హెల్త్ బుక్ ప్రింటింగ్ మిస్టేక్ = కళ్ళకింద కారీ బాగ్స్; మరి మంత్రాలబుక్కులో అచ్చు తప్పులు=? ఈ మధ్య టీవీల్లో మంత్రోపదేశాలు, యంత్రతంత్రాల మీద పుస్తకాలు ఎక్కువైపోయాయి. దేవుణ్ణి ప్రత్యక్షం చేస్తామనే స్వామీజీల కెరీర్లు కూడా బాగా నడుస్తున్నాయి. ఓకే, కూటి విద్యలు కూటి కొరకే అని తెలుసుకదా! కూటి కొరకే అన్నది కోటి కొరకే అని అర్ధం చేసుకుని పాపం టీవీగురువులు, యంత్రతంత్ర గ్రంధాల రచయితలూ, దొంగస్వాములు వాళ్ళ శక్తి కొద్దీ సమాజానికి “సేవ” చేస్తున్నారు.Continue reading “హెల్త్ బుక్ ప్రింటింగ్ మిస్టేక్ = కళ్ళకింద కారీ బాగ్స్; మరి మంత్రాలబుక్కులో అచ్చు తప్పులు=?”
Tag Archives: -ఇల్లిల్లు తిరిగే తుమ్మెదా! ఒళ్ళు జాగరత!!
సముద్రవసనే దేవీ! _/\_ నీరుకంటే బీరు తేలిగ్గా … :-( ప్చ్!ప్చ్!ప్చ్!
ఇంట్లో అమ్మ నెలకి సరిపడా (అనుకుని) జంతికలు, మిక్స్చరూ వగైరాలు తయారు చేసి డబ్బాల్లో పోసిపెడితే మనం రెండుమూడువారాల్లో లాగించెయ్యడం మామూలే. రెండు వారాల్లో ఖాళీ డబ్బాలు చూసుకుని నిన్నకాక మొన్న చేసినవి, అప్పుడే ఖాళీ చేసేసారర్రా!?! అంటూ పాపం అమ్మలు ఆశ్చర్యం, ప్రేమతో కొద్దిపాటి అసహనం కలిపి నిట్టూర్చడమూ మామూలే. (ఇది తెలుగువాళ్ళకి, భారద్దేశానికే కాదు అన్ని దేశాలకీ మామూలేననుకుంటా. ప్రింగిల్స్ పొటాటో చిప్స్ వాడి అడ్వర్టైజింగ్ స్లోగన్, “Once you pop, you can’t stop”Continue reading “సముద్రవసనే దేవీ! _/\_ నీరుకంటే బీరు తేలిగ్గా … 😦 ప్చ్!ప్చ్!ప్చ్!”
డౌట్లడిగే చికెన్ – మాట్లాడే మటన్ (1)
ఈ టపాకి టైటిల్ అలా పెట్టిన కారణం పోస్టు చివర్లో వుంది. పోస్ట్ మొత్తం చూడకుండా అది చదివేస్తే ఈ టపాకి హీరోలైన కోడి మేక బాధ పడతాయి. వాటి మనోభావాలు కూడా కాస్త అర్ధం చేసుకోవాలిగా మరి! సింగపూర్ చిన్నదేశం, సహజ వనరులు ఏవీ లేని దేశం కదా. ఎటు చూసినా బిల్డింగ్సే. చెట్లూ చేమలూ కనిపించినా అవన్నీ పార్కులూ, గార్డెన్లూ లేదా లాండ్ స్కేపింగ్ లో భాగంగా వుండేవే తప్ప సహజంగా, అడవి మాదిరిగాContinue reading “డౌట్లడిగే చికెన్ – మాట్లాడే మటన్ (1)”
సితార సినిమాలో, భానుప్రియలా అస్తమించే సూర్యుడివైపు వెళ్తూ…
మన అన్-సంగ్ హీరో సుగుణాన్ని మొట్టమొదట గ్రహించిన భారతీయుడు త్రేతాయుగపు రాముడు. తనని అరణ్యవాసం మాన్పడానికి వచ్చిన భరతుడితో రాజు ప్రజలతో ఎలా వ్యవహరించాలో చెబుతూ – ” రాజు ప్రజలనుంచి పన్నులు వసూలు చేయడం తేనెటీగ పువ్వు నుంచి మకరందాన్ని తీసుకున్నంత సున్నితంగా వుండాల,”ని అంటాడు. ఇప్పుడేమో దేశాలని మార్కెట్స్ గా, మనిషిని మార్కెట్ ఫాక్టర్ గా (పౌల్ట్రీ ఫాం, అందులో కోళ్ళు) మార్చి డబ్బు దండుకోడానికి తప్ప ఎందుకూ పనికిరాకుండా చేస్తున్నారు. (ఎవరు? మనమే)Continue reading “సితార సినిమాలో, భానుప్రియలా అస్తమించే సూర్యుడివైపు వెళ్తూ…”