Category: సైంటిఫిక్ హిందూ

సైంటిఫిక్ హిందూ – దేవుడిపై ఒక ఫిజిసిస్ట్ అభిప్రాయానికి కదిలిన అం’తరంగా’లు


“దేవుడిపై ఒక ఫిజిసిస్ట్ అభిప్రాయంపై నా అభిప్రాయం” పేరున ఆవకాయ డాట్ కామ్ లో వచ్చిన నా ఆర్టికల్ ఇది.

దేవుడనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ ఒక అమెరికన్ ఫిజిసిస్ట్ తెలిపిన తన అభిప్రాయం ఇది –

“Every account of a higher power that I’ve seen described, of all religions that I’ve seen, include many statements with regard to the benevolence of that power. When I look at the universe and all the ways the universe wants to kill us, I find it hard to reconcile that with statements of beneficence.”
తను నాస్తికుణ్ణని చెప్పడు కానీ ఆస్తికుణ్ణనీ అనడు. అగ్నోస్టిక్ కేటగరీ. సైంటిస్టుగా చాలా సాధించాడు, వ్యక్తిగా మంచివాడు. ఆయనలో తప్పు పట్టేందుకు ఏమీలేదు. బట్, చదువుకున్నవాళ్ళని ఇలాంటి స్టేట్మెంట్స్ ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా మతంపట్ల విముఖతతో ఉన్నవాళ్ళని.
మనిషిని దేవుడికి దగ్గరచెయ్యాల్సిన వివిధ మతాల్లో చోటుచేసుకునే మూఢవిశ్వాసాలు, దురాచారాలు, వితండవాదాలు, ఫెనాటిసిజాలకి విసుగు చెందిన వాళ్ళు ఆస్తికత్వానికి, దేర్-ఫోర్ దేవుడికి దూరంగా జరగటానికి ఇవి ఊతం ఇస్తాయి.

నాస్తికత్వాన్ని సపోర్ట్ చెయ్యడానికి సైన్సుని వాడుకోవడం సర్వసాధారణం. సైన్సులోనే ఆస్తికత్వాన్ని చూడడం కొంచెం అరుదు. God is no where అని ఒక సైంటిస్ట్ అన్నప్పుడు, వివేకానందుడు లేక స్వామి రామతీర్థ God is now here అని అక్షరాల సద్దుబాటుతో సమాధానం ఇచ్చారని అంటారు. దృక్కోణం మారితే భగవంతుడు ఎక్కడ చూసినా కనిపిస్తాడు. సో, సైంటిస్ట్ మాటలకి కదిలిన నా ఆలోచనలు ఇలా సాగాయి –

What is universe and what are you? Are you not a part and parcel of the universe? Can a wave ever think of the ways the ocean tries to kill it? A wave owes its existence to the ocean and has no separate existence or “non-existence” of its own. It results from the movements of the ocean; has a brief existence and finally disappears into its originator – Only to appear again at a different point in the same old ocean! Then where and how does the question of the ocean killing a wave arise? Unless the wave starts questioning /exploring the ways in which the ocean created it.
ఆ సైంటిస్టుతో మాట్లాడే అవకాశం ఉంటే పైవిధంగా వాదించేవాణ్ణేమో. అదెలాగో అయ్యే పనికాదు కనక నాకు నేను ఇచ్చుకున్న ఎక్స్ప్లనేషన్ ఇదీ –

The process of a wave exploring its ”OWN” origin, identity and destination- if and when it does – is but a false assumption, on the part of the wave, that it is an entity different from the ocean. This means that the wave in its infatuation with one phase of its existence is forgetting its more permanent state, the Ocean. Why I say ‘more permanent’ is because at an even deeper level, the Ocean itself becomes a transient phase of Water, the primary reason for the existence of ocean.

Likewise, man thinks that he is separate from his origin which in its ultimate state is called God. మనిషి ఎప్పుడైతే విశాల విశ్వం నుంచి తనని తాను దూరం చేసుకుని, ప్రత్యేక అస్తిత్వాన్ని ఆపాదించుకుంటాడో అహం అనే దశలోకి ప్రవేశిస్తాడు. అదే రకరకాల మంచి, చెడు అనుభవాలకి మనిషిని గురి చేస్తుంది. అదృష్టవంతుడైతే తిరిగి తన నిజమైన అస్తిత్వమైన అద్వైతస్థితిని గ్రహిస్తాడు. లేకపోతే …..???

Now, on the benevolent aspect of the Higher power –
Isn’t it easy to realize that the beneficence of the universe/the higher power is expressed in two ways? [ఐ డోంట్ వాంట్ టు థింక్/టాక్ అబౌట్ మిరాకిల్స్ హియర్. జస్ట్ వాంట్ టు కీప్ మై ఫీట్, అండ్ మైండ్ యాజ్ వెల్, ఆన్ గ్రౌండ్ 🙂 ]

The universe’s first beneficent expression is ever existent in the form of the natural processes and the laws governing those processes that made the formation and evolution of life on earth possible.
సునామీలతో విరుచుకుపడే సముద్రమే జీవానికి, ముఖ్యంగా మనిషికి అత్యవసరమైన వర్షానికీ, నదులకీ కారణం.
భూకంపాలు, అగ్నిపర్వతాలతో భయపెట్టే భూమే జీవుల అన్ని అవసరాలూ తీరుస్తుంది.
ప్రమాదకరమైన రేడియేషన్స్ తో నిండి ఉన్న అంతరిక్షంలోనే వాటిని నిర్వీర్యంచెయ్యగల వాతావరణం, స్ట్రాటోస్ఫియర్, భూమ్మీద జీవాలకి రక్షణ కవచంగా ఏర్పడింది.
జంతు ప్రపంచంలో చూస్తే ఒక జీవిని మరొక జీవి చంపి తినే వ్యవస్థ ప్రకృతి సహజంగా ఏర్పడినదే. ఒక జీవి అంతం అవడంలో మరో జీవి మనుగడకి కారణం ఔతుంది. అదే వ్యవస్థలో ప్రతీ జంతువుకీ కొమ్ములు, కోరలు, కవచాలతో పాటు తన పరిసరాలతో కలిసిపోయేలా రంగులు మార్చుకోగలగడంవంటి ఆత్మరక్షణ పద్ధతులు అనేకం అదే ప్రకృతి ఇస్తుంది. Nature is simultaneously protective and destructive depending on how a living organism adapts to it. In case of humans it is humans’s skill in manipulating nature to his benefit that made it possible for humans to evolve and survive all the ordeals that maleficent aspect of nature causes. I think we can say man inherited the beneficent aspect of nature in the form of discerning and discriminating intelligence which is not present (or is yet to develop) to the same degree in other life forms. If this is not beneficence what is?
సృష్టిలో జీవుల మనుగడకి ఆలంబన ఇచ్చే శక్తుల కన్నా వినాశనం చేసేవి ఎక్కువున్నాయనుకుంటే మొట్టమొదటి జీవి సర్వైవ్ అయ్యేదా?తన చుట్టూఉన్న వినాశకర పర్యావరణం నుంచి తనకు తాను రక్షణ వ్యవస్థలని కల్పించుకుంటూ, పరిస్థితులు మారుతున్నప్పుడల్లా వాటికి అనుగుణంగా పరిణామం చెందుతూ జీవం కోట్లఏళ్లుగా కొనసాగలేదా? పరిస్థితుల్ని తనకనుగుణంగా మలుచుకునే శక్తీ యుక్తీ జీవానికి సృష్ట్యాదినుండీ ఉన్నాయి. సృష్టికర్త ఆ శక్తియుక్తులతో పాటు అంతులేనన్ని సవాళ్లుకూడా జీవి ముందుంచాడు. ఇప్పటి వరకూ ఎదురైన సవాళ్ళన్నిటినీ విజయవంతంగా అధిగమించింది కనకే జీవం నిలబడింది.
The second way in which the higher power’s beneficence manifests itself takes the forms of compassion, cooperation, understanding, love, truth, non-violence, liberty, equality, fraternity, etc, the finer principles of a higher level of existence, that arose and evolved in the hearts and minds of the great souls that the earth has given birth to.

ఏకం సత్ విప్రాః బహుదా వదంతి
(One is the Being that the sages call by various names)

పండితాః సమదర్శినః
(He sees truly, who sees the Supreme Lord, existing equally in all beings, the unperishing within the perishing. Seeing equanimously the same Lord equally dwelling everywhere, one does not destroy the Self by the self; and then reaches the highest goal.)

వసుధైవ కుటుంబకమ్
(Yoga Vasishtha : “Poorly constituted minds, ignorant as they are, say that this is my relative, my friend, my family, this is mine, and this is not mine. But to a large-hearted individual whose perceptions have exceeded the limits of ordinary thinking, the whole world is a family.”)

Do unto others as you would have them do unto you.
(Attributed to various great men like Yudhishtira, Confucious, Jesus,..)

ఈ వాక్యాల సృష్టికర్త మనిషే ! మనిషికున్న దయ, ధర్మం, నిగ్రహంలాంటి ఉదారగుణాలకి ఇలాంటి రియలైజేషన్సే మూలం. వీటి ఆధారంగానే మహాత్ముల ఆలోచనలు, బోధలు సాగింది. ప్రపంచంలో మంచి అనేది ఉందంటే వీటి పాత్ర అస్సలేమీ లేదు అనుకోగలమా? Are they not benevolent expressions from one fine product of universal evolution, the man?

So, the scientific man’s impression that the universal forces conspire to kill us stems from the fact that his focus is only on the destructive aspect of the physical forces that have in their constructive aspect contributed to the development and survival so far of life. మనిషి ఒక్కడూ ఒకటి, తక్కిన విశ్వమంతా ఒకటి అనుకుంటే తప్ప అలాంటి ఆలోచన రాదు. దృష్టిబేధం తప్ప సృష్టిబేధం కాదు. మనిషి దృష్టికే బేధం కనిపిస్తుంది, రిలేటివిటీ వల్ల. సృష్టికర్తకి సృష్టి మాత్రమే కనిపిస్తుంది, సృష్టికర్తది కైవల్య(Absolute)స్థితి కనక. ఆయన కళ్ళకీ, మనసుకీ బేధం అనే కాన్సెప్ట్ వుండదు.

విష్ణుసహస్రనామంలో మొదటి రెండు పదాలు, విశ్వం విష్ణుః గుర్తొస్తున్నాయి. విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం.

Viswam Vishnu

***అణోరణీయాన్ మహతోమహీయాన్***

పవన్-కళ్యాణ్ కీ,సింహానికీ గడ్డం గీసుకోడంకంటే ఎక్కువ తేడాలున్నాయనీ….A sequel


పవన్ పేరు, సింహం పేరూ వాడుకుని పోస్టు మొదలుపెట్టి వాళ్ళ గురించి అస్సలు రాయకపోతే ఎలా? ఇవాళ వాళ్ళ గురించే రాద్దామని మొదలుపెట్టాను. ఏం రాస్తానో ఎంతవరకూ రాస్తానో ఇప్పుడే మొదటిలైన్లోనే పిక్చర్ రాదు. “మా”ర్క్ -ట్వైన్ గురువుగారు చెప్పినట్టు మొత్తం రాసే దాకా నువ్వేంరాయాలనుకున్నావో నీకే తెలియదు. పూర్తయ్యాక కానీ రాయటం మొదలవదు. అందువల్ల పెద్ద పెద్ద ప్లాట్లు వెయ్యకుండా మామూలుగా రాసుకుపోతా.

పవన్ ? (or) సింహం? ఎవరితో మొదలుపెడదాం? నాకు పవన్ కంటే సింహం గురించే కాస్త ఎక్కువ తెల్సు. దాని తోటే ముందు మొదలెడతా. ఈ సింహం ఉంది చూసారూ? ఒక్క గడ్డం విషయంలో తప్ప పవన్ కళ్యాణ్ తో ఏ విధమైన పోలికా లేదు. సినిమా కాబట్టి , సింహానికి ఉన్న ఇమేజిని బట్టి ఆ డైలాగ్- గడ్డం గీసుకోవడంలో తప్ప మిగిల్నవన్నీ సేమ్ టు సేమ్- వేసేశాడుగానీ పీకే కి సింహం విషయం తెలీకకాదనుకుంటా. పవన్ తనని తను సింహంతో కంపేర్ చేసుకున్నాడూ అంటే ఆ సింహం చేసుకున్న పుణ్యమేంటో, అదెంత గొప్పదై ఉంటుందో అనుకునేవాళ్ళు త్రిలింగదేశంలో చాలామందే ఉంటారు. త్రిలింగదేశం అంటే అన్-డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ అనే- అని మాత్రమే- కవి హృదయం. త్రిలింగ అన్న పదం తెలంగాణాని మాత్రమే సూచిస్తుందని, తెలుగువాళ్ళున్న ఏరియా అంతటినీ అని, ఒక సామాజికవర్గం నివసించిన ప్రాంతం కనక ఆ పేరొచ్చిందని (తెలుగు అనే పదంకి దగ్గరగా ఉంటుందా సామాజిక వర్గం పేరు) రకరకాల థియరీలున్నాయ్ కానీ ఆర్యన్ ఇన్వేజన్ థియరీ వెర్సస్ ఆల్టర్నేటివ్ థియరీస్ లాగా ఇవి కూడా ఎప్పటికీ తెగేవికావు. తెగితే రాజకీయాలు ఆ మేరకి తగ్గి పోతాయి. సో, మనిషి మైండ్ లో రాజకీయ పురుగు బతికున్నన్నాళ్ళూ ఈ థియరీలు రాజ్యం చేస్తూనే ఉంటాయ్. సరైన పురుగుల మందు వాడితే తప్ప థియరీల ఆధారంగా రాజకీయాలు, వాటికి సంబంధించిన సకల దుష్పరిణామాలు తప్పవు. పురుగుల తీవ్రతని బట్టీ కొందరికి మందు నెత్తిన జల్లితే చాలు.
కొందరికి మాత్రం, అనకూడదు గానీ ,తాగించడమే దారి.
Let me return to the main topic, i.e. సింహం now. పవన్ ఎండార్స్-మెంట్ వల్ల గడ్డం గీసుకున్న సింహం టీ-షర్ట్స్ ఎవన్నా త్రిలింగ దేశంలో ఫాషన్ అయ్యాయేమో తెలీదు, తెలుగువాళ్ళు మరీ తమిళతంబిల్లా ఉండర్లెండి. ఇదే డైలాగ్ రజనీకాంత్ వేసుంటే టీ-షర్ట్స్, లుంగీలు + గడ్డం గీసేసిన సింహానికి ఓ గుడి రెడీ. మనకి, అంటే ఆర్డినరీ ఇండియన్ కి తెలిసిన సింహం కవిత్వాల్లో, రచనల్లో, సినిమా డైలాగుల్లో ప్రొజెక్ట్ అయిన, ఐమీన్ వర్ణించబడిన సింహం మాత్రమే. దాని వ్యక్తిగత జీవితం ఎవరికీ నాట్ జియో పాపులరయేదాకా తెలీదు. స్టింగ్ ఆపరేషన్స్ లో బయటపడ్డ ప్రముఖుల నిర్వాకాల్లా జుగుప్సాపూరితంగా ఉంటుంది.
> నంబర్ వన్ మేల్ షావినిస్ట్ & ఎక్స్టార్షనిస్ట్ ఇది. మేల్ షావినిస్ట్ పిగ్ అంటారుగానీ పిగ్ తీసేసి లయన్ అనడం న్యాయం. జీవితాంతం పెళ్ళాలతో పని చేయించడం, పిల్లల్ని కనడం, నిద్రపోవడం అంతే.
> ఫామిలీలో ఎదిగిన మగపిల్లల్ని తన్ని తగిలెయ్యడం, లేకపోతే చంపెయ్యడం
> వేరే మగ సింహాలతో సంపుడో-సావుడో బేసిస్ మీద పోట్లాడి, గెలిస్తే దాని ఫామిలీని సొంతం చేసేసుకోవడం. ఆపైన కొత్త ఫామిలీ లో అప్పటికే ఉన్న అడ, మగ పిల్లలన్నిట్నీ మర్డర్ చేసెయ్యడం.
ఇదీ మృగరాజు అసలు పర్సనాలిటీ. దీనిక్కారణాలు డిటైల్డ్ గా కావాలంటే నాట్ జియో వీడియోలు చూడాల్సిందే. ఆ కారణాలన్నిటికీ మూలం మాత్రం స్వార్ధం, కరుడుకట్టిన స్వార్ధం. తన జీన్స్ తప్ప లోకంలో ఇంకే సింహపు జీన్సూ , తన కొడుకులవైనా సరే, బతికిబట్టకట్టకూడదు. ఈ ఒక్క కారణం దాన్నో మేల్ షావినిస్ట్ పిగ్ గా బిహేవ్ చేయిస్తుంది. ఆడవి అష్టకష్టాలు పడి వేటాడిన జంతువుని సగం దాకా లాగించిగానీ వాటిని తిననివ్వదు. వేరే ప్రైడ్ ని టేక్-ఓవర్ చేసినప్పుడు అందులోని ఆడవి పిల్లలుంటే తనతో జతకట్టవనీ, ఫ్యూచర్లో తనకి పోటీ వచ్చే శత్రుసింహపు పిల్లలనీ వాటిని చంపేస్తుంది. బేసిగ్గా తను తప్ప ఇంకెవరూ కనిపించనివ్వని మాత్సర్యం . ఇంతటి సున్నితమనస్కమైన జంతువుతో పవన్, పోనీ అత్తారింటికి దారేదిలో హీరో-గౌతమ్ నందా, తనని పోల్చు కుంటే నాకు నచ్చలేదు. నేను పవన్ కళ్యాణ్ లాంటోణ్ణి, నేను డాన్సులు, ఫైట్లు చేస్తాను, అతను చెయ్యడు. మిగిలినవన్నీ సేమ్ టు సేమ్ అనేస్తే చాలు. సింహాన్ని ఎలివేట్ చెయ్యడం అనవసరం. అదో పవర్ఫుల్ యానిమల్. అంతేకాని ఉత్తమ గుణాలకి ప్రతీక కాదు.
నౌ, ద టైమ్ హాజ్ కమ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఐ యామ్ డ్రైవింగ్ ఎట్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ పోస్ట్. బై4నౌ 🙂

****

ఆ మెన్‌, ఆమెన్‌ చెరపట్టన్‌, మ్రోగెన్‌ నీ గన్‌, నా పెన్‌ ఆపెన్‌

నువ్వు రాయాలనుకున్నదేదో పూర్తిగా రాసాకగానీ నువ్వేం రాయాలనుకున్నావో క్లారిటీ రాదు, నిజానికి రాయటం అప్పుడు మొదలౌతుంది అని మార్క్ ట్వైన్ ఉవాచ. ఇదేదో ఆరుద్ర గారి ఫిలసాఫికల్ ఉవాచ – నేనెక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటు – కి లిటరరీ ఈక్వలెంటులా ఉందే అనిపిస్తోందా? యూ ఆర్ రైట్. ఈ ఆర్టికిల్ ఇంతకుముందు పోస్ట్ చేసినప్పుడు ఆరుద్ర గారి పద్యం ఆధారంగా మృగాళ్ళని తిట్టడం నా ఉద్దేశం. రెండ్రోజులాగి రీ-బ్లాగ్ చెయ్యబోతూ ఎడిట్ చెయ్యడంలో రూపు మొత్తం మారిపోయింది.This is a ‘great’ writing experience for my smaaaaall self. ఎంతచెట్టుకి మొక్కకి అంత ‘గాలి’ మరి.

ఆరుద్ర పద్యం ఇదీ –

మెన్‌
ఆమెన్‌
చెరపట్టన్‌
మ్రోగెన్‌
నీగన్‌
నా
పెన్‌
ఆపెన్‌ (త్వమేవాహం పుట 36-37)
Your gun shoots and my pen stops the molesters that are after the helpless woman -ఇదీ మీనింగ్ . నాకున్న భాషా పరిమితుల్తో ఇంతకంటే బాగా రాయటం కుదరదు మరి.
ఆరుద్రగారి త్వమేవాహంలోదిట ఈ పద్యం. ఇవాళ విశాలాంధ్రలో చదివాను. ( ఇక్కడ కొంచెం పిడకల వేట – “ట” అన్న ఒక్క అక్షరం ఎంతగొప్పదో ఇప్పుడర్ధం అవుతోంది. పెద్ద పెద్ద వాక్యాలతో ఎక్స్ప్లనేషన్లూ, డిస్క్లైమర్స్ రాయవసరంలేకుండా జస్ట్ ఒక్క “ట” యాడ్ చేస్తే చాలు. విషయం మన సొంతం కాదని, ఆ పరిజ్ఞానం అంతకంటే లేదనీ చదివేవాళ్లకి తెల్సిపోతుంది. తిట్లు, విమర్శలు, వ్యాఖ్యలు వగైరాలతో శ్రమ పడకుండా మన్ని పెట్టకుండా లైట్ దీస్కుంటారు. తెలుగుభాషలోని సౌలభ్యాల్లో ఇది ఒకటి. ఇతర సౌలభ్యాలేమిటో నాకు తెలిసాక రాస్తాను. అప్పటివరకూ గరికపాటివారి ఉపన్యాసాలు వింటూ తెలుగు నిజంగా నేర్చుకుంటా. చిరంజీవి ఒకసారి , “ఈ సారి పార్లమెంటు సభలకొచ్చినపుడు హిందీ మే హీ బాత్ కరూంగా,” అన్నాడే అలా అన్నమాట.)
1949లో నిజాం/రజాకార్లకి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణా సాయుధపోరాటం బాక్-గ్రౌండ్ తో త్వమేవాహం రాశారు. అని తెలుగు వికీపీడియాలో చదివి తెలుసుకున్నాను. ఈ డిస్క్లైమర్ ఎందుకంటే ఎవరైనా ఆరుద్ర గారిపై వ్యాఖ్యలు, చర్చలు మొదలుపెడితే ఇంక నా పని అంతే, అందుకే ఈ ముందు జాగర్త.
మరెందుకు ఈ రాయాలన్న దురద అంటే – ఇన్ ఫాక్ట్ నాకే అనిపిస్తుంది – writer’s itch అని ఒకటుంటుందిగా
When once the itch of literature comes over a man, nothing can cure it but the scratching of a pen. But if you have not a pen, I suppose you must scratch any way you can అని ~Samuel Lover, అన్న పెద్దమనిషి 1842లో అన్నాట్ట. పెన్ను కాకపోతే ఏదో ఒకదాంతో రాయమన్నాడుగా రాసేందుకు కీబోర్డు, రాయించుకునేందుకు బ్లాగు ఉన్నాయి కనక రాయడం అనిన్నీ,
An incurable itch for scribbling takes possession of many, and grows inveterate in their insane chests అని ఆంగ్లంలో జువెనాల్ అనీ, రోమన్ భాషలో డెసిమస్ లునియస్ లువెనాలి (Decimus Iunius Iuvenalis) అని పిలవబడ్డ రోమన్ కవి తన 2nd century AD బెస్ట్ సెల్లర్ the Satires లో అనటం వల్లనూ ఈ బ్లాగ్రచనా ప్రయత్నమను సాహసమునకు ఒడిగట్టితిని.

ఆరుద్ర గారి గురించే సరిగ్గా తెలియదు కానీ కొత్తగా శామ్యూల్ లవర్ & జువెనాల్ అంటూ పాత రచయితల్ని కోట్ చెయ్యడమేమిట్రా నీ మొహం తగలెయ్యా అంటే ఐ కాన్ట్ హెల్పిట్, రైటర్’స్ ఇచ్ ఇంత భయంకరమని నాకూ ఇప్పుడే తెల్సింది. అందుకే ఆల్ టైమ్ బెస్ట్ రైటర్ మార్క్ ట్వైన్ రచనాకండూతి గురించి ఏమన్నాడా అని గూగిలింపనంత ఈ క్రింది వాక్యముగానంబడియె –

The time to begin writing an article is when you have finished it to your satisfaction. By that time you begin to clearly and logically perceive what it is you really want to say అన్నాడు మార్క్ ట్వైన్.

ఆర్టికల్ మొత్తం చదివాక ఎక్జాక్ట్లీ గా (ఎందుకోగానీ కొందరలా అంటారు)అదే జరిగిందని పాఠకులు గ్రహింపగలరు. ఈ పోస్టు యొక్క మాతృక – ఇదీ ఆరుద్ర గారి పద్యానికి అర్ధం – చూడగలరు.

Now, ఎక్కువ టైము వేస్టవ్వకుండా డైరెక్టుగా పాయింటుకి వచ్చేస్తా –

పద్యం ప్రతిపదార్ధం కూడా కావాలా? ఐతే ఇదిగో :
= ఆ
మెన్ = మగవాళ్ళు (మృగాళ్లు అని చదువుకొన వలెను)
ఆమెన్ = చర్చిలో చెప్పే ఆమెన్ కాదండోయ్, ఆమెను అనగా ఆ స్త్రీని
చెరపట్టన్ = ప్రతీ సినిమాలోనూ దీనికి మీనింగు దొరుకును కావున ఇచట వ్రాయనవసరము లేదు.
నీ గన్ = ‘తుప్పా’ కి చేపట్టిన పోలీసులు (ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా)
నా పెన్ = పత్రికలూ, రచయితలూ, కవులు, నటీనటులు ,ఎట్సెట్రా సామాజిక బాధ్యతగల వ్యక్తులు
ఆపెన్ = ఆపెదరు
ఆ మగవాళ్ళు (మృగాళ్లు అని చదువుకొన వలెను) ఆమెన్ (చర్చిలో చెప్పే ఆమెన్ కాదండోయ్) ఆమెను అనగా ఆ స్త్రీని చెరపట్టగా ‘తుప్పా’ కి చేపట్టిన పోలీసులు (ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా), చట్టాలు చేసే నాయకులు పత్రికలూ, రచయితలూ, కవులు, నటీనటులు ,ఎట్సెట్రా సామాజిక బాధ్యతగల వ్యక్తులు (ఎంతమందికుందో డౌటు)ఆపెదరు (వీళ్ళందరూ పెన్ వాడతారు కదా)
ఇదీ తాత్పర్యం.

పద్యాలపై నా పరిజ్ఞానం సున్నాయే. అయినా పద్యంలోని విషయం మాత్రం మరిచిపోలేనిది. అలా మర్చిపోకుండా మనదేశపు పురుషాహంకారవరాహాలు (మేల్ షావినిస్ట్ పిగ్స్) రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నాయి కదా మరి. ప్రస్తుతబాధేంటంటే ఆరుద్ర గారు కీచకులపై గన్ మోగుతుందని, పెన్ దురంతాల్ని అపుతుందని రాసారు కదా. ఏ గన్నూ మోగట్లెదు, ఏ పెన్నూ సరిగా రాయట్లేదు. రాజకీయ తుప్పు పట్టి, లీగల్ టాంగిల్స్ లొ చిక్కుకుని వంగిపోయిన గన్ను సరే మోగదు. రాయాల్సిన పెన్నుకీ బద్ధకం పట్టుకుంది. సెన్సేషన్స్, గాసిప్స్ , పాలిటిక్స్ లొ మసాలా మరిగి, రాయాల్సినవి, జాతికి కావాల్సినవి రాయడం మానేసింది. ఇంకోటి, మంచిని చదివి దానిని వంటబట్టించుకోవల్సిన జనానికీ మసాలాలు అలవాటు చేసింది.

మంచిని చెప్పాల్సినవాళ్ళు, మంచిని రక్షించాల్సినవాళ్ళు, మంచిని పెంచాల్సిన వాళ్ళు – పెన్నూ, గన్నూ, మెన్నూ – ఎవరూ కవి వాక్యాన్ని నిలబెట్టరా?

{నిన్నటి న్యూస్, కలకత్తాలో కొందరు దరిద్రులు ఓ డెబ్భై రెండేళ్ళ వృద్ధురాలిపై ప్రతాపం చూపించారు. ఈ ఆర్టికల్ మీకు నచ్చితే, మానవత్వం మర్చిపోయిన ఆ రాక్షసులు-సారీ రాక్షసులకి మానవత్వం ఎందుకుంటుంది? – ఆ filthy beasts త్వరలో పెన్ & గన్ చేపట్టిన అసలైన మెన్ చేతుల్లో నశించాలని కోరుకోండి.ఇక్కడ చెప్పిన డెబ్భైరెండేళ్ళ నన్ పై జరిగిన దారుణం రాజకీయ రంగు వేసుకుంటోంది, మరో పక్క పేపర్లలో అత్యాచారాల న్యూస్ సీరియల్ లా ప్రతిరోజూ వస్తూనే ఉంది. ప్చ్!}

_/\_Hi! Than-Q 4 UR patience 🙂 UR  feedback helps me write better _/\_

ఇదీ ఆరుద్రగారి పద్యానికి అర్ధం – Your gun shoots and my pen stops the molesters of women


ఆరుద్రగారి త్వమేవాహంలోదిట ఈ పద్యం. ఇవాళ విశాలాంధ్రలో చదివాను. “ట” అన్న ఒక్క అక్షరం ఎంతగొప్పదో ఇప్పుడర్ధం అవుతోంది. పెద్ద పెద్ద వాక్యాలతో ఎక్స్ప్లనేషన్లూ, డిస్క్లైమర్స్ రాయవసరంలేకుండా జస్ట్ ఒక్క “ట” యాడ్ చేస్తే చాలు. విషయం మన సొంతం కాదని, ఆ పరిజ్ఞానం అంతకంటే లేదనీ చదివేవాళ్లకి తెల్సిపోతుంది. తిట్లు, విమర్శలు, వ్యాఖ్యలు వగైరాలతో శ్రమ పడకుండా మన్ని పెట్టకుండా లైట్ దీస్కుంటారు. తెలుగుభాషలోని సౌలభ్యాల్లో ఇది ఒకటి. ఇతర సౌలభ్యాలేమిటో నాకు తెలిసాక రాస్తాను. అప్పటివరకూ గరికపాటివారి ఉపన్యాసాలు వింటూ ఉంటాను.

పద్యం –


మెన్‌
ఆమెన్‌
చెరపట్టన్‌
మ్రోగెన్‌
నీగన్‌
నా
పెన్‌
ఆపెన్‌ (త్వమేవాహం పుట 36-37)

(Your gun shoots and my pen stops the molesters that are after the helpless woman – ఇదీ మీనింగ్ . నాకున్న భాషాపరిమితుల్తో ఇంతకంటే బాగా రాయటం కుదరదు మరి)

ప్రతిపదార్ధం కూడా కావాలంటే :
ఆ = ఆ
మెన్ = మగవాళ్ళు (మృగాళ్లు అని చదువుకొన వలెను)
ఆమెన్ = చర్చిలో చెప్పే ఆమెన్ కాదండోయ్, ఆమెను అనగా ఆ స్త్రీని
చెరపట్టన్ = ప్రతీ సినిమాలోనూ దీనికి మీనింగు దొరుకును కావున ఇచట వ్రాయనవసరము లేదు.
నీ గన్ = ‘తుప్పా’ కి చేపట్టిన పోలీసులు (ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా)
నా పెన్ = పత్రికలూ, రచయితలూ, కవులు, నటీనటులు ,ఎట్సెట్రా సామాజిక బాధ్యతగల వ్యక్తులు
ఆపెన్ = ఆపెదరు
ఆ మగవాళ్ళు (మృగాళ్లు అని చదువుకొన వలెను) ఆమెను అనగా ఆ స్త్రీని చెరపట్టగా, ‘తుప్పా’ కి చేపట్టిన పోలీసులు (ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా), చట్టాలు చేసే నాయకులు పత్రికలూ, రచయితలూ, కవులు, నటీనటులు ,ఎట్సెట్రా సామాజిక బాధ్యతగల వ్యక్తులు (ఎంతమందికుందో డౌటు) వాళ్ళు ఆపెదరు (వీళ్ళందరూ పెన్ వాడతారు కదా)

మళ్ళీ ఆరుద్రగారి పద్యం విషయానికొస్తా. పద్యాలపై విషయ పరిజ్ఞానం సున్నాయే అయినా పద్యంలోని విషయం మాత్రం మరిచిపోలేనిది. అలా మర్చిపోకుండా మనదేశపు పురుషాహంకారవరాహాలు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నాయి కదా మరి. ప్రస్తుతం ఆ బాధేంటంటే ఆరుద్ర గారు కీచకులపై గన్ మోగుతుందని, పెన్ దురంతాల్ని అపుతుందని రాసారు కదా. ఏ గన్నూ మోగట్లెదు, ఏ పెన్నూ సరిగా రాయట్లేదు. 

రాజకీయ తుప్పు పట్టి, లీగల్ టాంగిల్స్ లొ చిక్కుకుని వంగిపోయిన గన్ను సరే మోగదు.
రాయాల్సిన పెన్నుకీ బద్ధకం పట్టుకుంది. సెన్సేషన్స్, గాసిప్స్ , పాలిటిక్స్ లొ మసాలా మరిగి, రాయాల్సిన జాతికి కావాల్సిన విషయాలు రాయడం మానేసింది. ఇంకోటి, మంచిని చదివి దానిని వంటబట్టించుకోవల్సిన జనానికీ మసాలాలు అలవాటు చేసింది.

మంచిని చెప్పేవాళ్ళు-మంచి చేసే వాళ్ళు-మంచిని నేర్చుకోవాల్సిన వాళ్ళు – పెన్నూ, గన్నూ, మెన్నూ – ఎవరూ కవి వాక్యాన్ని నిలబెట్టరా?

{నిన్నటి న్యూస్, కలకత్తాలో కొందరు దరిద్రులు ఓ డెబ్భై రెండేళ్ళ వృద్ధురాలిపై ప్రతాపం చూపించారు. ఈ ఆర్టికల్ మీకు నచ్చితే, మానవత్వం మర్చిపోయిన ఆ రాక్షసులు-సారీ రాక్షసులకి మానవత్వం ఎందుకుంటుంది? – ఆ filthy beasts త్వరలో పెన్ & గన్ చేపట్టిన అసలైన మెన్ చేతుల్లో నశించాలని కోరుకోండి.}

sasesham

_/\_Hi than-Q 4 UR patience 🙂 UR  feedback helps me write better _/\_

ఐన్-స్టీన్ చూసిన ఆదిశేషుడే శంకరుని స్పేస్-టైమ్ కంటిన్యువమ్ !!


తనీయాంసం పాంసుం తవచరణ పంకేరుహ భవం|విరించిస్సంచిన్వన్ విరచయతి లోకనవికలమ్||
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం|హరః సంక్షుద్యైనం భజతి భసితోధ్ధూలనవిధిమ్||

తల్లీ! నీ పాదపద్మాలకంటిన ధూళికణాలతో బ్రహ్మ పద్నాలుగు లోకాలని ఎటువంటి లోపాలు లేకుండా సృష్టించగా విష్ణువు అతికష్టంతో ఆదిశేషుడిగా తన వెయ్యితలలపై వాటిని మోస్తున్నాడు. ఆ లోకాలని లయకారుడు, శివుడు పొడిపొడి చేసి విభూతిగా ధరిస్తున్నాడు.

సౌందర్యలహరిలో రెండో శ్లోకం. శ్రీ జీ. ఎల్.ఎన్. శాస్త్రిగారి సౌందర్యలహరి తెలుగు అనువాదంలో ఆయన ఇచ్చిన సైంటిఫిక్ వివరణ ఆలోచనా తరంగాల్ని పురికొల్పి సైన్సు, ఫిలాసఫీల సంగమప్రదేశానికి తీసుకుపోతుంది. శాస్త్రిగారు స్వయంగా ఫిజిక్స్ ప్రొఫెసర్ కావడం గమనార్హం. ఆదిశేషుడు పధ్నాలుగు భువనాలనీ మొయ్యలేక తన వెయ్యి తలలపై అటూ ఇటూ మార్చుకుంటూ అతికష్టంగా భరిస్తున్నాడన్న విషయాన్ని భూమి ఉత్తరదక్షిణాయనాల్లో ప్రవేశించడంతో పోల్చారు. ఉత్తరాయనంలో సూర్యుడు ఉత్తర దిక్కుగా, దక్షిణాయానంలో ఆ దిశగా సూర్యుడి కదలిక కనిపిస్తుంది కదా. నిజానికి పొజిషన్ మారేది భూమి. తన కక్ష్యలో తన యాక్సిస్ కి ఇరవై మూడున్నర డిగ్రీల కోణంలో వంగి ప్రయాణించడం వల్ల సూర్యుడు అలా కదిలినట్టు అనిపిస్తుంది. ఋతువుల మార్పు దీనివల్ల కలుగుతుంది. ఆదిశంకరుడు అదే విషయాన్ని పొయెటిక్ గా చెప్పారని అంటారు శ్రీ శాస్త్రిగారు. ఆదిశేషుడి వెయ్యి పడగల మీద భూమి ఒక ఏడాదిలో ఆ చివర నుంచి ఈ చివరికి, ఈ చివరనుంచి ఆ చివరకి దొర్లుతూ భూగోళపు ఊహాచిత్రం మనసులో మెదిలింది.
అద్వైతాన్ని ఔపోసన పట్టకపోయినా ఆదిశంకరుడన్న పేరు విన్నా, ఆ రూపం తలచుకున్నా ఎందుకో హృదయం ఉప్పొంగుతుంది. శివుడి అవతారంగా పరిగణించే శంకరుడికి ఖగోళ విజ్ఞానం ఒక లెక్కలోది కాదని తెలుసు. కానీ ఒక తత్త్వవేత్తగా, జీవాత్మ, పరమాత్మల మధ్య సరిహద్దు రేఖని చెరిపి ఇద్దరినీ విలీనం చేసిన అద్వైత శాస్త్రవేత్తగా చూసినప్పుడు ఆయనకీ ఖగోళ రహస్యాలు తెలిసే అవకాశం ఉందా? ఆయన కాలానికి ఇండియన్ ఆస్ట్రానమీ అంత అభివృద్ధి చెందిందా? ఇలాంటి ప్రశ్నలతో ఆలోచనలు అటు మళ్ళాయి.
శంకరాచార్యుడి కాలానికి ఇండియాలో ఆస్ట్రానమీ, దాని ఆధారంగా జ్యోతిష శాస్త్రం వృద్ధి చెందాయి. వరాహ మిహిరుడు అప్పటికే అయనాంశ (shift of equinoxes) లెక్క కట్టాడు. ఆర్యభట్ (I), భాస్కర (I) ప్రసిద్ధులయ్యారు. సో, శ్లోకరచనలో శంకరుడు దివ్యదృష్టితో కాక తన శాస్త్రజ్ఞానంతోనే ఈ ఆస్ట్రనామికల్ అంశం ఇమిడ్చే అవకాశం ఉందనుకోవచ్చు. ఇదంత ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. కానీ శూన్యమైన ఆకాశంలో గ్రహ గోళాల్ని ఏ అదృశ్యశక్తి మోస్తున్నదనే విషయానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే భూకక్ష్యలో మార్పులకి ఆదిశేషుడు తలలు మార్చుకోవడమనే ఊహ(?) జోడించి అందంగా వర్ణించాడు. శంకరుడి వర్ణనకి, మోడర్న్ సైన్సు ఇచ్చిన వివరణకి పోలిక ఎంత దూరం వెళ్ళిందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెరిగిపోయింది.

ముందు భూమి ఇలా ఎందుకు పొజిషన్ మారుతుందో తెలుసుకుందామని గూగులించగా దొరికిన సమాచారంలో, నాకర్ధమైనంత వరకూ భూమికి మూడు రకాల మూవ్-మెంట్స్ ఉన్నాయని తెలిసింది. (తన చుట్టూ తన ఆత్మప్రదక్షిణాలు కాక)
ఒకటి – సూర్యుడి చుట్టూ ఒక కక్ష్యలో తిరగడం.
రెండు – ఉత్తర దక్షిణ ధ్రువాలు ఇరవై ఆరు వేల ఏళ్ళకొకసారి తారుమారవ్వడం (Axial Precession). హిపార్కస్ (190 – 120 B.C) తో మొదలుపెట్టి టాలెమి, భాస్కరులతో సహా అనేకమంది దీనిపై పరిశోధనలు చేశారు.
మూడు – భూకక్ష్య స్థిరంగా ఒకే పొజిషన్ లో ఉండదు. భూమితో సహా కక్ష్య కూడా సూర్యుడి చుట్టూ మెల్లిగా తిరగలి రాయిలా (eccentricగా) తిరుగుతుంది. ఇలా –

Perihelion_precession

(శాస్త్రిగారి సౌందర్యలహరి అనువాదం ఇక్కడ – https://archive.org/details/sondaryalahari023321mbp)

దీన్ని Apsidal precession అంటారు. హిపార్కస్ మొదటిగా చంద్రుడి కదలికల్లో దీన్ని గమనించాడట. బుధ గ్రహానికి ఈ precession లెక్కవేయ్యడంలో కెప్లర్ చిక్కులు పడ్డాడు. ఐన్-స్టీన్ తన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రతిపాదించాక దాని ఆధారంగా బుధగ్రహపు precession సరిగ్గా లెక్క వెయ్యగలిగారు. సాపేక్ష సిద్ధాంతాన్ని ఋజువు చేసిన ప్రయోగాల్లో ఇదొకటి. భూకక్ష్య సూర్యుడి చుట్టూ ఒక రౌండు తిరిగి రావడానికి 29000 ఏళ్ళు పడుతుంది. ఇదంతా మామూలు కళ్ళతో, మహా అయితే టెలిస్కోపుతో అబ్జర్వ్ చెయ్యగలిగిన విషయాలే. బ్యూటీ అంతా ఐన్-స్టీన్ ప్రతిపాదించిన స్పేస్-టైమ్ కంటిన్యువమ్ లో ఉంది. కంటికి కనిపించని శూన్య ఆకాశాన్ని,ఊహకందని కాలాన్ని కలిపి వలగా అల్లి దానిపై గ్రహ నక్షత్రాలు కదలాడుతున్నాయని ఎలా ఊహించాడో ఈ ఫిజిక్స్ పాలిటి ఆదిశంకరుడు! ఊహించడమే కాదు ప్రయోగాత్మకంగా ఋజువైన వైనం మరీ విచిత్రం. గ్రహాలు, నక్షత్రాల వంటి వస్తువుల చుట్టూ ఉన్న స్పేస్ వంగుతుంది అన్న ప్రతిపాదన ఒకానొక సూర్యగ్రహణ సమయానికి సూర్యుడి వెనుక, అంటే ఆకాశంలో మనకి కనిపించకుండా ఉండే భాగంలో ఉండే ఒకానొక నక్షత్రం ఈ ఎఫెక్టు వల్ల కనబడుతుందని జోస్యం చెప్పారు శాస్త్రవేత్తలు, ఐన్-స్టీనే అనుకుంటా. అది నిజమయ్యింది. సంపూర్ణ సూర్య గ్రహణ సమయంలో మామూలుగా అయితే కనబడకూడదనుకున్న ఆ నక్షత్రం కనబడింది. దాన్నుంచి వచ్చే కాంతి సూర్యుడి పక్క వంపు తిరిగితే తప్ప అది సాధ్యం కాదు. మామూలుగా స్ట్రైట్ లైన్ లో ప్రయాణించే కాంతి వంగిన స్పేస్ తో పాటు వంగి భూమిని చేరింది. ఆకాశం వంగడమేమిటి? శూన్యం అని అనుకుంటున్నది శూన్యం కాదనేగా దీనర్ధం.

ఇదిగో ఆకాశం వంపు తిరిగేది ఇలా –

earth-around-sunwarp

బొమ్మలో భూమి చుట్టూ క్రుంగి ఉన్న స్పేస్-టైమ్ మాట్రిక్స్ ఒత్తుకున్న మెత్తటి పడగలా లేదూ? So, నిజంగానే కంటికి కనిపించని పడగల మీద భూగోళం దొర్లుతోంది. In fact, అంతరిక్షంలో ఉన్న గోళాలన్నీ.

శంకరుడు ఆదిశేషుడిగా వర్ణించిన అదృశ్యశక్తినే ఆధునికంగా space-time continuum అంటున్నామా?

అయితే శేషుడి పడగలు వెయ్యి కాదు అనంతం. It may be coincidental, but, ఆదిశేషుడి మరోపేరు అనంతుడు!

శతాబ్దాల క్రితం ఆదిశంకరుని ఆలోచనలు, ఇటీవలి ఐన్-స్టీన్ ఆలోచనలు మస్తిష్కంలో ఒకటైపోయాయి,
“Both religion and science require a belief in God. For believers, God is in the beginning, and for physicists He is at the end of all considerations… To the former He is the foundation, to the latter, the crown of the edifice of every generalized world view,” అని క్వాంటమ్ థియరీకి ఆద్యుడైన మాక్స్ ప్లాంక్ అన్న మాటలు గుర్తొచ్చాయి.

spacetime-travel

– సైంటిఫిక్ హిందూ.

Hi! Thank you for reading this post 🙂

Your kind feedback via LIKES button

will help me write better  _/\_