Category: న్యూస్ – వ్యూస్

నేడే చదవండి B.Com(Chemistry) + కృష్ణ vs. కాళియ🐍


https://www.asianage.com/india/all-india/051119/cows-navel-produces-gold-with-sunshine-that-is-why-milk-is-yellow-wb-bjp-chief.html ఆ లింకులో వున్న న్యూస్ చదివే వుంటారు. పాతబడిన వార్తే కానీ ఎప్పుడెైనా enjoy చెయ్యచ్చు. B. Com (Physics) అనే టాపిక్ ఎంత ఫ్రెష్షుగా వుంటుందో అంత బావుంటుంది.

ఇంతకీ వార్తలో విషయం నిజమే ఐతే దేశంలో జూవెలరీ షాపులన్నీ మూసేసే రోజు దగ్గర్లోనే ఉన్నట్టు. ఇంట్లో ఒక ఆవుని పెట్టుకుంటే చాలు. మనకి రోజూ పాలు, పేడ(fuel)తో పాటు ప్రతీ యేడూ అక్షయ తృతీయకీ, పిల్లల పెళ్ళిళ్ళకీ, లాకర్లలో మూలగడానికీ – కేజీల కొద్దీ బంగారం మన పెరట్లో నాలుగుకాళ్లు, రెండు కొమ్ములు, ఒక తోకతో నడుస్తున్నట్టు. ఘోష్ గారు చెప్పినట్టు పాలు పసుపు రంగులోకి మారేంత బంగారం ఆవు ఒంట్లో వుంటే బీఫ్ తినేవాళ్ళందరూ ఆ పని మానేసి గోవు మాలక్ష్మికీ కోటి దండాలూ అంటూ పాలు పితికి బంగారం సంపాయించి, దాన్నమ్మిన డబ్బుతో ఫారిన్ కంట్రీలకి బిజినెస్ క్లాసులో వెళ్ళి ఫారిన్ బీఫ్ తినడం మొదలెడతారేమో! విదేశీ ఆవులకి డివైన్ స్టేటస్ లేదుట (ఆయనే చెప్పారా సంగతి) ఒకవేళ అవి డివైన్ స్టేటస్ క్లెయిమ్ చేసినా అది ఇవ్వబడదు. మొత్తమ్మీద బీఫ్ పాలిటిక్సూ, రిలేటెడ్ గందరగోళాలూ ఆగిపోయే టైమొచ్చేసినట్టుంది. ఇంక ఏ మనోభావాలూ దెబ్బతినవు కూడా. ఒకటే సమస్య. టెక్నికల్ ప్రాబ్లం. పాలలోంచి బంగారం extract చెయ్యడానికి గ్రాముకి ఎంత ఖర్చు అవుతుందనేదే ఆ ప్రాబ్లం. ఘోష్ గారే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసేస్తారు,😇 B.Com (Chemistry) చదివి.

ఆ ఫొటో News18.com వారి courtsey. అందులో పాలకడలి ఒడ్డు, పాత సినిమాల్లో నారదుడి పాటలకి వేసే మబ్బు తరగల సెట్టూ కనిపిస్తే అది మన పొరపాటేం కాదు. నిజానికి అక్కడున్న ఆ భక్తులకి అలాగే కనిపిస్తూ వుండి వుంటుంది – ఢిల్లీలో, పొల్యూషన్ వల్ల వెన్నెల కురవని, పొన్నలు అసలే విరియని యమునా తటిలో, కాళిందీ కుంజ్ అనే ఆ ఘాట్.

https://www.google.com/amp/s/www.news18.com/amp/photogallery/india/devotees-perform-chhath-puja-amid-toxic-foams-on-yamuna-river-2372639.html

ఆ సీన్ చూసి వేసిందే ఈ బొమ్మ –

😇😇😇😇😇😇😇😇😇😇😇

ఇది మరీ పాతబడిపోయిన న్యూసు. అందుకే ఈ న్యూసులో సెంట్రల్ కారెక్టర్లని వదిలేసి ఎవరూ ప్రాధాన్యత ఇవ్వని ఒక పాయింట్ పట్టుకున్నా. ప్రాధాన్యత వుందో లేదో పంచదశలోకవాసులే తేల్చుకోవాలి.

ఏపీ సీఎస్‌ని ప్రాధాన్యం లేని హెచ్.ఆర్.డీ.కి డైరెక్టర్ జనరల్‌గా పంపించేశార్ట. పంపించేశారంటే పంపించేస్తారు. అది ప్రభుత్వం, వాళ్ళ ఇష్టం, వాళ్ళ అధికారం, వాళ్ళ ప్రివిలేజి. మన ప్రాబ్లెమ్ కాదు. మన ప్రాబ్లెమ్ అంతా “ప్రాధాన్యత లేని” అనే ఫ్రేజ్ గురించే. “ప్రాధాన్యత లేని” డిపార్ట్మెంట్లు పెట్టడం ఎందుకో? వాటికి బడ్జెట్లు ఎందుకో? ప్రాధాన్యత ఇవ్వబడని / లేని / కోల్పోయిన అధికార్లని కూచోపెట్టడానికా?

అసలు “ప్రాధాన్యత” “లేకపోవడం” అంటే ఏంటో?

ఆ డిపార్టుమెంట్లు ప్రాధాన్యత లేని పనులు చేస్తాయనా?

లేక

ప్రభుత్వానికి ఆ ప్రాధాన్యతలతో పని లేదనా?

😇😇😇😇😇😇😇😇😇😇😇

Bye4Now🙋‍♂️

ఇదేం ఈక్వేషన్రా  వెంకటేశా!! దీని భావమేమి తిరుమలేశా!!


మట్టి+నీళ్ళు=అండా+దండా అట.

ఆహహా!! అలా అని ఎవరో అంటుంటేనూ!! ఇదేం

ఈక్వేషన్రా వెంకటేశా!! దీని భావమేమి తిరుమలేశా!! అనుకుంటున్నా 🤔

అంతే 🤗ఇంకేంలేదు🙏🤓.

తాడు ఒకటి తక్కువైందని ఎవరో అంటేనూ ….

ఆ పైన పిట్ట రెట్ట శాస్త్రాన్ని గుర్తు చేస్తేనూ….

👇👇👇

ఇంతే సంగతులు. బై4నౌ 🖐🤓

RawWijdom: నల్లని మబ్బులు🌧🌧గుంపులు గుంపులు మిరేజ్✈జెట్టులు బారులు బారులు అవిగో.. అవిగో..


నేను చెప్పబోయేది – అంటే నా raw wijdom – అర్ధం కావాలంటే ఇవాళ పొద్దున్నే నాకైన చిన్న ఎక్స్పీరియెన్స్ ఒకటి చెప్పాలి –

పొద్దున్న నిద్ర లేవగానే బెడ్రూమ్ విండోలోంచి దట్టంగా పట్టిన వాన మబ్బులు కనిపిస్తే ఆ ఆనందమే వేరు.

నల్లని మబ్బులు గుంపులు గుంపులు

తెల్లని కొంగలు బారులు బారులు

అవిగో అవిగో …

అని మల్లీశ్వరి పాట…

అది కాకపోతే..

మబ్బులో ఏముంది…నా మనసులో ఏముంది.. నా మనసులో ఏముంది?

అని లక్షాధికారిలో పాట

గుర్తొస్తాయి. పొరపాట్న గుర్తు రాకపోయినా మూడ్ హాయిగా అయిపోయి కప్పు కాఫీ కోసం రెడీ అయిపోతుంది.

కదా !!!!!!

.

.

.

.

కాదు.

ఐ మీన్, ఇవాళ్టి నుంచీ కాదు. ఎందుకంటే ఇవాళ పొద్దున్న ఆ👇 మబ్బుల్ని –

చూడగానే మదిలో ఆ పాటలూ, కాఫీకప్పులూ కాదు, రాడార్లకి దొరక్కుండా దూసుకొస్తున్న శత్రుదేశాల ఫైటర్ జెట్ల హోరు వినబడింది. ఏంటా అని కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా నల్లటి మబ్బులు గుంపులు గుంపులు. మళ్ళీ కళ్ళు మూసుకున్నా. తిరిగి యుద్ధవిమానాలు బారులు బారులు హోరులు హోరులు. సమ్ థింగ్ రాంగ్ సమ్ వేర్. అదేంటో కొన్ని క్షణాల్లో అర్ధమైంది, ఇది News Nationకి మోడీగారిచ్చిన ఇంటర్వ్యూ ఎఫెక్ట్ అని.

మోడీసారుగారి Raw Wisdom (ఆయన మాటల్లోనే) గురించి గిట్టనివాళ్ళూ, ముఖ్యంగా కుహనా మేధావులు తెగ జోకులేసేస్తున్నారు. కానీ నా ఉద్దేశం వాళ్ళకి మోడీ మీదున్న అసూయని ఈ రకంగా బైట పెట్టుకుంటున్నారని. అసలాలోచించండి. సామాన్యుడినైన నాకే మబ్బులు చూసి ఇంత భయం పుడుతుంటే ఇమ్రాన్ ఖానూ, పాక్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా, వీళ్ళకి తోడుగా ఉగ్రవాద నాయకులు ఎంతగా బెంబేలెత్తి పోవాలీ?

నా మటుకు నాకు వాళ్ళ పరిస్థితి కళ్ళక్కడుతోంది ఇలా –

మోడీ మేష్టారు తన Raw Wisdom (తెలుగు పేపర్లు అజ్ఞానం కొద్దీ మిడిమిడి జ్ఞానం అని తర్జుమా చేశాయనుకోండీ!! వాట్నీ, ఈ దేశాన్నీ మీరూ, నేనూ బాగుచెయ్యలేం కదా!!) వాడి పాకిస్తాన్ని ఎలా హడలగొట్టి పారేశారో కుహనాలకి ఇప్పటికైనా అర్ధవైందో, లేదో! ఇదే అర్థం అవ్వకపోతే, News Nation ఇంట్రవ్యూలోనే మేష్టారు బకెట్ల కొద్దీ తోడి పోసిన raw wisdom ఎలా అర్థం అవుతుంది నా మొహం?

1988లో డిజిటల్ ఫోటో తీసి అద్వానీగారికి e-mail చేశానని చెప్పారా. అది పట్టుకుని నెటిజన్లు, సోషల్ మీడియా ఒకటే రాద్ధాంతం. ఎందుకో అర్ధం కాదు. 5000యేళ్ళ క్రితం టెస్ట్-ట్యూబ్ బేబీల్ని సృష్టించినవాళ్ళకి e-mail, digital camera ఒక లెక్కలోకి రావని ఎప్పటికర్థం చేసుకుంటారో నె(నే)టిజనులు. మనకర్థంకానివన్నీ అబద్ధాలు అనుకునే జనం ఎక్కువైపోయారు. If there is a will, there is a way అన్నారు పెద్దలు. మనసు పెట్టి ఆలోచిస్తే raw wisdom అనేటటువంటిది అర్ధం కానంత కాంప్లికేటెడ్ మేటరేం కాదు, మనం కూడా rawగా ఆలోచిస్తే…

ఉదాహరణకి ఇలా👇 అర్ధం చేసుకోవచ్చు —

అదీ this week-end’s dose of raw wijdom. Bye4Now 🖐🤓

ద సైన్స్ ఆఫ్ పిట్ట🐥రెట్ట జోస్యం & ద ఇంపాక్ట్ ఆఫ్ ఎ పొలిటికల్ పిట్టరెట్ట


ఈ మధ్య జ్యోతిష్యాల మీదా, జ్యోతిష శాస్త్రజ్ఞుల మీదా జోకులెక్కువైపోయాయి. ఎక్కువైపోయాయి అంటే అవ్వవా మరి? టీవీ చర్చల్లో కూచుని డోనాల్డ్ ట్రంప్ నుంచీ వీధి చివర పుంపు వరకూ ప్రతీ విషయం మీదా జ్యోతిష్కుల ప్రిడిక్షన్స్, వాటికి హేతువాదులు ఛాలెంజులు, ఆ ఛాలెంజులకి జవాబు చెప్పలేక చర్చ మధ్యలో జ్యోతిష్కులు అలిగి లేచి వెళ్లిపోవడం, … ఈ ఫార్సులు చూసి జనం జోకులెయ్యక ఊరుకుంటారా? ప్లానెటరీ ఆస్ట్రాలజీ సైన్స్ కాదు అని నేను అనలేను. అలాగని అందరు జోతిష్కులు చెప్పేవీ సైన్టిఫిక్కే అనికూడా అనలేను. ఐనా ఇప్పుడు సబ్జెక్ట్ అదికాదు.
సబ్జెక్టు ఏంటంటే గవ్వల పంచాంగం నించీ గ్రహ సంచారం వరకూ ఎదో ఒకటి మన జీవితాల్ని ఎఫెక్ట్ చేసేస్తుందనే నమ్మకం నుంచీ, చేస్తోందేమో అనే అనుమానం నుంచీ బయటపడలేమా? పడొచ్చు.
అసలెందుకు బయటపడాలి? అనే ప్రశ్న బుర్రలో పుట్టాలి గానీ ఈజీగా బయట పాడొచ్చూ. ఎందుకు బయటపడాలి అనేందుకు లక్ష కారణాలున్నాయి. కానీ ఒక రెండు చెప్తే చాలు. ఒకటి, మన లైఫ్ రెస్పాన్సిబిలిటీ మనదే అనుకునే గుణం అలవాడడానికి. రెండు, మనిషి వీక్-మైండ్ని బతుకు తెరువుకి వాడుకునే గుణం పోడానికీ గవ్వలనీ, గ్రహాలనీ వాటి దారిని వాటిని పోనివ్వాలి. ఇప్పుడింక దాసరి నారాయణరావు / కె.విశ్వనాధ్ టైపు స్పీచులాపి ఈ పోస్ట్ కి ఐడియా ఎలా వచ్చిందో చెప్తా –
జిలేబిగారి బ్లాగులో సూర్యగారు పెట్టిన ఓ కామెంటు ఎంత న(వ్వి)చ్చిందంటే ఆ నవ్వు ఈ టపా రాసేవరకూ ఆగలేదు. సో, ఈ టపా క్రెడిట్స్ వాళ్ళిద్దరికీ చెందాలి.
ఇచ్ఛేసేవాణ్ణే. ఇంతలో అనుకోకుండా జోస్యాలు చెప్పేవాళ్ళ మీద ఓ “పిట్ట రెట్ట” (ఆహాహా! పిట్ట రెట్టలాంటిదని నా ఉద్దేశం) పడింది. జోస్యాలు చెప్పేవాళ్ళందరి మీదా కూడా కాదు లెండి. గవ్వల పంచాంగం నుంచీ పిట్ట జోస్యం (చిలకజోస్యం) మీదగా నవగ్రహాలూ (ఎనిమిది గ్రహాలూ+ఒక నక్షత్రం) మరియు పన్నెండు రాశుల వరకూ లోకంలో వున్న దేన్ని వాడైనా – ఆక్టోపస్సులూ, గుడ్లగూబలూ, etc సహా – ఫ్యూచర్ చెప్పే టెక్నాలజీ మనం డెవలప్ చేశాం కదా! ఆ టెక్నాలజీల్లో ఒకానొక బ్రాంచి మీద పడింది “పిట్టరెట్ట” (లాంటిది). అసలు పిట్టరెట్టని ప్రిడిక్ట్ చెయ్యడం ఎంత కష్టమో రాద్దామనుకున్నవాణ్ణి కాస్తా పొలిటికల్ ఇంపాక్ట్ ఆఫ్ ఎ పిట్టరెట్ట కూడా కలిపా. సో, క్రెడిట్లో ఆ “పిట్టరెట్ట”ని వేసిన వాళ్ళకీ కాస్త భాగం దక్కుతుంది. విమానప్రమాదాల్లాంటివి ముందుగానే ప్రిడిక్ట్ చేసి చెప్తే కొందరైనా ఆ ప్రమాదం తప్పించుకుంటారు కదా అనేది సూర్యగారి కామెంట్ సారాంశం. ఇక్కడే గ్రహాల-బేస్డ్ జ్యోతిష్యాన్ని విమాన ప్రమాదాల్లాంటి వాటికేగానీ పిట్టరెట్ట, గేదె పేడ, … వంటివి ప్రిడిక్ట్ చెయ్యటానికి ఉపయోగించకూడదా, అసలు అలాంటివి కూడా ప్రిడిక్ట్ చేయగలమా అనే ఎనాలిసిస్ నాలో మొదలైంది. అందులో భాగంగా అసలు గ్రహా-బేస్డ్ జోతిషం ఎలా ఆపరేట్ చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చెయ్యడానికి ఒక మేథమెటికల్ మోడల్ తయారు చేశా. ఆ మేధ-మే-టికిల్ మోడల్ ఇదుగో –
ఓ వంద, కాదు, వెయ్యి వస్తువులు – కుర్చీలు, గిన్నెలు, కోతులూ, మనుషులూ, చెట్లూ, ఫాన్లూ, కోళ్ళూ, నీళ్ళూ, etc అనమాట – అన్నిట్నీ సెపరేట్ తాళ్లతో ఒక లారీకి కట్టాలి. మళ్ళీ ఈ వస్తువులన్నిట్నీ ఒక దానితో ఒకటి చిన్న చిన్న తాళ్లతో కలపాలి. ఈ కలపడం ఒక చక్కటి క్రమంలో కాకుండా అడ్డదిడ్డంగా , చేతికొచ్చినట్టు కలపాలి. అంటే మనిషిని కోతికి, ఆ కోతిని అరిటిపండుకి, పండుని కుర్చీకి, కుర్చీని ఇంకొకడి కాలుకి, ఆ కాలుని ఇంకెవరో జుట్టుకి, జుట్టుని ఒక చెట్టుకి, … ఇలా – వీలయితే ఇంకా అడ్డదిడ్డంగా కలిపెయ్యాలి. తాళ్ళకి వేసే ముళ్ళు కొన్ని లూజుగా, కొన్ని టైటుగా వెయ్యాలి. కొన్ని పీట ముళ్ళు పడిపోయేలా ఉండాలి. ఇప్పుడు లారీని స్టార్ట్ చేసి ఒక సర్కిల్లో క్షణానికో గేరు మారుస్తూ నడపాలి. ఒక్కమాట, లారీ తిరిగే సర్కిల్లో గతుకులు, గోతులు, స్పీడ్ బ్రేకర్లూ … ఎక్కడపడితే అక్కడ ఉండాలి. లారీ డ్రైవరు బాగా తాగి ఉండాలి. లారీలు మాటిమాటికీ ఒకదాన్నొకటి గుద్దుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం తీరిగ్గా ఒక్కో వస్తువూ ఎలా కదులుతోంది అని పరిశీలించాలి. కొంచెంసేపు పరిశీలించాక ఇంకో ఎనిమిది లారీలు తీసుకొచ్చి వాటినీ ఈ వస్తువులన్నిటికీ తాళ్ళేసి కట్టేసి వాటినీ వేరు వేరు సర్కిల్స్లో ఇష్టం వచ్చిన స్పీడుల్లో తిప్పెయ్యడం మొదలెట్టాలి. ఇప్పుడింక ప్రతీ వస్తువుయొక్క మూవ్-మెంటునీ ప్రిడిక్ట్ చెయ్యడానికి ట్రై చెయ్యాలి. ఇప్పుడు తెలిసింది కదా గ్రహాస్-బేస్డ్ ఆస్ట్రాలజీ ఎంత ఈజీనో. ఈ పద్ధతిలో ఎవరి ఫ్యూచర్నైనా సరే చెప్పెయ్యచ్చు. ఆ ఫ్యూచర్ పాస్ట్ గా మారిపోయాక చెప్పడం మరీ తేలిక. ఈ మోడల్ అర్ధం చేసుకుంటే చాలు గవ్వల జోతిష్యం, చిలక జోస్యం, సోది, ఆక్టోపస్ భవిష్యవాణి, పుట్టుమచ్చల శాస్త్రం, … లాంటి కాంప్లికేటెడ్ శాస్త్రాలన్నీ ఇంకా ఇంకా ఈజీగా అర్ధమైపోతాయి. సరే, ఇప్పుడు ప్రశ్న పిట్టరెట్ట ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద పడుతుందో ప్రిడిక్ట్ చెయ్యడం ఎలా అని కదా!! వెరీ వెరీ సింపుల్ !! పైన లారీకి కట్టిన సామాన్లతో పాటు ఏ పిట్టరెట్టని ప్రిడిక్ట్ చెయ్యాలనుకుంటే ఆ పిట్టనీ (అది దొరక్కపోతే దాని రెట్టని) ప్లస్ అది ఎవరి మీద పడుతుందని అనుకుంటున్నారో ఆ మనిషినీ కూడా లారీకేసి కట్టెయ్యాలి. ఆ తర్వాత అంతా వెరీ వెరీ ఈజీ. గేదె పేడ ఎప్పుడు ఎంత వేస్తుందో చెప్పడం కూడా ఇదే పద్ధతిలో చెప్పొచ్చు. కానీ రైతన్నలు ప్రాక్టికల్ పర్సన్స్. గేదెకి వేసిన గడ్డిని బట్టి, వేసిన టైమింగుని బట్టీ గ్రహాల కంటే ఎక్యురేట్ గా ప్రిడిక్షన్ ఇచ్చేస్తారు. అదీకాక రుణమాఫీ ఇస్తేగానీ బతుకుబండి సాగని రైతన్న జోతిష్కుడికి ఫీజేవిచ్చుకుంటాడు పాపం!! వోట్ల కోసం కోట్లు పెట్టేవాడికి వోట్లు పడతాయో పడవోననే యాంక్జైటీ ఉంటుంది కానీ రేపు తెల్లారుతుందో లేదో తెలీని రైతుకి యాంక్జైటీ ఎందుకంటా? అంచేత పిట్టరెట్ట, గేదెపేడ, … వగైరాల ప్రిడిక్షన్స్కి మార్కెట్ లేదు. మరి ఏరోప్లేన్ యాక్సిడెంట్స్ అయినా ముందుగా లెక్కేసి చెప్పచ్చు కదా అంటే అదీ కుదరదు. ఎందుకంటే రేప్పొద్దున్నే ఫలానా ఎయిర్ లైన్స్ వాళ్ళ విమానం కూలిపోవును అని నాలాంటి మేధావి ప్రవచించాడనుకోండి ఫలానా ఎయిర్ లైన్స్ వాళ్ళ మనుషులొచ్చి మేధావిని ఆ ఫ్లైట్ లోనే కూచోపెట్టడం లేదా వీపు విమానం మోగించడం ఖాయం. భవిష్యత్తుని అర్ధం చేసుకున్న భవిష్యజ్ఞులు తెలిసి తెలిసి అలాంటి రిస్కు తీసుకోరు కదా!! మనమే అర్ధం చేసుకోవాలి మరి. సో, ఇంతకీ చెప్పొచ్ఛేదేంటంటే జోస్యుల్ని వారి కన్వీనియెన్స్ ప్రకారం జోస్యాలు చెప్పనివ్వడమే వారికీ, శాస్త్రానికీ కూడా సేఫ్.
నౌ, లెటజ్ టాక్ అబౌట్ ద పిట్టరెట్ట దట్ ఫెల్ ఆన్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఆస్ట్రాలజీ…………… కర్ణాటకలో పామిస్ట్రీ వృత్తిలోవున్న ఒకాయాన్ని మీ జ్యోతిషాలయపు బోర్డులో వున్న చెయ్యి బొమ్మని కవర్ చేసేయ్యండంటూ లోకల్ ఎలక్షన్ ఆఫీసర్లు ఆదేశించారుట. మార్చ్ 13 డెక్కన్ హెరాల్డ్ లో వచ్చిందీ వార్త. సదరు పామిస్టు లబోదిబోమంటే మీ బోర్డు మీదున్న చెయ్యి ✋ కాంగ్రెస్ పార్టీ గుర్తు కనక, అది ఎలక్షన్ కోడ్ కి విరుద్ధం కనక మూసెయ్యాల్సిందే అన్నారట.
ఇది చూడగానే – గుళ్లో దేవుళ్ళ కాంగ్రెస్ మార్కు అభయ హస్తాలని
✋, దేవుళ్ళ చేతుల్లో వుండే బీజేపీ కమలా🌷లని, ఇళ్లలో వైఎస్సార్సీపీ సీలింగ్ 🔆ఫాన్లనీ, వినాయకుడి బీఎస్పీ ఏనుగు🐘తలని, టీ కొట్లలో జేఎస్పీ గాజు 🥛 గ్లాసుల్నీ, రోడ్లమీద తిరిగే టీడిపీ సైకిళ్ళూ 🚲, టీఆరెస్ కార్లనీ🚗, ఆకాశంలో ప్రజాశాంతి హెలి🚁కాప్టర్లనీ …. అన్నిటినీ కవర్ చేసెయ్యమంటారో, ఏంటో .. ఇదెక్కడి పిట్టరెట్టరా బాబూ అనుకున్నా. ఇంతలో పామిస్టుగారు మండ్య ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరికెళ్ళి మొరపెట్టుకుంటే, “మీ హస్తానికి✋ , కాంగ్రెస్✋హస్తానికి సంబంధంలేదు, అంచేత ముయ్యక్కర్లేదంచెప్పి అభయ✋హస్తం చూపారట. ఇలా ప్రపంచంలో ఏ వస్తువూ కనిపించకుండా కవర్ చేసెయ్యడం ఎంత పెద్ద పనో ఆయన సరిగ్గా గ్రహించడంతో పెద్ద అనర్ధం తప్పింది. అదలా ఉంచితే ఇలాంటి పిట్టరెట్టలు ఇంకేం నెత్తిన పడబోతున్నాయో అన్ని బ్రాంచ్ ల జాతకరత్నాలూ లాప్-టాపులూ అవీ ముందేసుకుని లెక్కలు కట్టడం మొదలెట్టారని, మొదలెట్టాలనీ కోరుకుంటున్నా. ఎందుకంటే తమ ప్రొఫెషన్నే దెబ్బ తీసే పిట్టరెట్టల్నయినా ప్రిడిక్ట్ చేసుకోలేకపోతే ఎట్టా? ఒకానొక బాపూ కార్టూన్లో చుట్టూ అందరూ చినుకు తగలకుండా తిరుగుతుంటే అదృష్ట తాయెత్తులు అమ్మేవాడొక్కడి నెత్తినే మబ్బు పట్టి వర్షం కురుస్తున్నట్టు ఉండదూ?
ఈ పోస్టుతో జ్యోతిష్యాన్ని అపహాస్యం చేసినట్టనిపిస్తే అలా అనిపించినవాళ్ళకి – జ్యోతిష్యం ఎగ్జాక్ట్ సైన్స్ కాదు అనే వాళ్ళనీ నేను సపోర్ట్ చెయ్యను. నా కంప్లైంట్ అంతా మిడి మిడి జ్ఞాన మిడతంభొట్లు జ్యోతిష్కులూ, పేపర్లో వచ్చిన పొలిటికల్ అనాలిసిస్లు చదివేసి, వాటి ప్రకారం గవ్వలనీ, అంకెలనీ కిట్టించి ఫ్యూచర్ చెప్పే శాస్త్రజ్ఞులూ … ఇలాంటి వాళ్ళ మీదే. పుట్టిన సమయం ఎంత ఎక్యురేట్ గా ఉంటే అంత ఎక్యురేట్ గా జాతకం చెప్పగలం అని చెప్పి మనిషిని చూడకుండానే అతని జాతకం సరిగ్గా చెప్పిన ఒక ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గారిలాంటి జ్యోతిష్కుల మీద నో కంప్లైంట్స్. ఇంతే సంగతులు. తన హిలేరియస్ కామెంటుతో ఈ టపాకి ఐడియా ఇచ్చిన సూర్యగారికి స్పెషల్ థాంక్స్ చెప్తూ బై 4 నౌ 🙋🏼‍♂️

🐥🐥

తిరుమలేశుడికి \|/ తిరునామం రాములోరితో🏹రాజకీయం🤫


స్టేట్ లెవెల్లో తిరుమలేశ్వరుడికే  తిరునామాలు పెట్టడంలో…..

Screenshot_20190225-152257_S Note.jpg

జాతీయస్థాయిలో రాములవారి పేర  రాజకీయాలు చెయ్యడంలో ….

ఆరితేరిపోయారు నాయకులు…

గుళ్లో దేవుడు మాట్లాడక ఊరుకుంటాడని వీళ్ళకి ధైర్యమో? నమ్మకమో? 🤔

ప్రజల గుండెల్లో దేవుడు కూడా అంతే అనుకుంటారా?

ఏమో మరి 🤔 😇

వోటరు దేవుళ్ళే తేల్చాలి మరి 🤗

బై 4నౌ

✋🤓

మోడీమేష్టారు సారీ చెప్పడవేంటి?అసలాయన సారీ చెప్పల్సినంత పెద్ద సమస్యేవుందీ దేశంలో?


NM apologises

Coutsey: Andhrajyothi

మోడీ మేష్టారు సారీ చెప్పడం ఏంటి? అసలాయన సారీ చెప్పల్సినంత పెద్ద సమస్య ఏముందీ ?

గురువు అద్వానీ నమస్కారాన్ని పట్టించుకోలేదని దేశమంతా తల్లడిల్లిపోయినా దాని గురించి బాధ పడినట్టు చిన్న హింట్ కూడా ఇవ్వనాయన,

డీమోనిటైజేషన్ టైములో వారానికి రెండువేల కోసం క్యూలల్లో జనం నానా తంటాలు పడుతుంటే సారీ అనిపించనాయన,

బాంక్ ఎక్కౌంట్ వున్న ప్రతి ఒక్కరూ ఆ ఎక్కౌంట్లో పడాల్సిన పదిహేనులక్షలు ఎప్పుడు పడతాయా అని నాలుగేళ్ల బట్టీ కళ్ళు వాచేలా వెయిట్ చేస్తున్నా కిమ్మనకుండా కూచున్నాయన,

ఉన్నట్టుండి సారీ చెప్పడమేంటి? అసలాయన సారీ చెప్పల్సినంత పెద్ద సమస్య ఏముందీ దేశంలో? అనిపించక తప్పదు కొందరికైనా. జనరలైజ్ చేసెయ్యడం ఎందుగ్గానీ నాకు మాత్రం అనిపించింది. అందుకే పై హెడ్డింగ్ అదే ఫలానా పేపర్లో కనిపించగానే చదివేశా. ఎగ్జాక్ట్‌‌లీ ఇదీ ఆ న్యూస్ –

//కోల్‌కతా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం విద్యార్థులకు క్షమాపణ చెప్పారు. విశ్వభారతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సందర్భంగా ఆయన శాంతినికేతన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు ఆయన మాట్లాడుతూ ‘‘అన్నిటికన్నా ముందు, విశ్వభారతి విశ్వవిద్యాలయం ఛాన్సలర్ హోదాలో నేను క్షమాపణలు చెప్తున్నాను. నేను వస్తున్నపుడు కొందరు విద్యార్థులు సైగలు చేశారు, తమకు తాగునీటి ఏర్పాట్లు చేయలేదని చెప్పారు. మీకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్తున్నాను’’ అన్నారు. ఈ స్నాతకోత్సవంలో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా పాల్గొన్నారు.// 
Coutsey: Andhrajyothi

ఆయనకి నేను ఫానూ కాదు, అలా అని యాంటీ కూడా కాదు, కానీ ఆయన యొక్క జెస్చర్ మాత్రం నాకు భలే నచ్చింది. ఆయన ఛాన్సలర్ హోదాలోనే చెప్తున్నానంటూ ప్రధానమంత్రి హోదాలో కాదని నర్మగర్భంగా చెప్పినట్టనిపించినా కూడా నచ్చింది.

మనం గుళ్ళో విగ్రహాన్ని చూసి అది విగ్రహమే అనుకునే జనాలం కాదు కదా! అది అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడనే అనుకుంటాం కదా!! అలాగే ఆయన నేను ఛాన్సలర్ హోదాలోనే చెప్తున్నానర్రోయ్ అంటూ హైలైట్ చేసుకున్నా మనం ఆయనకున్న ప్రధాని హోదానే పట్టించుకుంటాం, ఆ మాటలు ప్రధాని మాటలే అనుకుంటాం. అనుకున్నాం. అనుకుందాం.

ఆ మాటలు చెప్పి మోడీ మేష్టారు ఎందరో పాత ప్రధానులు చెయ్యని, రాబోయే ప్రధానులు చేస్తారో చెయ్యరో తెలియని ఒక గొప్ప పని చేసి ఒక ట్రెండ్ సెట్ చేసారని నాకనిపించింది.

విశ్వభారతి ప్రాంగణంలో విశ్వకవి ఆత్మ వింటుండగా ప్రధాని దేశంలో ప్రబలుతున్న మంచినీటి సమస్యలని, నానాటికీ అడుగంటుతున్న భూగర్భ జలాల సమస్యని ఎక్నాలెడ్జ్ చేసారు.

ఆ యూనివర్సిటీ విద్యార్ధులు మంచినీళ్ళు లేవని చేసిన సైగలని ఆయన దేశం నలుమూలలనించీ ప్రజలు చేసిన సైగలుగా గుర్తించారనిపించింది.

తద్వారా ఫేస్‌‌బుక్కులూ, వాట్సప్పులూ, టీవీ డిబేట్లూ, చివరికి బ్లాగులూ – వీటిల్లో ఎక్కడా కనిపించని, నిజానికవేంటో కూడా తెలీని జనాల సమస్యల్ని ఎక్నాలెడ్జ్ చేసారు.

ఇంక ఆయన మార్గదర్శకత్వంలో కేంద్రం, రాష్ట్రాలూ –

NM apologises

అందరి నీటి కష్టాలూ తీర్చేస్తారని ఆశించచ్చు. (అసలే వాళ్ళ సత్సంబంధాలు అదిరిపోతున్నాయి కూడాను)

ఇంక జనాభాలో ప్రతి మనిషికి-

గుప్పెడు మట్టి సంగతెలా వున్నా రోజూ చెంబెడు నీళ్ళు దొరికి ఆ విధంగా స్వచ్ఛభారత్ ప్రాజెక్టు కూడా సక్సెస్ అవుతుందని కూడా-

ఆశించచ్చు

ఆశిద్దాం

ఆశిస్తూనే ఉందాం.

ఇంతేసంగతులు.

బై4నౌ

🙏

 

వృద్ధపతీ ఏకపత్నీవ్రతః


కొందరు రాజకీయుల వ్యవహారం ఎలా ఉంటుందంటే….,, చెప్తా, ఎలావుంటుందో చివర్లో చెప్తా…

పాపం కలియుగ అశ్వమేధం(=హార్స్ ట్రేడింగ్‌‌) కుదరకపోయేప్పటికి –

స్పీకర్ పదవి యొక్క హుందాతనము,

పార్లమెంటరీ విలువలు,

సభామర్యాదలు,

సభా ఇదీ,

సభా అదీ,…

వగైరాలన్నీ గుర్తొచ్చిపడిపోతాయి వాళ్లకి. దెబ్బతో స్పీకర్ పదవికి పోటీపడట్లేదనేస్తారు. ఏకగ్రీవ స్పీకర్ ఎన్నిక ప్రజాస్వామ్య సాంప్రదాయమని సెలవిచ్చేస్తారు కూడా.

ఆ సభాపతి ఏకగ్రీవుడుగా వుంటాడా? లేక కిష్కింధాపతి సుగ్రీవుడౌతాడా? అసలే ప్రజాస్వామ్య “పరిరక్షకు”లందరూ కలిసి ఏర్పాటు చేసేస్తున్న ప్రభుత్వమయ్యే!! కిష్కింధ వాతావరణం లేకుండా ఉంటుందా? అది బుల్లి వెండితెరల మీద ఎలాగు చూస్తాం. ఇంతకీ –

ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతానేవుంటాయి. అది మామూలే కానీ ఓడయిన బండి బండైన ఓడని ఎక్కిరించడం ఎద్దేవా చెయ్యడం; దానికి vice versa మహా చిరాగ్గా ఉంటది, మనకి. ఆ చిరాకుతో –

వృద్ధపతీ ఏకపత్నీవ్రతః అని పూర్వీకులు చెప్పని ముతక సామెతొకటుంది. (అఫ్‌‌కోర్స్, దీని పూర్వాశ్రమ సామెతంత ముతకా, షావినిస్టిక్కూ కాదనుకోండి) అదుగో ఆ సామెత గుర్తొస్తుంది రాజకీయుల యవ్వారం చూస్తే; రాజకీయ శ్రీరంగనీతులు వింటుంటే.

ఇంతేసంగతులు. బై4నౌ

ఆదివారంపూట అప్రస్తుతప్రసంగం (ఆధారాల్లేవు కానీ…// ఆవులకి గుడ్‌న్యూస్, డ్రైవర్లకి ….??//ఏ కండల వీరుడో, క్రికెట్ నవాబో, ఇంకే పవర్ – కనెక్షన్…


ఆధారాల్లేవు కానీ అనుమానాలున్నాయిగా?

(సుమోటోగా టవర్‌ రేడియేషన్ సమస్య, ఆంధ్రజ్యోతి, 03-04-2017 06:36:36) హైదరాబాద్: సెల్‌ టవర్ల నుంచి వస్తోన్న రేడియేషన్ సమస్యను లోకాయుక్త సుమోటోగా స్వీకరించనున్నట్లు జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి వెల్లడించారు. దాని నుంచి వెలువడుతోన్న రేడియో ధార్మిక కిరణాలు కేన్సర్‌కు కారణమవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. ప్రముఖ ఎన్విరాన్‌మెంటల్‌ మెడిసిన్ నిపుణులు డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ సక్సేనా అధ్యక్షతన మాసాబ్‌ ట్యాంక్‌లోని గోల్కొం డ హోటల్‌లో ఆదివారం ఇంటెగ్రేటివ్‌ అంకాలజీ అప్‌డేట్‌ పై వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌నకు జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. ఆర్గానిక్‌ ఫుడ్‌ మంచిదని, ఎరువులతో పండుతున్న ఆహారధాన్యాల వల్లే ప్రజలు అనా రోగ్యం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. సెల్‌టవర్‌ నుంచి వెలువడుతు న్న రేడియేషన్ చుట్టు పక్కల ప్రజలపై, పశు, పక్ష్యాదులపై తీవ్రప్రభావం చూపుతోందని ఆయన గుర్తుచేశారు. 

బావుంది కానీ ఇదంతా తేల్చి సెల్ టవర్ల బదులు వేరే సేఫర్ టెక్నాలజీ వాడే వరకు ఎన్ని దశాబ్దాలు పడుతుందో. సెల్ బిజినెస్సులవాళ్ళు సామాన్యులా? అంత తేలిగ్గా, ఏ లాభం ఆశించకుండా టెక్నాలజీ మార్చడానికి?  ఒక్క సంగతి అర్ధం కాదు, ఎక్కడైనా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెడదామన్నా, గనుల్లోంచి యురేనియం ఖనిజం తీద్దామన్నా రేడియేషన్ బాబోయ్ అంటూ గగ్గోలుపెట్టే ఎన్జీవోలు, మేధావులూ,గట్రా సిటీల్లో అడ్డూఆపూ లేకుండా వెలువడే అదే రేడియేషన్ని పట్టించుకోరేంటో?  అది ప్రమాదకరం అని ఆధారాల్లేవు అంటారేమో. ఆధారాల్లేవు కానీ అనుమానాలు వున్నాయిగా? మరి ఎవరూ రీసెర్చ్ చెయ్యరేం?

గ్రీన్‌కార్డ్

Greencard

ఆవులకి గుడ్ న్యూస్, డ్రైవర్లకి ….??

(ఆవులను ఢీకొనకుండా హెచ్చరించే ఇండికేటర్:ఆంధ్రజ్యోతి 09-04-2017 15:16:35గాంధీనగర్) : రోడ్లపై ప్రయాణించే వాహనాలు ఆవులతో ఢీకొనకుండా హెచ్చరించే వ్యవస్థను గుజరాత్ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించారు. ఆవులు వాహనానికి అడ్డంగా ఉన్నాయా? వాటి వల్ల వాహనానికి ప్రమాదం ఉందా? అనే అంశాలపై  ఈ అలర్ట్ సిస్టమ్ హెచ్చరిస్తుంది. ఆడియో లేదా వీడియో ఇండికేటర్ వాహనం డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది.డ్యాష్ బోర్డ్ కెమెరా, ఆల్గోరితం సహాయంతో ఈ వ్యవస్థ పని చేస్తుంది. పరిశోధకులు మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో రోడ్డు సదుపాయాలు అవసరానికి తగిన స్థాయిలో లేవన్నారు. తాము రూపొందించిన వ్యవస్థను వివిధ సందర్భాల్లో ఆవులు సంచరించే దృశ్యాలుగల వీడియోలతో అనేక రకాలుగా పరీక్షించినట్లు తెలిపారు. 80 శాతం సందర్భాల్లో ఆవులను ఈ వ్యవస్థ గుర్తించగలిగిందని చెప్పారు.

న్యూటన్ మహాశయుడి ఇంట్లో పిల్లి పిల్లల్ని పెట్టి ఏడు గదులు తిప్పుతోందిట. గది నుంచి గదికి ఒక్కో పిల్లని మోసుకేల్తున్న దాని అవస్థ చూసి న్యూటన్ మేష్టారు అన్ని గదుల గోడలకి ఏడేసి కన్నాలు చేసారట. ఏడు పిల్లలకి ఏడు కన్నాలన్న మాట. ఈ ఆవు-ఆన్-ద రోడ్ ఇండికేటర్ కనిపెట్టినవాళ్ళెవరో న్యూటన్ మేష్టారి అంశావతారాల్లా వున్నారు. ఆవులు, ఆంబోతులు రోడ్డు మీదకి రాకుండా కట్టేసుకోమని వాటి ఓనర్లకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తే పోలా? ఇంకోటి, రోడ్డు మీద ఆవుఉందో లేదో కనిపించనంత ఘోరంగా ఉంటుందా డ్రైవర్ ఐ సైటు? ఎనభై శాతం సందర్భాల్లో ఆవుల్ని గుర్తిస్తుందిట ఈ సిస్టం. డ్రైవర్ సరిగ్గా చూసుకుంటే వందశాతం సేఫ్ కాదూ? ఏంటో? చదవేస్తే వున్న మతి పోయిందిట ఎవరికో. ఉట్టి ఆవులే కాకుండా రోడ్డు మీద అడ్డంగా ఏమున్నా గుర్తించి అలర్ట్ చేసే సిస్టమ్స్ ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలన్నిటికీ అత్యవసరం. ముందా సంగతి చూస్తే ఉపయోగం. 

ఏ కండల వీరుడో, క్రికెట్ నవాబో, ఇంకే పవర్ – కనెక్షన్ వున్నవాడో ఇది చూస్తే ఇంకేమన్నా ఉందా?

Vanya

సంగారెడ్డి: మెదక్‌ జిల్లా రామాయంపేట రహదారిపై ఉన్న గంగాపూర్‌ గ్రామం పోచారం అభయారణ్యం పరిధిలోకి వస్తుంది. రాత్రివేళల్లో ఈ ప్రాంతంలో పులులు, చిరుతలు, జింకలు సహా ఇతర వన్యప్రాణులు పెద్ద సంఖ్యలో సంచరిస్తుంటాయి. రహదారిని దాటే క్రమంలో ఇటీవల తరచుగా ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో ఈ మార్గంలో చీకటిలో ప్రయాణించే వాహనచోదకులను అప్రమత్తం చేసి.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుక రేడియం వెలుగుల్లో ప్రకాశవంతంగా కనిపించేలా స్థానిక రహదారి చెంత ఇలా చిరుతపులి బొమ్మను ఏర్పాటు చేశారు. 

ఆవులకి యాక్సిడెంట్లు కాకుండా సిస్టం డిజైన్ చేసిన వాళ్ళంత తెలివితేటలూ ఈ బోర్డు పెట్టిన వాళ్ళకీ వున్నట్టున్నాయి. Wild Animal Crossing అని అన్ని దేశాల్లోనూ బోర్డ్లు వుంటాయి. అదికాదు సమస్య. మనదేశంలో ఏ కండల వీరుడో, క్రికెట్ నవాబో, ఇంకే పవర్ – కనెక్షన్ వున్నవాడో ఆ దారిలో వెళ్తే వాళ్లకి  డిన్నర్‌కి కావాల్సిన దుప్పులూ, సరదాకి ఒకటో రెండో పులిచర్మాల్నీ, పనిలో పనిగా మెళ్ళో వేసుకోడానికి పులిగోళ్ళు – ఇవన్నీ దొరికే షాపింగ్ సెంటర్లా కనిపిస్తుంది. ఆపైన లాయర్లకి, వాళ్ళ చుట్టూ అల్లుకున్న “యాన్సిలరీ ఇండస్ట్రీ”కి పండగ. పది, ఇరవై ఏళ్ళపాటు.

బై4నౌ

😊

1.కోపం వచ్చేస్తోందీ, శాపం పెట్టేస్తానూ..// 2.ఉరిమురిమి ఉర్జిత్‌పటేల్ మీద పడ్డట్టు..// 3.మూడోకంటికి కనపడదు, మూడోచెవికి మాత్రం వినిపిస్తుంది, ఏంటదీ?


🌏న్యూస్🌏

Rahul Gandhi said, “If they allow me to speak in Parliament, there will be an earthquake Speaking to reporters outside Parliament, Mr. Gandhi said that his party wants debate on demonetization so that the truth can come to the fore, but the government is running away from it. The Congress Vice President said that when he gets a chance to speak about demonetization in the House, “the Prime Minister will not be able to even sit there”

😎వ్యూస్😊

 “కోపం వచ్చేస్తోందీ, శాపం పెట్టేస్తానూ… కోపం వచ్చేస్తోందీ, శాపం పెట్టేస్తానూ…కోపం… కొ..కో.. క్కోపం.. వచ్చేస్తోందీ…”- నిత్యానంద మహర్షి ఉవాచ.

నిత్యానంద ఎవరో గుర్తొచ్చిందా? రాక చస్తుందా? నిత్యానంద నామధేయం అంత పాపులర్ అయింది ఆ మధ్య. బట్, సారీ ఆ నిత్యానంద కాదు ఆ మాటలన్నది, నిత్యానంద మహర్షి అలియాస్ రమణారెడ్డి in “లవకుశ (1963)” అన్నాడు. ఆ సన్నివేశాన్ని ఎవర్‌‌గ్రీన్ లవకుశ సినిమాలో చూడాలేకానీ ఇక్కడ వివరించడం కుదరదు. ఆ నిత్యానందులవారు ఇక్కడెలా వచ్చారో సినిమా చూసినవాళ్లకెలాగో తెలుసు, చూడనివాళ్ళు అర్జెంటుగా లవకుశ చూడాల్సిందిగా మనవి. రాహుల్‌కీ చూపించేస్తే మరీ సంతోషం.

🌏న్యూస్🌏

Union minister Giriraj Singh on Sunday said after ‘notebandi’ (demonetisation), there is an urgent need to make laws for ‘nasbandi’ (sterilisation) in the country. Singh is the second senior BJP leader in Bihar who has advocated sterilisation after demonetisation. Last week, former union minister and senior BJP leader Sanjay Paswan said sterilisation will help control the population of the country. 

😎వ్యూస్😊

ఇప్పటిదాకా పాకిస్తాన్ పైనా, నల్లకుబేరుల మీదా సర్జికల్ స్ట్రైక్స్ అయ్యాయి. ఈ రెండు సర్జరీలు సక్సెస్సా కాదా కాలం, వోట్లే తేల్చాలి. కాలం ఇచ్చే తీర్పు, వోటర్లిచ్చే తీర్పు వేరువేరుగా వుండొచ్చు. రెండో ప్రపంచయుద్ధంలో మిత్రదేశాల విజయానికి సారధైన విన్స్టన్ చర్చిల్‌ని ఆ వెంటనే జరిగిన ఎలక్షన్స్‌లో జనం ఇంటికి పంపించారు. కెమికల్ & న్యూక్లియర్ ఆయుధాల్ని టన్నులకొద్దీ తయారుచేయించి పాతాళంలో పాతిపెట్టాడని సద్దాంపై యుద్ధం చేసి  నానా గందరగోళం సృష్టించిన జార్జిబుష్‌కి రెండోసారి అధ్యక్షపదవి అర్పించారు. కాలానికి పక్షపాతం లేదు, కానీ ఆర్ధికపక్షవాతం బారినపడ్డ ప్రజలకి పక్షపాతం ఉండొచ్చు. కాలం తీర్పు ఫలానా డేట్ అంటూ ఏఁవుండదు (అదే డేట్ కదా!!) వోటర్ల తీర్పుకి మాత్రం వుంటుంది. డేటు మారినా వోటు మారునా? నోటు తీస్కునీ వోటు వెయ్యనా అని పాడుకుంటూ ఎంచక్కా వెళ్లి తనేవారికి వోటెయ్యాలనుకుంటే వాళ్లకి వేసేసి ఫ్యూచర్లో రాబోయే సర్జికల్ స్ట్రైకుల గురించి ఆలోచించుకుంటూ, దడుచుకుంటూ ఇంకో ఐదేళ్ళు గడిపేస్తాడు. సో, ఈ సర్జికల్ స్ట్రైకులపై వోటర్ల తీర్పు 2019లో, ఇప్పుడు నిజమైన, అచ్చమైన, అసలుసిసలు సర్జికల్ స్ట్రైక్ (కు.ని కత్తులు,కత్తెర్లతో పని కదా) కూడా ఒకటి వేసెయ్యమని మంత్రివర్యులు ఇచ్చిన ఉచితసలహా నచ్చేసి, ఎన్డీయే ప్రభుత్వం డాక్టర్లని కత్తులు కత్తెర్లు పట్టుకోమని హుకుం జారీ చేసేస్తే? డాక్టర్ వర్యులు కూడా అత్యుత్సాహంతో సంజయ్ గాంధీ”మహాత్ము”ణ్ణి తల్చుకుని రంగంలోకి దిగిపోతే!!??!! అసలే మన డాక్టర్లకి (అందరూ కాదు లెండి) సర్జరీకి పోస్ట్‌మార్టెమ్‌కి తేడా తెలీట్లేదయ్యే!!! కాస్మెటిక్ సర్జరీ పేరుతో కాళ్ళు కోసేసే ఘనత, అప్పుడే పుట్టిన పాపాయిలని ఎలకల మధ్య వదిలేసే ప్రతిభ కలిగినవాళ్ళయ్యే!!! అలాంటివాళ్ళు కు.ని.ల బదులు ఖూ.నీ.లు చేసేస్తే? అసలే కొత్తతరం ప్రొఫెషనల్సు తమ తెలుగుభాషాసామర్ధ్యాన్ని ఐ.సీ.యూలో వెంటిలేటర్ మీద జాగ్రత్తగా వుంచుతారేమో కు.ని. కి ఖూ.నీ కి తేడా తెలుస్తుందో లేదో!!! అలాంటివాళ్ళ  నిర్వాకాలకి బ్లాక్‌మనీ ఉరుము ఉరిమురిమి ఉర్జిత్‌పటేల్ మీద పడ్డట్టు (పడ్డానికి ఇంకా టైమున్నట్టుంది!) కు.ని దాడుల సలహా ఇచ్చినందుకు ప్రజలు మంత్రిగార్ని 2019లో పట్టుకుని….పట్టు కు.ని. … తెగ తిట్టుకుంటారేమో కదా!?!

🌏న్యూస్🌏

న్యూఢిల్లీ : నవంబరు 8వ తేదీ రాత్రి ప్రధాని పెద్ద నోట్ల రద్దు చేస్తూ సంచలన నిర్ణయం ప్రకటించడానికి ముందు ఎటువంటి కసరత్తు జరిగింది? ఈ నిర్ణయాన్ని రహస్యంగా ఎలా ఉంచగలిగారు? ఈ విషయంపై ఇప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మోదీకి అత్యంత నమ్మకస్తుడైన ఓ ఉన్నతాధికారి, మరో అయిదుగురు సభ్యుల బృందం ప్రధాని నివాసంలోనే నోట్ల రద్దు అంశంపై కసరత్తు చేశారు. వీరికి సమాచారం, ఆర్థిక అంశాల విశ్లేషణలో నిపుణులైన యువ బృందం సహకారం అందించింది. హస్‌ముఖ్ అదియా సెప్టెంబర్ 25న రెవెన్యూ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. _ _ _ _ _ _ _ _ _ . అదియా నాయకత్వంలోనే ప్రధాని నివాసంలో రెండు గదుల్లో నోట్ల రద్దుపై కసరత్తు మూడోకంటికి తెలియకుండా కసరత్తు జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

😎వ్యూస్😊

దీన్నిబట్టీ ఏం తెలుస్తోందంటే …

ఆ కసరత్తేదో మూడోకంటికి తెలీకుండా మాత్రమే జరిగిందనీ,

మూడోచెవికి మాత్రం అది వినబడిందనీ,

ఆ మూడోచెవికి నోరు కూడా ఉండాలనీ – ఉంటుందనీ – ఉందనీ,

నువ్వుగింజ కూడా నానని ఆ నోరే ఈ విశ్వసనీయవర్గాలకి ఉప్పందించిందనీ..   

లీకువీర లేవరా! మైకు పట్టి సాగరా!! మీడియాకి లీకులిచ్చి జోకులెన్నొ పేల్చారా!!!ఆ అ ఆ అ ఆ ఆ !! ఆ అ ఆ అ ఆ ఆ!!

ముందు🇧🇴జనగణ🇧🇴 ధ్వని, వెంటనే 💥రణగొణధ్వని💣// IAS officer spends Rs.500 on wedding // దేవుడు దిగొచ్చి ఎవర్నైనా పలకరిస్తే అది వార్త… // అమెరికా అధ్యక్షుడు రెండు🐔 సీమకోళ్లను🐓అధికారికంగా క్షమించి…


🌏న్యూస్🌏

The Supreme Court on Wednesday directed that cinema halls across the country must play the national anthem before the screening of a film and people should stand up as a mark of respect. The court also directed that the national flag should be shown on screen when the anthem is played. “People must feel this is my country and this is my motherland,” a bench of justices Dipak Misra and Amitava Roy said while stressing that it is the duty of every citizen of the country to show respect to the national anthem and the flag.

😎వ్యూస్😊

సుప్రీం కోర్టు తీర్పు బ్రహ్మాండం. మూడురంగుల జెండా మళ్ళీ సినిమాతెరల మీద జాతీయగీతానికి నాట్యం చేస్తుంటే దేశభక్తితో ఉప్పొంగనివాళ్ళెవరు? ఉద్వేగంతో గుండెలు నిండనివాళ్ళెవరు? కానీ……కానీ….కానీ..సినిమా చివర జనగణమన వినిపించడం డెబ్భైరెండు/మూడు ప్రాంతాల్లో ఆగిపోయినట్టుంది. ఐతే అప్పటివరకూ 90% సినిమాలకి ప్లాట్లు త్రేతాయుగంనుంచి దిగుమతి అయినవే. విలన్లు, వాంపులు కూడా కొమ్ములు, కోరలు మినహాయించి అన్ని విధాలా రాక్షసరాక్షసీమణుల్లాగే వుండేవారు. అందువల్ల సినిమా చివర ప్రేక్షకులు ప్రశాంతచిత్తంతో జనగణమన వినే ఛాన్సుండేది. తరవాత్తరవాత సినిమా రాక్షసరాక్షసీమణులంతా ధైర్యం చేసి జనసినీజీవనస్రవంతిలో కలిసిపోవడం మొదలుపెట్టారు. ఆ తరవాత….. the less we talk the better, సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సుప్రీం తీర్పు నేపధ్యంలో ఈ కాలపు మాస్‌మసాలా పాకేజ్ మూవీలకెళ్తే పరిస్థితేంటి? ముందు జనగణధ్వని, ఆ వెంటనే  ఐటండాన్సులు, మసాలాడైలాగుల రణగొణధ్వనులు వినాలి; సినిమా కధకి, స్క్రిప్ట్‌కి ‘అవసరం’ కాబట్టి నిజంగా అనవసరమైనా సరే చేసే ఎక్స్‌పోజింగులు, లిప్-లాకులు ఎంజాయ్ చెయ్యాలి; ఫాక్షన్‌లు, యాక్షన్ల పేరిట చూపించే రక్తపాతాన్ని కళ్ళారా చూసి తరించాలి; ధూమ/మద్యపానాలు ఆరోగ్యానికి హానికరం అంటూనే హీరోగారు ఆ పన్లన్నీ హీరాయిగ్గా  చేసేస్తుంటే చూసి బైటికెళ్ళాక ఆయనగార్ని ఇమిటేట్ చెయ్యాలనిపించచ్చు. నేరాలు చేసి చట్టం కళ్ళు కప్పి పెద్దమనుషుల్లా చెలామణీ అయిపోవడం ఎలాగో కొత్త ఐడియాలు వస్తాయి, వాటిని అమలు చేసేవాళ్ళుకూడా వుంటారు. ఒకపక్క జాతీయగీతానికి, జెండాకి గౌరవం మరో పక్క ఇలాంటి సినిమాలు చూసి ఆనందించాల్సిన అవసరం – రెండూ కల్సి ప్రజల “మనోభావాలు” ఎంత నలిగిపోతాయో ఏంటోనని  కోర్ట్లు ఆలోచించాలేమోనని ప్రజలు కాస్త ఆలోచించాలేమోనని……..

ఫైనల్‌గా కొశ్చనేంటంటే, జాతీయగీతం+జెండా కలిగించే స్ఫూర్తికి, మన కాంటెంపరరీ కమర్షియల్ సినిమా పుట్టించే భావోద్వేగాలకి పొసగుతుందా అని. మన జెండాకి సూటయ్యేలా సినిమాలుండాలేమో కదా!?! కాదా??అఖ్ఖర్లేదా???

🌏న్యూస్🌏

Andhra IAS officer spends Rs.500 on her wedding, returns to duty within 48 hours

😎వ్యూస్😊

నాకు తెల్సి చరిత్రలో అతి తక్కువ ఖర్చయ్యింది గుండమ్మకధలో ఎన్టీఆర్-సావిత్రిల పెళ్లికే. రూపాయి-ముప్పావలాతో రిక్షాలో ఊరేగింపుతో సహా శాస్త్రోక్తంగా పెళ్లి చేయించిన ఘనత రమణారెడ్డిది. ఆ తర్వాత, అంటే 1962 (గుండమ్మకధ రిలీజ్) తర్వాత యాభైనాలుగేళ్ళకి, పెళ్ళికి ఐదొందలంటే ఆనాటి రూపాయి ముప్పావలాకి సమానం అనుకోవచ్చేమో. ఐదొందలకోట్లు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్న రోజుల్లో దానికి కోటిరెట్ల తక్కువ ఖర్చుతో పెళ్లి తతంగం పూర్తి చెయ్యడం కుబేరులనుంచీ కుచేలుల వరకూ అందరికీ ఆదర్శప్రాయం.  

🌏న్యూస్🌏

ప్రధానమంత్రి _ _ _ సోదరుడు _ _ _  శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఏఈవో కృష్ణారెడ్డి వారికి స్వాగతం పలికారు. స్వామిఅమ్మవార్లకు _ _ _  ప్రత్యేక పూజలు నిర్వహించారు.

😎వ్యూస్😊

దేవుడు దిగొచ్చి ఎవర్నైనా పలకరిస్తే అది వార్త కానీ ప్రధాని బ్రదరుడైనా, రాష్ట్రపతి తాతగారైనా, చీఫ్‌మినిస్టర్ చెల్లెలైనా ఓ గుడికెళ్లి దేవుడికి దణ్ణం పెట్టుకుంటే అది న్యూస్ ఎలా అవుతుందో మన మీడియాకీ, ఆ దేవుడికీ తప్ప ఎవరికీ అర్ధంకాదు.

🌏న్యూస్🌏

వాషింగ్టన్‌: దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొనే కార్యక్రమం(థాంక్స్‌గివింగ్‌ రిచ్యువల్‌)లో భాగంగా అమెరికా అధ్యక్షుడు ఒబామా గురువారం రెండు సీమకోళ్లను అధికారికంగా క్షమించి విడిచిపెట్టారు. 18 వారాల వయసు, 40 పౌండ్ల బరువున్న ఈ సీమ కోళ్లకు ఐవా స్కూలు పిల్లలు సూచించిన పేర్లను ఒబామా పెట్టారు.

😎వ్యూస్😊

“ఒకపక్క రోజుకి లక్షలాది చొప్పున కోళ్ళని, మేకల్ని, దున్నల్ని… గుటుక్కుమనిపించేస్తూ మనమే ప్రతి రోజు ప్రతి క్షణం వీళ్ళని క్షమించాల్సింది పోయి వాళ్ళు మనకి  క్షమాభిక్ష పెట్టడమేంటో,” అని ఆ కోళ్ళకి తెలిసే/అడిగే ఛాన్సే లేదు. కోళ్ళకేనా క్షమాభిక్ష మాక్కూడా ఆ రాయితీ ఇవ్వచ్చు కదా అని అడిగే ఛాన్సు మేకలకి, దున్నలకి, పందులకీ లేదు. ఆఫ్ కోర్స్, వంకాయలకీ, ఉల్లిపాయలకి, తోటకూరకి, కాఫీపొడికి కూడా లేదు. కానీ మనం వారానికోసారో, ఏకాదశికో ఉపవాసం, శనివారం ఫలహారం, శాకాహారంలాంటివన్నీ పాటించి అమెరికన్ ప్రెసిడెంట్ పెట్టే క్షమాభిక్ష కంటే గొప్ప పని చేస్తున్నాం. అవి మనకి ప్రాణభిక్ష పెడుతుంటే మనం వాటికి క్షమాభిక్ష పెట్టడం ఏంటి అని అమెరికన్లకి అనిపించదో ఏంటో? కనీసం క్షమాభిక్ష అనే బదులు ప్రాణభిక్ష అంటే కొంత నయం.

ఒక మెకానికల్ ఇంజినీర్ 👀 దృష్టిలో👀 బ్లాక్‌మనీ (🚅 A Mech.Engineer’s 🚗 idea of BlackMoney)

🌏…ఇద్దరు ‘మోడర్న్’ దేవుళ్ళకి భక్తితో బిజినెస్ టైకూన్లు, పొలిటికల్ ఐకాన్లు సమర్పించిన…🌏

ఏడుపొస్తున్నా చచ్చినట్టు నవ్వక తప్పదు😂 – నవ్వాగక ఛస్తున్నా నోర్మూసుకు ఏడ్వక తప్పదు😷😉