Category: Uncategorized

🌇(భ)వన🌿 భోజనం🌾 + ♬మైక్-టెర్రరిజం😈+ “మరలిరాదా మానవలోకం? తనకి దూరమైన🐦వనాల కోసం🐒…”


goodmorning1

మొన్న శనివారం పొద్దున్నే నా కెమెరాలో చిక్కిన ఆ కొంగ నా గుడ్ మార్నింగ్ మెసేజిలో M అక్షరంగా –

అందంగా చందంగా సలలితభావ నిష్యందంగా

ఒదిగిపోతే వచ్చిన చిన్ముద్రలు👌 చప్పట్ల👏తో వాట్సప్ దద్దరిల్లి అద్భుతంగా మొదలైంది వారాంతం. మీక్కూడా అదే గుడ్మార్నింగ్ చెప్పకుండా ఉండలేకపోతున్నా.

మా శ్రీమతి వాట్సప్ గ్రూప్‌లో లేడీస్ అంతా కల్సి ఆదివారం వనభోజనాలు అన్నారు. శని, ఆదివారాలు రాగానే పూటకి రెండు, మూడు గంటలు వనాల్లో వనచరాల వెంట కెమెరా పట్టుకు తిరగడం, ఆ నాలుగు పూటలూ పూటుగా తిని సోమ-టు-శుక్రవారం రొటీన్లో పడిపోడం అలవాటు పడుతున్న నాకు వనంలోనే భోజనం అంటే అంతకంటే ఏం కావాలి? ఏం అక్కర్లేదు. కానీ ఆ ఐడియాకి ఎగిరి గంతెయ్యాలనేం అనిపించలేదు. ఎందుకంటే చిన్నప్పుడెప్పుడో కట్టాసుబ్బారావు తోటకెళ్ళి చేసిన వనభోజనం, అప్పుడు తిన్న- కాదు ఎవరో తినిపించిన 😊 – కొబ్బరిపాల పరమాన్నం ఇప్పటి వరకూ మర్చిపోలేదు. ఇంకొన్నాళ్ళకి – అంటే మరీ ఎక్కువ రోజులేం కాదు ఇంజినీరింగ్‌‌ చదువులోకి వచ్చాకే – మా తోటలోనే తాతా-సమేతులై అమ్మమ్మ, నానమ్మలు, పిన్నిలు, బాబాయిలు, కజిన్స్… అందరితో స”మేతం”గా కలిసి చేసిన వన సమారాధనలు మర్చిపోడం అసలే కుదరదు. అంతకంటే మర్చిపోలేనిది ఫ్రెండ్స్ అందరం అటో పదమూడు, ఇటో పదమూడు కిలోమీటర్లు సైకిళ్ళు తొక్కి మా తోటలో లేలేత కొబ్బరినీళ్ళతో, ఇళ్ళనుంచి పట్టుకెళ్ళిన కారియర్ భోజనాలు పంచుకుని తిన్న ఒకేఒక్క సందర్భం. సహజ వాతావరణంలో, మరీ పల్లెపట్టుల్లో కాకపోయినా చిన్న చిన్న పట్నాల అంచుల్లో చేసిన అలాంటి వనభోజనాలకి ఫొటోజెనిక్ వనాల్లో, కాండోమినియం ఫంక్షన్ హాల్స్‌లో, ప్లాస్టిక్ ప్లేట్లలో, మాటిమాటికి స్మార్ట్ ఫోన్లు చెక్ చేసుకుంటూ చేసే (భ)వనభోజనాలు ఎలా సరితూగుతాయి? అంచేత ఎగిరి గంతెయ్యలేదు. ఐనా, ప్రవాసమహిళాలోకం ఈసారి ఎలాగైనా ఎప్పుడూకంటే బాగా పూర్వపు వనభోజనాలకి ఇంచుమించు సరిసాటి అయ్యేలా నిర్వహిస్తాం అని కంకణాలు కట్టుకుని బయల్దేరేప్పటికి వాళ్ళని ప్రోత్సహించాలన్చెప్పి కంకణం కట్టుకోకుండానే నేనూ బయల్దేరా. అన్నమాట నిలబెట్టుకుంటూ సంసారాల్లో స్ట్రెస్ మేనేజ్ చెయ్యడం ఎలా అనే అంశం మీద సైకియాట్రీతో పాటు సంస్కృతం చదువుకుని సనాతన సంస్కృతి పాటిస్తున్న ఓ అచ్చ తెలుగు డాక్టర్ గారి చేత మంచి ప్రసంగం ఇప్పించారు. ఆయన చెప్పిన విషయాల్లో పాశ్చాత్యసంస్కృతి గురించి, విదేశీయుల మెటీరియలిజం గురించి మనలో సాధారణంగా వుండే అపోహల్లో ఒకదాని గురించి ఆయన చెప్పినది – బహుశా అది నేనూ గమనించి వుండడంవల్లనేమో – నాకు బాగా నచ్చింది. పెద్దవాళ్ళైన తల్లిదండ్రులని చూసుకోవడంలో కొందరు పాశ్చాత్యులు (& చైనీయులు కూడా) చూపించే శ్రద్ధా-ప్రేమా అత్యద్భుతం. ఉద్యోగాలు వదులుకున్నవాళ్ళూ, పెళ్ళిళ్ళు మానుకున్నవాళ్ళు, నర్సులు/ హాస్పిటల్స్ సంరక్షణలో కాకుండా తమంతట తామే పెద్దల్ని చివరివరకూ అంటిపెట్టుకు కాపాడిన వాళ్ళు అనేకమంది అని చెప్తూ వాళ్ళలో కొందరు ఇదే విషయాన్ని మన సంస్కృతినుంచి నేర్చుకున్నామని చెప్పడం ఇంకా నచ్చింది. కారణం – మన సంస్కృతి గురించిన గర్వం + దాన్ని గుర్తించిన విదేశీయుల భావవైశాల్యంపై గౌరవం. విచిత్రంగా – గర్వం, గౌరవం – రెండు పదాలూ గ,ర,వ అనే అక్షరాలనుంచే పుట్టాయి. పరస్పర గౌరవం ఉన్నచోటే గర్వించడం అనేదానికి అర్ధం అని చాటుతున్న “అక్షర”సత్యమా ఇది? ప్రసంగం అయిన వెంటనే భోజనాలు. అచ్చతెలుగు వంటకాలు – ఇంక్లూడింగ్ అవర్ హోం-మేడ్ (తెలుగు, తెలుగు !!) – సృష్టిస్థితిలయాలన్నీ స్వగృహంలోనే మా చేతుల్లో, సీసాల్లో, నోళ్ళలో (respectively 😆) పొందే – శాకంబరీ దేవీ వరప్రసాదంతో సహా – వడ్డించేశారు. భోజనాలయ్యే సమయానికి ఔత్సాహిక, వర్ధమాన, స్వయంప్రకటిత గాయనీగాయకులు గళాలు సవరించుకున్నారు. ఒకాయన ఘంటసాల భగవద్గీతని అందరికీ తన గళంలో వినిపించాలని కుట్ర చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. అప్పుడే భోజనాలకి దూరంగా వున్న వనాల్లోంచి వడ్రంగిపిట్ట కూత పెట్టింది. తీతువుపిట్ట బిజీగా వుండి వడ్రంగిపిట్టకి తన ఉద్యోగ బాధ్యతలు అప్పచెప్పిందా అనిపించింది, రానున్న “ఉపద్రవా”న్ని సూచిస్తూ ప్రకృతి స్తంభించిందా అనిపించేలా పొద్దున్నించీ పడుతూ అందర్నీ చల్లగా ఉంచిన వాన ఆగింది. పావుగంటలో వాతావరణం వెచ్చబడింది. అసంకల్పిత ప్రతీకార చర్యగా చెమటలు కారడం మొదలైంది. ఈ శకునాలకి తోడు వనదేవతలు “ఏఁవఁర్రా! భోజనాలు చేసారు. మరి వనాలు చూడరా?,” అంటూ ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది. అంతలో పొద్దున్న (భ)వనభోజనసీమలోకి ప్రవేశిస్తూనే కనబడిన ఓ ముద్దొచ్చే దృశ్యం – ఫోటో తీసుకున్నా – గుర్తొచ్చింది. నాలుగేళ్ల పసివాడికి వర్షం తప్పించుకోడానికో మరిదేనికో గడ్డిలోంచి బయటికి వచ్చి గచ్చునేల మీద  ఆఘమేఘాల మీద ఆదరాబాదరాగా వెళ్ళిపోతున్న నత్త కనిపించింది. వాళ్ళ నాన్నతో కలిసి దాన్ని చూస్తూ, ఏవేవో అడుగుతూ ఎంజాయ్ చేస్తున్నవాడి బుల్లి బుర్రలో చిన్న అందమైన ఆలోచన మెరిసింది. ఆ నత్తకి ఇతర జంతువులతో స్నేహం కలపాలని. తనతో తెచ్చుకున్న బుల్లి బుల్లి అడివిజంతువుల బొమ్మలు నత్త చుట్టూ పెట్టాడు. వాటి “కబుర్లూ, ఆటలూ” చూస్తూ సంబరపడుతున్నవాడిని చూడగానే వనభోజనం చేసిన ఫలితం, పుణ్యం, ఆనందం అన్నీ ఒక్కసారే కలిగేసాయి.

snail & animals

వనభోజనాల్లో జనం, భోజనంతో పాటు వనం తప్పనిసరి అని అవేమీ తెలియని పసివాడి చేత “మరలిరాద మానవలోకం? తనకి దూరమైన వనాల కోసం…” అంటూ ప్రకృతిమాత ఇచ్చిన సందేశమా ఇది అనిపించింది.

అదే అదునుగా తీసుకుని చెట్టూ పిట్టా పురుగూ పుట్రాలని ఒకసారి పలకరించి వచ్చే వంకతో అక్కణ్ణించి బయటపడితే మైక్-టెర్రరిజం నుంచి తప్పించుకోవచ్చని చెవులూ, కళ్ళూ, కాళ్ళూ, వాటికి వంత పాడుతూ కెమెరా సణుగుడు మొదలు పెట్టాయి. ఎప్పుడు బయల్దేరతానా అని చెప్పులు కూడా ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. ఇలా అనిపించడాన్నే కన్వీనియెంట్ థింకింగ్ అని, యాంటీ-సోషల్ థింకింగ్ అనీ కొందరంటారు. కానీ ఆత్మరక్షణ మన జన్మహక్కు. వాళ్ళ మాటలస్సలు పట్టించుకోకూడదు మనం. చెట్లు, చేమల్లో తిరిగేప్పుడు దోమలు, చీమలు తెగ కుడతాయి. మైకు-తీవ్రవాదుల బెడదతో పోలిస్తే వాటి కాట్లు ఫిష్-స్పా లో చిరుచేపలు పాదాల్ని గిలిగింతలు పెట్టినట్టు వుంటాయి. సో, వనభోజనంలో సగానికి అంటే భోజనానికి, టిక్కు పెట్టేసి, మిగిలిన సగం, వనవిహారానిక్కూడా టిక్కు పెడదామని బయల్దేరిపోయాను, వడ్రంగిపిట్ట కూత వినబడిన దిశగా …”వెడలెను కెమెరాపాణి, అడవులబడి, పక్షుల వెంబడి…” అంటూ వనదేవతలు పేరడీలు కడుతుండగా…

వనసంచారం నుంచి తిరిగి భవనసీమల్లోకి వస్తుంటే రెండు అనుభవాలు ఒకటి కాస్త కామెడీది, రెండోది కార్తీక వనభోజనానికి ఆహ్లాదకరమైన ముగింపు అనిపించే ఆధ్యాత్మిక స్పర్శ (=Spiritual Touch) వున్నది కలిగాయి. అవి వచ్చే టపాలో.

బై4నౌ 😊🙏

***

 

 

​గురుతుల్యులు, మిత్రులు,  బ్లాగ్బంధువులందరికీ …


గురుతుల్యులు, మిత్రులు,  బ్లాగ్బంధువులందరికీ  –

మీకు, కుటుంబసభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.🌷🙏

కాన్సెప్ట్ : అగ్రహార 😋/ ట్విస్ట్‌లు : అల్పాహారస్య😡 / క్లైమాక్స్ : ఫలహారేభ్యః 👀😌😢


(1)

టపా టైటిల్ ఇంట్రెస్టింగా ఉందా ? ఉండే వుంటుంది. కానీ ఏ పని చెయ్యాలన్నా గణపతిపూజ చెయ్యాలి కదా, అలాగే టైటిల్ టాపిక్ చదివేముందు ‘కృతయుగం’ నాటి ఓ చిన్న రసగుళిక –

ఆ మధ్య ఊరికే పాత పుస్తకాల కోసం గూగులిస్తుంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు అనీ బిసెంట్‌ గతించినప్పుడు రాసిన నివాళి ఒకటి దొరికింది అందులో చిన్న ముక్క ఇది – 

SP S SS1

దశాబ్దాల క్రితం – అంటే గోల్డ్ అని మనం అనుకునే ఓల్డ్ రోజుల్లోనే – ఆయనకి ఎర్ర అండర్‌లైన్ చేసిన ముక్కలు, పంచ్-లైన్స్ అనాలి నిజానికి, ఎందుకు తట్టాయో అనిపించింది. అనుభవాలూ-జ్ఞాపకాలూనూ మొత్తం త్వరగా చదివేయ్యాలి. వీలైతే, దొరికితే, ఆయన ఇతర రచనలు కూడాను. అప్పుడు కానీ ఆయన ఉద్దేశం అర్ధం కాదేమో. 

(2)

👇👇👇ఇదందరికీ అర్ధం అవుతుందా 😉? ఏమో! కాకపోయినా నా పూచీలేదండోయ్ –

కధ : శూన్య / బోరు                   స్క్రీన్ ప్లే : శూన్యస్య / బోరుస్య   దర్శకత్వం : శూన్యేభ్యః / బోరేభ్యః
మాటలు : మసాలా పాటలు  : మసాలాస్య     ఫైటులు   : మసాలేభ్యః
పాత్రలు : మాస్ పాత్రధారులు : మాస్‌స్య నటన : మాస్‌భ్యః
కాన్సెప్ట్ : అగ్రహారం ట్విస్ట్‌లు : అల్పాహారం క్లైమాక్స్ : ఫలహారం
కామెడీ : ఫార్ములా వెరైటీ : ఫార్ములాస్య క్రియేటివిటీ : ఫార్ములాభ్యః
సీన్స్ (కొన్ని) : అసభ్య స్కిన్ షో : అసభ్యస్య సందేశం : అసభ్యేభ్యః

మెయిన్ విలన్ మాత్రం : సూపర్ 👌– సూపరుస్య 👌👌– సూపరేభ్యః👌👌👌

🙈 🙉 🙊 

(3)

ఇంతే సంగతులు, బై4నౌ చెప్పేసేముందు కాస్త భగవన్నామ స్మరణం –  

ఆపదమొక్కులవాడా! రామనాధా!! కోవిందా!!! కోవింద!!!!

సారీ, సారీ, అది 👆అచ్చుతప్పు … టైపో … పొద్దున్నే న్యూస్ పేపర్ చదివిన ఎఫెక్ట్ అనుకుంటా 🙈 🙉 🙊 ………..

ఇప్పుడు సరిగ్గా – 

ఆపదమొక్కులవాడా ! అనాధనాధా!! గోవిందా!!! గోవింద!!!

🙏🙏🙏

 

లక్షలకోట్ల టన్నుల అందాన్ని  ఒకచోట  రాశి పోస్తే 🤔 ? 🌱🌻🏖అది  బ్రెజిల్ అవుతుంది 🌿🌳🏞 – అక్కడ ఒక వారం 


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

🌹🙏🌹 జీవితం ఉగాదిపచ్చడి తిన్నంత వీజీ…🌹🙏🌹


ఉగాది

మనం చేసుకునే పండగలన్నిట్లోకీ ఉగాది మహాగొప్ప పండగ. అంటే అది అతిశయోక్తి అవుతుందా? ఇంకే పండగనాడూ జరగని ఒక అద్భుతం ఆ రోజు జరుగుతుంది. అందుకని అది అతిశయోక్తి కాదు. జనం మామూలుగా సామాన్యుడు సామాన్యుడంటూ ముద్దుగా పిల్చుకునే సామాన్యుడు ఆ అద్భుతాన్ని చేసి చూపిస్తాడు. ఎలా అనేకదా ఇప్పుడు ప్రశ్న?

వినాయకచవితికి లడ్డూల వేలం, రికార్డ్ సైజు విగ్రహాల వెర్రి వెరసి వేలంవెర్రిగా లౌడ్‌స్పీకర్ల రొదలో తందానాలాడే సామాన్యుడు ఉగాదిరోజు, “మావిచిగురు తినగానే కోయిల కూసేనా? కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా?,” అని మనసులోనైనా, మౌనంగానైనా తర్కించక మానడు. ఋతువు మారడంలో వున్న మాజిక్ అది. 

దీపావళికి   చిటపటలాడే టపాకాయలపై మోజుతో మినుకు మినుకు దీపాల చిరదీవెనల్ని చిన్నచూపు చూసే సామాన్యుడే ఉగాదిపండక్కి ఓరకంటనైనా జ్ఞానదీప దర్శనం చేస్తాడు. అంటే, అమ్మ, భార్య, అక్క, చెల్లి, కూతురు – ఎవరి చేతినుంచి వేపపువ్వు పచ్చడి అందుకున్నా ఒక్కసారిగా చిన్ననాట తన వూళ్ళో జరుపుకున్న మొదటి ఉగాది, ఆ వాతావరణం, అప్పుడు కోయిలతో పడిన పోటీలనుంచీ ఈ రోజు ఈ క్షణం వరకూ నడిచిన జీవనప్రయాణం స్మృతిపధంలో మెలిగి ఆ అనుభవాలసారాన్ని ఉగాదిపచ్చడి రుచిలో మళ్ళీ ఒకసారి అనుభవిస్తాడు. 

సంక్రాంతి సీజన్లో కోర్ట్ ఆర్డర్లు కూడా లెక్కచెయ్యకుండా కోడిప్రాణాలతో చెలగాటం ఆడి, ఓడినా గెలిచినా కోడిని పకోడీ చేసిగానీ వదిలిపెట్టని సామాన్యుడు (వీడు నిజంగా సామాన్యుడేనా? ఏమో మరి). అటువంటి అసమానసామాన్యుడు ఉగాదిరోజు కోయిలకూతకి పులకరిస్తాడు. దానితో పోటీపడి రెచ్చగొడుతూ జుగల్ బందీ చేస్తాడు. అది రెచ్చిపోయి గొంతు బొంగురుపోయేవరకూ స్వరం పెంచుతుంటే ముచ్చటపడతాడు. అమాయకపుకోడికి పకోడీ-మోక్షం ఇచ్చేసే ఆ సామాన్యుడే గూటిదొంగ, సహజ ఆజన్మకబ్జాదారు అయిన కోయిలకి ఉగాదికవులతో కలిసి వసంతుడిచ్చే క్రమబద్ధీకరణ ఒప్పేసుకునే  (అ)సామాన్యుడు.

శివరాత్రికి ఒకే టికెట్టు మీద రెండు సినిమాలు చూసిమరీ జాగరణం చేసే సామాన్యుడు ఉగాదినాడు  పంచాంగం వినడానికి సినిమాని పక్కకి నెడతాడు. 

ఇంతెందుకు? ప్రతి పండక్కీ ఎవరో ఒక ఇన్‌ఛార్జి దేవుడుంటాడు. ఉగాదికి మాత్రం ఎవరి ఇష్టదైవం వాళ్లకి ఇన్‌ఛార్జి. నిజానికి ఉగాదిపచ్చడిలో షడ్రుచులతో పాటు కలిపే ఏడోరుచిని, అదే ఫిలాసఫీని, అర్ధం చేసుకుంటే భగవద్గీత చదివినట్టే, విశ్వరూప సందర్శనం అయినట్టే కాదూ?

ఏడాదంతా ఆర్తి లేక అర్ధార్ధి స్టేటస్‌లో సెటిలైపోయే సామాన్యుడు ఉగాదికి జ్ఞాని/జిజ్ఞాసువు అవతారం ధరిస్తాడు. తెలిసో తెలీకో – “అచ్చతెలుగు”లో చెప్పాలంటే – కాన్షస్‌లీ (or) అన్-కాన్షస్‌లీ జ్ఞానోదయం పొందుతాడు. ఉగాదిపచ్చడి రూపంలో జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలని, సుఖదుఃఖాలని, తప్పొప్పులని సమదృష్టితో స్వీకరించి “ఆ విధంగా ముందుకుపోవాల్నని” మళ్ళీ ఒకసారి నిశ్చయించుకుంటాడు. మిగిలిన పండగలన్నిట్లో మామూలు మోక్షంలాంటి చిన్నచిన్నఅవసరాలనుంచీ అభిమాన హీరో సినిమా హిట్టవ్వాల్సిన మహావసరం వరకూ ఆ పండగకి కనెక్ట్ అయ్యివున్న దేవీదేవతలకి అర్జీలు పెట్టుకోడం మామూలే. ఉగాదినాడు మాత్రం ఉగాదిపచ్చడిలో ఆరురుచుల్ని ఆరువిధాల జీవితానుభవాలుగా స్వీకరిస్తాడు. వసంతాగమనాన్ని, పంచమస్వరంలో కోకిలారవాన్ని ఆస్వాదించినంత అనందంగా ఉగాదిపచ్చడి సాంప్రదాయాన్ని ఆహ్వానిస్తాడు. జీవితం అంటే ఉగాదిపచ్చడి తిన్నంత/చేసినంత వీజీ కాదని తెలిసినా ఈ విధంగా కొత్త సంవత్సరంలో రాసిపెట్టివున్న ఆదాయ-వ్యయ-రాజపూజ్య-అవమానాదులకి మెంటల్‌గా ప్రిపేర్ అయిపోతాడు. భారతీయుడిలో అంతర్లీనంగా వుండే తాత్వికత తనలోనూ ఉందని ఓసారి గుర్తు చేసుకుంటాడు. ఏ పూజలూ, ప్రవచనాల సహాయం లేకుండానే ఆ అనుభూతిని పొందుతాడు. ఇది అద్భుతం కాదనగలమా? దేర్‌‌ఫోర్, మనం చేసుకునే పండగలన్నిట్లోకీ ఉగాది మహాగొప్పపండగ.

🌿 🌾 అందరికీ ఉగాది శుభాకాంక్షలతో …🌿 🌾

🌹🙏🌹

20170328_201110.jpg

టీకప్పులో ట్సునామి09-కుజగ్రహంపై పక్కాఇళ్ళు, మెగాహీరో ఆడియోఫంక్షన్‌కి పవన్‌కళ్యాణ్ ఎందుకెళ్ళలేదు?, etc, etc.


YVR's అం'తరంగం'

లాస్ట్‌వీక్ న్యూస్ పేపర్స్‌లో ఒక వార్తొచ్చింది. వార్తంటే హత్యలు, అక్రమసంబంధాల్లాంటి రెగ్యులర్ వార్తలు కాదు. (ఏం చేస్తాం? వీటిని వార్తలు అనాల్సిన ఖర్మ పట్టింది. న్యూస్ పేపర్ ఆన్‌లైన్ ఎడిషన్ చూస్తే వార్తలంటే ఇవే అన్నట్టు చూపిస్తున్నారు మరి. టీవీ ఛానెల్స్ ఐతే… నో కామెంట్స్.) ఇంతకీ ఇక్కడ డిస్కస్, ఐ మీన్,  – ఛీ..ఛీ..  ఆంగ్లమ్ముక్కల్లేకుండా గట్టిగా ఒక వాక్యం రాయడం గగనమై పోతోంది, అహో! ఆంధ్రభోజా శ్రీకృష్ణదేవరాయా, ఏమి చేతునయా?

ఇంతకీ ఇక్కడ చర్చించబోయే అంశం ఏంటయ్యా అంటే –

MARS housing

Photo courtesy: Youtube 

ఈమధ్య ఖగోళ శాస్త్రజ్ఞులకి కుజగ్రహం మీద వేలాది భవనాల్లాంటి నిర్మాణాలు కనిపించాయిట, టెలిస్కోపుల్లో. పై ఫోటో వాటిదే. కుజుడిపై బుద్ధిజీవులున్నారనే సంగతి ఇంకా ఊహక్కూడా అందని పరిస్థితిలో నిర్మాణం అనేమాట వాడడం కరెక్టు కాదు. నిర్మాత ఒకడుంటేనే కదా ఇళ్లయినా, సినిమాలైనా నిర్మాణం అయ్యేది? కుజుడి మీద జీవరాశి ఉండే అవకాశం లేదనుకుంటున్న ఆర్డినరీ మనిషి ఇలాగే అనుకుంటాడు. కానీ యూఎఫ్‌ఓలు, ఫ్లయింగ్ సాసర్లులాంటివి ఉన్నాయని నమ్మేవాళ్ళు అంత తేలిగ్గా కన్విన్స్ అవ్వరు.  వాళ్ళు తెలుగువాళ్ళయితే కన్విన్స్ అవ్వరు అనేబదులు సమాధానపడరు అనేవాణ్ణే కానీ వాళ్ళు తెలుగేతరులు. ఈ దేశంవాళ్ళే కాదు. ఎందుచేతో మనదేశంలో, అందునా తెలుగురాష్ట్రాల్లో యూఎఫ్‌ఓల్లాంటి మిస్టరీల మీద దృష్టి పెట్టేవాళ్ళు తక్కువే అనుకుంటా.     

కొత్తగా రిలీజయ్యే సినిమాలేంటి?

సంక్రాంతికి బాబాయ్-అబ్బాయ్‌ల సినిమాలకి క్లాష్ వస్తోందా?

View original post 691 more words

ఐ సఫర్, దేర్-ఫోర్ ఐ హావ్ మనసు!! 😂😂😂


మనసు మరణించే వరకూ ప్రశాంతికై ప్రయాస తప్పదు.

అవును తప్పదు, లేపోతే మనసుకవి “మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే..ఏ..ఏ.. ఏ ..,” అనెందుకు విలాపిస్తాడు? ఆ మాటని ఊరుకోలేదు, మనసుని మనిషికి దేవుడు విధించిన శిక్షగా, జీవుడిపై దేవుడు తీర్చుకున్న కక్షగా తేల్చి చెప్పాడు.

I think, therefore I am (నేను ఆలోచిస్తున్నాను, కనక నేను ఉన్నాను) అని రినీ దెకార్త్ తన ఉనికి నిజమేనని కన్‌ఫర్మ్ చేసుకున్నట్టు, మనసు పని చేసేవాళ్ళు – I suffer, therefore I have మనసు అనుకోవచ్చేమో  🤔😂 . (అలా అనుకుంటే నాకు బోల్డంత మనసున్నట్టే – చాలా మందికిలాగే. అది వేరే విషయం.)

హాయిగా జాలీగా బతకాలంటే మనసు లేకుండా ఎలా? మళ్ళీ అదే టైములో మనసు పనిచేస్తే – ఊరికే పన్జెయ్యడం కాదు స్పందిస్తే – బతకడం కష్టం. ఏంటో గోల? ఒక్క వాణిశ్రీని మిస్సయిపోతున్నందుకే ప్రేమనగర్ నాగేశ్వర్రావ్ అంత పెద్ద పాట ఆత్రేయగారితో రాయించుకుని ఘంటసాల గొంతు అప్పు తీసుకుని పాడి మరీ విషం తాగేసాడే అలాంటిది –

కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానిది, ప్రపంచం బాధ శ్రీశ్రీది అనిపించుకుని పతితుల, భ్రష్టుల, బాధాసర్పదష్టుల కోసం పరితపించిన శ్రీశ్రీ గారి మనసు ఎంత సఫర్ ఐతే ఆ మనసులోని భావాలు కలంలోంచి ప్రవహించి జగన్నాధ రధచక్రాల్ని కదిలించాయో  !?!🤔 ఐనా ఏం లాభం? ఈ భూమ్మీద ఎంతమంది శ్రీశ్రీలు ఎన్ని ప్రాంతాల్లో ఆవిర్భవించి పీడితజనం కోసం ఎంత పరితపించలేదు, వాళ్ళందరి ప్రయాసల ఫలితం మనిషికి ఏ మాత్రం దక్కింది. కారే రాజులు, రాజ్యముల్ గలుగవే… అన్నట్టే కారే కవీశ్వరుల్, కదిలించరే హృదయముల్? వారేరీ? వారి కవిత్వ తత్వ ప్రభావముల్ నేడేవీ? అనుకోవాల్సిన రీతిగానే ప్రపంచం మిగిలిందేం? జగన్నాధరధం ఉన్నచోటే ఆగిందేం? కారణం మనసే కదూ? వ్యక్తుల హృదయాల్లో అశాంతిగా, అసంతృప్తిగా, అందని ద్రాక్షపళ్లు పులుపు అనుకోలేని అశక్తతగా, తలకి మించిన భారం తలకెత్తుకునే అత్యాశగా  మెదులుతున్న మనసే కదూ? అదే కదూ వ్యష్టి నుంచి సమిష్టికి పాకి సమాజాన్ని అభద్రతాభావంలోకి, అనైక్యతలోకి నెడుతూ వ్యక్తికి వ్యక్తికి అంతరాన్ని పెంచుతూ అంటరానితనాన్ని పెంపొందించుతూ వున్నది? అదే అయితే మనసు పెట్టే పరుగులు ఆగాల్సిందే. దాని చాంచల్యం మరణించి, మనసు బుద్ధిలో, విచక్షణాజ్ఞానంలో, అంతరాత్మలో లీనం అవ్వాల్సిందే. అప్పుడే మనిషికి ప్రశాంతి. అలాంటి ప్రశాంతిని పొంది, మనీషిగా మారిన మనిషి ఒకరు ప్రశాంతిని పొందటం ఎలా అని అడిగిన వ్యక్తితో ఇలా అన్నారు –

మీరెప్పుడూ  I want Peace, I want Peace అని దేవులాడుతూవుంటారెందుకు? I (అహంకారం), want (కోరిక) లేనప్పుడు మిగిలేది Peace (ప్రశాంతి) కాదా?

So, మనసు = I (అహంకారం) + want (కోరిక)

ఆ మనసు అంతరించినప్పుడే ప్రశాంతి. భౌతికమరణంతో కాకుండా మనసుకి మోక్షం ఇచ్చి, బుద్ధిని అంతరాత్మని పని చెయ్యనిస్తే ప్రశాంతిని ఎంజాయ్ చెయ్యొచ్చు, ఇతరుల్నీ ప్రశాంతంగా బతకనివ్వచ్చు, మన అశాంతి వాళ్లకి ట్రాన్స్‌ఫర్ చెయ్యకపోవడం ద్వారా. ఎవరి ప్రశాంతిని వారే శోధించుకోవాలి, సాధించుకోవాలి. 🙏🙏🙏

thappadu