“ప్రజలకి కలిగే అసౌకర్యాలకి, పడే బాధలకీ ప్రభుత్వాల, నాయకుల అసమర్ధత కారణం కాదు. పాలసీ, ప్లానింగ్ సరిగా లేకపోవటం కాదు. అంతటికీ మూలం వాస్తు,” అని నేతలు చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్. “మేం చేసేదంతా చేసేస్తున్నాం కానీ రాష్ట్ర వాస్తు బావుండక ప్రజలు కష్టాలు పడుతున్నారు. పెట్రోలు, ఉల్లిపాయల ధరలు; రైతుల ఆత్మ హత్యలు, అత్యాచారాలు; నేరాలు ఘోరాలు, కుంభ కోణాలు అన్నీ వాస్తు సరిగా లేకే,” అని ఎవరో ఒక మంత్రి వర్యుడు త్వరలోContinue reading “ఉల్లిపాయల ధరలు, రైతుల ఆత్మ హత్యలు, నేరాలుఘోరాలు, కుంభ కోణాలు అన్నీ వాస్తు సరిగా లేకేనా ???”
Author Archives: YVR's అం'తరంగం'
భూమ్మీద మొదటి జీవి పుట్టినప్పుడు తను బ్రతకాలంటే పరిసరాలనుంచి ఏదో ఒకటి సంగ్రహించాలన్న విషయం ఎలా తెలుసుకుంది? – {అం’తరంగా’ల్లో విశ్వకవి భావాలు-2}
రవీంద్రుడి దృష్టిలో “స్కాండినేవియన్ దేశాల ప్రజలకి సంబంధించినంత వరకు సముద్రం వారి జీవన విలువలని ప్రతిబింబిస్తుంది. ఉత్తుంగ తరంగాలతో నేలతో, ఆ నేలతల్లి బిడ్డలతో ఎడతెగని యుద్ధం చేస్తూ కడలి వారికి నిరంతరం పొంచి ఉండే ప్రమాదంగా, అధిగమించవలసిన అడ్డంకిగా కనబడుతుంది. అజేయమైన మానవుడి ఆత్మస్థైర్యానికి విలయ ప్రకృతి విసిరే సవాలు సముద్రం. ఈ పోరాటంలో మనిషే గెలిచాడు, అది అతనిలో పోరాట స్ఫూర్తి నింపి ఇప్పటికీ అతనిచేత దారిద్ర్యం, నియంతృత్వం, అనారోగ్యాలపై యుద్ధం చేయిస్తోంది. నౌకాయానం నేర్చిContinue reading “భూమ్మీద మొదటి జీవి పుట్టినప్పుడు తను బ్రతకాలంటే పరిసరాలనుంచి ఏదో ఒకటి సంగ్రహించాలన్న విషయం ఎలా తెలుసుకుంది? – {అం’తరంగా’ల్లో విశ్వకవి భావాలు-2}”
అం’తరంగా’ల్లో విశ్వకవి భావాలు (1) – ‘అ’ర్ణవం-‘ఆ’కాశం
Originally posted on YVR's అం'తరంగం':
? ‘అ’ర్ణవం-‘ఆ’కాశం జీవానికి అఆలు నేర్పిన ఆదిగురువులు. ఒక ప్రక్క అగాధమైన అర్ణవం మరోవైపు అనంతమైన ఆకాశం. ఆ రెండిటి మధ్య ఆలోచనా తరంగాలనీ, అమృతత్వాన్నిచ్చే జ్ఞానాన్ని తనలోనే ఇముడ్చుకున్న మేధస్సు. అయస్కాంతపు విజాతి ధ్రువాల మధ్య తీగ వేగంగా కదిలినప్పుడు విద్యుత్తు ప్రవహిస్తే, మేధస్సు అంతుపట్టని విషయాల మధ్య అలుపులేని అన్వేషణ జరిపితే విజ్ఞానం వికసిస్తుంది. యుగయుగాల ప్రస్థానంలో జీవికి అ ఆ లు నేర్పిన గురువులు అ ర్ణవం ఆ కాశం ప్రళయజలధిలో ఏక…
అం’తరంగా’ల్లో విశ్వకవి భావాలు (1) – ‘అ’ర్ణవం-‘ఆ’కాశం
‘అ’ర్ణవం-‘ఆ’కాశం జీవానికి అఆలు నేర్పిన ఆదిగురువులు. ఒక ప్రక్క అగాధమైన అర్ణవం మరోవైపు అనంతమైన ఆకాశం. ఆ రెండిటి మధ్య ఆలోచనా తరంగాలనీ, అమృతత్వాన్నిచ్చే జ్ఞానాన్ని తనలోనే ఇముడ్చుకున్న మేధస్సు. అయస్కాంతపు విజాతి ధ్రువాల మధ్య తీగ వేగంగా కదిలినప్పుడు విద్యుత్తు ప్రవహిస్తే, మేధస్సు అంతుపట్టని విషయాల మధ్య అలుపులేని అన్వేషణ జరిపితే విజ్ఞానం వికసిస్తుంది. యుగయుగాల ప్రస్థానంలో జీవికి అ ఆ లు నేర్పిన గురువులు అ ర్ణవం ఆ కాశం ప్రళయజలధిలో ఏక కణజీవిగా ప్రప్రధమ ఆవిర్భావం, కోట్లాది సంవత్సరాలContinue reading “అం’తరంగా’ల్లో విశ్వకవి భావాలు (1) – ‘అ’ర్ణవం-‘ఆ’కాశం”
నాన్న చేసిన త్యాగం వ్యర్ధం కాదు, “మనిషి”ని మనిషిగా మార్చే ప్రేమై ఆ శౌర్యం, ధైర్యం మళ్ళీ అవతరిస్తాయి
Originally posted on YVR's అం'తరంగం':
? Don’t know if this world can ever give answers to the thousand questions that your young heart is pining for, O hero’s daughter ! ? ఈ దుఃఖానికి కారణమెవరు?ఈ గాయానికి బాధ్యులు ఎవరు? మనుషుల మధ్యన మంటలు పెట్టే మతమా?మతం పేరుతో నాటకమాడే రాజకీయమా? ఈ దుఃఖానికి కారణమెవరు?ఈ గాయానికి బాధ్యులు ఎవరు? చేతికొచ్చిన తలరాతలు రాసే దేవుళ్ళా?దేవుడి…
నాన్న చేసిన త్యాగం వ్యర్ధం కాదు, “మనిషి”ని మనిషిగా మార్చే ప్రేమై ఆ శౌర్యం, ధైర్యం మళ్ళీ అవతరిస్తాయి
Don’t know if this world can ever give answers to the thousand questions that your young heart is pining for, O hero’s daughter ! ఈ దుఃఖానికి కారణమెవరు?ఈ గాయానికి బాధ్యులు ఎవరు? మనుషుల మధ్యన మంటలు పెట్టే మతమా?మతం పేరుతో నాటకమాడే రాజకీయమా? ఈ దుఃఖానికి కారణమెవరు?ఈ గాయానికి బాధ్యులు ఎవరు? చేతికొచ్చిన తలరాతలు రాసే దేవుళ్ళా?దేవుడి పేరిట ద్వేషం నేర్పే మనుషులా? ఈ దుఃఖానికిContinue reading “నాన్న చేసిన త్యాగం వ్యర్ధం కాదు, “మనిషి”ని మనిషిగా మార్చే ప్రేమై ఆ శౌర్యం, ధైర్యం మళ్ళీ అవతరిస్తాయి”
నా జన్మభూమి ఎంతో అందమైన దేశము (2) – Tigers of Bandhavghar
Originally posted on YVR's అం'తరంగం':
అడవిలో టూరిస్టుల్ని మోసే ఏనుగులూ, జీపులూ దగ్గరగా రావడం ఇష్టం ఉండేది కాదుట ఛార్జర్ కి. మరీ హద్దు మీరుతున్నట్టనిపిస్తే వాటి మీద దాడి చేయబోతున్నట్టు హడావిడి చేసేది, గర్జించేది. అందుకే ఆ పేరు వచ్చింది. ఐతే ఏ ఎటాక్ లోనూ ఎవరూ గాయపడలేదు. ఉత్తుత్తి మాక్ ఎటాక్స్. మనుషుల్ని దగ్గరగా చూడడం అలవాటు పడిన అడవి మృగాలలో టాలరెన్స్ లెవెల్స్ అన్నిటికీ ఒకలాగా ఉండవు. పులులయితే కొన్ని చూసి…
నా జన్మభూమి ఎంతో అందమైన దేశము (2) – Tigers of Bandhavghar
అడవిలో టూరిస్టుల్ని మోసే ఏనుగులూ, జీపులూ దగ్గరగా రావడం ఇష్టం ఉండేది కాదుట ఛార్జర్ కి. మరీ హద్దు మీరుతున్నట్టనిపిస్తే వాటి మీద దాడి చేయబోతున్నట్టు హడావిడి చేసేది, గర్జించేది. అందుకే ఆ పేరు వచ్చింది. ఐతే ఏ ఎటాక్ లోనూ ఎవరూ గాయపడలేదు. ఉత్తుత్తి మాక్ ఎటాక్స్. మనుషుల్ని దగ్గరగా చూడడం అలవాటు పడిన అడవి మృగాలలో టాలరెన్స్ లెవెల్స్ అన్నిటికీ ఒకలాగా ఉండవు. పులులయితే కొన్ని చూసి చూడనట్టు వదిలేస్తే, కొన్ని దట్టమైన గడ్డిలోకి,Continue reading “నా జన్మభూమి ఎంతో అందమైన దేశము (2) – Tigers of Bandhavghar”
జీకే గా పీకే ఓకే పీకే గా ఏకే డబలోకే
Originally posted on YVR's అం'తరంగం':
ఏకే నటించిన పీకే, పీకే నటించిన గోపాల గోపాల ఓకే వారంలో చూసేసాం. జీకే గా పీకే ఓకే పీకే గా ఏకే డబలోకే రెండిట్లో థీమ్ ఒకటే, దేవుడికీ మనిషికీ మధ్య ఏర్పడ్డ దళారీ వ్యవస్థని ప్రశ్నించడం. గోపాల గోపాలలో ప్రశ్నలన్నీటికీ మొదట్లోనే దేవుడి ఆమోద ముద్ర పడిపోతుంది. పీకేలో అసలు దేవుడు రంగంలో ప్రవేశించకుండా, ఆయన ఆస్తిత్వానికి భంగం రాకుండా డిబేట్ అంతా మనుషుల మధ్యే జరుగుతుంది.…
మహాసముద్రంతో నీటి బిందువు అంటోంది ….
Originally posted on YVR's అం'తరంగం':
నువ్వూ నేనూ ఒకటనుకుంటే చెప్పలేని దైర్యం , ఆపలేని ఆనందం అనంతం నీ వైశాల్యం అగాధం నీ ఆంతర్యం అద్భుతం నీ సౌందర్యం అల్లకల్లోలం నీ ఆనందం అన్నీ నావే అన్నీ నేనే అంతలో ఏదో భయం, నేను నువ్వు కాదనిపించే సంవిద్వైతం అలగా ఎగయాలని ఆరాటం, ఎంత ఎగిసినా విరగకతప్పని దౌర్బల్యం కట్ట దాటనీయని నీ బంధం, కట్టలు తెంచే అర్ధంకాని చైతన్యం గుండె బాదుకున్నా చెదరని ఇసుక…