Category Archives: సైంటిఫిక్ హిందూ

శివోహం=శివోहम=శివోतुम I=U=WE=ॐSivaॐ


శివరాత్రి పూట శుభాకాంక్షలు చెప్దామని శివుడి బొమ్మ గీస్తుంటే వచ్చిన ఆలోచన –

This image has an empty alt attribute; its file name is whatsapp-image-2019-03-04-at-10.47.33.jpeg

🌹శివోహం🌹శివోहम🌹శివోतुम🌹
శివోహం = శివోहम = శివోतुम
వ్యష్టి = సమష్టి = సృష్టి

శివోహం –> నేనే శివుడిని అని నేను మనసా వాచా కర్మణా నమ్మినప్పుడు
శివోतुम –> అదే నమ్మకం ప్రతి “నేను”లో కలిగినప్పుడు
శివోहम –> ప్రపంచం అంతా శివస్వరూపంగా మారిపోదా?

నరుడు హరుడిగా మారడమే , మానవుడు మహాదేవుడవడమే సంఘం కానీ, దేశం కానీ ప్రపంచం కానీ మారడానికీ మూలం కదా!!
अहं निर्विकल्पॊ निराकाररूपॊ विभुत्वाञ्च सर्वत्र सर्वेद्रियाणाम् ।
न चासङ्गतं नैव मुक्तिर्न मेयश्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्

నాలో మార్పులు లేవు. నాకు రూపం లేదు. నేను అంతటా ఉన్నాను. సర్వేంద్రియాలను వికసింపజేస్తున్నాను. అన్నింటిలో సమానంగా ఉన్నాను. నాకు బంధమోక్షాలు లేవు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.

I am all pervasive. I am without any attributes, and without any form. I have neither attachment to the world, nor to liberation (mukti). I have no wishes for anything because I am everything, everywhere, every time, always in equilibrium. I am indeed, That eternal knowing and bliss, the auspicious (Śivam), love and pure consciousness.
ఆదిశంకరుడు అలా అనుకున్నది, మనని అనుకోమన్నదీ అందుకేనేమో. అహంలో శివం అంతగా నిండితేనే కానీ రాగద్వేషాల నిలయమైన ప్రపంచం మారదని ఆయనకి తెలిసినంత ఇంకెవరికి తెలుస్తుంది?
అందరికీ శివరాత్రి శుభాకాంక్షలతో ..  🌹🙏😊🙏🌹

A humble translation here –

Siva as understood by ancient seers is the Absolute Being of which all other states of being, including ours, are part. Understanding this ultimate truth of existence, keeping the mind in an unbroken contact with it and treating all other beings in line with that understanding is the ultimate level of evolution a human mind can aspire for. That is what the champion of Non-dualist philosophy (Adwaitha Siddhanta), Adi Sankaracharya conveys through his sanskrit composition Nirvana Shatkam.   

The last stanza of the composition says –

I am all pervasive. I am without any attributes, and without any form. I have neither attachment to the world, nor to liberation (mukti). I have no wishes for anything because I am everything, everywhere, every time, always in equilibrium. I am indeed, That eternal knowing and bliss, the auspicious (Śivam), love and pure consciousness.

The one that lives these lines through – in Thought, Word and Deed – can equate himself to Siva. He proclaims, “Sivoham (I am Siva, the Absolute Being).

Today India and Indians celebrate Sivaratri, the night of Siva, by reminding themselves, through various spiritual practices, of the evolutionary potential within.

Having said so much, now let me dwell a bit on the picture I scribbled this morning to wish my friends and relatives an “Auspicious Sivarathri.” After drawing that simple (rather too simple, right?) sketch I was thinking of a caption for it when “Sivoham,” which means I am Siva, flashed in my mind. Then it occurred to me that the last “ham”, pronounced as HUM, rhymes with the Hindi words हम (i.e. Hum = We) and तुम (i.e. Thum =You). Suddenly there seemed to be a very good meaning in playing with the three phrases Sivoham (I am Siva), Sivoहम (We are Siva) and Sivoतुम (You are Siva)

When –

the “I” in me,

the “I” in You and

the “I” in all of us resonate (and thereby connect) with each other as the principle of Siva as explained by Adi Sankara, would the whole world not get united in that Ultimate Truth of Existence and be filled with Peace? Wishing the whole world an Auspicious Sivaratri.
🌹🙏😊🙏🌹

వేదాంత🤚☝️ఆఫ్ దోస(ఆవ)కాయ😋


ఇవాళ, ఆదివారం చాలా లేటుగా మెలుకువొచ్చింది. ఎంత లేటంటే అది లంచ్ టైముకి తక్కువ, బ్రేక్ ఫాస్ట్ కి ఎక్కువా. అసలే చిరాగ్గా వుంది. టిఫిన్ ఏంటా అని చూస్తే అస్సలిష్టంలేని అటుకుల ఉప్మా !! తప్పక తిని, ఆ తిన్న పాపాన్ని నాలిక మీంచి కడిగేసుకుందామని మంచి కాఫీ ఒకటి కలుపుకుని దాన్ని పుచ్చుకుంటూ (పవిత్రమైన ద్రవాలని తాగకూడదు, పుచ్చుకోవాలని పెద్దలు చెప్పిన మాట!) వాట్సప్ ఓపెన్ చేశాను.

ముందు అన్నీ రొటీన్ ఫార్వార్డెడ్ మెసేజులు, పాటించలేక ఫార్వార్డ్ చేసేసిన అరిగిపోయిన సూక్తులు, దేవుళ్ళ బొమ్మలు వుండే గ్రూపులన్నీ దాటుకుని మా కాలేజీ గ్రూప్ కి చేరుకున్నాను. మా ఈ గ్రూపుకి క్రియేటివ్ అనే సఫిక్స్ ఒకటి పెట్టుకున్నాం. అంచేత ఇక్కడ సూక్తులు, ఫార్వార్డ్స్ బాగా తక్కువ.

మొట్టమొదట – యూ.ఎస్. నుంచి సేద్యం, సాహితీసేద్యం రెండిటి రుచీ తెలిసిన క్లాస్-మేట్ పెట్టిన పోస్ట్ పలకరించింది. ఆకుపచ్చటి తీగల నేపధ్యంలో గోల్డెన్-ఆరెంజ్ కలర్ లో మెరుస్తున్న దోసకాయలు, తన పెరటిలో పండినవి – ఆ ఫోటో పెట్టాడు.

చూస్తుంటే దోసకాయ ముక్కల పచ్చడితో మొదలుపెట్టి –

  1. దోసకాయ కాల్చిన పచ్చడి
  2. దోసకాయ పప్పు
  3. దోసకాయ కూర
  4. దోసకాయ ఆవ పెట్టిన కూర
  5. దోసకాయ సాంబారు
  6. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దోసావకాయ.

ఇలా దోస అవతారాలన్నీ గుర్తొచ్చి నోరూరించాయి. అటుకుల ఉప్మా తిన్న దోషం, దోసకాయ మహాత్మ్యం తలుచుకోవడంతో ఎగిరిపోయింది. కాఫీ మరీ రుచిగా అనిపించింది. ఇంక ఆనందం పట్టలేక నా స్పందనని ఇలా ఇచ్చాను.

దోసకాయ, a simple but great, spritually-loaded vegetable.
Its greatness spans from human taste buds to Vedas.
To understand that you will have to taste దోసావకాయ and explore the simple meaning of the vedic chant Maha Mrutyumjaya mantram.
It is easy to see that dosakaya is capable of subjecting man (& woman) to Attachment in the form of దోసావకాయ and also to liberate all in the form of Mrutyumjaya mantram by its own example. (Tells how easily a ripe dosa kaya detaches from its creeper)

ఇది నచ్చిన అమేరికా ఫ్రెండు అప్పుడే తరిగిన దోసముక్కల ఫొటో పెట్టాడు.

గ్రూపులో అందరికీ అమ్మమ్మలు దోసకాయ చేదుగా వుందో లేదో రుచి చూసి చెప్పమన్న చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.

ఇంతలో మరో ఫ్రెండు అన్నాడు –

“పండినవీ, ఎండినవీ ఏవైనా బంధాలు తెంచుకోక తప్పదుగా,” అని.

“అవును బ్రదరూ ! ఆ సంగతి దోసకాయకి తెలుసు కానీ, మనిషికి తెలీదు. తెలుసుకోడు.

మృత్యుంజయ మంత్రం అంటే మరణాన్ని ఆపేది అనుకుంటాడు కానీ దాన్ని తృణప్రాయంగా తీసుకుని దోసకాయ తన తీగ నుంచి విడిపోయినట్టు ప్రపంచం నుంచి విడిపోగలడా? ఇహలోకంలో ఇన్ష్యూరెన్సుల నుంచీ పరలోకంలో రంభ పక్కన బెర్తు వరకూ ఎన్ని వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి పాపం!!, ” అని రిప్లై ఇచ్చా.

ఇంతలో ఇంకో మెసేజ్ వచ్చింది. ‘ఠంగ్’మంటూ. ఏం లేదు, సింపుల్ గా “దోసావకాయ!! ఐ లవ్ ఇట్😋😋😋😋!!” అని వుంది.

అవును, ఎటాచ్-మెంటుకైనా, డిటాచ్-మెంటుకైనా దోసకాయ ఇచ్చినంత ఎఫెక్టివ్ మెసేజ్ ఏ గురువులూ, స్వాములూ ఇవ్వలేదే(రే)మో అనిపించింది.

దోసకాయాయ విద్మహే దోషరహితాయ ధీమహి

తన్నో దోసావకాయ ప్రచోదయాత్

ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః

బై4నౌ🙏😋

గణపతి కోరికలు, కాదు👐, Demands☝️తీర్చి తీరాల్సిందే!!


గణపతితత్త్వం అంతా గరికపూజలోనే ఉందంటారు. నా మట్టిబుర్రకి గరికలో అంత గొప్పదనం ఏవుంది అనే డౌట్ రాక మానదు. ఎవరో ఒకళ్ళని ఆడక్కా మానదు. అడిగాం కదాని ఆ చెప్పేవాళ్ళు సింపుల్ గా మట్టిబుర్రకి అర్ధమయ్యేట్టు చెప్పి ఊరుకోరు కదా.

ఆ “చెప్పడం”లో –

అష్టోత్తరాలు, సహస్రాలు, తంత్రాలు, మంత్రాలు….
విగ్రహాలు, నిమజ్జనాలు, బందోబస్తులు, శాంతిభద్రతలు…
అరటిపళ్ళు, అగరొత్తులు, లడ్డూలు- వాటి వేలాలు ….

ఆధ్యాత్మిక ప్రవచనాలు, నాస్తికుల ప్రలాపాలు, మతపిచ్చిగాళ్ళ ప్రేలాపనలు, రాజకీయ నాయకుల ప్రలోభాలు…

ఇన్ని పోగుపడతాయ్ వినాయకుడి మీద పత్రిలా.

ఇన్నిట్లో కప్పడిపోయి
ప్రకృతిమాత పుత్రుడు,
సృష్టిస్థితిలయాలకి అవతల వుండే ఆదిదేవుడి ఆత్మజుడు ఎక్కడా కనిపించడు. తెల్లారితే మళ్ళీ మామూలే.
తిన్నామా, పడుకున్నామా , తెల్లారిందా …
మట్టిబుర్రకి గరిక పవరేంటో అర్ధమవ్వదు.

పూజలు, హోమాలు, గుంజిళ్ళు , గుళ్ళు ఎన్ని చేసినా ప్రతి ఏడూ వినాయకుడు ఎప్పుడొచ్చాడో, ఎప్పుడెళ్ళిపోయాడో తెలీకుండానే వినాయక చవితి వెళ్ళిపోతుంది.

ఈ సంగతి ముందే తెల్సు కనక మట్టిబుర్ర మీదున్న ప్రేమతో, జాలితో తన బొమ్మని మట్టితోనే చెయ్యాలన్నాడు. కాస్త మట్టి ఉంటే చాలు ఇంకేం లేకపోయినా సర్దుకుపోయి అల్లుకుపోగల గడ్డి పరక గరికతోటే పూజ చాలన్నాడు.
మట్టి (simplicity) గరిక (humility) ఉన్నచోట తాను సాక్షాత్కరిస్తానన్నాడు.
ఆ రెండూ లేకపోతే ప్రపంచం అతివృష్టి- అనావృష్టి అన్నట్టు అల్లాడుతుందని ఆయన ఉద్దేశం అయ్యుండచ్చు. ఉద్దేశం కాదు సందేశమే అయ్యుండచ్చు. ఇప్పుడిప్పుడే మట్టిబుర్రకి విషయం తెలుస్తోంది. మెటీరియలిజంలో పడి మెంటల్ ఎక్కుతోందని అర్ధం అవుతోంది. చిలవలు పలవలు చెప్పి చివరికి చింతకాయలు కూడా రాల్చలేని వాళ్ళ బండారం బయట పడుతోంది. మట్టిబుర్ర గమనిస్తోంది. ప్రకృతికి దూరం అయిపోయానని గ్రహిస్తోంది. ఇవన్నీ చూస్తున్న గణపతికి మట్టిబుర్ర మీద జాలేసింది. అందుకే వచ్చేశాడు మళ్ళీ. సింపుల్ గా చెప్తే కానీ మట్టిబుర్రకి బోధపడదని తన తత్వాన్ని, సింబాలిజాన్ని ఆధునిక ఆంగ్ల మట్టిబుర్రల కోసం ఆంగ్లంలో, ప్లకార్డుల మీద డిమాండ్స్ గా రాసుకుని మరీ వచ్చేశాడు . అదుగో 👇అలా

మట్టితో తన బొమ్మని చేస్తూ మనసులో సింప్లిసిటీగా తనని ప్రతిష్టించుకొమ్మనీ, గరికతో తన మట్టి విగ్రహాన్ని పూజిస్తూ మనసుని హ్యుమిలిటీతో అలంకరించమనీ ఈసారి ఆయన సందేశం(ట). మనుషుల్లో నిరాడంబరత, అణకువ తక్కువ వ్వడమే వాళ్ళు పడుతున్న బాధలకి, తీస్తున్న గుంజిళ్లకి మూలం అని మూలాధారక్షేత్రస్థితుడికి అనిపించిందేమో!!

ఆయనకి విశ్వకవి పలుకులతో ఇదే ఈ మట్టిబుర్ర చేసే గరిక పూజ.

🌾Tiny grass, your steps are small, 
but you possess the earth under your 
tread🌾.
దుర్వాయుగ్మం పూజయామి🙏 
🌼God grows weary of great kingdoms,
but never of little flowers🌷.
దుర్వాయుగ్మం పూజయామి🙏

🌻The great earth makes herself hospitable with the help of the grass🌾.

దుర్వాయుగ్మం పూజయామి🙏

⚘God expects answers for the flowers he sends us, not for the sun and the earth🌿.

దుర్వాయుగ్మం పూజయామి🙏

ఇంతా చేసి మట్టిబుర్రకి వినాయకుడికి వాహనం ఏర్పాటు చెయ్యాలని తట్టలేదు. గణపతి గుర్తు చేశాడు . మట్టిబుర్రలో లైటు వెలిగింది.ఇన్నాళ్ల బట్టీ ఉన్న తీరని సందేహం తీరినట్టనిపించింది. స్వామీ! నీకు
చిట్టెలుకని వాహనంగా ఏర్పాటు చేస్తాను ఓకేనా? అంది. ఓకేనే కానీ చిట్టెలుకనే ఎందుకు సెలెక్ట్ చేశావో చెప్పు ముందు అన్నాడు.మట్టిబుర్ర ఇలా అంది –
స్వామీ, నేను అనే అహంకారాన్ని చిట్టెలుక సైజుకి తగ్గించేసుకుని, ఏనుగంతటి నీ తత్వానికి సరెండర్ అయ్యి నీ ఫిలాసఫీని ఒక తరం నుంచి మరో తరానికి మోసుకెళ్ళాలి అని నా భావం.ఈ సృష్టిలో నీ ఎజెండానే నడుస్తుందననే సత్యాన్ని నీ జెండాగా ఉండి సూచిస్తూ బతకాలని నా కోరిక అంది. మూషికధ్వజుడు మరియు అఖువాహనుడికి నచ్చినట్టుంది. “ఏనుగంత నేను ఎలక మీదెక్కి తిరగడం అంటే సింపుల్ లివింగ్ & హై థింకింగ్ అనే ఆదర్శానికి ప్రతీక అన్నమాట, బావుంది,అలాక్కానీ,” అన్నాడు.

🌻🌷🌾🌿🌹🌼

వాతాపి గణపతిం భజేహం

🌻🌷🌾🌿🌹🌼

👌😊సద్గురుVs.Sad😣గురు


గు = చీకటి = అజ్ఞానం అనే చీకటి

రు = వెలుగు = జ్ఞానం అనే వెల్తురు

సో, గురు = అంటే చీకటి పక్కనే వెలుగు. కానీ చీకటి అంటే వెల్తురు లేకపోవటం. వెల్తురు రాగానే చీకటి ఎక్కడికీ పోదు, అదింక వుండదు. అంతే. జ్ఞానం వికసిస్తే అజ్ఞానం అదృశ్యం అయినట్టు.

అన్-ఫార్ట్యునేట్లీ, ఆ విషయం కొందరు గురువులకి, ఐ మీన్, చాలా మటుకు స్వయం ప్రకటిత గురువులకి, తెలీదు. వాళ్ళని అనుసరించే భక్తజనాళికి అంతకంటే తెలీదు.

తెలీదు = అజ్ఞానం = చీకటి

ఇలాంటి గురువులు + వాళ్ళ శిష్యగణం కలిపి ఎంత అజ్ఞానం, ఎంత చీకటీ నింపుతున్నారో లోకంలో !!🤔

ఎందుకోగానీ నిజంగా చీకటి తొలగించే గురువులు ఎక్కువ వార్తల్లోకి రారు. వచ్చినా వాళ్ళు తొలగించేది అజ్ఞానం, మూఢత్వం అనే చీకట్లు కాబట్టి, నైన్టీ పర్సెంట్ జనాభాకి కావాల్సింది కూడా “Divinely-endorsed” అజ్ఞానమే తప్ప నిజమైన జ్ఞానం కాదు కాబట్టి వాళ్ళు లో-ప్రొఫైల్‌‌తోనే వుంటారు.

జ్ఞానం పేరుతో అజ్ఞానాన్ని, వీలైతే కొత్తకొత్తరకాల అజ్ఞానాల్ని తయారు చేసే గురువులకి మాత్రం ఇన్స్టాన్ట్ పబ్లిసిటీ. వీళ్ళ వెనకున్న శిష్యగణం జనాభాని బట్టీ వీళ్ళ వెనకబడే రాజకీయ నాయకులు. అందుకే ఆధ్యాత్మికతకి, రాజకీయాలకి అవినాభావ సబంధం – రెండూ వ్యాపారంగా మారిపోయినప్పుడు. రెండు వ్యాపారాలకీ సొసైటీలో పేరుకున్న అజ్ఞానమే పెట్టుబడి.

చీకటి గదిలోకి వెలుగు రావాలంటే కిటికీలు తెరవాలి. లేకపోతే లైట్ ఆన్ చెయ్యాలి. గదికి కిటికీలు లేకపోయినా, గదిలో లైటు లేకపోయినా అంతే సంగతులు. గురు = అంటే చీకటిని పోగొట్టే వెలుగు. అంతే కానీ –

వెలుగునిచ్చే కిటికీ కాదు, కిటికీ తెరిచే చెయ్యీ కాదు.

లైటు బల్బు కాదు, లైట్ ఆన్ చేసే స్విచ్చీ కాదు, స్విచ్చి వేసే చెయ్యీ కాదు.

కిటికీ తెరవాలన్నా, లైటు వెయ్యాలన్నా వెలుగు కావాలని మనకి అనిపించాలి కదా? ఆ అనిపించడం ఎలా జరుగుతుంది?

ఒకసారి అనిపించాక, తుప్పు పట్టో, ఇంకెందుకో కిటికీ తెరుచుకోపోయినా; కరెంటు పోయో, బల్బు మాడిపోయో లైటు వెలక్కపోయినా వాటిని మార్చుకోవడమో, రిపేర్ చేసుకోవడమో మన పనే కదా? అది చెయ్యాల్సింది మనమే అని మనకెలా తెలుస్తుంది?

అండర్‌‌-లైన్ చేసిన ఆ రెండు ప్రశ్నలూ మనసుల్లో పుట్టించి, వాటికి జవాబులు రాబట్టుకోవడం ఎలాగో మనుషులకి నేర్పించేవాడికే గురు అనేపేరు పొందే అర్హత వస్తుంది. పరిణతి చెందిన ఆలోచనాస్థాయి వున్నవాళ్ళ ప్రశ్నలు, సందేహాలు తీర్చగలిగిన వాడిని గురుస్థానంలో కూర్చోపెట్టచ్చు. సందేహాలు తీరి, తాత్విక సమస్యలన్నీ తీర్చుకుని, “ఏకం సత్ విప్రాః బహుదా వదంతి” అని బల్లగుద్ది నిరూపించగల స్థాయిలో వున్నవాణ్ణి రాముడిని తీర్చిదిద్దిన విశ్వామిత్రుడిలా నడిపించగలిగిన వాణ్ణి సద్గురువు అనొచ్చు. ఇవేం కాకుండా –

కోట్లు కూడబెట్టడం,

పాలిటిక్స్‌‌లో తలదూర్చి మంత్రిపదవులు పొందడం,

ప్రజల ఆలోచనాస్థాయిని ఎదగనివ్వకపోవడం,

అరాచకాల్ని, అత్యాచారాల్ని ఆధ్యాత్మికత ముసుగులో జస్టిఫై చెయ్యడం,

వగైరా కార్యక్రమాల్లో వున్నవాళ్ళని సద్గురు అని ఎలా అంటాం?

గు = చీకటి = అజ్ఞానం అనే చీకటి

రు = వెలుగు = జ్ఞానం అనే వెల్తురు

దీన్నిబట్టీ గురువులు రెండు రకాలు –

  1. గురు = చీకటి పక్కనే వెలుగు. కానీ చీకటి అంటే వెల్తురు లేకపోవటం. వెల్తురు రాగానే చీకటి ఎక్కడికీ పోదు, అదింక వుండదు. ఇలాంటి అనుభవం ఇచ్చేవాడు సద్గురువు.
  2. గురు = వెలుగుతో పాటే చీకటి. చీకటి అంటే వెల్తురు లేకపోవటం. వెల్తురు లేకపోయినా/రాకపోయినా చీకటి చీకటి దాని స్థానంలో అది పదిలంగా వుంటుంది. ఎక్కడికీ పోదు. ఈ టైపు అనుభవాన్ని ఇచ్చేవాడు శాడ్‌‌గురువు.(Sad గురు, అందరికీ శాడ్‌‌‌‌నెస్ ప్రసాదించే మహానుభావుడని కవిహృదయం.)

సమస్యేంటంటే ప్రపంచంలో రెండు రకాల గురువులూ వున్నారు. అన్ని మతాల్లోనూ వున్నారు. ఎక్కడో చదివాను గురువుని ఎంచుకునేముందు ఆ గురువుని అనేకరకాలుగా పరీక్షించి కానీ అతని దగ్గర చేరకూడదని. ప్రస్తుతం ఈ ప్రాసెస్ జరగట్లేదనిపిస్తోంది. జరిగినా అందులో ఏదో లోపం గారెంటీగా వుంది. అదేంటో మనమే వెతుక్కోవాలి. ఏ గురువులూ అందుకు సాయం చెయ్యరు. (అలా అని ప్రస్తుతం పెరుగుతున్న హేతు-తీవ్రవాదాన్ని సమర్ధించట్లేదు కానీ ఆధ్యాత్మికమార్గంలో హేతువాదానికి ముఖ్యపాత్ర వుందని చెప్పక తప్పదు)

ఇవాల్టికి ఇంతే సంగతులు. బై4నౌ 🙏.

🌾🌿🌷ధర్మరాజు పర్యావరణ స్పృహ🌷 🌿 🌾 Happy Deepavali + Happy Vrukshavali


పాండవుల వనవాసం కామ్యకవనంలో అనుకుంటా మొదలౌతుంది. ధర్మరాజులేని హస్తినలో ఉండలేక కొందరు ప్రజలు కూడా పాండవులతో ఆ అడవిలో వుంటారు. కొంతకాలానికి ఒకనాటి రాత్రి ధర్మరాజు కామ్యకవనంలో ఉంటున్న జంతువులూ, పక్షులు తనవైపు దీనంగా చూస్తూ బాధ పడుతున్నట్టు కలగంటాడు. గురువు ధౌమ్యుడిని ఆ కలకి అర్ధమేమిటని అడుగుతాడు. “రాజా! నువ్వూ నీ పరివారం ఇప్పటికే సంవత్సరంపాటు ఈ అరణ్యంలో గడిపారు. మీ ఉనికివల్ల అడవిలోని పశుపక్ష్యాదుల జీవనానికి ఆటకం ఏర్పడుతోంది. దయచేసి మీరు మరో స్థలానికి వెళ్లి ఈ పరిసరాలపైన, జీవులపైనా భారాన్ని తగ్గించండని ఆ జీవులు నిన్నుకోరుతున్నాయి యుధిష్టిరా!,” అని వివరిస్తాడు ధౌమ్యుడు. పరిస్థితి గ్రహించిన యుధిష్ఠిరుడు తక్షణమే తన నివాసాన్ని ద్వైతవనానికి మారుస్తాడు. అంతేకాదు తనతోపాటు వనవాసం చేస్తున్న ప్రజల్ని జనజీవన స్రవంతిలోకి మళ్ళిస్తాడు. వనాల పేర్లు, డయలాగ్సూ కొంచెం అటూ ఇటూ అవ్వచ్చు గానీ స్థూలంగా ఇదీ కధ. ప్రాచీన జీవనశైలిని గంధపుష్పాక్షతలతో “పూజించే” మనం నేర్చుకోవాల్సిన పాయింటు – యుధిష్టిరుడి పర్యావరణ పరిరక్షణ స్పృహ. సబ్-కాన్షస్‌గా పర్యావరణ పరిరక్షణ స్పృహ వున్నవాడు కాబట్టే ఆయనకి అంతరాత్మ ఆ కల రూపంలో దిశానిర్దేశం చేసిందని అనుకోవచ్చేమో. నా మటుకు నేను అలాగే అర్ధం చేసుకుంటాను. ఈ కధ మొదటిసారి చదివినప్పుడు మన పూర్వీకుల పర్యావరణ పరిజ్ఞానం, వాళ్ళ ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీనెస్ అర్ధమై ఒళ్ళు గగుర్పొడిచింది. ప్రకృతిలో భాగమై, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడమని ఋషులందరి తరఫున వ్యాసమహర్షి ఇచ్చిన, గ్రంధస్తం చేసిన సందేశం హృదయానికి హత్తుకుపోయింది. అప్పుడే పర్యావరణ సమతౌల్యతకి సంబంధించి ఆశ్రమధర్మాలలో అంతర్లీనంగా వున్నఉద్దేశం కూడా తెలిసింది. ఒక్క గృహస్తాశ్రమంలో తప్ప తక్కిన ఆశ్రమాల్లో సహజవనరులమీద వ్యక్తి వల్ల ఎక్కువ వత్తిడి వుండదు. ఈ ఏర్పాటు వల్ల మనుగడ కోసం మనుషులు ప్రకృతి నుంచి ఏమేం తీసుకున్నారో వాటిని భర్తీ చేసుకోవడానికి ప్రకృతికి వీలు కలిగేది. ఒక పక్క మనుషులు కక్షలు, కబ్జాలు, అస్త్రాలు, యుద్ధాల పేరిట విధ్వంసానికి పెద్ద ఎత్తున పాల్పడటం మొదలైన ఆ సమయంలోనే, వర్ణవ్యవస్థ వర్ణవివక్షగా రూపు మారుతున్న రాజకీయ వాతావరణంలో  అప్పటి తత్వవేత్తలు పాలకులకి, ప్రజలకి ఏ విధమైన దిశానిర్దేశం చేసారో తల్చుకుంటే ఒక పక్క ఆనందం, వాళ్ళ దూరదృష్టిని మానవాళి నిర్లక్ష్యం చేసిన విధం చూస్తే బాధ ఒక పక్క కలుగుతాయి. ఇతర జాతుల పోటీ నుంచి, ఆక్రమణ నుంచీ తప్పించుకోవాలంటే డెవలప్‌మెంట్ & ఇండస్ట్రియలైజేషన్ అనేవి తప్పనిసరి. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్న ప్రకృతి విధ్వంసం మొదలైంది. అయితే ఇప్పుడు డెవలప్‌మెంట్ & ఇండస్ట్రియలైజేషన్ వల్ల కలిగిన లాభాలేవీ జారవిడవకుండానే పర్యావరణ హితకరమైన జీవనశైలిని అలవర్చుకోవాల్సిన అవసరం, బాధ్యత అన్ని దేశాల, జాతుల మీదా పడింది. ఆ బాధ్యతని సంతోషంగా నెత్తికెత్తుకోడానికి అవసరమైన తాత్వికమూలాలు మన సంస్కృతిలోనే వున్నాయి. అదే ధర్మరాజుని వనం నుంచి వనం మారుతూ వెళ్ళడానికి ప్రేరేపించింది. ఆయనని ఆదర్శపాలకుడిగా తీసుకునే మనం ఆయన పర్యావరణ స్పృహని పుణికిపుచ్చుకుంటున్నామా? లేదా? రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని మన లైఫ్-స్టైల్లో, అలవాట్లలో అవసరమైన మార్పులు చేసుకుంటున్నామా, లేదా? మన ప్రాధాన్యతలు మారాయని గవర్న్మెంట్లూ, ఉత్పత్తిదారులూ, వ్యాపారవర్గాలూ గ్రహించేలా చేస్తున్నామా, లేదా?
ఈ ప్రశ్నని ఒకసారి లేవనెత్తి దానికి సమాధానం వెతుకుతూ లేదా చెబుతూ ఈ దీపావళి జరుపుకోవాలనే క్రిందటేడు వేసిన దీపావళి “టపా”కాయనే మళ్ళీ వేస్తున్నా ఒక చిన్న హాండ్-మేడ్ వీడియోతో –

🌹This is not preaching but just ideas and dreams to share with those who have the might and the means to make them happen🌹 

మానవజాతి ‘బాల్యా’న్ని శతాబ్దాలపాటు మనకిష్టమైనట్టు గడపనిచ్చింది భూమాత. తనకిష్టమైనవి, తనకి కావాల్సినవి త్యాగం చేసింది. ఇప్పుడింక నేలతల్లికి అవసరమైనవి మనమివ్వాలి. మన ప్రాధాన్యతలు, ప్రయారిటీలు మార్చుకోవాలని నేలతల్లి పర్యావరణం ద్వారా సంకేతాలిస్తోంది. పిల్లలకి ఒక వయసు వచ్చేవరకూ బొమ్మలు ఆటలు తప్పనిసరి. బాల్యం దాటాక పుస్తకం చదవాలి, మస్తకం పనిచెయ్యాలి. పుడమితల్లి తన పిల్లలకి అదే చెప్తోంది. టపాకాయగా మారి పేలిపోయిన ప్రతి రూపాయికీ ఒక చెట్టు నాటమని మౌనంగా సైగ చేస్తోంది.

సింపుల్‌గా, అందంగా, ఏదో లోతైన సత్యాన్ని మనసుకి స్ఫురింపజేస్తూ వెలిగే దీపంతో మనం గడిపేది కొన్ని నిముషాలు. ఆనందంతోపాటూ హడావిడి, ఆర్భాటం; వీటికి తోడు ఆడంబరం వెంటేసుకుని వచ్చే స్వీట్లు, టపాకాయలకోసం వెచ్చించే సమయం కొన్ని గంటలు. నానాటికీ కలుషితం అవుతున్న నైతిక వాతావరణం మనం దీపానికి ప్రాధాన్యత పెంచాలని చెబుతోంది. స్వచ్ఛంగా వెలిగే దీపాన్ని మనసులో సత్యంగానూ, బాహ్యంలో ఆ దీపపు పరమార్ధాన్ని ప్రతిఫలించే వృక్షాల రూపంలోనూ శాశ్వతత్వం కల్పించమని ప్రకృతి, మానవప్రకృతి కోరుకుంటున్నాయి. టపాకాయల హంగులకి, మండి మాడి ఉక్కిరిబిక్కిరి చేసే పొగగా మిగిలే వాటి వయసుపొంగులకి చెట్టూచేమల పచ్చిగాలితో, పూలూపళ్ళ సుగంధాలతో సాంత్వననివ్వాల్సిన సమయం వచ్చిందనీ, దీపావళితో వృక్షావళినీ పండగగా చేసుకోవాలనీ భావితరాల భవిష్యత్తు భారతీయులనడుగుతోంది.

 

Happy Deepavali 🌹🙏🌹Happy Vrukshavali 

 

⚛🌌🌊🌏సైంటిఫిక్☯వినాయక్🌷 🌿 🌾 🌹


 🌹 🌹 🌹 🌹🌹 🌹 🌹 🌹🌹 🌹 🌹 🌹

వాగర్ధామివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే |

Bapu Ardhanariswara

జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ||

 🌹 🌹 🌹 🌹🌹 🌹 🌹 🌹🌹 🌹 🌹 🌹

(pic courtesy: Google)

అనగనగనగా చాలా రోజుల కిందట, ఎంత చాలా అంటే చెప్పలేనంత చాలా. సైన్సు ప్రకారం సృష్టికి మొదలు అని చెప్పుకునే బిగ్ బాంగ్ కంటే కొంచెం ముందు అనమాట. అప్పుడు పరమాత్మ అని ఒకటే ‘పదార్ధం’ ఉండేది. పదార్ధం అని ఎందుకంటామంటే – అది ఆడాకాదు, మగ కాదు; దానికి పుట్టడం, పోవడం అనేవి లేవు. ఆకలి, దాహం, నిద్ర, భయం అంటే ఏంటో కూడా తెలీదు. “ఇంకొకటి”అనే కాన్సెప్టే లేనప్పుడు ఇంకే ఫీలింగైనా ఎలా వుంటుంది? అలాంటిది ఆ పరమాత్మ. దానికి సడెన్‌గా ఒకసారి ప్రకృతి , పురుషుడు అనే రెండుగా విడిపోతే ఎలా వుంటుంది అనిపించింది. అలా ఎలా అనిపించింది? “ఇంకొకటి”, “నేను కానిది”, “వేరేది” లాంటి రిలేటివిస్టిక్ కాన్సెప్ట్ లేనప్పుడు అని అడగద్దు. అదంతే. “యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా” అనుకోవాల్సిన సరిహద్దు రేఖ అది. సో, అనుకున్నట్టే అలాగే విడిపోయింది. విడిపోయిందన్న మాటే గానీ ప్రకృతి, పురుషులిద్దరికీ ఒకరంటే ఒకరికి వల్లమాలిన ఆకర్షణ. ఉండదా మరి? వాళ్ళిద్దరూ నిజంగా ఇద్దరు కాదు కదా! ఒక్కరే కదా? అందుకే ఆ ఎట్రాక్షన్. దానికి వాళ్ళు ప్రేమ అని పేరు పెట్టుకున్నారు. ఆనంద తాండవంగా ఆ ప్రేమని ప్రకటించుకోవడం వాళ్ళిద్దరికీ చాలా ఇష్టం. ప్రకృతికి రకరకాల రూపాలు ధరించి అలరించడం ఇష్టం. పురుషుడిని తన యోగమాయతో మోహితుడిని చెయ్యడం ఆమెకి ఒక ఆట. ప్రతీ రూపం తన ప్రతిరూపమేననీ; మాయకి, మోహానికి అతీతమైన శక్తి స్వరూపిణి తననుంచి వేరు కాదని, కాలేదని నిరూపించి ఆట పూర్తి చెయ్యటం పురుషుడి వంతు. ఈ సయ్యాటల్లో భాగంగానే  ప్రకృతి మేటర్ & ఎనర్జీ అనే రెండు రూపాలు ధరించింది ఒకసారి. పురుషుడు ఎవేర్‌నెస్ (ఎరుక)గా నిలిచాడు. మేటర్ & ఎనర్జీలుగా మారిన ప్రకృతి ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్‌లుగా ఆవిర్భవించింది. ప్రోటాన్, న్యూట్రాన్లతో కూడిన న్యూక్లియస్‌ని పురుషుడు ఆవహించాడు. న్యూక్లియస్‌‌లో దాగిన పురుషుడిని చేరాలని,  ప్రేమతో దాని చుట్టూ ప్రదక్షిణనృత్యం సాగించింది ఎలక్ట్రాన్. రకరకాల రీతుల్లో సాగిన ఆ  ప్రకృతీపురుషుల నృత్యవిన్యాసాలే హైడ్రోజెన్ మొదలైన మూలకాలుగా పరిణమించి ఇప్పటికీ సాగుతున్నాయి. ఆ తాండవంలోనే వాళ్ళిద్దరూ  గ్రహనక్షత్రాల రూపాల్లో వెలుగుతూ ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతున్నారు నేటికీ. అక్కడితో ఆగలేదు. నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, దిక్కులు, కొండలు, నదులు, సముద్రాలు, …. ఎన్నెన్నో అయ్యారు. నృత్యవిన్యాసాలు ప్రేమ విలాసాలుగా పరిణమించిన తరుణాలే జీవకణాలు. x & y క్రోమోజోములూ అయ్యాయి. అవే వృక్ష, పశు, పక్షి, కీటకాదులయ్యాయి. ఆ ప్రాణుల జీవనగమనమే వేదనాదంగా వింటూ ఆనంద పారవశ్యం పొందారు.  అప్పటికీ ప్రకృతీపురుషుల తనివి తీరలేదు. ఇంకా ఇంకా గొప్ప సృష్టి ఏదో జరగాలి. ఇప్పటివరకూ జరిగిన ఆనందనాట్యానికి శిఖరాయమానంగా ఒక అద్భుతవిన్యాసం చెయ్యాలి. ఏమిటది? సృష్టినృత్యానికి పరాకాష్టగా దాన్నెలా సంయోజన చెయ్యాలి? తాండవకేళి సలుపుతూనే పురుషుడు ధ్యానమగ్నుడయ్యాడు. ప్రకృతి ప్రేమదీక్షితురాలయింది.

ధ్యానసమాధిలోంచి పురుషుడు మేలుకొనేలోగా అతనికి నచ్చేలా నూతన సృష్టికి రూపకల్పన చెయ్యాలనుకుంది. ఆ ఆలోచనలోనే, అప్రయత్నంగానే నృత్యసమయంలో తన వంటిపై చేరిన మట్టికణాలతో ఒక ఆకారాన్ని కల్పించింది. అనుకోకుండా తయారైన ఆ మట్టిబొమ్మకి ప్రాణం పోయాలనిపించింది ప్రకృతికి. దానిని చూస్తుంటే అంతకు ముందెప్పుడూ లేని పులకింత. తామిద్దరూ చేసే సృష్టినాట్యంలో ఈ బుల్లిబొమ్మ కూడా  తన బుడి బుడి నడకలతో పదం కలిపితే, అది వేసే తప్పటడుగులు తామిద్దరూ కలిసి చూస్తూ ఆనందిస్తే , అది పలికే ముద్దు పలుకులనే తమ కైలాసశిఖరాగ్ర తాండవానికి వాద్య సహకారం  చేసుకుంటే,… ప్రకృతికి అంతకు ముందెప్పుడూ కలగని కొత్తకొత్త ఊహలు. ఆ బొమ్మ చేసే ప్రతి పనిలో, వేసే ప్రతి అడుగులో, ఆడే ప్రతి పలుకులో తమ ఇద్దరి నాట్య విన్యాసాలు, విలాసాలు, వినోదాలు ప్రతిఫలిస్తుంటే చూసి ఆనందించాలనే అప్పటి వరకూ లేని ఒక అందమైన కోరిక. ఆ ఊహలు ఇచ్చిన ఊపులో, ఉత్సాహంతో ఆ బొమ్మకి ప్రాణప్రతిష్ట చేసింది, ఈ నూతన సృష్టిలో పురుషుడి ప్రమేయం లేదన్న విషయం మరిచింది. ఈ చిన్న పొరపాటు వల్ల అప్పుడే ప్రాణం పొందిన ఆ శిశువుకి ఆత్మజ్ఞానం అలవడదన్న సంగతి ప్రకృతి గుర్తించలేకపోయింది. ఆ చిన్నిబాలుడికి అడుగులు నేర్పుతూ ఆడుకోవడం మొదలు పెట్టింది. ఇంతలో పురుషుని  ధ్యానం పూర్తయింది. ముందుగా అనుకున్న కొత్త నాట్యవిన్యాసాన్ని ధ్యానంలో దర్శించి వచ్చిన అతనికి ప్రకృతిమాతతో ఆడుకుంటున్న అందాల బాలుడు వింతగా అనిపించాడు. అయినా వాడి మీద వాత్సల్యం కలిగింది.  వారిద్దరితో తనూ అడుగు కలిపాడు.  అయితే చిన్నవాడు అడ్డుపడ్డాడు. కేవలం ప్రకృతి ఆలోచనలకి అనుగుణంగా ప్రాణం పోసుకున్న ఆ పసివాడు పురుషుడి ప్రవేశంతో తనలో ఆత్మజ్ఞానం మేల్కొనడాన్ని అర్ధం చేసుకోలేకపోయాడు. పశుప్రవృత్తిలో ఉండిపోయి తామసికుడైన మనిషి జ్ఞాన, విజ్ఞాన, చైతన్యాల్ని తన మూఢత్వంతో ఎలాగైతే ఎదిరిస్తాడో అలాగే పురుషుని రాకని నిరోధించడం మొదలుపెట్టాడు. జ్ఞాన స్వరూపుడైన పురుషుడికి సమస్య అర్ధమైంది. బాలుడి మేధోశక్తి , బుద్ధి ఉండాల్సిన స్థాయిలో లేవు. అందువల్లే తన నిజతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. తను ధ్యానంలో మునిగేముందు  కల్పించాలనుకున్న విశిష్టసృష్టి ఇది కాదు. ప్రకృతి తొందరపడి తన అభిప్రాయం తెలుసుకోకుండా చేసిన తక్కువ స్థాయి సృష్టి. ఇంతకుముందు ఉనికిలోకి తెచ్చిన ఏ ఇతర ప్రాణి కన్నా ఎక్కువైనది కాదు ఈ జీవి.  దీనికి కారణం ఈ బాలుడి సృష్టిలో తన ప్రమేయం లేకపోవడమే. విషయం గ్రహించిందే తడవుగా నిజతత్వాన్ని, సత్యాన్ని తెలుసుకోలేని, ఆ ఆసక్తే లేని  తక్కువ స్థాయి బుద్ధితో వున్న బాలుడి శిరస్సుని శరీరం నుంచి వేరు చేశాడు. పురుషుడి మనసు తెలియని ప్రకృతి దుఃఖంలో మునిగిపోయింది. పురుషుడు ఆమెని ఓదార్చాడు. బాలుడి మెదడు, శరీరాల బరువుల నిష్పత్తి  ఇతర ప్రాణులకున్నట్టు వుంటే చాలదనీ, అది పెరిగితే కానీ ముందుగా అనుకున్న అద్భుతసృష్టి జరగదని వివరించాడు. వెంటనే అందుకు తగిన బరువున్న మెదడుతో ఒక తలని సృష్టించి బాలుడి మొండేనికి అతికించాడు. బాలుడు సజీవుడై లేచి ప్రకృతిపురుషులిద్దరినీ తన తల్లిదండ్రులుగా గుర్తించాడు. వారిద్దరూ నిజానికి ఒకటేనని, వారూ తనూ వేరు కాదనే అద్వైతభావాన్ని అంగీకరించాడు. పాంచభౌతికమైన శరీరాన్ని ప్రకృతిగా, భౌతికతకి అతీతమైన ఎరుక/consciousness/congnizance ని పురుషుడిగా గౌరవించి, పూజించి –

వాగర్ధామివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే |జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ||

అని ఉపాసించిన ఆ క్షణంలో సకలచరాచరాల్లో అత్యున్నత జీవిగా పరిగణించబడిన మానవుడు ఉద్భవించాడు.

సూక్ష్మదృష్టి, గొప్ప శ్రవణశక్తి – అందరి అభిప్రాయాలూ వినిపిచుకునే ఆసక్తి,

ఎలాంటి క్లిష్ట విషయమైనా తేలిగ్గా ఆకళింపు చేసుకోగల మేధోశక్తి,

దేన్నైనా సాధించడానికి అవసరమైన  సారళ్యం, వశ్యత, నమ్రత, మృదుత్వం,

అనుభవాలన్నీ సమభావనతో స్వీకరించి జీర్ణించుకునే స్థితప్రజ్ఞత,

మంచితనంతో అందర్నీ కలుపుకుపోయే స్వభావం,

సంఘాన్ని అదుపులో ఉంచగల నాయకత్వ లక్షణాలు

అలవర్చుకుని వినాయకుడు, గణనాయకుడు అయ్యాడు.

వినాయకుడిలోని ఈ గుణగణాలన్నీ సాధించడంవల్లే శ్రీకృష్ణుడు అంతుచిక్కకుండా అదృశ్యమై తనకి అపనిందలు తెచ్చిన శమంతకమణిని వెతికి తీసుకొచ్చి అపవాదు పోగొట్టుకోవడమే కాక ముందుకన్నా కీర్తివంతుడయ్యాడు.

screenshot_20160905-003223.png

 🌷 🌿 🌾 🌹🌷 🌿 🌾 🌹🌷 🌿 🌾 🌹

గజాననం భూతగణాది సేవితం, కపిత్థజంబూఫలసారభక్షితం

ఉమాసుతం శోకవినాశకారణం, నమామి విఘ్నేశ్వర పాదపంకజం

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

 

 

గాంధీగారి🙈🙉🙊కోతులు + 3 కొత్త🐒🐵🐒 కోతులు Monkey’s Message😉 to its Cousins😆


 

చాలా ఏళ్ళ కిందట “మాకూ స్వాతంత్ర్యం కావాలి” అనే సినిమా వచ్చింది. చూడలేదు కానీ అది మనిషి వల్ల మూగజంతువులు పడుతున్న అగచాట్ల గురించి అని గుర్తు. జంతువులకీ స్వాతంత్ర్యం ఉండాలన్న చక్కటి ఉద్దేశంతో తీసినా ఇందులో చిన్న కాంట్రడిక్షన్ లేక పారడాక్స్ లేక అసంబద్ధత కనిపిస్తుంది. అది – స్వాతంత్ర్యం కోల్పోయిన జంతువుల చేత “మాకూ స్వాతంత్ర్యం కావాలి” అంటూ రక్తంలో నటన అనేది లేని ప్రాణుల చేత నటింపజెయ్యడం. బట్, అదొక మీనింగ్‌ఫుల్ అసంబద్ధత. స్వేచ్ఛ కోల్పోయిన వాళ్ళకే కదా దాని విలువ తెలిసేది, వాళ్ళే కదా స్వేచ్ఛ కోసం పోరాడేది. అదే పరిమిత స్వేచ్ఛతో లేక పూర్తి స్వేచ్ఛతో వున్న మూగజీవాలు మాకూ స్వాతంత్ర్యం కావాలి అన్నట్టు ప్రవర్తిస్తే? స్వాతంత్ర్యం సాధించుకున్నాక దాన్ని ఎలా వాడుకోవచ్చో కూడా ప్రదర్శిస్తే? అది ఎలావుంటుందో చూపించే ప్రయత్నమే ఈ టపా(కాయ్).

ఈ ప్రపంచంలో చరాచరాలన్నీ పరస్పరాశ్రయాలు. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఏదైనా ఉండడం సృష్టిలో కుదరని పని. జీవుల మనుగడ -అందులోనూ మానవసమాజపు మనుగడ పరస్పర ఆధారత లేకుండా అసాధ్యం. అందుకే స్వేచ్ఛని యధేచ్చ అనికాకుండా కొన్ని పరిమితులతో కూడిన స్వతంత్రత అని అర్ధం చేసుకోవాల్సిన అవసరం వుంటుంది. ఐతే, ఎలాంటి అసంతృప్తి లేకుండా ఎంతో కొంత స్వేచ్ఛని ఎలా వదులుకోగలం? అది తెలియాలంటే ఫ్రీడం అనే దానికి అసలైన అర్ధం, దాన్ని సద్వినియోగం చేసుకునే సామర్ధ్యం వుండాలి. మన చుట్టూ జరిగేవాటిని గమనిస్తే ఆ పరిస్థితి లేదు అనిపించకపోదు. కొందరు స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తారు, కొందరు సరిగ్గా వాడుకోలేకపోతారు. కానీ మెజారిటీ ప్రజలు వాళ్ళు అనుభవిస్తున్న సో-కాల్డ్ స్వేచ్ఛ మారువేషంలో వచ్చిన పరాధీనత అని తెలుసుకోలేరు.స్వేచ్ఛ కోరుకునే వాళ్ళు అది సాధించుకున్నాక దానికున్న పరిధులేమిటో తెలుసుకోకుండా ప్రవర్తించడం, అంతకు మించి దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోవడం, దాన్ని కాపాడుకునే అవకాశం కోల్పోవడం, అన్నిటికంటే మించి మారువేషంలో వచ్చిన పారతంత్ర్యాన్ని  గ్రహించలేకపోవడం – ఇవన్నీ ఆలోచించే లోచనాలకి కనిపించే సత్యాలు.

ఈ వాస్తవాల్ని మొన్నటి ఆగస్ట్ పదిహేనుకి కొంచెం అటూ ఇటూగా, మూడు కోతులు అనాలోచితంగానే అయినా పూర్తి అర్ధవంతంగా తమ హావభావాలలో , చేష్టలలో ఆవిష్కరించాయి. కోతి నుంచి పుట్టిన మనిషికి ఆ కోతులే ఒక సందేశాన్ని ఇస్తున్నాయా అనిపించే ఆ మూడు కోతులూ ఇవిగో👇

 

3 decades ago there was a telugu movie “maakoo swaatantram kaavaali” (=We want freedom too). Didn’t see the film but I know it was about animals’ rights and the travails they face under the shadow of the dominant species on earth i.e. Homo sapiens. I find the film’s title a bit paradoxical because it is about animals being forced by their masters to enact their own troubles. But then it is a very meaningful paradox. It is only the enslaved that can understand and fight for their freedom, Isn’t it? Now, imagine animals, partly or fully free, displaying their feelings for freedom and the way they might use it once it is achieved. That’s what this post is about.

It is said that there is no such thing as Unrestrained Freedom because all things in this world are interconnected and therefore interdependent. The interconnected-ness and inter-dependency become more emphasized in the living world, especially among humans and hence the necessity to know what freedom really means and to acquire the ability to exercise it carefully. But, some observation would reveal that freedom, in many instances, is not used with an educated understanding of the word. Some abuse it, some do not use it meaningfully and most do not realize that the “freedom” they are enjoying is a different form of slavery.

Pictures of a few monkeys that I came across during the independence day week seem to display the above mentioned facts about freedom. It is as if the monkey, from whose distant relative – some kind of ape – the homo sapiens are supposed to have evolved, is sending a message across to its distant cousins, us !!  👇

MonkeySuffer

దుర్భరమైన పరాయి పాలన నుంచి విముక్తి కోసం అర్రులు చాస్తాం. ఫ్రీడం వచ్చేవరకూ ఆలోచనా, ఆదర్శం, త్యాగం, విలువలూ అన్నిటికీ బోల్డు విలువ ఇస్తాం. (We yearn for freedom and long for a chance to break the restraints of slavery. We value Theories, Ideals, Sacrifice, Human Values until freedom is gained) 

60076821

ప్రాణాలకి తెగించి పోరాడి, స్వేచ్ఛ సాధిస్తాం. (We go to any extent to achieve freedom)

20170816194555

స్వేచ్ఛ దొరికాక …. అంతే సంగతులు మంకీ మైండ్‌కి బానిసలుగా బతుకుతాం. Monkey See – Monkey Do కల్చర్‌కి అలవాటు పడతాం. (But what we do with the well-earned freedom is a different matter. Monkey See – Monkey Do culture becomes the new bondage disguised as freedom) 

చెడు అనవద్దు, వినవద్దు, కనవద్దు అని చెప్పే గాంధీగారి మూడు కోతులూ అందరికీ తెలుసు. ఆ మూడిటికీ ఈ మూడు కోతుల్నీ కలిపి చూస్తే స్వాతంత్ర్యాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో & ఎలా అర్ధం చేసుకోకూడదో తెలుస్తుందేమో? మంకీ మైండ్‌ని కంట్రోల్లో పెట్టకుండా ఫ్రీడం కోసం ఎంత గొడవ చేసినా ఏంటి ప్రయోజనం? పరాయి పాలన అంటే ఒక్క విదేశీ పాలనే కాదు కదా? బుద్ధి, ఆత్మా కూడా పరాధీనతనుంచి బయట పడాలి. పరాధీనత అనేది స్వదేశం, విదేశం అనే గీతల మధ్య ఇమిడిపోయేంత చిన్న విషయమా? స్వధర్మం, పరధర్మం, సమదర్శనం అనేవాటిని అర్ధం చేసుకుని పాటించకుండానే పరాధీనత పోతుందా? స్వాతంత్ర్యం వస్తుందా? వాడ్డూయూ థింక్?

పనిలో పని, H.L. Mencken అనే ఆయన మంకీ మైండ్ + డెమోక్రసీ గురించి అన్నది 👇ఆలకించడం, దానిపై ఆలోచించడం అవసరం. (యెస్, మీ మైండ్‌లో నా గురించి మెరిసిన థాట్ నిజమే 😆, ఆయన గురించి నాకేం తెలీదు, ఈ కోట్ తప్ప)

Gandhiji, one who is seen, though not by all, as the symbol of our freedom used to keep figurines of three monkeys symbolizing the principle of “see no evil, hear no evil, speak no evil” . Add to them the three monkeys above and the six monkeys together may tell us how to understand and also how not to understand freedom. Human mind is compared to a mad monkey by philosophers. Accepting that comparison brings forward the question – of what use is the freedom when it is in the hands of a mad monkey? Another point of great significance is to understand freedom in its broadest and deepest sense. Is Freedom just the deliverance from physical rule by foreigners? Is it meaningful without the intellect and the soul being freed from bondage? And, does bondage only mean something limited between self-rule and foreign rule? Is Freedom from bondage complete without an understanding and practice of Swadharma, Paradharma and Samadarsana? The three principles which according to Indian philosophical tradition are the most important – but unfortunately the least-practiced – for a well-balanced life.

These thoughts seem to be nicely compressed into a single sentence by H.L. Mencken 👇 –honestly 🙏 I don’t know anything about him except for this quote of his — in his observations on monkey mind and democracy. Very interesting remark for freedom-lovers to brood over, isn’t it?

 

quote-democracy-is-the-art-and-science-of-running-the-circus-from-the-monkey-cage-h-l-mencken-19-67-93

ఇంతే సంగతులు. బై4నౌ. 🙏

(Photo courtesy : Deccan Herald & AZ Quotes)

 

“కిత్తాత్తమి అంటే కిత్తుది బత్తుడే”నా? or Is it about EXPERIENCING Lord Krishna? మరియు YVR salutes 🇮🇳…


కిత్తాత్తమి పోస్టు తరవాత, అది చదివేముందు – 🌹🌹🌹భారతమాతకి, భారతీయులకి, బ్లాగ్మిత్రులకి, నా బ్లాగ్ చదువుతున్న అందరికీ హృదయపూర్వక స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలతో🌹🌹🌹 –

 

“కిత్తాత్తమి అంటే కిత్తుది బత్తుడే”నా? కృష్ణ పరమాత్మని ఫీల్ అవ్వడమా? అంటే ఏమో తెలీదు. కానీ కృష్ణుడి విశ్వరూపాన్ని శ్రీఅరవిందుడి మాటలు, డాక్టర్ రాధాకృష్ణన్ వివరణ, విశ్వరూప సందర్శనయోగంలో ఘంటసాల స్వరం ఆవిష్కరించినప్పుడు అంతరాంతరాల్లో భాషకి, అర్ధానికి అందని భావాలు కలిగి అం’తరంగాలు’ కదులుతాయి. అలలు అలలుగా ఆలోచనలు సాగి సాగి క్షీరసాగర తీరాలని తాకుతాయి. అలాంటి అం’తరంగ’ ప్రవాహమే ఇది. ఇక్కడ కోట్ చేసిన ఐన్-స్టీన్ మాటలు చదివినరోజున మొదలై ఆదిశంకరుడిని స్పృశిస్తూ అలా అలా ఎన్నోరోజులు సాగిన ఈ ఫ్లో-ఆఫ్-థాట్స్  ఇవాళ పోస్ట్ చెయ్యడానికి సిద్ధం అయ్యాయంటే కృష్ణాష్టమి రూపంలోవున్న పాలసముద్రపు తీరాన్ని చేరడానికా? ఏమో, ఆ నీలమేఘశ్యాముడికే తెలియాలి. 

అద్వైతానికి ఆదిశంకరుడెలాగో, భౌతికశాస్త్రానికి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అలాంటివాడని ఒక్కోసారి అనిపిస్తుంది. ఆయన పలుకులు కొన్ని ఎంత అద్భుతంగా / ఆశ్చర్యకరంగా వుంటాయంటే ఆదిశంకరుడికి సరదాగా ఫిజిక్స్‌లో పరిశోధనలు చేద్దామనిపించి ఈ జ్యూయిష్-జర్మన్‌ సైంటిస్టులోకి పరకాయప్రవేశం చేశాడేమో అనిపించేంత. ఆయనకది అలవాటైన పనే కదా! ఈ ఉపోద్ఘాతానికి, ఈ పోస్టుకి మూలమైన ఐన్‌స్టీన్ మాటలు, తన ప్రాణస్నేహితుడు, శాస్త్రవేత్త అయిన బెసో పోయినప్పుడు ఆయన అన్నవి, ఇవీ – “Now he has again preceded me a little in parting from this strange world. (But) this has no importance. For people like us who believe in physics, the separation between past, present and future has only the importance of an admittedly tenacious illusion.” (నా స్నేహితుడు అన్ని విషయాల్లో మాదిరిగానే మరణంలో కూడా నాకంటే ఒకడుగు ముందున్నాడు. కానీ అదో పెద్ద విషయం కాదు. ఎందుకంటే, సైన్సును విశ్వసించే మాలాంటి వారికి భూత, భవిష్యత్, వర్తమానాల మధ్య వుండే వేర్పాటు ఒక భ్రాంతి / భ్రమ/ ఆభాస / మాయ తప్ప మరేం కాదు). చరాచర ప్రపంచానికి అవతల, వేరే ఏదో తలంలో, కాలాతీతుడై, అద్వైతస్థితిలో వున్న ఋషి చెప్పిన మాటల్లా లేవూ ఈ మాటలు? అందుకేనేమో కాలానికి ఐన్‌స్టీన్ ఇచ్చిన నిర్వచనం అంత విశేషంగానూ వుంటుంది. రెండు వస్తువుల మధ్యనున్న ఖాళీని దూరం అని ఎలాగైతే అంటామో, రెండు ఘటనల మధ్య వుండే gap‌నే టైము అన్నాడు. సృష్టిలో ఏ వస్తువుని తీసుకున్నా దాని స్థితిలో నిరంతరం మార్పు కలుగుతూ వుంటుంది. కంటికి తెలియని అతిసూక్ష్మమైన స్థాయిలో కలిగే ఈ స్థితిమార్పునే మనం సెకండ్లు, నిమిషాలు, గంటలు,…. శతాబ్దాలు, కాంతిసంవత్సరాలుగా కొలుస్తాం. జీవుల దగ్గరకొచ్చేసరికి స్థితిమార్పు బాల్య, యౌవన, వృద్ధాప్యాలుగా అనుభవంలోకి వస్తుంది. నిర్జీవపదార్ధాలతో శరీరం ఏర్పరుచుకున్న జీవశక్తి జననం నుంచి మరణం వరకూ ప్రవహించటమే జీవితం కాదూ. అంటే, పుట్టుక నుంచీ పోయేవరకూ శారీరకస్థితిలో కలిగే మార్పుల పరంపర – అంటే అది కాలప్రవాహమే కదూ?

“కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధో, లోకాన్ సమాహర్తుమి హ ప్రవృత్తః |ఋతేపిత్వా నభవిష్యంతి సర్వే, ఏవస్థితాః ప్రత్యనీకేషుయోధా||” – అని కృష్ణుడు సాధికారంగా చెప్పాడంటే అందులో ఆశ్చర్యం ఏముంది? అలా అనగల కెపాసిటీ, ఆ సుప్రీం ఎవేర్‌నెస్ వున్నవాడు కనకే ఆయన కృష్ణ పరమాత్మ అయ్యాడు. కానీ మామూలు మనిషి అదే భావాన్ని పొంది, తనవైన అలతిపదాలలో వ్యక్తీకరించినప్పుడు; అది ఇతర మామూలు మనుషులనీ స్పందింప చేసినప్పుడు – ఓహ్! కృష్ణపరమాత్మకి తన గీతాగానమే ప్రతిధ్వనించినట్టు ఉంటుందేమో? మళ్ళీ ఏమో అనే ప్రశ్నార్ధకం ఎందుకు?

నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరుబాహవే… అనిపించుకున్నవాడు తన గానపు ప్రతిధ్వని ఎందుకు వినలేడు? ఆయనే విశ్వం విష్ణుః కూడా. అందువల్ల తనే తన సృష్టిలోనే మరో రూపంలో నిలిచి పాడుతున్న విశ్వగీతిగా వింటాడు. ఇక్కడింకో విషయం స్ఫురిస్తోంది. విశ్వం విష్ణుః అన్న రెండు పదాల్లో విశ్వం అంటే భౌతిక ప్రపంచం , విష్ణువు ఆధ్యాత్మిక వాస్తవం. ఈ ప్రపంచంలో వుంటూ దైవాన్ని వెతుక్కునే మార్గాల్లో ఫిజిక్స్ (సైన్సు) కూడా ఒకటి అని మనం నమ్మగలిగితే పైన చెప్పిన కోట్‌లో For people like us who believe in physics… అంటూ విశ్వాన్ని tenacious illusion అంటూ విష్ణుశక్తిని రెండిటినీ స్ఫురణకి తెప్పించినట్టు వుంది కదూ?

What Adi Sankaracharya is for Adwaitha Vedanta (Non-Dualist philosophy), Einstein is for Physics. Thats what I feel, whenever I come across some of his observations, with whatever limited knowledge I have of both areas of human exploration. In fact, it is easy to imagine that AdiSankara transmigrated into this German-Jewish Scientist’s body just to explore the field of Physics. And transmigration is something he resorted to, at least once in his illustrious career of propagating Adwaitha philosphy, to understand the intricacies of family life which he never experienced, having renounced it even before entering it. Let me now come to the words that Einstein uttered, which led to my writing  of this post. Writing to the family of his close friend and fellow scientist, Michele Besso, just after Besso’s death, Einstein says -“Now he has again preceded me a little in parting from this strange world. (But) this has no importance. For people like us who believe in physics, the separation between past, present and future has only the importance of an admittedly tenacious illusion.” To someone familiar with India’s Adwaitha vedanta, such words can only come from a great soul capable of transcending the limitations of time and space. And the reference to the word ‘illusion’ points to Adwaitha philosophy whose central theme is maya i.e illusion. By breaking barriers separating the past, present and future, Einstein – knowingly or unknowingly- positioned himself, rather, his observing mind outside the boundaries of Time. That, probably, is the reason why he sounds like a transcendent soul. In physics Distance is defined as the space between two objects. And Einstein sees time as the space between two events. Based on Einstein’s definition Time is nothing but a measure of change. There is no separate entity or force called Time other than the infinite and irreversible process of Change. Now, any object or thing in the universe is subject to change, a change in its state. Change of state, however infinitesimal it may be, is a perennial process taking place at all levels and phases of existence, whether it is at an atomic scale or at a galactic one. This change is what we call time and measure it in nano-seconds, minutes, hours, light-years, etc. Applying this understanding to life we can see that three stages of life, namely Childhood, Youth and Senility are but the three milestones marking the changes of state of a living being. Thus life becomes a flow of time between birth and death implying that it is a series of changes that a body goes through between birth and death.
If Lord Krishna said –
kalo ‘smi loka-ksaya-krt pravrddho
lokan samahartum iha pravrttah
rte ‘pi tvam na bhavisyanti sarve
ye ‘vasthitah pratyanikesu yodhah
 
(Time am I, world-destroying, grown mature, engaged here in subduing the world. Even without thee (and thy action), all the warriors standing arrayed in the opposing armies shall cease to be) –he said that with the authority and supreme awareness of a personified Universal Soul which also is the source and destination of all that is part of the creation.
Now what would the Lord feel when an ordinary person feels and utters words similar to His own, making other ordinary beings feel the same?
I think the blessed Lord hears the echoes of His own Song Celestial from a corner of His Universe. 
Well, why not? After all He is praised by sages as one with infinite forms, eyes, heads, hands and feet. According to Vishnu Sahasranama, Viswam (the world) is Vishnu meaning Vishnu pervades the Universe that He created i.e. He creates the Universe out of Himself. Hence it is no wonder that the Lord hears His own divine song being sung by one of His manifestations. This brings to my mind another point that Einstein might have conveyed (most probably without the knowledge that he is echoing Vishnu Sahasranama) through the words – For people like us who believe in physics… and tenacious illusion. Viswam, the world, is the physical manifestation of Vishnu, the Ultimate Spiritual Reality. Einstein sounds like he is referring to both aspects by referring to Physics and Illusion. Physics was his preferred path to attain (or understand?) the Ultimate. Illusion is the power of Vishnu that is at the root of the created Universe.

ఇవి జస్ట్ ఫ్లో-ఆఫ్-థాట్స్. అంతే. అక్షరాల్లోకి సరిగా తర్జుమా అయ్యయో లేదో, అందులోనూ ఇంగ్లీష్ పాండిత్యం కూడా వెలగబెట్టాను. చదువరికిది ఫర్వాలేదనిపిస్తే ఆ సంతోషం కృష్ణార్పణం. అస్సలు బాలేదనిపిస్తే ఆ బాధ కూడా కృష్ణార్పణం. ఎందుకంటే పోస్ట్ వేసేయ్యమని తొందరపెట్టింది ఆయనే. టైటిల్ డిసైడ్ చేసింది కూడా ఆయనే అని రచయిత అనుమానం. ఇంతే సంగతులు. బై4నౌ. విష్యూ హాపీ కృష్ణాష్టమి!!!

🌷 🌿 🌾 🌹 🌹 🌾 🌿 🌷 

 

 

 

 

అవతారాలనేవి ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయే వన్-టైమ్ వండర్స్ …


ఇవాళ ధరిత్రీ దినోత్సవం. భూమిని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అందరూ గుర్తించాలని ఏర్పడిన శుభదినం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నేలతల్లికి శుభం కలగాలని సంకల్పించుకునే సుముహూర్తం. భగవంతుడు ఆదివరాహావతారం ఎత్తడానికి సంకల్పించుకున్న శుభఘడియ అనుకోవచ్చు, అనుకోవాలి కూడా.

అవతారాలనేవి ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయే వన్-టైమ్ వండర్స్ కాదు. అవి వచ్చినప్పుడే మాస్టర్ ప్లాన్‌తో వస్తాయి. వచ్చినప్పుడు జనహృదయాల్లో అవి కలిగించిన స్ఫూర్తి, వెలిగించిన జ్ఞానదీప్తి అవసరమైనప్పుడల్లా మళ్ళీ మళ్ళీ, సంభవామి యుగే యుగే – అంటూ ఆ అవతారలక్ష్యాన్ని సాధిస్తూవుంటుంది.

హిరణ్యకశిపుడు ఏ వస్తువులో విష్ణువుని చూపించమని ప్రహ్లాదుడిని అడుగుతాడోనని నరసింహావతారం భూమ్మీద వున్న చరాచరాలన్నిట్లో నిండిపోయి, వేచి వుందిట. ఇప్పుడు పుడమిని కొత్తకొత్త రూపాల్లో కబళిస్తున్న హిరణ్యాక్షుల నుంచి రక్షించేందుకు ఆదివరాహమూర్తి మన తలపుల్లో, చేతల్లో ప్రవేశించే పవిత్రదినం ధరిత్రీదినం.

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని నిర్లక్ష్యం చేసి సొంత వాహనాలని అతిగా ప్రోత్సహిస్తున్న మన “ప్రో-బిజినెస్” విధానాలు, అక్రమ ఇసుక తవ్వకాలు, అడ్డూఆపూలేని గనుల లైసెన్సింగ్ & తవ్వకాలు, ఎర్రచందనం మాఫియా, పర్యావరణ సమతూకాన్ని దెబ్బతీసేలా జరుగుతున్నఅడవుల ఆక్రమణ, నదులు, సముద్రాలలో కాలుష్యాన్ని, మురుగునీ వదిలిపెట్టడం, ఇంకా ఎన్నెన్నో  – ఇవన్నీ హిరణ్యాక్షుడి బాహ్యరూపాలు – స్థూల శరీరాలు.

ఆర్ధికాభివృద్ధి పేరుతో పెరిగిపోతున్న పదార్ధవాదం, హాయిగా బతకడానికి నిజంగా అవసరంలేని వస్తువులు, సంపదల పట్ల ఆరాటంతో మనిషిలో గూడు కట్టుకుంటున్న అసంతృప్తి, స్వార్ధం తప్ప అర్ధం కనిపించని రాజకీయాలవల్ల నానాటికీ పెరిగిపోయే అనవసర అవసరాలు – ఇవన్నీ హిరణ్యాక్షుడి అదృశ్యరూపాలు – సూక్ష్మశరీరాలు.   

ఆనందానికి ఆర్భాటానికి తేడా తెలియకపోవడం; ఆత్మకి అహంకారానికి బేధం గ్రహించలేకపోవడం; సత్యం,ధర్మం – వీటి నిజస్వరూపం తెలుసుకోకుండా ఎవరికిష్టమైనట్టు వాళ్ళు వాటిని నిర్వచించేసి కన్‌ఫ్యూజన్ సృష్టించడం – ఇవన్నీ హిరణ్యాక్షుడి కారణ శరీరాలు.

భూమాతకి హిరణ్యాక్షుడి పీడ పూర్తిగా వదలాలంటే వాడి మూడు శరీరాలూ నశించాలి. అది సాధించేందుకు వచ్చేదే ఆదివరాహావతారం. అందుకు భూమిని ఎవరో మళ్ళీ చాపలా చుట్టేసేవరకూ వేచివుండక్కర్లేదు, చుట్టడం మొదలైంది ఆల్రెడీ. ప్రభుత్వాలూ, వ్యాపారవేత్తల తీరు మారేలా మన ఆలోచనలూ, అవసరాలూ మార్చుకుని, తరువాత తరాలకీ ఆ విలువలు అందిస్తే ధరణీధరుని అవతార కార్యక్రమం వూపందుకుంటుంది. అది ఇవాళే జరగొచ్చు. జరగాలి. జరుగుతోంది.

ఎక్కడో, ఎందరి మనసుల్లోనో, ఎందరెందరి సంకల్పాల్లోనో, ఎన్నెన్ని విధాలైన కార్యక్రమాల్లోనో. అయినా చాలదు. ఇంకా ఇంకా కావాలి.

ధరణీ సహితుడైన వరాహమూర్తి ఆరాధనని గుడిలో, స్తోత్రాలతోనే సరిపెట్టడం సరికాదు –

మొక్కలు నాటి, అడవుల కొట్టివేతపై ఆధారపడడం తగ్గించుకుని – నైవేద్యం పెట్టాలి

సరస్సులు, నదులు, సముద్రాల్ని శుభ్రంచేసి, శుభ్రంగా వుంచి – అర్ఘ్యపాద్యాలివ్వాలి.

అవసరంలేని ఆర్భాటాలు బాగా తగ్గించుకుని – హారతివ్వాలి.

ముఖ్యంగా మన కన్జ్యూమరిస్ట్ లైఫ్ స్టైల్ మార్చుకుని – సాష్టాంగపడాలి.

– ఇలా కూడా పూజించవచ్చు. కాదు ఇలాకూడా పూజించాలి. కాదు కాదు ఇలాగే పూజించాలి. అప్పుడే భూదేవిపై భూజాని ప్రేమకి విలువ ఇచ్చినట్టు కదా? ఎంత ప్రేమ లేకపోతే ఆవిణ్ణి రక్షించుకోడానికి పందిరూపమైనా ధరించడానికి సిద్ధపడతాడు?

అంతేకాదు, తిరుపతి వెళ్ళినప్పుడు ముందుగా ఆదివరాహమూర్తి ఆలయానికి ఎందుకు వెళ్ళాలో తెలుసుకోవాలి. అదేంటంటే  –

మన ఆపదలు పోగొట్టి, కోరికలు తీర్చమని దేవదేవుణ్ణి ప్రార్ధించేముందు భూమాత క్షేమాన్ని కోరుకుని అందుకు మేమూ పాటుపడతామని సంకల్పించుకునేందుకు, నేలతల్లి ఆరోగ్యం కోసం ఆ దేవుణ్ణి మొక్కుకునేందుకు.

🌿 🌾 🌏 🌊 🌄

సముద్రవసనే దేవీ పర్వతస్తనమండితే|విష్ణుపత్నీనమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే||

🌊 🌄 🌏  🌿 🌾 

🙏

మిషన్ భస్మాసుర + ఆరోగ్యశ్రీలాగా మృత్యుంజయశ్రీ + మృత్యువుపై గెలిచే వరకూ ….


thappadu!

(2)

మృత్యువుపై గెలిచే వరకూ వేదాంతం వినక తప్పదు

అప్పుడెప్పుడో యుగాల క్రితం ఉండిన హిరణ్యకశిపుడి నుంచి ఇప్పటి హోమోసేపియనుడి వరకూ మృత్యువు అంతు తేల్చుకున్న వాడొక్కడూ లేకపోయాడు.  ఐ మీన్ ఇప్పటివరకూ.(ఎందుకంటే I trust science as much as I trust God.) హిరణ్యకశిపుడు పాపం సృష్టికర్తని ప్రత్యక్షం చేసుకుని, ఎన్ని రకాల మెలికలు పెడితే చావుని మోసం చెయ్యొచ్చో అన్ని రకాల మెలికలతో వరాలు పొంది కూడా మరణమాఫీ పొందలేకపోయాడు. తమ్ముడు హిరణ్యాక్షుడు వరాహమూర్తి చేతుల్లో  అంతం అవడంతో దుఃఖ్ఖిస్తున్న తల్లి దితికి జననమరణాల అనివార్యత గురించి హిరణ్యకశిపుడు చెప్పిన సుద్దులు వింటే (చాగంటివారి ప్రవచనంలో విన్నాను) అసలు  భగవద్గీత చెబుతూ కృష్ణ పరమాత్మ కాపీరైట్ వయోలేషన్స్ ఏమైనా చేశాడా అనిపిస్తుంది. “ఎప్పుడో సృష్ట్యాదిలో నేను వివస్వంతుడికి, ఆయన మనువుకి, మనువు ఇక్ష్వాకువుకి చెప్పినదే ఈ గీత,” అని భగవానుడు అన్నాడని తెలుసు కనక సరిపోయింది లేకపోతే బలిచక్రవర్తిని, మహిషాసురుడినీ, రావణబ్రహ్మనీ అణగారినవాళ్ళనీ, అమాయకులనీ అనుకునే “మేధా😇వులు ” కృష్ణుడి మీద కేసు పెట్టేవాళ్ళేమో! టాపిక్ వదిలి మనకక్కర్లేని విషయాల్లోకి వెళ్ళడం ఇప్పుడవసరమా? కాదుగదా! లెటజ్ గో బాక్ టు ద టాపిక్.

మృత్యువు అంతు తేల్చుకున్న వాడొక్కడూ లేడు అనగానే మార్కండేయుడు, ఆంజనేయుడు గుర్తొచ్చి వాళ్ళిద్దరూ ఉన్నారు కదా అనిపించచ్చు. వాళ్ళు తేల్చుకోలేదు. వరాల ద్వారా చిరంజీవత్వాన్ని పొందారు. మార్కండేయుడి మూలంగా శివుడే మృత్యువు అంతు తేల్చేస్తే దేవతలందరూ ప్రార్ధించి మృత్యువుని “బతికించు”కోవాల్సి వచ్చింది. చావుని బతికించడం ఏమిటో? అవును తప్పదు మరి, అది లేకపోతే దేవుళ్ళకి భయపడేదెవరు? మానవలోకమైనా, దేవలోకమైనా ఒకటే రూలనుకుంటా! పక్కవాడి అవసరాల్నీ, బలహీనతల్నీ ఆసరా చేసుకుని బిజినెస్ చెయ్యడం. దేవతలంతా కలిసి మృత్యుదేవతని తిరిగి బతికింపజేసి భూలోకంలో ఎంతటి ఎకనామిక్ డెవలప్‌మెంట్‌కి పునాదులు వేశారో మెడికల్ ఇండస్ట్రీని చూస్తే చాలు. అది చూసి, గుండెలవిసిపోయి, శ్రీహరి కటాక్షం కన్నా శ్రీమతిహరి దాక్షిణ్యం ముఖ్యమనీ, అది లేకుండా వైద్యుడి దగ్గరికెళ్తే నారాయణుడడ్డు పడినా హరీమనక తప్పదని శ్రీమతిహరిని ప్రత్యక్షం చేసుకునే కంగారులో, ఆ పరుగుల్లో –

ఆల్రెడీ ఉన్న కోరికల్ని, తీర్చుకునే ఛాన్సున్న కోరికల్ని అనుభవించడానిగ్గూడా తీరికుంటే ఓపికలేక, ఓపికుంటే తీరిక లేక కొట్టుకుంటున్న మెటీరియలిస్టిక్ నరుడికి నచికేతుడిలాగా యముడి పీక మీద కూచుని జననమరణచక్రాల అంతు తేల్చుకునేంత కోరిక తీరిక ఓపిక ఎక్కడుంటాయ్?

ఒకవేళ వున్నా –

శ్రీఅరోబిందోలాగా, “Life only is, or death is life disguised, — Life a short death until by life we are surprised,” అనగలిగేంతగా సత్యాన్ని శోధించే శక్తీ బుద్ధి తీవ్రతా ఎందరికుంటాయ్?

అందుకే  – జిందగీ కా సఫర్, హై యె కైసా సఫర్, కోయి సంఝా నహీ కోయి జానా నహీ||హై యె కైసీ డగర్? చల్తే హై సబ్ మగర్, కోయి సంఝా నహీ కోయి జానా నహీ|| — అని సరిపెట్టుకోవడం, కొంచెం పొయెటిక్ మైండ్ ఐతే ఇంకొంచెం ముందుకెళ్ళి — జిందగీ కో బహుత్ ప్యార్ హమ్ నే దియా, మౌత్ కే భీ మొహబ్బత్ నిభాయేంగె హమ్|| రోతె రోతే జమానే మే ఆయే మగర్, హస్తెహస్తే జమానే సే జాయేంగే హమ్|| జాయేంగే పర్ కిధర్? హై కిసే యే ఖబర్?|| కోయి సంఝా నహీ కోయి జానా నహీ|| — అంటూ రాబోయే దారీదరీ తెలీని ప్రయాణానికి ధైర్యం చెయ్యడం తప్ప సాదామనిషి ఏం చెయ్యగలడు?

కానీ చెయ్యగలడు. సామాన్యుడుగా సాదాసీదాగా ఉండగలవాడు, ఎస్పెషల్లీ మన ఇండియనుడు, అలా ఎలా ఉండగలడంటే వాడికి ఫిలాసఫీ అనేది ఒక కన్‌జెనిటల్ డిఫెక్ట్ లాంటిది లేకపోతె కన్‌జాయిన్డ్ ట్విన్ లాంటిది. లేకపోతే జగమే మాయ, బ్రతుకే మాయ అంటూ వేదాంతాన్ని సినిమాపాటల్లోకి దింపేసి చప్పట్లు, వన్స్ మోర్‌లు ఎలా కొట్టిస్తాడు?

పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్టనడిమి పని నాటకము అన్జెప్పేహేసి హాయిగా సినిమా ఐపోయాక హాలు బయటికి నడిచినంత ఈజీగా లైఫులోంచి నిజంలోకి వెళ్ళిపోడానికి ఎలా ప్రిపేర్ అవ్వగలడు?

సైన్స్ ద్వారా మనిషి ఏదోనాటికి మృత్యువుని తప్పించుకునే మార్గం కనిపెట్టినా దానికి ఎంత ధర చెల్లించాలంటారో ఆ రీసెర్చ్ చేయించిన దళారీలు.

ఒకవేళ ఏ ఆరోగ్యశ్రీలాగా మృత్యుంజయశ్రీ పధకం పెట్టి మన రాజకీయ నాయకులు సామాన్యులందరికీ అందుబాటులోకి తెచ్చేసినా ఆ సామాన్యుల్లోవున్న అసామాన్యులు (అవినీతిపరులు, అరాజకీయశక్తులు, ఆతంకవాదులు, అత్యాచార పరాయణులు, హత్యాశాపరులు…) కూడా మృత్యువుని జయించేసి కూచుంటారే, రాహుకేతువుల్లా? అప్పుడెలా?(ఇప్పటికే జైళ్ళల్లో అతిధి మర్యాదలు, బెయిళ్ళలో అధికారపగ్గాలు ఎంజాయ్ చేస్తున్న  రాహుకేతుజనాభా కన్సిడరబుల్‌గా వుందని కదా గొడవ)

ఒకసారెప్పుడో ఒక మహిమాన్వితవ్యక్తిని, “దేశంలో నీళ్ళచెరువుల్ని పెట్రోల్ చెరువులుగా మార్చెయ్యొచ్చుగదా? దేశానికి దరిద్రం తీరుతుంద,”ని ఎవరో అడిగారట. “నేను మార్చగలను కానీ నీలాంటి కోతి ఎవడో వాటిల్లో అగ్గిపుల్ల గీసిపడేస్తే ఎలా? ముందు మనిషి కోతివేషాలు తగ్గిచుకుంటే అప్పుడు చూద్దాం,” అని ఆయన జవాబు(ట). మహత్యాల సంగతెలా వున్నా మనిషి వేస్తున్న కోతివేషాలు నిజమే కదా. అందుకే మనిషి తన పూర్వాశ్రమాన్ని పూర్తిగా మర్చిపోయేలోపు, అదే వానరత్వాన్ని ఇప్పటికీ వదలక వేలాడుతున్న వాలం వూడి పోయేలోపు, మనిషికి మృత్యుంజయత్వం దక్కిందో వేదాంతం మర్చిపోయి వేదాన్ని అంతం చేసే మిషన్ భస్మాసుర మొదలెడతాడు.

ఈ కారణాలన్నీ దృష్టిలో పెట్టుకునేనేమో దేవతలంతా మృత్యుదేవతని పునర్జీవింపజేశారు. ఆ దేవతని తప్పించుకునే సమయం వచ్చేవరకూ, అంటే మార్కండేయుడిలాగా లేకపోతె హనుమంతుడిలాగా చిరంజీవత్వానికి అర్హత సంపాయించుకునే వరకూ వేదాంతం భట్టీయం వేసి ఒంట బట్టించుకోమని వాళ్ళ ఉద్దేశం. నచికేతుడి కధలో, ఆదిశంకర బోధల్లో, అరవిందాశ్రమంలో అమృతత్వాన్ని ఆస్వాదించమని వాళ్ళ సందేశం. అలా నిజంగా ఆస్వాదిస్తే మరణాన్ని ఆపే మందులతోటీ, మృత్యుంజయ ఆరోగ్యశ్రీలతోటీ పనే వుండదు.  అంతవరకూ వేదాంతం వినక తప్పదు.

 

 (1)

మనసు మరణించే వరకూ ప్రశాంతికై ప్రయాస తప్పదు.

అవును తప్పదు, లేపోతే మన’సుకవి’ “మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే..ఏ..ఏ.. ఏ ..,” అనెందుకు విలాపిస్తాడు? ఆ మాటని ఊరుకోలేదు, మనసుని మనిషికి దేవుడు విధించిన శిక్షగా, జీవుడిపై దేవుడు తీర్చుకున్న కక్షగా తేల్చి చెప్పాడు.

I think, therefore I am (నేను ఆలోచిస్తున్నాను, కనక నేను ఉన్నాను) అని రినీ దెకార్త్ తన ఉనికి నిజమేనని కన్‌ఫర్మ్ చేసుకున్నట్టు, మనసు పని చేసేవాళ్ళు – I suffer, therefore I have మనసు అనుకోవచ్చేమో  🤔😂 . (అలా అనుకుంటే నాకు బోల్డంత మనసున్నట్టే – చాలా మందికిలాగే. అది వేరే విషయం.)

హాయిగా జాలీగా బతకాలంటే మనసు లేకుండా ఎలా? మళ్ళీ అదే టైములో మనసు పనిచేస్తే – ఊరికే పన్జెయ్యడం కాదు స్పందిస్తే – బతకడం కష్టం. ఏంటో గోల? ఒక్క వాణిశ్రీని మిస్సయిపోతున్నందుకే ప్రేమనగర్ నాగేశ్వర్రావ్ అంత పెద్ద పాట ఆత్రేయగారితో రాయించుకుని ఘంటసాల గొంతు అప్పు తీసుకుని పాడి మరీ విషం తాగేసాడే అలాంటిది –

కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానిది, ప్రపంచం బాధ శ్రీశ్రీది అనిపించుకుని పతితుల, భ్రష్టుల, బాధాసర్పదష్టుల కోసం పరితపించిన శ్రీశ్రీ గారి మనసు ఎంత సఫర్ ఐతే ఆ మనసులోని భావాలు కలంలోంచి ప్రవహించి జగన్నాధ రధచక్రాల్ని కదిలించాయో  !?!🤔 ఐనా ఏం లాభం? ఈ భూమ్మీద ఎంతమంది శ్రీశ్రీలు ఎన్ని ప్రాంతాల్లో ఆవిర్భవించి పీడితజనం కోసం ఎంత పరితపించలేదు, వాళ్ళందరి ప్రయాసల ఫలితం మనిషికి ఏ మాత్రం దక్కింది. కారే రాజులు, రాజ్యముల్ గలుగవే… అన్నట్టే కారే కవీశ్వరుల్, కదిలించరే హృదయముల్? వారేరీ? వారి కవిత్వ తత్వ ప్రభావముల్ నేడేవీ? అనుకోవాల్సిన రీతిగానే ప్రపంచం మిగిలిందేం? జగన్నాధరధం ఉన్నచోటే ఆగిందేం? కారణం మనసే కదూ? వ్యక్తుల హృదయాల్లో అశాంతిగా, అసంతృప్తిగా, అందని ద్రాక్షపళ్లు పులుపు అనుకోలేని అశక్తతగా, తలకి మించిన భారం తలకెత్తుకునే అత్యాశగా  మెదులుతున్న మనసే కదూ? అదే కదూ వ్యష్టి నుంచి సమిష్టికి పాకి సమాజాన్ని అభద్రతాభావంలోకి, అనైక్యతలోకి నెడుతూ వ్యక్తికి వ్యక్తికి అంతరాన్ని పెంచుతూ అంటరానితనాన్ని పెంపొందించుతూ వున్నది? అదే అయితే మనసు పెట్టే పరుగులు ఆగాల్సిందే. దాని చాంచల్యం మరణించి, మనసు బుద్ధిలో, విచక్షణాజ్ఞానంలో, అంతరాత్మలో లీనం అవ్వాల్సిందే. అప్పుడే మనిషికి ప్రశాంతి. అలాంటి ప్రశాంతిని పొంది, మనీషిగా మారిన మనిషి ఒకరు ప్రశాంతిని పొందటం ఎలా అని అడిగిన వ్యక్తితో ఇలా అన్నారు –

మీరెప్పుడూ  I want Peace, I want Peace అని దేవులాడుతూవుంటారెందుకు? I (అహంకారం), want (కోరిక) లేనప్పుడు మిగిలేది Peace (ప్రశాంతి) కాదా?

So, మనసు = I (అహంకారం) + want (కోరిక)

ఆ మనసు అంతరించినప్పుడే ప్రశాంతి. భౌతికమరణంతో కాకుండా మనసుకి మోక్షం ఇచ్చి, బుద్ధిని అంతరాత్మని పని చెయ్యనిస్తే ప్రశాంతిని ఎంజాయ్ చెయ్యొచ్చు, ఇతరుల్నీ ప్రశాంతంగా బతకనివ్వచ్చు, మన అశాంతి వాళ్లకి ట్రాన్స్‌ఫర్ చెయ్యకపోవడం ద్వారా. ఎవరి ప్రశాంతిని వారే శోధించుకోవాలి, సాధించుకోవాలి.

🙏🙏🙏