☝ అది జస్ట్ కాఫీ మూడ్‌లోకి వచ్చేందుకు, ఇది👇 నేను ఫ్రెష్‌గా కలిపిన కాఫీ ఎంజాయ్ చెయ్యడానికీ 😎, go ahead !! ఈ మధ్య వైకుంఠంలో స్వామివారితో బాతాఖానీ కొడుతూ కాఫీ పుచ్చుకుని చాలా రోజులు – రోజులు కాదు, ఒక ఏడాదిన్నర – అయింది. స్వామివారేమనుకుంటున్నారో, ఇప్పుడు కప్పు పట్టుకుని వెళ్తే, “ఏం ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా,” అంటారో అనీ, అంటే ఏం చెప్పాలో తెలీకా కొంచెం ఊగిసలాడినా , స్వామివారి దగ్గర మనకి మొహమాటం ఏంటీ? ఒకవేళ ఆయనContinue reading “☕కాఫీత్వ☕ – పిబరే🙏రామరసం // పిబరే☕ఫిల్టర్-కాఫీ”
Category Archives: కాఫీత్వ
కప్పు🍵-లిప్పు-కాఫీ☕-సాసర్⛾ & 🎤 ది లెజెండ్స్ ఆఫ్ మ్యూజిక్ ♬
కప్పునైనా కాకపోతిని సరాగాల లిప్పుల తారాడగా కాఫీనైనా కాకపోతిని సుస్వరాల గళముల జాల్వారగా సాసరైనా కాకపోతిని లయలయలొలుకు చేతుల నర్తించగా
కురుక్షేత్రయుద్ధం ముగిసి కృష్ణపరమాత్ముడు అర్జున జీవాత్ముణ్ణి రధంలో ఇంటికి తోలుకొచ్చాక..
“స్వామీ! కిందటిసారి మీ కూర్మావతారం గురించి మాట్లాడుకున్నాం గుర్తుందా?,” ఔల్బ్రాండ్ కాఫీపొడితో తీసిన డికాక్షన్లో పావుకప్పుడు పాలకడలిని నిమజ్జనం చేస్తూ అడిగాను. “గుర్తుంది, ఏం?” అన్నారు స్వామి క్లుప్తంగా. నిన్నరాత్రి ఒక కల వచ్చింది. కలలో క్షీరసాగరమధనం కనబడింది. కానీ మామూలుగా పటాల్లో, శిల్పాలలో, బాంకాక్ ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన సెట్టింగులో, పౌరాణిక సినిమాల్లో చూసినట్టుగా లేదు,” పుష్పహాసుని చిరునవ్వుండగా వేరే పంచదార ఎందుకనే భావనతో సుగర్‌లెస్ కాఫీని తనివితీరా ఆఘ్రాణిస్తూ అన్నాను. “మరెలాఉందేమిటి నీ స్వప్నసాగరContinue reading “కురుక్షేత్రయుద్ధం ముగిసి కృష్ణపరమాత్ముడు అర్జున జీవాత్ముణ్ణి రధంలో ఇంటికి తోలుకొచ్చాక..”
కాఫీత్వ37 – మేం తెలుగు నేర్చుకునేది టీవీ యాంకర్ల దగ్గర. వాళ్ళు ప్రస్తుతం సంస్కృతం మాట్లాడట్లేదు. మోడీగారు వచ్చే ఎలక్షన్స్‌లో మళ్ళీ ప్రధాని అయ్యాక….
పాలకడలిలోంచి నాలుగూ చెంచాల పాలు తీసుకుని మనసులో మరుగుతున్న ఆలోచనల డికాక్షన్లో వేసి ప్రపంచంతో ఎటాచ్మెంట్ అనే పంచదార వేసి అసంతృప్తి చెంచాతో కలుపుతున్నాను. భారతమాతాకి జై అంటే దేశానికి లాభం ఏంటి? జై హింద్ అనే అంటే నష్టం ఏంటి? ఎంత శాతం? అనే విషయం తీవ్రంగా ఆలోచిస్తూ… స్వామివారు ప్రత్యక్షమయ్యారు. కూర్మావతార రూపంలో. అదేంటి స్వామీ ఇవాళీ రూపంలో వచ్చారు? ఇప్పుడు నీ మనసులోనూ ఏదో మేధోమధనం జరుగుతోంది, సమయానుకూలంగా ఉంటుందని. ఈ ఉభయచరContinue reading “కాఫీత్వ37 – మేం తెలుగు నేర్చుకునేది టీవీ యాంకర్ల దగ్గర. వాళ్ళు ప్రస్తుతం సంస్కృతం మాట్లాడట్లేదు. మోడీగారు వచ్చే ఎలక్షన్స్‌లో మళ్ళీ ప్రధాని అయ్యాక….”
స్వామివారు వైకుంఠపు కిచెన్ లోకి వెళ్ళారు. అక్కడ శ్రీమాత చేతి కాఫీ, నందనవనంలో ఇంద్రుడు పండించి పంపిన ఫ్రెష్ అరబికా కాఫీగింజల డికాక్షన్, పాలకడలి పాలు, అమృతపు పంచదారతో శ్రీమాత కలిపిన కాఫీ…
////”ఫ్రాంక్లీ స్పీకింగ్, మనుషుల విషయంలో నా ఎక్స్పెక్టేషన్ ఏంటో భూమ్మీదున్న ఏడు బిలియన్ల జనాభాలో 0.1% మందికైనా అంటే డెబ్భైవేలమందికైనా సరిగ్గా అర్ధమైందో లేదో డౌటు నాకు. మీరు అనుకునేది, విన్నది, చదివింది ఇవన్నీ ఎన్ని వేల సంవత్సరాల నుంచీ ఎన్ని నోళ్ళలో ఎన్ని రూపాంతరాలు చెందిన ఇన్ఫర్మేషనో గ్రహించావా? నెక్స్ట్ కాఫీ కప్పుకి ఒక కమ్యూనికేషన్ ఎలా డిస్టార్ట్ ఔతుందో అంటే ఎలా వక్రీకరిస్తుందో ఒక కధ ద్వారా చూపిస్తా నీకు.”//// “మనం నిజంగాContinue reading “స్వామివారు వైకుంఠపు కిచెన్ లోకి వెళ్ళారు. అక్కడ శ్రీమాత చేతి కాఫీ, నందనవనంలో ఇంద్రుడు పండించి పంపిన ఫ్రెష్ అరబికా కాఫీగింజల డికాక్షన్, పాలకడలి పాలు, అమృతపు పంచదారతో శ్రీమాత కలిపిన కాఫీ…”
భూమి బల్ల పరుపుగా వుండును. గ్రహములన్నీ భూమి చుట్టూ తిరుగును. దేవుడు సమస్త ప్రపంచమును నాలుగువేల సంవత్సరాల క్రితం జస్ట్ వారం రోజుల్లో సృష్టించెను.
భూమి బల్ల పరుపుగా వుండును. గ్రహములన్నీ భూమి చుట్టూ తిరుగును. దేవుడు సమస్త ప్రపంచమును నాలుగువేల సంవత్సరాల క్రితం జస్ట్ వారం రోజుల్లో సృష్టించెను. పుష్కరాల్లో నదిలో మట్టి జల్లని వారిని కృత్య నాశనము చేయును. నదిలో కాలుష్యాలను కలుపు వారిని ఏమీ చేయదు. తన పేరు మీద యుద్ధములు, మతమార్పిళ్ళు, హత్యాకాండలు జరపమని దేవుడు కొన్ని మతములవారికి చెప్పెను. కిటికీలోంచి బద్ధకంగా డైనింగ్ టేబుల్ మీదకి ప్రసరిస్తూ, మామూలుగా కంటికి కనపడకుండా గాలిలో ఎగిరే ఏవేవో కణాలనిContinue reading “భూమి బల్ల పరుపుగా వుండును. గ్రహములన్నీ భూమి చుట్టూ తిరుగును. దేవుడు సమస్త ప్రపంచమును నాలుగువేల సంవత్సరాల క్రితం జస్ట్ వారం రోజుల్లో సృష్టించెను.”
3138 B.C అక్టోబర్-మహాభారతయుద్ధం మొదలైనరోజు, ఎగ్జాక్ట్ డేట్ సరిగ్గా గుర్తులేదు….
“స్వామీ! ఆధునిక మానవజాతి, హోమో సేపియన్స్, కి అమ్మమ్మ….మ్మ అనదగిన లూసీ అస్థిపంజరం ఇథియోపియాలో దొరికింది. వానరాలకి మల్లే చిన్నదైన పుర్రె, మనుషుల్లా నిటారుగా నడవగల కాళ్ళువున్న లూసీ వానరాలనుంచి మనిషి పరిణామం చెందుతున్న దశలో జీవించింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఇథియోపియానే కాఫీకీ జన్మస్థలం. దీన్నిబట్టీ చాలా మంది కాఫీత్వవాదులు ఇలా అనుకుంటున్నారు – ఇథియోపియాలో ఆస్ట్రలో పితికస్ అనే వానరజాతిలో ఎలా పుట్టిందో అనుకోకుండా రెండుకాళ్ళపై నడవటం అనే ఫాషన్ మొదలైంది. ఖాళీ సమయాల్లోContinue reading “3138 B.C అక్టోబర్-మహాభారతయుద్ధం మొదలైనరోజు, ఎగ్జాక్ట్ డేట్ సరిగ్గా గుర్తులేదు….”
కాఫీత్వ33 – మత్స్యావతారం-DNA-జీవపరిణామం
“ఏమోయ్! కాఫీగత ప్రాణీ! కిందటి కాఫీత్వంలో సిరివెన్నెల శాస్త్రిగారి పాట ఎందుకు కోట్ చేసానో ఏమైనా ఆలోచించావా?,” ఆది దేవుడు, అభవుడు, సామవేదనాద వినోదుడు ఎదురుగా నిలబడి ఇలా అడిగితే మానవమాత్రుడైనవాడు తట్టుకోగలడా? తప్పక తట్టుకోగలడు. తట్టుకోవాలి. ఆదిదేవుడు, అంటే ఆరిజిన్ ఆఫ్ దిస్ హోల్ క్రియేషన్, ఎదురుగా కనిపించినప్పుడు ఆయనతో సుబ్భరంగా మాట్లాడి అన్ని డౌట్లు తీర్చుకుని, మనం ఎలావుండాలని ఆయన అనుకుంటాడో అలా వుండడానికి ట్రై చెయ్యాలిగానీ మేనమామ చెవులో వెంట్రుకలు మొలిపించమనో, మోక్షంContinue reading “కాఫీత్వ33 – మత్స్యావతారం-DNA-జీవపరిణామం”
తెలుగువాణ్ణి కదా!ఇంగ్లీషులో చెప్తే బుర్రకెక్కింది /మీకు నేనక్కర్లేదు నా మేజిక్కులు,రాజకీయాలు,మూఢనమ్మకాలు ..
ఈ కప్పు కాఫీ స్వీకరించేముందు ఓ Coffee-Thought for the day : కందసామి పిళ్ళైతో కలిసి కాఫీ హోటలుకెళ్ళిన మహాశివుడు, మహాశివుడనే మనిషి కాదు అచ్చంగా లార్డ్ శివ, మొదటిసారిగా భూలోకపు అమృతం కాఫీని రుచి చూసాడు. ఆయన ముఖంలో సోమరసం తాగిన అనుభూతికి ఇంచుమించు సరిసాటి అయిన ఫీలింగ్ చూస్తున్న కందసామితో, “కందసామీ! ఈ కాఫీ పరిమళంలో, రుచిలో నీకు నా లీల కనబడుతోందా?,” అన్నాడు. “స్వామీ! నీ లీల కాదు నాకు హోటలు వాడి లీలContinue reading “తెలుగువాణ్ణి కదా!ఇంగ్లీషులో చెప్తే బుర్రకెక్కింది /మీకు నేనక్కర్లేదు నా మేజిక్కులు,రాజకీయాలు,మూఢనమ్మకాలు ..”
బ్లాగ్జీవి, RGV, మెగాస్టార్ చిరంజీవి, …ఏ జీవికైనా సరే….
విష్ణువు అంటే బాలెన్సింగ్ పవర్ ఆఫ్ యూనివర్స్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఫిల్టర్ కాఫీకి ప్రాణంలాంటి పాలు గుర్తు రావాలి. గుర్తొస్తాయ్. గుర్తొస్తాయ్ కాబట్టి ప్రపంచాన్ని నడపడంలో విష్ణుమూర్తి రోల్ ఏమిటో అదే రోల్ కాఫీలో పాలు ధరిస్తాయని కూడా అర్ధమైపోతుంది. దీన్నిబట్టీ కాఫీలో పంచదారే బ్రహ్మదేవుడనిన్నీ, కాఫీ డికాక్షన్ అనేది సాక్షాత్తూ ఆదిదేవుడు శివుడికి ప్రతిరూపమనిన్నిన్నీ అర్ధం అవుతుంది. అవ్వాలి. లేకపోతే అర్ధం చేసుకుంటాం. అదర్వైజ్, అది కాఫీత్వం అనిపించుకోదు. క్రియేటెడ్ బీయింగ్స్ అన్నిటికీ కూడాContinue reading “బ్లాగ్జీవి, RGV, మెగాస్టార్ చిరంజీవి, …ఏ జీవికైనా సరే….”