ఇండియాలో జలయజ్ఞాలే కానీ జలయుద్ధాలు(వాటర్ వార్స్) జరుగుతాయా?అని ఇండియాలో ఎవరూ కొశ్చన్ చెయ్యరు. ఆశ్చర్యం అసలే పడరు. మనకి మునిసిపాలిటీ టాప్స్ దగ్గర జరిగే బిందెయుద్ధాలు తెలుసు. కొన్ని కులాలకి దాహానిక్కూడా నీళ్ళు దొరకని (దొరకనివ్వని) పరిస్థితుల్లో నీటి పేరు మీద జరిగిన కులపోరాటాలూ తెలుసు. అందువల్ల అడపాదడపా కర్నాటక, తమిళనాడు మధ్య జరిగే కావేరీజలాలపై వివాదాలు, వాటితోపాటు జరిగే విధ్వంసాలూ పెద్ద న్యూస్‌లా అనిపించవు, మేధావివర్గం అని స్టాంప్ పడిన వాళ్లకి తప్ప. మేధావివర్గంవాళ్ళలా గడ్డాలు పెంచి, జీన్స్‌పాంట్Continue reading “కావేరి🔥వాటర్‌వార్💣>>కమల్‌హాసన్ మిస్సైన రెండు పాయింట్స్ >🔎(1)భాషనేర్చిన🐒కోతులు🐒 🔎(2)వాటర్‌లో వున్న వాటా&వార్ 🔎”
Category Archives: ప్చ్!
😉 మీ ఊళ్ళో గాంధీస్టాట్యూ మీద రంగుల్ని గీకిన గుర్తులున్నాయా? 😉
ఆయన నమ్మిన సిద్ధాంతం, అవలంబించిన జీవనవిధానం ఒకప్పుడు సంచలనాలు సృష్టించాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని, మేధావుల్నీ ఆకర్షించాయి. రకరకాల సోషల్ స్టీరియోటైప్స్లో ఇరుక్కుపోయిన జాతులు, సంస్కృతుల్లో కాస్త ఔట్-ఆఫ్-ది-బాక్స్ ఆలోచించడానికి వెనుకాడనివాళ్లని సత్యం, అహింసల బేసిస్‌పై నిర్మితమైన గాంధీగారి పనులు, పద్ధతులు ఆకర్షించాయి. ఆయనంటే పడనివాళ్ళ అభిప్రాయం ఏంటోగానీ, గాంధీజీకి పబ్లిసిటీ పిచ్చిగానీ, ఎప్పుడూ వార్తల్లోఉండాలనే తపనగానీ వుండేవని ఎవరూ అనగా విన్లేదు. అలాంటి గాంధీజీ ఎప్పుడూ ఊహించివుండని పని ఆయన విగ్రహం ఒకటి చేసేసింది 😉 చిన్న సైజు సంచలనంContinue reading “😉 మీ ఊళ్ళో గాంధీస్టాట్యూ మీద రంగుల్ని గీకిన గుర్తులున్నాయా? 😉”
సెలబ్రిటీ కృష్ణ జింక (black buck) లైఫ్ సెటిల్ అయినట్టే ..😂
వెల్కమ్ టు గంద్రగోళంటుడే’స్ ఓపెన్ డిబేట్
ఒకప్పుడు- ఇప్పుడు -తప్పదు అను (D)Evolution of Human Thoughts
ఒకప్పుడు : Western Philosophy : I THINK, therefore I am. Indian Philosophy : I AM, therefore I think. ఇప్పుడు : Business Philosophy : I LOOT, therefore I am. Media Philosophy : I THINK-NOT, therefore I am. Political Philosophy : I SPLIT, therefore I am. Global Philosophy : I TWEET, therefore I am. తప్పదు(మనిషిContinue reading “ఒకప్పుడు- ఇప్పుడు -తప్పదు అను (D)Evolution of Human Thoughts”
పూరీలు కాలిపోతే న్యూస్‌లో చెప్పాలా ?
పూరీలు కాలిపోతే న్యూస్ లో చెప్పాలా ? పూరీలు కాలిపోవడం ఒక న్యూసా? ప్రత్యేకంగా అనౌన్స్ చెయ్యాల్సినంత పెద్దవిషయమా? హూ యామ్ ఐ టు డిసైడ్ ? డిసైడ్ చెయ్యాల్సింది తెలుగు టీవీ చానల్సు. ఎందుకు, ఎలాగా అంటే – నేడొక ప్రముఖ తెలుగువార్తామాధ్యమమందు సజీవ ప్రత్యక్షవార్తలు చూడ కుతూహలము కలిగి దూరదర్శన యంత్రమును దూరనియంత్రణా సాధనముతో వెలిగించితిని. అత్యంతాధునాతన వస్త్రములు ధరించి, గొప్ప కళ్ళద్దములు కూడా పెట్టుకొని, పెదవికర్రచే ఎర్రగా అద్దుకొనిన అధరములతో ఆంగ్లమువలె ధ్వనించు ఆంద్రభాషను అంత్యంత దమ్ముతోContinue reading “పూరీలు కాలిపోతే న్యూస్‌లో చెప్పాలా ?”
తీసేవాళ్ళు+వేసేవాళ్ళు+ఎగబడి చూసేవాళ్ళు+సెన్సార్‌బోర్డు+గవర్న్మెంటు = ప్చ్! మనం!!
ప్రయాణీకులతో కిక్కిరిసిన బస్సు ఒక దారిన పోయే దానయ్యని గుద్ది అతని జీవితం అర్ధంతరంగా ముగిసిపోతే ఆ పాపంలో ప్రయాణీకులకి భాగం ఉంటుందా? ఉండదు గాక ఉండదు. అని బల్ల గుద్ది చెప్పెయ్యచ్చు. డ్రైవర్ పొరపాటో, బస్సు బ్రేకులు పని చెయ్యకపోవడమో, అవతలి మనిషి రాంగ్ సైడులో ఉండడమో, ఇంకేదో ఇంకేదో వంద కారణాలు ఉండచ్చు ప్రయాణీకులదే తప్పని ఎవరనగలరు? ఆ మనిషిని గుద్దెయ్యడానికే బస్సు మాట్లాడుకుని వీళ్ళంతా బయలుదేరివుంటే అది వేరే విషయం. ఐ థింక్, మనంContinue reading “తీసేవాళ్ళు+వేసేవాళ్ళు+ఎగబడి చూసేవాళ్ళు+సెన్సార్‌బోర్డు+గవర్న్మెంటు = ప్చ్! మనం!!”
ఎకనామిక్ డెవలప్మెంట్+కన్జ్యూమరిస్ట్ మైండ్=ఖాండవ దహనం
కేజ్రివాల్ ప్రభుత్వం పుణ్యమా అని ఢిల్లీలో కాలుష్యం తగ్గించే దిశగా ఒక అడుగు పడింది. ప్రజాస్పందన అదిరిపోతోందని కేజ్రివాల్ సంతోషం వెలిబుచ్చారు కూడా. అదిరిపోక చస్తుందా? రాష్ట్రపతి నుంచి రోడ్లు, పేవ్మెంట్లు తప్ప వేరే నివాసంలేని వాళ్ళ వరకూ అందరూ పొగనే పీల్చాల్సి వస్తుంటే. అత్యవసరంగా రోడ్డు మీదకొచ్చే వాహనాల సంఖ్యని నియంత్రిస్తే తప్ప కుదరని సిట్యుయేషన్లో ఈ అడుగు పడింది-అంటే ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీ అనుకోవచ్చు – బట్ స్టిల్ ఈ చర్య తాత్కాలికపరిష్కారం మాత్రమే. సమస్యContinue reading “ఎకనామిక్ డెవలప్మెంట్+కన్జ్యూమరిస్ట్ మైండ్=ఖాండవ దహనం”
అధ్యక్షా!అధ్యక్షా!…ఓ అసెంబ్లీ అధ్యక్షా!
అధ్యక్షా, ఈ రోజు కొందరు సభ్యులం సభాముఖంగా ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నామధ్యక్షా! అదేంటంటే అధ్యక్షా! పార్లమెంటు కొత్తభవనం నిర్మాణానికి లోక్ సభ స్పీకరుగారు కోరినట్టుగానే రాష్ట్రంలో కూడా కొత్త అసెంబ్లీ భవనం నిర్మించాలనధ్యక్షా! ఐతే కొత్తసెంబ్లీలో కొన్ని ప్రత్యెక వసతులు కల్పించాలని కూడా మా వినతి అధ్యక్షా! అధికారపక్షఁవోళ్ళుగానీ, ప్రతిపక్షపార్టీలోళ్ళుగానీ అధ్యక్షా అందరికీ – అంటే ప్రతి ఒక్కరి కుర్చీకి ఈ ప్రత్యెక వసతులు ఉండేలా చూడాలి అధ్యక్షా! అందుకు మా సూచనలేంటంటే అధ్యక్షా … మొదటిదిContinue reading “అధ్యక్షా!అధ్యక్షా!…ఓ అసెంబ్లీ అధ్యక్షా!”
ప్చ్!-//మెదడు వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే…//
Hate Story 3 – సర్ప్రైజ్ హిట్ ఆఫ్ ది ఇయర్ అని సినీ పండిట్లు చంకలు గుద్దుకుంటున్నార్ట. ఎంతగా గుద్దుకుంటున్నారంటే ఎన్బీకే తొడకొట్టే రికార్డు బద్దలవుతుందనికూడా సినీవర్గాలు ఆందోళన పడుతున్నారట. అన్ని అంచనాలనీ, చవకబారు సినిమా అన్న రివ్యూవర్ల వ్యాఖ్యానాల్నీ అధిగమించి యాభై కోట్ల మార్కు చేరుకోబోతోందిట. ఈ మాత్రం వసూళ్లు సాధిస్తుందని పాపం కలలో కూడా అనుకోలేదుట. గల్లాపెట్టెల గలగలలు వినపడవనిపిస్తే విలవిల్లాడడం, వినపడితే చంకలు గుద్దుకోవడం సినీపండిట్లకి సహజం. గల్లాపెట్టె గలగలల్లోనే జలజల్లాడుతూ జనజీవనContinue reading “ప్చ్!-//మెదడు వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే…//”