Category: న్యూస్ – వ్యూస్

🌿 💖 🌾మనసుల్ని తయారుచేసే సర్జికల్ స్ట్రైక్స్ …// మోస్ట్ ఎఫెక్టివ్ యాంటీ-టెర్రరిస్ట్ వెపన్ మనకుంది🌿 💖 🌾


 

🌏న్యూస్🌏

పెద్ద నోట్ల రద్దు వల్ల, నల్లధనం ఉత్పత్తికి దారితీస్తున్న వ్యవస్థ మాత్రం చెక్కు చెదరబోదు. ఆదాయపు పన్నురేట్లు అధిక స్థాయిలో ఉండడమూ, పన్నుల వసూలు యంత్రాంగంలో అవినీతి మూలంగానే నల్లధనం సృష్టి అవుతోంది……………….. పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దు ఈ అవినీతికర వ్యవస్థను నిర్మూలించదు. కనుక ప్రస్తుతం రాజకీయవేత్తలు, రియల్‌ఎస్టేట్‌ యజమానులు, బంగారు ఆభరణాల వర్తకులు మొదలైన వారి వద్ద భారీ మొత్తాల్లో నిల్వవున్న సొమ్ముకు కొంత నష్టం జరిగినప్పటికీ, ఆ వ్యవస్థ యథావిధిగా నల్ల ధనాన్ని కొంచెం తక్కువ స్థాయిలో ఉత్పత్తి చేస్తుంది. పాకిస్థాన్‌లో నకీలీనోట్లను ఉత్పత్తిచేస్తున్న ఫ్యాక్టరీలు కొత్తనోట్ల ఉత్పత్తికి తమ సాంకేతికతలను నవీకరించుకుంటాయి…………………… ప్రభుత్వం తొలుత పన్నురేట్లను తగ్గించి, ప్రభుత్వ యంత్రాంగంలో కింది స్థాయిలోని అవినీతిని నియంత్రించి పెద్ద విలువగల కరెన్సీనోట్లను రద్దు చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎంతైనా వున్నది. …….. ఇటువంటి సానుకూల చర్యలు లేని పక్షంలో పెద్దనోట్ల రద్దు వరం కాకపోగా శాపంగా పరిణమిస్తుంది.

– అని నేనట్లేదు. ఆర్థికవేత్త, బెంగళూరు ఐఐఎం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ భరత్ ఝన్‌ఝన్‌వాలా అంటున్నారు, ఆంధ్రజ్యోతిలో.

😎వ్యూస్😊

ఝన్‌ఝన్‌వాలాగారు సమస్యని ఎలా మానేజ్ చెయ్యాలో చెప్పారు కానీ, దాని మూలాలలోకి వెళ్లినట్టు లేదు.  రెండు రకాల సర్జికల్ స్ట్రైకులు రెండు రకాల తీవ్రవాదుల మీద ఒక్క నెల రోజుల వ్యవధిలో జరిగి మాంఛి థ్రిల్లింగ్‌గా వున్న సమయమే సమస్య మూలాలెక్కడ వున్నాయో వేడికి వాటి మీదా సర్జికల్ దాడి చెయ్యడానికీ సరైన తరుణం. అంత తేలికకాదు కానీ పడక్కుర్చీలో కూచుని ఆలోచించడానికేముంది? చాలా ఈజీ. ఆలోచిద్దాం. ఇలా –

ఏ దేశపు ప్రజలకైనా తీవ్రవాదం, ఉగ్రవాదం అనగానే ముసుగులేసుకున్న ముష్కరుల సూయిసైడ్ ఎటాక్స్, 11th సెప్టెంబర్ 2001 నాటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎటాక్ లేకపోతే తమిళ పులులు, ఐరిష్ గెరిల్లాలు వగైరాలే ముందుగా గుర్తుకొస్తాయి. విదేశీహస్తాల కుట్రలే ఎక్కువగా కనిపిస్తాయి. చాపకింద నీరులా వచ్చి ముంచేసే తీవ్రదురాశావాదాలు ఆర్ధిక రాజకీయ అవినీతిభాగోతాలు. మొదటిరకపు తీవ్రవాదం ఎయిడ్స్, జికా వైరస్‌ల్లాగా బయట నుంచి దాడి చేసేవైతే, రెండోరకంవి శరీరాన్ని లోపల్నుంచి తినేసే కేన్సర్స్. నిజానికి ఎకనామిక్ & పొలిటికల్ కరప్షన్ – తీవ్రదురాశావాదం – కొన్ని రకాల తీవ్రవాదాలు ప్రబలడానికి కారణం. వాటికి విరుగుడు కూడా రెండురకాలుగా వుండక తప్పదు. తుపాకులకి తుపాకులతో సమాధానం చెప్తూనే తుపాకుల యుద్ధం అవసరంలేని పరిస్థితులు సృష్టించాలి. పెద్దనోట్ల రద్దులాంటి చర్యలతోపాటూ అవినీతికి మనసొప్పని మనస్తత్వాన్ని మనిషికి అలవరచాలి. హింసని, అనైతికతని అంగీకరించలేని మనసొక్కటే అన్ని రకాల దురాశలకి, దుష్కృత్యాలకీ విరుగుడు. అలాంటి మనసుల్ని తయారుచేసే సర్జికల్ స్ట్రైక్స్ కావాలి.

వేషభాష లెరిగి కాషాయవస్త్రముల్|| గట్టగానె ముక్తి గలుగబోదు

తలలు బోడులైన తలపులు బోడులా ||విశ్వదాభిరామ! వినుర వేమ!

 – అని వేమనగారు ఊరికే అన్నాడా?

తీవ్రవాద శిబిరాలపైనా, నల్లధనపు భోషాణంపెట్టెలపైనా చేసే సర్జికల్ స్ట్రైక్స్ గుండు కొట్టించుకుని, కాషాయం కట్టుకునే వస్త్ర సన్యాసానికి సమానం. తలపులకీ కాషాయం పట్టించి, వాటిలో నిండివుండే అహంకారాన్ని గొరిగించే మానసిక సన్యాసంలేనిదే తీవ్రవాదం, తీవ్రదురాశావాదం తగ్గుముఖం పట్టవు.

🙈 🙉 🙊

🌏న్యూస్🌏

లొంగిపో బిడ్డా….. అన్న తల్లి మాటకి తలొగ్గి ఉమర్‌ ఖలీఖ్‌ మిర్‌ అలియాస్‌ సమీర్‌ అనే కరుడుగట్టిన ఉగ్రవాది ఆయుధాలతో సహా లొంగిపోయాడు, కాశ్మీర్లోని సోపోర్ దగ్గరలో …

😎వ్యూస్😊

ఎంత కరుడుగట్టినా కరిగించగల మార్దవం, కరుణ, ప్రేమ ఒక్క తల్లికి తప్ప దేనికి సాధ్యం? ప్రపంచం మొత్తం గ్రహించి గౌరవించాల్సిన మోస్ట్ ఎఫెక్టివ్ యాంటీ టెర్రరిస్ట్ వెపన్ – కులం, మతం, సంస్కృతి, ప్రాంతంతో పనిలేని తల్లిప్రేమ. ఆ ప్రేమకి పిల్లలు నోచుకోకుండా చేసే ఏ పరిణామమైనా – అది అభివృద్ది కావచ్చు, ఆధునికత కావచ్చు, అజ్ఞానం కావచ్చు, అసహనం కావచ్చు – అన్నీ తీవ్రవాద మనస్తత్వాన్ని పెంచి పోషించేవే. కొన్ని రకాల తీవ్రవాదం టెర్రరిస్టుల్ని తయారు చేస్తే మరికొన్ని రకాలు యూనివర్శిటీ షూటింగులకి, అత్యాచారాలకి, ఆర్ధిక నేరాలకి కారణం అవుతాయి. రూపంలోనే తేడా. మూలం ఒకటే. మనుషులకి విలువలతో కూడిన జీవితం అలవాటు కాకపోవడమే. ప్రపంచం అంతా కలిసి తల్లి ప్రేమ ఒక్కదాన్ని రక్షించుకుంటే, రాజాజీ చెప్పినట్టుగా తల్లికి ఇవ్వాల్సిన స్థానం ఇస్తే – ఇస్తోందా లేదా అనేది డిస్కస్ చెయ్యాలా? –భూమ్మీద చాలా సమస్యలు ఉండవేమో. మొత్తమ్మీద ఒక్క ఉగ్రవాదిలోనైనా అతని భావజాలం తన తల్లి గొంతుకి తలవంచిందంటే ఎంత హాయిగా, మలయమారుతంలా అనిపిస్తోందో!!!

🌿 💖 🌾

ఇండియన్లు మా ప్రధాని నిఝ్ఝంగా గ్రేట్ అనుకునే ఘట్టాలు..// 🙈 🙉 🙊 తప్పక చూడండి (కాదు, చూడక తప్పనిది😜) 👉 సంపూర్ణ ట్రంపాయణం 🙈 🙉 🙊 // 🐦🐒పులి మనిషిని చంపితే క్రౌర్యం మనిషి పులిని చంపితే ధైర్యం, శౌర్యం🐦🐒


 

🌏న్యూస్🌏

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘నల్లధనం’పై వీర ఖడ్గం ఎత్తారు. వెయ్యి, ఐదొందల కరెన్సీ నోట్లపై కత్తి వేటు వేశారు. ‘నల్ల దొరల’కు అనూహ్య, ఆకస్మిక షాక్‌ ఇచ్చారు. నల్లధనం అరికట్టడంపై ఒక్కో అడుగు వేస్తూ వచ్చిన మోదీ… మంగళవారం రాత్రి ఒక్కసారిగా ‘బాంబు’ పేల్చారు. త్రివిధ దళాల అధిపతులతో సమావేశమైన అనంతరం మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ, దౌత్య అంశాలపై కీలక నిర్ణయాలు ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ… మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పేలా 500, 1000 నోట్ల రద్దు గురించి ప్రసంగించారు. పేదల కష్టాలు, అవినీతి సమస్యకు ప్రధాన కారణం నల్ల ధనమే అని తేల్చారు. నల్లధనం, నకిలీ కరెన్సీ, ఉగ్రవాదం… ఇవే దేశ అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నాయన్నారు.

😎వ్యూస్😊

ఇండియన్లు  మా ప్రధాని నిఝ్ఝంగా గ్రేట్ అనుకునే ఘట్టాలు చరిత్రలో నాలుగే నాలుగు –

మొదటిది అరవైఐదులో లాల్‌బహాదూర్ శాస్త్రి పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పిన తరుణం,

రెండోది 1971లో పాకిస్తాన్ని రెండు ముక్కలు చేసిన ఇందిరాగాంధీ ప్రహరణం,

మూడు పీవీ నరసింహారావుగారి ఆర్ధిక సంస్కరణం,

నాలుగు బ్లాక్ మనీపై మోడీ వ్యూహాత్మక రణం

నెహ్రూగారి పబ్లిక్ సెక్టార్ డెవలప్మెంట్, ఇస్రో ఘన విజయాలు, పోఖ్రాన్ అణువిస్ఫోటనాలు, కలాంగారి అగ్నేయాస్త్రాలు కూడా గొప్పవే కానీ పై నాలుగూ అనూహ్యంగా జరిగి ప్రజల్ని బాగా ఎక్సైట్ చేసి, ఎన్నో ఏళ్ల పాటు గుర్తు చేసుకుంటూ ఉండేలా నిలిచిపోయా(తా)య్, I think 🤔. ముఖ్యంగా నాలుగోది, బహుళార్ధ సాధక ప్రాజెక్టు, కాదు సర్జికల్ స్ట్రైక్. ఒకే దెబ్బకి ఉగ్రవాదుల్ని, నల్లకుబేరుల్ని, అవినీతి చేపల్ని, ఇన్‌ఫ్లేషన్‌ని ఉతికారెయ్యడంతోపాటు యూపీ ఎలక్షన్లనీ, ప్రోబబ్లీ 2019 ఎలక్షన్లనీ (వోటుకి నోటు లావాదేవీలు ఆగిపోతాయ్ మరి) కూడా బుట్టలో వేసేసుకునే పాశుపతాస్త్రం.

🐦🐒 🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴

🌏న్యూస్🌏

👇 బొమ్మే న్యూస్ –

trump

😎వ్యూస్😊

ఆ బొమ్మ చూస్తుంటే భారద్దేశానికి సంబంధించినంత వరకూ అమెరికా ప్రెసిడెంటు పొజిషన్లో చాలా మార్పు, ఒక రకంగా ప్రొమోషన్ వచ్చినట్టే అనిపించట్లా? ఒబామా జేబులో ఎప్పుడూ హనుమంతుడి బొమ్మ పెట్టుకునేవారు(ట). అప్పట్లో ఆయనకి పెద్ద హనుమాన్ విగ్రహం, గదలాంటివి బహుకరించాం. ఒబామాతో పోలిస్తే ట్రంప్‌గారి ఆంజనేయభక్తి ఎలాంటిదో, ఎంతటిదో, భక్తి వుంటే అది ఆంజనేయుడి దివ్యత్వంపైనో, వానరత్వంపైనో తెలీదుగానీ ఆయన ఫోటోలు ఏకంగా హనుమంతుడి పటాల సరసన చేరిపోయాయి. యత్ర నార్యంతు పూజ్యంతే… అన్న హిందూసంస్కృతిపై ఆయనకున్న “గౌరవాభిమానాలు” ఆయన దీపావళి సందేశాల్లో విన్నాం, చేష్టలు లీకైన పాత ఆడియోల ద్వారా తెలుసుకుని ఆనందించాం. ఆజన్మ బ్రహ్మచారి హనుమంతులవారికీ విషయం తెలీకుండా ఉంటుందా? తన పటం పక్కనే ఈ అపర మన్మధులవారి చిత్రాలని చూస్తే  ఏం ఇబ్బంది ఫీలౌతాడో ఏమో! (మన్మధులవారూ తోటి హిందూ దేవుడే అయినా ఆయనకీ, అంజనేయుడికీ సైద్ధాంతిక విబేధాలున్నాయి కదా మరి). అయినా ట్రంప్‌కి మనం ఇచ్చిన ‘ప్రమోషన్’ వెనక పాకిస్తాన్ నెత్తిన అమెరికన్ గద పడుతుందనే, పడాలనే మన ఆశ వుందని హనుమంతుడికి తెలీదా ఏంటి? అంచేత చూసీ చూడనట్టు ఊరుకోవచ్చు. అయితే ఈయన(ట్రంప్)గారు –

హనుమంతుళ్ళా ఉగ్రాక్షసుల్ని మట్టు పెడతారో 🤔

అంతులేని యుద్ధాలకి ఆజ్యం పోస్తారో 🤔

అణు(బాంబు)మంతుల్ని అణిచిపెడతారో 🤔

అ(ను/ణు)బంధం ఇండియాతో పెనవేస్తారో🤔  – వెండితెరపై చూడాల్సిందే

త్వరలో విడుదల, తప్పక చూడండి (కాదు, చూడక తప్పనిది) –

సంపూర్ణ ట్రంపాయణం

ట్యాగ్ లైన్ –

ముందు చూసి తర్వాత (అవసరమైతేనే) కాల్చడం రామభక్త హనుమానం🙏

ముందు కాల్చేసి ఆపైన చూసే రకమని ట్రంప్‌పై లోకానికి అనుమానం.😇

🐦🐒 🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴

🌏న్యూస్🌏 :

chiruta

బాలికను చంపిన చిరుత పులిని.. సజీవ దహనం చేసిన గ్రామస్తులు

సూరత్: బాలికను చంపిన చిరుత పులిని గ్రామస్తులు సజీవ దహనం చేశారు. బోనులో చిక్కిన చిరుతపై తమ కసి తీర్చుకున్నారు. గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని వాడి గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగింది……

http://www.andhrajyothy.com/artical?SID=329877

😎వ్యూస్😊 :

పులి మనిషిని చంపితే క్రౌర్యం

మనిషి పులిని చంపితే ధైర్యం, శౌర్యం

అని వందేళ్ళ క్రితమే ఎవరో మనుషుల డబుల్ స్టాండర్డ్స్‌ని ఏవగించుకున్నారు. సరే, స్ట్రగుల్-ఫర్-ఎగ్జిస్టెన్స్ అనేది ఏ జీవీ తప్పించుకోలేని సత్యం. ఆ స్ట్రగుల్లో జంతువులకీ మనుషులకీ మధ్య సంఘర్షణ తప్పదు, వన్యప్రాణి ఓడిపోకా తప్పదు. అంతులేని మనిషి ఆకలి కోసమో, అడవుల కొట్టివేత కారణంగానో హ్యూమన్-యానిమల్ కాన్ఫ్లిక్ట్ పెరుగుతోందేకానీ తగ్గడం లేదు. ఐనా, మానవజాతి ఒక పక్క అన్యజీవజాతుల్ని భక్షిస్తూనే మరోపక్క సంరక్షించడానికీ ప్రయత్నిస్తున్నారు. అది హర్షణీయం.👍

ఇవన్నీ ఒక ఎత్తు, జనానికి టాయిలెట్లు కట్టించుకునే, వాడుకునే అలవాటులేకపోవడానికి ఒక జీవం – నో, నో, రెండు జీవాలు బలవ్వడం మరో ఎత్తు. అదీ స్వచ్ఛభారత్ నేపధ్యంలో. చిరతపులి చిన్నపిల్లని చంపితే కసి తీర్చుకోక ఊరుకుంటామా అని సరిపెట్టుకోవచ్చు కానీ ఆ బాలిక చిరుత నోట పడడానికి మూలం జనం నాగరికతకి అలవాటు పడకపోవడం కాదా? ఒక జంతువుగా మరో జంతువుని వేటాడడం పులికి సహజం. నాగరికులుగా ప్రజలు టాయిలెట్లు కట్టించుకోకపోవడం, వాడకపోవడం అసహజం. అది ప్రకృతిపై మనిషి చెలాయిస్తున్న నిరంకుశత్వం.

🐦🐒 🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴

న్యూస్🌏😎వ్యూస్> 🙏షిర్డీసాయి దేవుడా కాదా?🙏//😆అత్యంత ఖరీదైన పెళ్ళికి అతి విలువైన…😆//👌👌కవి వైరముత్తు భావాలకి అవినేని భాస్కర్‌గారి అనువాదం👌👌


🌏న్యూస్🌏 > దేశంలో అత్యంత ఖరీదైన పెళ్ళికి అతి విలువైన శుభలేఖ (ఇంతకంటే డిటెయిల్స్ కావాలా..?)

😎వ్యూస్😊 > అత్యంత ముచ్చటైన ఆ శుభసినిమాలేఖని ఇంకా బాగా ప్లాన్ చేసి వుండాల్సింది. పాట, నటన, గ్రాఫిక్స్ అన్నీ అద్భుతం. నటీనటులందరూ తమతమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. స్క్రీన్-ప్లే , దర్శకత్వం గురించి చెప్పనే అక్కర్లేదు. కానీ ఎక్కడో ఏదో చిన్న వెలితి. సినీకళలో వున్న ఇరవైనాలుగు శాఖల్లో ఒకటేదో సరిగ్గా కుదరలేదు. తెర మీద సినిమాలతో పాటు నిజజీవిత డ్రామాలూ చూడ్డం అలవాటైపోయిన మనకి ఒక సినిమాకి ఉండాల్సిన హంగులు, మసాలాలన్నీ లేకపోతే సినిమా చూసిన తృప్తి వుండదు కదా!?!  ఆఁ.. ఐనా మించిపోయిందేముంది? ఫ్యూచర్లో ఎన్నో సెలబ్రిటీ వెడ్డింగులు అపరకుబేరుల ఇళ్ళలో జరుగుతూనే ఉంటాయ్. ఐ యామ్ ష్యూర్, ఎవరో ఒకరు బాక్‌గ్రౌండ్‌లో జూనియర్ ఆర్టిస్టులు గెంతుతుంటే విదేశీలొకేషన్స్‌లో స్టెప్పులేస్తూ పెళ్ళికి పిలవకపోరు. స్టంట్‌లు, ఐటండాన్సులు పెట్టడానికి కొంచెం టైమ్ పడుతుందేమోగానీ కాస్ట్యూమ్స్ మారుస్తూ స్టెప్స్ వేస్తూ పిలిచే పెళ్లిపిలుపులు త్వరలో విడుదల. యెస్, ఇప్పుడా వెలితి ఏవిటో తెలిసిపోయింది.😆😆😆

🌏న్యూస్🌏 > Half of India’s wildlife in danger of extinction: Living Planet Report 2016

😎వ్యూస్😊 > మనకున్న ఎటాచ్‌మెంట్లూ, సెంటిమెంట్లూ కూడా ఇంకే దేశంలోనూ, సంస్కృతిలోనూ ఉండవంటే అతిశయోక్తి కాదు. అలాగే ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అనేది మనకి తెలిసినంత బాగా ఏ దేశానికీ తెలీదు. మొదటిదానివల్ల దేవుళ్ళ నుంచీ సినిమాయాక్టర్ల వరకూ అందర్నీ గుళ్ళు కట్టి వాటిలో బంధించేస్తాం. రెండోదానివల్ల ఆ గుళ్ళనీ, గుడిలో పూజలందుకునేవాళ్ళనీ కూడా కొన్నాళ్ళకి మర్చిపోతాం. ఈ క్రమంలోనే మనం ఈ దేశంలో తిరుగాడే వన్యమృగాలకీ, పక్షులకీ, కొండలకీ, గుట్టలకీ, నదులకీ దైవత్వం ఆపాదించి పూజిస్తాం. కొండలమీద దేవుళ్ళ నివాసాలు, నదుల్లో వారికి నౌకావిహారాలు. పశుపక్ష్యాదుల మాటకొస్తే ఒక్కో జాతినీ ఒక్కో దేవుడికి వాహనంగా ఏర్పరిచి గౌరవించాం. అక్కడితో పనైపోయిందని చేతులు దులిపేసుకున్నాం. కొండలు నదుల పరిస్థితి ఏమిటో కేదార్‌నాధ్ వరదలోనూ, గంగాయమునల ప్రక్షాళనా ప్రయత్నాల్లోనూ తెలుస్తోంది. జంతుజాతుల అవస్థ ఏంటో ఇప్పుడిలా బైటపడింది. మూగజీవాలపై తమిళకవి వైరముత్తు భావాల్ని అవినేని భాస్కర్‌గారి అనువాదంలో చదువుకుని నిట్టూర్చడం కంటే ఏం చెయ్యలేని స్థితిలో వున్నాం, అందుకే ఒకసారి ఆ కవితని ….  👇

 http://eemaata.com/em/issues/201609/9120.html

🌏న్యూస్🌏 > షిర్డీసాయి దేవుడా కాదా?

😎వ్యూస్😊 > ఏ భక్తి సాంప్రదాయంలోనైనా ఆర్తి, అర్ధార్ధి టైపు భక్తులు మెజారిటీగా వుంటారు. జిజ్ఞాసు , జ్ఞాని కేటగిరీ ఎక్కడైనా మైనారిటీయే.  జ్ఞాని-జిజ్ఞాసులకి వాళ్ళేం చేస్తున్నారో వాళ్లకి క్లారిటీ ఉంటుంది కనుక వాళ్ళకీ వివాదాల గోలే ఉండదు. స్వచ్ఛమైన ఆర్తులకీ అచ్చమైన అర్ధార్ధులకీ ఇవి పట్టించుకునేంత ఓపిక తీరిక లగ్జరీ వుండవు. అవసరాన్ని బట్టీ దేవుణ్ణి మార్చుకుంటారు కానీ ఇలాంటి మేధోమధనాలు వాళ్ళ ఒంటికి పడవు. సో, ఈ వాదవివాదాల వల్ల ఎఫెక్ట్ అయ్యి బాధపడే  సంశయాత్ములు, అంటే అర్ధార్ధి స్టేజి నుంచి జిజ్ఞాసు-జ్ఞాని వర్గంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నవాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం కూలంకష చర్చలు జరగాలి. ఒక వ్యక్తి దేవుడా కాదా అంటే అవుననీ కాదనీ ఎడతెగని వివాదానికి ఏడాదికోసారి తెర లేస్తూ వుంటుంది. వివాదానికి ఇరుపక్షాలా మనోభావాలు గాయపడుతూనే వుంటాయి. అదలా కొనసాగుతూనే వుంటుంది కానీ వివాదంపై వున్న ఫోకస్ ఆ వివాదంవల్ల వెలుగులోకి వచ్చే, వెలుగులోకి రావాల్సిన ముఖ్యమైన విషయాలపైకి మళ్ళదు. ఎందుకో మరి? ఆర్జీవీ ట్వీట్లు , ఆయన ఫిలాసఫీ ఇర్రిటేటింగ్ గా వున్నా కొన్నిట్లో  మాంఛి లాజిక్కుంటుంది. ఆలోచించే మెదడుకి కావాల్సినంత మేత. చూసే దృష్టిని బట్టి షిరిడీసాయి పైన చెలరేగుతున్న వివాదం కూడా అలాంటిదే. భక్తులు, విభక్తులు (=సాయికి భక్తులు  కానివారని కవి హృదయం😉 ) కూడా  లోతుగా ఆలోచించాల్సినవి, అయినా ఎవరూ సీరియస్ గా పట్టించుకోనివి ఐన పాయింట్లు అనేకం దీనివల్ల చర్చలోకి వస్తాయి.

మచ్చుకి కొన్ని

  1. ఒక వ్యక్తిని దేవుడా కాదా డిసైడ్ చేసే శక్తి మానవులకి ఉందా అనేదానిపై అర్ధవంతమైన చర్చ జరగదు. ఎందుకో?

  2. ఇంకొక పాయింట్, తత్వమసి మహావాక్యం అర్ధం ఏమిటి? దేవుడికీ జీవుడికీ మధ్యనున్న మాయ తెర తొలగగానే ఇద్దరికీ బేధం లేదని, ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం కలిగిన మనిషి ఆ సాక్షాత్కారాన్ని తన జీవితంలోనే సాకారం చేసినప్పుడు అతను దేవుడే అవుతాడనే కదా? ఇది వుట్టి నమ్మకమా, నిజమా? ఈ అంశంపై చర్చ జరగదు, ఎందుకో?   

  3. “బోధించిన సన్మార్గవచనముల బొంకుజేసి తాపట్టిన పట్టు సాధించు”కునే భగవంతుడు మనం, మనుషులం, ఏర్పాటు చేసుకుని పాటిస్తున్న కట్టుబాట్లని కాదని, మనం గీసుకున్న సరిహద్దుల్ని చెరిపేసి కొత్తరూపంలో రావాలని అనుకుంటే దాన్ని అర్ధం చేసుకోగల కెపాసిటీ, అహంకారరాహిత్యం ఎంత గొప్పవాళ్ళకైనా ఉంటాయా? వున్నాయి అని ఎవరైనా అనుకుంటే అది అరిషడ్వర్గాలకి అమ్మమ్మ అయిన అహంకారం అనిపించుకోదా? లీలామానుషరూపాల విషయంలో ఇది తగునా? ఈ పాయింట్స్ పై డిబేట్ ఏదీ?

  4. తరచుగా భక్తి అనేది ఆర్తితోనే మొదలైనా భక్తుడు క్రమంగా జిజ్ఞాసువుగా, జ్ఞానిగా పరిణామం చెందక అర్ధార్ధి స్థాయిలో ఆగిపోతే ఆ భక్తికీ, భక్తుడికీ, పూజించబడిన దైవరూపానికి సార్ధకత ఉంటుందా అని జ్ఞానమార్గంపై ఫోకస్ పెంచే చర్చలేవీ? జనులు జ్ఞానమార్గం పట్టనినాడు ఫిలాసఫీలకీ, అవతారాలకీ ప్రయోజనం ఏమిటి? చర్చ!?! 🤔

ఇలాంటి అంశాలపై అర్ధవంతమైన చర్చలు ఆధ్యాత్మికవేత్తల మధ్య కంటిన్యువస్‌గా జరుగుతూ వుంటే ప్రజలకి మార్గదర్శకంగా ఉండదూ? ఆ రకంగా వివాదాన్ని సంవాదం(= ప్రశ్నోత్తర రూపమగు సంభాషణము అని ఆంధ్రభారతి డిక్షనరీ మీనింగు)గా మార్చుకోవచ్చేమో?!? షిర్డీసాయి కృష్ణుణ్ణి రిపీట్ చేస్తూ చెప్పిన “తద్విద్ధి ప్రణిపాతేన పరి ప్రశ్నేన సేవయా. ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శిన:” శ్లోకానికర్ధం అదే కదూ!  🤔🤔🤔

🐦🐒 🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴

👇క్లిక్👇

🌴🌹🌾🌿🌷హాపీ వృక్షావళి!! పుడమితల్లి కోసం చిన్న హాండ్‌మేడ్ వీడియో🌷 🌿 🌾 🌹 🌴

ములాయం సింగ్ ఉవాచ: నా కొడుకు వేస్ట్, ఆమె కొడుకు బెస్ట్ + శివపాల్ ఉవాచ: గంగాజలంపై ఒట్టు..//వేళ్ళతో లెక్కపెట్టే అలవాటున్న పిల్లలు తెలివితేటల్లో..//దీపావళికి పొల్యూషన్-ఫ్రీ దీపాలు


🐦🐒 🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴

🌏న్యూస్🌏

వేళ్ళతో లెక్కపెట్టడం అలవాటున్న పిల్లలు తెలివితేటల్లో ముందుంటారు(ట)

Counting on fingers may make kids smarter: Study

Washington, Oct 23, 2016, PTI:

In order to analyse how the mind works while performing arithmetic, Ilaria Berteletti from Gallaudet University in the US and colleagues scanned the brains of 39 children between ages eight and 13 while they mentally subtracted and multiplied single-digit numbers. File photo. For representation purpose. Parents, take note! Counting on fingers may make your kids smarter, suggests a new study which found that children who have better perception of their hands tend to be more skilled at math. Finger perception – the ability to distinguish, name, or recognise the fingers – is associated with math skill and even when people are not manually ticking off numbers, areas of the brain associated with fingers are still activated, researchers said.

😎వ్యూస్😊

వేళ్ళమీద లెక్కపెట్టడం, అక్షరాలు దిద్దడం, ఎక్కాలు బట్టీపట్టడం మొన్నమొన్నటి వరకూ ఇండియాలో పిల్లలకి అలవాటున్నవే కదా! ఇంకొంచెం వెనక్కెళ్తే పజిల్స్‌లాంటి పద్యాలు హోమ్‌వర్క్‌గా ఇచ్చేవారని “ధారణా బ్రహ్మరాక్షస” బిరుదాంకితులు గరికిపాటివారు చెప్పారు. అంటే ముందునుంచే వున్న తెలివితేటల్ని పెంచే పద్ధతుల్ని మార్చేసి, ఆ సో-కాల్డ్ “పాత”పద్ధతులన్నీ మరుగునపడ్డాక, అలవాటు తప్పిపోయాక అవే మంచివని “సైంటిఫిక్”గా తెలుసుకుంటున్నాం. ప్చ్! కాన్ట్ హెల్పిట్! రీ-ఇన్వెంటింగ్ ద వీల్ అంటే ఇదేనేమో!?!?!

🌏న్యూస్🌏

రామజన్మభూమిలో యాదవకుల ముసలం అనిపించుకుంటున్న ములాయం Vs. అఖిలేష్ Vs.శివపాల్Vs.అమర్‌సింగ్ వివాదాల్లో రెండు హైలైట్స్ –

(1)   🌏న్యూస్🌏 // నా కొడుకు వేస్ట్ ఆమె కొడుకు బెస్ట్ : మోడీకి ములాయం ప్రశంసలు

తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ చూపులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పడ్డాయి. మోదీ ‘మంచి కొడుకు’ అని తెగ పొగిడేశారు. ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టినా అప్పుడప్పుడూ వెళ్ళి తన తల్లి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారన్నారు. మోదీ ఆదర్శప్రాయుడైన కొడుకు అని స్పష్టం చేశారు. లఖ్‌నవ్‌లో సోమవారం జరిగిన సమాజ్‌వాదీ పార్టీ సమావేశంలో ములాయం, ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్ హోరాహోరీగా తలపడిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలోనే అఖిలేశ్‌కు పరోక్షంగా హితవు చెప్తూ మోదీని ప్రశంసించారు. తన సంతానం నుంచి తాను ఏమి ఆశిస్తున్నదీ ములాయం సంకేతాలిచ్చారు.

😎వ్యూస్😊

పాపం, ఈ మాటకి అఖిలేష్ ఎలా ఫీలయ్యాడో, ఎంత ఫీలయ్యాడో కానీ ప్రజల్లో కొందరైనా “చాయ్ అమ్ముకునేవాళ్ళ పిల్లలకి, కుస్తీపట్లు పట్టేవాళ్ళ పిల్లలకి తేడా ఇదన్నమాట,” అనుకుంటే?!?! ఇంకేమన్నావుందా?

(2)   🌏న్యూస్🌏 //గంగాజలంపై ఒట్టు.. అఖిలేశ్‌ కొత్తపార్టీ పెడతానన్నారు : శివపాల్ యాదవ్//

‘‘కొత్త పార్టీ పెడుతున్నానని అఖిలేశ్‌ నాతో చెప్పారు. ఇప్పుడు మాటమార్చి అబద్ధాలు చెబుతున్నారు. కావాలంటే గంగానదిమీద ప్రమాణం చేస్తా.’’ అంటూ ములాయం సోదరుడు, యూపీ మంత్రి శివపాల్‌యాదవ్‌ ఆరోపించారు.

😎వ్యూస్😊

అఖిలేష్ అలా చెప్తే చెప్పుండచ్చు. చెప్పకపోయీ వుండచ్చు. మనకి తెలీదు. తెలిసే అవకాశం కూడా లేదు. ఈ గంగాజలం మీద ఒట్టేసి చెప్పడం అనేదే సందేహాలకి తావిస్తుంది. గంగా ప్రక్షాళన / శుద్ధి ప్రాజెక్టు ఇంకా పూర్తవ్వలేదుగా? అది అవ్వకుండానే గంగానదిపై ఒట్లేసేస్తే జనాలకి – గంగలో పేరుకున్న (కుంటున్న) కాలుష్యం చూస్తున్నవాళ్లకి – ఆ ఒట్ల మీద డౌట్లు రావూ?

🌏న్యూస్🌏 : దీపావళి రోజు బాణసంచా కాల్చవద్దని కాలుష్య నియంత్రణ మండలి సూచిస్తోంది. కాలుష్యకారకమైన పొగ వల్ల శ్వాసకోశ వ్యాధులు, విపరీతమైన శబ్దాల కారణంగా వినికిడి సమస్య వస్తుందని, కళ్ళల్లో రజను వంటివి పడితే దృష్టికే ఇబ్బంది కలుగుతుందని సంబంధిత శాఖ హెచ్చరిస్తోంది. 75 డెసిబుల్స్‌ అంటే రెండు చేతులతో చప్పట్లు గట్టిగా కొడితే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం గల బాణసంచాను మాత్రమే వినియోగించడం వల్ల ఇబ్బంది ఉండదని కూడా ప్రచారం చేస్తున్నారు.

😎వ్యూస్😊 : చెవులకి సంగీతంలా వినబడి, కళ్ళకి విందులా కనిపించిన వార్త ఇది, నిజంగా. సంస్కృతి, సాంప్రదాయం పేర్లతో ఏడాదిలో ఒకేఒక్కరోజులో గాలిలో ఎంత పొల్యూషన్ కలుపుతున్నామో. గణేశనిమజ్జనాల్లో నీళ్ళలో కలుస్తున్న కాలుష్యం కంటే దీపావళి రోజు గాలిలో కలిసే విషవాయువులు ఎక్కువ. ఇంకా పైగా ఇతరప్రాంతాలకి గాలి నీళ్ళకంటే తేలిగ్గా వ్యాపిస్తుంది. కాలుష్య నియంత్రణ మండలి సూచనలు టపాకాయల రణగొణధ్వనిలో మినుకుమినుకుమంటూ ఒక మూలన ఒదిగుండే దీపాల్లా వున్నా అవి దీపావళి అంతరార్ధాన్ని చాటే జ్ఞానదీపాల్లా వున్నాయి.

🐦🐒 🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴

న్యూస్🌏😎వ్యూస్ >ఈ సిగ్నల్ రిసీవ్ చేసుకున్న సైంటిస్ట్ వావ్! అని…//మైసూర్ పాక్ పేరు మార్చాలని, కరాచీ హల్వాలో కరాచీ … // షాంఘై నుంచి ఏ దిశలోనైనా సరే మూడు గంటలు….


 

🌏న్యూస్🌏 >> A 39-year-old radio signal that hinted at life beyond Earth is being probed again

wow

😎వ్యూస్😊 ముప్ఫైతొమ్మిదేళ్ళ క్రితం అంతరిక్షంలోంచి వచ్చిన ఓ సిగ్నల్‌ని మన సైంటిస్ట్‌లు పసిగట్టారు. ఒకే ఒక్కసారి వచ్చిన ఆ రేడియో సిగ్నల్ ధనుర్రాశిలో వున్న నక్షత్రమండలాల్లో ఎక్కణ్ణుంచో వచ్చిందని అంచనా. భూమికాక విశ్వంలో వేరే ఎక్కడైనా బుద్ధిజీవులుండి వాళ్ళు ఇతర బుద్ధిజీవుల అన్వేషణలో సంకేతాలు పంపిస్తున్నట్టైతే ఆ సంకేతాలు ఎలా ఉండాలో దానికి తగినట్టు ఇవున్నాయని  శాస్త్రజ్ఞుల అంచనా.  ఈ సిగ్నల్ రిసీవ్ చేసుకున్న సైంటిస్ట్ వావ్! అని నోరు తెరిచాట్ట. పైన కనిపిస్తున్న “wow” అతని రాతే. ఆ వావే దానికి పేరుగా స్థిరపడింది. కొత్తగా మళ్ళీ ఈ సిగ్నల్స్‌పైన పరిశోధనలు మొదలౌతాయిట.

బానేవుంది కానీ భూమ్మీదున్న నానాజాతుల జనాల మధ్య వైరాలూ, ఆ మాటకొస్తే ఏ జాతికి ఆ జాతిలోనే అంతఃకలహాలూ కలిపి సవాలక్ష ఇష్యూలు నలుగుతూ కొట్టుకు చస్తుంటే, కాదు ఛస్తుంటే, ఇప్పుడు కొత్తగా గ్రహాంతరజీవుల్ని వెతికి పట్టుకుని వాళ్ళతో సంబంధబాంధవ్యాలు నెరపాల్సిన అర్జెన్సీ ఏఁవిటో మానవుడికి. వాళ్ళంతట వాళ్ళు వెతుక్కుంటూ వస్తే ఎలాగో తప్పదు. అది వేరే సంగతి. మనమే వాళ్ళని వెతికి పట్టుకున్నాక వాళ్ళూ మనలాంటివాళ్ళే అయితే ఇంక షరా మామూలేగా? అంతరిక్షంలో బోర్డర్లు, పార్టిషన్లు, LOCలు, క్రాస్-బోర్డర్ టెర్రర్ ఎటాక్స్, సర్జికల్ స్ట్రైక్సూ, మన సినిమాల్లో వాళ్ళ యాక్టర్స్ నటించాలంటే మన ఆర్మీకి సినిమావాళ్ళు కోట్లు చెల్లించడం…….

🐦🐒 🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴🐦🐒 🍵 🌏

🌏న్యూస్🌏 >> కృష్ణ జింకల వేట కేసులో సుప్రీం కోర్టుకి రాజస్తాన్ ప్రభుత్వం  అప్పీల్

😎వ్యూస్😊 >>

kandala

🐦🐒 🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴🐦🐒 🍵 🌏

🌏న్యూస్🌏>>    మైసూర్ పాక్ పేరు మార్చాలని, కరాచీ హల్వాలో కరాచీ ఉన్నంతవరకూ దాన్ని ముట్టుకోమని నెటిజన్ల హల్చల్!!

😎వ్యూస్😊 >>

ఉరుమురిమి మంగలం మీద పడినట్టు ఇండో-పాక్ గొడవల సంగతేమోగానీ మైసూర్‌పాక్ ప్రాణాల మీదకొచ్చింది. ఉరీ ఎటాక్స్, ఆపైన సర్జికల్ స్ట్రైక్స్ నేపధ్యంలో రెండు దేశాల ప్రభుత్వాలు డిప్లొమాటిక్ & స్ట్రాటజిక్ వార్ చేస్తుంటే దాన్ని కాష్ చేసుకోడానికి పేటపార్టీలు, సందుపార్టీలు, టీవీ ఛానళ్ళు ఒక పక్క చెలరేగిపోతుంటే, ఇంకోపక్క గల్లాపెట్టెల వర్రీ పట్టుకున్న కండలవీరులు, కరణ్ జోహార్లు తమ సొంత శైలిలో కామెడీ చేస్తుంటే పొలిటికల్ & సినీ కమెడియన్స్‌ని గేలి చేస్తున్నారో లేక తమ ఉడతాదేశభక్తి ప్రదర్శిస్తున్నారోగానీ సామాన్యులు మైసూర్‌పాక్ మీద, కరాచీ హల్వా మీద, పెషావర్ బిర్యానీ మీద యుద్ధాలు ప్రకటించారు. ఓ పాతికేళ్ళ క్రితం వరకూ మైసూర్‌పాకంగా స్వదేశీ ఘుమఘుమలు వెదజల్లి, ఫాషనబుల్ జన‌ం పాకాన్ని పాక్‌గా ఆంగ్లీకరించినా భరించి ఇప్పుడు మేడిన్ పాకిస్తాన్‌ ముద్ర వేయించుకుని…. ప్చ్! పాపం! మైసూర్‌‌పాక్(కం). ఇంకా నయం, పాకంగారెలు పాక్ గారెలుగా మారలేదుగానీ మారివుంటే?? ….ఎంత ప్రమాదం తప్పిందీ..

🐦🐒 🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴🐦🐒 🍵 🌏

🌏న్యూస్🌏>>

Seeing pollution over India, China left me shocked: Astronaut Scott Kelly : “Seeing places like China and India, and the pollution that exists there almost all the time is quite shocking,” Kelly said in a brief media appearance with US President Barack Obama in the Oval Office of the White House yesterday.

“There was one day last summer, the summer of 2015, when I was in space I saw the eastern side of China was perfectly clear. And I’d never seen that before in all of my time in space, and I’d spent well over a year in space, total, at that point,” he said. Seeing Himalayan lakes kept US astronaut Scott Kelly ‘sane’

“I could see all these cities that are – there’s like over 200 cities in that part of China, with over a million people. And it was at dusk, and I could just, for the very first time, I was able to see them, and it was quite shocking,” he added.

😎వ్యూస్😊 >> హైదరాబాద్‌లో అరగంట ఆటో ప్రయాణం చేసినా, డబుల్‌డెకర్ బస్సులో పై డెక్‌లో కూచుంటేగానీ ఊపిరాడని వైనం చూసినా, బైట వాహనాలు వదిలిన పొగ వాసన ఏసీకార్లో చల్లచల్లగా వీచే మలయపవనంగా చెలామణీ అయ్యే విధం అనుభవించినా తెలిసిపోయే, నగరవాసులు(ల్ని?) నిత్యం ఆస్వాదించే పొల్యూషన్ని-

షాంఘై నుంచి ఏ దిశలోనైనా సరే మూడు గంటలు ప్రయాణించినా కొడైకెనాల్లో మబ్బుల్లా కంటిన్యువస్‌గా కనిపిస్తూనేవుండే కాలుష్యాన్ని-

చూసి హా…..శ్చర్యపడిపోయేసేదానికి ఏడాదిపాటు అంతరిక్షంలో గడపాలా?

😉 😉 😉 వాట్ ఐ మీన్ ఈజ్, ఇంతింత కాలుష్యాన్ని పీల్చేస్తూ కూడా మనం మౌనంగా భరించేస్తుంటే స్కాట్ కెల్లీలాంటివాళ్ళు పై విధంగా హైలైట్ చెయ్యక తప్పదు, మనమే మౌనం వీడాలి అని.

🐦🐒 🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴🐦🐒 🍵 🌏

న్యూస్🌏+😎వ్యూస్>చైనా మరో ఈస్టిండియా కంపెనీ/ఇవాళ ఒక అమెరికన్‌తో/”పయనించే ఓ చిలుకా! ఎగిరిపో కబ్జా అయ్యెను గూడూ,” …


 

🌏న్యూస్🌏  చైనా మరో ఈస్టిండియా కంపెనీ: పాక్ ప్రభుత్వంపై పాక్ చట్టసభ్యుల ఆగ్రహం
😎వ్యూస్😊 చైనా – పాకిస్తాన్ జాయింటుగా చేస్తున్న ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ వల్ల నష్టాలు కష్టాల పాలవుతున్నది బలూచీస్తాన్ ప్రజలు. వాళ్ళ గురించి ఇన్నాళ్ళూ లేని ఆగ్రహం, ఆదుర్దా, ప్రేమ పాక్ చట్టసభలు ఇప్పుడెందుకు ఒలకబోస్తున్నట్టు? ఎందుకంటే అదంతా బెలూచిస్తాన్‌లో జరుగుతున్న అక్రమాలపై ప్రపంచం కళ్ళు తెరిపించడానికి ఇండియా చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోడానికి చైనా ఆడిస్తున్న తోలుబొమ్మలాట కాబట్టి. ఈస్టిండియా కంపెనీ ప్రస్తావన ఎందుకో? ఆ కంపెనీ వల్లే కదూ వీళ్ళకీ పాకిస్తాన్ దక్కింది?

😈😈😈

🌏న్యూస్🌏 ఇవాళ ఒక అమెరికన్‌తో మాట్లాడే పని పడింది… అనుకోకుండా వాళ్ళ ఎలక్షన్స్ ‌టాపిక్ వచ్చింది…
😎వ్యూస్😊 అతను ఏవఁన్నాడంటే, “ఈ ఎలక్షన్స్‌లో ట్రంప్‌కి  అధికారం రాకూడదని హిల్లరీకి వోట్లేసేవాళ్ళు, హిల్లరీ ప్రెసిడెంటు అవ్వకూడదని ట్రంప్‌ని ఎన్నుకునేవాళ్ళు వున్నారు కానీ ఇద్దర్లో ఏ ఒక్కరినీ ప్రెసిడెంట్ అవ్వాలని కోరుకుని వోట్ చేసేవాళ్ళు లేరు,” అని. మన ఎలక్షన్లే నయఁవేఁమో!!

🙈 🙉 🙊

🌏న్యూస్🌏  దురాక్రమణలు, కబ్జాల గురించి వార్తలు, విశ్లేషణలు, చట్టాలు, లా-ఎన్ఫోర్స్‌మెంట్లు… అంటూ ఎన్నాళ్ళు ఎన్ని డిబేట్లు చేసినా అవింకా జరుగుతూనే వున్నాయి. ఎందుకంటే ….
😎వ్యూస్😊 కబ్జా అనేది మనుషులకి పుర్రెతో పుట్టిన బుద్ధి కనక. జంతుస్థాయిలో వున్నప్పటి నుండీ ఇప్పటి వరకూ కొన్ని లక్షల ఏళ్ల పరిణామక్రమం జరిగినా జీన్స్‌లో ఇంకా పూర్తిగా మారని క్వాలిటీ అది. 👇అదిగో ప్రూఫ్ – 

kabja

(అదేదో ఫోటో కాంపిటీషన్‌లో బహుమతి పొందిన ఫోటో. నిజంగా జరిగినది, ఫోటోషాప్ కానిది.) ఐతే, కొన్ని లక్షలఏళ్ల పరిణామక్రమంలో మనిషికి కబ్జా అలవాటు పూర్తిగా పోలేదు కానీ, క్రమబద్ధీకరణ అనే కొత్త స్కిల్ నేర్చుకున్నాడు. పాపం ఈ చిలక మాత్రం ఉడుము తోక పట్టుకుని ఎంత పీకినా ఏం పీకలేక చివరికి “పయనించే ఓ చిలుకా! ఎగిరిపో కబ్జా అయ్యెను గూడూ,” అని పాడుకుంటూ వేరే గూడు వెతుక్కుంటూ పోయిందిట.  

🍵 🌏 🌊 🌄 🌇 🌃 🌉 🌷 🌿 🌾 🌹 🌴