
అయోధ్యరామా
అగణిత గుణధామా
అగస్టైదు నీ కరోనేషన్ (Coronation)
అదిరిపడుతు మరోవైపు కరోనాతో నేషన్
అద్వానీ రాకుండా
అవనిపూజ జరిగింది,
అఖాడాల అలుపెరగని పోరాటం
అగారమై వెలయనుంది
అవతార పురుషుడా!!
అఫీషియల్లీ నువ్విప్పుడు
అయోధ్యాపురవాసివి,
అధికారపుపగ్గాలను అందించే సారధివి
అమాయకభక్తికి, వోట్లకి మధ్య వారధివి
అబలలకీ,
అనాధాశ్రమాలకీ,
అహల్యోద్ధారకా నేటినుండి నీవే దిక్కువి
అవనిజాపతీ!!
అడవుల ఆచ్ఛాదన తొలగిన
అవని కోరుతోంది శరణాగతి.
అష్టకష్టాల బడుగులనీ,
అప్పులపాలైన రైతులనీ
అమరావతి అందని ఆంధ్రులనీ
అయోధ్యరాజా ఆదుకోవాలిక నువ్వే.
అవినీతిని,
అక్రమాల్ని,
అత్యాచారాల్ని,
అరాచకాల్నీ
అరికట్టే బాధ్యత ఇకపై నీదే.
అదేం పాపం!! అంటావా?
అధికారంలో వున్నా,
అప్పోజిషన్లో కూచున్నా,
అసెంబ్లీలొ, పార్లమెంట్లొ
అధిష్ఠానాల కనుసన్నలు దాటి,
అధికారలాలస మించి,
అజెండాలు లేవు మా ప్రతినిధులకి.
అభివృద్ధి ముసుగులో పెరుగుతున్న
అసమతౌల్యం,
అరాచకపు ముద్రవేసి సాగించే
అణచివేత, ఏవీ పట్టవు వారికి.
అబ్దుల్ కలాం కలలు,
అంగారక గ్రహయాత్రలు,
అమెరికాతో దోస్తులు,
అంబానీల ఆస్తులు,
అణుశక్తితొ ఆటలు
అన్నిట్లో ముందున్నా,
అలో లక్ష్మణా!!
అన్నమో రామచంద్రా!!అంటూ
అర్రులు చాచే ఆర్తులకీ కొదవలేదు
అరమర చేయకు, స్వామీ
అర్జెంటుగ ఆదుకొనుమీ
అయోధ్యరామా
అగణిత గుణధామా
అగస్టైదు నీ కరోనేషన్ (Coronation)
అదిరిపడుతు మరోవైపు కరోనాతో నేషన్ *****************************
ఇంతే సంగతులు 🙏🙂
// “అద్వానీ రాకుండా అవని పూజ జరిగింది “ //
ఏరు దాటాక ……. ……???
బాధ కలిగించే విషయం ఇది. ఆమధ్య ఒక సభలో వేదిక మీద అందరినీ పలకరిస్తూ అద్వానీ వైపు చూడను కూడా చూడకుండా దాటి వెళ్ళిపోయినప్పుడే అర్థమయింది కదా.?
రాముడికి ఇల్లు ఏర్పరచడం సంతోషమే గానీ దాంతో
దేశభారమంతా మొత్తానికి రాముడి మీద వేసేశారన్నమాట? అంతకన్నా చెయ్యగలిగేదీ ఏమీ కనబడడం లేదు లెండి.
కరోనేషన్ …… కరోనా నేషన్ 👌👌🙂
LikeLike
హైదరాబాద్ అనాధాశ్రమం ఘటన కలిగించిన బాధకి ఇంకొన్ని కలిపి రాములవారికి ఇలా convey చేసాను సర్ వీఎన్నార్ గారు.
LikeLike
టపా బాగా వ్రాసారు కాని బొమ్మ నచ్చలేదు.
ఇంతకు ముందు whatsapp లో కూడ ఇలాంటి బొమ్మ వచ్చింది.
రాముని బొమ్మ చిన్నగా, మోడీ బొమ్మ పెద్దగా ఎందుకు? రాముని కన్నా ఎవరూ పెద్ద వాళ్ళు కాదు. రాముడిని నడిపించగల వారెవరు?
అయినా అయోధ్య లో రామాలయం కట్టినంత మాత్రాన భారత దేశంలో రామరాజ్యం వచ్చేస్తుందా?
LikeLike
//రాముని బొమ్మ చిన్నగా, మోడీ బొమ్మ పెద్దగా ఎందుకు?//
మీరన్న ఆ whatsapp బొమ్మ చాలామంది నిజభక్తులని, కొంతమంది “రామభక్త”భక్తుల్ని ఆలోచనలో పడేసింది. అందుకే అదే కాన్సెప్ట్ కంటిన్యూ చేశాను. ఆలోచన అంటే ఆత్మారాముడికి ఇష్టం కదా!!
//అయినా అయోధ్యలో రామాలయం కట్టినంత మాత్రాన భారత దేశంలో రామరాజ్యం వచ్చేస్తుందా?// భలేవారండీ బొనగిరిగారు, ఇలాంటి ప్రశ్నలు వెయ్యొచ్చా? తప్పు కాదూ!!😆😆😆
LikeLiked by 1 person
మొత్తానికి దేముడిని సుద్దర భక్తుడే నిలబెట్టాడు. మండలానికి కమండలమే ధీటుగా నిలిచింది.
చిన్ని బాలరాం (బలరాం అంటే వేరేటాయన), తుసీ చంగా హో.
LikeLike
Indian Politics = (సాష్టాంగ)దండం (🙏)+దండం(💪)+కోదండం(🏹🛕)+మండల్+కమండల్+దానం(₹)
LikeLike
సాష్టాంగం కూడా ఉందండోయ్!
LikeLike