ఏకే నటించిన పీకే, పీకే నటించిన గోపాల గోపాల ఓకే వారంలో చూసేసాం. జీకే గా పీకే ఓకే పీకే గా ఏకే డబలోకే రెండిట్లో థీమ్ ఒకటే, దేవుడికీ మనిషికీ మధ్య ఏర్పడ్డ దళారీ వ్యవస్థని ప్రశ్నించడం. గోపాల గోపాలలో ప్రశ్నలన్నీటికీ మొదట్లోనే దేవుడి ఆమోద ముద్ర పడిపోతుంది. పీకేలో అసలు దేవుడు రంగంలో ప్రవేశించకుండా, ఆయన ఆస్తిత్వానికి భంగం రాకుండా డిబేట్ అంతా మనుషుల మధ్యే జరుగుతుంది. పీకేలో ఇజాల ప్రిజాల్లో ఇరుక్కుపోయిన మైండ్స్Continue reading “జీకే గా పీకే ఓకే పీకే గా ఏకే డబలోకే”
Author Archives: YVR's అం'తరంగం'
ద ఇండియా ఐ లవ్ (1)
Originally posted on YVR's అం'తరంగం':
బాంధవఘర్ నేషనల్ పార్క్. జీపులో అడవిలోకి వెళ్తున్నాం. తెల్లవారు ఝాము ఐదు అవుతుంటే మౌగ్లీ రిసార్ట్ నుంచి బయల్దేరాం. కటిక చీకటి ప్లస్ చిక్కటి చలి. ఓపెన్ టాప్ జీప్ లో ముందు డ్రైవరూ, వెనక సీట్లో మేమిద్దరం. భాయ్ సాబ్! నీ దగ్గర గన్ ఉందా అని వచ్చీ రాని హిందీలో అడిగా. గన్ గిన్ ఏమవసరంలేదు సాబ్. మనం జీపులో ఉన్నంతసేపూ పులి మన జోలికి రాదు.…
ద ఇండియా ఐ లవ్ (1)
బాంధవఘర్ నేషనల్ పార్క్. జీపులో అడవిలోకి వెళ్తున్నాం. తెల్లవారు ఝాము ఐదు అవుతుంటే మౌగ్లీ రిసార్ట్ నుంచి బయల్దేరాం. కటిక చీకటి ప్లస్ చిక్కటి చలి. ఓపెన్ టాప్ జీప్ లో ముందు డ్రైవరూ, వెనక సీట్లో మేమిద్దరం. భాయ్ సాబ్! నీ దగ్గర గన్ ఉందా అని వచ్చీ రాని హిందీలో అడిగా. గన్ గిన్ ఏమవసరంలేదు సాబ్. మనం జీపులో ఉన్నంతసేపూ పులి మన జోలికి రాదు. నా సీటు పక్కనుంచి రెండడుగుల దూరంలోContinue reading “ద ఇండియా ఐ లవ్ (1)”
ఆరు నెలలు తీరని కలలు, విగ్రహరాజకీయాలు మరియు On what item girls should be called.
Originally posted on YVR's అం'తరంగం':
మొన్న ఈనాడులో ఆరు నెలలు తీరని కలలు టైటిల్ తో వచ్చిన వార్త – “ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి మంగళవారానికి ఆరునెలలయింది. విభజన చట్టంలో ఎపీకిచ్చిన హామీల అమలును గుర్తు చేసుకొనే ప్రతి ఒక్కరి నుంచి నిట్టూర్పే వినిపిస్తోంది….” – ఇలా సాగిన కధనం చివరికి విభజన బిల్లు ఆమోద సమయంలో రాజ్య సభలో మన్మోహన్ ఇచ్చిన హామీలని గుర్తు చేస్తూ ముగిసింది. మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడలేదు కానీ హామీలు…
ఆరు నెలలు తీరని కలలు, విగ్రహరాజకీయాలు మరియు On what item girls should be called.
మొన్న ఈనాడులో ఆరు నెలలు తీరని కలలు టైటిల్ తో వచ్చిన వార్త – “ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి మంగళవారానికి ఆరునెలలయింది. విభజన చట్టంలో ఎపీకిచ్చిన హామీల అమలును గుర్తు చేసుకొనే ప్రతి ఒక్కరి నుంచి నిట్టూర్పే వినిపిస్తోంది….” – ఇలా సాగిన కధనం చివరికి విభజన బిల్లు ఆమోద సమయంలో రాజ్య సభలో మన్మోహన్ ఇచ్చిన హామీలని గుర్తు చేస్తూ ముగిసింది. మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడలేదు కానీ హామీలు నెరవేర్చడంలో తాత్సారం గురించి సణుగుడు ఉంది.Continue reading “ఆరు నెలలు తీరని కలలు, విగ్రహరాజకీయాలు మరియు On what item girls should be called.”
నో.వా.చే.రా – 03 స్వచ్ఛ భారత్
‘యువ’నేత ఉవాచ: “Modi had said (in his Lok Sabha campaign) I alone will generate employment… I alone will build factories, roads and airports. But after forming government, he said you people take the broom, I am going to Australia.” కరెక్టే. పాత ప్రభుత్వహయాంలో ఇప్పించిన ఉద్యోగాలు చేస్తూ మోడీ పీఎమ్ గా వచ్చి చీపురు పట్టి గుర్తు చేస్తే కానీ శుభ్రత పట్టించుకోనంత బిజీContinue reading “నో.వా.చే.రా – 03 స్వచ్ఛ భారత్”
నో.వా.చే.రా – “ఒరేయ్!బాలుడా! జాగ్రత్తరోయ్..” (002)
బోరు బావి సంఘటనలు మనలో ఉన్న ఎపతీని ప్రతిబింబించే ఒక ఉదాహరణ మాత్రమే. ఎన్నెన్ని దుర్ఘటనలు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయో, బయటపడనివి ఎన్ని జరుగుతున్నాయో ఊహించుకుంటే …. OMG !! బాలుడేనా? బాలిక ఎంత క్షోభ పడుతోందీ దేశంలో? ఎవరో వస్తారని ఏదో చేస్తారని … ఎదురుచూస్తూ మోసపోవడం, అదే, మన్ని మనం మోసం చేసుకోవడం మనకి అలవాటైపోయింది. మన సంస్కృతి, మన ఫిలాసఫీలని మించినవి లేవు, అందులో నిస్సందేహంగా సందేహంలేదు. ఐతే వాటిని నిత్యజీవితానికి, సామాజికContinue reading “నో.వా.చే.రా – “ఒరేయ్!బాలుడా! జాగ్రత్తరోయ్..” (002)”
నో.వా.చే.రా – 002 ఒరేయ్! బాలుడా! జాగ్రత్తరోయ్! బోర్ వెల్ దగ్గరకెళ్ళేముందు ఈ ప్రశ్నలు వేసుకో..
మొన్న ‘బోరు బావిలో పడిన బాలుడు’ వార్త మళ్ళీ వచ్చింది. ఎన్ని మళ్ళీలయ్యాయో ఇలాంటి మొదటి సంఘటన వార్తల్లో వచ్చినప్పట్నుంచీ, 2005 అని గుర్తు. ఈ సారి అదృష్టంకొద్దీ పిల్లాడిని ప్రాణాలతో బయటికిలాగారు. ఎవరు? అధికారులు. ఎవరో వేసుకుంటున్న బోర్ వెల్, దానికి ఎవరో కంట్రాక్టర్, సంబంధంలేని పిల్లలు అక్కడికి రావడం, ఆ బోర్ లో పడడం, అక్కణ్ణుంచీ మీడియా హడావిడి, అధికార్లు బాలుణ్ణి బయటికి తీసే ప్రయత్నం చెయ్యడం, ఎక్కువసార్లు విఫలమవ్వడం… ఏం జరుగుతోందిక్కడ? ఏమీContinue reading “నో.వా.చే.రా – 002 ఒరేయ్! బాలుడా! జాగ్రత్తరోయ్! బోర్ వెల్ దగ్గరకెళ్ళేముందు ఈ ప్రశ్నలు వేసుకో..”
నరుడను నేను, నారాయణుడనే నేను
మానవ జాతి పరిణామక్రమం ఆధారంగా ఎగిసిన ఈ హృదయాం’తరంగా’నికి నండూరి రామమోహనరావు గారి నరావతారం, విశ్వరూపం, విశ్వ దర్శనం పుస్తకాలు పునాదులు వేస్తే శ్రీ అరవిందుని మాటలు ఆసరా అయ్యాయి. నా జాతి ప్రస్థానం పరమాణువుకి ముందు మొదలై పరబ్రహ్మ వరకూ సాగుతుందని, అందులో నేనూ ఉన్నానని, ఎప్పటికీ ఉంటాననీ తెలిసి పొందిన అనుభూతి అది నాకు అర్ధమయ్యేలా తెలిపిన మహానుభావులందరికీ అంకితం – The Ten Avatars as a Parable of Evolution Avatarhood wouldContinue reading “నరుడను నేను, నారాయణుడనే నేను”
నో.వా.చే.రా – 001 (స్వచ్ఛ భారత్ / పటేల్ .vs. నెహ్రూ)
స్వచ్ఛ భారత్ స్లోగన్ తో, ఒక్కొక్కరు మరో తొమ్మిదిమందికి పిలుపునివ్వడమనే కాన్సెప్ట్ తో మోడీ సృష్టించిన క్లీన్లినెస్ ఫీవర్ ఎంతవరకూ సక్సెస్ అవుతుందనే ప్రశ్నచాలామందికి ఉంది. సెలబ్రిటీలు చీపుళ్ళు పట్టుకుని ఫొటోజెనిక్ ఊడ్పులు ఊడ్చినంత మాత్రాన శుభ్రత మన సంస్కృతిగా మారిపోతుందా అని పెదవి విరిచేవాళ్ళు, మీడియాకెక్కేవాళ్ళు బాగానే ఉన్నారు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. స్వచ్ఛ భారత్ కి ఇంతకుముందు ఏ నాయకు-డూ/రాలూ ఇవ్వని విజిబిలిటీ ఇచ్చినందుకు మోడీని మెచ్చుకుని తీరాలి. తనని, తన పరిపాలనా దక్షతని ఎలాContinue reading “నో.వా.చే.రా – 001 (స్వచ్ఛ భారత్ / పటేల్ .vs. నెహ్రూ)”