నా అం’తరంగం’


yvrs-%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%b0%e0%b0%82%e0%b0%97%e0%b0%82

RAMANAVAMI

29 March 2017, ఉగాది

WhatsApp Image 2017-03-29 at 11.19.32

Nov’16

thappadu

09Oct’16, 1540hrs

collage-2016-10-09-11_24_53

03rd Oct’16, 2300hrs

గాంధీజీ పేరుతో పోస్ట్ పెడితే మొత్తం నలుగురు చూశారు. అల్లు అర్జున్ మీద పోస్ట్ పెడితే రెండువందల అరవై నలుగురు చూశారు. ప్చ్! 😦

బాపూజీ! మీ పేరు M.K.గాంధీ నుంచి అల్లు మోహన్‌దాస్ కరంచంద్ అని మార్చుకుంటే మంచిదేమో ‌‌!!!

2nd Oct.’16, 08.30am

2nd-oct_12

20th Sept.’16, 12.58 am

Writing for your own blog gives you an opportunity to redefine your life. When you write something you think is good for public consumption you will feel an urge to practice what you preach. Otherwise it is difficult to write. Thus blogging is an enlightening experience for sincere writers.

20th Sept.’16, 12.42am

పశూనాం నరజన్మ దుర్లభం అని నమ్మేవాళ్ళు కొందరు.దేవతలు కూడా మనుషులుగా పుట్టి జీవితం అనుభవించాలని తహతహలాడుతూ ఉంటారు అని అంటారు కొందరు.గోవుని మించిన జీవి అసలులేనేలేదని కుండ బద్దలు కొట్టేస్తారు ఇంకొందరు.బట్, మనిషి కన్నా, ఆవు కన్నా చెట్టు గొప్పది కదూ? ఎట్‌లీస్ట్ 90% వృక్షజాతులు మరో జీవిని మోసం చేసే, చంపే అవసరంలేని బ్రతుకు బ్రతకడంలేదూ? వందలయేళ్ళయినా వేలయేళ్ళయినా జీవితమా అంతా కేవలం సూర్యరశ్మి, నేలలో ఇంకిన నీరు, లవణాలతో సరిపెట్టుకుని బ్రతికే చెట్లుచేమలు నిజమైన ఋషి జీవితం గడుపుతున్నట్టు కాదూ?

19th Sept.’16, 05.42am

ఫిలాసఫీ రాయడానికి టైము దొరకట్లేదు. దొరికినప్పుడు పెన్ను, అదే కీ బోర్డు, ముందుకి కదలదు. మైండ్‌లో ఉన్న ఆలోచనలు వేళ్ళలోకి, వాట్నుంచి కీ బోర్డులోకి ప్రవహించి అక్షరాలుగా మారడం ఒక పట్టాన జరిగే పని కాదు.అందుకే, ఎప్పుడే ఐడియా వస్తే, ఏ ఐడియాకి ఆలోచనలు త్వరగా అక్షరాలై ఘనీభవిస్తున్నాయో అవే రాస్తున్నా.

19th Sept.’16, 02.30am

స్వేదమ్ ఖేదమ్ మోదమ్ అనుభవించి మది పలికెను నాదమ్ //భేదమ్ అభేదమ్ అధిగమించి హృది పాడెను వేదమ్ //తొలి దమ్‌తో మొదలై జీవయాత్రలో కదిలిన పాదమ్, బ్రతుకుపాటలో ఆఖరి పాదమ్ తెరవెనక్కు తరిమే మరొక్క చిరుదమ్‌ // పరమాత్మను నేనై చూచు వినోదమ్, జీవాత్మగ చేసే నిస్సహాయ అనునాదమ్//

(ఇవి టాగోర్ మాటలు కావని ఈజీగానే తెలిసిపోతుంది కనక ఆయనవి కావు అని రాయలేదు 😉 )

19th Sept.’16, 02.00am

సముద్రమన్నా, కడలి అలలు మనసులో కదిలించే తాత్వికభావ పరంపరలన్నా ఉన్న మక్కువతో ఈ బ్లాగ్ టైటిల్లో అంతరంగాన్ని అం’తరంగం’ చేసాను, 2012లో. ఇప్పుడే తెల్సింది గరికిపాటి నరసింహారావుగారు తన సాగరఘోష కావ్యంలో అధ్యాయాలని అంతరంగాలుగా సంబోధించారని, 2001లో. అంతటి సాహిత్యవేత్తకి వచ్చిన ఐడియానే నాకూ రావడం కాకతాళీయం, అదృష్టం అని తెలిసినా అంతులేని స్పేస్-టైమ్ కంటిన్యువమ్‌లో ఎక్కడో ఆ మహాకవి అంతరంగాల వేవ్ ఫ్రీక్వెన్సీకి నా థాట్ ‌వేవ్స్ రిసోనేట్ అయ్యాయనిపిస్తే (ఐ మీన్ ఊహించుకుంటే) ఆ ఫీలింగ్ బావుంది. అది జరగడానికి ఓ పదకొండేళ్ళు, జరిగిందని తెలియడానికి ఓ పదహారేళ్ళు పట్టింది. Better late than never. నేనెక్కాల్సిన రైలు ఒక జీవిత కాలం లేటు అనుకోను. నేనున్న రైలు ఓ లైఫ్ టైం లేటుగా నడుస్తోంది అనుకుంటాను.

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s