ఈ మధ్య జ్యోతిష్యాల మీదా, జ్యోతిష శాస్త్రజ్ఞుల మీదా జోకులెక్కువైపోయాయి. ఎక్కువైపోయాయి అంటే అవ్వవా మరి? టీవీ చర్చల్లో కూచుని డోనాల్డ్ ట్రంప్ నుంచీ వీధి చివర పుంపు వరకూ ప్రతీ విషయం మీదా జ్యోతిష్కుల ప్రిడిక్షన్స్, వాటికి హేతువాదులు ఛాలెంజులు, ఆ ఛాలెంజులకి జవాబు చెప్పలేక చర్చ మధ్యలో జ్యోతిష్కులు అలిగి లేచి వెళ్లిపోవడం, … ఈ ఫార్సులు చూసి జనం జోకులెయ్యక ఊరుకుంటారా? ప్లానెటరీ ఆస్ట్రాలజీ సైన్స్ కాదు అని నేను అనలేను. అలాగనిContinue reading “ద సైన్స్ ఆఫ్ పిట్ట🐥రెట్ట జోస్యం & ద ఇంపాక్ట్ ఆఫ్ ఎ పొలిటికల్ పిట్టరెట్ట”
Author Archives: YVR's అం'తరంగం'
పొలిటి “కలర్స్” ఆఫ్ హోలీ 2019
హోలీ పండగ ఇవాళ ఒక్క రోజే. రాజకీయ రంగుల పండగ ప్రతి రోజూ. దాంతోపాటే రాజకీయ రంగులరాట్నం కూడా. హోలీ రంగులు రోజంతా చిమ్ముకున్నా చివరికి అన్నీ కడిగేసుకుంటారు. పొలిటి “కలర్స్” పోవాలంటే మాత్రం ఫిరాయింపు “స్నానం” చేస్తేనే కానీ కుదరదు. పొలిటీషియన్లకి తప్పదేమో కానీ, పవరొచ్చాక ప్రజలని పాత రాజకీయ రంగులంటించి చూడకుండా వుంటే ….. వాళ్ళలా వుంటారా, వుండరా అనేది, “రంగుల “సినిమా”లు చూపించడం ఆపి పని చెయ్యండ్రా,” అంటూ జనం హుంకరిస్తే కానీContinue reading “పొలిటి “కలర్స్” ఆఫ్ హోలీ 2019″
xxx కాండోమ్స్కి మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల …..
ఒక స్వతంత్ర దేశంలో – దేశ సరిహద్దుల అవతలున్న శత్రువులకి సరిహద్దుల ఇవతలున్నవాళ్ళు ఏదో ఒకరకంగా సాయం చేస్తే దేశద్రోహం బయట్నించి ఎటాక్ చేసే శత్రువుతో యుద్ధాలు చేసి శత్రుసైనికుల్ని చంపడమో చావడమో చేస్తే దేశభక్తి. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము నట్ట నడిమీ పని నాటకమూ అన్నట్టు పై రెండు డెఫినిషన్లూ కాక దేశంలో జరిగే ఇతర వ్యవహారాలేవీ దేశభక్తి/ద్రోహం పరిధిలోకి రావనుకుంటే ఈ ఇరవైయ్యొకటో శతాబ్దంలో సరిపోతుందా? ఇప్పుడీ అసందర్భ ప్రసంగం ఏంటీ అనిపిస్తోందా?Continue reading “xxx కాండోమ్స్కి మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల …..”
శివోహం=శివోहम=శివోतुम I=U=WE=ॐSivaॐ
శివరాత్రి పూట శుభాకాంక్షలు చెప్దామని శివుడి బొమ్మ గీస్తుంటే వచ్చిన ఆలోచన – 🌹శివోహం🌹శివోहम🌹శివోतुम🌹శివోహం = శివోहम = శివోतुमవ్యష్టి = సమష్టి = సృష్టి శివోహం –> నేనే శివుడిని అని నేను మనసా వాచా కర్మణా నమ్మినప్పుడుశివోतुम –> అదే నమ్మకం ప్రతి “నేను”లో కలిగినప్పుడుశివోहम –> ప్రపంచం అంతా శివస్వరూపంగా మారిపోదా? నరుడు హరుడిగా మారడమే , మానవుడు మహాదేవుడవడమే సంఘం కానీ, దేశం కానీ ప్రపంచం కానీ మారడానికీ మూలం కదా!!अहंContinue reading “శివోహం=శివోहम=శివోतुम I=U=WE=ॐSivaॐ”
తిరుమలేశుడికి \|/ తిరునామం రాములోరితో🏹రాజకీయం🤫
స్టేట్ లెవెల్లో తిరుమలేశ్వరుడికే తిరునామాలు పెట్టడంలో….. జాతీయస్థాయిలో రాములవారి పేర రాజకీయాలు చెయ్యడంలో …. ఆరితేరిపోయారు నాయకులు… గుళ్లో దేవుడు మాట్లాడక ఊరుకుంటాడని వీళ్ళకి ధైర్యమో? నమ్మకమో? 🤔 ప్రజల గుండెల్లో దేవుడు కూడా అంతే అనుకుంటారా? ఏమో మరి 🤔 😇 వోటరు దేవుళ్ళే తేల్చాలి మరి 🤗 బై 4నౌ ✋🤓
ఇండో-పాక్ వార్ వస్తుందా? రెండు దేశాలూ ఆటం బాంబులు విసురుకుని…!?!? వామ్మో!నిద్ర పట్టట్లేదు😴😴😴
ఫిబ్రవరి 14 నుంచీ ఈ రోజు సాయంత్రం వరకు కంటి మీద కునుకు లేదు. ఎక్కడ మన వాళ్లు పాక్ మీద సర్జికల్ స్ట్రైకులు చేసేస్తారో… ఎక్కడ ఇండో-పాక్ వార్ వచ్చి పడుతుందో…. ఎక్కడ రెండుదేశాలూ ఆటంబాంబులు విసురుకుని సర్వనాశనం చేసేసుకుంటాయో…. ఒక్కో జెట్టూ 576 కోట్లు లెక్కన వేలకోట్ల ఫైనాన్షియల్ రిస్కూ, మరోపక్క అదో కుంభకోణం అని జనం అనుకుంటే ఎదురయ్యే పొలిటికల్ రిస్కూ వున్నా గుండెల్ని 56 అంగుళాల రాళ్ళు చేసుకుని కొన్న రఫాలేContinue reading “ఇండో-పాక్ వార్ వస్తుందా? రెండు దేశాలూ ఆటం బాంబులు విసురుకుని…!?!? వామ్మో!నిద్ర పట్టట్లేదు😴😴😴”
ఆ అమ్మాయి మూగప్రశ్నలకి కొవ్వొత్తులూ, వీరాలాపాలూ సెలబ్రిటీ-తొడచరుపులూ ఎన్నికల సంవత్సరపు ఎక్స్-గ్రేషియోల కంటే అర్ధవంతమైన జవాబులున్నాయా?
కన్నతండ్రికి కడసారి కన్నీటి సెల్యూట్ చేస్తున్న ఆ 👆 అమ్మాయి కళ్ళలో కనిపించే ప్రశ్నల్ని ప్రపంచం పసిగట్టిందా? కనీసం ఊహించిందా? ఆ ప్రశ్నలకి – కొవ్వొత్తుల ప్రదర్శనలూ నాయకుల వీరాలాపాలూ సెలబ్రిటీల తొడ చరుపులూఎన్నికల సంవత్సరపు ఎక్స్-గ్రేషియోల — కంటే అర్ధవంతమైన జవాబు ఇవ్వగలదా ? ఇప్పుడే సోషల్-మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక వీరవనిత ఉపన్యాసం చూశా. ఆవిడ లేవనెత్తిన పాయింట్ ఏంటంటే – ఆటల్లో కప్పులు, మెడల్స్ గెల్చుకొచ్చిన క్రీడాకారులకి ఉద్యోగాలూ, కోట్ల కోట్లContinue reading “ఆ అమ్మాయి మూగప్రశ్నలకి కొవ్వొత్తులూ, వీరాలాపాలూ సెలబ్రిటీ-తొడచరుపులూ ఎన్నికల సంవత్సరపు ఎక్స్-గ్రేషియోల కంటే అర్ధవంతమైన జవాబులున్నాయా?”
న్యూమరాలజీ = నారదాలజీ
నర – నారా ఇంద్ర – చంద్ర పై పదాల్లో కామన్ అక్షరాలేవేంటి? న – ర – ద —> ఆ ‘న’ ని కొంచెం సాగదీస్తే ? నా-ర-ద = నారద నారదుల వారి మెయిన్ డ్యూటీ ఏంటీ? కలహాలు పెట్టుట. నారదులవారు వున్నచోట కలహాలు కాపురము చేయును. కధని ఇంకొంచెం సాగదీద్దాం …. న – ర – ద –> ఆ ‘న’ని మైనస్ చేసేసి అక్కడ ‘బు’ పెడితే ?Continue reading “న్యూమరాలజీ = నారదాలజీ”
🌳వన🌕🐦విహారం🌵 – ఆ రోదసీపక్షి, ఈ పుడమిపిట్ట Bird-Celestial zooms above, the Bird-Terrestrial looms below
మనం ఏ హడావిడీ లేకుండా పౌర్ణమి అని పిలుచుకునే నిండు పున్నమికి అమేరికన్లు ముద్దుగా సూపర్-మూన్, బ్లడ్-మూన్,…లాంటి పేర్లు పెట్టారు. సూపర్ మూన్ పేరు బానే ఉంటుంది కానీ బ్లడ్-మూన్ అంటేనే ఒక రకంగా ఉంటుంది. రక్త చంద్రుడు !! అని తెలుగులో అనుకుంటే రాంగోపాల్ వర్మ సినిమా టైటిల్లా వుండి ఎర్రటి ఆకాశం, అందులో గబ్బిలాలు ఎగురుతూ, మధ్యలో కాలు తెగి రక్తం కారుతున్న ఒంటరి ఒంటెలా …. అబ్బో !! తల్చుకుంటే కడుపులో దేవుతోంది.Continue reading “🌳వన🌕🐦విహారం🌵 – ఆ రోదసీపక్షి, ఈ పుడమిపిట్ట Bird-Celestial zooms above, the Bird-Terrestrial looms below”
రైతుని పట్టిన 🐊రుణమకరాన్ని🐊 వదిలించవే మకర సంక్రాంతీ!!🙏🙏
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా రైతన్నలకీ, నేతన్నలకీ. రైతుల పంటలకి మంచి ధరలు పలికి, జనం (మనం) కొనుక్కునే బట్టల్లో ఓ 25% చేనేత బట్టలే కొనుక్కునీ వాళ్ళ సంక్రాంతిలో కొత్త కాంతి నింపాలని కోరుకుంటూ … వాళ్ళ ఋణాలు (పార్టీలకి అతీతంగా) 100% మాఫీ అయిపోయి మళ్ళీ వాళ్ళు అప్పులు చెయ్యాల్సిన అవసరం రాకూడదని ఆశ (దురాశా?) పడుతూ … 🐄🐂🐃 🌾🌾🌴🌴🌳🌳🌿🌿🎋🎋🐄🐂🐃