Category Archives: నో.వా.చే.రా

వాళ్ళా? వాళ్ళూ …వాళ్ళూ …వ్..వాళ్ళు..మ్.. మను..


హిట్లర్ , స్టాలిన్, గడాఫీ, ఇదీ అమీన్, సద్దాం –> నరహంతక నియంతలు. మిలియన్ల మందిని పొట్టనపెట్టుకున్నారు.

పులి, సింహం, మొసలి, షార్క్ –> క్రూరమృగాలు.

ఈగలు, దోమలు, ఎలకలు, పందులు –> వైరస్ లు, బాక్టీరియాలని వ్యాప్తిచేసే జీవులు. కలరా, మలేరియా, ప్లేగు, మెదడువాపులాంటి డేంజరస్ వ్యాధులు కలిగిస్తాయి.

పేను, నల్లి, మిణ్ణల్లి –> పేరసైట్స్. అసహ్యమైన బతుకు బతికే రక్తపిపాసులు.

తుంగ, గరిక, వయ్యారిభామ –> కలుపు మొక్కలు. మంచి పంట పండకుండా చేసే పనికిరాని మొక్కలు.

మరి వీళ్ళూ –

సారా, సిగరెట్, బీడీ తయారుచేసే/అమ్మే/అమ్మనిచ్చేవాళ్ళు…

పోర్నోగ్రాఫర్స్, హ్యూమన్ ట్రాఫికర్స్, డ్రగ్ ట్రాఫికర్స్ … వీళ్ళందర్నీ పట్టుకోకుండా వదిలేసే అధికారులు… పట్టుకున్నా బడాబాబుల “దక్షిణలు” అందుకుని కేసుల్ని మసిపూసి మారేడుకాయ చేసే అవినీతిపరులు…

సెన్సేషన్ కోసం, టీఆర్పీల కోసం వార్తలు సృష్టించే మీడియా, సెన్సేషన్ పాతబడగానే అసలు సమస్యని “మరిచిపోయే” “సీనియర్” జర్నలిస్టులు

నదులు,సముద్రాల్నీ, మనసుల్నీ కలుషితం చేస్తున్నవాళ్ళు ….

మతం పేరుతో యుద్ధాలు, మూఢనమ్మకాలవల్ల శిశుహత్యలు చేసేవాళ్ళు …

రాజకీయాన్ని వ్యాపారం చేసేవాళ్ళు ….

వీళ్ళంతా ఎవరు?

వాళ్ళా? వాళ్ళూ …వాళ్ళూ …వ్..వాళ్ళు మనుషులూ!

మరి ముందు చెప్పిన కలుపుమొక్కలు, పేరసైట్సూ, వ్యాధికారక జీవులూ, క్రూరమృగాలు, నరహంతక నియంతలకీ వీళ్ళకీ తేడా ఏంటి?

అదా? అదీ.. అదీ .. అదే .. తెలీట్లేదు!

నీకు తెలియంది అదొక్కటే కాదు, ఇంకా చాలా వుందని ఇప్పుడే తెలిసింది. కానీ ఆ సంగతి నీకు తెలిసేదెప్పుడో??? అది మాత్రం తెలీదు 😉

🤪🤪🤪🤪🤪

ఒక దున్న🐃, ఒక సింహం🦁, ఒక👩‍🚀👩‍🚒 అతివ🤱👰


బ్లాగ్-లోక గురుబంధుమిత్రులందరికీ 🪔🌻⚡విజయదశమి శుభాకాంక్షలు🪔🌻⚡.

అణువు నుంచీ ఆకాశం వరకూ …..

అంతరంగం నుంచీ అంతరిక్షం వరకూ …..

అంతటా వ్యాపించిన ప్రకృతి (నామ,రూప, పదార్థాల సమాహారం) పురుషులు (జాగృతి = చైతన్యం = జ్ఞానం = ఆత్మ) ఒకరినొకరు గుర్తించి, ఒకరు లేకుండా మరొకరి అస్థిత్వానికి ఆధారం, అర్ధం లేవని తెలుసుకున్న రోజు విజయదశమి అని …

ఈ తెలుసుకునే ప్రాసెస్ లో ప్రకృతి -పురుషులు పడిన స్ట్రగులే తొమ్మిది రోజుల యుద్ధం అని …

తమోగుణాన్ని రజోగుణం, రజోగుణాన్ని సత్వగుణం డామినేట్ చెయ్యాల్సిన అవసరాన్ని, ఎత్తి చూపడమే దున్నపోతుని చెండాడుతున్న సింహం, ఆ సింహాన్ని అధిరోహించి అదుపులో వుంచిన దుర్గాదేవిల వెనకవున్న సింబాలిజం, అంతరార్ధం అని …

… అంటున్నాయి ఇవాళ అంతరంగ “తరంగాలు”.

సమస్తదేవతాశక్తుల సమన్వయ రూపమైన దుర్గ స్త్రీ రూపంలో ఎందుకుందని అడుగుతున్న ఆలోచనా’తరంగాల’కి ….

సమాజం కానీ, సంస్కృతి కానీ, ప్రభుత్వం కానీ ఇవన్నీ జీవ చైతన్యానికి, మానవ బుద్ధి వికాసానికి ప్రతీకలు అనుకుంటే వీటన్నిటిలో పురుష సహజమైన ధృఢత్వం, గాంభీర్యాలకంటే స్త్రీ సహజమైన లాలిత్యం, ప్రేమ, మమకారాలు ఒక్క పిసరు ఎక్కువ మోతాదులో వుండాలని సూచించడమే దుర్గారూపాన్ని దర్శించిన ద్రష్టల ఆంతర్యం అయ్యంటుందని అంతఃపరావర్తన (Internal Reflection) పొందిన అం”తరంగాలు” సమాధానం చెప్తున్నాయి.

పురుషాధిక్య సమాజంలో స్త్రీకి ఇవ్వాల్సిన గౌరవాదరాలు ఏమిటో భవిష్యత్తు (అంటే, ఈనాటి గర్ల్ ఛైల్డ్ పరిస్థితి) చూసిన ఋషులు ఈ విధంగా చెప్పారేమో!?! అనుకుంటున్నాయి హృదయాం”తరంగాలు”.

ఇలాంటి ఆలోచనలు వదిలేసి మహిషాసుర మర్దనలో కుల స్పర్ధలని, మనిషి అభ్యుదయానికి పనికిరాని రాజకీయాలని వెతుక్కోవడం జగన్మాతకి నచ్చదేమోనని ముక్తాయిస్తున్నాయి విచక్షణాం”తరంగాలు”.

మరోసారి విజయదశమి శుభాకాంక్షలతో …

బై4నౌ🙏😊

ఎ forఎన్విరాన్మెంట్; ఏfor ఏకదంతం


Ganesha is LordSiva’s spiritual & environmental msg to world. ElephantEcology&its corridors are important for Him. శివుడు వినాయకుడికి అమర్చిన ఏనుగు తలలో ఆధ్యాత్మిక రహస్యం, పర్యావరణ ప్రవచనం – రెండూ చొప్పించాడు. ఆధ్యాత్మికత వున్న చోట పర్యావరణం బావుంటుంది. మంచి, పరిశుభ్రమైన ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికత పెరుగుతుంది.

ఆధ్యాత్మిక పర్యావరణం కావాలంటే పర్యావరణఆధ్యాత్మికత పెరగాలి.

ఏనుగుని, దానికి అవసరమైనంత అడవిని సంరక్షించి పెంచితే మంచిదని మనుషులు గ్రహించాల్సిన రోజు వస్తుందని శివుడికి తెలుసని తెలుస్తోంది, గ్రహించి పరిస్థితిని మార్చేరోజు ఎప్పుడొస్తుందో చెప్పాడా మరి?? భక్తులు, ప్రవచనకర్తలు, పీఠాధిపతులకి చెప్పేవుంటాడు. వాళ్ళు మరి రియల్ ఎస్టేట్ వాళ్ళకి, యురేనియం అధారిటీకి, మైనింగ్ మాఫియాకి, ఇసుక హిరణ్యాక్షులకి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటుకీ ఎప్పుడు చెప్తారో !!!అసలు చెప్తారో చెప్పరో, చెప్పే ధైర్యం వుందో లేదో!! హేఁవిఁటో!!

కరోనాకి🤓 హోమియోపతి, అల్లోపతి, అల్లం-వెల్లుల్లోపతి, పసుపోపతి, ఎండోపతి ….


ఛస్తుంటే సంధి మంత్రంలా నీ సుత్తి పోస్టులేంట్రా అనకండి. శొంఠిపిక్కల కషాయంతో మొదలెడితే హోమియోపతి, అల్లోపతి, అల్లం-వెల్లుల్లోపతి, పసుపోపతి, ఎండోపతి (అదే ఎండలో నుంచోడం), నీడోపతి (నీడలో పడుకోడం, ఇదింకా ఏ వైద్యనారాయణుడూ ప్రకటించలేదు), జానీవాకరోపతిలకి వేంకటాచలపతిని కూడా జోడించి సోషల్ మీడియాలో తెగ హోరు పుట్టిస్తుంటే పెరిగిన చిరాకుకి –

కోట్లమందికి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలున్నాయనే అంచనాలు కలిగించిన ఆందోళనకి –

మన నాయకుల పారాసిటమాల్ + బ్లీచింగ్ పౌడర్ రెమెడీలు పుట్టించిన ఫ్రస్ట్రేషన్ తోడై –

చివరికి నాకే కొత్త కొత్త ఐడియాలు పుట్టుకొస్తన్నై. వాటిలో శాంపిల్ కి ఒక ఐడియా. మన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అన్ని రకాల వైద్యవిధానాలనీ ఇమిడించి ఎవరికిష్టమైన రెమెడీ వారికి అందించీ కరోనాని ఎదుర్కుని గెలిచే ఐడియా అనమాట. అదేంటంటే, ఇదుగో ఇదీ 👇, ఇలా రాసి వాట్సప్ లో పెట్టా.

నాదో ఉచిత సలహా. ఎవరికి ఎలాంటి వైద్యం కావాలో ముందే సెలక్ట్ చేసుకోవాలి, తరువాత ఛాయిస్ మార్చడం కుదరదు అని హెల్త్ మినిస్టర్స్ ఒక స్టేట్మెంట్స్ ఇవ్వాలి.
Eg.
అల్లం, పసుపు చాలు అనేవాడికి సింప్టమ్స్ పోయే వరకు అవే ఇస్తారు.

ఎండలో నుంచుంటే చాలు అనేవాణ్ణి వైరస్ వదిలే వరకూ ఎండలో నిలబెడతారు.

పారసిటమాల్, బ్లీచింగ్ పౌడర్లని నమ్మేవారికి అవి ఫ్రీగా సప్లై చేస్తారు.

అంతే ఇంకే ట్రీట్మెంటూ వుండదు.

దెబ్బకి మూడు లాభాలు కలుగుతాయి.

1.హాస్పిటల్సూ, మెడికల్ స్టాఫూ ఓవర్లోడ్ అవ్వరు.
2.జనతా కర్ఫ్యూ సక్సెస్ కూడా అవుతుంది.
3.వాట్సప్ కూడా ఓవర్లోడ్ అవ్వకుండా వుంటుంది.

ఇది ఒక ఫ్రెండుకి రుచించలేదు, వెటకారం అనిపించింది. “మన కిందకి నీళ్ళొచ్చే వరకూ వెటకారం మానం మనం,” అన్నాడు.

“నీళ్ళు కిందకి రావడం ఏంటి? పీక వరకూ ములిగి వుంటే 😆.
ఐనా కర్ఫ్యూలు, క్వారంటైన్లూ తప్పించుకునేవాళ్ళనీ,
ఇన్ఫెక్ట్ అయినా వార్డ్ లోంచి తప్పించుకునేవాళ్ళనీ, జనం భయాన్నీ, అమాయకత్వాన్నీ బిజినెస్ ప్రమోషన్ కోసం వాడుకునేవాళ్ళనీ చూసి వెటకారాలూ, మిరియాలూ నూరక ఊరకయుండుట ఎలా మిత్రమా!!?!!,” అన్నా.

“సరే, నీ ఇష్టం వచ్చినట్టు ఏడు,” అని వదిలేశాడు. అంతేసంగతులు, బై4నౌ 🙏🤓🙏

ఢిల్లీలో “రామాంజనేయ”🏹🙏🐵 యుద్ధం; గెలిచిన”హనుమంతుడు”✌🏽


ఈ పాలిటిక్స్ వున్నాయి చూశారూ, టీకాలులేని virusలాంటివి. ఒకసారి పట్టుకుంటే వదిలే ప్రశ్నే లేదు. లేకపోతే ఏంటి, ఒకపక్క కరోనా వైరస్ గడగడలాడిస్తున్నా ఢిల్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ కోసం ఆత్రం తగ్గడంలేదు. మా వూళ్ళో నలభైఐదో కరోనా కేసు కన్ఫర్మ్ అయిపోయింది. నిన్న రాత్రి. ఐనా నిండా మునిగాక చలేంటి? నోరు, ముక్కు (మాస్కులతో) మూసుకుని మరీ పేపర్లు తిరగెయ్యడం తప్ప చెయ్యగలిగిందేం కనపడ్డం లేదు. చచ్చినట్టు అదే పని చేస్తున్నాం. ఢిల్లీలో ముగియబోతున్న “రామాంజనేయయుద్ధం” కాస్సేపు కరోనా మీంచి దృష్టి మళ్లించి రిలీఫ్ కలిగిస్తోంది అనుకున్నా. మళ్ళీ “రామాంజనేయయుద్ధం” మొదలైందా అనికూడా అనుకున్నా. అది త్రేతాయుగంలోనే అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడేంటని ఎవరైనా అడిగితే వాళ్ళనెవరూ బావు చెయ్యలేరు. త్రేతాయుగంలో యయాతి మహారాజు మొదటి రామాంజనేయయుద్ధానికి కారకుడైనట్టు ఇప్పుడు కేజ్రీవాల్ రెండో రామాంజనేయయుద్ధానికి దారి తీసాడు, హనుమాన్ చాలీసా చదివి. ఆఫ్ కోర్స్, ఈసారి రాములవారూ, హనుమంతులవారి మధ్య డైరెక్ట్ గా కాకుండా రామభక్తులు, హనుమంతుడి “శరణు” కోరిన కేజ్రీవాల్ proxy war నడిపారు. Proxy war కదా ఫన్ చూద్దాం అనుకున్నారో, ఏంటో మొదటియుద్ధాన్ని ఆపినట్టు బ్రహ్మో, శివుడో వచ్చి రెండోయుద్ధాన్ని ఆపలేదు. చివరికి రాముడి కంటే రామభక్తుడే బలవంతుడనిపించేలా కేజ్రీకి 61 సీట్లు, భక్తులకి 7 సీట్లు వచ్చాయి. (ఇది రాస్తున్న టైముకి). పొద్దున్న ఆమాద్మీ లీడింగ్ లో ఉందని చూడగానే “Is Lord Hanuman so pleased with Kejri’s Chalisa that he changed party?” అనుకున్నా. కానీ మొదటియుద్ధంలో రాములవారికి ఎదురుతిరిగి నానా క్షోభా పడిన హనుమంతుడు ఈసారి మళ్ళీ అలాంటి రిస్కు ఎందుకు చేస్తాడనిపించింది కాసేపు. కమలంగుర్తుకీ, అరవింద్ కేజ్రీ వాల్ లో వున్న అరవిందానికీ మధ్య కన్ఫ్యూజ్ అయ్యాడా అని అనుమానం వచ్చింది. అనకూడదు కానీ హనుమంతులవారి నిజాయితీ మీద కూడా డౌట్ వచ్చి, ఈయనకీ బంధుప్రీతీ, biased-opinions ఉంటాయా అనిపించింది. ఎందుకంటే కేజ్రీవాల్ అనగానే తండ్రి కేసరి(కేజ్రీ), తన జాతీ (వాల్ = వాలము) గుర్తుకొచ్చి పక్షపాతం, nepotism కనబరిచాడా అనిపించి, అంతలోనే రామ, రామ అనుకుని చెంపలు గట్టిగా వేసేసుకున్నా. ఐనా ప్రియభక్తుడు దారి తప్పుతుంటే రాములవారు చూస్తూ వూరుకుంటారా? ఊరుకోరు. నారదుణ్ణో, లక్ష్మణుణ్ణో రాయబారం పంపి పొత్తు కుదుర్చుకోవడమో, సీట్ల సర్దుబాటు చేసుకోవడమో చేసేవారు కదా. అలా చెయ్యలేదు. అంటే రాములవారు చూసీ చూడనట్టు వదిలేశారా? ప్రోబబ్లీ, కమలనాధుల కామెంట్లు, ఎన్నికల స్టంట్లూ ఇంకొంచెం polishedగా, ఇంకొంచెం refinedగా వుండాలనిపించిందేమో. రావణుడికి నేడు పోయి, రేపు రమ్మని చెప్పిన మర్యాదస్తుడికి ఆ మాత్రం ఎక్స్పెక్టేషనుండదూ భక్తుల మీదా?? సో, అవన్నీ సరిదిద్దుకుంటే, ఆ దిద్దుబాట్లు తనకి నచ్చితే నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలిపిస్తానని సూచిస్తూ ఏడో, ఎనిమిదో సీట్లు గెలిపించాడేమో. కిందటిసారి మరీ సున్నాలొచ్చాయి కదా!! దాంతో పోలిస్తే ఈసారి చాలా ఇంప్రూవ్-మెంటుంది కదా!! లేకపోతే కాంగ్రెస్ పార్టీలా consistentగా మళ్ళీ సున్నా వచ్చేదిగా !! ఐనా ఈ ఢిల్లీ జనానికి మాత్రం కాస్త ఇంగితం ఉండద్దూ?? పార్లమెంటుకి కమలాన్నీ, అసెంబ్లీకి చీపురుకట్టనీ కోరుకుంటే పాపం పార్టీలు కన్ఫ్యూజ్ అవ్వవూ? అర్ధం చేసుకోరూ!!!

ఇంతేసంగతులు, బై4నౌ 🙏🐵

“దిశ”నిర్దేశం : అవతారాలు దిగొచ్చే వరకూ “మృగాళ్ళ”ని భరించే సహనం, స్వార్ధం, పిరికితనం & necessary quid-pro-quo with god, power, caste, religion, gender & money మనలో మస్తుగా వున్నాయి.మెన్‌
ఆమెన్‌
చెరపట్టన్‌
మ్రోగెన్‌
నీగన్‌
నా
పెన్‌
ఆపెన్‌ 

అని కవి ఆరుద్ర ఉవాచ. కవివాక్యం అంతా నిజమవలేదు. “దిశ” ఉదంతంలో జరిగిన ఎన్-కౌంటర్ తో ఆరుద్రగారు చెప్పిన గన్ మోగింది, నాలుగు సార్లు. పెన్ (=Social debate & reforms) మాత్రం ఆగిపోయేలావుంది. కవివాక్యం సగం నిజమై రెండో సగం మరో దురంతం జరిగేవరకూ ముసుగేసుకు పడుకునేలావుంది.

నలుగురు కీచకులు ఎన్-కౌంటర్ అయిపోయారు. ఎన్-కౌంటర్ కాదు, ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఫైర్ అన్నారు. ఏదైతేనేం రాక్షసుల విషయంలో Poetic justice జరిగిందనుకున్న జనం – అంటే లీడర్లూ, సెలబ్రిటీలు, స్టార్లు, మినిస్టర్లూ, …. అందరూ – నరకాసురుడు చావగానే జనం దీపావళి జరుపుకున్నంత ఇదిగా మాటల టపాకాయలు పేల్చుతున్నారు. సత్వరన్యాయం జరిగిపోయిందని సంబరాలు చేస్తున్నారు.

నిజమే, “దిశ”కి నరకం చూపించిన నరకాసురులని నరకానికి పంపించడం అనేది అందరూ కోరుకున్న న్యాయమే.

ఈ ఎన్-కౌంటర్ -సారీ- ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఫైర్ వల్ల కీచకులతోపాటు దేశం నలుమూలలా జరగాల్సిన చర్చ కూడా ఎన్-కౌంటరైపోయింది.

మనకి కావలసినది “దిశ”కి జరిగిన అన్యాయానికి ప్రతీకారమా?

లేక

ఇలాంటి దురంతాలు మళ్ళీ జరగకుండా ఆపే సాంఘిక సంస్కరణమా?

ప్రతీకారం తీరింది, నలుగురు కీచకులూ పోలీసుల్నీ, శిక్షనీ తప్పించుకునే ప్రయత్నంలోనే (అనే కదా అంటున్నారు!!) అయినా ప్రజల మనసుల్లో రగులుతున్న ప్రతీకారేచ్ఛ చల్లారింది. అదే సమయంలో సంస్కరణ అంశాన్ని రగిలించే ఆవేశం కూడా చల్లారిపోతుంది(పోయింది).

అయితే …

చాలామంది ”కీచకవధ”ని ఒకపక్క సమర్థిస్తూనే అది జరిగిన తీరుని ప్రశ్నించి, విశ్లేషించిన విధం చూస్తే కొంచెం ఆశ పుడుతోంది,

కానీ ….

జనంలో – at least జనంలో కొన్ని వర్గాల్లో – కొన్ని భ్రమలున్నాయి. ఆ భ్రమలు కొందరిలో genuine అమాయకత్వం అయితే కొందరు ఆ భ్రమలనే మనం కోరుకున్న, ఎదురు చూస్తున్న వాస్తవంగా చిత్రీకరిస్తారు(స్తున్నారు). ఈ రెండురకాల మెంటాలిటీల వల్ల సమాజంలోనూ, చట్టసభల్లోనూ జరగాల్సిన చర్చ చచ్చుబడిపోతుంది / చచ్చుబడింది. ఇంకొక దుర్ఘటన జరిగే వరకూ అందరూ నిద్రపోతారు.

మన జీన్స్ లో ఎక్కడో అవతారం దిగివచ్చే వరకూ రాక్షసబాధ భరించే గుణం తిష్టవేసుక్కూర్చుంది. దేవతలు విష్ణువు దగ్గరికెళ్ళి మొరపెట్టుకోవాలి, ఆయన యోగనిద్రలోంచి మేలుకుని తన అవతారానికి script, screen – play, casting, settings,… వగైరా సెట్ చేసుకోవాలి. అందుకు టైమ్ పడుతుందని మన DNAలో programming బాగా జరిగింది., ఒకవేళ అది malfunction ఐతే reprogram చేసే “Software programmers”కి కొదవేలేదు. అంచేత అవతారం వచ్చే వరకూ భరించే సహనం, దానికి supporting softwareగా స్వార్ధం, పిరికితనం & necessary quid-pro-quo arrangements with god, power, caste, religion, gender & money మనలో మస్తుగా వుండడంతో పై ప్రాసెస్ అంతా జరిగేవరకూ సోషల్ ప్రాసెస్ దుప్పటి కప్పుకుని పడుకుంటుంది.

మనం నిజంగా భ్రమరావతిలో వున్నాం, ఎలాగంటే –

సమస్యకి “మృగాళ్ళు” మాత్రమే కారణం, వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తే జనారణ్యంలో దాక్కున్న ఇతర మృగాళ్ళు భయపడి, బయట పడకుండా వుంటారనుకోడం పెద్ద భ్రమ.

నలుగురు చదువూ, సంస్కారం, (ముఖ్యంగా) డబ్బూ, పలుకుబడీలేని మృగాళ్ళని చంపితే అవన్నీ పుష్కలంగా వున్న మృగాళ్ళు భయపడతారనుకోడం ఇంకా పెద్ద భ్రమ.

డబ్బూ, పలుకుబడీ, అధికారం వున్న మృగాలకి తూటాన్యాయం జరుగుతుందని అనుకుంటే అంతకంటే పెద్దభ్రమ లేదు.

‘సింగం’లాంటి ఆఫీసర్లుంటే చాలు, ఇంకెవడూ ఇలాంటి పనికి dare చెయ్యడు అనుకుంటే మనం కృతయుగంలో వున్నామనే భ్రమలోంచి బయటపడాలి ముందు. (కలియుగంలో కావాల్సింది హీరోలూ, అవతారపురుషులూ కాదు. వోటర్ల safety & securityలకి guarantee ఇవ్వగల సేవకులు.)

As a minimum, ఆ భ్రమలలోంచి బయటపడి, “మృగాళ్ళు”కానీ, వాళ్ళకి బలైనవాళ్ళు కానీ వాళ్ళ సోషల్ స్టేటస్ తో పనిలేకుండా అందరికీ ఒకటే న్యాయం జరిగేలా సిస్టం మారనంత వరకూ స్వీట్లు పంచుకున్నా, బ్యాండ్-బాజాలతో సంబరాలు చేసుకున్నా అది కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లి పొందే ఆనందంలాంటిదే.

కానీ జరుగుతున్న డిబేట్ అంతా brokenగా, facturedగా partial facts & half-truths ఆధారంగా జరుగుతోంది.

ఒకరు బాధితురాలి డ్రెస్సింగ్ వల్లే ఇంత జరిగిందంటారు. అమ్మాయిలు స్మార్ట్ గా వ్యవహరించొద్దా అని పాయింట్ తీస్తారు.

ఇంకొకరు బెల్ట్ షాపులవల్లే నేరాలు పెరుగుతున్నాయంటారు.

మరొకరు పోలీస్ సరిగ్గా స్పందిస్తే ఘోరం జరిగేదికాదంటారు.

ఫలానాపార్టీ పవర్లో వుంటే ఇలాగే వుంటుందంటారు. (మా పార్టీకి పవరిస్తే ఇవన్నీ ఆగిపోతాయని మాత్రం ఛస్తే అనరు)

Lawలో వున్న loop-holes వల్లే మృగాళ్ళు నిర్భయంగా వుంటున్నారంటారు.

సమాజంలో విలువలు పడిపోవడమే అసలు కారణం అని కొందరూ, కాలం చెల్లిన విలువల్లోనే అన్ని పాపాలకీ, పాపాత్ములకీ రూట్-కాజ్ వుందని కొందరూ అంటారు.

అన్నిట్లోనూ ఎంతోకొంత నిజం వుంది. అన్నిట్లోనూ మనకి నచ్చని / తోచని చేదు నిజాలని dilute / hide చేసే ప్రయత్నం వుంది.

But ….

అన్ని రకాల అభిప్రాయాలనీ, ఆలోచనలనీ సమన్వయం చేసి, తీసుకోవాల్సిన యాక్షన్స్ ఏంటో, ఎన్ని యాక్షన్స్ తీసుకున్నాం? ఇంకా ఏమేం పెండింగ్ లో వున్నాయి? తీసుకున్నవాటి effectiveness ఎలావుంది? అనే రివ్యూ చేసే ప్రయత్నం మాత్రం లేదు.

ఆ పని ఎవరు చేస్తున్నారు? ఎవరు చెయ్యాలి? ఇప్పుడు గుండెలు చరుచుకుంటున్న ప్రజాప్రతినిధులు ఆ అవసరాన్ని గుర్తించారా? గుర్తించేవరకు ఒత్తిడి తేవాల్సిన బాధ్యతని ప్రజలు, ప్రజాసంఘాలు నెత్తిన పెట్టుకున్నాయా?

పైదంతా సొసైటీని తిట్టిపొయ్యడం కాదు, మన collective way of thinkingలో మిస్సవుతున్నదేంటో ఏకరువుపెట్టే యత్నం. ఇందాకా దేవతలు విష్ణువు దగ్గరికెళ్ళి మొరపెట్టుకోవాలి, ఆయన యోగనిద్రలోంచి మేలుకుని తన అవతరణకి planning & preparation చేసుకోవాలి … అంటూ జోకినది నిజానికి జోక్కాదు. ఆ దేవతలు, ఆ విష్ణువు, ఆ మొరలు, అవతరణలు అన్నీ మన అంతరంగంలో నిరంతరం జరిగే దేవాసుర సంగ్రామం అనేది మనం మర్చిపోతున్నామనే బాధ. అమృతం కోసం నిజాయితీగా యుద్ధం చేసిన రాక్షసుల కంటే మారువేషాల్లో దేవతల్లా కనిపిస్తూ అమృతం తాగేసిన రాహుకేతువులతోనే ఎక్కువ డేంజర్. వాళ్ళిద్దరూ ఆకాశంలో జ్యోతిష్కుల గ్రహచక్రాల్లో లేరు. మనలోనే కామ-క్రోధ-లోభ-మద-మాత్సర్యాల రూపంలో వున్నారు. వెర్రితలలు వేసిన వ్యాపార మనస్తత్వాల్లో వున్నారు. ప్రజాసేవ తప్ప ఇంక దేనికైనా రెడీగా వుండే డర్టీపాలిటిక్సులో వున్నారు. మనని మనం రకరకాలుగా విడగొట్టుకుని, మన వోట్లకి అసలైన ప్రతిఫలం పొందలేని మన మూఢత్వం, స్వార్ధం, బలహీనతల్లో వున్నారు.

నిన్నో, మొన్నో ఒక lady MP ఉన్నావ్ జిల్లాలో జరిగిన మరో హత్యాచారంపై మాట్లాడుతూ, “ఒకవైపు రామాలయం కడుతుంటే మరో వైపు సీతకి నిప్పు పెడుతున్నారు,” అన్నారు. ఆవిడ ఆక్రోశం కరెక్టే.

కానీ, రామాలయం కట్టగానే రాముడు విల్లమ్ములు పట్టుకుని అక్కడ వెలుస్తాడని మనకి నమ్మకం వుందా?

లేక

ఈ దేశాన్నీ, ఈ ప్రజల మంచి గుణాలనీ, ఔన్నత్యాన్నీ మెచ్చి రాముడు దిగివస్తే అప్పుడు ఆయనకి గుడి కడదామా?

ఏది కరెక్టు? దేవుడికి నచ్చేది ఏది?

(దయచేసి ఇది రాముణ్ణి రాజకీయంగా వాడుకునే ప్రయత్నంగా చూడకండి. రాముడు, గుడితోపాటు జీసస్ & చర్చ్; అల్లా & మాస్క్ లకి కూడా ఈ ప్రశ్నలు వర్తిస్తాయని, అందరికీ ఒకటే అయిన దేవుడికి ఈ విషయంలో ఏ అభ్యంతరం వుండదనీ నా total confidence.)

So, అన్ని ప్రశ్నలూ లేవనెత్తాలి –

టీవీకెమెరాల ముందు కాదు,

ఎవరి మనసుల్లో వాళ్ళు.

ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు.

ఎవరి పార్టీలో వాళ్ళు.

ఎవరింట్లో వాళ్ళు, ఎవరి ఆఫీసులో వాళ్ళు.

ఎవరి కులసంఘంలో వాళ్ళు, ఎవరి మతానికి సంబంధించి వాళ్ళు.

ఎవరు కూర్చున్న చట్టసభలో వాళ్ళు.

ప్రశ్నించాలి. సమాధానాలు దొరికే దాకా, ఈ “మృగాళ్ళ” సమస్య సమసే దాకా మన మీద, మన వ్యవస్థల మీద, మన అవస్థల మీద మన ప్రతినిధుల మీదా ప్రశ్నల ప్రెషర్ పెంచాలి.

నేను సిన్సియర్-గా నమ్మేది ఏంటంటే – జరిగిన / జరుగుతున్న / జరగనున్న దారుణాలకి ప్రతి మనిషి ఫీలయ్యే pain ఒకటే. వాళ్ళ ప్రతిస్పందనలు మాత్రం తమ కుల/మత/వర్గ/జ్ఞాన/వయో/రాజకీయ బేధాలని బట్టీ వేరువేరుగా వుంటాయి. అందరికీ కామన్ గా వున్న బాధ / సానుభూతి ఈ రెండే సమస్యకి పరిష్కారం చూపిస్తాయి. మరేవీ కాదు.

ముగించే ముందు నిన్న చూసిన ఒక ట్విటర్ పోస్టు ఇది – https://twitter.com/arunbothra/status/1203268979956969473?s=12 ఆ సీనియర్ పోలీసాఫీసర్ కుండబద్దలు కొట్టిన నిజాలని మనం ఫేస్ చెయ్యాలి. చెయ్యగలమా? చెయ్యాలంటే ముందు –

Until humans do not defeat their internal enemies (కామ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్య) they’ll have to continue fighting (or falling victim to) them in their forms of social evils.

Many times it’s the individual that suffers for the mistake of being part of an imperfect society made up of mostly imperfect individuals.

Microcosm Vs. Macrocosm

అని గ్రహించాలి.

🌹లోకాస్సమస్తాస్సుఖినోభవంతు🌹