ఈ రోజు ప్రధాని షామల్ దాస్ రంచోడ్ దాస్ చంచడ్, ప్రతిపక్ష నాయకుడు ఫున్ సుక్ వాంగ్ఢు లోకసభలో ఒక సంయుక్త ప్రకటన చేసారు. ప్రస్తుతం దేశం సాధిస్తున్న ఆర్ధిక పారిశ్రామిక ప్రగతిని దృష్టిలో ఉంచుకొని, దీని వలన రాగల నైతిక దుష్పరిణామాలని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రకటన చేస్తున్నట్లు వారు వివరించారు. భారీగా జరిగే వ్యాపార లావాదేవీలు, సహజ వనరుల వినియోగం, ప్రభుత్వ వ్యయాలు, ఎన్నికల ప్రచార ఖర్చులు రాజకీయ నాయకులను కార్పొరేట్ల, మాఫియాల చేతుల్లోContinue reading “ఆకా…శ్శ్య వాణి వార్తలు చదువుతున్నది … ఎవరు చదివితే ఏంటండీ?ముందు వినండి, చివరివరకూ!”
Author Archives: YVR's అం'తరంగం'
మహాసముద్రంతో నీటి బిందువు అంటోంది ….
నువ్వూ నేనూ ఒకటనుకుంటే చెప్పలేని దైర్యం , ఆపలేని ఆనందం అనంతం నీ వైశాల్యం అగాధం నీ ఆంతర్యం అద్భుతం నీ సౌందర్యం అల్లకల్లోలం నీ ఆనందం అన్నీ నావే అన్నీ నేనే అంతలో ఏదో భయం, నేను నువ్వు కాదనిపించే సంవిద్వైతం అలగా ఎగయాలని ఆరాటం, ఎంత ఎగిసినా విరగకతప్పని దౌర్బల్యం కట్ట దాటనీయని నీ బంధం, కట్టలు తెంచే అర్ధంకాని చైతన్యం గుండె బాదుకున్నా చెదరని ఇసుక తిన్నెల నిశ్శబ్దం ఉత్సాహం విరిచేస్తూ రాతిగుండెల్లోContinue reading “మహాసముద్రంతో నీటి బిందువు అంటోంది ….”
హృదయాం’తరంగం’ – ౦౦౧ (Waves of Change)
అలలు అలలు అలలు అలలు, మనసుకడలిలో ఎగిసే అంతులేని కలలు. కలలు కలలు కలలు కలలు, తలపులతీరం దాటని అలుపెరుగని అలలు శిలలు శిలలు శిలలు శిలలు, కలలఅలల హొయలనాపు అహంకారగిరులు అలలు అలలు అలలుఅలలు , శిలలకు వెరవక పొంగే భావావేశపు ఝరులు కలలు కలలు కలలు కలలు, శిలలో శిల్పం చూసిన ద్రష్ట చేతి ఉలులు శిలలు శిలలు శిలలు శిలలు, అలలఉలుల మేల్కొల్పుకి ఉలికిపడే నిద్రాణపుకలలు శిలలు అహంకారానికి ప్రతీకలు –Continue reading “హృదయాం’తరంగం’ – ౦౦౧ (Waves of Change)”
అంతరంగ చిత్రం
(2) Waves crashing on beach rocks remind me of the struggle the human spirit goes through to unshckle itself of the chains of isms, systems, ideologies, religions and traditions. The same chains that, once upon a time, were the guide ropes to lead man through the dark tunnels of history, of myth and of unknown. The sameContinue reading “అంతరంగ చిత్రం”
యాన్ ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ బుడగ !
నేనిక్కడ ఎలా ఉన్నానో, ఎక్కడికి పోతున్నానో నాకు తెలీదు. ఊహ తెలిసినప్పట్నుంచీ ఓ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉండడమే తెలుసు. “నేను” ఉన్నాను అనుకుంటాను తప్ప ఎక్కడున్నాను? ఏం చేస్తున్నాను? ఎందుకు చేస్తున్నాను? లాంటివేమీ తెలీదు. ఆ ఊహా, ధ్యాస లేవు. ఆలోచన, జ్ఞాపకం, భయం, సుఖం …. ఇలాంటివేమీ లేవు నాలో. జిజ్ఞాస, ప్రశ్న అనే గుణాలు పుట్టేవరకు. అవెలా ఎందుకు పుట్టాయో ఇప్పటికీ తెలీదు. కానీ అవి మొదలైనప్పప్పట్నించీ బతుకు బుద్బుదప్రాయం అయిపొయింది. అయిపొయిందేంటిContinue reading “యాన్ ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ బుడగ !”
అలలు, అలలు, అలలు,— ఓ కార్టూన్, అరచేత్తో సూర్యోదయాన్ని ఆపడం, etc, etc.
పై పెద్దమనిషిని సానుభూతితో అర్ధం చేసుకోండి, పాపం. గాంధీ , నెహ్రూల బాటలో నడుస్తున్నానని కూడా చెప్పారీయన. ఒక అనుమానం ఏమిటంటే, గాంధీ గారు 70 ఏళ్ల వయసులో చేసిన వివాదాస్పద ప్రయోగాలు, నెహ్రూ గారి పై వచ్చిన మనకంతగా నచ్చని కధలూ సీరియస్ గా తీసుకుని ఫాలో అయిపోతున్నాడా ఈయన? అని. బ్లాగు తెరిచినంత తేలికా రాయడం ? అల్లసాని వారి అల్లిక జిగి బిగి, ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు, పాండురంగ విభుని పదగుంభనమును, కాక, మానుContinue reading “అలలు, అలలు, అలలు,— ఓ కార్టూన్, అరచేత్తో సూర్యోదయాన్ని ఆపడం, etc, etc.”
Bye, Kaka..
ప్రతి మనిషి కి 1008 ఛాన్సులు -1
1 ఐ యామ్ ష్యూర్ దిస్ ఈజ్ ఎనదర్ రీ-ఇన్వెన్షన్ ఆఫ్ వీల్. అయినా ఎవరో ఒకరికి ఇది పనికి రావచ్చు. ఇవాళ నా పుర్రెలో ఒక బుద్ధి పుట్టింది. ఇది పూర్వీకులు ఎప్పుడో చెప్పినదే అయిఉంటుంది. చాలా మంది చేస్తున్నదే కూడా అయి ఉంటుందనడంలో ఏ సందేహం లేదు. అయినా మనిషికి స్వయంగా అర్ధం చేసుకున్న విషయం పట్ల ఉన్న నిబద్ధత ఇతరులు చెప్పినదాంట్లో ఉండదు. ముఖ్యంగా చెప్పిన విషయం మనిషి తాత్విక, వైజ్ఞానిక తృష్ణనుContinue reading “ప్రతి మనిషి కి 1008 ఛాన్సులు -1”
అలోలము లాలోచనలేవేవో …
అలోలము లాలోచన లేవేవో నా లోపల ప్రాలేయఛ్ఛాయలవలె తారడగ కోరాడగ .. – శ్రీశ్రీ శ్రీశ్రీ ఏ సందర్భంలో ఈ వాక్యాలు వ్రాసారో తెలియదు. అసలిది శ్రీశ్రీదని కూడా తెలియదు గొల్లపూడి మారుతీరావు గారి కాలం లో చదివే వరకూ. చదువుతుంటే పసితనంలో తప్ప కలగని కారణరహితమైన హాయి కలిగింది. మనసులో ఈ చిత్రం మెదిలింది. బ్లాగ్ ఎలా మొదలెట్టాలా తెలియక కొట్టుకుంటుండగా ఇదే నా ఫస్ట్ పోస్ట్ గా వేసేస్తే ? అనిపించి పోస్ట్Continue reading “అలోలము లాలోచనలేవేవో …”