Category: హృదయాం’తరంగం’

ఎమోజీ/ఎమోటికాన్‌లకి పర్యాయపదాలు => రెండు క్షణాల మౌనం / ఒక కొవ్వొత్తి / ఒక పుష్పగుచ్ఛం. Can we do something better?


ప్రేమతో పెంచిన గులాబిమొక్క ఆకలి తప్ప ఏమీ తెలియని పశువు నోట పడితే, పెంచిన ఆ మనసుకి కలిగే విలవిల

అందమైన భావాల్ని అక్షరీకరించి వ్రాసిన కవితని, వ్యామోహాన్ని మించిన భావం ఎరుగని బైతు చింపి పారేస్తే, ఆ కవితని కనిపెంచిన కవిహృదయం పడే వేదన

అపురూపంగా నిర్మించుకున్న పర్ణకుటీరం శివాలెత్తిన సుడిగాలికి చిందరవందరగా కూలిపోతే, పర్ణశాలలోనే పంచప్రాణాలూ పెట్టుకుని బ్రతికే ఆత్మ పొందే క్షోభ

— ఇవన్నీ అంతులేని అలలై చెలరేగుతూ ఆ తల్లి కళ్ళలోంచి పొంగిపొర్లుతున్నాయి.

ప్రేమ పోసి పెంచుకున్న మొక్క,

ఆశయాల ప్రతిరూపంగా రక్తంతో లిఖించుకున్న  కవిత,

ఆశలసౌధంగా పంచప్రాణాలతో నిర్మించిన పొదరిల్లు

—- అయిన కన్నబిడ్డని ఆ స్థితిలో చూసిన తల్లి ఇంకెలా వుండగలదు.

మూడురోజుల ముందు స్నేహితులతో వెళ్ళిన కూతురు, కూతురుగా కాక ఆమె నిర్జీవశరీరంగా తిరిగొస్తే, ఆ తల్లి మనసులో ఎగిసిపడే ప్రశ్నాకెరటాలకి అడ్డుకట్టవేసే సాహసం, జవాబు చెప్పే ధైర్యం, ఇది మళ్ళీ జరగనివ్వం అనగల    ఆత్మవిశ్వాసం  సమాజానికి, జాతికి, ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకి ఉన్నాయా? వాట్సాప్‌లో వాడుకునే ఎమోజీ/ఎమోటికాన్‌లకి పర్యాయపదాలైపోయిన  –

రెండు క్షణాల మౌనం / ఒక కొవ్వొత్తి / పుష్పగుచ్ఛం  – ఇవికాక ఇంకేమైనా చెయ్యగలదా/రా?

ప్రభుత్వాన్ని, పోలీసుల్ని, పాశ్చాత్యసంస్కృతిని తిట్టుకోడాన్ని మించి ఏమైనా నిర్మాణాత్మక కార్యక్రమం చేపట్టగలదా?

చిన్నారి సాన్వి, “నిర్భయ”, మొన్న ర్యాన్, గుర్‌గాఁవ్‌లో బస్‌ కండక్టర్ పశుత్వానికి బలైన బాలుడు, చెన్నై రైల్వే స్టేషన్‌లో హత్యకి గురైన స్వాతి, కాలేజ్ రాగింగ్స్ వల్ల ఆత్మహత్యలకి పాల్పడ్డ విద్యార్ధులు, బీహార్‌లో ఒక కారుని ఓవర్‌టేక్‌ చేసిన “పాపానికి” హత్యకి గురైన మైనర్ కుర్రాడు, డేరాఘోరాల బలిపశువులు —- వీళ్ళందరి విషాదాంతాలు టీనేజర్లకి పాఠాలుగా స్కూల్ సిలబస్‌లలో చేరాల్సిన అవసరం లేదా?

బలి అయినవాళ్ళ, బలి “తీసుకున్న”వాళ్ళ కుటుంబాల దుర్భర అనుభవాలు యవ్వనంలోకి అడుగు  పెడుతున్న పసిమనసులకి వార్నింగ్ సిగ్నల్స్‌గా ఉపయోగపడాల్సిన సమయం వచ్చేసి చాలా కాలం అయినట్టుంది. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పిల్లల్ని కోల్పోయిన అభాగ్యులూ,  వాళ్ళ దుఃఖానికి కారణమైనవాళ్ళకి జన్మనిచ్చిన “పాపానికి” “జీవితకాలశిక్ష” అనుభవించాల్సిన ఖర్మ పట్టిన నిర్భాగ్యులూ కూడా సానుభూతికి అర్హులే. తమ జీవితాలు వ్యర్ధం అయిపోయాయనే భావం వారికి కలగకుండా చెయ్యలేకపోతే సమాజానికి సభ్య అనే ప్రిఫిక్స్ శుద్ధదండగ. అలాంటివారిని అలా వారి మానాన వార్ని వదిలెయ్యకుండా తమ దుఃఖాన్ని, ఆక్రోశాన్ని, అనుభవసారాన్ని హైస్కూల్ పిల్లలతో పంచుకునేలా ప్రోత్సహించి, అవకాశం కల్పిస్తే ? పోయినవాళ్ళు తిరిగి వస్తారని కాదు. చెడిపోయినవాళ్ళు మారుతారనీ కాదు. విధి చేతులో దారుణంగా మోసపోయిన వాళ్ళ అనుభవాన్ని ప్రత్యక్షంగా వారి నుండే వింటూ, ఆ బాధ చూసినప్పుడు

స్వతంత్ర జీవితంలోకి అడుగుపెట్టబోయే తరంలో విచక్షణాదీపాలు వెలిగించి తమ దుఃఖభారం కొంతైనా తగ్గించుకోగలుగుతారని,

సో-కాల్డ్ మోడర్న్ జెనరేషన్స్‌లో కొందరైనా విచక్షణాజ్ఞానాన్ని వాడాల్సిన అవసరాన్ని గుర్తిస్తారని. మంచి చెడు అనేవి వుంటాయని, జీవితానికి, ఫన్‌కి తేడా వుందని గ్రహిస్తారని.

“ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. లైట్ తీసుకోండి,” అని చెప్పే పిల్లలు కూడా కొంచెం సున్నితంగా ఆలోచిస్తారని.

నా ఉద్దేశంలో ప్రభుత్వాలకి, ప్రజాప్రతినిధులకి ఇలాంటి ఐడియాలు రావడం, వాట్ని అమలు చెయ్యడం అలవాటు లేదు, ఫ్యూచర్లో అలవాటౌతుందనే ఆశ కూడా లేదు. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు చొరవ తీసుకోవాలి.

(మూడురోజుల ముందు స్నేహితులతో వెళ్ళిన కూతురు, కూతురుగా కాక ఆమె నిర్జీవశరీరంగా తిరిగొస్తే హతాశురాలై శోకవిహ్వల అయిన ఒక తల్లి🙏 ఫోటో నిన్న పేపర్లో చూసి మనసు వికలమైతే, అది ఫామిలీతో పంచుకుని రాసిన పోస్ట్ ఇది. ఎవరినైనా ఏ కోణంలోనైనా బాధిస్తే మన్నించమని కోరుతున్నాను🙏)

 

 

అ.ని.సా? హతవిధీ!!! a device to prevent rapes? (మరియు)         🌹🌜🌞🚲ల  కధాకమామిషు 


చిన్నప్పుడెప్పుడో ఒక కొటేషన్ చదివాను. ఎంత చిన్నప్పుడంటే ఆ కొటేషన్ ఎవరిదో తెలుసుకోవాలనే ధ్యాస ఉండనంత చిన్నప్పుడు. కానీ మనకీ ఒక చిన్నప్పుడు వుండేది అనుకునేంత పెద్దయ్యాక్కూడా గుర్తుండిపోయింది ఆ కోట్.  ఆ కొటేషన్ సారాంశం ఏంటంటే, ఇదీ – ప్రపంచానికి ఆప్టిమిస్టులూ, పెస్సిమిస్టులూ ఇద్దరి అవసరం ఉందిట. ఆప్టిమిస్టు విమానం కనిపెడితే, పెస్సిమిస్టు పారాచూట్ కనిపెడతాడుట.

చిన్నప్పుడు కదా ఇదేదో బానేవుందే అనిపించింది. కొంచెం పెద్దయ్యాక తట్టింది, పేరాచూట్ కనిపెట్టినవాడు పెస్సిమిస్ట్ ఎందుకౌతాడూ అని. విమానం కూలిపోయినా, పేలిపోయినా సరే నేను మాత్రం బతికి తీరాలి అనుకునేవాడు పెస్సిమిస్ట్ ఎలా అవుతాడసలూ? దీన్నిబట్టీ అర్ధమైనది ఏంటంటే ఆ కోట్ కోటిన వ్యక్తి పేరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదని. కానీ ఒకటి, కోట్ బాగా నచ్చెయ్యడంవల్ల దాని మీద మాటిమాటికీ ఆలోచించడంవల్ల చివరికి ఆప్టిమిజానికీ, పెస్సిమిజానికీ తేడా బాగా తెలిసింది, ఆ ఫలానా కోట్ కోటిన “కోటే”శ్వర్రావు కంటే బాగా!! ఇప్పుడింతకీ ఈ సోది ఎందుకనే ప్రశ్నకి జవాబు, ఇదిగో –

//బోస్టన్‌/చెన్నై, జూలై 27: లైంగిక వేధింపులకు గురైనప్పుడు సాయాన్ని అర్థించేవారి కోసం ఓ భారతీయ శాస్త్రవేత్త స్టిక్కర్‌ లాంటి ధరించే సెన్సర్‌ను అభివృద్ధి చేశారు. దీన్ని దుస్తులకు అతికిస్తే చాలు.. ఎవరైనా లైంగిక వేధింపులకు గురిచేస్తే సదరువ్యక్తి ఆపదలో ఉన్నారని ఆప్తులకు అలారం మోగిస్తూ సెన్సర్‌ హెచ్చరికలు పంపిస్తుందట. …..//

రెండుమూడ్రోజుల క్రితం ఒక తెలుగు పేపర్లో వచ్చిన వార్త ఇది. టెక్నాలజీ ఏం పెరిగిపోయింది అని ముక్కున వేలేసుకోవాల్సినంత గొప్ప విషయం అనుకోవాలా? ఇలాంటి సాధనాలు వాడితే కానీ కంట్రోల్ చెయ్యలేనంతగా మనుషులు దిగజారిపోయారనుకోవాలా? రెండూ అనుకోవాలి.

పైన చెప్పిన అ.ని.సా(అత్యాచార నిరోధక సాధనం)  ఆ “కోటే”శ్వర్రావు దృష్టిలో పెస్సిమిజానికి చిహ్నం అయ్యేదే. కానీ ఆయన ఆలోచనా విధానం తప్పుకదా. అది ఆప్టిమిజానికే గుర్తు. గవర్న్మెంట్లు, పోలీసులు, సొసైటీ (ఇదే మొదటి ముద్దాయి నిజానికి) – అందరూ చేతులు ముడుచుకుని కూచుంటే టెక్నాలజీపైన ఆధారపడక తప్పదుగా మరి?  ఆ రకంగా ఆప్టిమిజాన్నే సూచిస్తోంది ఇది, బాధితుల కోణంలో చూస్తే. కానీ నిరాశాజనక ఆశావాదం, pessimistic-optimism. ఎందుకు?

ఇందుకు👉 – దీన్ని కనిపెట్టింది అమెరికన్ లాబ్‌‌లోనేనైనా, కనిపెట్టిన సైంటిస్ట్ ఇండియన్నేట**. అందులోనూ మహిళ. ఆశ్చర్యం ఏఁవుంది? ఇక్కడ అలాంటి సెన్సర్ (Sensor, సెన్సార్ అనుకోకూడదని) డివైజెస్‌కి మార్కెట్ బాగా పెరుగుతోంది కదా మరి? ఈ సాధనం తయారుచెయ్యాల్సిన అవసరం ఎత్తి చూపిస్తున్నది – సంఘం, ప్రభుత్వం, పోలీస్ – వీటన్నిటి పట్లా నిరాశనే కదూ? (** స్వదేశీ లాబ్స్‌కానీ, రీసెర్చర్లుకానీ కనిపెట్టివుంటే కొంత సంతోషంగా వుండేది. సమస్యని పట్టించుకునే వాళ్ళున్నారనే చిన్న పాజిటివ్ సైన్ కనబడి.)

సెన్సర్స్ మార్కెట్ బావుందని బిజినెస్సులు, లాభాలు లెక్కలేసే “ఆప్టిమిస్ట్‌”లకి ఇదో వ్యాపారవకాశం కావచ్చు. అంతకంటే ఇంకేమన్నా అవుతుందా/అవగలదా అనేదే ప్రశ్న. ఆన్సర్? తెలీదు. బట్,  సంస్కృతిలో ఏర్పడుతున్న ఒక  పెస్సిమిస్టిక్ ట్రెండ్‌కి ఇదొక సూచకం, ఇండికేటర్ అని మాత్రం తెలుసు. ఒకవేళ ఈ వ్యాపారం లాభసాటిగా మారిందంటే దేశానికి అంతకంటే దరిద్రం ఇంకోటి లేదనే(కదా?). మానవవిలువల దిగజారుడు ఆగుతుందో ఆగదో కానీ, వ్యాపారాలు, లాభాలు ఆగవు కదా? మరి, పెరుగుతున్న ఆ లాభాల గ్రాఫులు మరో రకంగా ఉపయోగపడతాయా? అవిచూసి గవర్న్మెంట్లు, పోలీసులు, సొసైటీ పడాల్సినంత సిగ్గు పడతారా? ఆ గ్రాఫులు ఎంత పైకి ఎక్కితే దానికి విలోమానుపాతం (inverse proportion)లో మనిషి విలువలు సంస్కారం దిగజారుతున్నాయని గ్రహిస్తారా? గ్రహించి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారా? డౌటే. వాళ్లకివన్నీ తెలియని సంగతులైతే కదా?

ఫ్రాంక్లీ స్పీకింగ్, దేశంలో గోభక్షకుల్ని శిక్షించే గోరక్షకులున్నారు, పరువు హత్యలు చేస్తున్న పేరెంట్స్ వున్నారు, ఆడపిల్లలు పుట్టడమే అనవసరం అనుకునే అసురులు వున్నారు, మంత్రగత్తెలనీ/గాళ్ళనీ నిలువునా కాల్చేసే మహాధీరులున్నారు  – కానీ అత్యాచారం చేసినా, అందుకు ప్రయత్నించినా –


మెన్‌
ఆమెన్‌
చెరపట్టన్‌
మ్రోగెన్‌
నీగన్‌
నా
పెన్‌
ఆపెన్‌ (ఆ మెన్‌, ఆమెన్‌ చెరపట్టన్‌, మ్రోగెన్‌ నీ గన్‌, నా పెన్‌ ఆపెన్‌ )

– అని అత్యాచార పరాయణుల భరతం పట్టి, పుట్టగతుల్లేకుండా చెయ్యగల ప్రజలు మాత్రం కనిపించరు. ఎందుకో?

ఎందుకో తెలిసి ఏం లాభం? ఆ “ఎందుకో”లోంచి బయటపడే ఆలోచనా శక్తీ, సంస్కృతీ అలవడనప్పుడు? అంతే సంగతులు. 

ఇంత సీరియస్ టాపిక్ తర్వాత చిన్న షార్ట్ బ్రేక్ లేకపోతే ఎలా? 😃, have it 👇

సినిమాల్లో మంచి సినిమాలు వేరయా… అనే, కోరికోరి నేను రాస్తున్న 🌹🌹”నిన్నుకోరి”🌹🌹 రివ్యూ


పూర్వం సినిమాలు పిల్లలపైన చెడు ప్రభావం చూపిస్తాయని అనేవాళ్ళు. అయినా సినిమాలు మారలేదు కానీ మనుషులు మారిపోయారు. సినిమాల్ని జీవితంలో భాగంగా యాక్సెప్ట్ చేసేసారు.  ఆ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే వచ్చిందో అప్పట్నుంచీ, ఎవరికైతే వచ్చిందో వాళ్ళని సినిమా ప్రభావితం చెయ్యడం మొదలైంది. ఏ గూటిచిలక ఆ మాటలు మాట్టాడినట్టు ఎలాంటి సినిమాలు ఇష్టపడేవాళ్ళు అలా ఎఫెక్ట్ అవుతారు. అలాగే ఆలోచన నేర్పేవి, ఆనందాన్నిచ్చేవి అయిన సినిమాలు ఎప్పుడూ ఉన్నాయి. కొత్తగా వస్తున్న డైరెక్టర్సూ, యాక్టర్సూ మంచి సోషల్లీ రిలవెంట్ సబ్జెక్ట్‌‌లు తీసుకుని, వాటిని సూటిగా, హత్తుకునేలా – అంటే తక్కువ మాటలతో, అనవసరపు పాటలు, ఫైట్లూ లేకుండా, అతి మెలోడ్రామాలేకుండా, ప్రబంధపద్యాలనే వచనంలా చెప్పే డైలాగ్స్ పెట్టకుండా – సినిమాలు చేస్తున్నారు. డైరెక్షన్ & యాక్షన్ – రెండిట్లోనూ రియాలిటీకి దగ్గరగా వుండడం వీటి స్పెషాలిటీ. పేరెంట్స్ పిల్లలతో ఏదైనా చెప్పాలన్నా, జీవితపాఠాలు నేర్పాలన్నా, పిల్లల మనసు అర్ధం చేసుకోవాలన్న ఎంతో కష్టపడాల్సి వస్తున్న ఈ రోజుల్లో కొన్ని సినిమాలు ఆ పనుల్ని సులువు చెయ్యడానికి కొంతవరకూ పనికొస్తున్నాయి. నువ్వే నువ్వే, బొమ్మరిల్లు, అనుకోకుండా ఒకరోజు, ఆకాశమంత, పెళ్లిచూపులు, మనమంతా,…. ఇప్పటికిప్పుడు గుర్తుకొస్తున్న కొత్త మంచి సినిమాలు. వాటి కోవలోకి వచ్చేదే — మొన్న మేము ఫస్ట్ డే – ఫస్ట్ షో చూడాలని మరీ మరీ కోరి కోరి చూసిన “నిన్ను-కోరి.”  ఇక్కడో విజువల్ పెడితే రాయడం రాకపోయినా రాసి రాశి😝పోసేస్తున్న, మిమ్మల్నందర్నీ “రాసి” రంపాన 😈పెడుతున్న నాకు కాస్త శ్రమ😉తగ్గుతుంది. అందుకే ఇది –

Screenshot_20170709-182057

BTW, పిని👆 = ఆది పినిశెట్టి👆

ఒక డెలికేట్ & కాంప్లికేటెడ్ సబ్జెక్ట్‌ని జనానికి విసుగురాకుండా, ప్రొడ్యూసర్‌కి నష్టం రాకుండా హాండిల్ చెయ్యడం మాటలు కాదు కదా? ఆ పరిధులు దాటకుండా, అలాగని అక్కర్లేని చెత్త పోగెయ్యకుండా బాగా తీసారు. సారీ, మళ్ళీ ఒక విజువల్ –

Screenshot_20170709-182047

నాని, ఆదిపినిశెట్టి, నివేదాథామస్ ముగ్గురూ బాగా చేసారు. కానీ ఈ సారికి ఫస్ట్ మార్కు నివేదకి ఇచ్చేశాం. ఆ అమ్మాయికి నటనకి ఎక్కువ స్కోప్ దొరికింది. ఒకరకంగా ముగ్గుర్లోనూ ఎక్కువ సంఘర్షణకి గురైన పాత్ర అనిపిస్తుంది. అనిపించింది. ఎందుకంటే నాని అన్నిట్నీ వదిలేసి దేవదాసు కానీ, ఒక ప్రేమోన్మాదిగా మారిపోవడానికి కానీ అతి దగ్గరగా వచ్చేసిన పాత్ర. ఆది పాత్రది అన్నిట్నీ మనసులో దాచుకునే, ఎప్పుడూ ఉదాత్తంగా వుండాలని నమ్మే, అలాగే వుండే కారెక్టర్. సొసైటీలో “నాని”లు ఎక్కువగానే కనిపిస్తారు కానీ “ఆది”లు అరుదుగా బయటపడతారు. గుర్తింపుకీ అవకాశం వుండదు. “నాని” మీద మొదటినుంచీ సింపతీ కలుగుతుంది. “ఆది” స్వభావం, అతని ఎక్స్‌ప్రెషన్సూ సినిమా చూస్తుండగా కంటే క్లైమాక్స్‌లో సరిగ్గా అర్ధం అవుతాయి. ఆది నటనా కౌశలాన్ని ఆస్వాదించాలంటే సినిమా రెండోసారి చూడాలి. ఇంక “నివేద.” ఆశక్తురాలిని అనుకునే ఆడపిల్ల. మంచిది. ఎవర్నీ నొప్పించలేని, వదులుకోలేని మనస్తత్వం. ప్రేమని ప్రేమగానే అర్ధం చేసుకోగల, మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ ఉన్న ముగ్ధ. మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ ఉన్న ముగ్ధ అన్న ఫ్రేజ్ ఎందుకు వాడానంటే యూజువల్లీ ముగ్ధలూ, మెచ్యూరిటీ ఆఫ్ మైండు ఒకే ఒరలో పట్టాల్సిన రెండు కత్తులు. మామూలుగా పట్టవు కానీ ఎక్సెప్షన్స్ – మినహాయింపులు – ఉంటాయి కదా. అలాంటి ఒక ఎక్సెప్షనే “నివేద” పాత్ర. పాత్ర ఆకారంలో ఒదిగిపోయే నీళ్ళలా నివేదాథామస్ పల్లవి పాత్రలో ఒదిగిపోయింది. అందుకే తనకి 100/100. ఈ సినిమాకి పనికట్టుకు వెళ్ళింది నాని కోసం, కానీ నివేద యాక్షన్‌కి, అంతర్వాహినిలాంటి ఆది భావోద్వేగాలకి ఖైదీ, బందీ, ఫిదాయీ వగైరాలన్నీ అయిపోయాం. క్రెడిట్ గోస్ టు నాని 😊.  నౌ, ఫైనల్లీ, ఎ విజువల్ ఫర్ నాని –

Screenshot_20170709-182038Screenshot_20170709-182026

ఐ మీన్, నాని సీనియర్లందరితో సమాన స్థాయి అందుకున్నాడని. కవిహృదయం కొంచెం కాంప్లెక్స్ గా ఉందేమోననిపించి ఈ ముక్క కలిపాను. నాని ఎంచుకుంటున్న కధలని బట్టీ అతనికి డిజప్పాయింట్ చెయ్యడం రాదనీ, ఇమేజ్ లో ఇరుక్కుపోడనీ ఆశగా వుంది. అది అత్యాశ కాదని నాని ప్రూవ్ చెయ్యాలి. చేస్తాడు.

కళ్ళలో సన్నటి నీటిపొరని, ముఖంపై పెదిమలు విడివడని చిరునవ్వుని, పెదిమలు దాటకుండా లోపలికి, హృదయం వరకూ వినిపించే మాటల్నీ పుట్టించే కధలు, దృశ్యకావ్యాలు నాకిష్టం. “నిన్ను-కోరి” ఆ స్టాండర్డ్ – రేటింగ్ అందాం – అందుకుంది.  Director SivaNirvana deserves all praise.

కొసమెరుపు (మెరుస్తుందో, మెరవదో కొంచెం డౌటు): శుక్రవారం సినిమా చూశాక, శనివారం కాకతాళీయంగా “వెన్నెల కాటేసింది” నవల చదివా(http://www.koumudi.net/books/koumudi_vennela_katesindi.pdf). ఈ మధ్యకాలంలో చదివిన తెలుగు నవల, జీవితంలో మొదటిగా చదివిన(Please, please…don’t look at me like that 😂) గొల్లపూడి మారుతీరావుగారి నవలా అది. “సుబ్బులు” పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆ కారెక్టర్‌ అర్ధం అయ్యాక “పల్లవి” పాత్ర మరీ నచ్చింది.

ఇంతే సంగతులు. బై4నౌ.

🙏

 

 

 

నా.., కాదు మీ…, కాదుకాదు మన 🌹బాపూరమణీయం@వైకుఠం🌹మళ్ళీ ఒకసారి


ఈ రోజు ముళ్ళపూడి వెంకటరమణగారి పుట్టిన్రోజు. ఆయన్ని తలచుకున్నప్పుడు ఆటోమేటిగ్గా, అసంకల్పిత ప్రతీకారచర్యగా బాపుగార్ని తలచుకోకుండా ఉండలేము. ప్రాణస్నేహితులుగా వాళ్ళిద్దరూ జీవితాల్లో ఎంతగా కలిసివున్నారో అంతగా తెలుగువాళ్ళ మనసుల్లోనూ ఎప్పుడూ కలిసేవుంటారు. వున్నారు. అందుకే వాళ్ళ అనుబంధం బాపురమణీయం అనిపించుకుంది. బాపురమణగార్లని తలచుకున్నప్పుడల్లా ,శంకరాభరణం శంకరశాస్త్రిగారు అంటాడేఁ, “ఆర్ద్రత అంటే అదొక భాషకందని భావంరా,” అని అలాంటిదేదో భావతరంగం మస్తిష్కంలో పుట్టి హృదయం నుంచి ప్రతిఫలిస్తుంది. రమణగారి రచనలు చదివినా, బాపు గారి బొమ్మల్ని – ముఖ్యంగా కొంటెబొమ్మల్ని – చూసినా  పెదాల మీద పుట్టే సన్నటి మందహాసతరంగాలు హృదయంలో, మనసులో, మస్తిష్కంలో ప్రతిధ్వనిస్తాయి. వారిద్దరికీ తెలుగు ప్రజల మనస్సుల్లోకి మెనీ మెనీ హాపీ రిటర్న్స్ చెబుతూ ఓ రెండేళ్ళ క్రితం సారంగ సాహిత్య పత్రిక ప్రచురించిన –

నా బాపూరమణీయం@వైకుఠం మళ్ళీ ఒకసారి.

కాదు మీ  బాపూరమణీయం@వైకుఠం మళ్ళీ ఒకసారి.

కాదు కాదు మన బాపూరమణీయం@వైకుఠం మళ్ళీ ఒకసారి.
బాపూరమణీయం@వైకుంఠం

బాపూరమణీయం@వైకుఠం

వైకుంఠంలో  బ్రహ్మ సరస్వతితో కలిసి తల్లితండ్రులతో కబుర్లు చెపుతున్నాడు. ఇంతలో జయవిజయుల అనౌన్స్-మెంటు “బాపూరమణలు తమ దర్శనానికి వచ్చారు ప్రభూ,” అంటూ. “వాళ్ళని త్వరగా తీసుకురండి, ఆలస్యమెందుకు?” అన్నట్టు లక్ష్మీనారాయణులు చూసిన చూపులకి బ్రహ్మకి ఆశ్చర్యం వేసింది.

ఎవరీ బాపూరమణలు? రామలక్ష్మణులు, కృష్ణార్జునులు, జయవిజయులు, అశ్వనీ దేవతలు, నారద తుంబురులు, … లాగా బాపూరమణలనే ఈ కొత్త ద్వంద్వసమాసానికి కారకులెవరా అని నాలుగు ముఖాల్లో రెండే ప్రశ్నలు – బాపు ఎవరు? రమణ ఎవరు? – కదలాడుతూ చూసాడు. చదువులతల్లి మాత్రం పుట్టింటివాళ్ళని చూసిన భూలోకపు కోడల్లా సంబరపడుతోంది. పరిస్థితి గమనించిన విష్ణుమూర్తి లక్ష్మి వైపు చూసి నవ్వాడు. “ఎంత గొప్ప స్నేహమో! రవఁణొచ్చి చాలా సేపే అయినా ఇద్దర్నీ ఒకేసారి చూడాలని మీ మావఁగారి ఉద్దేశం,”  అంది కోడల్తో. ఒదిగిఒదిగి వస్తున్న ఇద్దర్నీ చూసి వీళ్ళిద్దరి వినయం గురించి మనం విన్నది (వాళ్ళు వినాలా?) నిజ్ఝంగా నిజం సుమీ అనుకున్నారు లక్ష్మి శ్రీహరి. చిత్రకళలో శ్రీరాముడే తన  గురువని చూపిస్తూ వేసిన బొమ్మ – అదే, రాముడు సీత పాదాలకి పారాణి అద్దుతూ ఉంటే తను కుంచెలూ, రంగులూ పట్టుకుని రాముడి కందిస్తున్నట్టు గీసారూ, అదీ.

అందులో ఎంత ఆనందంగా ఉన్నారో అంతకన్నా ఆనందంగా చేతులు కట్టుకుని, అలవాటు ప్రకారం రమణగారికి కొంచెం వెనగ్గా నిలబడి ఆదిదంపతులని తదేకంగా చూస్తూ ఉన్నారు. గురువు మాట కాదని అష్టాక్షరీ మంత్రాన్ని సామాన్యులందరికీ అందించిన రామానుజుడి ఆవేశం, అద్వైతాన్ని అక్షరాలా అనుభవించిన శంకరుని జ్ఞానసౌందర్యం రమణగారిలో తొణికిసలాడుతున్నాయి. ఆయనలో  భక్తుడూ, సునిశిత పరిశీలకుడు, రచయితా, తత్త్వవేత్త ఒకేసారి కనబడుతున్నారు. స్వామివారికి ఇద్దరి సంగతీ తెలుసు కనక ధరహాసంతో, నిజభక్తులని  చూసిన సంతోషంతో అలాగే చూస్తూ ఉన్నాడు. అయ్యవారి సంతోషాన్ని చూస్తూ అమ్మవారూ అలా ఉండిపోయింది. బ్రహ్మ గారు మాత్రం నాలుగు చూపుడువేళ్ళు నాలుగు ముక్కుల మీదా వేసుకుని చోద్యం చూస్తున్నాడు. ఆయనకి రజోగుణం ఎక్కువ కనక ఒక్క క్షణం ఇదేమిటి ఈ మానవమాత్రుల  మీద ఈయనకింత ఆసక్తి అనుకున్నా అంతలో కృష్ణావాతారంలో గొల్లపిల్లల మీద ఈయన ప్రేమని తను పరీక్షించి మరీ భంగపడ్డ వైనం గుర్తొచ్చి సద్దుకున్నాడు. కలియుగంలో కూడా స్వామికి అలాంటి భక్తులున్నారనమాట అనుకున్నాడు. స్వామిని డిస్టర్బ్ చెయ్యకుండా గుసగుసగా అన్నాడు వాణితో, “సృష్టికర్తగా నేను టూ బిజీ కనక వీళ్ళెవరో తెలుసుకోలేదు కానీ నీకు తెలుసులా ఉందే? ఎవరు వీళ్ళు ఏమిటి కధ?” అన్నాడు. ఆవిడ మహానందంగా చెప్పింది “నా అంశలైన అరవైనాలుగు కళల్లో సాహిత్యం రమణగానూ, చిత్రలేఖనం బాపూగానూ అవతరించాయి” అని. “అవునా?! మరయితే వందలాది కళాకారులూ సాహితీవేత్తలూ ఉండగా వీళ్ళిద్దరే అని ఎలా చెబుతావు?” అన్నాడు. “ఎవరి విశిష్టత వాళ్ళదే. కానీ వీళ్ళిద్దరూ మూడు ప్రక్రియల్లో, అంటే సాహిత్యం, చిత్రలేఖనం, చలనచిత్రనిర్మాణ శైలీశిల్పాలలో జంటకవులు, కన్-జాయిన్డ్ ట్విన్స్. రమణ కధలు బాపు బొమ్మల్లోనూ, సినిమాల్లోనూ పొందిగ్గా ఒదిగిపోతాయి. వాటి గొప్పతనాన్ని బాపూరమణీయపు చవిచూసిన తెలుగువాళ్ళ ఆనందంతోనే కొలవగలం. అయినా మహా వినయసంపన్నులు. ఆధునిక పోతనలు. శ్రీరామునికి మహాభక్తులు. ఇంకేం ఋజువు కావాలి నా అంశ ఉన్నవాళ్ళనడానికి? ”

“నీ అంశలేనోయ్, సందేహమా? మరైతే చలనచిత్రాలన్నావ్, అవేంటి? కదిలే బొమ్మలా? వాటి గురించి వివరంగా చెప్పు”  అన్నాడు బ్రహ్మ దేవుడు.

“సాహిత్యం, నాటకం, ఛాయాచిత్రం, చిత్రలేఖనా ప్రావీణ్యం కలిపి వాటికి సంగీతనాట్యాలు జోడిస్తే చలనచిత్రం అని అరవై ఐదో కళ పుట్టింది. అందులో  నిష్ణాతులు వీళ్ళిద్దరూ”

“ఉట్టి కదిలే బొమ్మలే కాదు అవి మాటలు కూడా ఆడతాయి. చెట్లచుట్టూ, మంచు కొండల్లో డాన్సులు చేస్తూ పాటలు పాడతాయి. అంతే కాదు  అగ్నిపర్వతాల మధ్యా, ఎగిసి పడే కెరటాల మధ్యా నుంచుని ఏడుస్తూ కూడా పాడతాయి.”

 

“వింతగా ఉందే? ఇదీ నా సృష్టే?”

“ఈ కళ మానవ సృష్టి మహాత్మా! అయినా కళామతల్లిని నేనయితే, మీరు సృష్టించడం ఏమిటి?”

“సరే, సరే, సరే. చలనచిత్రాలలో వీళ్ళిద్దరి ప్రత్యేకత ఏమిటి?”

“మీకు ఘంటసాల వెంకటేశ్వరరావు గురించి గుర్తుందా?”

“వాణీ, వీణా పాణీ ! నన్ను ఇబ్బంది పెట్టకు, నువ్వే ఆయనెవరో, ఆయన గొప్పతనం ఏమిటో చెప్పి పుణ్యం కట్టుకో”

“ఇండియా, చైనా జనాభాలు మరీ అంత పెంచకండి, మీకు వర్క్-లోడ్ ఎక్కువైపోతుందని ఎన్నిసార్లు చెప్పాను? వింటేగా? మర్చిపోకూడని  విషయాలు మర్చిపోతున్నారు. మీ నోటిమాటతో ఎగిసిన గాన-సునామీని గుర్తించలేకున్నారు. యముడికి చిత్రగుప్తుడిలా మీకూ ఒక అసిస్టెంట్ ఉంటే బావుణ్ణు”

“ఏం చేస్తాం? యముడికి రెండు చేతులూ, ఒక తలే గదా! నాకు నాలుగు తలలు నాలుగు చేతులు ఉండడంతో అసిస్టెంట్ పోస్ట్ శాంక్షన్ అవ్వట్లేదు. అక్కడికీ తలరాతలన్నీ చాలామటుకు కాపీ, పేస్ట్ చేసేస్తున్నా, యాంత్రిక యుగానికి అంతకంటే కష్టపడ్డం ఎందుకని. అయినా తీరిక దొరకట్లేదు. అదలా వదిలేయ్. ఘంటసాల గురించి చెప్పు”

“ఒకప్పుడు మీ సభలో నారద,తుంబురుల సంగీత పోటీ జరిగినప్పుడు దేవతలందరూ కలిసి కూడా ఇద్దరిలో ఎవరు గొప్ప గాయకుడో తేల్చలేకపోయారు.  చివరికి వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగి పోట్లాట వరకూ వచ్చింది. అప్పుడు మీరు కోపించి మీరిద్దరూ కలిసి మానవలోకంలో ఓకే శరీరంలో పుట్టండి అని శపించారు. శాపవిమోచనగా లక్షలాది, కోట్లాది ఆంధ్రులని ఇద్దరి గానమాదుర్యంలో ఒకేసారి ముంచి తేల్చి తరతరాల పాటు గుర్తుండిపోయేలా చేసి  తిరిగి మీ మీ రూపాలు పొందుతారు అని మీరు సెలవిచ్చారు.  అంతట నారద తుంబురులు ఒక్కటై ఘంటసాల వెంకటేశ్వరరావుగా జన్మించి ఆంధ్రదేశాన్ని తన గాత్ర మాధుర్యంలో ముంచి వేశారు”

“అవునా? నా శాపం తెలుగు వాళ్లకంత ఆనందం కలిగించిందా? సంతోషం.”

“ఆయన పాడిన భగవద్గీత కృష్ణావతారంలో మావఁయ్యగారే పాడినట్టు ఉంటుంది”

“ఔనా! చాలా బావుంది. లోకకళ్యాణం చేసి వచ్చారన్నమాట దేవ, గంధర్వ గాయకులిద్దరూ”

“సరిగ్గా అలాంటి లోక కళ్యాణమే చేసి వచ్చారు ఈ బాపు రమణ ద్వయం. ఆంధ్ర జాతిని వాళ్ళ మూలాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ సంస్కృతినీ, సాంప్రదాయాన్ని; బలాల్నీ, బలహీనతలని; వాళ్ళ నిత్యజీవితాల్లో ఉండే హాస్యాన్ని, సున్నితత్వాన్ని, గాంభీర్యతని, శృంగారాన్ని, అమాయకత్వాన్ని, అహంకారాన్ని, ఆమ్యామ్యాని, మామూలు మనుషుల్లా కనిపించే క్రూరులనీ, క్రూరంగా కనబడే మంచివాళ్ళనీ, … అందర్నీ, అన్నిటినీ, ‘వోలు మొత్తం’ తెలుగుదనపు విశ్వరూపాన్ని రచించి, చిత్రించి, చలనచిత్రీకరించి –

తెలుగుదనం అంటే తెలీనివాడికి దాన్ని కంటికికట్టే ఎన్-సైక్లోపీడియాలా;తెలుగుకీ, ఆ నేలకీ దూరమైనవాణ్ని క్షణంలో సొంతూరికి, తన మనుషుల మధ్యలోకి తీసుకెళ్ళిపోయేలా; తెలుగు మర్చిపోయిన వాడికి తెలుగు సంస్కృతి మనసంతా నిండిపోయేలా,…..చెయ్యగల ఓ మూడు గంటల చలనచిత్రం తయారు చెయ్యగలరు.  మానవనైజానికి, మానవత్వానికి తెలుగు వెర్షన్ లా ఉంటుంది అది”

“ఒక సంస్కృతి రూపు దిద్దుకోవడంలో తమ వంతు చేసారన్నమాట. బావుంది, ఇంకా చెప్పు”

“కొంచెం కవితాత్మకంగా చెప్తాను,  I am waxing lyrical.”

“గో ఎహెడ్!”

“తెలుగుదనం స్పష్టంగా మాట్లాడితే అది రమణ రాత అవుతుంది. రూపం ధరిస్తే బాపు బొమ్మౌతుంది”

“భలే!”

“పులిహారా, గోంగూరా, మజ్జిగపులుసు, పనసపొట్టు కూరా, గుమ్మడికాయ వడియాలూ … …. లాంటివన్నీ ఉన్న తెలుగు మీల్

బంతిపూలు గుచ్చిన గొబ్బెమ్మలనీ, చుట్టూ పాడుతూఆడే ముద్దబంతిపూలని చూసినప్పుడు కలిగే తెలుగు జీల్

చిరు వేసవిలో, పరీక్షల సీజన్లో రామనవమి పందిట్లో పానకం వడపప్పుల్లో ఘుమ ఘుమలాడే తెలుగు ఫీల్

తెల్లవారకట్ట కుంపటిపై కాఫీ కాస్తూ కబుర్లు చెప్పుకునే అచ్చ తెలుగు కొత్తజంటలో, కష్టసుఖాలు కలబోసుకునే పాతజంటలో కనిపించే తెలుగు సౌల్ (soul) ఇవన్నీ ఒక బాపు బొమ్మలోనూ, ఒక రమణ కధలోనూ లేక ఇద్దరూ కలిసి తీసిన సినిమాలోనూ ఒకేసారి అనుభవించవచ్చు”

“అద్భుతః, ఇంకా..”

“రమణ మాట, బాపు బొమ్మ కలిసి కదిలితే -‘ముత్యాలముగ్గు’ల మధ్య ‘గోరంత దీపా’ల కొండంత వెలుగు ల్లో ‘అందాల రాముడి’తో ‘సీతాకళ్యాణం’  జరిగినంత అందంగా ఉంటుంది”.

“పరమాద్భుతః! వాణీ, వీణాపాణీ! నీ మాటలు వింటుంటే నాకిప్పుడే మరో లోకాన్ని సృష్టించి పూర్తిగా తెలుగువాళ్ళతో తెలుగుదనంతో  నింపెయ్యాలనిపిస్తోంది”

“విధాతా! కొంచెం ఓపిక పట్టండి. నేనంతా చెప్పలేదు”.

“చెప్పు మరీ! చెప్పు మరీ! చెప్పు మరీ! చెప్పు మరీ!,” అది నాలుగు గొంతులతో ఒకేసారి మాట్లాడ్డం వలన వచ్చిన ఇకో ఎఫెక్ట్.  “పద్యాలు చదవకుండా ప్రబంధ నాయికలను పరిశోధించాలంటే ‘బాపు బొమ్మల్ని’ చూస్తే చాలు; ప్రపంచం, మనుషులు, దేవుడు సరిగ్గా అర్ధం కాకపొతే రవఁణ కధలన్నీ చదివేస్తే చాలు; బాపూరమణల సాంగత్యం మరిగితే ‘కలియుగ రావణాసురుడై’నా ‘కలాపోసన’ చెయ్యాల్సిందే; నరుల అనుభూతుల్ని, బలహీనతల్ని సానుభూతితో అర్ధం చేసుకోవాలంటే దేవతలంతా రవఁణ కధలు, డైలాగులు హాండ్ బుక్ గా వాడుకోవచ్చు; తెలుగుని, రసాత్మకతని, పెదవులు విడివడని చిరుహాసాన్ని చాలాకాలంపాటు మర్చిపోయినవాళ్ళు బాపు కుంచెనీ, రమణ కలాన్ని ఆశ్రయిస్తే చాలు; అప్పుల్లో, వాట్సప్పుల్లో మునిగిపోతున్న మనుషుల నుదుట ‘బుడుగు’, ‘రాధాగోపాళా’ల్ని చదువుతారు అని మీరు వ్రాస్తే వాళ్ళు కొంచెం సుఖపడతారు. ఓ వ్యక్తిలో మానవత్వం ఉందా లేదా అని డౌటొస్తే ‘కొంటె బొమ్మల బాపు’ అతని చేతిలో పెట్టండి, క్షణంలో వాడి ముఖంలో చిరునవ్వు కదలాడకపోతే  “వాడొఠ్ఠి నస్మరంతి” గాడని తెలుసుకోండి; మనిషి-దేవుడు రిలేషన్స్ ఎలావుండాలో తెల్సుకోవాలంటే మనుషులూ, దేవుళ్ళు కూడా బుద్ధిమంతుడులో మాధవయ్యా- మాధవుల బంధాన్ని చూస్తే  చాలు ; వీళ్ళ రచనలు, బొమ్మలు, కార్టూన్లు, సినిమాలు “శిక్ష”గా వేసేస్తే 50%  నరకవాసులు మంచివాళ్ళై పుట్టేస్తారు; వీళ్ళిద్దర్నీ స్వర్గంలో ఉండమంటే అక్కడికొచ్చిన పుణ్యాత్ములంతా స్వర్గ సుఖాలొదిలేసి ‘కోతికొమ్మచ్చి’ మొదలెడతారు”

“అమ్మో! అది కుదరదు. స్వర్గలోకం ఫంక్షన్స్ మార్చడానికి రూల్సొప్పుకోవు. వీళ్ళని వైకుంఠంలోనే వుంచుదాం”

ఆదిశేషుడు, గరుత్మంతుడూ కంగారుగా చూసారు. అక్కడే ఉన్న రామభక్త హనుమాన్ కి వాళ్ళ ఆదుర్దా చూసి రామావతారంనాటి ‘రాముడి ఆవలింతలకి  చిటికెలు’ ఉపాఖ్యానం గుర్తుకొచ్చింది. తను మాత్రం ” శ్రీ రామ జయరామ. సీతా రామా కారుణ్యధామా కమనీయనామా…” హమ్ చేస్తూ ఆనంద భాష్పాలు కార్చసాగాడు.

“క్షమించండినాధా! ఇవన్నీ మీకు తెలియవని కాదు, కలియుగం మరీ భరించలేకుండా ఉంది నరులకి. వీళ్ళిద్దరి తత్వాన్ని, భావాల్ని కొత్తతరాల నుదుట  రాస్తే నరులు కొన్నాళ్ళైనా  సుఖపడతారని తల్లిగా నా….,” శారదాదేవి మాట పూర్తయేలోపు శ్రీదేవి గొంతు సవరింపుతో వాణీ-బ్రహ్మసంవాదం ఆగింది.

cropped-bapu-ptgs1.jpg

“నాధా! రాబోయే కల్పంలో మళ్ళీ రామాయణం ఉంటుందిగా?”

“తప్పదుగా మరి!”

“అయితే ఈసారి నార్త్ ఇండియాలో వద్దు, సౌత్ లో, ఆంధ్రాలోనే పుడదాం. మీరు సరయూనది మిస్సవకుండా గోదావరి ఉండనే ఉంది”

“సరే! కానీ ఇంకా ఏదో ఉంది నీ మనసులో”

“బాల, అయోధ్య కాండలు తెలుగు నేల మీద, తెలుగు వాళ్ళతో గడిపి,  …”

“గడిపి?”

“తెలుగు సాంప్రదాయాలు, పండగలు, రుచులూ,…ఆస్వాదించి…”

“ఆఁ! దించి…?”

“అరణ్యకాండ పూర్వంలాగే పాపికొండల మధ్య గోదావరి ఒడ్డునా …”

“ఓకే! తధా…”

“ఆగండాగండి. బాపుతో పంచవటి డిజైన్ చేయించి అందులో రమణ శైలిలో మాట్లాడుకుంటూ ….”

“స్తు”

“శేషా! కంగారు పడకు వీళ్ళని అరణ్యవాసానికి తీసుకెళ్ళం. లక్ష్మి అడిగినవన్నీ వీళ్ళతో తయారు చేయించి దగ్గర పెట్టుకో. ఎగ్జిక్యూషన్  అంతా పూర్వంలా నీదే” అని ఆదిశేషుడి అంతరంగం తెలిసిన స్వామి ఇలా అన్నాక శేషుడి ముఖం పడగలై విచ్చుకుంది. బాపూరమణలు “దారుణమైన” వినయంతో మరీమరీ ఒదిగి స్వామిని, శ్రీమాతని చూస్తూండిపోయారు.

“మహాలక్ష్మీ! అనుకున్నవన్నీ అడిగావా? ఇంకేమైనా మిగిలాయా?”

“మనం త్యాగరాజు ఇంటికి అతిధులుగా వెళ్ళాం గుర్తుందా? అప్పుడు నేను త్యాగయ్యగారితో నేననుకున్నవన్నీ సరిగ్గా చెప్పలేదు, మీరు ఏమంటారోనని. ఆ మాటలన్నీ బాపు-రమణ వాళ్ళ ‘త్యాగయ్య’ సినిమాలో సీత చెప్పేసింది”

“సో?”

“ఈసారి మళ్ళీ మన రామావతార కార్యక్రమంలో త్యాగరాజ స్వామి ఘట్టం కూడా పునరావృత్తం అవుతుందంటే…”

“అవుతుంది మరి. అహల్య, శబరి, హనుమయ్య, త్యాగయ్య లేని రామకధలో రసం ఉంటుందా?”

“ఐతే ‘త్యాగయ్య’లో ఇంటివిషయాలు పట్టించుకోని త్యాగయ్యతో వీళ్ళ సీతమ్మ ఎలా మాట్లాడిందో నేనూ అలాగే మాట్లాడాలనుకుంటున్నా”

“ఏఁవర్రా! అమ్మవారనుకున్నవన్నీ జరిపిద్దామా?” అన్నాడు స్వామి. బాపు యధాప్రకారం బిడియంగా నవ్వారు,అంతే. రమణగారు మెల్లిగా,”స్వామీ ! జనం పొగుడుతారండీ, వద్దులెండి”అనేసారు.

” భూమ్మీద మీకు ఎలాగో పొగడ్తలు తప్పవు, ఇప్పుడు కింద నరులకి పైనున్న సురలు తోడౌతారు. అంతేగా?” స్వామి నవ్వాడు.

ముళ్ళపూడివారిని మొహమాటం, వినయం ముప్పిరిగొన్నా సాక్షాత్తూ దేవదేవుడు చెప్పాడు కదాని సద్దుకున్నారు.  బాపుగారు మాత్రం ఎప్పట్లాగే మౌనంతో, చిరునవ్వుతో మేనేజ్ చేసేద్దామనుకున్నారుగానీ, ఆపుకోలేకపోయారు. “మా బ్రహ్మ ఉన్నాడుగా, చేస్తాము  స్వామీ” అన్నారు. బ్రహ్మదేవుడు “అపార్ధం” చేసుకోకుండా సరస్వతి ఆయన  చెవిలో చెప్పింది, “బ్రహ్మ అంటే మీరే అనుకునేరు, రమణని బాపు బ్రహ్మ అంటాడు.” అప్పటికే అంతా అర్ధమైన బ్రహ్మదేవుడు సీరియస్ గా “బాపూ నీకు మరణం లేదయ్యా?” అన్నాడు. అందరూ ఆయన వైపు ఆశ్చర్యంగా చూసారు. బాపుగారయితే మరి నేనిక్కడికెలా వచ్చాను అన్నట్టు చూసారు. అయినా తనకి సహజాతి సహజమైన మౌనాన్నే ఆశ్రయించి రమణగారి వైపు చూశారు.

“నా రాతల్లో చిన్న టైపో దొర్లింది. మరణం అని రాయబోయి రమణం అని రాసేసాను. అందువల్ల నువ్వు జస్ట్ రమణించావు, అంతే!” అని బ్రహ్మ  వివరణ ఇవ్వడంతో వైకుంఠం ఆనందంతో – కాదు, ఆనందం అక్కడ ఎప్పుడూ ఉండేదేగా- నవ్వులతో మారు మోగుతుండగా “తండ్రీ! మీ టైపో ఎర్రర్ లోక కళ్యాణార్ధమే! ఈ మిత్రద్వయం చేసిన కళాసృష్టికి ఎంతమంది పరవశించిపోతూ ఉంటారో ఇప్పటికీను. అదంతా మీ టైపో వల్లే కదా!” అంటూ నారద  మహర్షి ప్రత్యక్షమయ్యాడు.

“కుమారా! ఎక్కడి నుండి రాక?”

“కైలాసం నుంచి. మహాదేవుడు సకుటుంబంగా వస్తున్నాడు”.

అంతలోనే ఫస్ట్ ఫామిలీ ఆఫ్ క్రియేషన్ అరుదెంచారు. వస్తూనే బాపుగారి అర్ధనారీశ్వరుడి చిత్రంలోలాగ గణపతి కుమారస్వాములని చెరో పక్క  ఉంచుకుని ఆది దంపతులు అర్ధనారీశ్వరరూపంలోకి మారిపోయారు. బాపురమణలు ప్రణమిల్లారు. శ్రీహరి తనని బాపు శివుడితో కలిపి చిత్రించిన బొమ్మ తలచుకున్నాడు, గ్రహించిన శివుడు హరిలో అర్ధభాగంగా కనబడ్డాడు. హరిహరనాధుడు ఆనందతాండవం చేసాడు. అప్పటి వరకూ ఆనంద పరవశుడై ఉన్న బ్రహ్మ శివవిష్ణువులకి ఒక ప్రపోజల్ సమర్పించాడు. అందులో ఉన్న వివరాలివి (నీకెలా తెలుసు అని అడక్కండి,  వాళ్ళు నాకు చూపించారు) – “ఈ బాపురమణ తమ సృజనాత్మకతతో ఆంధ్రజాతి లక్షణాలకి, సంస్కృతికి గొప్ప గుర్తింపునీ, అందమైన ఐడెంటిటీనీ సంపాదించిపెట్టారు. ఆంధ్రదేశంలో ఏ కాస్త రసజ్ఞ్జత ఉన్నవాడైనా వీరివల్ల ప్రభావితుడౌతాడు. అలాంటి ఆంధ్రదేశం ఇప్పుడు రాజకీయ కారణాలతో రెండు ముక్కలైంది.  రాజకీయ కారణాలు కనక ఆ మార్పుతప్పలేదు. అయినా సంస్కృతిపరంగా జాతి విడిపోయిందని బాధ పడేవాళ్ళందరి కోసం తెలుగు భాష, తెలుగు వాళ్ళు మాత్రమే ఉండేలా ప్రత్యేక గ్రహాన్ని సృష్టించాలని కోరుతున్నాను. ఈ తెలుగు భూగోళం సృష్టించడంలో, అక్కడి ప్రకృతి, సాహిత్యం, ఇతర కళలూ;  ముఖ్యంగా తెలుగు భాష, సాంప్రదాయాలకి సంబంధించి నాకు, సరస్వతికి సలహాదారులుగా టాంక్ బండ్ లలితకళాతోరణంలో ఉన్న తెలుగు వెలుగులందరి తరఫునా బాపురమణలని నియమించాలని ప్రార్ధిస్తున్నాను”

ప్రపోజల్ పరిశీలించిన శివకేశవులు తలలెత్తి చూసారు. మహాదేవుడు నవ్వుతూ, “అం..త్తేనా..?” అన్నాడు. మిత్రద్వయం ఒకరినొకరు చూసుకున్నారు  ఎక్కడో విన్నట్టుందే ఈ డైలాగ్ మాడ్యులేషన్ అనుకుంటూ. వెంటనే బ్రహ్మ అందుకున్నాడు, “అంతేనా అంటే మరొకటుందండి. ముందు దీన్సంగద్దేల్చండి మరి!” అంటూ. బాపురమణలు ఉలిక్కిపడ్డారు, ఈ  వాక్యమూ తెలిసినదే. హనుమంతుడు మెల్లిగా ఎవరికీ వినబడకుండా గుర్తు చేశాడు,”మీ ముత్యాలముగ్గు కాంట్రాక్టర్ డైలాగులయ్యా ఇవీ”  అని. ప్రాణమిత్రులిద్దరూ చేతులు కట్టుకుని త్రిమూర్తులని, త్రిమాతలని తన్మయంగా, తదేకంగా చూస్తుండిపోయారు.  శివుడు మళ్ళీ అడిగాడు, “బ్రహ్మదేవా! తెలుగు భూగోళం గ్రాంటెడ్. ఆ మరోటి ఏమిటో చెప్పు?”

“ఆదిదేవా! కొత్త తెలుగు గోళంలో రాజకీయనాయకులు మాత్రం పుట్టకూడదని ఓ శాపం, కాదు వరం, ఇవ్వండి”

“తధాస్తు”

(ఈ కధ విన్నవారు, చదివినవారు, వ్రాసినవారు బాపురమణీయస్ఫూర్తితో సృష్టించబడిన తెలుగు భూగోళంలో శాశ్వత స్థానము పొందనర్హులని  త్రిమూర్తులు వారి దేవేరులతో కలిసి దీవించిరి.)

janta

***********

==>>ఆధునిక(త)కవిటఆ<<==


 

06.30 pm – ఇప్పుడే న్యూస్ చూశా. పరిస్థితి ఆశాజనకంగా లేదు.

ఇంకోవైపు ఎంతోమంది సహృదయులు, సామాన్యులు పాప క్షేమం కోసం ప్రార్ధనలు, పూజలు చేస్తున్నారు.

అంతకంటే ఏం చెయ్యగలరు?

ముందు ఇలాంటి అన్యాయాలకి కారణమైనవాళ్ళవి, అన్యాయాలని ఆపాల్సినవాళ్ళవి మనసులు, బుద్ధులు మారాలనికూడా ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తే మంచిదేమో !?!

***

 

K…V = Kaళాతపస్V = Kaళాతపస్Vశ్వనాధ్ = కళాతపస్విశ్వనాధ్ 🙏


K_ _ _ _ V = Kaళాతపస్V = Kaళాతపస్Vశ్వనాధ్ = కళాతపస్విశ్వనాధ్

ఎందరో అభిమానులు, కళాభిమానులు, మహానుభావులు ఆ కాశీనాధుడి సొంతమనిషైన – కాశీనాధు”ని” విశ్వనాధ్ కదా మరి😊 – ఈ కళాతపస్వి గురించి చెబుతుంటే, ప్రశంసలు కురిపిస్తుంటే నేను ఏం చెయ్యలేదే అని నాకనిపిస్తుందని అలా అనిపించకూడదని ఏదో ఇలా స్వహస్తాలతో రాసుకున్న ఉడతాభక్తి  – 

వేదసారం శంకరాభరణరాగంలో సిరిసిరిమువ్వల నాదాలే శృతిలయలుగా సిరివెన్నెలలా సాగరసంగమ ప్రదేశాన వర్షించినపుడు ఆవిర్భవించిన అరుదైన స్వాతిముత్యం మన కాశీనాధుని విశ్వనాధుడిని ఈ దేశం దాదాసాహెబ్ ఫాల్కే పేరిట స్వర్ణకమలాలతో అభిషేకిస్తున్న శుభోదయంలో కాలం మారిందంటూ అందరి మనసుల్లో స్వాతికిరణాలు వెదజల్లి జీవన జ్యోతులు వెలిగించిన ఆ సూత్రధారుడికి సవినయ నమస్సుమాంజలి అర్పిస్తూ …

తెలుగు కళలకి, సాంప్రదాయాలకి ఆపద్బాంధవుడై మన సంస్కృతికి నాస్తి జరా మరణజం భయం అని తన స్వయంకృషితో అభయమిచ్చి కళామతల్లికి శుభలేఖ అందించిన ఈ కళాతపస్వితో నటసీమ సప్తపది నడవాలని ఆశిస్తూ ….

YVR’s అం’తరంగం’🙏

 

 

 

 

Why(ఎందుకు)We(మనం)Are(ఉన్నాం)?(04) – కృష్ణుడి బోధ, బుద్ధుడి బాధ, జీసస్ గాధ అన్ని వేలయేళ్ళపాటు …


whyweare-logo3

🌊🌊🌊🌊

ఇది నాలుగో అల, మిగిలినవి 👇 

కృష్ణుడి బోధ, బుద్ధుడి బాధ, జీసస్ గాధ అన్ని వేలయేళ్ళు నిలబడినప్పుడు…..

నేనెవర్ని? అంటూ అన్వేషించినంతసేపూ ఏ ప్రాబ్లమూ వుండదు. మొదటినుంచీ చివరివరకూ అంతా అంతరంగ మధనమే. మనసెంత డీవియేట్ అయినా మళ్ళీ మళ్ళీ వెనక్కి లాక్కొచ్చి అన్వేషణ కొనసాగించవచ్చు. వై యామై? (నేనెందుకు వున్నాను?) అన్న ప్రశ్న వేసుకోవడమే తడవు వచ్చి పడతాయి వెయ్యి సమస్యలు – కాదు విఘ్నాలు – కాదు తపోభంగం చెయ్యడానికి ఇంద్రుడు పంపే అప్సరసలు. అప్సరస అనేకంటే అప్‌సురస అంటే బెటరు. అంటే, ఏదైనా సాధించాలనే సంకల్పం కలగగానే, హనుమంతుడికి అడ్డుపడిన సురసలాగా అడ్డుపడేదే అప్సరస ఉరఫ్ అప్‌సురస (Up comes Surasa) అన్నమాట. హనుమంతుడంతటి వాడికి తప్ప సురసని ఎదిరించి నిలబడ్డం సాధ్యం కాదుగదా? నా జీవితానికి ఇదీ లక్ష్యం అని ఆల్రెడీ డిసైడ్ చేసేసుకున్నా, చేసుకోబోతున్నా, చేసుకుందామని అనుకున్నా ఆ క్షణం నుంచీ కన్నతల్లితండ్రులనుంచీ కట్టుకున్న భార్యతో కలిపి కన్నబిడ్డల వరకూ,  మారుతున్న సాంఘిక స్థితిగతుల నుంచీ చచ్చినా మారని బాస్ వరకూ, ఆరోగ్యం నుంచీ ఆధ్యాత్మికగురువు (పొరపాటున బురిడీగురువు పాలబడితే) వరకూ, చూపు తగ్గుతున్న కళ్ళ నుంచీ వూడబోతున్న పళ్ళ వరకూ,  వుడుగుతున్న వయసు నుంచీ ఉడుకు తగ్గని మనసు వరకూ ఏదో ఒకటి ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఇంద్రకార్యం నెరవేర్చడానికి రెడీగా వుంటారు/యి. జీవితానికో లక్ష్యం, పరమార్ధం పెట్టుకోవాల్సిందే అనుకున్నవాళ్ళు – ఐతే స్వామి వివేకానంద, రమణమహర్షిలలాగా ఆజన్మ బ్రహ్మచర్యంలో వుండిపోవాలి. లేకపోతే బుద్ధుడిలా, అరబిందోలాగా, జిడ్డుకృష్ణమూర్తిలాగా అన్నిటినీ దూరంగా పెట్టగలగాలి. ఈ రెండు మార్గాలూ మిస్సైతే, “నేనెక్కాల్సిన రైలు జీవితకాలం లేట”ని నిట్టూర్చుకుంటూ మూలపడిపోవాలి. వెయిట్! వెయిట్! రియల్లీ? మూలపడిపోవాలా? ఐ డోన్ట్ థింక్ సో. మూడో మార్గం వుంది. అది తనకున్న పరిధిలో చేయగలిగినంత చెయ్యడమే. ఏం చెయ్యాలనేదే పెద్ద సమస్య. ఒంటి మీద తోలు నుంచీ కట్టుకున్న ఆలు (మొగుడి) వరకూ కాలు అడ్డుపెట్టి మరీ ఇంక చాలు అంటుంటే, చేసినదేమైనా వున్నా అది మారుతున్న కాలానికి, క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్ … అన్నట్టు మారిపోయే మనుషుల ఆలోచనలకి, జీవనవిధానాలకి సూట్ అవ్వక మరుగున పడిపోతుంటే ఏం చెయ్యగలడు మనిషి? ఈ నవనవాభ్యుదయ విశాలసృష్టిలో చిత్రములన్నీ నావేలే… అంటూ చుట్టూ జరిగేవన్నిటిపై ఓనర్‌షిప్ క్లెయిమ్ చేసుకోగలడు కానీ కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే అనే ధైర్యం చెయ్యగలడా? చేసినా ఇవ్వగలడా? ఇదంతా నెగెటివ్‌టాక్, చేతకానివాడి ఆలోచనలు అనుకుంటారేమో 🤔 . సో వాట్? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు?నేను చేసేదేదో ఒక నూరేళ్ళో ఎట్ లీస్ట్ యాభయ్యేళ్ళో కనీసం పాతికేళ్ళోనైనా సర్వైవ్ అవ్వకపోతే ఎలా? కృష్ణుడి బోధ, బుద్ధుడి బాధ, జీసస్ గాధ అన్ని వేలయేళ్ళు నిలబడినప్పుడు వాళ్ళ స్ఫూర్తితో ఇన్నాళ్ళ జీవితాన్ని తట్టుకున్న నా ధ్యేయం పట్టుమని పదేళ్ళు కూడా నిలబడకపోతే… then what is the difference between me and an animal which has no choice but to be a helpless part of a machine called Nature? అసలు నేను ఏం చేస్తే, ఎలా బతికితే I am satisfied with this life అని అనిపిస్తుంది?

🌊🌊🌊

మూడో అల

“…అతనికి దొరికిన సత్యాన్ని మతంగా ఆర్గనైజ్ చేయిస్తాను,” అన్నాడు సైతాన్.

ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది – ఈ లైను సెల్‌ఫోన్ కంపెనీలకి బిజినెస్ స్లోగన్ కావచ్చు. కానీ అందులో ఎంత తాత్వికత – philosophical depth – వుందో కదా? ఐతే, ఐడియా బదులు ప్రశ్న అంటే ఆ లోతు పెరుగుతుంది. (P.N.👉 బిజినెస్‌మెన్‌కి ప్రజలు వేసే ప్రశ్నలు నచ్చవు. వాళ్ళ ఐడియాలకి మనం డబ్బు ధార పొయ్యాలి కానీ ప్రశ్నలు గుప్పించకూడదు. అందుకే స్లోగన్‌లో ఐడియా వుంటుంది కానీ కొశ్చనుండదు 😉 ) ఇన్ ఫాక్ట్, ఐడియా కంటే ప్రశ్నే గొప్పది. ప్రశ్నించే స్వభావమే కొత్త ఐడియాలకి దారి తీస్తుంది. కాదా? హూ యామ్ ఐ? వై యామ్ ఐ? అనే రెండు ప్రశ్నలు వేల సంవత్సరాల నుంచీ మానవులతో ప్రయాణిస్తున్నాయి, మానవ పరిణామాన్ని ప్రభావితం చేస్తున్నాయి. రెండిట్లో ఏ ప్రశ్నతో మొదలైనా రెండోది ఎదురౌతుంది. నేనెవర్నో తెలిసాక నేనేం చేస్తున్నాను?అనే ఉపప్రశ్న, దానికి తోడుగా చేసేదేదో ప్రపంచానికి మంచి చేసేది అవ్వాలనే కోరిక కలుగుతాయి. Why(ఎందుకు)We(మనం)Are(ఉన్నాం)? అనే మీమాంస, హూ యామ్ ఐ, నేనెవర్ని? అనే సెల్ఫ్ రియలైజేషన్ ప్రాసెస్ రెండూ వేరు వేరు కాదు. ఆఫ్ట్రాల్ ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్టు ఎక్కణ్ణుంచి వచ్చాం? ఎక్కడకి పోతున్నాం అనేది అర్ధం కాకుండానే – గట్టిగా మాట్లాడితే అసలు రావడం, పోవడం అనేది ఉందా లేక అదంతా జస్ట్ మెంటల్ కన్స్ట్రక్షనా? తెలుసుకోకుండానే – టపా కట్టేస్తే ఏం బావుంటుంది?(యాన్ ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ బుడగ !) అందువల్ల నేనెవర్ని? అని మరీ బాహుబలిలో ప్రభాస్ అంత భీకరంగా, భీభత్సంగా కాకపోయినా ఎంతోకొంత సీరియస్‌గా, వీలైనంత సిన్సియర్‌గా ట్రై చేసి తెల్సుకోవాలి. అయితే ఇందులో కొంచెం రిస్కుంది. ఎవరికీ? సెల్ఫ్-రియలైజేషన్ బాహుబలికి, వాడితో పాటు సొసైటీకి. ఏదో కాస్త అర్ధమైందనిపించగానే “బాహుబలి” దాన్ని ఆర్గనైజ్ చెయ్యడం, ఇన్స్టిట్యూషనలైజ్ చెయ్యడం మొదలుపెడతాడు. జిడ్డు కృష్ణమూర్తిగారి ఫేవరిట్ జోక్ ఒకటుంది. ఒకసారి దేవుడు, సైతాన్ పైనుంచి భూలోకాన్ని చూస్తున్నారట. వాళ్ళ దృష్టి దారిన పోతున్న ఒక దానయ్య మీద పడింది. పోతూ పోతూవున్న దానయ్య ‌సడెన్‌గా వంగి బాట మీదనుంచి ఏదో తీసుకుని పరిశీలనగా చూస్తున్నాడు. అతను చూస్తున్నదేమిటో దేవుడికి తెలిసిపోయింది, సంతోషంగా నవ్వుతూ సైతాన్‌తో అన్నాడు – “ఇంక నీ ఆట కట్టు. మానవుడికి సత్యం ఏమిటో తెలిసిపోయింది. నీ మాయలకి, ప్రలోభాలకి లొంగడు.” సైతాన్ కూల్‌గా చెప్పాడు, “నా ఆట ఇప్పుడే మొదలవ్వబోతోంది. ఆ దానయ్య చేత అతనికి దొరికిన సత్యాన్ని ఆర్గనైజ్ చేయిస్తాను,” అని. తర్వాతేంజరిగిందో ఊహించుకోవచ్చు. దానయ్య తనకి దొరికిన సత్యం ఆధారంగా ఓ విశ్వాసం, దానికి సంబంధించి రూల్స్, రెగ్యులేషన్స్, డ్రెస్‌కోడ్ ఏమిటి, హెయిర్ స్టైలు ఎలావుండాలి, వగైరా వగైరా స్టార్ట్ చేసాడు. అవన్నీ స్ట్రిక్ట్‌గా, కొండొకచో fanaticalగా ఫాలో అవ్వనివాళ్ళు ఎలాంటి నరకాలకి పోతారో చెప్పి భయపెట్టాడు, అయినవాళ్ళు ఎంతటి స్వర్గసుఖాలు అనుభవిస్తారో చెప్పి ఆశపెట్టాడు. ఆ తర్వాత జరిగిందంతా హిస్టరీ. ఇప్పటికీ జీ టీవీ సీరియల్లా సాగుతూనేవుంది. దానయ్యకి దొరికిన సత్యం మాత్రం దానయ్య కట్టించిన రకరకాల ఆరాధనాస్థలాల్లో బందీ అయిపోయింది. ప్రపంచంలో ఒకే ఒక్క దానయ్యే వుండివుంటే కధ ఎలా ఉండేదో ! కానీ కుల..వర్గ.. ప్రాంత..వృత్తి.. భాషా….. ఇలా ఎన్ని రకాలుగా మనుషుల్ని విభజించొచ్చో అంతమంది దానయ్యలుంటారు. ప్రతి దానయ్యకీ, అసిస్టెంట్ దానయ్యలు, సబ్-అసిస్టెంట్ దానయ్యలు…….

మొత్తమ్మీద దానయ్యల ప్రస్థానం మంచి ఉద్దేశాలు, ఆదర్శాలతోనే మొదలైనా ఒక స్టేజిలో దానయ్యల అనుయాయులకి గమ్యంకంటే మార్గం, ప్రయాణం, లగేజీ ముఖ్యమైపోతాయి. దానయ్య ఫాలోవర్స్‌కి వాళ్ళు చేరాల్సిన ఊరికంటే ఊరికి వెళ్ళే దారి మీద, ప్రయాణించే బస్సుమీద, దారికి రెండు పక్కలా ఉండే షాపులు, హోటళ్ళ మీద శ్రద్ధ ఎక్కువైపోతుంది. బస్సు ప్రయాణం కంటే రోడ్డు పక్క కాఫీ హోటల్లో కూచుని మాట్లాడుకోవడం, పేకాడుకోవడం అలవాటౌతాయి. వాటితోపాటు దెబ్బలాడుకోవడం, కాట్లాడుకోవడం, పోట్లాడుకోవడం కూడా. చివరికి కన్ఫ్యూజన్‌లో పడిపోయి, దాన్ని భరించలేక దానయ్యలెవర్నీ నమ్మకూడదనే కన్క్లూజన్‌కి వచ్చి ఎవరికి ఇష్టమైన రీతిలో వాళ్లు బతకడం మొదలెడతారు. అందులో ఒకడు ఉట్టి బతకడంలో ఫన్ ఏముందనిపించి చంపడం మొదలెట్టాడంటే వాణ్ని ఏ న్యాయం, ధర్మం, చట్టం, శాస్త్రం, నీతి, నియమం ఆపలేవు. ఇంకెవడో వచ్చి వాణ్ని చంపేవరకూ. ఈ సొదంతా ఎందుకంటే దానయ్యలని గుడ్డిగా ఫాలో అవ్వడంవల్ల కలిగే ప్రయోజనం లిమిటెడ్, పరిమితం అని చెప్పడానికే. దానయ్య ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ అతని అనుభవాన్ని మరొకరికి ఇవ్వలేడు. జస్ట్, గైడ్ చెయ్యగలడు. “ఆహారనిద్రాభయమైధునాలు ఎవరికివారు చేసుకోవాల్సిందే, అవి పనివాళ్ళు చేసిపెట్టేవి కాదని అయ్యగారికి చెప్పరా,” అని అందాలరాముడులో రమణగారు రాస్తే ఏఎన్నార్ నాగభూషణం మీద విసిరిన డైలాగుంది. ఆ నాలుగిటిలాంటిదే ఆధ్యాత్మికానుభవం కూడా. Don’t take me wrong. ఒక్క ఎక్స్‌పీరియెన్సింగ్  విషయంలో తప్ప ఆ నాలుగిటినీ స్పిరిచ్యువాలిటీని ఒక గాటన కట్టడంలేదు. సో, దానయ్య ఆచరించి మరీ బోధించిన ఫిలాసఫీ మనలో జ్ఞానకాంక్షని తీరుస్తోంది, మన సత్యాన్వేషణకి గమ్యం చూపిస్తోంది అనిపిస్తే, మనం కన్విన్స్ అయితే ఆ ఫిలాసఫీని ఎవరంతట వారు అనుభవంలోకి తెచ్చుకోవాలి. Who Am I? Why Am I? Whence do I come? Where Am I heading to? ఈ ప్రశ్నలతో సతమతమై, రాజీలేని సమాధానం కోరుకున్న వ్యక్తికే ఫిలాసఫీని స్వీయానుభవంలోకి తెచ్చుకునే అవసరం, ఆకాంక్ష కలుగుతాయి. ఆన్సర్స్ దొరుకుతాయి. ఆ ఆన్సర్స్‌కి అనుగుణంగా ఆ వ్యక్తి జీవనవిధానం మారుతుంది. అప్పుడే ఆ లైఫ్‌కి నిజమైన, అర్ధవంతమైన పర్పస్ ఏర్పడుతుంది. ఆ పర్పస్‌లో హింస, మోసం, స్వార్ధం వుండవు. మంత్రతంత్రాలు, కన్వర్షన్లు, క్రూసేడ్‌లు, జిహాద్‌లు, ఫత్వాలు వుండవు. వాటి అవసరం ఆ వ్యక్తి జీవనవిధానంలో వుండదు. ఒక సుకుమారమైన పువ్వు, ఒక తియ్యటి పండు, ఒక పూలమొక్క, ఒక పళ్ళచెట్టు, ఒక మహావృక్షం – వీటి జీవన విధానం ఏమిటో, వీటి లైఫ్ పర్పస్ ఏమిటో – I think it is called ఋషిత్వం – అదే ఆ వ్యక్తి జీవితంలో ప్రతిఫలిస్తుంది. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారిన ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ (నేనెక్కడున్నాను, ఎలా వచ్చాను, ఎక్కడికిపోతానులాంటి ప్రశ్న నాబుర్రలో మెదిలే ప్రశ్నేలేదు) ఏదో అలాంటిదే ఈ వ్యక్తిలోనూ మార్పు తెచ్చింది.

🌊🌊

రెండో అల

ప్రశ్నించడం అనేదో కన్జెనిటల్ డిసీజ్, or, is it?

కృష్ణుడు చెప్పినట్టుగా సీరియస్‌గా సత్యాన్వేషణలో పడ్డ ఇరవైమందిలో ఒక్కడు అల్టిమేట్ రియాలిటీని అర్ధం చేసుకుని బుద్ధిగా జస్ట్ అలా “ఉండడం(to exist)” కి అలవాటు పడతాడు. అల్టిమేట్ రియాలిటీలో మొదలై తిరిగి అదే అల్టిమేట్ రియాలిటీలో అంతమయ్యే ప్రయాణం – ఉనికి, జీవితం, ఎగ్జిస్టెన్స్‌కి  –  నదిలో లేక నదిగా కొట్టుకుపోతున్న నీటిచుక్క అన్‌కాన్షస్‌గా ఏదో అలా కొట్టుకుపోవడం కాకుండా నేను ఆవిరై గాల్లో కలిసిపోవచ్చు, మట్టి నన్ను పీల్చేసుకోవచ్చు, కాలుష్యం నిండిన ఢిల్లీ యమునానదిలా తయారవ్వచ్చు, ఉప్పునీళ్ళల్లో కలిసిపోయి సముద్రంపేరుతో చెలామణీ అయిపోవచ్చు ఏదైనా కావచ్చు అనే స్పృహతో కాన్షస్‌గా కొట్టుకుపోతుంటే  అది “జస్ట్ ఉండడం (Being)” – ఉనికి. నీటిచుక్కకి కాన్షస్‌నెస్ ఉంటుందా అంటే అదో డిఫరెంట్ సబ్జెక్ట్. ఐనా, కాన్షస్‌నెస్ ఉంటేమాత్రం ఏం చేస్తుంది? దండంపెడుతూ ప్రవాహంలో కొట్టుకుపోడం తప్ప. దండంపెట్టాలన్నా చేతులుండాలి కదా. సో, దాని గతి సంపూర్ణశరణాగతే. total surrender ఒక్కటే శరణ్యం. మనిషిలాగా పరిస్థితి మార్చుకునే ఫెసిలిటీ – కాళ్ళూ, చేతులూ, రెక్కలూ, నోరూ ఎట్సెట్రా లేవుగా మరి. ఆ సౌకర్యం వున్న మానవజీవి మాత్రం రకరకాల సర్కస్ ఫీట్లు చేస్తూ ఉంటుంది.  బట్, ఎన్ని ఫీట్లు చేసినా తన చేతుల్లోలేని పుట్టుక, చావు మధ్యనే. ప్రతి మనిషి కూడా చచ్చినట్టు పుట్టాల్సిందే. చచ్చినట్టు చావాల్సిందే.  ఒక్కసారి పుట్టాక చచ్చినట్టు బతకాల్సిందే(పోయేవరకూ). జంతువులు పాపం ఎందుకు పుట్టాం, ఎక్కడికి పోతాంలాంటి ప్రశ్నలు వేసుకోవు(మనకి తెలిసి)కదా. అవి ఇంచుమించు ప్రవాహంలో కొట్టుకుపోయే నీటిచుక్కతో సమానం.  పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడిమి పని నాటకము అంటూ రాగాలు తియ్యలేవు. మనిషికి మాత్రం కాస్త సర్కస్‌ఫీట్లు చేసే చాన్స్ ఉండడంతో తనకి నచ్చని స్థితిలోంచి తను బాగుంటుందనుకునే స్థితిలోకి మారడానికి ప్రయత్నిస్తాడు. మార్పు తృప్తికరంగా ఉంటే ఓకే. లేకపోతేనే నట్టనడిమి పని అంతా నాటకంలా అనిపిస్తుంది. నిజంగా నాటకమా కాదా? నిజం ఎవరికి తెలుసు? Who am I? Why am I? What is this journey called life? Where do I come from and where am I heading? Is there purpose for this life?ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు గురువులు చెప్పింది విని బుద్ధిగా నమ్మేయ్యడం కాకుండా స్వీయానుభవంతో తెలుసుకుని ఆ ఎవేర్‌నెస్‌లోనే మొత్తం జీవితాన్ని నడుపుకోగలమా? ఏమో, అది సాధ్యమేనేమో, కానీ ఎందుకలా అంత కష్టపడి అవసరంలేని ప్రశ్నలు వేసుకుని వాటికి జవాబులు వెతుకుతూ, దొరికిన జవాబులు రైటో కాదో తెలిసే అవకాశంలేక ప్రశ్నల్తోనే జీవితాంతం ప్రయాణం చెయ్యడం అనే ప్రశ్న వస్తే అది కచ్చితంగా సరైన ప్రశ్నే. కానీ ఈ ప్రశ్నించడం అనేదో కన్జెనిటల్ డిసీజ్. మొట్టమొదట నిప్పు రాజేసినవాడితోనో చక్రం కనిపెట్టినవాడితోనో మొదలై వేదకాలపు ఋషులకి, అవేవో రకరకాల నదీ తీర నాగరికతల వాళ్లకి అంటుకుని సోక్రటీజ్, బుద్ధుల వరకూ పాకి ఆ పైన లెక్కలేనంత మందికి వ్యాపించి ఇప్పటికీ నయం కాని, మందులేని సహజసిద్ధ’వ్యాధి’. దానికి మందుగా ఒక్కోసారి విషం తాగాల్సి రావచ్చు, సిలువ ఎక్కాల్సి రావచ్చు. ఒకప్పుడు ఈ ‘వ్యాధి’లేక “బాధపడుతున్న”వాళ్ళు పుర్రెలో పుట్టిన బుద్ధి పుడకలతో గానీ పోదన్చెప్పి గియోర్డానో బ్రూనో అనే ఆయన్ని బతికుండగానే కాల్చి చూశారు. సామెత తప్పని ఋజువు చేస్తూ అప్పటికే ఆ బుద్ధి ఇతర పుర్రెల్లోకి ప్రవేశించింది. ప్రశ్నా పరంపర కొనసాగించింది. కొనసాగిస్తోంది.

🌊

అల

Uncertainty is the only Certainty

ఈ ప్రశ్న ఎప్పుడూ తలెత్తని మనిషి నిజంగా అదృష్టవంతుడు(రాలు). ఈ మీమాంస మొదలైన మైండ్‌కి ప్రశాంతత దొరకడం కష్టం. ఒకవేళ దొరికినా అది తాత్కాలికమే, టెంపరరీ ఫినామినన్. ఎందుకు టెంపరరీ? ఎందుకంటే, మనిషి ఉనికే టెంపరరీ కనక. ఈ ప్రపంచంలో, ప్రపంచం మరీ చిన్నది, విశ్వంలో Uncertainty is the only Certainty. నదిలో కొట్టుకుపోయే నీటిచుక్క తను ఆవిరైపోయేవరకూ తనో పేద్ద నదిననే అనుకుంటుంది. ఆవిరై మేఘాల్లో చేరిపోయాక? తనో కుములో నింబస్ మబ్బునని అనుకుని ఉరుములు, మెరుపులతో నానా హడావిడీ, ఆర్భాటం చేసేస్తుంది. వర్షంగా కురిసి బురదగానో, వరదగానో మారేవరకూ. దానికి తెలీని సంగతి ఏంటంటే తన ఐడెంటిటీ, నీటి బిందువు నుంచీ మహా సముద్రం వరకూ మధ్యలో బురద, వరదతో సహా ఎలాగైనా మారొచ్చు అని.

వెయ్యికోట్లఏళ్ళ క్రితం బిగ్‌‌బాంగ్‌తో మొదలైన ఈ దృశ్యప్రపంచంలో మనిషి పాత్ర ప్రవేశించి కొన్ని క్షణాలే అయింది. ఇంతలోనే మనిషి బుర్రలో ఎన్ని ప్రశ్నలు? ఈ పూటకి నూకలెక్కడ దొరుకుతాయ్? నుంచీ భూమ్మీద నూకలు చెల్లాక ఎక్కడికి పోవాలి వరకూ. అన్నిటికీ జవాబులు దొరుకుతున్నాయా? అది డౌటే. జవాబుల కోసం వెతుకుతున్నామా అంటే ముందు అడగాల్సింది అసలు ప్రశ్నలు వేస్తున్నామా అని…..

ఏడు బిలియన్ల జనాభాలో ప్రశ్నలు వేసుకుని, జవాబులు వెతుక్కునే లగ్జరీ ఎంతమందికి దొరుకుతుంది? ముందీ ప్రశ్నకి ఆన్సర్ వెతకాలి. అక్కర్లేదు, కురుక్షేత్రంలో మొట్టమొదటి ప్రపంచయుద్ధం జరిగినప్పుడు (1914 – 18 జరిగింది రెండో ప్రపంచయుద్ధం) అర్జునుడికి అర్జెంటుగా వై వియ్ ఆర్ అనే ప్రశ్నకి సమాధానం కావాల్సొచ్చింది. కృష్ణుడు కూడా అంతే అర్జెంటుగా విశ్వరూపం చూపించి హడలగొట్టేవరకూ యుద్ధం చెయ్యనని భీష్మించుక్కూచున్నాడు. ఆ తరవాత “అర్జునా! కోట్లాదిమందిలో ఓ పదిమందికో ఇరవైమందికో ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడం, సమాధానాలు వెతకడం అనే హాబీ ఉంటుంది. వాళ్ళలో ఏ ఒక్కడికో మాత్రమే కరెక్ట్ ఆన్సర్ తెలిసే అవకాశం వుంటుంది,” అని తేల్చేసాడు(సింది) పరమాత్మ. అందువల్ల ఎవరికైనా ఎగ్జిస్టెన్షియల్ డౌట్స్ వచ్చాయంటే పరమాత్మ షార్ట్ లిస్టు చేసిన పదీ ఇరవై మందిలో వారూ ఉన్నట్టే లెఖ్ఖ. ఐతే, చివరికి సెలక్ట్ అయ్యేది ఒక్కరే కదా! తనెందుకు “ఉన్నాడో” వాడికి తెలిసిపోయింది కనక వాడితో ప్రపంచానికి, ప్రపంచంతో వాడికి గొడవేంలేదు.

🌴🌹🌾🌿🌷హాపీ వృక్షావళి!! పుడమితల్లి కోసం చిన్న హాండ్‌మేడ్ వీడియో🌷 🌿 🌾 🌹 🌴


🌹This is not preaching but just ideas and dreams to share with those who have the might and the means to make them happen🌹 

భూమాత దశాబ్దాల మన ‘బాల్యా’న్ని మనకిష్టమైనట్టు గడపనిచ్చింది. తనకిష్టమైనవి, తనకి కావాల్సినవి త్యాగం చేసింది. ఇప్పుడింక నేలతల్లికి అవసరమైనవి మనమివ్వాలి. మన ప్రాధాన్యతలు, ప్రయారిటీలు మార్చుకోవాలని నేలతల్లి పర్యావరణం ద్వారా సంకేతాలిస్తోంది. పిల్లలకి ఒక వయసు వచ్చేవరకూ బొమ్మలు ఆటలు తప్పనిసరి. బాల్యం దాటాక పుస్తకం చదవాలి, మస్తకం పనిచెయ్యాలి. పుడమితల్లి తన పిల్లలకి అదే చెప్తోంది. టపాకాయగా మారి పేలిపోయిన ప్రతి రూపాయికీ ఒక చెట్టు నాటమని మౌనంగా సైగ చేస్తోంది.

సింపుల్‌గా, అందంగా, ఏదో లోతైన సత్యాన్ని మనసుకి స్ఫురింపజేస్తూ వెలిగే దీపంతో మనం గడిపేది కొన్ని నిముషాలు. ఆనందంతోపాటూ హడావిడి, ఆర్భాటం; వీటికి తోడు ఆడంబరం వెంటేసుకుని వచ్చే స్వీట్లు, టపాకాయలకోసం వెచ్చించే సమయం కొన్ని గంటలు. నానాటికీ కలుషితం అవుతున్న నైతిక వాతావరణం మనం దీపానికి ప్రాధాన్యత పెంచాలని చెబుతోంది. స్వచ్ఛంగా వెలిగే దీపాన్ని మనసులో సత్యంగానూ, బాహ్యంలో ఆ దీపపు పరమార్ధాన్ని ప్రతిఫలించే వృక్షాల రూపంలోనూ శాశ్వతత్వం కల్పించమని ప్రకృతి, మానవప్రకృతి కోరుకుంటున్నాయి. టపాకాయల హంగులకి, మండి మాడి ఉక్కిరిబిక్కిరి చేసే పొగగా మిగిలే వాటి వయసుపొంగులకి చెట్టూచేమల పచ్చిగాలితో, పూలూపళ్ళ సుగంధాలతో సాంత్వననివ్వాల్సిన సమయం వచ్చిందనీ, దీపావళితో వృక్షావళినీ పండగగా చేసుకోవాలనీ భావితరాల భవిష్యత్తు భారతీయులనడుగుతోంది.

 

🌹This is not preaching but just ideas and dreams to share with those who have the might and the means to make them happen🌹 

🐦🌄🌏🙏🌊🐦

 

 

Beauty is in the “I” of the Beholder


bfly 02

Hi! If you continue to read till the end it is the beauty, the colors and the tenderness which the mother-nature had endowed me with that prompts you to do so. I think. And I think I am right! Because I believe that beauty is in the eye of the beholder. If you think I am right then I have a story to share with you and you might like to share it with others who you think might benefit from it. But, before the story I want to say something about the beauty which as the beholder you have in your eye; the beauty that caused your exhilaration at my beauty – it is nothing but the quality that makes you love Nature, Beauty, Truth, Freedom and the underlying Oneness of all beings. I know, because that quality is what gave me the beauty that flowed from your eyes through your mind into your fingers moving them to make that click. Now the story –

My life started as a cater pillar, an ugly and fat cater pillar whose sole occupation was to eat, eat and eat more. I was always in a hurry to eat, to gobble up whichever tender leaf or delicate flower that my eyes fell on. I was consumed by an eagerness to consume everything. I never knew that things have feelings and that those feelings make an impact on us. But, that was until in a fateful moment, a moment in which my mind, almost by accident, registered a flower’s frightful shudder at my sight. That was when I, for the first time in my life, had a thought. I can even say that it was the first time I sensed there was something called “I” in me. From that moment on, Thinking started in me and I started to BE. Being caused an aspiration in me for BEEing. Yes, you heard it right. I coined this word Beeing. It means my endeavor to be like a honey bee. My yearning to adopt a honey bee’s way of living lead to the metamorphosis that transformed an ugly, greedy cater pillar into a butterfly.

As I said, I learnt thinking, about me as well as others, when I first saw a flower’s feelings as I was devouring it. Yes, I devoured it in spite of an uneasy feeling welling up within my heart. Today I call it guilty conscience. But then I couldn’t help eating up that tiny, fragrant flower as eating was the goal as well as the means of my existence. I came to know much later that the kind of existence I lived had taken up many forms. Ego-centrism, narcissism, materialism, chauvinism, etc. at individual level and racism, fascism, imperialism, expansionism, fanaticism, etc. at a collective level. I also understand that these ’isms’ are causing much destruction, violence, war and environmental disasters to the detriment of earthlings including my friend Honey Bee and I. Yes, we are threatened, our populations are getting isolated and going locally extinct. Am I digressing?  Okay.  The spark of guilty conscience that a flower’s disgust caused in me gradually grew into a roaring fire stoked up by the death cries of a thousand flowers. It burnt me from within until I could feel the flowers’ pain from without. And that’s when I happened to see the inspirer of my metamorphosis, the Honey Bee. I saw him, or rather her? No, It’s neither. Honey Bee is just It and is largely free of all kinds of ego, even that associated with gender. Honey Bee’s is the true being. It never hurts a flower while collecting nectar and repays the flower’s favor by spreading its pollen. It has a formidable weapon but uses it only in self-defense. Its life is spent in building and supporting its society. Its livelihood? Perfect model of non-violent symbiosis. A Flower fails to tremble in disgust at the sight of a Honey Bee. Rather, it laughs beautifully, and in ecstasy, as the bee carries its pollen, knowing that the purpose of its life is fulfilled.

Why can’t I be a Bee? Why this life of predation? What for is this parasitic existence?

I wanted a meaning for my life, a purpose for living. And I yearned for it so powerfully that I wept, I prayed and I tugged at the feet of that invisible primal power that brought me into ‘this’ all-consuming existence. Then I imprisoned myself in my own cocoon lest I feel tempted again to re-embark on my destructive career. Made a final and quiet promise to myself that I would either turn into a bee-like being or I return whence I came. I don’t know what happened thereafter but I opened my eyes to see a new “I”. Mother Nature turned me into a BEEing bestowing on me all the colors and the delicacy of the flowers that I once ate. Now I do everything like a bee does. Well, almost. I am happy. More than that nobody, including myself, hates me. I am no longer a all-consuming, shall I say, desire-fulfilling machine. I have a purpose, Live Beautifully and Let other beautiful things Live.

Did I go through a state of Samadhi like an Indian sage? Did I attain to a state of Nirvana of a Buddha?  Or was I swept away by the flow of Universal Love that flooded the heart of a Jesus? I don’t know. I don’t need to know. All that I know and experienced was a sense of unity with the entire universe, a touch of the invisible thread that binds all beings. I think that feel is what manifests as the beauty, the colors, the tenderness and the freedom that you see in my form, in my movements and in my way of living. And that’s what resonates in you as your love for Nature, Beauty, Truth, Harmony Freedom and the underlying Oneness of all beings. Now, please do not think that this story is meant to benefit you in anyway because you already have it in you, the Universal Love, which, I feel, sparked your interest in Beauty is in the “I” (the personality, the character, the nature, the soul) of the Beholder. This story is for those who are very close but are yet to touch the invisible chord within that plays the music of Universal Love. Hope it will reach them !!!

*****