.com/news/special/its-ok-lah-lee-kuan-yew-sleeping-now/20150325.htm)

దీన్నిబట్టీ సీ.ఎమ్, పి.ఎమ్ లు సింగపూర్ మోడల్ కి, దాన్ని తీర్చిదిద్దిన ఆర్కిటెక్టుకి ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పేమిటో ఆ వెబ్-జైన్ వాళ్ళకే తెలియాలి.

ఇవన్నీ తెలియకుండా (తెలిసినా తమకిష్టంలేనివాళ్ళని తిట్టడానికి తెలీనట్టుండి) ఆయన్నో అల్లాటప్పా మనిషిలా మర్యాదలేకుండా ఇంకెవరిపైనో చేసే విమర్శ లోకి తీసుకురావడం అవసరమా? భావ్యమా?
Please note, మంచి సాంప్రదాయమా అనట్లేదు ఎందుకంటే జర్నలిజంలో మంచి సాప్రదాయాలుంటాయని జనమూ, జర్నలిస్టులూ మర్చిపోయే ప్రాసెస్ వేగంగా జరిగిపోతోంది. మీడియా కమర్షియల్ అయిపోయి జర్నలిజం స్టాండర్డ్స్ అడుగంటుతున్నాయి.

మరి జనం సంగతీ? వాళ్లకి ఈ స్టాండర్డ్స్ ఏమిటో ఎందుకో తెలీని పరిస్థితి. ఐడియాలజీ తో పనిలేని కమర్షియల్ రాజకీయాలు + గాసిప్స్+సినిమా క్రేజ్ + కన్జ్యూమరిస్ట్ లైఫ్ స్టైల్ – ఇవి వాళ్ళ దృక్పధాన్ని డామినేట్ చేస్తుంటే విలువల అవసరం ఎలా తెలుస్తుంది? ప్చ్!

******