సైకిలేసుకుని🚲 చాయ్ కొట్టుకెళ్ళి గాజుగ్లాసు🥛లో లోటస్🌸 బ్రాండ్ చాయ్ పోసుకుని ఫాన్🔆 కింద కూచుని టీ తాగాలని సామాన్యుడి కల. మూడువారాల క్రితం, పొద్దున్నే ఆఫీసుకి పోతుంటే అనుకోకుండా ఆ 👆 లైను మనసులో అవతరించింది. తెల్లార్లూ వింటున్న పొలిటికల్ డిబేట్ల, మేధావుల విశ్లేషణల ఎఫెక్ట్ అయ్యుంటుంది. చదవడానికి బానేవుంది కదా అనిపించి – “ఎవరైనా ఈ పొలిటికల్ పొడుపు కధని విప్పండర్రా,” అంటూ మా వాట్సప్ గ్రూపులో పెట్టా. ఆఫీసులో, సీట్లో హాయిగా కూచుని కాఫీ☕️Continue reading “సైకిలేసుకుని🚲 చాయ్ కొట్టుకెళ్ళి గాజుగ్లాసు🥛లో లోటస్🌸 బ్రాండ్ చాయ్ పోసుకుని ఫాన్🔆 కింద కూచుని టీ తాగాలని ….”
Category Archives: వాట్సాప్ప్ ముచ్చట్లు
వేదాంత🤚☝️ఆఫ్ దోస(ఆవ)కాయ😋
ఇవాళ, ఆదివారం చాలా లేటుగా మెలుకువొచ్చింది. ఎంత లేటంటే అది లంచ్ టైముకి తక్కువ, బ్రేక్ ఫాస్ట్ కి ఎక్కువా. అసలే చిరాగ్గా వుంది. టిఫిన్ ఏంటా అని చూస్తే అస్సలిష్టంలేని అటుకుల ఉప్మా !! తప్పక తిని, ఆ తిన్న పాపాన్ని నాలిక మీంచి కడిగేసుకుందామని మంచి కాఫీ ఒకటి కలుపుకుని దాన్ని పుచ్చుకుంటూ (పవిత్రమైన ద్రవాలని తాగకూడదు, పుచ్చుకోవాలని పెద్దలు చెప్పిన మాట!) వాట్సప్ ఓపెన్ చేశాను. ముందు అన్నీ రొటీన్ ఫార్వార్డెడ్ మెసేజులు,Continue reading “వేదాంత🤚☝️ఆఫ్ దోస(ఆవ)కాయ😋”
నల్లటి తారు రోడ్డు. రెండు పక్కలా అశోకుడు నాటించిన చెట్లు. రోడ్డు మధ్యలో….
నా ఫేవరిట్ ఇంగ్లీషు నవల ఒకటుంది. అది, ‘ది ఫోర్త్ ప్రోటోకాల్’ అని ఫ్రెడరిక్ ఫోర్సిత్ రాసినది. అది మొదలవ్వడం ఒక దొంగతనంతో మొదలౌతుంది. బ్రిటిష్ గవర్నమెంట్లో సెక్రెటరీ లెవెల్లో పంజేస్తున్న ఒక ఘరానా పెద్దమనిషి ఇంట్లో వజ్రాలు దొంగిలిస్తూ వాటితోపాటు పొరపాటున కొన్ని రహస్య పత్రాలు కూడా తీసుకొచ్చేస్తాడు . తీసుకొచ్చినవాడు వాటిని ఎక్కడో పారెయ్యక తీరిగ్గా కూచుని క్షుణ్ణంగా చదువుతాడు. సదరు సెగెట్రీగారు దేశరక్షణ రహస్యాలన్నీ అమ్మేస్తున్నాడని అర్ధం చేసుకుంటాడు. ఇక్కడి వరకూ వచ్చాకContinue reading “నల్లటి తారు రోడ్డు. రెండు పక్కలా అశోకుడు నాటించిన చెట్లు. రోడ్డు మధ్యలో….”
వాట్సప్ ముచ్చట్లు 5: ME=M(y)E(go)
(Photo Courtesy : Google) మొన్న మా వాట్సప్ గ్రూప్లో ఓ ఇంటరెస్టింగ్ డిస్కషన్ జరిగింది. సందర్భం ఏంటంటే గ్రూప్లో ఒకళ్ళ వివాహ రజతోత్సవం. క్లాసుమేట్కి ఒక్కొక్కరూ ఎవరి శైలిలో వారు అభినందనలు గుప్పిస్తున్నారు. ఒకతను – జిడ్డు కృష్ణమూర్తిగారి స్కూల్లో చదవు వల్ల అలవడిన మంచి కవితాత్మకత + సామాజిక స్పృహ + కరుణార్ద్ర హృదయం తన పోస్టుల్లో మామూలుగానే నింపుతూ ఉంటాడు – తన అభినందన సందేశాన్ని కూడా అలాగే మలిచాడు. అందులో మొదటివాక్యంContinue reading “వాట్సప్ ముచ్చట్లు 5: ME=M(y)E(go)”
Whatsapp ముచ్చట్లు(4) – రాతలన్నీ అమందానంద “కంద”ళిత హృద”యాటవెలదు”లైన వేళ…..
తొమ్మిదో క్లాసు నుంచీ డిగ్రీ ఫస్టియర్ వరకూ అదృష్టం బావుండి మంచి అధ్యాపకులు దొరికితే లాంగ్వేజి క్లాసుని మించిన ఆటవిడుపు ఇంకోటుండదు. ఫిజిక్స్, లెక్కలు, ఎకనామిక్స్, వగైరా ఐతే కూటి కోసం లేకపోతే కూలీ కోసం అదీకాకపోతే కట్నం కోసం చదివే కోటి సబ్జెక్ట్ల మధ్య పడి అప్పుడప్పుడే నలుగుతున్న కుర్ర బ్రెయిన్లకి తెలుగు, ఇంగ్లిష్ క్లాసులు మంచి రిలీఫ్. ఇప్పుడైతే తెలుగు పద్యాల గురించి రాయట్లేదులెండి. తెలుగు పద్యాలు వినీ, చదివీ అవి అర్ధమైతే ఆనందించడమే తప్పContinue reading “Whatsapp ముచ్చట్లు(4) – రాతలన్నీ అమందానంద “కంద”ళిత హృద”యాటవెలదు”లైన వేళ…..”
Whatsapp ముచ్చట్లు (3) – మానవుల Children’s Meet – దేవుళ్ళ Parent’s Meet
“దేవుణ్ణి నమ్మే తొంభైశాతం మంది జనుల కోసం…” అంటూ మా ఫ్రెండ్ ఒక పోస్టు పెట్టాడు. త్వరలోనే ఒక చిల్డ్రన్స్ మీటింగ్ కానీ, ఒక పేరెంట్స్ మీటింగ్ కానీ జరగబోతోంది, జరక్కపోయినా జరగాలని కోరుకుంటున్నాను అంటూ మొదలైంది మెసేజి. అందరూ ఆసక్తిగా ఓపెన్ చేసి చదివేశారు. స్మైలీలు 😊, లైకులు 👌, చప్పట్లు 👏, బుర్ర చుట్టూ తిరిగే చక్రంతో ఉన్న ఎమోజీలు 😇… ఇలా వివిధ ఎక్స్ప్రెషన్లు వెల్లువెత్తాయి. ఇంతకీ మెసేజి సారాంశం ఏంటంటే –Continue reading “Whatsapp ముచ్చట్లు (3) – మానవుల Children’s Meet – దేవుళ్ళ Parent’s Meet”
వాట్సాప్ప్ ముచ్చట్లు (2) – N.A.S.A🚀 కృష్ణ🙏 N.A.S.A 🚀కృష్ణ🙏||కృష్ణ🙏 కృష్ణ🙏 N.A.S.A 🚀N.A.S.A🚀
వాట్సాప్లో ఒక నమస్కారం + ఆనందభాష్పాల ఎమోజీతోపాటు “ప్లీజ్ ఫార్వర్డ్ టు యాజ్ మెనీ యాజ్ పాజిబుల్. లెట్ ఎవ్విరివన్ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్” అని వెనకాలే పదో, పన్నెండో🙏 లు తగిలించుకుని వచ్చిన ఆ మెసేజ్ వల్ల గ్రూపు మెంబర్లలో – కొందరికి ఆనందభాష్పాలు ఇన్నాళ్ళకి జనం “గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్” రియలైజ్ అవుతున్నారు కదా అని కొందరికి దుఃఖాశ్రువులు “మేం ఎన్నాళ్ళనుంచో నెత్తీ నోరు బాదుకుని మరీ ఇదే చెప్తుంటే ఇప్పటికా గుర్తించేది?,” అని నేను పెట్టాలనుకున్న మెసేజి ఇంకెవరోContinue reading “వాట్సాప్ప్ ముచ్చట్లు (2) – N.A.S.A🚀 కృష్ణ🙏 N.A.S.A 🚀కృష్ణ🙏||కృష్ణ🙏 కృష్ణ🙏 N.A.S.A 🚀N.A.S.A🚀”
WhatsApp ముచ్చట్లు 001>> 👩అయ్యంగార్ టు అత్తగార్ 👩🎓 ఆవకాయ టు ఆటంబాంబ్స్👩 (అనే) అమ్మ-ఆవకాయ-ఒక తమిళమ్మాయి కధ
వాట్సాప్ అనగానే ఎవరో ఫార్వార్డ్ చేసిన నీతివాక్యాలు, ఇన్స్పిరేషనల్ మెసేజులు, ఔట్-డేటెడ్ వైఫ్ & హజ్బెండ్ జోకులు, ఓవర్-ది-టాప్ భక్తిప్రపత్తులు, నిజంగా ఉన్నదానికి కాస్త ఎక్స్ట్రాలు కలిసిన సంస్కృతీసాంప్రదాయ సూక్తిముక్తావళీ ఇవన్నీ మామూలే. చాలామంది వాట్సాప్ వీడియోలు, పిక్చర్లు ఓపెన్ చూసి చూడ్డం సంగతి అలావుంచి వాటిని డిలీట్ చేసుకుని ఫోన్ స్టోరేజి తగ్గిపోకుండా చూసుకోడంలో బిజీగా ఉంటున్నారు. ఐతే, ఒక్కోసారి మంచి మంచి డిస్కషన్లు, చమత్కారాలు, ఎవరికో ఏదో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు చకచకా జరిగిపోయే సహాయసహకారాలుContinue reading “WhatsApp ముచ్చట్లు 001>> 👩అయ్యంగార్ టు అత్తగార్ 👩🎓 ఆవకాయ టు ఆటంబాంబ్స్👩 (అనే) అమ్మ-ఆవకాయ-ఒక తమిళమ్మాయి కధ”