ఢిల్లీలో “రామాంజనేయ”🏹🙏🐵 యుద్ధం; గెలిచిన”హనుమంతుడు”✌🏽


ఈ పాలిటిక్స్ వున్నాయి చూశారూ, టీకాలులేని virusలాంటివి. ఒకసారి పట్టుకుంటే వదిలే ప్రశ్నే లేదు. లేకపోతే ఏంటి, ఒకపక్క కరోనా వైరస్ గడగడలాడిస్తున్నా ఢిల్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ కోసం ఆత్రం తగ్గడంలేదు. మా వూళ్ళో నలభైఐదో కరోనా కేసు కన్ఫర్మ్ అయిపోయింది. నిన్న రాత్రి. ఐనా నిండా మునిగాక చలేంటి? నోరు, ముక్కు (మాస్కులతో) మూసుకుని మరీ పేపర్లు తిరగెయ్యడం తప్ప చెయ్యగలిగిందేం కనపడ్డం లేదు. చచ్చినట్టు అదే పని చేస్తున్నాం. ఢిల్లీలో ముగియబోతున్న “రామాంజనేయయుద్ధం” కాస్సేపు కరోనా మీంచి దృష్టి మళ్లించి రిలీఫ్ కలిగిస్తోంది అనుకున్నా. మళ్ళీ “రామాంజనేయయుద్ధం” మొదలైందా అనికూడా అనుకున్నా. అది త్రేతాయుగంలోనే అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడేంటని ఎవరైనా అడిగితే వాళ్ళనెవరూ బావు చెయ్యలేరు. త్రేతాయుగంలో యయాతి మహారాజు మొదటి రామాంజనేయయుద్ధానికి కారకుడైనట్టు ఇప్పుడు కేజ్రీవాల్ రెండో రామాంజనేయయుద్ధానికి దారి తీసాడు, హనుమాన్ చాలీసా చదివి. ఆఫ్ కోర్స్, ఈసారి రాములవారూ, హనుమంతులవారి మధ్య డైరెక్ట్ గా కాకుండా రామభక్తులు, హనుమంతుడి “శరణు” కోరిన కేజ్రీవాల్ proxy war నడిపారు. Proxy war కదా ఫన్ చూద్దాం అనుకున్నారో, ఏంటో మొదటియుద్ధాన్ని ఆపినట్టు బ్రహ్మో, శివుడో వచ్చి రెండోయుద్ధాన్ని ఆపలేదు. చివరికి రాముడి కంటే రామభక్తుడే బలవంతుడనిపించేలా కేజ్రీకి 61 సీట్లు, భక్తులకి 7 సీట్లు వచ్చాయి. (ఇది రాస్తున్న టైముకి). పొద్దున్న ఆమాద్మీ లీడింగ్ లో ఉందని చూడగానే “Is Lord Hanuman so pleased with Kejri’s Chalisa that he changed party?” అనుకున్నా. కానీ మొదటియుద్ధంలో రాములవారికి ఎదురుతిరిగి నానా క్షోభా పడిన హనుమంతుడు ఈసారి మళ్ళీ అలాంటి రిస్కు ఎందుకు చేస్తాడనిపించింది కాసేపు. కమలంగుర్తుకీ, అరవింద్ కేజ్రీ వాల్ లో వున్న అరవిందానికీ మధ్య కన్ఫ్యూజ్ అయ్యాడా అని అనుమానం వచ్చింది. అనకూడదు కానీ హనుమంతులవారి నిజాయితీ మీద కూడా డౌట్ వచ్చి, ఈయనకీ బంధుప్రీతీ, biased-opinions ఉంటాయా అనిపించింది. ఎందుకంటే కేజ్రీవాల్ అనగానే తండ్రి కేసరి(కేజ్రీ), తన జాతీ (వాల్ = వాలము) గుర్తుకొచ్చి పక్షపాతం, nepotism కనబరిచాడా అనిపించి, అంతలోనే రామ, రామ అనుకుని చెంపలు గట్టిగా వేసేసుకున్నా. ఐనా ప్రియభక్తుడు దారి తప్పుతుంటే రాములవారు చూస్తూ వూరుకుంటారా? ఊరుకోరు. నారదుణ్ణో, లక్ష్మణుణ్ణో రాయబారం పంపి పొత్తు కుదుర్చుకోవడమో, సీట్ల సర్దుబాటు చేసుకోవడమో చేసేవారు కదా. అలా చెయ్యలేదు. అంటే రాములవారు చూసీ చూడనట్టు వదిలేశారా? ప్రోబబ్లీ, కమలనాధుల కామెంట్లు, ఎన్నికల స్టంట్లూ ఇంకొంచెం polishedగా, ఇంకొంచెం refinedగా వుండాలనిపించిందేమో. రావణుడికి నేడు పోయి, రేపు రమ్మని చెప్పిన మర్యాదస్తుడికి ఆ మాత్రం ఎక్స్పెక్టేషనుండదూ భక్తుల మీదా?? సో, అవన్నీ సరిదిద్దుకుంటే, ఆ దిద్దుబాట్లు తనకి నచ్చితే నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలిపిస్తానని సూచిస్తూ ఏడో, ఎనిమిదో సీట్లు గెలిపించాడేమో. కిందటిసారి మరీ సున్నాలొచ్చాయి కదా!! దాంతో పోలిస్తే ఈసారి చాలా ఇంప్రూవ్-మెంటుంది కదా!! లేకపోతే కాంగ్రెస్ పార్టీలా consistentగా మళ్ళీ సున్నా వచ్చేదిగా !! ఐనా ఈ ఢిల్లీ జనానికి మాత్రం కాస్త ఇంగితం ఉండద్దూ?? పార్లమెంటుకి కమలాన్నీ, అసెంబ్లీకి చీపురుకట్టనీ కోరుకుంటే పాపం పార్టీలు కన్ఫ్యూజ్ అవ్వవూ? అర్ధం చేసుకోరూ!!!

ఇంతేసంగతులు, బై4నౌ 🙏🐵

30 thoughts on “ఢిల్లీలో “రామాంజనేయ”🏹🙏🐵 యుద్ధం; గెలిచిన”హనుమంతుడు”✌🏽

 1. సూర్య

  చీపురే కదా అని చీప్ గా చూడొద్దు. ఊడ్చి పారెయ్యటం దానికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు.
  నాకు అనిపించింది ఏమిటంటే మొన్నటి బడ్జెట్ లో ఎడమచేత్తో పన్ను రాయితీ ఇచ్చి కుడిచేత్తో తీసుకున్న యవ్వారం తో మధ్యతరగతి మండిందా అని!

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   సూర్య, ఢిల్లీవాసులకి చీపురునీ, కమలాన్నీ ఎలా వాడుకోవాలనేదాంట్లో ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయని, హనుమంతుడు వాళ్లతో ఏకీభవించాడనీ నాకనిపించింది 😄.

   Like

   Reply
  2. bonagiri

   కరక్టే కాని, ఈ పన్నులు దేశంలో అందరికీ ఊడగొట్టారు కదా!

   Like

   Reply
 2. bonagiri

  రామాంజనేయ యుద్ధం జరగకూడదనే దిల్లీ వాసులు రామభక్తులని పార్లమెంటుకి, ఆంజనేయభక్తులని అసెంబ్లీకి పంపించారని (ఒకప్పటి దిల్లీ వాసుడిగా) నా అభిప్రాయం.

  Like

  Reply
 3. Zilebi

  ఏ అస్త్రమైన యేమి భక్తులారా మాడేది మీ తలకాయే 🙂

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   జిలేబీజీ చెప్తున్నదేమిటంటే పళ్ళు రాలడం తప్పదు, ఏ రాయితో కొట్టుకోవడం అనేది ప్రజల ఛాయిస్ అని. 😃

   Like

   Reply
   1. విన్నకోట నరసింహారావు

    “జిలేబి” గారి “అంతరంగం” బాగా గ్రహించారండీ మీరు. YVR గారూ 🙂.

    Like

    Reply
    1. YVR's అం'తరంగం' Post author

     అవును సార్, వీఎన్నార్ గారు, జిలేబీగారు కనిపించకుండా (కందాలను) వినిపించేవారు (కవి) కదా !!

     Like

     Reply
 4. విన్నకోట నరసింహారావు

  హనుమంతుడికి “సంకట మోచనుడు” అనే పేరు గదా 🙂.

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   @విన్నకోటవారు,
   సర్, కేజ్రీవాల్ సంకటం తీర్చడం ద్వారా హనుమంతుడు ఆయనకి వున్న సంకటం కేంద్ర ప్రభుత్వం/బీజేపీ/కాంగ్రెస్ లే అని కన్ఫర్మ్ చేశాడంటారా?

   Like

   Reply
   1. విన్నకోట నరసింహారావు

    అంతేగా, అంతేగా 🙂
    ఎంతైనా మీరు కుశాగ్రబుద్ధులండీ 👌.

    Like

    Reply
 5. విన్నకోట నరసింహారావు

  ముఖానికి తొడుగు వేసుకుని తిరుగుతున్నానంటారా? చాలా మంచి పని👌. N95 మాస్కులే కదా? ఆ మాస్కులు మీ ఊళ్ళో సరసమైన ధరలకే అమ్ముతున్నారా (లేకపోయినా జనాలకు గత్యంతరం లేదు లెండి)? ధరలు విపరీతంగా పెంచి అమ్ముతున్నారని చైనాలో ఒక షాపుకు మిలియన్లలో జరిమానా విధించారని 30-01-2020 నాటి Deccan Chronicle (Hyd) daily 11వ పేజీలో వార్త వచ్చింది. చదివి నేను చాలా సంతసించాను. ప్రభుత్వాలు ఆ మాత్రం కఠినంగా ఉండడం ఇటువంటి సందర్భాలలో అవసరమే. చైనా ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి.

  “కరోనా వైరస్” భయం మూలాన మీ సింగపూర్ లోని DBS Bank వారు తమ ఉద్యోగులను work from home చేసుకోండని చెప్పారని ఇవాళ్టి (13-02-2020) Deccan Chronicle (Hyd) daily లో 13వ పేజీలో వార్త 👇.

  మీకందరికీ కూడా అటువంటి వెసులుబాటు ఇవ్వమని మీ ఆఫీసు వారికి సలహా ఇవ్వరాదూ?

  http://epaper.deccanchronicle.com/articledetailpage.aspx?id=14565949

  అలాగే ఈ వైరస్ గొడవ పూర్తిగా తగ్గిపోయ వరకు చైనా వెళ్ళమని కూడా మీ బాసుడుకి / బాసిణికి చెప్పెయ్యండి. “చైన పక్క కెళ్ళొద్దురా డింగరీ” అని మీ వాళ్ళు హెచ్చరిస్తున్నారని కూడా చెప్పండి 🙂.

  Anyway take care ☝️.

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   @VNRసర్, N95లు దొరకడంలేదండి. ప్రస్తుతానికి సర్జికల్ మాస్కులే. on-line ఆర్డర్ చేశాం. //మీ ఆఫీసు వారికి సలహా ఇవ్వరాదూ?// ఇప్పటికి అంతా case-by-case వ్యవహారమేనండి. Pregnant women కి మాత్రం work from home ఇచ్చారు. చైనా ట్రిప్పులు ఆగిపోయాయి.

   Like

   Reply
   1. విన్నకోట నరసింహారావు

    కరోనా వైరస్ అదునుగా మాస్కులను అధికధరలకు అమ్ముతున్న మెడికల్ షాపొకదానికి భారీ జరిమానా విధించిన చైనా ప్రభుత్వం …. అనే వార్త గురించి పైన నా వ్యాఖ్యలో (13-02-2020) తెలియజేసాను కదా.
    ఇప్పుడు ఆ వైరస్ హైదరాబాద్ నగర ప్రవేశం (మా చిన్నతనంలో “జింబో నగర ప్రవేశం” అనే సినిమా వచ్చింది లెండి 😊) చెయ్యడంతో ఇక్కడి మెడికల్ షాపులు 3 రెట్లు 4 రెట్లు ధర పెంచి మాస్కులను అమ్ముతున్నారని ఇవాళ్టి వార్త …. 04-03-2020 ఆంధ్రజ్యోతి (Hyd) దినపత్రికలో (page.9) 👇. చైనా ప్రభుత్వమంత కఠినంగా మన ప్రభుత్వాలు వ్యవహరిస్తాయనే సూచనలేమీ లేవు. అయినా షాపుల్లో మాస్కులు ఆల్రెడీ ఖాళీ లెండి.
    ప్రస్తుతానికి టీవీ చానెళ్ళు పండగ చేసుకుంటూ బిజీ బిజీ.
    https://epaper.andhrajyothy.com/c/49604719

    Like

    Reply
 6. Jai Gottimukkala

  2013 లో “మధ్యం దర్జా భద్రలోక్ బాబూ లోగ్ పార్టీ” గా మొదలయిన ప్రస్థానం ఇప్పుడు పెట్టుకున్న పేరుకు తగ్గట్టు అం ఆద్మీ గోసలను పట్టించుకునే స్థాయికి చేరింది. లగే రహో అరవింద్ భాయ్.

  ఒక్క ఫ్లై-ఓవరు కట్టలేదు, ఒక్క ప్రాజెక్టు చేయలేదు, లోక్పాల్ జోలికి పోలేదు, షహీన్ బాగ్ లాంటి భావోద్వేగ తతంగాలకు రెచ్చిపోలేదు.

  మొహల్లా క్లినిక్, ప్రాధమిక బడులు, జుగ్గీ-జోపిడి క్రమబద్దీకరణ, బిజిలీ బిల్ హాఫ్, పానీ బిల్ మాఫ్ అన్న మంత్రాలే నమ్మాడు. ఇవి తాయిలాలు.అంటూ కొట్టిపారేసే పడకఖుర్చీ మేధావులకు ఇవే భావి తరం ప్రగతికి బాటలు తీసే అభివృద్ధి ఆయుధాలని ఎప్పుడు అర్ధం అవుతుందో ఏమో?

  ఇక ఇప్పటికే మొదలెట్టిన ఈ “రత్నాలతో” పాటు కాలుష్య నియంత్రణ & సంపూర్ణ రాజ్ దర్జా మీద కూడా దృష్టి సారిస్తే ఢిల్లీ గల్లీల్లో తిరుగు లేని శక్తిగా నిలిచిపోవడం ఖాయం. కాదూ కూడదని “నా అంతటి ఘనుడు లేడు, దేశం మొత్తంలో చక్రం తిప్పేస్తా” అంటూ కాలర్ ఎగరేస్తే చతికిల పడడం అంతే నిశ్చితం తస్మాత్ జాగ్రత్త.

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   @Jai Gottimukkala, నాకు తాయిలాల ఎకనామిక్స్ మీద పెద్ద ఐడియా లేదు కానీ తాయిలాలు రాష్ట్రం ఆర్ధిక వ్యవస్థని బట్టీ, నాయకుల సిన్సియారిటీని బట్టీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఫలితాలిస్తాయని అనుకుంటాను.
   //ఇవే భావి తరం ప్రగతికి బాటలు తీసే అభివృద్ధి ఆయుధాలు// అవును. ప్రజల కొనుగోలుశక్తిని, thereby demandని పెంచడం ద్వారా, కదా?

   Like

   Reply
   1. Jai Gottimukkala

    @YVR’s అం’తరంగం’:

    “తాయిలాలు” అనే టర్మ్ మన వైట్ కాలర్ “మేధావులు” పెట్టే ముద్దుపేరు. వీరికి జనాకర్షణ సబ్సిడీలకు పెట్టుబడి సాయానికి తేడా తెలీక తాము అయోమయంలో పడి ఇతరులను కూడా అయోమయపరుస్తారు. అఫ్కోర్స్ ఇది బయాస్ లేదా భయం (ఉ. తక్కువ కులపోల్లు ఇంగిలీషు నేర్చుకుంటే పాలేరు పనులు మానేసి పెత్తనానికి వస్తారేమోనని పుట్టుకు వచ్చిన తెలుగు భాషాభిమానం) కూడా కావొచ్చును.

    ఉ. UBI (రాహులుడి భాషలో “న్యాయ్) consumption support మాత్రమే. ఇందువలన ఆట్టే ప్రయోజనం లేదు సరికదా diversion (ఉ. మద్యపానం) అవకాశాలు ఎక్కువ. అదే అమ్మ ఒడి పథకానికి వస్తే ఇది ఒక (human) capital formation విధానం.

    మీరన్నట్టు నాయకత్వపు చిత్తశుద్ధి ముఖ్యమే కానీ పథకం యొక్క direction అంతకన్నా కీలకమని నా ఉద్దేశ్యం. Poor delivery or last mile connectivity can derail a scheme somewhat but the design of the scheme is even more important.

    “ప్రజల కొనుగోలుశక్తిని, thereby demandని పెంచడం ద్వారా, కదా?”

    అవును కాకపొతే ప్రత్యక్ష శక్తితో పాటు పరోక్ష & దీర్ఘకాలిక శక్తి ఇంకా ముఖ్యం. Even subsidies boost purchasing power & stimulate demand. Game changer mechanisms focus on long term & sustainable empowerment leading to capital formation as well as redistribution of power sharing structures.

    Like

    Reply
    1. సూర్య

     తక్కువ కులపొల్లు ఇంగిలీషు నేర్చుకుంటే పోటీకి వస్తారనే భయం తో తెలుగు అభిమానం పడుతుందా. ఎంత విఞ్ఞాణం!
     మన రాష్ట్రం లో ఉనికి లేనంత కాలం పక్క రాష్టం లో ఓ పార్టీ ఎలా పాలించినా సూపర్ గా కనబడే మేధావులకే ఇలా అనిపిస్తుంది.

     Like

     Reply
     1. Jai Gottimukkala

      మరేనండి. పెద్దోళ్ల పిల్లల కోసం సొంత ట్రస్టు బళ్ళలో ఇంగిలీషు చదువులు నేర్పించి అమెరికా పంపించి తానా తందానా పాడే మహాశయులు బీదోళ్ళ పిల్లలు బాగు పడితే కండ్లు కుట్టి భాషాభిమానం పొంగి పోయి స్వకుల పత్రికలో సుద్దులు రాయట్లా.

      కందుకూరి వీరేశలింగం వితంతు పునర్వివాహం, మాడపాటి హనుమంతరావు ఆడపిల్లలకు చదువు వంటి సంస్కరణలు సొంత వాకిట్లోనుండి మొదలు పెట్టారు. ఇప్పటోళ్లదంటా బయటోళ్ల మీద ప్రయోగాలు, ఎదుటి మనిషికి చెప్పేందుకే నీతులు! ఆ దరిద్రపు ఎంగిలిపీసేదో కాశీలో వదిలేసి ఎంచక్కా తామే తెలుగును ఉద్దరించాలంటే మనసొప్పదు పాపం నాయిడు గారికి.

      జస్ట్ ఫర్ ఇంఫో, మన రాష్ట్రంలో ఉనికి కోల్పోయినోళ్లు శానా మందే ఉన్నరు. ఇప్పుడు అక్కడా సొంత పెరట్లో పునాదులు కదుల్తుంటే ఆగం అయిపోయి “శిల మోసే గాయాలు” అంటూ పాటలు షురూ చేసిన్రు.

      Like

      Reply
    2. YVR's అం'తరంగం' Post author

     డెవలప్మెంట్ ఎకనామిక్సుని, పర్సనల్ ఎకనామిక్సునీ మిక్స్ చేసి అందులో కుంభకోణాల మసాలాలు కలిపి, రీజినల్ ఎమోషన్ల ఉప్పూ, కులమతాల కారం, జాతివైరాల పులుపూ, …. కలిపి చేసిన మన రాజకీయ బిర్యానీలు ఎంత తింటే అంతులేని జనాభాకి కడుపు నిండుతుంది? అలాంటి జనాభాని కంట్రోల్ చెయ్యడానికి కేంద్రం చిన్న కుటుంబాల బిల్లు తెస్తుందిట కదా? కొందరు తాయిలాలు ఇస్తే, వాళ్ళ ప్రత్యర్ధులు జనాభా తగ్గిస్తారు. ఫలితాలు అందే సరికి తరం మారుతుంది. హేఁవిటో!!!

     Like

     Reply
     1. Jai Gottimukkala

      ఇందిరమ్మ చిన్నకొడుకు సంజయుడు అప్పుడెప్పుడో యమ-అర్జన్సీగా చిన్న కుటుంబాలంటూ నానా హంగామా చేసి బొక్కబోర్లా పడ్డాడు కదండీ. ఎవరు మరిచిపోయినా మేనకమ్మకు గుర్తుండే ఉంటుంది. మళ్ళీ ఆ దుస్సాహసం జరుగుతుందా ఆ తమాషా కూడా హమ్ దేఖేంగే.

      అన్నట్టు సంకట మోచన బజరంగ్ బలీ ఆంటే మారుతియేనా? 800 మానేసి చాన్నాళ్లయింది కనుక డౌటనుమానం!

      Like

      Reply
      1. YVR's అం'తరంగం' Post author

       @jai , బిల్లు పాసయినా అవకపోయినా దాని చుట్టూ జరిగే రాద్ధాంతం+ polarization కోసమైనా తమాషా జరగొచ్చు.

       Like

      2. Jai Gottimukkala

       యూనిఫామ్ సివిల్ కోడు కోసం ప్రస్తుత లోకసభ సెషన్లోనే ఎదో ప్రయివేటు బిల్లు లిస్టింగ్ అయిందట మాస్టారూ. ఇదీ అట్లాంటిదేనేమో.

       మొన్నటి తెలంగాణా మునిసిపల్ ఎన్నికల ముందర ముగ్గురు లేదా ఎక్కువ పిల్లలు ఉన్నవారు పోటీ చేయకూడదనే (ఇదివరకే ఉన్న పాత) నియమాన్ని తొలగించారు. భాజపా ఇది తురకోళ్ల పుష్టీకరణ అంటూ గొంతు చించుకున్నా పెద్దగా గిట్టలేదు. లోకసభ/విధానసభలకు అటువంటి (ఇప్పటికి లేదు కనుక కొత్త) నియమాలు చేయాలంటే RPA సవరించాల్సి ఉంటుందని అనుకుంటా. క్రికెట్ టీమ్ సైజులో కుటుంబాలున్న నాయకుల గతి ఏమిటో మరి!

       Like

 7. bonagiri

  Being a city state, Delhi is a rich state. It can afford some freebies. If Mumbai is also a city state, it would be richer than Delhi.

  Like

  Reply
 8. విన్నకోట నరసింహారావు

  YVR గారు,
  ఈ టపాకు సంబంధం లేదు.

  ఇవాళ్టి (04-03-2020) Deccan Chronicle (Hyd) వారి supplement Hyderabad Chronicle లో “City Life” column లో (page.6) “Fastest बird in a frame” అని ఒక ఫొటో-వ్యాసం వచ్చింది. మీరు nature photographer కాబట్టి మీకు ఆసక్తికరంగా ఉండవచ్చు. ఈ క్రింది లింక్ లో చూడవచ్చు 👇.

  http://epaper.deccanchronicle.com/articledetailpage.aspx?id=14661254

  Like

  Reply

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s