Central Catchment Reserve అనే పార్క్ లో ఇక్కడ, తన వనసీమని పరికిస్తున్న ఈ గొల్లభామని చూస్తూ వుండగా మా ఫ్రెండు పంపిన Save Nallamala Campaign మెసేజ్ వచ్చింది. వెంటనే సైన్ చేసి అడవి దారి (అలా అనుకోడం ఓ తృప్తి😆) వెంట నడుస్తూ దారి పొడుగునా వున్న ఈ ఆక్సిజన్ ఫాక్టరీలని తనివితీరా చూస్తూ వెళ్తూ – 5-star general ఛాతీ మీద మెరిసే Starsలాగా ఎన్నెన్నో తుఫాన్లు చేసిన గాయాలు నిండిన ఒంటితోContinue reading “ప్రజల కోరిక మీద ఇందిరాగాంధీ Silent Valley projectని ఆపేసింది(ట). మోడీగారు యురేనియం ప్రాజెక్ట్ ఆపుతారా?”
Author Archives: YVR's అం'తరంగం'
హుమ్..మ్..మ్..వెతికితే చిక్కడు-దొరకడు, దొరికితే కదలడు-వదలడు 😍
ఓ రెండు మూడు వారాల క్రితం లంచ్ బ్రేకులో మా ఆఫీసు చుట్టుపక్కల వున్న చెట్లు, పుట్టలు, పిట్టలు (రెక్కలు, ముక్కులు, ఈకలు వుండి గాల్లో ఎగిరేవేలెండి😉) చూసుకుంటూ తచ్చాడుతుంటే అదిగో ఆ అద్భుత జీవి కనబడింది. పేరు Cantao Ocellatus[Mallotus Shield Bug] (ట). ఎక్కువగా బొద్దిచెట్ల (Macaranga peltata) ఆకుల వెనకవైపు గుడ్లు పెట్టి, వాటిలోంచి పిల్లబ్యూటీలు బైటికొచ్చే వరకూ అక్కణ్ణుంచి కదలవుట. చుట్టుపక్కల ఎంత గందరగోళంగా వున్నా సరే కదలవుట. సరిగ్గా ఆContinue reading “హుమ్..మ్..మ్..వెతికితే చిక్కడు-దొరకడు, దొరికితే కదలడు-వదలడు 😍”
శాస్త్రిగారి సుబ్బయ్య
పుట్టి జన్మెత్తిన ఇన్నాళ్ళకి రావిశాస్త్రిగారి కధ మొదటిసారి చదివా. ఆఫీసులో ఏలాల్సిన బాసులూ, తోలాల్సిన ఈగలూ లేకపోవడంతో నిన్నా మొన్నా ఆఫీసులో కూచునే చదివేసా గబా గబా. అది రెండొందల యాభై పేజీల అల్పజీవి నవల. చదివాక తెలిసింది అది రావిశాస్త్రిగారి మొదటి ప్రచురిత నవల అని. నవలకి ఆయన వ్రాసిన ఉపోద్ఘాతం కానీ, చివరిమాట కానీ చదవకుండా డైరెక్టుగా నవలే చదివేసా. ఇదో సైకలాజికల్ పోర్ట్రైట్లా వుందే అనుకుంటూనే చదివేశా. ఒక అసమర్ధుడి జీవయాత్రలా కాకుండాContinue reading “శాస్త్రిగారి సుబ్బయ్య”
బ్లాగ్-పెద్దల్,గురుమిత్ర బాంధవులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలతో 😊🙏
బ్లాగ్-పెద్దల్, గురుమిత్ర బాంధవులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలతో 😊🙏 – YVR’s అం”తరంగం” మరియు YVRsఅంతరంగవాసి🌻🦚😍🦢🌹
Neil Arm💪strong (అనే) నీల బాహు🏋️♂️బలి
ఇవాళ ఈనాడులో ఒక ఐటమ్ చూశాక పాత టపా ఒకటి తిరగదోడాలనిపించింది. ఆ ఐటమ్ ఇదీ – https://www.eenadu.net/cinema/newsdetails/2/2019/08/09/138828/Doctor-Strange-director-Scott-Derrickson-is-all-praises-for-THIS-scene-from-Baahubali ఒక్క ‘ఈగ’ తప్ప తక్కిన రాజమౌళి సినిమాలన్నీ అరవ్వాళ్ళకీ, శివాజీగణేశన్తో సహా అతి అంటే ఏంటో పాఠాలు చెప్తున్నట్లు అనిపిస్తాయి (నాకు). మీకలా అనిపించకపోతే మీ తప్పుకానీ, అందుకు నా పూచీ కానీ ఏం లేవండోయ్. 133 కెమెరాలు పెట్టి తీసిన బెన్-హర్ ఛారియట్ రేసూ, మిట్టమధ్యాహ్నం వెన్నెల కురిపించిన మార్కస్-బార్ట్లే ” లాహిరి లాహిరి లాహిరిలోContinue reading “Neil Arm💪strong (అనే) నీల బాహు🏋️♂️బలి”
🌳🌾వనవిహారం🦜🌵 చిట్టీ చిలకమ్మది మహమద్ రఫీ & ఘంటసాల పాడినట్టు పుల్లా, పుడకా ముక్కున కరిచి కట్టిన గూడేం కాదు ….
చిట్టీ చిలకమ్మా! అమ్మా కొట్టిందా! అని చిన్నప్పుడు పాడుకోవడం, బుద్ధి పుడితే దొరికిన పిల్లకాయలచేత పాడించడం తప్ప చిట్టి చిలకమ్మ గూడు ఎలా వుంటుంది? అందులో చిలకమ్మ అసలేం చేస్తూ వుంటుంది? అనే ధ్యాస ఎప్పుడూ కలగలేదు. ధ్యాస కలిగేప్పటికి చిట్టిచిలకమ్మలు జనావాసాల్లో కనిపించడం తగ్గిపోయింది. ఈ నేచర్ ఫోటోగ్రఫీ మొదలెట్టిన దాదాపు రెండేళ్ళకి అదుగో ఆ చిలకమ్మ గూట్లోంచి తొంగిచూస్తూ నా కళ్ళకి, ఆ పైన నా కెమెరాకి చిక్కింది. మన ఇండియన్ రామచిలకకి దీనికీContinue reading “🌳🌾వనవిహారం🦜🌵 చిట్టీ చిలకమ్మది మహమద్ రఫీ & ఘంటసాల పాడినట్టు పుల్లా, పుడకా ముక్కున కరిచి కట్టిన గూడేం కాదు ….”
Chandrayaan2 – చందమామకి కాసిని చక్కిలాలు, జిలేబీలు + కంద ఫ్రై, ఘాటుగా గోంగూరా …
ఇవాళ సాయంత్రం కాలవొడ్డున షికారుకెళ్ళా …. అప్పుడు తీసిన ఫొటోలే ఈ టపాకి దారి తీశాయి. చంద్రన్న అంటే మళ్లీ పాలిటిక్స్ గుర్తొస్తాయి. చందమామలో వున్న హాయి చంద్రన్నలో వుంటుందా? నెలరాజులో వున్న చల్లదనం రాజన్నలో దొరుకుతుందా? ఏమో మరి? ప్రస్తుతం మన టాపిక్ వేరు. చందమామని నా P900 తో క్లోజప్ షాట్ తీశా…. నల్ల కళ్ళజోడు పెట్టుకుని వాళ్ళక్కయ్య, అదే మన పుడమితల్లి వైపు చూస్తున్నట్టు అనిపించాడు, మావయ్య. ఆయన మనసులో మాటలు కూడాContinue reading “Chandrayaan2 – చందమామకి కాసిని చక్కిలాలు, జిలేబీలు + కంద ఫ్రై, ఘాటుగా గోంగూరా …”
ఇదేం ఈక్వేషన్రా వెంకటేశా!! దీని భావమేమి తిరుమలేశా!!
మట్టి+నీళ్ళు=అండా+దండా అట. ఆహహా!! అలా అని ఎవరో అంటుంటేనూ!! ఇదేం ఈక్వేషన్రా వెంకటేశా!! దీని భావమేమి తిరుమలేశా!! అనుకుంటున్నా 🤔 అంతే 🤗ఇంకేంలేదు🙏🤓. తాడు ఒకటి తక్కువైందని ఎవరో అంటేనూ …. ఆ పైన పిట్ట రెట్ట శాస్త్రాన్ని గుర్తు చేస్తేనూ…. 👇👇👇 ఇంతే సంగతులు. బై4నౌ 🖐🤓
Destroy this Tree, Now ☝️😠
I mean, I want this 👇 – Demonic Tree of Politics destroyed, రాజకీయ విషవృక్షాన్ని కూల్చెయ్యాలి. No..ww…www ☝️😠 ఆ పని చాలా సింపుల్🤗, ఆ చెట్టు వేళ్ళకి అందుతున్న ఆహారం అందకుండా చెయ్యాలి. అవును, కానీ, అది చెయ్యడం ఎలా🤔? అదే నాయనా! ఎలా చెయ్యాలో ఆలోచించమనే చెప్తున్నా. ఆలోచించు. లోచించు. చించు. ఎదో ఒకటి! తొందరగా చెయ్! ఫస్టు, ఆ చెట్టుకి నువ్వు పోస్తున్న నీళ్ళు ఆపేయ్!! సరేనా! ఆపేయ్!!Continue reading “Destroy this Tree, Now ☝️😠”
What YOU THINK you are What OTHERS THINK you are What you REALLY are ఒక వ్యక్తిలో పై మూడు పార్శ్వాలు వుంటాయి. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా. ఎంతటి త్రిలోకసుందరుడు, నవమన్మధుడు, వెండితెర వీరుడు, ఐనా సరే! పై మూడు పార్శ్వాలు వుండి తీరతాయి. ఒకవేళ లేకపోయినా ఆయన జీవితంతో ఏదో రకంగా ముడిపడి ఆ కారణంగా లాభమో, నష్టమో పొందిన, ఇంకా పొందాలనుకుంటున్న వాళ్ళంతా ఎవరికి తోచిన పార్శ్వాన్ని వాళ్ళు చూపిస్తారు.Continue reading