అక్టోబర్ 2 అనే తారీఖుకి జాతకం మారి, దశ తిరిగి 150 ఏళ్ళు …..


అక్టోబర్ 2 ప్రాముఖ్యత, ఆ ప్రాముఖ్యతతెచ్చిన వ్యక్తిపై వైముఖ్యత, ఆయన ఫిలాసఫీ మీద నిరాసక్తత, ఆ ఫిలాసఫీ అర్ధంకాని, పాటించలేని అశక్తత అన్నీ దేశంలో సమానస్థాయిలో పెరుగుతున్న ఈ రోజు,

అక్టోబర్ 2 అనే తారీఖుకి జాతకం మారి, దశ తిరిగి 150 ఏళ్ళు నిండిన ఈ రోజు గాంధీతాత తలంపుకి రాగానే ముందుగా మా ఇంట్లో పూసిన గులాబీ దగ్గర ఇలా చిన్న రెండుజడల పిల్లని చెయ్యి పట్టుకు నడిపిస్తూ కనిపించారు. హథ్రాస్ ఘటన గుర్తొచ్చింది. బొమ్మ పైన ఆ కాప్షన్👇 పెట్టేదాకా మనసొప్పలేదు.

సాయంత్రం మళ్ళీ మా ఇంట్లోనే ఆ👇 వీణానాదంలో బాపూజీ అడుగుల సవ్వడి వినబడే వరకూ మనసు బాధగా మూలుగుతూనే వుంది. ఏమని? గాంధీతత్వాన్ని అందిపుచ్చుకునే అర్హత మనకింకా రాలేదేంటని.

ఆ తత్వం ఆత్మ స్వాతంత్ర్య తత్వం అని అర్ధమైనప్పుడు కదా అర్హత వచ్చేది.

🌹🙏🌹

25 thoughts on “అక్టోబర్ 2 అనే తారీఖుకి జాతకం మారి, దశ తిరిగి 150 ఏళ్ళు …..

 1. విన్నకోట నరసింహారావు

  మీరు అనుకుంటున్న స్వాతంత్ర్యం భారతప్రజలకు ఇప్పట్లో వచ్చే సూచనలేమీ లేవు. ఎక్కడో దారి తప్పింది. గాంధీ జయంతి నాడు చేసే హడావుడి, వర్థంతి నాడు చేసే భజనలు నిజాయితీ కనబడని కంటితుడుపు కార్యక్రమాలు మాత్రమే. మేరా భారత్ మహాన్🙏.

  “We know Albert Einstein’s famous words on Gandhi:
  “Generations to come will scarce believe that such a one as this ever in flesh and blood walked upon this earth.“”

  అదేదో ఇప్పటికే వచ్చేసినట్లుంది.

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   VNR sir, ఐన్-స్టీన్ కి మనవాళ్ళ సంగతి తెలియదు కానీ, తెలిస్తే indians of current generation scarce understand Gandhi అని అప్పుడే అనేవాడని నా అనుమానం.

   Like

   Reply
 2. bonagiri

  బొమ్మ బాగుందండి.

  విషాదం ఏమిటంటే, మనకి గాంధీజీని తలుచుకునే అర్హత ఉందా అని ప్రశ్నించుకునే రోజులు పోయాయి. గాంధీజీకే ఆ అర్హత ఉందా అని ప్రశ్నించే రోజులు వచ్చాయి.

  Like

  Reply
  1. విన్నకోట నరసింహారావు

   బోనగిరి గారు లెస్స పలికితిరి 👌.
   చారిత్రక వ్యక్తులు సాధించినదానిని ప్రక్కన బెట్టి వారిలో లోపాలు వెతకడం ఫాషనై పోయింది.

   Like

   Reply
   1. సూర్య

    ప్రతి సమస్యలోకి కులం, మతం, ప్రాంతం ఇరికించి మేధావుల్లా పోజుకొట్టడం కూడా ఫ్యాషన్ అయిపోయింది లెండి.

    గాంధీ పేరుచెప్పుకుని దేశాన్ని ఏలేద్దామని కొందరు, గాంధీని ఎలా చేరిపెయ్యాలా అని కొందరు తెగ మధనపడిపోతున్నారు.

    Like

    Reply
     1. Jai Gottimukkala

      అణిచివేతకు ఏది ప్రాతిపదికో ధిక్కారానికీ అదే కేంద్రబిందువు కావడం సహజం.

      ఊరవుతలి పాకలు అగుపిస్తలేవు కాబట్టి లేనేలేవనడం గాంధేయం కాదు, కండ్లకు గంతలు కట్టుకున్న గాంధారేయం.

      Like

      Reply
   2. బుచికి

    https://www.opindia.com/2020/10/mahatma-gandhi-celibacy-brahmacharya-experiments-sleep-naked-bath-women/amp/
    – గాంధీ గారి గురించిన కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల ఈ వ్యాసం చదివాను. ఆయన లోని సత్య సంధత, నిరాడంబరత, గ్రామ స్వరాజ్యం, భారత దేశం పైన ఉన్న ప్రేమ. . ఈ గొప్ప గుణాలు అందరికీ ఆదర్శం. అయితే ఆయన బ్రహ్మ చర్యం పై చేసిన ప్రయోగాలు, మనకు హాని చేసే వారి పైన కూడా అహింసా వాదం బోధించడం .. ఇలాంటివి సమాజానికి మంచిదో కాదో చర్చించడం తప్పు కాదు.

    Like

    Reply
    1. YVR's అం'తరంగం' Post author

     బుచికిగారు, గాంధీ ఎక్స్పెరిమెంట్లు ఇప్పుడు కొత్తగా బైటపడినవి కాదుగా. ఆయన బతికున్నప్పుడే పబ్లిక్ డొమైన్ లో వున్న విషయాలు. అవి 100% weird & absurd. ఆడపిల్లలకి సంస్కారం నేర్పకపోవడం వల్లే రేప్స్ జరుగుతున్నాయనే వింత థియరీలకంటే, ఆ థియరీలకి తాళం వెయ్యడంకంటే weird & absurd కాదేమో.

     Like

     Reply
  2. YVR's అం'తరంగం' Post author

   థాంక్యూ బోనగిరిగారూ, అవును. ఆయనది simple living-high thinking మోడల్, ఇప్పుడున్నది high living-simplest-possible thinking మోడల్😆

   Like

   Reply
 3. Jai Gottimukkala

  పెద్ద చదువులు చదివి బోలెడంత దుడ్డు సంపాయిస్తున్న ఠాకుర్ యువకుడు చనిపోతే యాగీ అంతాఇంతా కాదు. ఠాకుర్ల యోగిరాజ్యంలో అసమదీయుల ఉక్కుపాదం కింద అన్నెం పున్నెం ఎరగని దళిత ఆడబిడ్డ బలైపోతే అడిగే దిక్కు లేదు.

  మనువాదమా వర్ధిల్లు. పురుషాహంకారమా మళ్ళీ నీదే గెలుపు. రాజరికమా నీకు అడ్డు లేదు.

  దేశమా విలపించు. గ్రామమా కుంగిపో. స్వరాజ్యమా చచ్చిపో.

  కారంచేడు నుండి హత్రాస్ వరకు నిర్విరామంగా సాగుతున్న దొరహంకారం ఇంకెన్నాళ్లు? మనిషిని మనిషిగా గౌరవించ(లే)ని పుక్కిటి పురాణాలు సమిసేదెప్పుడు? యోగి పుంగవుల రామరాజ్య బూటకానికి తెర పడదా?

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   జైగారూ, ఈ “అందాల రాముడు” పాట గుర్తుకొచ్చింది.
   //రాముడేమన్నాడోయ్…
   సీతా.. రాముడేమన్నాడోయ్
   నాడు రాజులంతా మంత్రులైతే మెచ్చుకున్నాడోయ్
   కొందరు మంత్రులు మారాజులైతే నొచ్చుకున్నాడోయ్ .. డోయ్ .. డోయ్//

   కొంచెం మార్చాను…

   రాముడేమన్నాడోయ్…
   సీతా.. రాముడేమన్నాడోయ్
   రాజులంతా (జనకుడిలాంటి) యోగులైతే మంచిదన్నాడోయ్,
   కొందరు యోగులేమో సీఎంలైతే
   తల పట్టుకున్నాడోయ్.. డోయ్.. డోయ్
   😆😆😆😆😆😆😆😆

   Like

   Reply
   1. విన్నకోట నరసింహారావు

    ఆహా, చాలా బాగుంది. paraphrasing లో మీరు సిద్ధహస్తులు లాగా ఉన్నారే!

    (ఇటువంటి తెలుగు సినిమా పేరు చెబుతున్నప్పుడు పేరుకి ముందో వెనకాలో బ్రాకెట్లో “పాత” అని కూడా తగిలించండి తికమక కలగకుండా. పాతసినిమా పేర్లను కొత్త సినిమాలకు ఏమీ సంకోచం లేకుండా పెట్టే ధోరణి బాగా పెరిగి పోతోంది …. భావదారిద్ర్యం అనుకుంటాను)

    Like

    Reply
  2. bonagiri

   జై గారు, రామరాజ్యం ఎప్పుడు వస్తుందో తెలియదు కాని, కామరాజ్యం మాత్రం నడుస్తోంది.

   Like

   Reply
 4. బుచికి

  ఏ ఆడపడుచు పైన అరాచకం జరిగినా సమాజం ప్రభుత్వం స్పందించ వలసిందే. దోషులకు కఠిన శిక్ష పడవలసిందే. అయితే ఇప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కులం మతం ఆధారంగా రాజకీయం జరుగుతుంది. హత్రాస్ ఘటన కు ముందు యూపీ లో ఒక దళిత యువతిని అన్య మతస్థులు కిరాతకం గా చంపారు. అప్పుడు మీడియా గానీ ప్రియాంకా రాహుల్ ప రామర్శాకు వెళ్లరు. ఎందుకంటే దోషులు హిందువులు కారు కాబట్టి.

  అలాగే ఇటీవల ఒక హిందూ యువతి ని మతాంతర వివాహం చేసుకొని మతం మారనందుకు తల నరికి చంపారు. ప్రియాంక రాహుల్ సెక్యులర్ మీడియాకు అవసరం లేదు.

  దిశ నిర్భయ ఘటన లో బలై పోయిన ఆడ పడుచులు దళితులు కారు.

  పాల్గార్ లో హిందూ సాధువులను కొట్టి చంపినప్పుడు మీడియా రాజకీయం స్పందించదు.

  అత్యాచార బాధితులు దలితేతరులు , దోషులు హైందవేతరులు అయితే బలైపోయిన వారి ప్రాణాలకు విలువ ఉండదు. అప్పుడు మను స్మృతి, దొరల పాలన అనే మాటలు రావు.

  ఇది ప్రస్తుత భారతదేశం లో ఉన్న కుల మత ఆధారిత రాజకీయం.

  బలై పోయిన ఆడ పడుచులకు ఆత్మ శాంతి, దోషులకు కుల మత అతీతంగా కఠిన శిక్షలు తొందరగా అమలు జరగాలని కోరుకుందాము.

  All Lives matter.

  Like

  Reply
 5. bonagiri

  From one of my earlier post in my blog.

  మనం గాంధీజీని, ఆయన మార్గాన్ని నిజంగానే గౌరవిస్తున్నామా? మన రాజకీయ నాయకులు ఆయన పేరు చెప్పుకుని విచ్చలవిడిగా అధికారం చెలాయిస్తున్నారు. మరొవైపు కొంతమంది కుహనా మేధావులు గాంధీజీ జీవితంలోని చిన్న చిన్న తప్పులు ఎత్తి చూపుతూ ఆయనని కించపరుస్తున్నారు. అసలు ఈ ప్రపంచంలో గాంధీజీని విమర్శించే అర్హత ఎంతమందికి ఉంది? పురాణాల్లో దేవుళ్ళే తప్పులు చేసారు. అయినా వాళ్ళని మనం పూజించట్లేదా? మానవమాత్రుడు గాంధీజీ కూడా కొన్ని తప్పులు చేసి ఉండచ్చు. అయినా ఆయన తప్పులు ఎత్తిచూపడం కంటే ఆ మహాత్ముని గొప్పతనాన్ని ప్రచారం చేస్తే భావి తరాలకు కూడా ఒక ఆదర్శమూర్తి ఉంటాడు.
  సబ్ కో సన్మతి దే భగవాన్.

  Like

  Reply
 6. varma

  చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చాలా బాగుంది. మేము ఒక వెబ్సైటు రన్ చేస్తున్నాము దానిపేరు https://www.prajavaradhi.com telugu news(s) latest updates movie updates అందిస్తున్నాము దయచేసి మా వెబ్సైట్ ను వీక్షించి మీ అబిప్రాయం తెలుపగలరు.

  Like

  Reply
 7. prajavaradhi

  చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చాలా బాగుంది. మేము ఒక వెబ్సైటు రన్ చేస్తున్నాము దానిపేరు telugu news(s) latest updates movie updates అందిస్తున్నాము దయచేసి మా వెబ్సైట్ ను వీక్షించి మీ అబిప్రాయం తెలుపగలరు.

  Like

  Reply
 8. bonagiri

  ఆయనెవరో వాట్సాప్ మెసేజ్ పట్టుకొచ్చి గాంధీనే కాకుండా బుద్ధుడు, అశోకుని కూడ blame చేస్తున్నారు. మరి జపాన్ లాంటి దేశాలు బుద్ధిజం ఇప్పటికీ ఫాలో అవుతూ అంత అభివృద్ధి ఎలా సాధించాయో?

  Like

  Reply
  1. Jai Gottimukkala

   బోనగిరి గారూ,

   జగమే మాయా బ్లాగులే మాయా
   వాట్స్యాపులే విశ్వవిద్యాలయాలయా

   Like

   Reply
   1. YVR's అం'తరంగం' Post author

    గజం మిధ్య, పలాయనం మిధ్య అని ఒక కథ వుంది కదా. అదే ఫాలో అయిపోతున్నారు వాట్సప్ యూనివర్సిటీ ఛాన్సలర్లు & ఫార్వర్డ్ స్పెషలిస్ట్లు 😆😆😆😆

    Like

    Reply
  2. YVR's అం'తరంగం' Post author

   వాట్సప్ యూనివర్సిటీ పట్టభద్రులు ఎక్కువైపోయార్లెండి ఈ మధ్య. వాళ్ళ కోసం వాట్సప్ ప్రొఫెసర్లు, హిస్టోరియన్లు కూడా పెరుగుతున్నారు.

   Like

   Reply
   1. విన్నకోట నరసింహారావు

    వాట్సప్ యూనివర్శిటీ 😁😁😁😁.
    డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో అగ్రగామి 😁😁😁😁

    Like

    Reply
 9. విన్నకోట నరసింహారావు

  YVR,
  ఎల్లరున్ సుఖులే కదా?
  మీ సింగాపురంలో కొత్త సంవత్సరం ఆల్రెడీ వచ్చేసినట్లుంది. మీకు, మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు🌹🌹. .

  Like

  Reply

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s