Central Catchment Reserve అనే పార్క్ లో ఇక్కడ, తన వనసీమని పరికిస్తున్న ఈ గొల్లభామని చూస్తూ వుండగా మా ఫ్రెండు పంపిన Save Nallamala Campaign మెసేజ్ వచ్చింది. వెంటనే సైన్ చేసి అడవి దారి (అలా అనుకోడం ఓ తృప్తి😆) వెంట నడుస్తూ దారి పొడుగునా వున్న ఈ ఆక్సిజన్ ఫాక్టరీలని తనివితీరా చూస్తూ వెళ్తూ – 5-star general ఛాతీ మీద మెరిసే Starsలాగా ఎన్నెన్నో తుఫాన్లు చేసిన గాయాలు నిండిన ఒంటితోContinue reading “ప్రజల కోరిక మీద ఇందిరాగాంధీ Silent Valley projectని ఆపేసింది(ట). మోడీగారు యురేనియం ప్రాజెక్ట్ ఆపుతారా?”
Category Archives: అరణ్యరోదన
మానవా!ఓ మానవా! బురిడీలు మానవా మానవా??
***
“మత్తకోకిలలు,మత్తేభాలని,శార్దూలాలని జనం మీద వదిలేస్తున్నారు, ప్రమాదమేమో!,” (Warning : దీనికి సీక్వెల్కూడా కలదు😆)
గురువుగారు, కష్టేఫలి శర్మగారి బ్లాగ్ పోస్టుల్లో ఒక దానిపై నేచేసిన కామెంటు పై ఆయన వ్యాఖ్యానిస్తూ, “మత్త కోకిలలు,మత్తేభాలని,శార్దూలాలని జనం మీద వదిలేస్తున్నారు, ప్రమాదమేమో!,” అన్నారు. అది చూడగానే ఈ పిట్టకధని బ్లాగ్జనుల మీదకి ఎలావదలాలో ఐడియా వచ్చింది. అవును మత్తకోకిలలు, మత్తేభాలు, శార్దూలాలు వూళ్ళలోకి ప్రవేశించి జనం మీద పడిపోతున్న మాట నిజమే. అడవులు తగ్గిపోయి కొన్ని, డెవలప్మెంటు పెరిగిపోయి కొన్ని ఎక్కడుండాలో, ఎలావుండాలో తెలీక జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అంతేకాదు – సిటీల్లోకి వచ్చిన మత్తకోకిలలుContinue reading ““మత్తకోకిలలు,మత్తేభాలని,శార్దూలాలని జనం మీద వదిలేస్తున్నారు, ప్రమాదమేమో!,” (Warning : దీనికి సీక్వెల్కూడా కలదు😆)”
ONE MINUTE FOR WILDLIFE (002) -దప్పిక తీరక ప్రాణం వదిలిన ఆ దుప్పి ఏం చెబుతోంది?
మనుషులే నీళ్ళులేక అల్లాడుతుంటే దప్పిక తీరని దుప్పి అంటూ ఈ గోలేంట్రా అనిపిస్తోందా? బ్లాగ్స్ చదివే తీరిక, ఆసక్తి, ఓపిక ఉన్నవాళ్ళెవరికీ గారంటీగా అలా అనిపించదనే ధైర్యం. అందులోనూ ఈ పోస్టు టైటిల్ చూసి కూడా క్లిక్ చేసారంటే వన్యప్రాణుల్ని ఇష్టపడేవాళ్ళు, వాటిని సంరక్షించాలనుకునేవాళ్ళే అయ్యుంటారు. మూగజీవాలపై సానుభూతిని వారితో సహానుభూతిగా మార్చుకోవడానికే ఈ ONE MINUTE FOR WILDLIFE మొదలుపెట్టాను. So, dear reader! I am so happy for your visit. _/\_ 🙂 Continue reading “ONE MINUTE FOR WILDLIFE (002) -దప్పిక తీరక ప్రాణం వదిలిన ఆ దుప్పి ఏం చెబుతోంది?”
One Minute For Wildlife/వన్యప్రాణుల కోసం ఒక నిమిషం – సంబార్ జింకకి గ్రామస్తుల ఆతిధ్యం
అడవిజింకని చూడగానే ఏమనిపిస్తుంది? కొందరికి అందం, అమాయకత్వం, సాధుత్వం కనిపిస్తాయి. కాస్త కవిహృదయమో సాహిత్యస్పర్శో ఉన్నవాళ్ళకైతే లేడికళ్ళ ప్రబంధనాయికలూ, భీతహరిణేక్షణలు, దుష్యంతుడి వద్దకి వెళ్తున్న శకుంతల చీరచెంగు పట్టుకుని కన్నీరు పెట్టిన జింకపిల్ల, సీతారాముల కధని మలుపు తిప్పిన బంగారులేడి గుర్తుకి రావచ్చు. కొందరికి మున్యాశ్రమాల ప్రశాంతతా, హరితవనాల్లో పరుగులు తీసే జీవచైతన్యం స్ఫురిస్తాయి. ఉడుకురక్తాలవాళ్ళకి శ్రీశ్రీగారి “పులి చంపిన లేడి నెత్తురు” కూడా గుర్తురావచ్చు. కొందరికి మాత్రం మరోరకం ఆలోచనలు పుడతాయి. వాళ్ళు కండలవీరులు కావచ్చు,Continue reading “One Minute For Wildlife/వన్యప్రాణుల కోసం ఒక నిమిషం – సంబార్ జింకకి గ్రామస్తుల ఆతిధ్యం”