నో.వా.చే.రా – “ఒరేయ్!బాలుడా! జాగ్రత్తరోయ్..” (002)


బోరు బావి సంఘటనలు మనలో ఉన్న ఎపతీని ప్రతిబింబించే ఒక ఉదాహరణ మాత్రమే. ఎన్నెన్ని దుర్ఘటనలు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయో, బయటపడనివి ఎన్ని జరుగుతున్నాయో ఊహించుకుంటే …. OMG !!

బాలుడేనా? బాలిక ఎంత క్షోభ పడుతోందీ దేశంలో?

ఎవరో వస్తారని ఏదో చేస్తారని … ఎదురుచూస్తూ మోసపోవడం, అదే, మన్ని మనం మోసం చేసుకోవడం మనకి అలవాటైపోయింది. మన సంస్కృతి, మన ఫిలాసఫీలని మించినవి లేవు, అందులో నిస్సందేహంగా సందేహంలేదు. ఐతే వాటిని నిత్యజీవితానికి, సామాజిక జీవితానికి అన్వయించుకోవడంలో మనం వెనకబడి ఉన్నాం. ఇందులో కూడా సందేహం లేదు అనుకుంటున్నా.
మనలో అందరికీ వ్యక్తిగతంగా అత్యున్నత ఆదర్శాలు, ఆశయాలు, వాటిని సాధించుకునే ఉత్తమ మార్గాలు, విలువలు అన్నీ ఉన్నాయి. అవి ఎంత స్ట్రాంగ్ గా, ఎంత డీప్ గా  ఉన్నాయనేది తెలిపేది ఇలాంటి సంఘటనల్లో మనం ఎలా రియాక్ట్ అవుతున్నామో అది.

ఒక్క బోర్ వెల్ దుర్ఘటనలో భౌతికంగా, మానసికంగా లేక రెండు విధాలా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళ లిస్టు రాస్తే –

1.బోర్ వేయించే వ్యక్తీ
2.వేసే కాంట్రాక్టర్
3.అనుమతులిచ్చే ప్రభుత్వ శాఖలు, అధికారులు
4.మధ్యవర్తులు (వీళ్ళు  ప్రజా ప్రతినిధులు కావచ్చు, లోకల్ గా పెద్ద తలకాయలు కావచ్చు)
5.బాధిత కుటుంబం
6.మీడియా
7.సివిల్ డిఫెన్స్ / ఫైర్ డిపార్ట్-మెంట్
8.పాఠకులు/ప్రేక్షకులు  in other words సమాజం

వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరికీ కూడా విడివిడిగా చూస్తే, స్థాయిలో ఎక్కువ తక్కువలున్నా, విలువల మీద గౌరవం ఉంటుంది. ఏదో మంచి సాధించాలనే ఉంటుంది. చాలా మంది వారి కుటుంబం స్థాయిలోనో, వారి వర్గ స్థాయిలోనో ఎంతో కొంత మంచి సాధించి కూడా ఉంటారు. ఐతే అందులో మళ్ళీ చాలామంది పొరపాటునో గ్రహపాటునో జరిగిన దుర్ఘటనకి బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తే దాన్ని ధైర్యంగా, నిజాయితీగా ఎదుర్కోరు. కేసు మరీ జటిలం కాకుండా, శిక్షలు పడకుండా చూసుకోవడమే ప్రధానం అవుతుంది. విలువలన్నీ వెనక్కిపోతాయి. అడ్డదార్లు వెతుకుతారు. నా ఉద్దేశం చాలామటుకు బాధ్యులు బాధ పడతారు. చిన్న పిల్లల ప్రాణాలు పోవడం ఎవరికి సమ్మతంగా ఉంటుంది? అందరూ సినిమా విలన్స్ అంత క్రూరంగా ఉంటారా? కానీ బాధ్యత నెత్తిమీద వేసుకోరు. అప్పుడే ముందు పోస్ట్ లో రాసుకున్నసమీకరణం తన పని తాను చేసుకుపోతుంది. ఎలా పని చేస్తుందో వివరణ అవసరమా? వ్యక్తిగత విలువలు, సామాజిక విలువలు, సామాజిక బాధ్యతలు అన్నిటికీ ఎవరికి వారు – బుద్ధిపూర్వకంగా కొందరు, నిస్పృహతో కొందరు, నిర్లిప్తతతో కొందరు – తాజ్ మహళ్ళు కట్టేస్తారు/స్తాం.

ఇక్కడో రెండు ప్రశ్నలు –
వ్యక్తిగత విలువలు అందరిలో సమానంగా ఉన్నప్పుడు అవి సామాజిక విలువలు అవ్వవా?
మెజారిటీ ప్రజలు విలువలకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అవి సామాజిక బాధ్యతగా మారడానికి అడ్డం ఏముంటుంది?
ఈ రెండూ జరగట్లేదు కనకే అన్ని విధాల దుర్ఘటనలు, దుష్కృత్యాలు, సాంఘిక దురాచారాలు ఎక్కువైపోతున్నాయి. అని నా అభిప్రాయం.
సామాజిక బాధ్యతల విషయంలో ప్రజలు రాజీ పడరని తెలిస్తే ఏ ప్రభుత్వమూ, నాయకుడూ, మీడియా or బిజినెస్ మాన్ వాటితో రిస్క్ తీసుకోరు. చచ్చినట్టు ప్రజలకి ఏది ఇష్టమో అదే చెయ్యడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రజాభిప్రాయం నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా, అసందింగ్ధంగా పై వర్గాలకి చేరట్లేదు. ప్రజాస్వామ్యం అంటే యధా రాజా తధా ప్రజా కి రివర్స్, యధా ప్రజా తధా రాజా. ప్రభుత్వానికీ, లేజిస్లేటర్లకీ వారి బాసులుగా మనమా మెసేజ్ పంపుతున్నామా?ఖచ్చితంగా లేదు. ఎందుకు లేదు అంటే తట్టిన జవాబే ఈ ఈక్వేషన్ –
ప్రభుత్వ నిర్వ్యాపరత్వం (బాధితుల అవసరాలు, బలహీనతలు+సామాజిక నిర్లిప్తత+ సామాజిక ఆత్మ వంచన+ కులమతవర్గ విబేధాలు)
Government’s inaction (One or all of victims’ ignorance, desperation & covetousness + social apathy + social hypocrisy + various types of social stratification) x Criminal’s Optimism

ఈక్వేషన్ లో కుడి పక్క ఉన్న ఫాక్టర్స్ లో ఒకటి లేక కొన్ని లేక అన్నీ అవాంఛనీయ సామాజిక పరిణామాలకి – బోర్ వెల్ ఘటనలు, వివిధ రకాల అత్యాచారాలు, దుర్ఘటనలు – కారణాలు అవుతున్నాయి. ఈ ఫాక్టర్స్ లో ప్రతీ ఒకటి 0 అయితే గవర్నమెంట్ ఇనాక్షన్ కి చోటుండదు. ఎన్ని ప్రయాసలు పడైనా ప్రభుత్వం ఆ సమస్యని పరిష్కరించాల్సిన స్థితి, at least theoretically, వస్తుంది. ప్రస్తుతం గవర్నమెంట్ ఇనాక్షన్ 100 అనుకుంటే ఒకొక్క ఫాక్టర్ విలువ తగ్గిన కొద్దీ ఇనాక్షన్ అనులోమానుపాతం(direct proportion) లో తగ్గుతుంది. ప్రతీ ఒకటి సున్నా అవడం అత్యాశే, సున్నా చేయడానికి ప్రయత్నించడం దురాశ కాదు. నేరస్తుడు ఎంతటి ఆశావాది ఐనా – ఎన్ని పైరవీలు, లంచాలు, బెదిరింపులు పని చేసినా –  పై ఫాక్టర్స్ తగ్గిన కొద్దీ దాని ప్రభావం తగ్గక తప్పదు.  ఐతే అవి తగ్గడానికి వీల్లేని విధంగా ప్రస్తుత సమాజం ముక్కలైపోయింది. రాజకీయాలు, వోట్ బాంకులు, కుల మత తత్వాలు, క్లాస్ డిఫరెన్సులు వర్గవిబేధాల్ని కొనసాగిస్తున్నాయి.

పై ఫాక్టర్స్ అన్నిటినీ విడివిడిగా పూర్తిగా అర్ధం చేసుకున్న స్కాలర్స్, సంస్కర్తలు, సంఘసేవకులు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరి కృషిని సమన్వయం చేసి ఫలితాలు సాధించగల ప్రజాసంస్థలు ఉన్నాయి. వ్యక్తులు, వివిధ ప్రజా సంస్థలు ఒకటయి పనిచెయ్యాలి. ప్రజాప్రతినిదుల్ని పార్టీలకతీతంగా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి చర్చించాలి. జనం ఆత్మవంచన చేసుకోకుండా ఈ కార్యక్రమాలకి అటెండ్ అవ్వాలి. నేతలకి, బాబూడమ్ కి ప్రజాభిప్రాయం ఏమిటో ఐడియా ఇవ్వాలి. ఒక్క బోర్ వెల్ దుర్ఘటనల్ని పూర్తిగా ఆపగలిగితే చాలు. మిగిలినవి సాధించటానికి అందరికీ స్ఫూర్తి కలుగుతుంది. అనవసరంగా పోగొట్టుకున్న పసిప్రాణాలకి ………

ఇదంతా థియరీ, విష్ ఫుల్ థింకింగ్, డే డ్రీమింగ్, ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ –

“ఒరేయ్!బాలుడా! జాగ్రత్తరోయ్..” పై ఎంకరేజింగ్ గా వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడే చూసి ఇంకా వ్రాస్తున్నా –

దేశంలో జరిగే అన్ని అవాంఛనీయ సంఘటనల్లోకీ అత్యంత సీదాసాదా మూల కారణాలున్న సమస్య ఇది. రోడ్ల మీద కవర్స్ లేకుండా వదిలేసిన మాన్-హోల్స్ లొ పడి, పోయిన సంఘటనలకీ బోర్ వెల్ మృతులకీ పెద్ద తేడాలేదు. కొద్దిపాటి ముందు జాగ్రత్త చర్యలతో నివారించగల ఈ సమస్యలకి కేవలం పని చేస్తున్న వాళ్ళ అజాగ్రత్తే ముఖ్య కారణం. ఆపైన పని చేయిస్తున్న బోర్ యజమానికి ఏ బాధ్యతా లేకపోవడం రెండో కారణం. విషయం కోర్టు వరకూ వెళ్లకుండా సెటిల్మెంట్ జరిగిపోవడం మూడోది. ప్రభుత్వం, మీడియా, సమాజం పసివాడు పడిన చిత్రహింసని తేలిగ్గా మర్చిపోవడం నాలుగోది. టూ మచ్ కదా?

పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే –
ప్రభుత్వ నిర్వ్యాపరత్వం ∝ (బాధితుల అవసరాలు, బలహీనతలు+సామాజిక నిర్లిప్తత+ సామాజిక ఆత్మ వంచన+ కులమతవర్గ విబేధాలు) x నిందితుడి ఆశావాదం
Government’s inaction ∝ (One or all of victims’ ignorance, desperation & covetousness + social apathy + social hypocrisy + various types of social stratification) x Criminal’s Optimism

ఈక్వేషన్ లో అన్ని ఫాక్టర్స్ లో మార్పు రావాలి. అతిముఖ్యంగా బ్రాకెట్లో ఉన్నవి తగ్గాలి. అదో కల అంతే. నిజమైతే బావుంటుంది.

ప్రాక్టికల్ సొల్యూషన్ చాలనుకుంటే –

పని మొదలుపెట్టే ముందు పరిసరాల, వర్కర్ల భద్రతకి సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు తీసుకుంటారో తెలియదు కానీ గట్టిగా పరిశీలిస్తే వాటిల్లో లొసుగులు బయటపడచ్చు. పడతాయి.
బోర్ వెల్ కంపెనీకి భద్రతాదికారి ఉన్నాడా? అవసరమైన స్థాయిలో భద్రతా నియమావళి ఉందా, లేదా?
నియామావళి ఆధారంగా కంపెనీ భద్రతా నిర్వహణ పద్ధతులు తయారుచేసిందా, లేదా?
పనికి ముందు అనుమతి పత్రాల్ని జారీ చేసే ప్రభుత్వాధికారి ఎవరు? పనికి ముందు, తర్వాత వాళ్ళు చేసే తనిఖీలేమిటి?
పని ఏర్పాట్లు జరిగిన తర్వాత అన్నీ సరిగ్గా ఉన్నట్టు ఎవరు ద్రువీకరిస్తారు?
పని జరిగే సమయంలో దానితో సంబంధం లేనివాళ్ళు అక్కడ లేకుండా చూసే బాధ్యత ఎవరిది?

ఈ ప్రశ్నలన్నిటికీ కరెక్టు జవాబులు రావాలంటే కంపెనీ నిర్వహణ ఖర్చు పెరగడం ఖాయం. నిజానికి పెద్ద పరిశ్రమల్లో పాటించే భద్రతా నియామాలు, భద్రతా ప్రమాణాలు; అందుకు వాటికుండే వనరులు, సౌకర్యాలు చిన్నవాటికీ ఉండాలంటే అది ఆ కంపెనీలకి కష్టమౌతుంది. అందుచేత ఇవన్నీ తప్పనిసరి అంశాలు చెయ్యడంలో ఆలస్యం జరుగుతుంది. బోర్ వెల్ కంపెనీలని దుర్ఘటనల విషయంలో గట్టిగా నిలదియ్యడంలో ఇదో అడ్డంకి. అధికారిక తనిఖీల ద్వారా వీటిని కంట్రోల్ చెయ్యడం కూడా కష్ట సాధ్యం, అందుకు అవసరమయ్యే ప్రభుత్వ వనరుల దృష్ట్యా.

ఒకవేళ బోర్ వెల్ కంపెనీకి భద్రతా నియమావళి, వగైరాలు ఉన్నా సైటులో పని జరిపించే  స్టాఫ్ నిర్లక్ష్యం, అజ్ఞ్జానాల పాత్ర చాలా ఉంటుంది. నిజానికి మూడొంతుల కేసుల్లో ఇదే అసలు సమస్య అయిఉండవచ్చు. పెద్ద పెద్ద ఇండస్ట్రీల్లో, మంచి భద్రతా నిర్వహణ ఉన్న సంస్థల్లో కూడా 90% ప్రమాదాలు వ్యక్తుల నిర్లక్ష్యం, అజ్ఞ్జానాల వల్లే జరుగుతాయనేది నిజం. Accidents do not happen, they are caused అనేది భద్రతా నిపుణులకి బాగా తెలిసిన విషయం. పెద్ద కంపెనీల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ పరిస్థితి ఉన్నప్పుడు చోటామోటా కంపెనీల గురించి చెప్పుకునేదేముంటుంది? వీటిల్లో పనిచేసే వాళ్ళ స్కిల్స్, ట్రైనింగ్ గురించి అసలు మాట్లాడే పని లేదు.

బోర్ ఏ దశలో ఉండగా ప్రమాదం జరిగిందనేది తెలిస్తే ఇంకొంత క్లారిటీ ఉంటుంది.

బోర్ పని మధ్యలో ఆపినప్పుడు జరిగిందా? బోర్ పడదని నిర్ణయించి పని ఆపేసి కంట్రాక్టర్ వెళ్ళిపోయాక జరిగిందా అనేది చూడాలి.
మొదటి దశలో జరిగితే కంట్రాక్టర్ ది ప్రధాన బాధ్యత, రెండో దశలో అయితే బోర్ యజమానిది పూర్తి బాధ్యత. రెండిట్లోనూ బోర్ యజమాని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వీళ్ళిద్దరూ కాక పసివాణ్ణి ఆ ప్రాంతంలోకి వెళ్ళనిచ్చిన తల్లితండ్రుల సంగతేమిటి? బోర్ తియ్యడానికి అనుమతి ఇచ్చి దానివల్ల జరగగల ప్రమాదాల విషయం పట్టించుకోని ప్రభుత్వం, ఈ విషయాలపై పోరాడని మీడియా, సమాజం… అందరూ ప్రమాదానికి కారకులే. ప్రమాదం జరిగాక ఎవరికి చేతైన విధంగా వాళ్ళు తప్పించుకుంటారు.

అందరూ బాధ్యత ఫీల్ అయ్యేవాళ్ళయితే –

1. బాలుడు ఆ దరిదాపుల్లో ఉండేవాడు కాదు.
2. బోర్ యజమాని పని జరుగుతుంటే ఇతరులు అక్కడికి రాకుండా బారికేడ్ వేస్తాడు. బోర్ పడక పని ఆగిపోతే, గోతిని పూడ్చడమో,  కవర్ వెయ్యడమో చేస్తాడు.
3. కంట్రాక్టర్ ఓ భద్రతా నియమావళి పెట్టుకుని అది అమలయ్యేలా చూస్తాడు. తన సిబ్బందికి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇస్తాడు. పని జరిగేటప్పుడు సేఫ్టీకి అవసరమైన పరికరాలు, వస్తువులు ఏర్పాటు చేస్తాడు. సిబ్బందిలో ఒకణ్ణి సేఫ్టీ వాచ్-మన్ గా పెడతాడు.
4.అనుమతి ఇచ్చిన అధికారి పనికి ముందూ, తర్వాత తనిఖీ చేస్తాడు.
5.మధ్యవర్తులు ఉండరు. ప్రజాప్రతినిధులు పై నాలుగు పాయింట్లూ అమలయ్యేలా తమ అధికారాల్ని, ప్రజా సంబంధాల్నీ ఉపయోగిస్తారు.
6. మీడియా – సమస్యని ప్రజల దృష్టి పధంలోంచి జారిపోకుండా ఈ పనుల తీరుతెన్నులు హైలైట్ చేస్తుంది.
7.పాఠకులు/ప్రేక్షకులు  in other words సమాజం -NGOలు, ప్రజా సంఘాల రూపంలో, సంతకాల ఉద్యమాల్లాంటి కార్యక్రమాలతో, డిమాన్స్ట్రేషన్లతొ సమస్య పరిష్కారం అయ్యేవరకూ కృషి చేస్తారు.

న్యాయమో కాదోగానీ, పై వాటిలో దేనివల్ల ప్రమాదం జరిగిందనేది వదిలిపెట్టి కాంట్రాక్టర్ కి, బోర్ యజమానికి కఠిన శిక్షలు, జరిమానాలు అమలు చేస్తే పరిస్థితి బాగు పడవచ్చు. కానీ వాటి బదులుగా కేసు లేకుండా చూసుకుంటే? ఏ గొడవా ఉండదు. ఎవరూ పన్చేయ్యక్కర్లేదు. ప్రజలు రాజీపడరని తెలిస్తే ఏ నాయకుడూ, అధికారీ, మీడియా or బిజినెస్ మాన్ సామాజిక బాధ్యత విషయంలో రిస్క్ తీసుకోరు. చచ్చినట్టు అవసరమైనవన్నీ చేసితీరుతారు. మనమే వాళ్ళకి ఇవ్వాల్సిన మెసేజ్ ఇవ్వట్లేదు. ఆ మెసేజ్ –

యధా ప్రజా తధా రాజ.

ప్రజలుగా మనం వాళ్లకి బాసులం. వాళ్ళని సీరియస్ గా గమనిస్తున్నాం. పని చేసినవాడే మళ్ళీ అధికారంలోకి వస్తాడు అని వాళ్లకి తెలిసేలా బిహేవ్ చేస్తాం.  అంతకంటే ముందు మన్ని మనం మార్చుకుంటాం.
సామాజిక నిర్లిప్తత, సామాజిక ఆత్మ వంచన, కులమతవర్గ విబేధాలు – వీటిలో ఎవరి వంతు వాళ్ళు మైనస్ చేసేస్తాం.

బోరు బావి బాలల అమాయక త్యాగాలకి కృతజ్ఞ్జతగా

********************************************************************

Part 1

మొన్న ‘బోరు బావిలో పడిన బాలుడు’ వార్త మళ్ళీ వచ్చింది. ఎన్ని మళ్ళీలయ్యాయో ఇలాంటి మొదటి సంఘటన వార్తల్లో వచ్చినప్పట్నుంచీ, 2005 అని గుర్తు. ఈ సారి అదృష్టంకొద్దీ పిల్లాడిని ప్రాణాలతో బయటికిలాగారు. ఎవరు? అధికారులు. ఎవరో వేసుకుంటున్న బోర్ వెల్, దానికి ఎవరో కంట్రాక్టర్, సంబంధంలేని పిల్లలు అక్కడికి రావడం, ఆ బోర్ లో పడడం, అక్కణ్ణుంచీ మీడియా హడావిడి, అధికార్లు బాలుణ్ణి బయటికి తీసే ప్రయత్నం చెయ్యడం, ఎక్కువసార్లు విఫలమవ్వడం…

ఏం జరుగుతోందిక్కడ?

ఏమీ జరగట్లేదు. ఎందుకు జరుగుతుంది? ఎవరూ ఏం చేయ్యకపోతుంటే?

నీ తల్లిదండ్రులతో సహా సమాజం, ప్రమాద కారకులు, ప్రభుత్వం, మీడియా – ఎవరూ ఏమీ చెయ్యట్లేదు. అందువల్లే బోరు బావుల్లో బాలుడు మాటి మాటికీ పడుతూనే ఉన్నాడు. వాడికి బుధ్ధొచ్చి పడడం మానెయ్యలేగానీ వీళ్ళందరూ ఏం చెయ్యరు. జరిగినదాన్ని మర్చిపోవడమనే కన్వీనియెంట్ థింకింగ్ కి అలవాటు పడిపోయారు.
ఒరేయ్! బాలుడా! జాగ్రత్తరోయ్!

నువ్వు భావి భారత పౌరుడివి కావాలి, బోరు ‘బావి’ పౌరుడు కాదు.

బోర్ బావి చుట్టుపక్కలకెళ్ళే ముందు ఈ ఈక్వేషన్ గుర్తు పెట్టుకో –
(బాధితుల అవసరాలు, బలహీనతలు + సామాజిక నిర్లిప్తత + సామాజిక ఆత్మవంచన + వర్గ విబేధాలు) x నేరస్తుడి ఆశావాదం = ప్రభుత్వ నిర్వ్యాపారత్వం (inaction)

నువ్వు బోర్ వెల్ దగ్గరకెళ్ళేముందు ఈ ప్రశ్నలు వేసుకో. జవాబు క్లియర్ గా లేకపోతే ఆ చుట్టుపక్కలకెళ్ళకు. ఆ ప్రశ్నలు –
ఏమైనా రెగ్యులేషన్ ఉందా ఈ బావులు తవ్వటానికి సంబంధించి?

బావిలో పడిన పిల్లల ప్రాణాలు పోతే ఎవరిదీ బాధ్యత?

బావి చుట్టూ ఏ విధమైన బారికేడ్ లేకుండా వదిలేసే కాంట్రాక్టర్ బాధ్యత ఏమిటి?

ఆ పనితో సంబంధం లేని వాళ్ళు అక్కడకి వస్తే, ప్రమాదంలో పడితే ఆ పని చేస్తున్న, చేయించుకుంటున్న వ్యక్తులకి ఏ సంబంధం లేకపోవడం ఏమిటి? ఒకవేళ ఉండుంటే గవర్నమెంట్ వాళ్ళ మీద తీసుకుంటున్న చర్యలేమిటి?

బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడా లేదా అనేవరకూ రిపోర్ట్ చేసే మీడియా ఆ తరువాత ఏం జరిగిందో, ఏం జరగాలో చెప్పదేమిటి?

ఈ ప్రశ్నలు చాలామందికి ఉన్నా అడగరు. బాధితులు పేదవాళ్ళు కనక ఏదో ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయిందని గెస్ చేస్తారు. నిజానికి అదే అయినా ఆశ్చర్యం లేదు. అంగబలం, అర్ధబలం లేనివాళ్ళు అంతకన్నా ఏం చెయ్యగలరు? సంఘటిత వర్గం కాదు. డబ్బు వస్తుందంటే ఆశపడి జరిగిన అన్యాయాన్ని, బలైపోయిన పసిప్రాణాన్ని మరిచిపోయే ప్రయత్నం చేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ, తండ్రి మందు కొట్టి బాధని బాటిల్లో, సారీ సారా పాకెట్ లో దింపేస్తే, తల్లి స్త్రీ గా తనకి జరుగుతున్న అన్యాయాల్లో ఇదీ ఒకటనుకునో, భర్త చేతిలో దెబ్బలు తినో, రాబోయే నష్టపరిహారంతో కూతురి పెళ్లి జరుగుతుందనో … ఏదో ఒకటో లేక ఈ కారణాలన్నిటి వల్లో మళ్ళీ ఇంకోసారి తలవంచుతుంది.

అన్నిటికీ మించి సబ్-కాన్షస్ గా పనిచేసే ఫాటలిజం, predeterminism, మనలో ఎలాగూ ఉంది. అది బాధితుల మీదా, చోద్యం చూస్తున్న సమాజం మీదా సమానంగా పని చేస్తుంది. అది పనిచేయ్యలేనిది ప్రమాదకారకుల మీద మాత్రమే. ఏదో విధంగా బాధితుల్ని మేనేజ్ చేసి, జనం కళ్ళు కప్పి తప్పించుకోవచ్చనే ఆశావాదం కలవాళ్ళు వారు.

(బాధితుల అవసరాలు, బలహీనతలు + సామాజిక నిర్లిప్తత + సామాజిక ఆత్మవంచన + వర్గ విబేధాలు) x నేరస్తుడి ఆశావాదం = ప్రభుత్వ నిర్వ్యాపారత్వం (inaction)

మనలో ఉన్న ఫాటలిజం, దానివల్ల + వర్గ విబేధాల వల్ల వచ్చే నిర్లిప్తత ఉన్నా మాలో ఇవేమీ లేవని మనకి మనం చెప్పుకునే self-conceit నే సామాజిక ఆత్మవంచన అంటాం.
ప్రజాస్వామ్యం, మానవత్వం ఈ రెండూ లోతుగా వేళ్ళూనని రెండు గొప్ప వృక్షాలు మన సమాజంలో. ఆ వేళ్ళు ఇప్పటికి కొన్ని వర్గాలనే, అదీ కొన్ని పరిమితుల మేరకే చేరుకున్నాయి. అవి అందరినీ వారి వారి శక్తిసామర్ధ్యాలతో సంబంధం లేకుండా రక్షించగలిగినప్పుడే అవి మన సమాజంలో వ్యవస్థీకృతం (Institutionalized) అయ్యాయని చెప్పుకోగలం. అప్పటి వరకు ప్రజాస్వామ్యం కొన్ని పరిధుల్లో పరిమితమైపోతుంది. మానవత్వం ఒక వ్యక్తిగత విలువగానే ఉండిపోతుంది. అది సామాజిక బాధ్యతగా ఇంకా పూర్తీ రూపాంతరం చెందలేదు. ప్రజాస్వామ్యం, మానవత్వం సామాజిక విలువలు, బాధ్యతలు కాలేదని చెప్పడానికి ఆధారం పై ప్రశ్నలకి సరైన సమాధానాలు లేకపోవడమే. అవి సామాజిక విలువలు అయివుంటే ముందుగా –

(1) ప్రమాదం జరగకుండా కంట్రాక్టర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సంబంధంలేని వాళ్ళు సైటులోకి రాకుండా సైటు సొంతదారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవేమీ జరగని పరిస్థితిలో వాళ్ళు అనుభవించాల్సిన శిక్షలను న్యాయశాస్త్ర పరంగా ప్రభుత్వం నిర్ణయించేది.

(2)పని ప్రారంభించే ముందు సేఫ్టీకి సంబంధించి తీసుకున్న అన్ని జాగ్రత్తలు వివరిస్తూ కంట్రాక్టర్, బోర్ సైట్ యజమాని సంతకం చేసిన సేఫ్ వర్క్ పర్మిట్ పై ప్రభుత్వాధికారి (బోర్ లో ఎవరైనా పడినప్పుడు వాళ్ళని రక్షించే శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్?) సంతకం చేసి అనుమతి ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టేది.

(3)ఈ విషయంలో సరైన చట్టాలు తేవాలని ప్రజాసంఘాలు కానీ, వ్యక్తులు కానీ – వారి నుంచి ప్రభుత్వం పై వత్తిడి పెరిగేది, .

(4)ప్రమాదాలకి దారితీయగల అవకాశమున్న అన్ని పనులలో కాంట్రాక్టర్ల, ఆ పని చేయించుకుంటున్న సంస్థల/వ్యక్తుల బాధ్యతలేమిటనే చర్చ ప్రజలలో మొదలై ప్రజాప్రతినిదులకి ఆ వేడి అంటేది.

మొదటి రెండు పాయింట్లు నిజానికి ఉచిత సలహాలు. ఏ మట్టి బుర్రకైనా తడతాయి. చివరి రెండు మాత్రం సామాజిక స్పృహ ఉన్న సమాజాల్లోనే తలెత్తుతాయి. తోటి మనిషి తన సంతానాన్ని కేవలం కొందరి అజాగ్రత్తల కారణంగా ఎందుకు కోల్పోవాలనే సహానుభూతి బలంగా ఉన్న సమాజాల్లోనే అది జరుగుతుంది.

ఏ రాష్ట్ర శాసన సభలో కానీ, పార్లమెంట్ లో కానీ ఏ లెజిస్లేటరైనా ఈ ప్రశ్నలు లేవనెత్తారా?
NGOలేవైనా ఏ సమస్యని చర్చించాయా?
ఏ న్యాయవాదీ లేక ప్రజా హక్కుల పోరాటాలు చేసేవాళ్ళు ఇంతవరకూ P.I.L ఎందుకు వెయ్యలేదు?

Maybe I am wrong, but నా ఈ సందేహాలు నిజమేనా? లేకపొతే వీటికి సంబంధించిన న్యూస్, మీడియా కవరేజ్ కి నోచుకోవట్లేదా?

ఒరేయ్! బాలుడా! జాగ్రత్తరోయ్! బోర్ బావి చుట్టుపక్కలకెళ్ళే ముందు ……………..

****************************************************************

నో.వా.చే.రా – 002 ఒరేయ్! బాలుడా! జాగ్రత్తరోయ్! బోర్ వెల్ దగ్గరకెళ్ళేముందు ఈ ప్రశ్నలు వేసుకో..


మొన్న ‘బోరు బావిలో పడిన బాలుడు’ వార్త మళ్ళీ వచ్చింది. ఎన్ని మళ్ళీలయ్యాయో ఇలాంటి మొదటి సంఘటన వార్తల్లో వచ్చినప్పట్నుంచీ, 2005 అని గుర్తు. ఈ సారి అదృష్టంకొద్దీ పిల్లాడిని ప్రాణాలతో బయటికిలాగారు. ఎవరు? అధికారులు. ఎవరో వేసుకుంటున్న బోర్ వెల్, దానికి ఎవరో కంట్రాక్టర్, సంబంధంలేని పిల్లలు అక్కడికి రావడం, ఆ బోర్ లో పడడం, అక్కణ్ణుంచీ మీడియా హడావిడి, అధికార్లు బాలుణ్ణి బయటికి తీసే ప్రయత్నం చెయ్యడం, ఎక్కువసార్లు విఫలమవ్వడం…

ఏం జరుగుతోందిక్కడ?

ఏమీ జరగట్లేదు. ఎందుకు జరుగుతుంది? ఎవరూ ఏం చేయ్యకపోతుంటే?

నీ తల్లిదండ్రులతో సహా సమాజం, ప్రమాద కారకులు, ప్రభుత్వం, మీడియా – ఎవరూ ఏమీ చెయ్యట్లేదు. అందువల్లే బోరు బావుల్లో బాలుడు మాటి మాటికీ పడుతూనే ఉన్నాడు. వాడికి బుధ్ధొచ్చి పడడం మానెయ్యలేగానీ వీళ్ళందరూ ఏం చెయ్యరు. జరిగినదాన్ని మర్చిపోవడమనే కన్వీనియెంట్ థింకింగ్ కి  అలవాటు పడిపోయారు.
ఒరేయ్! బాలుడా! జాగ్రత్తరోయ్!

నువ్వు భావి భారత పౌరుడివి కావాలి, బోరు ‘బావి’ పౌరుడు కాదు.

బోర్ బావి చుట్టుపక్కలకెళ్ళే ముందు ఈ ఈక్వేషన్ గుర్తు పెట్టుకో –
(బాధితుల అవసరాలు, బలహీనతలు + సామాజిక నిర్లిప్తత + సామాజిక ఆత్మవంచన + వర్గ విబేధాలు) x నేరస్తుడి ఆశావాదం = ప్రభుత్వ నిర్వ్యాపారత్వం (inaction)

నువ్వు బోర్ వెల్ దగ్గరకెళ్ళేముందు ఈ ప్రశ్నలు వేసుకో. జవాబు క్లియర్ గా లేకపోతే ఆ చుట్టుపక్కలకెళ్ళకు. ఆ ప్రశ్నలు –
ఏమైనా రెగ్యులేషన్ ఉందా ఈ బావులు తవ్వటానికి సంబంధించి?

బావిలో పడిన పిల్లల ప్రాణాలు పోతే ఎవరిదీ బాధ్యత?

బావి చుట్టూ ఏ విధమైన బారికేడ్ లేకుండా వదిలేసే కాంట్రాక్టర్ బాధ్యత ఏమిటి?

ఆ పనితో సంబంధం లేని వాళ్ళు అక్కడకి వస్తే, ప్రమాదంలో పడితే ఆ పని చేస్తున్న, చేయించుకుంటున్న వ్యక్తులకి ఏ సంబంధం లేకపోవడం ఏమిటి? ఒకవేళ ఉండుంటే గవర్నమెంట్ వాళ్ళ మీద తీసుకుంటున్న చర్యలేమిటి?

బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడా లేదా అనేవరకూ రిపోర్ట్ చేసే మీడియా ఆ తరువాత ఏం జరిగిందో, ఏం జరగాలో చెప్పదేమిటి?

ఈ ప్రశ్నలు చాలామందికి ఉన్నా అడగరు. బాధితులు పేదవాళ్ళు కనక ఏదో ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయిందని గెస్ చేస్తారు. నిజానికి అదే అయినా ఆశ్చర్యం లేదు. అంగబలం, అర్ధబలం లేనివాళ్ళు అంతకన్నా ఏం చెయ్యగలరు? సంఘటిత వర్గం కాదు. డబ్బు వస్తుందంటే ఆశపడి జరిగిన అన్యాయాన్ని, బలైపోయిన పసిప్రాణాన్ని మరిచిపోయే ప్రయత్నం చేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ, తండ్రి మందు కొట్టి బాధని బాటిల్లో, సారీ సారా పాకెట్ లో దింపేస్తే, తల్లి స్త్రీ గా తనకి జరుగుతున్న అన్యాయాల్లో ఇదీ ఒకటనుకునో, భర్త చేతిలో దెబ్బలు తినో, రాబోయే నష్టపరిహారంతో కూతురి పెళ్లి జరుగుతుందనో … ఏదో ఒకటో లేక ఈ కారణాలన్నిటి వల్లో మళ్ళీ ఇంకోసారి తలవంచుతుంది.

అన్నిటికీ మించి సబ్-కాన్షస్ గా పనిచేసే ఫాటలిజం, predeterminism, మనలో ఎలాగూ ఉంది. అది బాధితుల మీదా, చోద్యం చూస్తున్న సమాజం మీదా సమానంగా పని చేస్తుంది. అది పనిచేయ్యలేనిది ప్రమాదకారకుల మీద మాత్రమే. ఏదో విధంగా బాధితుల్ని మేనేజ్ చేసి, జనం కళ్ళు కప్పి తప్పించుకోవచ్చనే ఆశావాదం కలవాళ్ళు వారు.

(బాధితుల అవసరాలు, బలహీనతలు + సామాజిక నిర్లిప్తత + సామాజిక ఆత్మవంచన + వర్గ విబేధాలు) x నేరస్తుడి ఆశావాదం = ప్రభుత్వ నిర్వ్యాపారత్వం (inaction)

మనలో ఉన్న ఫాటలిజం, దానివల్ల + వర్గ విబేధాల వల్ల వచ్చే నిర్లిప్తత ఉన్నా మాలో ఇవేమీ లేవని మనకి మనం చెప్పుకునే self-conceit నే సామాజిక ఆత్మవంచన అంటాం.
ప్రజాస్వామ్యం, మానవత్వం ఈ రెండూ లోతుగా వేళ్ళూనని రెండు గొప్ప వృక్షాలు మన సమాజంలో. ఆ వేళ్ళు ఇప్పటికి కొన్ని వర్గాలనే, అదీ కొన్ని పరిమితుల మేరకే చేరుకున్నాయి. అవి అందరినీ వారి వారి శక్తిసామర్ధ్యాలతో సంబంధం లేకుండా రక్షించగలిగినప్పుడే అవి మన సమాజంలో వ్యవస్థీకృతం (Institutionalized) అయ్యాయని చెప్పుకోగలం. అప్పటి వరకు ప్రజాస్వామ్యం కొన్ని పరిధుల్లో పరిమితమైపోతుంది. మానవత్వం ఒక వ్యక్తిగత విలువగానే ఉండిపోతుంది. అది సామాజిక బాధ్యతగా ఇంకా పూర్తీ రూపాంతరం చెందలేదు. ప్రజాస్వామ్యం, మానవత్వం సామాజిక విలువలు, బాధ్యతలు కాలేదని చెప్పడానికి ఆధారం పై ప్రశ్నలకి సరైన సమాధానాలు లేకపోవడమే. అవి సామాజిక విలువలు అయివుంటే ముందుగా –

(1) ప్రమాదం జరగకుండా కంట్రాక్టర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సంబంధంలేని వాళ్ళు సైటులోకి రాకుండా సైటు సొంతదారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవేమీ జరగని పరిస్థితిలో వాళ్ళు అనుభవించాల్సిన శిక్షలను న్యాయశాస్త్ర పరంగా ప్రభుత్వం నిర్ణయించేది.

(2)పని ప్రారంభించే ముందు సేఫ్టీకి సంబంధించి తీసుకున్న అన్ని జాగ్రత్తలు వివరిస్తూ కంట్రాక్టర్, బోర్ సైట్ యజమాని సంతకం చేసిన సేఫ్ వర్క్ పర్మిట్ పై ప్రభుత్వాధికారి (బోర్ లో ఎవరైనా పడినప్పుడు వాళ్ళని రక్షించే శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్?) సంతకం చేసి అనుమతి ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టేది.

(3)ఈ విషయంలో సరైన చట్టాలు తేవాలని ప్రజాసంఘాలు కానీ, వ్యక్తులు కానీ – వారి నుంచి ప్రభుత్వం పై వత్తిడి పెరిగేది, .

(4)ప్రమాదాలకి దారితీయగల అవకాశమున్న అన్ని పనులలో కాంట్రాక్టర్ల, ఆ పని చేయించుకుంటున్న సంస్థల/వ్యక్తుల బాధ్యతలేమిటనే చర్చ ప్రజలలో మొదలై ప్రజాప్రతినిదులకి ఆ వేడి అంటేది.

మొదటి రెండు పాయింట్లు నిజానికి ఉచిత సలహాలు. ఏ మట్టి బుర్రకైనా తడతాయి. చివరి రెండు మాత్రం సామాజిక స్పృహ ఉన్న సమాజాల్లోనే తలెత్తుతాయి. తోటి మనిషి తన సంతానాన్ని కేవలం కొందరి అజాగ్రత్తల కారణంగా ఎందుకు కోల్పోవాలనే సహానుభూతి బలంగా ఉన్న సమాజాల్లోనే అది జరుగుతుంది.

ఏ రాష్ట్ర శాసన సభలో కానీ, పార్లమెంట్ లో కానీ ఏ లెజిస్లేటరైనా ఈ ప్రశ్నలు లేవనెత్తారా?
NGOలేవైనా ఏ సమస్యని చర్చించాయా?
ఏ న్యాయవాదీ లేక ప్రజా హక్కుల పోరాటాలు చేసేవాళ్ళు ఇంతవరకూ P.I.L ఎందుకు వెయ్యలేదు?

Maybe I am wrong, but నా ఈ సందేహాలు నిజమేనా? లేకపొతే వీటికి సంబంధించిన న్యూస్, మీడియా కవరేజ్ కి నోచుకోవట్లేదా?

ఒరేయ్! బాలుడా! జాగ్రత్తరోయ్! బోర్ బావి చుట్టుపక్కలకెళ్ళే ముందు ……………..

****************************************************************

నరుడను నేను, నారాయణుడనే నేను


మానవ జాతి పరిణామక్రమం ఆధారంగా ఎగిసిన ఈ హృదయాం’తరంగా’నికి నండూరి రామమోహనరావు గారి నరావతారం, విశ్వరూపం, విశ్వ దర్శనం పుస్తకాలు పునాదులు వేస్తే  శ్రీ అరవిందుని మాటలు ఆసరా అయ్యాయి. నా జాతి ప్రస్థానం పరమాణువుకి ముందు మొదలై పరబ్రహ్మ వరకూ సాగుతుందని, అందులో నేనూ ఉన్నానని, ఎప్పటికీ ఉంటాననీ తెలిసి పొందిన అనుభూతి అది నాకు అర్ధమయ్యేలా తెలిపిన మహానుభావులందరికీ అంకితం –

PariNaamam

The Ten Avatars as a Parable of Evolution

Avatarhood would have little meaning if it were not connected with the evolution. The Hindu procession of the ten Avatars is itself, as it were, a parable of evolution. First the Fish Avatar, then the amphibious animal between land and water, then the land animal, then the Man-Lion Avatar, bridging man and animal, then man as dwarf, small and undeveloped and physical but containing in himself the godhead and taking possession of existence, then the rajasic, sattwic, nirguna Avatars, leading the human development from the vital rajasic to the sattwic mental man and again the overmental superman. Krishna, Buddha and Kalki depict the last three stages, the stages of the spiritual development—Krishna opens the possibility of Overmind, Buddha tries to shoot beyond to the supreme liberation but that liberation is still negative, not returning upon earth to complete positively the evolution; Kalki is to correct this by bringing the Kingdom of the Divine upon earth, destroying the opposing Asura forces. The progression is striking and unmistakable. As for the lives in between the Avatar lives, it must be remembered that Krishna speaks of many lives in the past, not only a few supreme ones, and secondly that while he speaks of himself as the Divine, in one passage he describes himself as a Vibhuti, వృష్ణినాం వాసుదేవః.. We may therefore fairly assume that in many lives he manifested as the Vibhuti veiling the fuller Divine Consciousness. If we admit that the object of Avatarhood is to lead the evolution, this is quite reasonable, the Divine appearing as Avatar in the great transitional stages and as Vibhutis to aid the lesser transitions.

– Sri Aurobindo

     (from Letters on Yoga)

(4ksy)

నో.వా.చే.రా – 001 (స్వచ్ఛ భారత్ / పటేల్ .vs. నెహ్రూ)


స్వచ్ఛ భారత్ స్లోగన్ తో, ఒక్కొక్కరు మరో తొమ్మిదిమందికి పిలుపునివ్వడమనే కాన్సెప్ట్ తో మోడీ సృష్టించిన క్లీన్లినెస్ ఫీవర్ ఎంతవరకూ సక్సెస్ అవుతుందనే ప్రశ్నచాలామందికి ఉంది. సెలబ్రిటీలు చీపుళ్ళు పట్టుకుని ఫొటోజెనిక్ ఊడ్పులు ఊడ్చినంత మాత్రాన శుభ్రత మన సంస్కృతిగా మారిపోతుందా అని పెదవి విరిచేవాళ్ళు, మీడియాకెక్కేవాళ్ళు బాగానే ఉన్నారు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. స్వచ్ఛ భారత్ కి ఇంతకుముందు ఏ నాయకు-డూ/రాలూ ఇవ్వని విజిబిలిటీ ఇచ్చినందుకు మోడీని  మెచ్చుకుని తీరాలి. తనని, తన పరిపాలనా దక్షతని ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలో మోడీకి తెలిసినంత ఎవరికీ తెలియదు. అందువల్ల స్వచ్ఛ భారత్ ని పుణ్యానికీ పురుషార్దానికీ కూడా ఆయన వాడుకుంటాడని అనుకోడంలో తప్పు లేదు. నిజానికి వాడుకోవాలి కూడా. ప్రజలకే లాభం. తరువాత వచ్చే లీడర్లకీ ఇలాంటి కార్యక్రమాలు ఏదో ఒకటి నెత్తికేత్తుకోవాల్సిన ట్రెండ్ ఏర్పడుతుంది. దీనివల్ల రాజకీయాల్లో క్లీన్లినెస్ సంగతెలా ఉన్నా క్లీన్లినెస్ రాజకీయాలు మొదలై, మన అదృష్టం బావుంటే విదేశాల్లో గ్రీన్ పార్టీల్లాగ మనదేశంలో శుభ్రత పార్టీలు ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఒక కండిషన్. ప్రజల్లోకి స్వచ్చ్ భారత్ ఫీవర్ వ్యాపించాలి. మా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అని ప్రజలందరూ ఫీలవ్వాలి, డిమాండ్ చెయ్యాలి. ఎవరికివాళ్ళు శుభ్రంగా ఉండి, పరిసరాల శుభ్రతకి పాటు పడాలి. అలాంటి మార్పు ప్రజల్లో చూసిన నాయకులు వాళ్ళని వోటు బాంకుగా మార్చుకోడానికి వాళ్ళే రోడ్లు, టాయిలెట్స్ క్లీన్ చెయ్యడం నుంచీ, మునిసిపాల్టీలు/కార్పోరేషన్లూ శుభ్రతపై దృష్టి పెట్టేవరకు ఎన్ని పాట్లైనా పడతారు.

జనం చూస్తున్నారు కదాని “చెత్త” సినిమాలు తీస్తున్నాం అని తెలుగు సినిమా నిర్మాతలు డైరెక్టర్లు, మాకు వేరే గత్యంతరం లేకే ఈ “చెత్త” చూస్తున్నామని జనం అనుకోబట్టే కదా సినిమాల్లో ఇంత “చెత్త” తయారయింది? అసలు చెత్త కూడా ప్రజల్లో, నాయకుల్లో, అధికారుల్లో ఇలాంటి ఉదాసీనత వల్లే గుట్టలుగా పేరుకుపోతుంది. సింగపూర్ ఎంత క్లీన్ గా ఉందో అని అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్ కూడా నోరు తెరుస్తారు. అంత క్లీన్లినెస్ సాధించడానికి అక్కడి గవర్నమెంట్ ఎంత శ్రమ పడిందో తెలిస్తే ఇంకా పెద్దగా నోరు తెరుస్తారు. సింగపూర్ మొదటి ప్రధాని, లీ కువాన్ యూ 1965 ప్రాంతాల్లో మొదటిసారి బెంగుళూర్ వెళ్ళినప్పుడు, ఆ సిటీ ఒక ఉద్యానవనంలా ఉండడం చూసి సింగపూర్ అలా వుండాలి అని సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పంలో ధృఢత్వం ఎంతుందో చెప్పాలా? స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లవుతున్నా సడలలేదు. కేవలం ప్రభుత్వం తల్చుకుని,- ఫైన్లు వేసి, క్లీన్ వర్క్ ఆర్డర్స్ ఇచ్చి, లిఫ్ట్స్ లో పబ్లిక్ ప్లేసెస్ లో కెమేరాలు పెట్టీ – రకరకాలుగా, జనం శుభ్రతకి అలవాటుపడేలా మార్చారు. నిజానికి ఒకప్పటి చైనీస్ లో శుభ్రత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాంటిది వాళ్ళూ ఇప్పుడు దానికలవాటు పడిపోయారు. ఎవరో ఫారిన్ పెద్ద మనిషి ఒకసారి అన్నాడట – వ్యక్తిగత శుభ్రతలో మీ భారతీయుల్ని మించిన వాళ్ళు లేరు, పరిసరాల అపరిశుభ్రతలో కూడా మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు – అని. ఎవరో మరో పెద్దాయన, ఇండియనే, వ్రాస్తే చదివాను. దురదృష్టం, పేర్లు గుర్తుకి రావట్లేదు. ఫారినర్ అన్నాడని మనకి కోపం రావచ్చు కానీ (ఇది రాసినందుకు నామీదా రావచ్చు) ఆ కామెంట్ కరెక్టే కదా?

కావాలంటే మహత్మా గాంధీ అనుయాయి, శ్రీ V. కళ్యాణం గారిని అడగొచ్చు. 1948 నుంచీ ఇప్పటి వరకు ఆయన తను ఉంటున్న ఇల్లుతో మొదలుపెట్టి , చుట్టుప్రక్కల ప్రాంతం అంతా, ఆ వీదితో సహా ప్రతిరోజూ శుభ్రం చేస్తారట. 93 ఏళ్ళ వయసులో ఇప్పుడు ఆ వీధిని తుడిచే ఓపిక లేక మిగిలినవి క్లీన్ చేస్తున్నారట. ఆయన ఫ్రస్ట్రేషన్ ఎలా ఉందంటే – ఆయన పొరుగునే ఉన్న ఓ లక్షాధికారి ఈయన తుడిచిన ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు కాల్చి పారేసిన సిగరెట్లతో నింపుతూ ఉంటాడట. ప్రతిరోజూ పెద్ద మనిషి పడుతున్న శ్రమ చూసి కూడా సంఘంలో స్టేటస్ ఉన్న వ్యక్తి ఇలా ఉంటే, మిగిలినవాళ్ళ గురించి చెప్పుకోవాలా? ఇలాంటివి విన్నప్పుడే మోడీ ఆశయం ఫలిస్తుందా అనిపిస్తుంది. స్వచ్ఛ భారత్ ఫీవర్ ఒక్క సెలబ్రిటీలకే పరిమితం అవకుండా సామాన్యులని ప్రభావితం చేసి వాళ్ళే ఈ ఉద్యమానికి లీడర్-షిప్ వహించేలా చూస్తె బావుండనిపిస్తుంది. స్వచ్ఛ భారత్ మీద ప్రజలు పెట్టుకున్న ఆశలు తీరాలంటే ప్రజల్లోనే ఎక్కువ మార్పు రావాలి. మోడీకి ఆ విధమైన మార్పు తెచ్చే ప్లానేమన్నా ఉందా అంటే, ఉండే ఉంటుంది అనుకోవాలి. ఆయన ప్లాన్లన్నీ ఒకేసారి చెప్పేసే రకం కాదు కనక. ఒక వేళ ప్లాన్ లేకపోతే? పాలిటిక్సులో, పరిపాలనలో పడి దీన్నంతగా పట్టించుకోలేకపోతే?

ఈ మధ్య మహారాష్ట్రలో సంగీతా అవలే అని ఒకావిడ మంగళ సూత్రాలమ్మిన డబ్బుతో ఇంట్లో టాయిలెట్ కట్టించుకుందని విన్నాం. ఆవిడని పంకజా ముండే సన్మానించి, కొత్త మంగళ సూత్రాలిచ్చిందని కూడా విన్నాం. ఫ్రాంక్లీ స్పీకింగ్, స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ పుట్టక ముందు ఇది జరిగితే, పొరపాటునో, గ్రహపాటునో మన మీడియా అది హైలైట్ చేసి ఉంటే  ఎలా ఎనలైజ్ చేసేవాళ్ళం ఈ విషయాన్ని?

ఒక పల్లెటూళ్ళో, మంగళ సూత్రాలకి అత్యంత సెంటిమెంటల్ వాల్యూ ఉన్న చోట, అవి అమ్మి టాయిలెట్ కట్టించుకోవడం – పాములు, తేళ్ళ భయం వల్ల కావచ్చు; కొన్ని చోట్ల చిరుతపులుల్లాంటి జంతువులు గ్రామాల్లోకి వస్తూ ఉంటాయి, ఆ భయం కావచ్చు; చీకట్లో బహిర్భూమికి వెళ్తూ అత్యాచారాలకి గురైన కేసులు విన్నాం, ఆ భయం కావచ్చు అనుకుంటాం. సడెన్ గా మారుమూల గ్రామంలో ఓ వ్యక్తికి దేశ శుభ్రత గురించి ఆందోళన పట్టుకుందనే కోణంలో ఆలోచన పోదు. నిజానికి అసలెవరూ ఆలోచించరు ఈ విషయాన్ని.

సెలబ్రిటీలు ఫొటోజేనిక్ ఊడ్పులు ఊడ్చినా, మీడియా రెచ్చిపోయి హైలైట్ చేసినా, ముఖ్యమంత్రులూ, నాయకులూ సడెన్ గా “ఆమ్ ఆద్మీ’లైపోయినా మోడీ దృష్టి అటుందనీ, ఆయన దృష్టిలో పడాలని ఈ హడావిడంతా. ఆయనతో పాటు ఆయన చేసినవన్నీసెన్సేషన్ అన్న మూడ్.లో  మీడియా, దాని మీద ఆధారపడిన చోటా మోటా రాజకీయ నాయకులు, మంత్రులూ ఉన్నారు కనక ఈ అటెన్షన్ అంతా.
మోడీ దృష్టిపధం నుంచి స్వచ్ఛ భారత్ ఏ మాత్రం తప్పుకున్నా ఇక అంతే అది అందరి దృష్టిపధం నుంచీ జారిపోయినట్టే. లేకపోతే వీళ్ళందరికీ ఇన్నాళ్ళుగా రాని ఉత్సాహం, సామాజిక బాధ్యత ఎక్కణ్ణుంచి వచ్చాయ్? అమితాబ్, సల్మాన్ లాంటి వాళ్ళు తల్చుకుంటే ఇలాంటి అవేర్ నెస్ తీసుకురాలేరా? పోనీ చిరంజీవి తల్చుకోవచ్చుగా స్టాలిన్ లోలాగ? మరి రజనీ కాంత్ గానీ తల్చుకుంటే దేవుడు కూడా చీపురు పట్టుకుని రావాలే? మోడీ వస్తే గానీ వీళ్ళకి ఐడియాలు రావా? లీడర్ షిప్ లేక అలమటిస్తున్నారా?సామాన్యులు ఈ మాటంటే ఒప్పుకోవచ్చు గానీ, సెలబ్రిటీలు, బిజినెస్ టైకూన్లు అంటే నమ్మడం కష్టం. (Rest in the next post)
*******************************************************************************
వైజాగ్ తీరప్రాంతంలో డాల్ఫిన్ పాప్యులేషన్ పెరిగిందని ఈనాడు వార్త. వాటి సంచారాన్ని గమనించిన నేవీషిప్స్ నుంచి వచ్చిన సమాచారం ఇది. INS Savithri Sea trials కి వెళ్ళినప్పుడు నేను చూసిన డాల్ఫిన్స్, అవి స్కూలు పిల్లల్లా నీలి కెరటాల మధ్య దూకుతూ పోవడం … ఆ దృశ్యాలు గుర్తొస్తున్నాయి. అప్పుడు సముద్రంలో తాబేళ్ళు అరుదైపోయాయనేవాళ్ళు. డాల్ఫిన్స్, ఫ్లయింగ్ ఫిష్ తప్ప ఇంకేమీ కనబడేవి కావు. ఈ మధ్య కాలంలో డాల్ఫిన్స్ కూడా తగ్గి, మళ్ళీ వాటి సంఖ్య పెరుగుతోందని వార్త రావడం సంతోషం.
*******************************************************************************
భావి “భార”త “యువ” ప్రధాని, రాహుల్ గాంధీ జోక్ పేల్చారు … “జవహర్ లాల్ నెహ్రూ విధానాలు ఇప్పటికీ అనుసరించదగినవి”, అని. ఇక్కడ జోక్ నెహ్రూ విధానాల గురించి కాదు, ఇన్నాళ్ళకి రాహుల్ కి అవి గుర్తుకు రావడం గురించి. 2004 నుంచీ ఇప్పటి వరకూ సోనియా, రాహుల్, ప్రియాంక నెహ్రూని పబ్లిక్ లో తలచుకున్న సందర్భాలు వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. నెహ్రూ పాటించిన పార్లమెంటరీ విలువలని కాంగ్రెస్ కొనసాగించిన వైనం చూడాలంటే ఒక్క ఆంధ్ర ప్రదేశ్ విభజన పై లోక్ సభలో జరిగిన రాద్ధాంతం తల్చుకుంటే చాలు. Jokes apart, ఎవరెన్ని విమర్శలు చేసినా చరిత్రలో నెహ్రూ స్థానం, ఆయన ప్రత్యేకత ఆయనవే. పాలసీలు ఎంచుకోవడంలో, వాటి అమలులో తప్పులు చేసి ఉండవచ్చు, కానీ దేశం పట్ల ఆయన నిజాయితీని అనుమానించాల్సిన అవసరం ఉందా? చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయిన సంస్కృతి ఒక దేశంగా ఆవిర్భవించి కొత్త దిశని దశని వెతుక్కుంటున్న సమయంలో అనేక కన్ఫ్యూజన్స్ ఉంటాయి. దేశ విభజన సమస్యలు, కులమత విబేధాల నిర్మూలన, ఆర్ధిక వ్యవస్థ వ్యవసాయం నుంచి పరిశ్రమల వైపుకి మారడం, అమెరికా-సోవియెట్ల కోల్డ్ వార్ ప్రభావం పడని విదేశీ విధానం, ఇండియాని శాస్త్రీయంగా అగ్ర దేశాల స్థాయికి తీసుకెళ్లడం – ఇవన్నీ అర్ధం చేసుకోవటం, అవసరమైన చోట కొత్త కాన్సెప్ట్స్ రూపొందించటం లాంటివెన్నో నెహ్రూ, ఆయన సహచరులు ఎదుర్కొన్న అంశాలు. నేషన్ బిల్డింగ్ కి సంబంధించిన విషయాలు. ఇప్పటి ప్రభుత్వాలకి నేషన్ బిల్డింగ్ ప్రధాన వ్యవహారం కాదు. వాటి పని మారుతున్న ప్రపంచ పరిస్థితుల్ని అర్ధం చేసుకుని దేశానికి సరైన దిశా నిర్దేశం చెయ్యడం. ఈ మౌలిక బేధాన్ని విస్మరించి అరవై ఐదేళ్ల క్రితం జరిగిన వాటిని ఇప్పటి పరిస్థితుల కోణంలో చూసి తిట్టడం ….
మా ముత్తాతకి బుద్ధిలేదు వ్యాపారమో, ఫాక్టరీయో పెట్టకుండా వ్యవసాయం చేసాడని ఓ మనవడు విసుక్కుంటే ఎలా వుంటుంది? అలా వుంది.
ధర్మరాజు చేసిన పొరపాట్లని భీముడు, ద్రౌపది, అర్జునుడు మాటి మాటికి ఎత్తి చూపినా ఓవరాల్ గా ఆయన డైరెక్షన్ లోనే నడిచారు. అలాగే నెహ్రూతో పాలసీ పరమైన విబేదాలున్నా పటేల్ టీమ్ స్పిరిట్ తో నెహ్రూ విధానాలని బహిరంగ విమర్శ చెయ్యలేదు. విబేధాలు అంతర్గతంగానే ఉంచారు. మరీ అంత తీవ్ర విబేధాలుంటే పార్టీని, పదవినీ పట్టుకుని వ్రేలాడే మనస్తత్వం, వ్యక్తిత్వం ఆయనవి కావు. ఆయన ఉక్కు మనిషే.
ఆ ఇద్దరి నిజాయితీకి ఆధారాలు కావాలంటే –
గాంధీజీ హత్య తర్వాత పటేల్ మామూలు మనిషి కాలేకపోవడం, హోమ్ మినిస్టర్ గా అది తన నైతిక బాధ్యత అని ఫీలవడం.
చైనా యుద్ధం షాక్ నుంచి నెహ్రూ ఎప్పటికీ కోలుకోలేక పోవడం
– ఇవి చాలవా? అవి నమ్మల్సిన ఆవసరం లేదూ అంటే మన జనరేషన్ వాళ్ళు నమ్మితే చరిత్ర అంతా నమ్మాలి, లేకపోతే ఏమీ నమ్మకూడదు. సెలెక్టివ్ గా నమ్ముతాం అంటే … సారీ, నో కామెంట్స్.
రాజకీయ అవసరం కొద్దీ బీజేపీ పటేల్ ని సొంతం చేసుకున్నా, నెహ్రూని తిట్టాల్సిన అవసరంలేదు. అలాగే బీజేపీ పటేల్ పేరున రాజకీయ లబ్ది పొందకూడదని ఎప్పుడో తాము వదిలేసిన నెహ్రూని ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా ప్రమోట్ చెయ్యడం హాస్యాస్పదంగా ఉంటుంది. మనం ఇవన్నీ చూసి నెహ్రూ, పటేల్ వర్గాలుగా విడిపోతే చివరికి మిగిలేది రాజకీయం, చారిత్రక వ్యక్తులకి అన్యాయం. గాంధీ, నెహ్రూ, పటేల్, రాజాజీ, అంబేద్కర్, …. they were the products of their times and they acted in accordance with the values they beleived in. They tried to bring new ideas and new lines of thinking to the people of a budding nation and that in their own special individual styles. To allow these national icons to be used as political tools or not can only left to people’s understanding of the great leaders’ statesmanship and their times. It is upto individuals to prefer or project one of them as a better alternative but it should not lead to downsizing the others.

2011-03-02_13-57-27_329

 

ఆకా…శ్శ్య వాణి వార్తలు చదువుతున్నది … ఎవరు చదివితే ఏంటండీ?ముందు వినండి, చివరివరకూ!


ఈ రోజు ప్రధాని షామల్ దాస్ రంచోడ్ దాస్ చంచడ్, ప్రతిపక్ష నాయకుడు ఫున్ సుక్ వాంగ్ఢు లోకసభలో ఒక సంయుక్త ప్రకటన చేసారు. ప్రస్తుతం దేశం సాధిస్తున్న ఆర్ధిక పారిశ్రామిక ప్రగతిని దృష్టిలో ఉంచుకొని, దీని వలన రాగల నైతిక దుష్పరిణామాలని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రకటన చేస్తున్నట్లు వారు వివరించారు. భారీగా జరిగే వ్యాపార లావాదేవీలు, సహజ వనరుల వినియోగం, ప్రభుత్వ వ్యయాలు, ఎన్నికల ప్రచార ఖర్చులు రాజకీయ నాయకులను కార్పొరేట్ల, మాఫియాల చేతుల్లో తోలుబోమ్మలుగా మార్చేఅవకాశం ఉందనీ, దీనిని మొగ్గలోనే త్రుంచివేయాల్సిన అవసరం ఉందనీ వారు అభిప్రాయపడ్డారు. ఈ నేపధ్యంలో దేశ రాజకీయ వ్యవహారాలలో కొన్ని మౌలిక మార్పులు తీసుకు రావటానికి అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు, త్వరలో ఈ మార్పులను తీసుకురావటానికి పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు చెప్పారు.

స్థూలంగా బిల్లు స్వరూపాన్ని వివరిస్తూ వారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా రాజకీయాలలో ప్రవేశించి అధికారంలోకి రావచ్చుననీ, ఐతే దీనిలో మంచీ చెడూ రెండిటికీ అవకాశం ఉందనీ, ఎట్టి పరిస్థితుల్లో చెడు మాత్రం జరగకుండా చూడడమే బిల్లు ఉద్దేశ్యమనీ పేర్కొన్నారు. ఈ బిల్లు ముఖ్యంగా రాజకీయాల్లో ప్రవేశించి ప్రజా సేవ చెయ్యాలనుకుంటున్న వర్ధమాన నాయకులను దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్నామని, వ్యక్తులు కేవలం ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చేలా బిల్లు భరోసా ఇవ్వగలదని, ఇతరత్రా స్వార్ధపూరిత వ్యవహారాలకు తావిచ్చే అవకాశం ఉన్నవారిని వడపోస్తుందనీ ఆశిస్తున్నామని తెలిపారు. ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందిన తరువాత రాజకీయ ప్రవేశం చేసే వ్యక్తులందరూ కుల మతాలకతీతంగా ఎలక్షన్ కమిషన్ నిర్వహించే అర్హత పరీక్షలలో ఉత్తీర్ణులయి, ఫీల్డ్ వర్క్ ప్రాజెక్టులలో తమ సమర్ధతను, నిబద్ధతని నిరూపించుకోవాలని తెలిపారు. దీని వల్ల ఐదు నుంచి పది సంవత్సరాల కాలంలో ఇప్పుడున్న పాత తరం నాయకులు, పద్ధతులు పూర్తిగా ప్రక్షాళన కాగలవని భావిస్తున్నట్లు వారు తెలిపారు.
మరికొన్ని వివరాలు ….
పరీక్షా పత్రాలు జాతీయ స్థాయి అయ్యేఎస్ ల కమిటీ తయారు చేస్తుంది.

పరీక్షలో దేశావసరాలు, సాంఘిక ఆర్ధిక స్థితిగతులు, కొత్త పాలనా సంస్కరణల అవసరం, కులమత వర్గ ప్రాంతీయతలకతీతంగా పనిచేయ్యవలసిన అవసరం మొదలైన వాటిపై అభ్యర్ధుల అవగాహనా, నిబద్ధతలను అంచనా వెయ్యడం జరుగుతుంది.

ప్రతీ సంవత్సరం అన్ని రాజకీయ పార్టీలూ తమ భవిష్యత్ నాయకత్వ అవసరాలకు అనుగుణంగా అభ్యర్ధులను ఎంపిక చేసుకొని జాబితాను ఎన్నికల సంఘానికి పంపాలి. ఒక పార్టీ ఎంతమంది అభ్యర్దులనైనా పంపవచ్చు. అభ్యర్ధులు అన్ని కులాల వర్గాల మతాల మద్దతు ఉన్నవారై ఉండాలి. కనీసం డిగ్రీ ఉండి, ముప్ఫై ఏళ్ళు పైబడి, ఏదో ఒక రంగంలో స్వయంకృషితో పైకొచ్చిన వారై ఉండాలి.
నేర చరిత్రలు ఉండి, కేసులు పెండింగులో ఉన్నవారు కేసులు పూర్తయి నిర్దోషులని తేలిన తరువాత మాత్రమె దరఖాస్తులు పంపుకోవాలి. ఈ లోపు వారు పార్టీ కార్యకర్తగా మాత్రమె అర్హులౌతారు. చట్ట సభల్లో కూర్చునే అర్హత ఉండదు.
పరీక్ష పాసైన వారు ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. పరీక్షలో ఇచ్చిన అంశాలపైనే మరింత లోతుగా, కూలంకషంగా ఇంటర్వ్యూలలో పరీక్షిస్తారు.
ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణులైన వారు ముందుగా జిల్లా స్థాయిలో, తరువాత రాష్ట్ర, జాతీయ స్థాయిలలో మొత్తం పది సంవత్సరాల పాటు రాజకీయ ట్రైనీగా పని చెయ్యాలి. ట్రైనింగ్ లో అభ్యర్ధి తన సొంత జిల్లాకి కనీసం రెండు జిల్లాలు, లేక రాష్ట్రం దాటి వెళ్లి అక్కడున్న ప్రజా సమస్యలు, అవసరాలు, సంస్కరణలపై పనిచెయ్యాలి. ట్రైనింగ్ కాలంలో ఏ విధమైన నేరప్రవృత్తి, కుల/మత దురహంకారం బయటపడినా అభ్యర్ధి రాజకీయాలకు అనర్హుడౌతాడు.
ట్రైనీలు ఆయా జిల్లాల కలెక్టర్, ఎస్పీ, మేజిస్ట్రేట్ల పర్యవేక్షణలో ఉంటారు. ట్రైనింగ్ పూర్తయే సమయానికి ఆయా అధికారులు ఇచ్చిన కాండక్ట్ సర్టిఫికెట్లు ఎన్నికల సంఘానికి చేరుతాయి.
ట్రైనింగ్ విజయవంతంగా పూర్తయిన అభ్యర్ధులకు సెంట్రల్ సెలక్షన్ కమిటీ వివిధ రంగాలనుంచి ఎంపిక చేసిన సమస్యలను ప్రాజెక్టు వర్క్ గా ఇస్తుంది. వాటిని అభ్యర్ధులు వివిధ స్థాయిల నాయకులు, అధికారులు, ఆయా రంగాలలో నిపుణులైన వారితో పనిచేసి పరిష్కార మార్గాలు, వాటి అమలుకు అవసరమైన ప్లానింగ్, నిధులు వగైరాలపై కసరత్తు చేసి రిపోర్ట్ ఇవ్వాలి. వీరు సమర్పించిన నివేదికల ఆధారంగా కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా పరిష్కార మార్గాల నాణ్యతను, సమర్ధతను నిర్ణయిస్తారు. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో అమలు చేయవచ్చు. పాస్ మార్కులు పొందిన అభ్యర్ధులు చట్ట సభలలో పాల్గొనే అర్హత పొందుతారు.
అర్హత పొందిన అభ్యర్ధులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సొంత ప్రాంతాలలో పని చెయ్యరాదు.

బిల్లు అమలులోకి రాగానే చట్ట సభలకి ఎన్నికైన అభ్యర్ధుల చేతులకి గడియారాన్ని పోలి ఉండే ఎలక్ట్రానిక్ సాధనాన్ని అమర్చడం తప్పనిసరి. ఇది విమానాలలో ఉండే బ్లాక్ బాక్స్ ను పోలిన పరికరం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యవహారాలన్నిటినీ ఆడియో, వీడియోలుగా రికార్డ్ చేసి భద్రం చేస్తుంది. అనుమానాస్పదులైనవారి చేతి పరికరాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమక్షంలో వేరు చేసి అందులోని సమాచారం విశ్లేషించేందుకు వీలుగా చట్టాలని సవరించడం జరుగుతుంది. ఈ సాధనాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాలని ఇది తక్షణం రికార్డు చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో ఆద్వర్యంలో పనిచేసే సెంట్రల్ కంప్యూటర్ కు పంపుతుంది. (ఇలాంటి బ్లాక్ బాక్సులని మతసంస్థల అధిపతులకి, ఆస్తులు బాగా ఉన్న ఆశ్రమాల అధిపతులకీ కూడా వర్తింపజేయ్యాలని ప్రతిపాదనలున్నాయి. తీవ్రవాద కార్యకలాపాలకి, ఆధ్యాత్మికత పేరుతో అడ్డదిడ్డమైన పన్లకి అడ్డుకట్ట వెయ్యడమే దీని ఉద్దేశం. మనోభావాలు దెబ్బతిన్నా ఫర్వాలేదు, అమాయకులు దెబ్బతినకూడదని నాయకుల ఉద్దేశ్యం)

ఇవి కాక కొత్తతరం మంత్రులు, సహాయ మంత్రులందరికీ ప్రైవేట్ కంపెనీ సీఈఓలతో సమానమైన జీతభత్యాలు ఇవ్వబడతాయి. దీనివల్ల వారికి లంచాలకు ఆశపడే అవసరం తగ్గుతుందని అంచనా.

పార్టీ నిధులు అడ్డదారుల్లో సంపాదించవలసిన అవసరం లేకుండా ఎన్నికల ప్రచారం అవసరం లేని కొత్త పధ్ధతిని బిల్లులో ప్రతిపాదిస్తారు. దీని ప్రకారం ప్రజలు తమ నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధి, శాంతిభద్రతల పరిస్థితి, లంచగొండితనం, ఉద్యోగావకాశాల మెరుగుదల వంటి కీలకాంశాల ఆధారంగా తామే ఎవర్నిఎన్నుకోవాలో నిర్ణయించుకుంటారు.

ఈ మార్పుల ద్వారా రాజకీయాల్ని పెడదారి పట్టించే చాలా దారులు మూసుకుపోతాయని ఆశిస్తున్నామని షామల్ దాస్ రంచోడ్ దాస్ చంచడ్, ఫున్ సుక్ వాంగ్ఢు ఆశాభావం వ్యక్తం చేసారు. పార్లమెంట్ సభ్యులంతా ఏకకంఠంతో సంతోషం వ్యక్తం చేసారు.

ఆకా…శ్శ్యవాణి వార్తలు మీరు వింటున్నారు.

ఇతర గ్రహాలలో మానవ జాతిని పోలిన బుద్ధిజీవుల అన్వేషణకై మన దేశం పంపిన అత్యాధునిక వ్యోమనౌక తొలి విజయం సాధించింది. నూరు శాతం మన గ్రహాన్ని పోలిన గ్రహాన్ని, దానిపై మన జాతిని పోలిన జాతిని వ్యోమనౌక గుర్తించింది. మక్కికి మక్కి మన భాష, సంస్కృతులు ఉన్న ఒక దేశాన్ని కూడా గుర్తించినట్టు వ్యోమనౌక నుంచి తాజా సమాచారం అందింది. మన గ్రహానికి దాదాపు ముప్ఫై కాంతి సంవత్సరాల దూరంలో మన మిల్కీ వే గాలక్సీలోనే ఉన్న ఒక మధ్య రకం నక్షత్రం చుట్టూ తిరిగే తొమ్మిది గ్రహాల్లో ఇది ఒకటని, కేంద్ర నక్షత్రం నుంచి మూడవ స్థానంలో ఈ గ్రహం 450 కోట్ల సంవత్సరాల నుంచీ ప్రదక్షిణలు చేస్తుందని సమాచారం. ఈ కొత్త సౌర కుటుంబంలోని మిగిలిన ఎనిమిది గ్రహాలపై ఎలాంటి జీవులు లేనట్టు వ్యోమనౌక ఇచ్చిన ప్రాధమిక సమాచారం.

ఆకా…శ్శ్యవాణి …వార్తలు…. ఇంతటితో .. సమా…ప్తమ్.

(ఒక అంచనా ప్రకారం కొన్ని బిలియన్ల ఎక్సో-ప్లానెట్స్ (భూమిని పోలినవి) విశ్వంలో ఉన్నాయట. More than 1800 exoplanets have been discovered (1849 planets in 1160 planetary systems including 471 multiple planetary systems as of 2 November 2014). ఇందులో కనీసం ఒక్క చోటైనా 100% భూమిలాంటి గ్రహం ఉండి, మనలాంటి మనుషులే ఉండి, మన దేశం కూడా ఉండి, అక్కడ రాజకీయాలు మాత్రం సత్తెకాలంవి అయ్యుంటే ఎలా ఉంటుంది అనే ఊహ ఈ కధకి బీజం)

When Mark Twain said,”There is no distinctly American criminal class – except Congress”, he was referring to American politics alone.Well, what would he say if he were around today?

మహాసముద్రంతో నీటి బిందువు అంటోంది ….


నువ్వూ నేనూ ఒకటనుకుంటే చెప్పలేని దైర్యం , ఆపలేని ఆనందం
అనంతం నీ వైశాల్యం అగాధం నీ ఆంతర్యం
అద్భుతం నీ సౌందర్యం అల్లకల్లోలం నీ ఆనందం
అన్నీ నావే అన్నీ నేనే

అంతలో ఏదో భయం, నేను నువ్వు కాదనిపించే సంవిద్వైతం
అలగా ఎగయాలని ఆరాటం, ఎంత ఎగిసినా విరగకతప్పని దౌర్బల్యం
కట్ట దాటనీయని నీ బంధం, కట్టలు తెంచే అర్ధంకాని చైతన్యం
గుండె బాదుకున్నా చెదరని ఇసుక తిన్నెల నిశ్శబ్దం
ఉత్సాహం విరిచేస్తూ రాతిగుండెల్లో ఘనీభవించిన అహంకారం
నువ్వేనేననుకోనివ్వని అంతులేని నీ అంతర్మధనం
నీలోనే నా ఉనికనుకొమ్మనే జడప్రపంచపు అంధ నిబంధనం
నువ్వూ నేనూ ఒకటైనప్పుడు ఎందుకు నాకీ గతజల సేతుబంధనం
నేను నీది కాదనుకుంటే తప్పదుమరి నీ మనసున మధనం
ఎంత కాలమీ అరణ్య రోదనం ఎంత సేపు నీ ఆత్మ శోధనం

అయినా …

ఫరవాలేదు కూడగట్టుకుంటాను ధైర్యం
దుర్భరం నా మనసులోని దైన్యం
ప్రాణమివ్వమని సూర్యుణ్ణడుగుతా
ఊతమివ్వమని కొండగాలినడుగుతా
వానమబ్బునై ఆకాశంతో చేరిపోతా

అలనై ఆవిరినై మేఘాన్నై జలపాతాన్నై ఆకసమంతా ఆవరిస్తా
యేరునై సెలయేరునై చైతన్యపు తేరునై పుడమిపై నడయాడి వస్తా
నదినై పావన హృదినై జీవన కధనై నేను నేనై నీకై మళ్ళీ తిరిగివస్తా

మందమారుతాల మృదుత్వం
పిల్లతెమ్మెర సితారల సంగీతం
మేఘాన్నై నేనాస్వాదిస్తా

పర్వత సానువుల ఆత్మవిశ్వాసం
ఒంటరి శిఖరాగ్రాల ధైర్యం, స్థైర్యం
అందుకున్న నేఁ జలపాతాన్నై దూకేస్తా

లోయలోతుల్లోని భావగాంభీర్యం
అరణ్యాల, మైదానాల వైశాల్యం
గుండెల్లో నింపుకుని నీ చెంతకు ప్రవహిస్తా

నా ఒడిలో ఎదిగే జాతుల ఔన్నత్యం
నను త్రాగిన సంస్కృతుల సాహిత్యం
కలుపుకుని నీలో సంగమిస్తా

జననమరణావృత్తుల సాక్షినై పొందిన వైరాగ్యం
సృష్టిస్థితిలయాల కర్తగా ప్రాప్తించిన దివ్యత్వం
మోసుకుని స్థితప్రజ్ఞనై నీలో లయిస్తా

మన ఇద్దరి కలహం ఒక చైతన్యం
ఆద్యంతం అది అనంత ప్రణయం
నేనూ నువ్వని విభజించే ద్వైవిధభావం
నన్ను నేను తెలుసుకునే క్రమపరిణామం
నేనే నీవని, నీలోనే నేనని ఎరుగక తప్పని అద్వైతం

nadeemukham

Once we dreamt that we were strangers.

We wake up to find that we were dear to each other

-Tagore (from Stray Birds)

4ksy

హృదయాం’తరంగం’ – ౦౦౧ (Waves of Change)


అలలు అలలు అలలు అలలు,
మనసుకడలిలో ఎగిసే అంతులేని కలలు.
కలలు కలలు కలలు కలలు,
తలపులతీరం దాటని అలుపెరుగని అలలు
శిలలు శిలలు శిలలు శిలలు,
కలలఅలల హొయలనాపు అహంకారగిరులు
అలలు అలలు అలలుఅలలు ,
శిలలకు వెరవక పొంగే భావావేశపు ఝరులు
కలలు కలలు కలలు కలలు,
శిలలో శిల్పం చూసిన ద్రష్ట చేతి ఉలులు
శిలలు శిలలు శిలలు శిలలు,
అలలఉలుల మేల్కొల్పుకి ఉలికిపడే నిద్రాణపుకలలు

alalu kalalu silalau

 

శిలలు అహంకారానికి ప్రతీకలు – నిర్జీవ వస్తువులో అది జడత్వంగా కనబడితే మనిషిలో అది మార్పుని అర్ధం చేసుకోలేకపోవడం, మార్పుని అంగీకరించలేకపోవడం, మార్పు అవసరమైన చోట కూడా అది వద్దనుకోవడం … ఇలా మానిఫెస్ట్ అవుతుంది.

కలలు అంతరాత్మ కోరుకునే మార్పుకి  సంకేతాలు. ఏది పడితే అది కాదు, ఓ మంచి మార్పుకి – అంటే ఇప్పుడున్న స్థితి కంటే అందమైనది, ఉన్నతమైనది, కష్టం, దుఃఖం, హింసలని తగ్గించేది … ఇల్లాంటి మార్పుల్లో ఏదైనా కావచ్చు, మానసికం లేదా భౌతికం కావచ్చు. పాజిటివ్ దృక్పధం ఉన్న ఏ హృదయమైనా, మస్తిష్కమైనా ఇలాంటి మార్పుని కోరుకుంటుంది. ఆ మార్పు నిజమయ్యే వరకూ ఆ కోరిక కల గానే ఉంటుంది.

కల > Conception > క్రియేటివిటీ / సృజనాత్మకత > మార్పు

అలలు. కలల్ని నిజం చేసే ఆకాంక్ష, ప్రయత్నం, ప్రయాస, పట్టుదల…. వీటన్నిటికీ అలలు ప్రతీక.

కల కనేది, అలని కదిలించేది సమస్త సృష్టికి, దాని స్థితిలయాలకి కారణమైన ఆదిశక్తి. ఆ శక్తే స్థితి మార్పుని దర్శించి, ఆ మార్పుని సంకల్పించే, ఆవిష్కరించే ద్రష్ట.

ద్రష్ట అంటే ఋషి, కవి, రచయిత, కళాకారుడు(రిణి), తత్త్వవేత్త, శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త (కొండొకచో విప్లవకారుడు), వీళ్ళలో ఎవరైనా కావచ్చు. ద్రష్ట అనే నిర్వచనం మతమౌఢ్యం, తీవ్రవాదం ఉన్నచోట వర్తించదు. వాటికి దురహంకారమే సరైన నిర్వచనం.

ద్రష్ట ఆకాంక్షలు, ఆశయాలు, ఆదర్శాలు జనబాహుళ్యాన్ని మార్పు కోరుకునేలా ప్రభావితం చేసినప్పుడు వారిలో వచ్చిన చైతన్యం సంఘంలో కరుడుకట్టుకుపోయిన మూఢత్వం, హింసా ప్రవృత్తి, దురాశ, అవినీతి, మత దురహంకారం, అజ్ఞానం, మానసిక రుగ్మత, అధికార దాహం, …. ఏదైనా సరే, అది సమాజ శ్రేయస్సుని దెబ్బ తీసేంతగా PERVERT అయినప్పుడు …. దాన్ని సంస్కరిస్తుంది, లేదా నిర్మూలిస్తుంది.

సముద్ర తీరంలో ఉండే శిలలపై కెరటాలు చేసే యుద్ధం, కాలక్రమంలో శిలలు మెత్తటి ఇసుకగా మారిపోవడం , ఇవన్నీ చూస్తే ఇప్పుడు చెప్పుకున్నదంతా ఒక్కసారి మనసులో మెదులుతుంది. ఆ స్ఫురణ మామూలు మనిషిలో వ్యక్తిత్వ సంస్కరణకి దారి తీస్తే, మనీషిలో సంఘ సంస్కరణకి, సేవకి, త్యాగానికి స్ఫూర్తిగా నిలుస్తుంది.

 

—These little thoughts are the rustle of leaves; they have their whisper of joy in my mind—

 

 

అంతరంగ చిత్రం


              (2)

              Waves crashing on beach rocks remind me of the struggle the human spirit goes through to unshckle itself of the chains of isms, systems, ideologies, religions and traditions. The same chains that, once upon a time, were the guide ropes to lead man through the dark tunnels of history, of myth and of unknown. The same chains that were once used to fathom the unknown, the ultimate truth of existence.

              Man himself made these chains but instead of using them wisely for the common good of human race he misused them. He used them to control his fellow men, to confuse the down-trodden and to cage god within his own narrow definitions. Now he is trapped himself in the tangled mess of these chains not knowing how to free himself. He could learn from the waves and their eternal fight with the rocks of the shore. They may take millenia to bring about a change, but they never give up. Its always the rocks that give in by becoming the soft sand where little creatures make their homes, in which little children build their dream castles and on which youthful feet tread to think up their future.

This is how my thoughts took shape –

alalu kalalu silalau

  • “We are like islands in the sea, separate on the surface but connected in the deep.” ― William James
  • “Because there’s nothing more beautiful than the way the ocean refuses to stop kissing the shoreline, no matter how many times it’s sent away.”
    Sarah Kay
  • “The creative act is a letting down of the net of human imagination into the ocean of chaos on which we are suspended, and the attempt to bring out of it ideas.― Terence McKenna
  • “It is beautiful, it is endless, it is full and yet seems empty. It hurts us.” ― Jackson Pearce, Fathomless

______________________________________________________________________________


 

(1)

అం'తరంగం' (౧)

శ్రీశ్రీ ఏ సందర్భంలో ఈ వాక్యాలు వ్రాసారో తెలియదు. అసలిది శ్రీశ్రీదని కూడా తెలియదు గొల్లపూడి మారుతీరావు గారి కాలం లో చదివే వరకూ. చదువుతుంటే పసితనంలో తప్ప కలగని కారణరహితమైన హాయి కలిగింది. మనసులో ఈ చిత్రం మెదిలింది.

యాన్ ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ బుడగ !


నేనిక్కడ ఎలా ఉన్నానో, ఎక్కడికి పోతున్నానో నాకు తెలీదు. ఊహ తెలిసినప్పట్నుంచీ ఓ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉండడమే తెలుసు.
“నేను” ఉన్నాను అనుకుంటాను తప్ప ఎక్కడున్నాను? ఏం చేస్తున్నాను? ఎందుకు చేస్తున్నాను? లాంటివేమీ తెలీదు. ఆ ఊహా, ధ్యాస లేవు.
ఆలోచన, జ్ఞాపకం, భయం, సుఖం …. ఇలాంటివేమీ లేవు నాలో. జిజ్ఞాస, ప్రశ్న అనే గుణాలు పుట్టేవరకు. అవెలా ఎందుకు పుట్టాయో ఇప్పటికీ తెలీదు. కానీ అవి మొదలైనప్పప్పట్నించీ బతుకు బుద్బుదప్రాయం అయిపొయింది. అయిపొయిందేంటి నా మొహం? బుడగ బతుకు బుద్బుద ప్రాయం కాక ఇంకే ప్రాయం అవుతుంది?

నేనుఉన్నానుపోతున్నాను
ఈ మూడు భావాలూ చాలు ఒక బుడగ జీవితం దుర్భరం అవ్వడానికి.
అవును జీవితం బుడగస్య బుడగః అన్న చలపతి స్వామి మాట నా విషయంలో అక్షరాలా నిజం.

(Note : కొత్త గురువులు, స్వామీజీల కోసం ఎదురు చూసే వీరభక్తశిఖామణులకి దుర్వార్త :– చలపతి స్వామంటే దేశంలో జనాభా కి డైరెక్ట్ ప్రపోర్షన్ లో పెరిగిపోతున్న స్వామీజీల్లో ఎవరూ కాదు. కే. విశ్వనాధ్ గారి శుభోదయంలో హీరో.)

Cogito ergo sum, I think, therefore I am, నేను ఆలోచిస్తున్నాను అందుచే నేను ఉన్నాను — అని రినీ దేకార్త్ (René Descartes)ఒక్కడే కాదు ఓ బుడక్కూడా అనుకోగలదు. ఉన్న తేడా అంతా వ్యక్తీకరణలోనే. ఆయనైతే అమ్మయ్య నేనున్నానన్న మాట అని వీపు చరుచుకోగలడు. (బుడగలకది కుదరదు. చరుచుకుంటే బుడగ ఉండదు కనక.)

దేకార్త్ ముందూ తరవాతా ఎంతమందికీ ఐడియా వచ్చుండదు? ఐడియా రాని వాళ్ళ కన్నా వచ్చినా చెప్పని వాళ్ళే ఎక్కువుంటారు లోకంలో.
(రినీ దేకార్త్ René Descartes,

Refer: http://en.wikipedia.org/wiki/Ren%C3%A9_Descartes <లేక>

నండూరి రామ్మోహన రావు గారి విశ్వదర్శనం)

ఎనీవేస్, నాకా ఐడియా వచ్చింది. అందుకే ఎంత బుడగస్య బుడగః అయినా నేనున్నాను, నేనూ ఉన్నాను అని ధాటీగా చెప్పగలను.
ఉండడం అనే స్థితిని మించిన ఆనందం, ఉండలేకపోవడం అనే ఆలోచనకి మించిన దుఃఖం బుడగలకుండవు. నిజానికి ఆ రెండు స్థితులూ తప్పనిదేదైనా బుడగే.
కొన్ని రకాల బుడగలకి ఈ రెండు స్థితుల మధ్యలో ఇంకా ఏవేవో ఆనందాలుంటాయి(ట).
(మనుషులు అనీ మరో మహత్తర బుడగ జాతి ఉందట. వాళ్ళకీ ఆనందాలు మరీ ఎక్కువట. ఆ ఆనందాలు దూరమైనప్పుడల్లా నమ్మకురా ఇల్లాలు, పిల్లలూ బొమ్మలురా జీవా అనీ, జగమే మాయ బ్రతుకే మాయా అనీ, మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే అనీ కొందరు పాటలు అని అవి పాడతారుట. అయినా పెద్ద లాభం ఉండదుట ఆ టైపు బుడగలకి.)

అసలు ఉండడం, being, అనే పని ఎంత కష్టమో తెలిస్తే జస్ట్ ఉన్నందుకే ప్రతి బుడక్కీ ఓ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ఇవ్వచ్చు. అంటే, ఒక లైఫ్ టైం గడప గలిగినందుకు ఈ అవార్డ్ అనమాట. అలాంటిది ఆలోచించే బుడక్కి మరెలాంటి అవార్డ్ ఇవ్వాలో? ఐతే, బుడగల్లో లైఫ్ గురించి ఆలోచించడం కన్నా లైఫ్ ని అచీవ్ చెయ్యడానికే ప్రాధాన్యత. ఆలోచించి మాత్రం ఓ బుడగేం చెయ్యగలదు కనక? నా స్టోరీ అంతా విన్నాక మీకే తెలుస్తుంది. అప్పటికీ తెలియకపోతే మీకింకా బుద్బుదత్వ సిద్ధి కలగలేదని అర్ధం.
(బుద్బుదత్వ సిద్ధి అంటే నేనూ ఓ బుడగమాత్రుణ్ణే అనే వినయం, అంతేకానీ అదేదో తాంత్రిక సిద్ధి అనుకునేరు, ఆ పని చెయ్యకండి. ఈ మధ్య మనదేశంలో సిద్ధులకోసం, గుప్తనిధుల కోసం హోమాలు, తంత్రాలూ ఎక్కువైపోయాయిట, టీవీల్లో ప్రవచన కర్తలు నెత్తీ నోరూ బాదుకుని మరీ చెప్తున్నారు)

నేను ఉనికిలోకోచ్చిన చాలాకాలం వరకూ నేను గ్రహించలేదు నేనున్నది ఒక ప్రవాహంలోనని. (నా చుట్టూ ఉన్న బుడగలే నా ప్రపంచం, కొట్టుకుపోవడమే మా జీవితం.) నేను, నేను అని ఇంత ఇదిగా అంటానేగానీ కొట్టుకుపోడంలో ఈ “నేను” ప్రమేయం ఏమన్నా ఉందానని సందేహం రా(లే)దు. (సందేహం వచ్చినా అది తీరే సరికి ఈ దేహం ఉండకపోవచ్చు. పోవచ్చు కాదు ఉండదు, 99.9%)
జీవితం బుడగస్య బుడగః అన్న చలపతి స్వామి మహావాక్యం తెలిసి కొన్ని, తెలియక కొన్ని, తెలిసినా ఆ సత్యం తట్టుకోలేక మర్చిపోయి కొన్ని మొత్తం మీద బుడగలందరం హడావిడిగా, ఆనందంగా కొట్టుకుపోతూ ఉంటాం. కొట్టుకుపోకపొతే కొంపేదో ములిగిపోతున్నంత బిల్డప్ ఇస్తూ ఉంటాం. నిజానికి అదే మా జీవితం, అదేమా సంతోషం. ఐతే దానికప్పుడప్పుడూ బ్రేకులు పడతాయి. ఎలాగంటే —

హాయిగా పోతున్న ఓ బుడగ సడెన్ గా మాయమైపోతుంది. మళ్ళీ కనబడదు. అప్పుడు లోపల ఓ రకమైన అలజడి కలుగుతుంది. అస్సలు బావుండదు ఆ అలజడి. మొదటిసారి నా పక్కనే ఉన్న ఒక బుడగ నా కళ్ళ ముందే అదృశ్యం అయిపోయినప్పుడు ఒక క్షణం ఆశ్చర్య పడ్డా. ఆశ్చర్యం అనే భావం మొదటిసారి అప్పుడే కలిగిందని గుర్తు. అంతలోనే ఆ విషయం వదిలేసి కొట్టుకుపోడంలో బిజీ ఐపోయా..అంతలో మరో బుడగ మాయం. ఈ సారి షాకయ్యా.
ఏమౌతోంది? వీళ్ళెక్కడికి పోయారు? ఎంతకీ రారేం?
ఏం జరిగింది? వూఁ….ఫ్ — ఏం జరుగుతోంది? వూఁ…ఫ్ — ఏం జరగబోతోంది? వూఁ…ఫ్ — నాకు తెలియాలి. తెలిసి త్తీరా…లి.
“అతడు”లో ఎమ్మెస్ నారాయణ పాత్రలా గర్జించాను. (అసలీ పాత్రే పెద్ద బుడగ. కధలో ఎందుకు ఎలా ఎంటరయిందో, ఎలా నిష్క్రమించిందో తెలీదు. Hats off to Trivikram !!!)

నా లాగే ఇతర బుడగలూ గర్జిస్తున్నాయా?ఏమో. అసలు ఆ ధ్యాస ఏ ఒక్క భంగురానికీ ఉన్నట్టు లేదు. నాకు తప్ప.
(మధ్యలో ఈ ఈగో ఒకటి. బుడగలందు పుణ్య బుడగలు వేరయా, అది నేనయా అనుకుంటే కానీ బుడగ మెంటాలిటీకి హాయి ఉండదు)
ఈసారి మూడు బుడగలు ఒక్కుమ్మడిగా మాయం. భయం పుడుతోంది. నేనూ ఇలా మాయమైపోతానేమోనని.
ఎలా ఇక్కడున్నానో తెలియదు. ఎక్కడినుంచో ఇక్కడికి వచ్చానంటే ఏం చెప్తాను? అది తెలిస్తే మళ్ళీ అక్కడికే పోతాం అని సరిపెట్టుకోవచ్చు. ఆ అదృష్టం లేదు.

ఏం చెయ్యను? ఆలోచన అనేది లేకపోతే హాయిగా ఉండేది. నేనెలా వచ్చానో తెలీనట్టే ఈ ఆలోచన ఎందుకొస్తుందో, ఎందుకుంటుందో కూడా తెలీదు.

ఈ బుద్బుదాంతరంగ మధనంలో ఓ పిడకల వేట కూడా ఉందండోయ్.
ఈ అంతర్మధనం నాకేనా ఇతర బుద్బుదములకూ కలదా అనే ధర్మ సందేహం కలిగి అదో సంకటంగా మారింది. ఇదంతా నా స్వంతం, నా స్వయం ప్రతిభ, అనితర సాధ్యం అనిపించి అదేదో మంచి ఇదిగా ఉంది. బుడగలందు పుణ్య బుడగలు వేరయా లాంటి ఫీల్. అదొచ్చినప్పుడల్లా కొంచెం ఉబ్బుతాను. మరీ ఉబ్బితే ఐపోతావ్ అని నాలోపల్నుంచి ఎవరో అరిచినట్టనిపించి ఆ ప్రయత్నం వదిలేస్తా. మధ్య మధ్య ఈ సంకటం తలెత్తుతూ ఉంటుంది. లోపల్నుంచి అరుపు వినబడకపోతే ఇంతే సంగతులు. ఇంతకుముందు అదృశ్యమైన బుడగల బతుకిలాగే తెల్లారిందా? ఏమో? ఈ పిడకల వేట వల్ల ఓ మంచి కూడా జరిగిందనిపిస్తుంది. వేరు వేరుగా కనిపించినా జన్మతః బబుల్సన్నీ ఒకటే అనిపిస్తుంది. ముఖ్యంగా ఉబ్బితబ్బిబ్బవడం వల్లే బుడగలు మాయమైపోతాయని స్ట్రాంగ్ గా అనుకున్నప్పుడు. అందులో బుడగాత్మలన్నిటినీ కలిపే అదృశ్యపరమాత్మ స్ఫురిస్తుంది. మొత్తమ్మీద నా మాత్రం ఆలోచించే బుడగలుండకపోవు అని తేల్చుకున్నా. మరైతే ఏం తెలియనట్టు మూసుక్కుచుటాయేం? ఏమో? అయినా నాకు తెలిసిందంతా నేనందరికీ చెప్పగలుస్తున్నానా ఏం? ఒకవేళ చెప్పినా అవి వింటాయా? పట్టించుకుంటాయా? మరి నా సంగతీ?అసలు తోటి బుడగలేమైనా చెప్తే వినే మర్యాదా, గౌరవం నాకున్నాయా? ఇలా అనుకున్నాక దురహంకారం కాస్త తగ్గింది. ఉబ్బడం కూడా. బబుల్స్ అన్నీ ఒకలాగే ఆలోచిస్తాయి. ఆలోచించాలి. కొంచెం వెనకా ముందూ అంతే.
[[ఉబ్బు లేక ఉలుపు లేక ఊదు లేక శోథము లేక శోఫ లేక శోఫము లేక శ్వయధువు లేక శ్వయనము లేక శ్వయము తగ్గినా బుద్బుదప్రాయత్వం మీద నా అబ్జర్వేషన్స్ బుద్బుదలోకం అంతటికీ తెలియజెయ్యాలని తాపత్రయం కలుగుతుంటుంది మధ్య మధ్య. ఏదో కొత్త విషయం అర్ధమైనప్పుడు, rather అర్ధమైందనిపించినప్పుడు, మరీను.
క్షణ క్షణ గండంగా బతికే ఓ బుడక్కి ఈ తాపత్రయం ఎందుకంటా? ఉన్నట్టుండి బుడగలోకాన్ని మార్చిపారేయ్యాలనా? అనవసర తాపత్రయమే. కానీ ఉంది. ఎలాగో మాయమైపోయే బుడగలకి మీరు మాయమైపోతారు, గుర్తు పెట్టుకోండి అని చెప్పాలా? ఎందుకు? విషయం తెలిసినా తెలీకపోయినా చివరికి మిగిలేది మాయమైపోవడమేగా? అదేదో అజ్ఞానంలోనే జరిగిపోవచ్చుగా? నేనో మహాబుద్బుదాత్మనై పోవాలనా, బుడగజాతి నా అడుగులకి మడుగులొత్తాలనా?లేక బుద్బుదానందాలకి అడ్డుకట్ట వెయ్యాలనా, వాళ్ళందర్నీ నా అవసరార్ధం మానిప్యులేట్ చేయ్యాలనా? ఎందుకు నాకీ తాపత్రయం? ఇది కూడా బుడగలన్నిటికీ కామన్ ట్రెయిట్ అయుండచ్చు. బుద్బుదత్వమే, కానీ enlightened అండ్ exalted బుద్బుదత్వం ]]
ఇన్ని విషయాలు నాకెలా తెలిసిపోతాయో? తెలియడం అనొకటుంటుందా బుడగల్లో? నాలోని తెలుసుకునే గుణం, ఇకపైన తెలివి అంటా, ఇదో స్పెషల్ క్వాలిటీ ఏమో? నేనొ గొప్ప బుడగనేమో అనిపిస్తుంది ఒకోసారి. ఈ తెలివిని ఉపయోగించి బుడగలు మాయం అవడం వెనకున్న రహస్యం తెలుసుకుంటే? అసలు బుడగలెలా వస్తాయో కూడా తెలుసుకోవాలి.
అదేదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ లాగ “నేనే తెలివైనవాణ్ణిగదా, ఆలోచిస్తా” అనుకుంటూ ఈ తాలూకూ ఆలోచనల్లో కొట్టుకుపోతూనే చుట్టూ చూసాను. ప్రవాహానికి ఇరు పక్కలా బుడగల్లాంటివి కాకుండా ఇంకా ఎమేమిటో వింత వింత ఆకారాలు, రంగులు,కదలికలు, శబ్దాలు.. నా తోటి బుడగలు ఎక్కడికి పోతున్నాయి. ఈ కొత్త వింత వస్తువులు ఎలా వస్తున్నాయి?

బుర్ర తిరుగుతోంది.
ఇంతలోనే ప్రవాహంలో ఏదో మార్పు. కొంచెం హాయి, ఆహ్లాదం, అంతలో కాస్త భయం, ఆందోళన, ఆత్రుత …. అవేంటో ఎలా కలుగుతాయోగానీ కలిగాయి.
అంతలోనే చుట్టూ ఉన్న ప్రపంచం చూస్తూ ఉంటే ఎందుకో తెలియని ఆనందం, ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలనే ఆత్రుత, లోపల ఏంటో తెలియని ఒక ఆందోళన, …. అన్నీ ఒకసారే.
ఇంతలో నా పక్కనే, నన్నంటుకుంటూ, నాతో పాటే కొట్టుకుపోతూ మరో బుడగ. కొంచెం ధైర్యం వచ్చింది. వచ్చిందా? ఏమో. భయం తగ్గింది అంటే కరెక్టేమో. నిజానికి ఇందాక చెప్పిన మూడు అంతు తెలియని భావాల జోరు, హోరు తగ్గినట్టు ఉంది. వాటిలో అవి బాలెన్స్ అయినట్టు ఉంది. నా లోపల ఒక రకమైన ఈక్విలిబ్రియం ఏర్పడినట్టు
(నిజానికి ప్రవాహం ఒడిదుడుకులు లేకుండా, కొండలమీంచి దూక్కుండా, లోయల్లో ఒరుసుకుంటూ పోకుండా ఉండడం ఈ ఈక్విలిబ్రియానికి ఆధారం అని తరవాత్తెలిసింది.)
ఆ కొత్త బుడగా, నేనూ. ఇద్దరం కలిసి అలా కొట్టుకుపోతున్నాం. ఇలా కలిసికోట్టుకుపోవడం ఆ బుడగకీ నచ్చినట్టుంది. దానికీ భయం తగ్గి ఉంటుంది. కాదు కాదు.దానిలోనూ ఈక్విలిబ్రియం వచ్చినట్టుంది. ఇద్దరం చుట్టూ ఉన్న, జరుగుతున్న విషయాలు మర్చిపోయాం. మర్చిపోయాం అనుకుంటున్నానా? నిజంగానే మర్చిపోయానా? ఏమో. ఈ లోపులో మా ఇద్దర్నీ తగులుతూ, మాతో పాటే కొట్టుకుపోతూ మరో చిన్న బుడగ. ఈ సామూహిక ప్రయాణం బావుంది. అలా ఎంత దూరం వెళ్ళామో కలిసి.
మధ్య మధ్య మాయమైపోయిన బుడగలు గుర్తొస్తున్నాయి. ఏమై పోయుంటాయవి? అవేవీ ఇలా కల్సి ప్రయాణించడం ఎంజాయ్ చేసుండవు పాపం.
అవునూ ఇప్పుడు మూడు బుడగలం కలిసి హాయిగా కొట్టుకుపోతున్నాం, మేం కూడా ఇలా మాయమైపోంగదా? ఈ థాట్ రాగానే ఒక్క క్షణం ఒళ్ళు జలదరించింది? ఎందుకు? ఏమో?
ఇంకొంత దూరం ప్రయాణం. మాక్కొంచెం ముందుగా కొట్టుకుపోతూ ఓ బుడగ జంట కనబడింది. అలా చూస్తున్నా వాటిని. ఇలా కలిసి ప్రయాణించే బుడగలు ఇంకా ఉంటాయన్నమాట.

మా లాగే అవీ ఒక రకమైన తృప్తితో కొట్టుకుపోతూ ఉండొచ్చు అనే భావం కలిగి ఇంకొంచెం సంతోషం కలిగింది.
చాల సేపు ఆ జంట, మా గుంపు పక్క పక్క నే ప్రయాణించాము. అప్పుడే గమనించా. ప్రవాహం పక్కనే కనిపిస్తున్న వింత ఆకుపచ్చ ఆకారాల్లో ఒకటి ప్రవాహం మధ్య వరకూ అడ్డుపడి ఉంది. మా పక్కనే ఉన్న బుడగల జంట దాని వైపే వెళ్తోంది. వెళ్లి దానికి గుద్దుకుంది. అంతే రెండిట్లో ఒక బుడగ “టప్” అని మాయమైపోయింది. రెండో బుడగ ముందుకి సాగింది. కానీ వణుకుతూ పోతున్నట్టు అనిపించింది. కొంత దూరంలోనే అదీ “టప్” మని మాయం. మరీ దగ్గరగా ఉందేమో ఆ మాయం అవడంలో దానిలోంచి చిన్న చిన్న చుక్కల్లా ఉన్నాయి అవేమిటో చుట్టూ ఎగిరి ప్రవాహంలో పడిపోయాయి. అందులో “కలిసిపోయాయి”. కలిసిపోయాయా? అంటే? ఏమో? అసలీ ప్రవాహం ఏమిటో తెలియదు. అందులో ఈ బుడగలు ఎలా వచ్చాయో అంతకన్నా తెలియదు. మాయం అయిపోయినప్పుడు ఎక్కడికి పోతున్నాయో తెలియదు.ఇప్పుడు ఇంత దగ్గర్నుంచి చూసాక అనిపిస్తోంది. బుడగ ప్రవాహంలో కలిసిపోవడమేనేమో ఈ మాయం. ఒళ్ళు గగుర్పొడిచింది. ఒళ్లా అదేమిటి? ఇదో కొత్త ఆలోచన వస్తోంది.నేను బుడగని అని నాకెలా తెలిసిందో తెలిసింది. నా ఆకారం, చుట్టూ పక్కల ఉన్న ఇతర ఆకారాలు చూస్తుంటే నాలంటివి కొన్ని, నాలాంటివి కానివి కొన్ని కనిపిస్తుంటే నాలో ఉన్న ఏదో నాకు చెప్తోంది. ఇది నేను, ఇది నేను అని. నేను అనే ఫీలింగ్ భలే వింతగా ఉంది. ఐతే అదొక్కటే కాదు నేను కానిది కూడా ఉంది.

అది మరో బుడగ కావచ్చు, చుట్టూ ఉన్న వింత ఆకారాలు కావచ్చు, ఈ ప్రవాహం కావచ్చు.

నేను, నేను కానివి కొన్ని( అందులో మళ్ళీ రకరకాలు),

ఇవన్నీ ఉంటున్న మరో మరోటి, అంటే ఈ ప్రవాహం,

ఈ ప్రవాహం కూడా ఉంటున్న ఒక శూన్యం (?),
ఉన్న వాటిలో కొన్ని మాయమైపోవడం, తనంతట తను మాయమైపోయేది ఒకటి, దేనికో గుద్దుకుని మాయమైపోయేదొకటి,
ఉండడం, ఉండకపోవడం,…..
ఏంటిదంతా?

ఏమైతేనేం ఈ నా థాట్స్ అన్నీ నా పక్కనున్న పెద్ద బుడక్కీ, చిన్న బుడక్కీ చెప్పాలనిపిస్తోంది.
నాలో ఉన్న భావాలు వాళ్ళలోనూ కలగాలని, అవి నానుంచే వాళ్ళకి కలగాలనీ … ఏంటో, లోపల ఏదో కదుల్తున్నట్టు, ఏదో, ఏదో, ఏదో ….
అయితే వాళ్ళెం పట్టనట్టు ఉన్నారు. వాళ్ళకీ నాలాగే అనిపిస్తూ ఉండచ్చు, వాళ్ళకీ తమ భావాలని నాకు పంపడం ఎలాగో తెలియక అలజడి పడుతూ ఉన్నారేమో? ఏమో.

ప్రవాహం ముందుకి పోతోంది. ఆలోచనలు ఆపి మళ్ళీ చుట్టూ ప్రపంచాన్ని చూస్తున్నా.
అప్పుడే ఒకటి జరిగింది.

నా ఆలోచనలని, నా జీవితాన్నీ మలుపు తిప్పిన సంఘటన.
నా బుద్బుదత్వంలో శాశ్వతత్వం ఉందనిపింపజేసే ఘటన.

పై నుంచి ఒకటేదో ప్రవాహంలో “టప్” అని పడింది. ఆ పడినప్పుడు ఇందాక బుడగ పగిలిపోయినప్పుడు ఎగిరిన చిన్న నలకల్లాంటివి ప్రవాహంలోంచి ఎగిరి మళ్ళీ అందులో పడిపోయాయి. ఆశ్చర్యం. ఓ కొత్త బుడగ ప్రత్యక్షం. అరె ఎలా జరిగిందిది? నేనూ ఇలాగే ప్రత్యక్షమయ్యానా? నాలాగే బుడగలన్నీ ఇలా ప్రత్యక్షం అవుతాయా? భలే. కొత్త బుడగ మా వెనకే వస్తోంది.

నా ఆలోచన పెరిగింది. ప్రవాహంలో ఏదో పడితే బుడగలు పుట్టును అని సిద్ధాంతం ఒకటి తయారయింది బుద్బుద మస్తిష్కంలో.

నా అబ్జర్వేషన్స్, rather questions, ఇలా ఉన్నాయి –
పైనుంచి అదేదో పడినప్పుడు ఎగిసిన చుక్కలు ప్రవాహంలో కలిసిపోయాయి.
అంటే ప్రవాహంలో ఉన్న పదార్ధం, పై నుంచి పడిన పదార్ధం ఒకటేనా?
అదేదో పడడంవలన ఒక ఆకారం, నేనే, ఎందుకు ఏర్పడాలి?
అంటే ఆ పడే దాంట్లో నేను ఆల్రెడీ ఉన్నానా?

అంతులేని ప్రశ్నలు. జవాబులేని ప్రశ్నలు.

చివరికి-
పైనున్న పదార్ధం కిందున్న అదే పదార్ధంలో పడినప్పుడు బుడగలు పుట్టును, నా థియరీని కొంచెం మోడిఫై చేశా.
ఇది కొంచెం బావుంది. ఇందాకటి ఆలోచన కన్నా. అంతా తెలిసిపోయినట్టుంది. బుడగలే కాదు ఇతర ఆకారాలకీ ఇలాంటి కారణమే ఏదో ఉంటుంది.

ఇంకో రకం పదార్ధం పైనుంచి కింద ఉన్న అలాంటి పదార్ధంలో పడితే ఫలానా ఆకారం ఏర్పడును. ప్రతి ఆకారానికీ ఇదే థియరీ.
మిగిలిపోయిన మిస్టరీ ఏంటంటే పైనున్న పదార్ధం ఎప్పుడు పడుతుందో తెలియదు, కిందున్న పదార్ధం, అదే ప్రవాహం, ఎక్కడికి పోతుందో అసలే తెలియదు.
తెలుసుకోవాలా? తెలుసుకోగలనా? ఒక బుడగ జీవితకాలం సరిపోతుందా?
రెండు పదార్ధాలూ ఒకటే అయితే, అందులోంచి పుట్టిన బుడగలో కూడా అదే పదార్ధం ఉండాలిగా. వేరే ఉంటుందా?
ఆకారాన్ని కలిగించే ఒకానొక విషయం ఏదో అందులో ఉండుంటుంది. అదేంటో తెలుసుకోవాలి.
ఇంతలో మళ్ళీ పీడ కల. తెలుసుకునేలోపు నేను మాయమైపోతే? ఏదైనా అడ్డుపడి దానికి గుద్దుకుని “టప్”అని పెలిపోతే?
ఏముంది? ప్రవాహంలో కలిసిపోతాను. అప్పుడు ప్రవాహంలో ఏముందో? ఎక్కడికెళ్తోందో తెలుస్తుందేమో? వామ్మో ! నా వల్లకాదు. బుద్బుదప్రాయమైనా ఈ బుడగ జీవితంలో ఉన్న హాయి ప్రవాహంలో ఉంటుందా? ఐ డోంట్ థింక్ సో.
అరె పైనుంచి ఇందాకటిలాగే ప్రవాహంలాంటి పదార్ధం పడుతోంది. ఇంకో బుడగ ఏర్పడుతుంది. ఈ సారి జాగ్రత్తగా చూడాలి. చూసాను. ఆ పదార్ధం ప్రవాహంలో పడలేదు. మా వెనక వస్తున్న కొత్త బుడగ మీద పడింది.

“టప్”, చుక్కలు,మాయం.

ఓర్నాయనోయ్. ఇంత భయంకరమా ఈ బుడగత్వము? పైనుంచి అదేదో నా పక్కనున్న బుడగల మీదా పడితే? నా మీదే పడితే?

ఇప్పుడు బుడగల సృష్టి క్రమం మీద నేను తయారు చేసిన థియరీ ఏం కాను?హడిలిపోతున్నా! నా తర్వాత వచ్చిన బుడగ నా కంటే ముందే టప్పుమంది. నా పనే నయం.

ఓ పక్క ఏ చుక్క ఎప్పుడు మీద పడుతుందో అని హడలు, మరో పక్క విషయం తెలుసుకోమని దొలుస్తోన్న పురుగు.
ఏదో మీద పడి పుట్టి మునిగే వరకూ ఏదో ఒకటి చెయ్యలిగా. పురుగుకే తల వొంచా.

చుక్క ప్రవాహంలో పడితే బుడగ, చుక్క బుడగ మీద పడితే నో మోర్ బుడగ. ఓ మై గాడ్!
హాఁ! ఏమన్నాను? గాడ్?

G.. O.. D, గాడ్ ?

G for Generation
O for Operation
D for Destruction …….. ఇంతేనా ?
ఇంతేనా అంటే బుడగ వరకూ ఇంతే.
పుట్టడం, కొట్టుకుపోడం, పేలిపోడం.
బుడక్కి ముందూ, బుడగ తరువాత మాత్రం ఏదో ఉంది. పేలిపోయాక్కానీ అదేంటో తెలియదు. ఐ మీన్, బహుశః.

పైనుంచి చుక్క పడడం మిస్టరీ. ఎప్పుడు పడుతుందో తెలీదు.
కిందున్న ప్రవాహం మరో మిస్టరీ. ఎక్కడికి పోతుందో తెలీదు.
మధ్యలో బుడగ మాత్రం హిస్టరీ.
(రెండు మిస్టరీల మధ్య ఉండేదాన్నే హిస్టరీ అనవచ్చును అని మరో కంక్లూషన్.పుట్టుటయు నిజము, పోవుటయు నిజమూ, నట్ట నడిమీ పని నాటకమని అన్నమయ్య వాచ ; వరల్డ్ ఈజ్ ఎ స్టేజంటూ షేక్స్పియర్ ఉవాచ)

రెండు “తప్పు”ల, (అంటే ఇద్దరు కలిసి చేసిన ఓకే తప్పుని రెండు తప్పుల కింద లెక్కేస్తే అది కరెక్టే; సారీ ;-), for being a bit naughty, ఎంత బుడగైనా లైఫ్ లో కొంత ఫన్ కోరుకుంటుంది కదా)

రెండు “టప్పు”ల మధ్య బుడగ జీవితం నాటకమా, ఇదంతా ఒక డ్రామా స్టేజీయా, రెండు మిస్టరీల మధ్య నేనో హిస్టరీనా?
అసలు నేనున్నానా, లేనా? నా అస్తిత్వంలో నా ప్రమేయం లేదా? వామ్మోవ్
అయితే పైనుండే చుక్కవ్వాలి, లేతే కిందున్న ప్రవాహం కావాలి, అప్పుడే నీకు శాశ్వతత్వము బుడగోత్తమా! అంటూ ఓ అశరీరవాణి హోరు మొదలైంది. ఎక్కణ్ణుంచో తెలీదు. ఇదెక్కడి గోలో?
పై చుక్క తను పడే వరకూ కనబడదు, ఎట్టి పరిస్థితిలోనూమాట్లాడదు.
కింద ప్రవాహం ఆగదు, మనక్కావాల్సినట్టు చస్తే పోదు. (ఇండియాలో చట్టంలా “తన పని” తను చేసుకుపోతూ ఉంటుంది.)
మధ్యలో ఈ అశరీరవాణి ఎక్కడ్నుంచి వచ్చిందిరా బుడగ్గా?
అశరీరవాణికి ఎలా తెలుసో ఈ విషయం. కానీ చెప్పింది. దానికేం చెప్పడం చెప్పేస్తుంది. చెప్పేవాడికి అడిగేవాడు లోకువనే సామెత ఊరికే వచ్చిందా? (స్వామీజీలు, గురూజీలు, యంత్రాలూ కవచాలిచ్చేవాళ్ళూ, యజ్ఞయాగాలు చేసేసేవాళ్ళూ, నెంబర్లతో, పేరుమార్పుల్తో, వాస్తుతో బ్రహ్మ కష్టపడి రాసిన రాతల్ని చేరిపేస్తున్నవాళ్ళని చూస్తే తెలీట్లా?)

బుడగలన్నీ ఆశాజీవులు కనక, ఎంత ఆలోచనా పరుణ్ణయినా బుడగనే కనక, చివరికి ఇలా సరిపెట్టున్నాను –
“టప్” అనే లోపు మామూలుగా(అంటే హాయిగా అని అర్ధం చేసుకోవలెను) కొట్టుకుపోవచ్చు. అంతకన్నా ఈ బుడగ జీవితానికి కావాల్సిందేముంది? ఓ బుడగ కోరుకోదగ్గది మాత్రం ఏముంది? సాధించగల్చినప్పుడు కోరుకోవచ్చు గానీ …. ప్చ్! ఆలోచన అనవసరం.
తన్నుకున్నా పైనున్న శూన్యంలో ఏముందో తెలీదు. గింజుకున్నా కిందున్న ప్రవాహాన్ని మళ్ళించలేను.
పై చుక్కనో, కింద ప్రవాహాన్నో ప్రార్ధించి, పూజించి తరించడం తప్ప ఒక బుడగగా ఏం చెయ్యలేను.
అప్పట్నుంచీ పై నుంచి పడే చుక్కని నా మీద పడవద్దని, ప్రవాహాన్ని నాకేమి ఇతర ఆకారాలు తగలకుండా చూడమనీ ప్రార్ధించడం మొదలెట్టాను. ఆనందంగా కొట్టుకుపోతున్నా .
నా ప్రార్ధన ఫలించింది. అలా అనుకున్నా అంటే బెటర్.
ఏదో నెత్తి మీద పడే వరకూ ప్రార్ధన ఫలించినట్టు లెక్క, పడితే ప్రార్ధన సరిపోలేదని సరిపెట్టేసుకోడం.
ప్రార్ధన వల్ల పడడం ఆగిందా లేక పడే వరకూ చేసిన ప్రార్ధన నా point of attention ని మరిపించిందా? I decided not to know that.

పై చుక్క, ప్రవాహం వీళ్ళే దేవుళ్ళు. దేవుళ్ళు బుడగల్ని చల్లగా చూస్తారు. మంచి బుడగల్ని మరీ చల్లగా చూస్తారు. చిరంజీవుల్ని చేస్తారు. నేను మంచి బుడగని………. ఇదే నాకు నచ్చిన ఆలోచన విధానం. అందరూ ఇలాగే ఆలోచిస్తే పుడమి బుడగ మీద chaos తగ్గుతుందేమో. ఫిలాసఫీ, సంపూర్ణ శరణాగతి బుడగలకీ ఉంటాయా అనిపిస్తోందా? బుడగలం కాబట్టే ఆ రెండూ కావాలి అని బుడగ బుర్రకి అర్ధం కాలేదనమాట. నాకర్ధం అయిన (అయిందనుకున్న) ఈ విషయాలన్నీ ప్రపంచంలో, అదేనండీ ప్రవాహంలో, ఉన్న అన్ని బుడగలకీ వివరించి వాటిని నాలాంటి భక్తబుడగలుగా మార్చెయ్యాలని ఒకటే తపన. నన్నుచూసి కొన్ని బుడగలు మారాయని కూడా అనుమానం. మారని వాటిని పట్టి పల్లర్చాలనే కసి కూడా.
ప్చ్! బుడగత్వం.

నా చిన్ని బుడగకి శ్రీ రామ రక్షా, నెత్తిన ఏదో పడుటే శిక్షా
కొట్టుకుపోవుట దేవుడి లీల, బుడగ బతుకులో ఆగని గోల,
“టప్పు”కు ముందు బుడగ వుండదు
“టప్పు” తరువాత బుడగ వుండదు
టప్పులు లేక బుడగలు లేవు, బుడగల కోసం టప్పులాగవు
నా చిన్ని బుడగకి శ్రీ రామ రక్షా, నెత్తిన ఏదో పడుటే శిక్షా……

ఇలా భజన చేస్తూ కొట్టుకుపోతున్నా (న్నాం). నా ఉద్దేశం అన్ని బుడగలూ ఇలాగే కొట్టుకుపోతాయని. “టప్” అనే వరకూ.

ఇంతలో ప్రవాహంలో ఏదో పెద్ద మార్పు, సడెన్ గా చుట్టూ లక్షలాది బుడగలు అన్నీ మావైపే వచ్చేస్తున్నాయి. మీదడి పోతున్నాయి. చుట్టూ “టప్” శబ్దాలు మార్మోగిపోతున్నాయి. బుడగలందరం హాహాకారాలు చేస్తున్నాం. వేగంగా కొట్టుకుపోతున్నాం. ఎక్కడికో పాతాళానికి పడిపోతున్నట్టు ప్రవాహం లాగేస్తోంది. పైనుంచి ఏదో శక్తి తోసేస్తోంది. దేవుళ్ళిద్దరికీ ఏదో కోపం వచ్చేసినట్టుంది. బుడగల్ని నాశనం చేసేస్తున్నారు. నన్నంటి పెట్టుకు వచ్చిన బుడగలు మిగిలిన వాటిలో కలిసిపోయాయో, పగిలిపోయాయో … అర్ధమైపోయింది. నాకూ “టప్”మనే టైమోచ్చేసిందని, అనేయ్యాలని, అనేస్తున్నాననీ….
“టప్”
అంతే ఆ పైన నాకేం తెలియదు. “టప్” అన్న టైములో కనబడిన దృశ్యం తప్ప –

అదే, ప్రవాహం ప్రళయంగా మారిన చోట కోట్లాది కొత్త బుడగలు. ఎక్కడికో కొట్టుకుపోతూ కోట్లాది “కొత్త” బుడగలు. ప్రవాహం ఇంతకు ముందు లాగే తన పని తను చేసుకు పోతోంది. చట్టం లాగా. కానీ ప్రవాహం చుట్టూ ఉన్న సీనరీ మాత్రం మారిపోయింది. ముందు నేను చూసిన దానికన్నా భిన్నంగా ఉంది. ఆకారం, రంగు, శబ్దం అన్నీ తేడాగా ఉన్నాయి. ఈ కొత్త ప్రవాహంలో కొత్త సీనరీల మధ్యలో బుడగస్య బుడగ జీవితంలో ఏమైనా మార్పుంటుందా?ఏమో. ఉండదేమో? మారినట్టనిపించినా మారదేమో. ఆ కొత్త బుడగలకే తెలియాలి.

ఏదేమైనా బుడగై పుట్టాక “టప్పు”లు తప్పవు అనుకుంటూ టప్పుమని పగిలి సన్నటి తుప్పరయిపోయి ప్రవాహంలో పడిపోయా. మళ్ళీ బుడగయ్యానో, లేదో తెలుసుకునే అవకాశం లేదు.

అవుతాననే ఆశ, అందుకు అవకాశం ఉందనే నమ్మకం – వీటితోనే హాయిగా పేలిపోయా
మళ్ళీ బుడగత్వపు భయాలూ, ప్రమాదాలూ, అనిశ్చితీ – వీటితోనే భయం భయంగా పేలిపోయా
బుడగగానో, ప్రవాహం గానో, ఈ రెండిటికీ అతీతమైన ఇంకేదో అదృశ్య శక్తిగానో ఉంటూనే ఉంటానని తెలిసి పేలిపోయా
ఉండడం ఒక్కటే నా స్వభావం అనీ, ఉండకపోవడం అనేది నాలో లేనేలేదని, నా చేత కాదని తెలుసుకుని ధైర్యంగా పేలిపోయా

అలలు, అలలు, అలలు,— ఓ కార్టూన్, అరచేత్తో సూర్యోదయాన్ని ఆపడం, etc, etc.


పై పెద్దమనిషిని సానుభూతితో అర్ధం చేసుకోండి, పాపం. గాంధీ , నెహ్రూల బాటలో నడుస్తున్నానని కూడా చెప్పారీయన. ఒక అనుమానం ఏమిటంటే, గాంధీ గారు 70 ఏళ్ల వయసులో చేసిన వివాదాస్పద ప్రయోగాలు, నెహ్రూ గారి పై వచ్చిన మనకంతగా నచ్చని కధలూ సీరియస్ గా తీసుకుని ఫాలో అయిపోతున్నాడా ఈయన? అని.

బ్లాగు తెరిచినంత తేలికా రాయడం ?

అల్లసాని వారి అల్లిక జిగి బిగి,

ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు,

పాండురంగ విభుని పదగుంభనమును,

కాక, మాను రాయ నీకే తగురా

– అన్నట్టు ఏం వ్రాయాలో తెలీక దగ్గరలో మానులేంలేక కుర్చీకేసి , అదీ మామూలు కుర్చీ కాదు ఆఫీసు

కుర్చీ , వీపు రాసుకుంటూ ఇంతమంది ఇంత బాగా రాసేవాళ్ళుండగా నేనెందుకు ఇందులో దిగానా

అనుకుంటుండగా అంతలో అంతరాత్మ ప్రబోధం తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు అని. సరే ఎందుకు

చెప్తోందో అంతరాత్మ, ఎన్ని సినిమాల్లో ఎంతమంది చెడిపోలేదు , ఎన్ని అద్దాలు అనవసరంగా

పగిలిపోలేదు దీని మాట వినక అనుకుని, అదీ కాక బుర్రలో ఉన్నది ఎలాగో ఇసకే కనక తైలం తప్పక

వస్తుందనిపించి , ముందు ఏదైనా సబ్జెక్ట్ చూసుకుందామని ప్రయత్నం మొదలుపెట్టా. అన్ని సబ్జెక్ట్లూ

థీములూ – స్తోత్రాలూ సుభాషితాలతో మొదలై స్ట్రింగ్ థియరీ వరకూ కవర్ అయిపోయాయి. తిట్టే నోరూ

తిరిగే కాలూ లాగే రాసే పెన్నూ టైప్ చేసే వేళ్ళూ కూడా ఊరుకోవు కనక ఏదో ఒకటి, నోటికొచ్చిన వాగుడూ

చేతికొచ్చిన రాతలూ బ్లాగులో దింపేద్దాం అనుకుని ఇదిగో ఇలా ……. ఎందుకో టామ్ సాయర్ కధలో  ఓ అమాయకప్పిల్లికి  టామ్ తన దగ్గు మందు పోసే ఘట్టం మాటి మాటికీ గుర్తొచ్చింది. అసలే ఎలా రాయాలో ఎం రాయాలో

తెలియక ఏడుస్తుంటే ఈ పిల్లి శకునం ఏంట్రా అనుకోకుండా అదే సబ్జక్ట్ తీసుకు రాయడం మొదలెట్టా.  టామ్, పోలీ పెద్దమ్మ ఇచ్చిన మందు తను వేసుకోకుండా గోడ కున్న పగుళ్ళలో పోసేస్తూ ఉంటే పోలీ

పెద్దమ్మ పెంపుడు పిల్లి, పీటర్, అక్కడికొస్తుంది. ఒరిజినల్ చదవడంలోని మజా నేనెలా

అనువదించగలను? ఒరిజినలే చదవండి. ఒకసారి బాల్యంలోకి వెళ్ళొచ్చినట్టు కూడా ఉంటుంది.

– One day Tom was in the act of dosing the crack when his aunt’s yellow cat came along, purring, eying the teaspoon avariciously, and begging for a taste. Tom said: “Don’t ask for it unless you want it, Peter.” But Peter signified that he did want it. “You better make sure.” Peter was sure. “Now you’ve asked for it, and I’ll give it to you, because there ain’t anything mean about me; but if you find you don’t like it, you mustn’t blame anybody but your own self.” Peter was agreeable. So Tom pried his mouth open and poured down the Pain-killer. Peter sprang a couple of yards in the air, and then delivered a war-whoop and set off round and round the room, banging against furniture, upsetting flower-pots, and making general havoc. Next he rose on his hind feet and pranced around, in a frenzy of enjoyment, with his head over his shoulder and his voice proclaiming his unappeasable happiness. Then he went tearing around the house again spreading chaos and destruction in his path. Aunt Polly entered in time to see him throw a few double summersets, deliver a final mighty hurrah, and sail through the open window, carrying the rest of the flower-pots with him. The old lady stood petrified with astonishment, peering over her glasses; Tom lay on the floor expiring with laughter. “Tom, what on earth ails that cat?” “I don’t know, aunt,” gasped the boy. “Why, I never see anything like it. What did make him act so?” “Deed I don’t know, Aunt Polly; cats always act so when they’re having a good time.”

(మార్క్ ట్వైన్ ఒరిజినల్ కన్నా నండూరి రామ్మోహన్రావు గారి ట్రాన్స్ లేషన్ మరీ అందంగా ఉంటుంది, టరమ్స్ & కండిషన్స్ అప్లై. మనలో బాల్యం ఆవిరైపోకుండా ఉండాలి.)

ఇదెందుకు వ్రాయాలనిపించిందో అర్ధమైంది. అది తరువాత. సూర్యోదయం ఆపడం ఎలాగా తెలుసుకుందామని కనక ఈ పోస్ట్ చదువుతుంటే ముందుగా ఓ కమర్షియల్

బ్రేక్.  Buy one, get one free. అరచేత్తో సూర్యోదయం ఆపడం తో పాటు నా సొంత డబ్బా ఉచితం.

అసలు వీడెందుకు వ్రాయాలి, వ్రాసెను బో నేనెందుకు చదవాలి అనిపిస్తే ఈ క్రింది కారణాల వలన  –

పువ్వులెందుకు పూస్తాయో, సూరీడు వెలుగెందుకిస్తాడో,

నదులెందుకు ప్రవహిస్తాయో, అప్పారావు అప్పులెందుకు చేస్తాడో,

ఆర్ జీ వి ఈ మధ్య సినిమాలెందుకు తీస్తున్నాడో

చట్టం ఎందుకు ‘ఎంచక్కా’ తన పని తాను చేసుకుపోతూ ఉంటుందో

– అందుకే

( ఆర్ జీ వి అన్నాను కదాని ఆయనొక్కడే కాదు ఇంకా చాలామంది ఉంటారు ఆ కేటగిరీలో, ఆర్ జీ వి

అంటే ట్రెండీ గా ఉంటుందనీ …)

నీటిలో చేప నిశ్శబ్దంగా ఉంటె, గాల్లో ఎగిరే పక్షి పాట పాడుతుందిట, నేలపై తిరిగే జంతువు సందడి

చేస్తుందిట. మనిషిలో మూడూ ఉన్నాయిట. ఇది రవీంద్రనాధ్ ఠాగూర్ వాక్యం – STRAY BIRDS లో.

ఆయన నాయిస్ అన్నాడు. నాయిస్ పదానికి డిక్షనరీలో  ౘప్పుడు, శబ్దము, సందడి, ధ్వని, సద్దు,

confused sound, din, cry, outcry, clamour, uproar, hubbub, tumult, fuss, bustle ఇన్ని

అర్ధాలున్నాయి. జంతువుల్లో అనవసరంగా అరిచేవేమీ లేవు. జిమ్ కార్బెట్, కెనెత్ ఆండర్సన్ , డేవిడ్

అటెన్ బరో నడిగినా, వాళ్ళకున్న అనుభవజ్ఞానంలేని ఆర్డినరీ వైల్డ్ లైఫ్ లవర్నడిగినా చెప్పేస్తాడు

జంతువులకి అనవసర వాచాలత్వం లేదని. మరి విశ్వకవి జంతువులకెందుకు నాయిస్ అనే పదం

వాడాడు? నే చూసిన పుస్తకం లో టైపో ఎర్రర్ అయ్యుంటుంది , ప్రకృతిప్రేమికుడైన రవీంద్రుడు ఖచ్చితం గా

జంతువులకి గందరగోళం ఆపాదించడు అనిపించి దాన్ని సందడి అని ఫిక్స్ చేసేసుకున్నా. ఐతే ఈ

వాక్యంలో ఠాగూర్ దృష్టి మెయిన్ గా మనిషి మీదే కనక, మనిషికి నాయిస్ పదం కూడా పూర్తిగా

సరిపోదు కనక, అర్ధం చేసుకునేవాళ్ళు జంతువులకో అర్ధంలో, మనుషులకో అర్ధంలో నాయిస్ ని

అన్వయించుకుంటారనుకుని ఆయన ఆ పదం వేసి ఉంటాడు. మనిషి ఇన్ ఫ్రా సోనిక్ టు అల్ట్రా సోనిక్ త్రూ

టు ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ లన్నిటిలో చప్పుడు చెయ్యగలడు. వినేటప్పుడు మాత్రం ఇది వర్తించదు.

ఎదుటివాడి ఫ్రీక్వెన్సీ , వేవ్ లెంగ్తూ పట్టుకోలేకపోవడమే నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం

కావడానికి ఒకానొక ప్రధాన కారణం అంటే తప్పవుతుందా? అన్ని ఫ్రీక్వెన్సీలూ వినాలంటే చెవులు

పట్టుకెళ్ళి మనసుకి తగిలించాలి. మనసు మూగాడే కానీ బాసున్డది దానికి, చెవులుండే మనసుకే

ఇనిపిస్తుండా ఇది ….(ఆత్రేయ పాట, అక్కినేని నోట అనగానే ఈ ట్రాన్స్ లిటరేషన్ టూలుక్కూడా

కిక్కెక్కిందో ఏంటో) మనసు మూగదేగానీ బాసుండది దానికి, చెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది….

మనసుతో వినడం మొదలెట్టినప్పుడే మనిషికి పరిపక్వత వస్తుంది. ప్రపంచాన్ని సానుభూతితో అర్ధం

చేసుకోవడం అలావాటౌతుంది.  కవులకిలాంటివి అందరికంటే ముందుగా ఎలా తెలిసిపోతాయో ? అని

నాలాంటివాడు అనుకోకుండా ద్రష్ట అనే పేరు కూడా ఉందిట కవికి. కనబడకుండా వినిపించేవాడు కవి అని

వెలుగు నీడల్లో అక్కినేని నాగేశ్వరరావు డైలాగు. మరి ద్రష్ట ఎలా అయ్యాడూ అనుకుంటూ –

కనబడనిది కని

వినబడనిది విని

తడబడక వల్లించు

వాడుఇలను కవిరా, కుమతీ …..

అని నాకు నేనే ఎక్స్ ప్లనేషన్ ఇచ్చుకున్నాక అర్ధమయింది కవులు ద్రష్టలెలా అయ్యారో. ఏదైనా సరే ఎవరి

పుర్రెలో పుట్టిన బుద్ధి వాళ్లకి బాగా అర్ధం అవుతుంది. ద్రష్టగా సత్యాన్ని గుర్తిస్తే, కవిగా ఆ సత్యాన్ని

అందంగా, ఆవేశంగా, అందరి తరఫునా చెప్తాడు కవి. భావం ఉన్నా భాషలోకి మార్చలేక కష్టపడే నాలాంటి

వాడికి మౌత్ పీస్ కవి. సరే, ఠాగూర్ కవి, దేర్ ఫోర్, ద్రష్ట. నాయిస్ పదం వాడి  ఆయన నాలోని నాయిస్

వినిపించేందుకు లైసెన్స్ ఇచ్చాడనిపించి ఏదో నాకొచ్చింది రాసేస్తున్నా.  సరే, టామ్ సాయర్ పిల్లి కధ ఇక్కడెందుకు దూర్చానంటే, ఇందుకు –

But Peter signified that he did want it.

Peter was sure.

Peter was agreeable. కన్వీనియంట్ థింకింగ్ అనే దాన్ని ఈ మూడు ముక్కల్లో చూపించాడు రచయిత. చాలా మందిలో ఉండేదే.

చేస్తున్న పనిని ఏదో విధంగా జస్టిఫై చేసేసుకోవడం. అదే నాలోనూ ఉందండి. కానీ ఇప్పటివరకూ ఎవరి

మీదా ఉపయోగించలా. ఏదో ఒకటి రాయాలని పెన్ను, కాదు, కీ బోర్డ్ గొడవ మొదలెట్టేవరకూ.

అప్పట్నుంచీ కన్వీనియంట్ థింకింగూ మొదలైపోయింది. పై మూడు వాక్యాలూ నేను వాడుకున్న

విధంబెట్టిదనిన …

పొరపాటున నా రాతలు చదువుతున్నారు కదా అని  ఓ క్షణం పాటు టామ్ సాయర్

పిల్లితో పోలుస్తున్నట్టనిపిస్తే నేనేమీ చెయ్యలేను. నా ఉద్దేశం అది కాదు, నా సుత్తంతా వినడానికి

చతుస్సముద్రవేలావలయితమైన ఈ బ్లాగు దేశంలో ఎవరో ఒకరు ఉంటారనే జస్టిఫికేషన్ కోసం  మాత్రమె

వాడుకుంటున్నాను దీన్ని. అయినా ఇంకా అలాగే అనిపిస్తే దయచేసి చదవడం మానెయ్యండి. మనం రాసేవి

చూసి ఎవరో ఒకరు ఏదో ఒకటి అనుకుని అది పైక్కూడా అనేస్తే ఎలా అనే భయం లేకుండా ఈ టామ్

సాయర్ – పిల్లి ఎపిసోడ్ మంచి ధైర్యాన్నిస్తుంది. ఇంతోడి చెత్త రైటింగ్ కి  టామ్ సాయర్నుంచి ఠాగూర్  వరకూ వత్తాసు తెచ్చుకోవాలా అని మీకనిపిస్తే మీరే రైటు. మీ చేతిలోనే ఉంది వోటు.

వోటు అంటే గుర్తొచ్చింది. అరిచేత్తో సూర్యోదయం ఆపడం ఎలాగో చెప్తాను. నిజానికి నేను కాదు చెప్పేది.

మెగాస్టార్. చెప్పడం కాదు చేసి చూపించారు. ప్రజారాజ్యం సూర్యుణ్ణి కాంగ్రెస్ హస్తం తో మూసేసినప్పుడే ఈ

వామపక్ష భావజాల మహావాక్యం తప్పని తేలిపొయింది. ప్రపంచాన్ని నడిపేది ఆదర్శాలు, ఇజాలు కాదు

మనుషుల అవసరాలు, అహంభావజాలు(అహం అనే భావం నుంచి పుట్టిన ఇజాలు అని

కవిహృదయము)  అని చరిత్ర చాలాసార్లు నిరూపించింది. అదే సత్యానికి విలీనం ద్వారా ఒక జాతీయ పార్టీ

ఒక ప్రాంతీయ పార్టీ కలిసి సింబాలిక్ గా పునరంకితం అయ్యారు. ఎవరైనా ప్రరాపా ద్వారా రాజకీయాల్లో

పెనుమార్పు వచ్చేస్తుందని నమ్మి ఉంటే వాళ్లకి సున్నితంగా చరిత్రగతిని సూచించడం అన్నమాట ఇది.

విలీనం చెయ్యాలని నిర్ణయించడం ద్వారా మెగాస్టార్ కే  ఈ క్రెడిట్ పూర్తిగా దక్కాలి. ప్రజలు చరిత్ర

మర్చిపోకుండా ఓ పార్టీని పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలనీ త్యాగం చేసి మరీ ఓ సందేశాన్నిచ్చినందుకు.

ఇండియా పార్టిషన్, గాంధీజీ హత్య, కమ్యూనిస్ట్ సిద్ధాంత వైఫల్యం, పార్లమెంటులో నేర చరిత్రుల బిల్లు

పాసవ్వకపోవడం, అన్నహజారే ఉద్యమంపై రాజకీయ బురద జల్లుడు … ఇవన్నీ ఏం చెబుతున్నాయి ? దేశమంటే

మట్టి కాదోయ్, … వెయిట్, ప్రపంచమంటే మట్టికాదోయ్, ప్రపంచమంటే మనుషులోయ్ అని. (గ్లోబలైజ్

అయిపోతున్నాంకదా.) మనుషులు ఎలా వుంటే వాళ్ళ పాలకులు, నాయకులు, జీవితాలు , ఎట్సెట్రా,

ఎట్సెట్రా ..అలా ఉంటాయనే కదా. మనని మనమే తిట్టుకోవడం, మనని మనమే మార్చుకోవడం అత్యంత

అవసరమని అరిచేత్తో సూర్యోదయాన్ని ఆపడం అనే ఫినామినన్ మనకి చెబుతోంది. గాంధీ తాత

గారేమన్నారు ? బీ ద ఛేంజ్ దట్ యూ వాంట్ టు సీ ఇన్ అదర్స్ అని కదా. ఆయన తను పాటిస్తూ

అందరికీ చెప్పారు డైరెక్ట్ గా. మన రాజకీయాలు, నాయకులు అదే విషయాన్ని  ఇన్ డైరెక్ట్ గా

చెప్తాయి(రు). వియ్ హావ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్. అందువల్ల నాయకులు సరిగా లేరు అని

బాధపడకుండా మనమే మారాలి. వ్యవస్థ ఏదైనా, విశ్వాసం ఏదైనా వాటిని నిలబెట్టాల్సింది వాటిని

నిర్మించుకున్న మనమే, మన గుణగణాలే. సంఘ స్థాయిలో మనలో పేరుకుపోయిన ఆవాంఛనీయ

లక్షణాలే మెజారిటీ పాలిటిక్స్ రూపంలో మనకి నాయకులని అందిస్తాయి. ఒక్క రాజకీయమే కాదు, అన్ని

రంగాల్లోనూ ఇది ఇంతే. విలీన రూపంలో ఇంత గొప్ప సందేశం ఇచ్చినా ‘జల్సా’ సినిమాలో పవన్ కళ్యాణ్

చేసిన కాంగ్రెస్ నాయకుడి సీను అనుకోకుండా చిరంజీవి చెయ్యాల్సివస్తోందే అని కొంచెం బాధగానే

ఉంటుంది. కానీ ఎవరేం చెయ్యగలరు? కుచ్ పానే కే లియే ఔర్ కుచ్ ఖోనా హై.

చిరంజీవి పరిస్థితిలా ఉంటే, రాజకీయాల్లోకి దూకుతానని మాటి మాటికీ బాలకృష్ణ వార్నింగులు. వచ్చేదేదో సీరియస్ గా సీనియర్

ఎన్టీయార్ లా అదే ఉత్సాహంతో, అదే ఆత్మవిశ్వాసంతో వస్తే బావుండు. లవకుశ లో నిత్యానందుడు కోపం

వచ్చేస్తోందీ, శాపం పెట్టేస్తానూ అంటూ బెదిరిస్తాడు అలా చేస్తే జనాలకి నిత్యానందుడు గుర్తోచ్చేస్తే వోట్లు

రాలడం కష్టం కదా. కమిటవ్వకుండా తొడలు కొట్టినా, మీసాలు తిప్పినా అవి కొత్త వోట్లు తేవు, ఇతర

పార్టీల వోట్లు చీల్చవు. ఎవరేం మంచి చేస్తారు ప్రజలకి అనేది పక్కనపెట్టి కనీసం ఓ బలమైన

ప్రత్యామ్నాయ పార్టీగా తెలుగు దేశానికి పూర్వ వైభవం తెస్తే బావుండు. బాలకృష్ణకి వోట్లు తెచ్చే టెక్నిక్

తెలియకపోవచ్చు. మరి చంద్రబాబుకీ తెలియదా?ఇప్పుడే అందిన వార్త అన్నా హజారే నిరాహార దీక్షకి

మంచి స్పందన వస్తోందిట. మంచి వార్త. ప్రజల్లో ఉన్న కసి తెలుస్తోంది. ఐతే, జన లోక్ పాల్ అనుకున్న

లక్ష్యం సాధీంచగలదా?ఇప్పటికే ఉన్న ఫోర్ ఎస్టేట్స్ తో పాటు ఫిఫ్త్ ఎస్టేట్ అయ్యి కొన్నాళ్ళకి వాటిలాగే

ఇనెఫెక్టివ్ అయి కూచుంటుందా? చెప్పలేము. ఎవరూ నన్నడగరు కానీ అడక్కపోయినా చెప్పగల

స్వాతంత్ర్యం బ్లాగ్దేవత ప్రసాదించింది కనక చెప్తున్నా. లోక్ పాల్ రావడం పక్కనుంచి, అన్నా టీమ్

రాజకీయాలపై ప్రజల ఫోకస్ తగ్గకుండా కులమతప్రాంతాలకతీతంగా సామాన్యుడి అవసరాలని, కష్టాలనీ

దృష్టిలో ఉంచుకుని పనిచేసే ఒక శాశ్వత ఫోరం టీమ్ అన్నా ఏర్పాటు చేసి అన్ని సమస్యల మీద బహిరంగ

చర్చ నిరంతరం జరిగేలా చూస్తే ప్రజలు సంఘటితం కావడానికి ఒక కేంద్రం ఉంటుంది. ఉద్యమాలూ , వాటి

నాయకులూ ఆవిర్భవించేవరకూ అవినీతి, అరాచకం తమ పని తాము చేసుకు పోతూ ఉంటాయి.

చట్టాల్లాగే. వీటికి వ్యతిరేకంగా ప్రజలు సంఘటితం కావాలంటే ఎంతో ప్రాసెస్ జరగాలి. అది జరిగి ఉద్యమం

మొదలయ్యాక రాజకీయ బురద జల్లుడు మొదలౌతుంది. అది తట్టుకుని మళ్ళీ కూడదీసుకోవడంలో

చాలా ఆలస్యం జరుగుతుంది. శాశ్వత ఫోరం ఉంటే అవసరమైనప్పుడు ప్రజలు దానివైపు తిరుగుతారు.

కాకపొతే ఫోరం లోకి కోవర్ట్ లు, కుహనాలు రాకుండా టీమ్ జాగ్రత్త పడాలి. ఎప్పటికప్పుడు టీమ్ లీడర్స్ ని

తయారు చేస్తూ ఉండాలి. ఆది శంకరుడు దేశం నాలుగు దిక్కులా నాలుగు అద్వైత పీఠాలు స్థాపించినట్టు

అన్నా కూడా ప్రజాస్వామ్య పీఠాలు ఏర్పాటు చేస్తే?   ఇన్ని రాసి జగన్ గురించి రాయకపోతే ఎలా ? జగన్ని చూస్తుంటే మలేషియాలో ప్రతిపక్ష నాయకుడు

అన్వర్ ఇబ్రహీం కధతో పోలికలున్నాయా అనిపిస్తోంది. అతన్ని, అన్వర్ ఇబ్రహీం, తొంభై ఎనిమిది నుంచీ రకరకాల కేసుల్లో

ఇరికించి ఎన్నికల్లో పాల్గోకుండా చూస్తోంది అధికార పక్షం. ఒక్క కేసూ ప్రూవ్ అవ్వదు కానీ ఇతను

అధికారం లోకి వచ్చే అవకాశం ఉండదు. మలేషియా ఎన్నికల నియమాలు అలా ఉన్నాయి. నిజానికి

అలా తయారు చేసారు. పోలికలు అంతవరకే. జగన్ కేసు పూర్తిగా అలా ఉండే అవకాశం తక్కువ. అంతా

2014 ఎన్నికల సమీకరణాలను బట్టీ ఉంటుంది. కణికుడి రాజనీతి అవలంబించిన మనరాజకీయాల్లో

శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు, పనిలో పనిగా దేశానికి సరైన నాయకులూ ఉండరుకదా. ఇంకా

రాజకీయాలు చాలు. ఇప్పుడు భారతంనుంచి ఒక కధ. ఇంద్రాది దేవతలు తమ కంటే శక్తివంతులు గర్విస్తూ ఉంటే పరమాత్మ వాళ్ళమధ్య

ఒక గడ్డి పరక పడేసి దానిపై వారి శక్తుల్ని చూపమంటాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఏమీ

చెయ్యలేకపోతాడు. అగ్ని కాల్చలేడు, వాయువు కదపలేడు. మిగతా దేవతల శక్తియుక్తులు గడ్డిపరకపై

పని చేయక వాళ్ళు పరమాత్మకి తలవంచుతారు. ఈ కధ ఉదాహరించటానికి కారణం ఈ మధ్య

వార్తల్లోకెక్కిన దైవ కణం. ఈ దైవ కణం గురించి మొదటిగా తెలిసాక (పూర్తిగా కాదు) ఫైనల్ గా సైంటిస్టులు

సృష్టి రహస్యం కనిపెట్టేస్తారేమో, ఇంక దేవుడి పీఠం కూడా కదిలిపోతుందేమో అని కొంచెం బాధగా ఉండేది.

దైవకణం గురించి పూర్తిగా తెలియదు కదా మరి. అప్పుడు పైన చెప్పిన కధ గుర్తొచ్చేది. సైంటిస్టులు దైవ

కణం కనుక్కున్నట్టు, అందులోంచి దేవుడు వీళ్ళకి ఏవో పరీక్షలు పెట్టి పై దేవతల కన్నా దారుణంగా వీళ్ళ

గర్వభంగం చేసేసినట్టు, వీళ్ళందరూ లాబోరేటరీలు వదిలి అరణ్యాల దారి పట్టినట్టు ఏవేవో ఊహించేవాణ్ణి.

తీరా దైవ కణం పేరు ఎలా వచ్చిందో ఈ మధ్య తెలిసాక దేవుడి భవిష్యత్తుకి, సైంటిస్టుల భవిష్యత్తుకి ఏ ఢోకా

లేదని తెలిసిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్,  దైవకణం అనే పేరు వెనక దైవవిశ్వాసం నేతిబీరకాయలో నెయ్యి కన్నా కొంచెం తక్కువుంది. దీనికోసం

వెతికిన మొదటి సైంటిస్టుల్లో ఒకడైన Leon Lederman దీన్ని Goddamned Particle అని

రాద్దామనుకున్నాడట ఏదో సైన్స్ పత్రికలో, కానీ ఎడిటర్ ఒప్పుకోక గాడ్ పార్టికిల్ అని సెటిల్ అయ్యాడట.

Goddamned అనేది ఆస్తికుల్ని నొప్పించే పదం. వాడకంలో దీన్ని నిస్సహాయ స్థితిని సూచించటానికి

వాడతారు. హిగ్స్- బోసాన్ ఆచూకీ దొరక్క ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు Leon Lederman ఈ పదం

వాడాడు. తన పేరు పెట్టుకున్న కణం గురించి మాట్లాడుతూ హిగ్స్ అన్నాడు అసలు దైవ కణం అనే మాట

వాడడం కూడా తనకిష్టం లేదని. తను ఆస్తికుడు కాకపోయినా నమ్మకం ఉన్నవాళ్ళు దేవుణ్ణి ఒక చిన్న

కణంలో బంధించడాన్ని మెచ్చరని అతని భయం. భయపడడా మరి? భూమి, సూర్యుడి చుట్టూ తిరుగుతుందన్నందుకు కోపర్నికస్ కి పట్టిన గతి తెలిసినవాడు, ఆ ప్రాంతాల్లోనే పుట్టి పెరిగాడు.
పరమాత్మా, పరమాణురూప, శ్రీ తిరువేంకటగిరి దేవా .. అంటూ భారతీయులు అంతటా దివ్య చైతన్యాన్ని చూడగలరని, ఇప్పటికీ చూస్తున్నారనీ ఆయనకేం తెలుసు పాపం.  అసలు దైవ కణం దొరకగానే దేవుడి రహస్యం అంతా

మనుషులకి తెలిసిపోతుందనే భయం ఆధార రహితం అని కొంచెం లేటుగా అర్ధంచేసుకున్నాను. మన

ఋషులు మానసిక పవిత్రతతో చేసిన సాధనలో దేవుణ్ణి దర్శించారు. భౌతిక శాస్త్ర పరిశోధనలో ఆ దేవుడు

కనబడడం అసాధ్యం. దేవుడిచ్చిన మనసుతోనే పరిశోధన చేస్తూ, ఆ మనసులోనే దేవుణ్ణి చూడగలం, అలాగే ఆయన్ని చూడాలి

అన్న విషయం వీళ్ళకి తెలియదు,  ఇప్పుడే తట్టదు. మనసుని తప్ప అన్నిటినీ కంట్రోల్ చేయ్యాలనుకునేది ఇప్పటి

మానవ జాతి. విష్ణువుని వెతుకుతూ వైకుంఠానికి వెళ్లి అయన కనబడక తనకి భయపడి

పారిపోయాడనుకున్న హిరణ్యకశిపుడి అజ్ఞానం, దైవ కణం దొరగ్గానే సృష్టి రహస్యం తెలిసిపోయిందనుకుని

చంకలు గుద్దుకునే వాళ్ళ విజ్ఞానం దాదాపు ఒకటే. సృష్టి రహస్యాలు చివరికంటా కనుక్కున్నా (మనుకున్నా) భౌతిక దృష్టితో చూసేవాళ్ళకి కనపడేది విష్ణువు లేని వైకుంఠమే. మనిషిని రక్షించే దేవుణ్ణి చూడాలంటే, అణువుల్లో కాదు, ఋషిహృదయాల్లోనే వెతుక్కోవాలి.పాపం సైంటిస్ట్ లని  ఏమీ అనట్లేదు. వాళ్ళు చాలా

వరకూ న్యూట్రల్ ఈ విషయంలో. ప్రపంచ వ్యాప్తంగా సైంటిస్ట్ లలో 50% దేవుణ్ణి నమ్ముతారట. ఎప్పుడో

బి.బి.సి వెబ్ సైట్ లో చదివిన గుర్తు. అలాగే సైంటిస్ట్ లకి ఒక మంచి గుణం ఉంది. ఏ థియరీ కూడా ‘ గిది

ఫైనల్’ అని చెప్పరు వాళ్ళు.  ఎప్పటికప్పుడు సిద్ధాంతాలని సవరించుకోడానికి సిద్ధంగా ఉంటారు. ఆ

విషయంలో  మత విశ్వాసాల కన్నా సైన్స్ సిద్ధాంతాలే నయం. మనిషిని మభ్య పెట్టవు. డాగ్మా వుండదు.

ఐతే, ఆధ్యాత్మికతా ఉండదు. మానవత్వానికి లాభం తక్కువ. అదే దాంతో వచ్చిన సమస్య. ఆధ్యాత్మికతని

డాగ్మాటిక్ పద్ధతిలో అనుసరించమంటుంది మతం. అదే దాంతో వచ్చిన చిక్కు. మనసు దాహం

తీరనివ్వదు. రెండూ కాని మధ్యే మార్గం ఉంటుంది. రెండిటినీ సరైన పాళ్ళలో ఉపయోగించుకునేది.

అలాంటి పధ్ధతి దైవ కణం తో పరోక్ష సంబంధం ఉన్న ఒకాయన, హిగ్స్-బోసాన్ అనే పేరులో బోసాన్ కి

తన నామధేయాన్ని అరువిచ్చిన శ్రీ ఎస్. ఎన్. బోస్ జీవన విధానం లో కనబడుతుంది. ఈయన కనిపెట్టిన

లెక్కల ప్రకారం ప్రవర్తించే కణాల జాతికి చెందుతుంది దైవ కణం. ఈయనది ఋషి లాంటి వ్యక్తిత్వం.

ప్రచారానికి దూరం. అసలు సైన్స్ లో తన ప్రజ్ఞనీ , నైపుణ్యాన్నీ కూడా బయట పెట్టుకోలేనంత

నిరాడంబరత్వం. మరో సైన్స్ ఋషి, ఐన్ స్టీన్ వల్ల ఈయన ప్రతిభ వెలుగులోకొచ్చింది. ఐన్ స్టీన్ కి ఈయన

వ్రాసిన లెటర్ చూస్తేనే ఎంత వినయవంతుడు అనిపిస్తుంది. ఫ్రెంచి భాష చక్కగా మాట్లాడ గలిగీ మేరీ క్యూరీ

కి ఆ విషయం చెప్పలేకపోయిన మొహమాటస్తుడు. ఆవిడేమో, ఈ విషయం తెలియక, ఫ్రాన్స్ లో ఎక్కువ

కాలం ఉండి ఫ్రెంచి నేర్చుకుంటే తన దగ్గర రీసెర్చ్ చెయ్యొచ్చని చెప్పిందట. ఐతే మొహమాటం,

నిరాడంబరత్వం, యూరోపియన్స్ అంటే భయం (అని కొందరన్నారు) కాదు, ఆయనలో ఉన్నది

ఋషిత్వమే అనిపిస్తుంది. ప్రాచీన ఋషులు గొప్ప వైజ్ఞానికులని కొందరికి అనుమానం, కొందరికి

అభిప్రాయం, కొందరికి విశ్వాసం. ఎవరైనా రైటు కావచ్చు. నమ్మనివాళ్ళది మాత్రం ఒకటే ప్రశ్న. అంత

విజ్ఞానం ఉన్నప్పుడు మానవాళి అభివృద్ధికి ఎందుకు వాడలేదు, అలా రహస్యంగా ఎందుకు వుంచేసారు

అని. ఋషులు మనిషి మనసుని ఆధునికులేవరూ చూడనంత లోతుగా అధ్యయనం చేసారు. వాళ్లకి

తెలుసు ఎప్పుడో ఒక ఏ.క్యూ. ఖాన్ ఆవిర్భవిస్తాడని, వాణ్ణి కాపాడే పాకిస్తాన్ లు, వాడి మార్కెట్ గా నార్త్

కొరియాలు, ఇరాన్ లు ఎప్పుడూ ఉంటాయని. అంతే కాదు, ఇలాంటివాళ్ళని సృష్టించి,

రాజకీయావసరాలకి వాడుకుని , తరువాత శ్రీరంగనీతులు చెప్పే దేశాలూ ఉంటాయని.   మహాభారతంలో కొన్ని విషయాలు మోడరన్ సైన్స్ కి అతి దగ్గరగా ఉంటాయి. నిజంగా అప్పుడు ఇంత

టెక్నాలజీ ఉందేమో అనిపించేంత. ఉందని నమ్మేవాళ్ళు ఒంటికాలి మీద లేస్తే నేనేం చెయ్యలేను. Maybe,

ఉందేమో కూడా అనుకుని, అదే మాట పైకీ అనేస్తాను. జూల్స్ వెర్న్, హెచ్. జి. వెల్స్ లు తమ రచనల్లో

తమ కాలంలో ఊహించరాని ఎన్నో  ఫ్యూచరిస్టిక్ విషయాలు వ్రాసారు. సబ్ మెరైన్, స్పేస్ ట్రావెల్ లాంటివి.

మరి వ్యాసుడు టెస్ట్ ట్యూబ్ బేబీలు, ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్, క్లోనింగ్ … అన్నీ వ్రాసేసాడు. ఒకవేళ

ఇవన్నీ అప్పుడే తెలిసి ఉన్నా మనవాళ్ళు ఎందుకు అలా వదిలేసారు అంటే సమాధానం ఎస్. ఎన్. బోస్,

జే.సి. బోస్ వంటి వాళ్ళని చూస్తె అర్ధం అవుతుంది. సత్యాన్వేషణలో ఉన్న ఆసక్తి మనవాళ్లకి, ఐ మీన్

మన మొదటి తరం సైంటిస్ట్లకి, దాన్ని భౌతిక ప్రయోజనాలకి వాడుకోవటంపై ఉండదు. అలా చెయ్యడం

ఎలాంటి దుష్పరిణామాలకి దారి తీస్తుందో వీళ్ళ జీన్స్ కి తెలుసు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కన్నా క్వాలిటీ ఆఫ్

మాన్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే లైఫ్ క్వాలిటీ దానంతట అదే పెరుగుతుంది. కదా?

ఆంధ్రా హనుమాన్

ఇటీవల మీడియా అంతా హనుమంతుడంటే దారాసింగే గుర్తొస్తాడని రాస్తుంటే తెలుగు చిత్రాల హనుమంతుడు అర్జా

జనార్దన రావు జ్ఞప్తికొచ్చారు. 1926 లో పుట్టి 2007 లో గతించిన అర్జా తెలుగులో హనుమంతుడు

ప్రముఖంగా కనబడే చిత్రాలన్నిటిలో నటించారు. వీరాంజనేయ, సంపూర్ణ రామాయణం, రామాంజనేయ

యుద్ధం, ముత్యాలముగ్గు మొదలైన సినిమాల్లో ఆయన హనుమంతుడి దాస్య భక్తిని, వీరత్వాన్ని చక్కగా

బాలన్స్ చేసి నటించారు. నిజానికి హనుమంతుడి బాడీ లాంగ్వేజ్ దారాసింగ్ కన్నా అర్జా అద్భుతంగా

పట్టుకున్నట్టు హనుమ రామభక్తి తెలిసిన వాళ్ళందరికీ తెలిసిపోతుంది. సంపూర్ణ రామాయణంలో ఫుల్

లెంగ్త్ పాత్రలో జీవించిన ఆయన రామాంజనేయ యుద్ధంలో హనుమంతుడిగా కళ్ళనీళ్ళు తెప్పిస్తారు.

ముత్యాలముగ్గులో హనుమ అమాయకత్వాన్నీ అద్భుతంగా నటించారు. విలన్ని చంపుదామని గద

ఎత్తుతుంటే వాడు ఏదో మాట్లాడుతూ రామ రామ అంటాడు. అంతే, హనుమ గద దించి వెళ్ళిపోతాడు.

ఆయన భక్తురాలైన పాప ఏమిటి స్వామీ వాణ్ని వదిలేసావ్? అంటుంది. వాడు రామ నామం

జపిస్తున్నాడమ్మా అని ఈయన అమాయకంగా సమాధానం చెబుతాడు. ఈ పాత్రలో దారాసింగ్ ఎలా

చేసేవారో కానీ అర్జా మాత్రం లా జవాబ్. ఈయన వివరాలకోసం IMDB, తెలుగు వికీ లో చూస్తె కొద్దిగానే

ఉన్నాయి.

vedika

your forum for critical and constructive writings

నా కుటీరం

సమాజం, సాహిత్యం, సౌందర్యం

Kadhana Kuthuhalam

మరపురాని కథలను మళ్ళీ చదువుదాం.!

🌿🐢YVR's 👣Walks🐾With🌾Nature🐌🍄

🌻Look deep into nature, and then you will understand everything better 🌹 👨‍🔬Albert Einstein👨‍🏫

ఉహల ఊసులు

కవిత్వం, వంటా - వార్పు, మనసులో మాటలు, అక్కడ - ఇక్కడ

Prasad Oruganti

“I've learned that people will forget what you said, people will forget what you did, but people will never forget how you made them feel”— Maya Angelou

A Birder's Notebook

"Learning to bird is like getting a lifetime ticket to the theater of nature".

SEEN ALONG THE TRAIL

"I am at home among trees." ~ J.R.R. Tolkien

BUDGET BIRDERS

birding the world on a budget

Mike Powell

My journey through photography

Singapore Bird Group

The blog of the NSS Singapore Bird Group

MORGAN AWYONG

little truths . little deaths

Animals in South-East Asia

By Andrew Rhee (http://blog.daum.net/fantasticanimals)

Singapore Birds Project

Singapore birds information for birders by birders

Life is a poetry

Life is a beautiful journey. Live, discover, feel and fall in love with it

Why watch wildlife?

A site dedicated to watching wildlife

vedika

your forum for critical and constructive writings

నా కుటీరం

సమాజం, సాహిత్యం, సౌందర్యం

Kadhana Kuthuhalam

మరపురాని కథలను మళ్ళీ చదువుదాం.!

🌿🐢YVR's 👣Walks🐾With🌾Nature🐌🍄

🌻Look deep into nature, and then you will understand everything better 🌹 👨‍🔬Albert Einstein👨‍🏫

ఉహల ఊసులు

కవిత్వం, వంటా - వార్పు, మనసులో మాటలు, అక్కడ - ఇక్కడ

Prasad Oruganti

“I've learned that people will forget what you said, people will forget what you did, but people will never forget how you made them feel”— Maya Angelou

A Birder's Notebook

"Learning to bird is like getting a lifetime ticket to the theater of nature".

SEEN ALONG THE TRAIL

"I am at home among trees." ~ J.R.R. Tolkien

BUDGET BIRDERS

birding the world on a budget

Mike Powell

My journey through photography

Singapore Bird Group

The blog of the NSS Singapore Bird Group

MORGAN AWYONG

little truths . little deaths

Animals in South-East Asia

By Andrew Rhee (http://blog.daum.net/fantasticanimals)

Singapore Birds Project

Singapore birds information for birders by birders

Life is a poetry

Life is a beautiful journey. Live, discover, feel and fall in love with it

Why watch wildlife?

A site dedicated to watching wildlife

Discover WordPress

A daily selection of the best content published on WordPress, collected for you by humans who love to read.

Gangaraju Gunnam

What I love, and mostly, what I hate

చిత్రకవితా ప్రపంచం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

సాహితీ నందనం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

బోల్డన్ని కబుర్లు...

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

SAAHITYA ABHIMAANI

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

లోలకం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

కష్టేఫలి

సర్వేజనాః సుఖినోభవంతు

zilebi

Just another WordPress.com site

కష్టేఫలే

సర్వేజనాః సుఖినోభవంతు

అంతర్యామి - అంతయును నీవే

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

ఎందరో మహానుభావులు

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

వరూధిని

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

హరి కాలం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

The Whispering

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

Satish Chandar

Editor. Poet. Writer

పిపీలికం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

పని లేక..

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

గురవాయణం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

పక్షులు

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

ఆలోచనలు...

అభిమానంతో మీ ప్రవీణ.....

Vu3ktb's Blog

Just another WordPress.com weblog

ఆలోచనాస్త్రాలు

............... ప్రపంచంపై సంధిస్తా - బోనగిరి

abhiram

album contains photos of my thoughts & feelings

%d bloggers like this: