Category: LOVE4EARTH

మొన్న జూన్5th న ‘జులాయి’ సినిమాలో రాజేంద్రప్రసాద్ చెప్పిన త్రివిక్రమ్ డైలాగ్ గుర్తొచ్చింది


If you can’t be in awe of Mother Nature, there’s something wrong with you – Alex Trebek

జూన్5thన వర్ల్డ్ ఎన్విరాన్‌‌మెంట్ డే అని కొంచెం లేటుగా గుర్తొచ్చింది. వాట్సప్ మిత్రులందరికీ నిన్న మా ఆఫీస్ బిల్డింగ్ పక్కనున్న పార్కులో కనబడ్డ ఆ 👇 –

poobaala

పూబాలతో గ్రీటింగ్స్ పంపే దాకా బ్లాగ్‌‌లో కూడా ఒక ఎన్విరాన్‌‌మెంటల్ టపా ఒకటి పోస్ట్ చెయ్యాలని గుర్తురాలా.  ఎన్విరాన్‌‌మెంటల్ అనుకోగానే ‘జులాయి’ సినిమాలో రాజేంద్రప్రసాద్ డైలాగొకటి గుర్తొచ్చింది. ఒక దొంగతో నిజం చెప్పించడానికి హీరో వాడి చేతిలో ఒక పెన్ను గుచ్చేస్తాడు. రాజేంద్రప్రసాద్ పోలీస్ కమిషనరే అయినా పోలీస్ పన్లు ఎప్పుడూ చెయ్యని శాల్తీ కావడంతో జడుసుకుంటాడు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పుణ్యమా అని మాంఛి డైలాగ్ వదుల్తాడు – కుర్రాడు మరీ వయోలెంట్‌‌గా వున్నాడు. వీడికి పువ్వుల్నీ, పిల్లల్నీ చూపించండ్రా!! – అని.

మాటల మాంత్రికుడి డైలాగులో వున్న మంత్రం ఏంటోగానీ ఆ పూబాల కాస్తా ఈ👇 మురిపాలబాలయ్యింది.

muripaala bala

మళ్ళీ వాట్సప్పుకి పని పడింది. నిజంగా ఆ డైలాగులో “మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు…” అనే నైరాశ్యాన్ని పోగొట్టే మందుంది. ఎన్విరాన్మెంటల్ హెల్త్‌‌లో దాగిన మెంటల్ హెల్త్ రహస్యాన్ని విప్పి చెప్తుంది.

Every flower is a soul blossoming in nature – Gerard De Nerval 

ఒక పువ్వుని పూజ కోసమైనా కొయ్యడానికి మనసొప్పని చేతులు యాసిడ్ అటాక్‌‌లు చెయ్యగలవా?

ఎట్ లీస్ట్ అటాక్ చేసేముందు సందేహిస్తాయేమో, ఆ సందిగ్ధంలో అనర్ధం ఆగిపోయే అవకాశం ఉంటుందేమో!?!

DSC_0451

తల్లిపక్షి అందించిన పండుని గారంగా అందుకుంటున్న ఆ పిట్టపిల్లలో అమ్మ చేతి గోరుముద్దలు తిన్న తనని చూసుకున్న కుర్రాడు ఇంకో తల్లి బిడ్డని నొప్పించగలడా?

ఒక క్షణంంపాటైనా తటపటాయింపుకి గురై మనసు మార్చుకుంటాడేమో!?!

DSC_0413-1

సాలెగూడులో చిక్కి విలవిల్లాడుతున్న అందాల సీతాకోకచిలుకని చూసి ఒకే ఒక్కసారి ఒక పసిమనసు ద్రవిస్తే అది మళ్ళీ ఎవరి స్వాతంత్రాన్నైనా, ఎవరి ప్రాణాలైనా హరించడానికి ఒడిగట్టగలదా?

మనసులో ఒడిగట్టినా చేతల్లోకి దిగకుండా ఆగుతుందేమో!?!

DSC_0257

పూవు-తేనెటీగల అవినాభావ సంబంధంలో రెండు వేరు వేరు జీవులుగా కనిపిస్తున్న ఏకత్వాన్ని, విభిన్న రూపాల్లో కనిపిస్తున్న వాటిలో అంతర్లీనంగా స్ఫురించే అద్వైతతత్వాన్ని ఆకళింపు చేసుకున్న యువతలో వ్యతిరిక్త భావాలు, పరస్పర విద్వేషాలు ఎలా పుడతాయి?

ఏకం సత్ విప్రాః బహుదా వదంతి అని ఎవరి భాషలో వాళ్ళు అర్ధం చేసుకుంటారేమో!?! ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారేమో!?! 

DSC_0170

సొంతంగా విత్తు నాటి పెంచిన వృక్షం పూలు పూసి, కాయలు కాసి కొత్త చెట్టుకి జన్మనివ్వడం చిన్నప్పుడే అనుభవంలోకి తెచ్చుకున్నవాళ్ళు  తమని కని పెంచినవాళ్ళ ప్రేమానురాగాల్ని వమ్ము చేసి ఆత్మహత్యలకి పాల్పడగలరా? నేరస్తులుగా మారగలరా?

పువ్వుల్ని, పొలాల్నీ, తోటల్నీ చూస్తూ –

తూనీగలతో, తువ్వాయిలతో ఆడుకుంటూ –

పంటకాలవకి అడ్డంగా వేసిన తాటి దుంగ మీద అడుగులో అడుగేసుకుంటూ నడుస్తూ –

తొలకరి జల్లు నేలనంటగానే వెలువడే మట్టివాసన పీలుస్తూ –

నల్లటి వానమబ్బుల క్రిందగా, పచ్చటిపైర్ల మీదగా అందంగా, మందంగా పయనించే తెల్లకొంగల బారుల్ని చూసి పరవశిస్తూ –

బడికెళ్ళే ఛాన్సే లేని పిల్లలకి ఆ పైన చెప్పినవన్నీ ఎలా అనుభవంలోకి వస్తాయి?

Look deep into nature, and then you will understand everything better – Albert Einstein 
పర్యావరణ పరిరక్షణ అంటే చెట్లు పెంచడం, వన్యప్రాణుల్ని కాపాడ్డం మాత్రమే కాదేమో వాటితో మనిషి తాదాత్మ్యం చెందడం కూడా అవసరమేమో?

అందుకే ఎన్విరాన్‌‌మెంటల్ లో మెంటల్ కూడా ఇమిడిపోయివుంది.

ఎన్విరాన్‌‌మెంటల్ పొల్యూషన్, మెంటల్ పొల్యూషన్ రెండూ ఒకేసారి విజృంభిస్తున్న తరుణంలో వనాలు పెంచడంతో పాటు పిల్లల చదువులు ధనం కన్నా వనం ముఖ్యమనిపింపజేసేలా వుంటే ఎంత బావుండు!!??!!

Study nature, love nature, stay close to nature. It will never fail you – Frank Lloyd Wright

🐦🐒 🐵🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴

ప్రకృతి ఒడి – అది ఒక బడి Battering Bee-Eater & a Fluttering ButterFly


TEACHER NATURE

When I saw that blue throated bee eater battering an unfortunate bee (or a dragon fly) I thought, “End of one journey!!.”  The phrase became a quote – “End of one journey is the beginning of another,” when I noticed that the bird was a fledgling. That was not supposed to be the end of the story. While taking care not to scare the bird off I was absorbed in observing the bird through the lens and was clicking the camera off trying to capture all the battering bee-eater’s postures. Thus I had no idea that there was a Tawny Coster on the scene. I realized the presence of the beautiful butterfly flying past the colorful bee-eater while viewing the picture on my laptop at home. I don’t know if the TawnyCoster had a close shave for it escaped the attention of not one but two birds – one busy with the Just-Caught and the other, the one some distance away on the same perch, scanning the thin air for the Yet-To-Be-Caught. The thought that the butterfly had a lucky escape caused my quote to expand. It became, “End of one journey is the beginning of another and an extension of yet another.” I felt satisfied that I got some David Attenborough-style expression to display the frozen colorful drama with. Once I started decorating the photo with the words my thoughts instinctively began to connect the natural world with our own world and couldn’t help but add this somewhat sad observation – “End of one journey is the beginning of another and an extension of yet another. That’s valid for natural world. Fortunately human world is where that law is being overcome and unfortunately it is STILL a “beeee…..ing overcome”-thing.” 

(It is only after writing this up that I checked natural history references about the bee-eaters’ favorite menu and its not a good news for butterflies. That pretty Tawny Coster had a close shave.)

తేనెటీగనో, తూనీగానో ముక్కున పట్టుకుని మింగడానికి సిద్ధమౌతున్న ఆ పచ్చరెక్కపిట్టని చూడగానే అనిపించింది “ఒక జీవన పయనం ఆగింది,” అని. అది కొత్తగా రెక్కలు విప్పి గూటినుంచి బయటపడి జీవన సమరంలో అడుగిడిన పిల్లపిట్ట అని తెలియగానే ముందనుకున్న మాట కాస్తా, “ఆగిన ఆ పయనం మరో కొత్త జీవనయానానికి నాంది,” అన్న ప్రకృతిసూత్రంగా మారింది. వీలైనంత దగ్గర్నుంచి ఆ పచ్చరెక్కపిట్టని ఫోటో తియ్యాలన్న ధ్యాసలో, అది కంగారుపడి ఎగిరిపోకూడదని మెల్లిగా అడుగులో అడుగేస్తూ , చకచకా కెమెరా క్లిక్కుమనిపిస్తున్న నా కంటికి టానీ కోస్టర్ అనే ఆ సీతాకోక చిలుక కనబడలేదు. వీకెండ్ మార్నింగ్ బర్డ్ వాక్ అయ్యాక ఇంట్లో ఒక్కో ఫోటో చూస్తున్నప్పుడే చూసాను. పచ్చరెక్కపిట్టలు తేనెటీగలు/తూనీగల పాలిటి యమకింకరులని తెల్సుగానీ ఆకుచిలకల పాలిటి ఏ కింకరులో తెలీదు. బట్, వాటికీ యమదూతలే కావచ్చనే ఊహతో చూస్తే మాత్రం ఈ ఆకు చిలక పెద్ద ప్రమాదాన్నే దాటేసిందనుకోవాలి. ఒకటి కాదు రెండు పిట్టల మధ్య నుంచి ఎగురుతూ పోయింది. ఒకటి అప్పుడే పట్టిన పురుగుని మింగడంలో బిజీగా వుంటే రెండోది – గాల్లో ఎగురుతున్న ఏ ప్రాణులకోసం దీక్షగా చూస్తోందోగానీ – ఈ సీ.కో.చి.ని పట్టించుకోలేదు. వెంట్రుకవాసిలో భూమ్మీద నూకలు చెల్లకుండా – కాదు కాదు – భూమ్మీద పూరేకులు చెల్లిపోకుండా తప్పించుకుందన్న చిన్న సంతోషం మదిలో మెదిలిన ప్రకృతిసూత్రాన్ని కొంచెం సవరించిందిలా –   

ఒక పయనానికి తుది,

మరో యానానికి నాంది

జరుగుతున్న కధకి కొనసాగింపు

ఈ మూడు వాక్యాలూ అలా ఆ ఫోటోకి అతికించేసి, “ఆహా! డేవిడ్ ఎటెన్‌బరో లెవెల్లో ప్రకృతి చెప్పే నీతుల మీద కామెంటరీ రాసేసాను కదా,” అనుకుంటుండగా ఆలోచనలు మానవలోకం వైపుకి మళ్ళాయి, అసంకల్పితంగా. అవును, ఆ పైనున్న వాక్యాలు జంతుప్రపంచానికి సరిపోతాయి, మరి మన లోకానికీ? అదృష్టం, శతాబ్దాల పరిణామక్రమంలో మన లోకం ఆ ప్రకృతిన్యాయాన్ని అధిగమించింది. దురదృష్టం ఏంటంటే ఈ అధిగమించే ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకా ఎన్ని శతాబ్దాలు పడుతుందో??   

(ఈ చిన్ని టపా పూర్తి చేసాగ్గానీ పచ్చరెక్క పిట్టలు ఎక్కువగా పట్టి తినే ప్రాణులేవో తెలుసుకోవడం అవ్వలేదు. తెలుసుకున్నదేంటంటే ఆ సీతాకోక చిలుక “బ్రతుకు జీవుడా,” అని తన భాషలో తప్పక అనుకుని వుంటుంది, రెండు అందాల యమదూతల మధ్యనుంచి తను ఆడుతూ పాడుతూ ఎగిరి వచ్చేసానని గుర్తించాక.)

Here is the original picture without color enhancement –

DSC_0208-1

 ***

లోకల్ Vs.నాన్-లోకల్ Birds of Different Feather


When I saw the big bird flying in a direction opposite to mine but straight above the track I was walking on, I was not sure if it was a juvenile White-bellied sea eagle or a Brahminy kite. Birds of both these species are regularly seen around the flood water canal area which also happens to be my weekend Bird Walk (Bird watching + Morning Walk) circuit. In the early morning twilight the colors and feather markings were not clearly visible to determine the species but as the bird got closer I felt it must be a juvenile White-bellied Sea Eagle. I started clicking my camera as the bird passed overhead with wings flapping heavily, another sign of an eagle. ( 👇 Pic. 1, 2, 3, 4 👇)

Osprey-Eagle 1

The bird flew northwards, into the reddening skies. I was about to turn back and continue walking southward, when I realized my juvenile sea-eagle was being chased by an adult sea-eagle (it looked bigger) and within seconds they were overhead of me and to my right straight above the canal. Just as I clicked my camera to capture their aerial acrobatics I saw something dropping from the talons of the smaller eagle and the bigger one approaching that “something.” Obviously I failed to notice the “something” while photographing the juvenile when it passed above me previously. I hardly had the time to witness the acrobatics as I let my lens watch the aerial drama while I kept my focus on clicking the camera. (👇 Pic. 5, 6 👇)

Osprey-Eagle 2

The adult eagle with its “daily-bread”, it must be a fish, won or rather grabbed from the poor juvenile proceeded west to enjoy whatever was the catch in a lightly wooded part adjacent to the reservoir into which the flood water canal, mentioned before, drains. (👇 Pic. 7👇) In my eagerness to follow the winner (or the bully?), I lost track of the poor juvenile. Hope, by now (s)he would have her/his daily-fish.

Osprey-Eagle 3

I reached home wondering when and from which corner the adult eagle approached as I could not recall seeing another bird in the scene. Taking a closer look at pic.4 I spotted a black speck (circled) which I now think was the adult bird flying eastwards noticed the juvenile with its prize catch and immediately took to chasing it. Both the birds must be unaware of each other until their flight paths crossed. At least, I suppose so.

Osprey-Eagle 5

The story doesn’t end here. That’s because I noticed something else in the first three pictures. Something about the juvenile seemed not to match with White-bellied Sea eagle that I thought it to be. What is it? Its beak looked somewhat un-eagle-like. Smaller, Shorter and resembled a kite’s beak more than that of an eagle. Could that be an Osprey? Changing the picture’s Brightness/Contrast settings and a visit to Wikipedia confirmed that my “juvenile” White-bellied Sea Eagle was actually a non-breeding visitor to this part of the globe, an Osprey (Pandion Haliaetus). It must be from Europe as North American birds, I understand, winter in South America. (👇 Pic. 8 👇)

Osprey-Eagle 4

 

And, this is how I shared the aerial drama with my Whatsapp groups –

Witnessed an aerial drama this morning while bird-wa(lk/tch)ing.

Spotted a White bellied Sea eagle snatching a fish dropped by another one (probably a juvenile)

It happened during my morning walk today. Only later i realized these are not birds of same feather😀.

A closer look at the pics revealed that the fish-dropper is an Osprey, a winter visitor from Europe. (American ones winter in South America). No surprise, the non-local guy was bullied by the local Sea eagle, resident of South Asia n Australia. Politics 😊

 

Bye4Now🙏 & know that this post is dedicated to all the Nature Lovers and Protectors of Wild Life. Thank you & C.U. again 😊

🌷 🌿 🌾 🌹🐦🐒 🦀🐬🐆🐅🦌 🌷 🌿 🌾 🌹🐦🐒 🦀🐬🐆🐅🦌 🌷 🌿 🌾 🌹

మోడీమెసేజ్ = శ్రీకృష్ణుని కోరిక = ప్లాస్టిక్-ఫ్రీ భూమాత =గోసంరక్షణ


ఆవులు ప్లాస్టిక్ వ్యర్ధాలు తినే బ్రతికే అవసరం లేకుండా చెయ్యడమే నిజమైన గోసేవ అని మోడీగారు గోరక్షకులకిచ్చిన సందేశం. కొందరికి నచ్చింది. కొందరికి నచ్చలేదు. “ఇదంతా రాజకీయం. గుజరాత్, యూపి ఎలక్షన్స్ దగ్గర పడడంతో మోడీ ఆపరేషన్ వోట్‌బాంక్ ఆకర్ష్ మొదలెట్టార,”ని ఇంకొందరు అంటున్నారు. ఆ రాజకీయ లింకుల సంగతెలా వున్నా ప్రకృతిప్రేమికులకి, పర్యావరణ రక్షకులకి మోడీ మాటలు చెవిలో పోసిన అమృతం కింద లెక్క. హిందూధర్మం, సంస్కృతి దృష్ట్యా ఆవుని రక్షించాలనుకునేవాళ్ళతో కలిసి పనిచేసి పర్యావరణ కాలుష్యాన్ని అంతం చెయ్యడానికి మోడీ సందేశం మంచి అవకాశం కల్పించింది. ఎలా?

ఇలా –

భారతదేశపు మొట్టమొదటి గోప్రేమికుడు గోపాలకృష్ణుడు గీతలో ఏం చెప్పాడు? మనం ఆయన చెప్పినది సరిగ్గా ఫాలో అవుతున్నామా లేదా? ఈ రెండు ప్రశ్నలకి జవాబులు వెతకడంలో మోడీ సందేశానికి సరైన అర్ధం ఏంటో, ఆ అర్ధానికి తగిన కార్యాచరణ ఏదో తెలుస్తాయి (అని నేను అనుకుంటున్నా అందరూ అలా అనుకుంటారని ఆశిస్తున్నా).

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యాప్రయచ్ఛతి!
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః॥

(ఎవరు నాకు పరమభక్తితో,ఆకునో, పువ్వునో, పండునో మరియు జలమునో సమర్పించుచున్నాడో,అట్టి పరిశుద్ధ భక్తుడగువాడు భక్తితో సమర్పించిన కానుకను నేను ప్రేమతో స్వీకరించుచున్నాను.)

అని స్వామి మాట. అయితే వాటిని ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి ఇమ్మన్నాడా? కానీ మనం వాటన్నిట్నీ ప్లాస్టిక్ బాగ్స్‌లో / బాటిల్స్‌లో వుంచి గుడికి తీసుకెళ్తున్నాం. ఆ ప్లాస్టిక్ బాగ్స్/బాటిల్స్‌ని గుడి శుభ్రం చేసేవాళ్ళు ఎలా డిస్పోజ్ చేస్తారో ఎవరూ పట్టించుకోరు కదా? గుడులనే కాదు ఎక్కడ ఏ పూజలు, శుభకార్యాలు జరిగినా, పెళ్ళిళ్ళు, పేరంటాలు జరిగినా అన్నిచోట్లా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా జరుగుతోంది కదా? పేరంటాల్లో ఇచ్చే పళ్ళు, సెనగలకి ప్లాస్టిక్ కవర్లు, వాటితోపాటు ఇచ్చే చిన్న చిన్న ప్లాస్టిక్‌తో చేసిన కానుకలు (కుంకుమ భరిణెలు, దేవుళ్ళ బొమ్మలు, వగైరా); పెళ్ళిళ్ళలో పెళ్లి మండపం డెకరేషన్ నుంచీ పెళ్లి భోజనాలకి వాడే ప్లేట్లు, గ్లాసుల వరకూ ఒకొక్క పెళ్లి సీజన్‌లో ఎన్నేసి టన్నుల ప్లాస్టిక్ వాడకం జరుగుతోందో తలచుకుంటే.. వామ్మో. అన్ని టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు ఎక్కడికి పోతున్నాయి? రీసైకిల్ అవుతున్నాయా? గాలికి, వానకి చెల్లాచెదరై అన్ని చోట్లా వ్యాపిస్తున్నాయా?

మన దేశంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ అంతగా ఊపందుకోలేదు కనక రెండోదే నిజం అనుకోవాలి. చెల్లాచెదురైన ప్లాస్టిక్ వ్యర్ధాలు పొలాలు, కాలువలు, నదులు, సముద్రాల్లోకి చేరుతున్నాయి. కొంత భాగం ఆవుల, ఇతర జంతువుల, పక్షుల శరీరాల్లో భాగంకూడా అవుతున్నాయి. ఆవు తినడంవల్ల ఆ గోవుతో పాటు ప్లాస్టిక్ కూడా మన పూజలందుకుంటోందేమో అనుకుంటే…. ఎంత చిరాగ్గావుందో కదా? చిరాకే అయినా ఇది నిజం. 2008లో శబరిమల ఆలయాన్ని 35 మిలియన్ల భక్తులు సందర్శించారు(ట). ఒక అంచనా ప్రకారం సగటున ఒక్కొక్క సందర్శకుడు 250గ్రాముల ప్లాస్టిక్ అక్కడ వదుల్తారు. అంటే ఒక్క ఏడాదిలో 8750టన్నుల ప్లాస్టిక్ అక్కడ పేరుకుంటోంది. చెన్నైలో ఒక ఆవు సడెన్‌గా చనిపోతే పోస్ట్‌మార్టం చేసారు. దాని కడుపులో 17కిలోల ప్లాస్టిక్ ఉందిట. మరో ఆవు కడుపులో 40కిలోలు, ఒక ఏనుగు ఉదరంలో 80 కిలోల ప్లాస్టిక్ బయటపడ్డాయిట. వైట్ క్రేన్ అనే యూరోపియన్ కొంగ తినే ఆహారంలో ప్రస్తుతం ప్లాస్టిక్ భాగం అయిపోయిందిట. నదులు, సముద్రాల్లో వుండే జీవులని ప్లాస్టిక్‌తోపాటు మురుగు, కెమికల్స్, ఆయిల్స్ కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కొత్తగా పుష్కరాల్ని ప్రభుత్వాలు కమర్షియలైజ్ చెయ్యడం మొదలెట్టాక షాంపూలు, సబ్బులు, బట్టలు, కొబ్బరి చిప్పలు, డబ్బులు… మై గాడ్!!!

కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలాన్ని ఇప్పుడు రాస్తే శకుంతల ఉంగరాన్ని మింగిన చేప కడుపులో కాయిన్స్, సబ్బు బిళ్ళలు, మినరల్ వాటర్ బాటిల్స్ కూడా దొరికినట్టు వర్ణించాల్సివస్తుంది 😉

మన సంస్కృతిలో అడుగడుగునా ఆధ్యాత్మిక అర్ధం ఉంటుందని మనకి తెలుసు. దేవుడి నైవేద్యానికిచ్చినా, బ్రాహ్మడికో, బీదలకో దానం ఇచ్చినా, పెళ్లిపేరంటాల్లో కానుకలు, విందులు ఇచ్చినా.. అన్నీ దైవభావనతో జరగాలి. జరుగుతాయి కూడా. మనకి ప్రకృతి, జీవులు, కొండలు, నదులు, సముద్రాలు (మనం ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాం కానీ మనుషులు కూడా 😉 ) అన్నీ దైవస్వరూపాలే. అలాంటపుడు అందరిలోనూ అన్నిటిలోనూ నిండివున్న నల్లనయ్యకి మనం ప్రేమతో ఇచ్చే పత్రపుష్పఫలతోయాలలో  ప్లాస్టిక్సూ, వాటి సహోదరగణమైన ఇతర కాలుష్యాలు కలవకుండా చూసుకోవడం మన ధర్మం. ఈ ధర్మాన్ని రక్షించుకోడానికి పెద్ద ఉద్యమాలు అక్కర్లేదు. మంత్రులు, సెలబ్రిటీల ఆధ్వర్యంలో ప్రాజెక్ట్స్ చేపట్టక్కర్లేదు. ఎవరికివారు ప్లాస్టిక్ వాడడం మానెయ్యాలి. గాంధీజీ విదేశీవస్తుబహిష్కరణ పిలుపు బ్రిటిష్‌‌వాళ్ళని ఎంత ఊపు ఊపిందో “నేను ప్లాస్టిక్ వాడను. ఇతరులు ఇచ్చిన ప్లాస్టిక్ వస్తువులు తీసుకోను” అనే వ్యక్తిగతనిర్ణయం కాలుష్యాన్ని, కాలుష్య కారకులని అంతగా తగ్గించగలదు. కొన్ని పరిస్థితులని చక్కదిద్దాలంటే గవర్నమెంట్ చట్టాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకన్నా  ప్రజాభిప్రాయాలు, వ్యక్తిగత ప్రాధాన్యతలు బాగా పని చేస్తాయి.

What do you think?

Don’t think, just decide….

to carry a cotton bag with you while shopping and convince others to do the same.

🙂  🙏  🙂