ఛస్తుంటే సంధి మంత్రంలా నీ సుత్తి పోస్టులేంట్రా అనకండి. శొంఠిపిక్కల కషాయంతో మొదలెడితే హోమియోపతి, అల్లోపతి, అల్లం-వెల్లుల్లోపతి, పసుపోపతి, ఎండోపతి (అదే ఎండలో నుంచోడం), నీడోపతి (నీడలో పడుకోడం, ఇదింకా ఏ వైద్యనారాయణుడూ ప్రకటించలేదు), జానీవాకరోపతిలకి వేంకటాచలపతిని కూడా జోడించి సోషల్ మీడియాలో తెగ హోరు పుట్టిస్తుంటే పెరిగిన చిరాకుకి –
కోట్లమందికి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలున్నాయనే అంచనాలు కలిగించిన ఆందోళనకి –
మన నాయకుల పారాసిటమాల్ + బ్లీచింగ్ పౌడర్ రెమెడీలు పుట్టించిన ఫ్రస్ట్రేషన్ తోడై –
చివరికి నాకే కొత్త కొత్త ఐడియాలు పుట్టుకొస్తన్నై. వాటిలో శాంపిల్ కి ఒక ఐడియా. మన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అన్ని రకాల వైద్యవిధానాలనీ ఇమిడించి ఎవరికిష్టమైన రెమెడీ వారికి అందించీ కరోనాని ఎదుర్కుని గెలిచే ఐడియా అనమాట. అదేంటంటే, ఇదుగో ఇదీ 👇, ఇలా రాసి వాట్సప్ లో పెట్టా.

నాదో ఉచిత సలహా. ఎవరికి ఎలాంటి వైద్యం కావాలో ముందే సెలక్ట్ చేసుకోవాలి, తరువాత ఛాయిస్ మార్చడం కుదరదు అని హెల్త్ మినిస్టర్స్ ఒక స్టేట్మెంట్స్ ఇవ్వాలి.
Eg.
అల్లం, పసుపు చాలు అనేవాడికి సింప్టమ్స్ పోయే వరకు అవే ఇస్తారు.
ఎండలో నుంచుంటే చాలు అనేవాణ్ణి వైరస్ వదిలే వరకూ ఎండలో నిలబెడతారు.
పారసిటమాల్, బ్లీచింగ్ పౌడర్లని నమ్మేవారికి అవి ఫ్రీగా సప్లై చేస్తారు.
అంతే ఇంకే ట్రీట్మెంటూ వుండదు.
దెబ్బకి మూడు లాభాలు కలుగుతాయి.
1.హాస్పిటల్సూ, మెడికల్ స్టాఫూ ఓవర్లోడ్ అవ్వరు.
2.జనతా కర్ఫ్యూ సక్సెస్ కూడా అవుతుంది.
3.వాట్సప్ కూడా ఓవర్లోడ్ అవ్వకుండా వుంటుంది.
ఇది ఒక ఫ్రెండుకి రుచించలేదు, వెటకారం అనిపించింది. “మన కిందకి నీళ్ళొచ్చే వరకూ వెటకారం మానం మనం,” అన్నాడు.
“నీళ్ళు కిందకి రావడం ఏంటి? పీక వరకూ ములిగి వుంటే 😆.
ఐనా కర్ఫ్యూలు, క్వారంటైన్లూ తప్పించుకునేవాళ్ళనీ,
ఇన్ఫెక్ట్ అయినా వార్డ్ లోంచి తప్పించుకునేవాళ్ళనీ, జనం భయాన్నీ, అమాయకత్వాన్నీ బిజినెస్ ప్రమోషన్ కోసం వాడుకునేవాళ్ళనీ చూసి వెటకారాలూ, మిరియాలూ నూరక ఊరకయుండుట ఎలా మిత్రమా!!?!!,” అన్నా.
“సరే, నీ ఇష్టం వచ్చినట్టు ఏడు,” అని వదిలేశాడు. అంతేసంగతులు, బై4నౌ 🙏🤓🙏
మిరియోపతి కూడా గానీ ఇంతకీ మీరు వాట్సప్ లో పెట్టినదేమిటి? చెయ్యి బొమ్మ చూపించారు అంతే లింక్ ఇవ్వడం మరచినట్లున్నారు.
LikeLike
” అంతరంగమోపతి ” వదిలేసారే అది కూడా వాట్సప్ లో చక్కర్లు కొడుతోందట 🙂 ( if you can’t go outside go inside :))
కరోన మాతా నమో నమః
త్వమేవ మహామాయా
జిలేబి
LikeLike
“నాదో ఉచిత సలహా. ఎవరికి ఎలాంటి వైద్యం కావాలో ముందే సెలక్ట్ చేసుకోవాలి, తరువాత ఛాయిస్ మార్చడం కుదరదు అని హెల్త్ మినిస్టర్స్ ఒక స్టేట్మెంట్స్ ఇవ్వాలి”.
మంచి ఉపాయం. అప్పుడే తప్పుడు స్టేట్మెంట్లు మాని డాక్టర్లు చెప్పింది వింటారు.
చివర్లో మిమ్మల్ని ఏడవమన్న మిత్రుడు ఆల్రెడీ ఏడుస్తున్నట్లు ఉన్నాడు☺️☺️
LikeLike
హన్నన్నా ! వెటకారము
టన్నులకొద్దీ వచించుటా ? భరతావని యే
మన్నా చైనానా ? యో
రన్నా ! యిది దేవభూమి యని మరిచితిరా ?
LikeLike