ఇన్సెన్సిటివ్ సొసైటీ+నాన్సెన్సిటివ్ పాలిటిక్స్+ఒక మృగం


రెండురోజుల గాప్‌లో ఇద్దరు ఆడపిల్లలు దారుణంగా ఒక మృగానికి (అవును ఒకే మృగానికి) బలయ్యారు.
దాడి చేసిన మృగం ఒకటే. దాన్ని పెంచి, పోషిస్తున్నది మాత్రం ఒక వ్యవస్థ, ఒక సమాజం. వాటిల్లో పేరుకుపోయిన సిగ్గులేనితనం.

యధావిధిగా –

టీవీ స్క్రోలింగులూ, సెన్సేషనల్ హెడింగులతో న్యూస్ ఐటమ్సూ
ప్రభుత్వానిదే బాధ్యత అంటూ ప్రతిపక్షాలూ
నేరస్తుల్ని పట్టుకు తీరతాం అంటూ ప్రభుత్వాలూ, పోలీసులూ
ఎప్పుడూ జరిగే తంతే అని తలపట్టుకునే ప్రజలూ
సెన్సేషన్‌కి కాలం తీరాక బాధితుల్నీ, నేరస్తుల్నీ పూర్తిగా మర్చిపోయే – పత్రికలూ, ప్రతిపక్షాలూ, ప్రభుత్వాలూ, ప్రజలూ.
అన్నీ మామూలే. రెండుమూడ్రోజుల్లో అన్నీ పబ్లిక్ మెమరీలోంచి డిలీట్ ఐపోయేవే.

నిర్భయ కేసు తర్వాత అలాంటి కేసులు ఎన్ని వెలుగు చూశాయి? అందులో ఎన్నిటి మీద చట్టసభల్లో చర్చ జరిగింది?
ఎన్ని ఘోరాలు జరిగితే పోలీసులుకానీ, ప్రభుత్వాలుకానీ ఇవి చెదురు మదురు నేరాలు కావు, ట్రెండుగా మారుతున్న సామాజిక ఘోరాలు అని భావిస్తారు?

క్రిమినాలజీ చదవని వాళ్ళకైనా ఈజీగా అర్ధమయ్యే పాయింట్ ఒకటుంది. అది నేరపరిశోధనలో రెండు పార్శ్వాలుంటాయనేది.
నేరం జరిగిపోయాక అదెలా జరిగిందో, నేరస్తులెవరో కనిపెట్టి వాళ్లకి సరైన శిక్ష పడేలా చూడడం ఒక పార్శ్వం.
ఇదేలాంటి నేరం మాళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవడం రెండోదీ, మొదటిదాని కంటే ముఖ్యమైనదీ అయిన పార్శ్వం.

ఈ రెండో పార్శ్వాన్ని ప్రభుత్వాలూ, ప్రతిపక్షాలూ, మరీ ముఖ్యంగా ప్రజలూ అస్సలు పట్టించుకోట్లేదు.
పోలీస్ వ్యవస్థని అనాల్సిన పన్లేదు. వాళ్ళని ఎంపవర్ చెయ్యాల్సింది ప్రభుత్వాలూ, ప్రతిపక్షాలూ, ప్రజలే. కానీ చెయ్యరు.

ఎందుకంటే ఈ మూడు వర్గాలూ –

వాళ్ళ వాళ్ళ చిన్ని చిన్ని బొజ్జలకి శ్రీరామరక్షలు చుట్టుకుంటూ,
సొసైటీలో జరిగిన ప్రతిదాన్నీ పొలిటికల్ కేపిటల్‌గా వాడుకుంటూ,
ప్రవచనాలు వింటూ, ప్రదక్షిణాలు చేస్తూ
సినిమాలని జీవితంగా చూస్తూ, జీవితాన్ని సినిమాలా గడిపేస్తూ
టైము రాగానే ఛస్తూ గడిపేస్తున్నారు.

ఛీ!! ఇంత ఇన్సెన్సిటివ్ సొసైటీనీ – ఈ నాన్సెన్సిటివ్ పాలిటిక్సునీ చూసి చూసి చిరాకు పుడుతోంది.

ఆవు మీద ఈగ వాలనివ్వని దేశంలో ఆడపిల్లలపై హత్యాచారం చెయ్యడానికి వెనకాడని దరిద్రుల జనాభా ఎందుకు, ఎలా పెరుగుతోంది?

ఘోరాలు చేయించే పెర్వర్షన్, నేరాలు చేసే తెగింపూ, సాక్ష్యాధారాల్ని నాశనం చేసే చావు తెలివితేటలూ – జనంలో ఇవన్నీ నిస్సందేహంగా పెరుగుతున్నాయి. అందులో ఆశ్చర్యం లేదు. ఆశ్చర్యం ఏంటంటే వాటిని ఆపడానికి –

అవసరమైన సామాజిక చైతన్యం తక్కువవడం
తగినంత సోషల్ డిబేట్ అనేది కొరవడడం
ఉండాల్సినంత పోలీస్ డిటరెన్స్ లేకపోవడం
ముఖ్యంగా ఇండియన్లకి సిగ్గులేకపోవడం.

మనిషిలో దాక్కుని దాడి చేసే పెర్వర్షన్ అనే మృగానికీ –
స్వార్ధం, నిర్లక్ష్యం, నిర్లిప్తత అనే మేత వేసి ఆ మృగాన్ని పెంచుతున్న సమాజానికీ –
అశ్రద్ధ, అధికారదాహం, ఆలోచనారాహిత్యంతో మృగాన్ని చూసీచూడనట్టు వదిలేస్తున్న పాలనావ్యవస్థకీ –
బలైపోయిన ఇద్దరు అమ్మాయిలకి అశ్రుతప్త హృదయంతో
సంఘం తరఫున క్షమాపణలు చెప్పుకుంటూ … 🙏😔🙏

 

Published by YVR's అం'తరంగం'

These little thoughts are the rustle of leaves; they have their whisper of joy in my mind...

20 thoughts on “ఇన్సెన్సిటివ్ సొసైటీ+నాన్సెన్సిటివ్ పాలిటిక్స్+ఒక మృగం

 1. criminalization of society.
  నా మాట ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఇది దారి తప్పిన దేశం అని నేనంటూ ఉంటాను. రోజురోజుకూ నా అభిప్రాయం గట్టి పడుతోంది.

  Like

 2. ఆడపిల్ల ఇంకా ఇల్లు చేరలేదని ఆందోలనతో పోలీస్
  ష్టేషన్ కెలితే ,
  ఫ్రెండుతో వెళ్లుంటుందిలే , రేపొస్తుంది అని ఎగతాళి
  సమాధానం వస్తుంది , ప్రతి మిస్సింగ్ కేసులో . ఏలినవారి సేవలో తలమునకలుగా ఉండే వ్యవస్త మనది . ఇరవైనాలుగ్గంటలలో ఛేదించామని గొప్ప
  చెప్పుకుంటే , బుగ్గయిన విషయం మర్చిపొమ్మనే
  సందేశ మిచ్చినట్లే కదా .

  Like

  1. నిజం, రాజారావు మాస్టారు.
   ఈ హైదరాబాద్ ప్రియాంక ఉదంతంలో కూడా ఫిర్యాదు చెయ్యడానికి పోలీస్ స్టేషన్ కు వెడితే లేచిపోయిందేమో అన్నారని వార్తాపత్రిక వార్త (ఇవాళ్టి … 30-11-2019 … హైదరాబాద్ “ఆంధ్రజ్యోతి” డెయిలీలో మొదటి పేజ్, పదకొండో పేజ్ … ఈ క్రింది లింక్ లో చూడండి).

   “లేచిపోయిందేమో” (మొదటి పేజ్) 👇
   https://epaper.andhrajyothy.com/m5/2441530/Hyderabad-Main/30-11-2019#page/1/1

   “లేచిపోయిందన్నారు” (పేజ్ నెం.11)👇
   https://epaper.andhrajyothy.com/m5/2441530/Hyderabad-Main/30-11-2019#page/11/1

   Like

   1. సార్ , రాజ కీయ వ్యవస్త చేతిలో తతిమ్మా ప్రజోపయోగ సేవా వ్యవస్తలన్నీ వాటి విధులను కోల్పోయాయి . వ్యవస్తలన్నీ
    ఏలినవారి సేవలో నిరంతరం తరిస్తున్నవి .
    ఇప్పుడు నడుస్తున్నది ప్రజాస్వామ్యం కాదు .
    రాచరిక నియంతృత్వం . ప్రజల బాగోగులు
    పట్టించుకునే తీరికా వోపికా అధికారులకు
    లేదు .

    Like

    1. ఛీ నూస్ ఛానల్ మాత్రం ఈ పోలీస్ ఉదంతాన్ని కవరప్ చేసే పనిలో ఉంది.

     Like

 3. ఇటువంటి సంఘటనల గురించిన వార్తలు చూసినప్పుడల్లా … మన దేశంలో స్త్రీలు డిస్పోజబుల్ వస్తువులా ఈ నేరస్థుల దృష్టిలో … అని అనుమానం వస్తుంటుంది నాకు.
  ఉత్త డిస్పోజబుల్ (అంటే వాడుకుని పక్కన పడెయ్యడం, తన మానాన తాను పోవడం) నుండి యూజ్ & త్రో (వాడుకుని చంపెయ్యడం) వరకు వచ్చింది. యూజ్ & డిస్ట్రాయ్ (వాడుకుని, చంపేసి, కాల్చెయ్యడం) అన్నది ఇటీవల మొదలైన కొత్త ట్రెండ్ అనిపిస్తోంది.
  మనం ఎటు వెళుతున్నాం, సమాజం ఎటు వెడుతోంది అని ప్రశ్నించుకోవడం అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ‌‌‌మనది దారితప్పిన దేశం అన్నది నా నిశ్చితాభిప్రాయం.
  ఒక హాస్యాస్పదమైన విషయమండీ … ఈ సంఘటనపై సినిమా వాళ్ళు ఏవో సానుభూతి స్టేట్మెంట్లు ఇచ్చారట. యువత ఇలా తయారవడానికి కొంత కారణం … వెరైటీ సాకుతో వాళ్ళు తీస్తున్న వెర్రి మొర్రి హింసాయుత సినిమాలు, వాటిల్లో స్త్రీని ఆటవస్తువులాగా చూపించడం, నిత్యపారాయణ లాగా అవిరామంగా ఆ సినిమాల్ని జనాలకు చూపించే టీవీ మీడియా … వీటి ప్రభావం కొంత వరకు లేదా? వీళ్ళు మాట్లాడటమేమిటి!?
  ఎటువంటి ఘోరాలు జరుగుతున్నా ఏదీ మారదు … భరిస్తూ పడుండటమే సామాన్య మానవులం చెయ్యగలిగింది.

  Like

  1. పైన నా కామెంట్ లో:-
   “ఉత్త డిస్పోజబుల్” = యూజ్ & త్రో
   “యూజ్ & త్రో” = యూజ్ & క్రష్ (వాటర్ బాటిల్ లాగా)
   అనుకోండి.

   Like

  2. ఇలాంటి సంఘటనలు చూసినపుడు సమాజం ఎటుపోతోంది అనే నిర్లిప్తతా ఆవేదనా కలగడం సహజం. నిజానికి గత 5 రోజులుగా పని మీద పూర్తిగా మనసు లగ్నం చేయలేని పరిస్థితి వచ్చింది. జరిగింది తలచుకుంటే మనకే కన్నీళ్ళు ఆగకుంటే ఇక ఆ కుటుంబం అనుభవించే బాధ ఇంకెంత ఉండి ఉంటుంది.
   అసలు మనం వ్యవస్థలని, పాలకులని, నాయకులని, సినిమాలని ఆఖరికి మతాన్ని తిట్టేసుకుంటుని సంతృప్తి పడిపోతున్నాం.
   దేశం కాని ప్రపంచం కాని పరిపూర్ణ ప్రశాంతతతో ఎప్పుడు ఉండి చచ్చింది కనుక.
   మేరునగధీరుడని చెప్పుకునే రాముడు ఉండగానే సీత అపహరించబడలేదా? చిటికెనవేలిమీద కొండనెత్తిన ధీరుడు భూమిపై తిరుగాడుతున్న కాలం లోనే ద్రౌపదికి ఎన్ని అవమానాలు జరగలేదు? రోషముగల దేవుడు సదా కాచుకుని చూసుకుంటానని చెప్పే సో కాల్డ్ రాజవంశం లోనే మహిళలపై అఘాయిత్యాలు జరగలేదా.
   ఆ ఘటనలకి (కాల్పనికమైనావే అనుకున్నా) నేటి పరిస్థితికీ తేడా ఏమిటంటే ఆయా సంఘటనలలో అర్థబలం అంగబలం తో ఒడలు మరిచిపోయినవారు దారుణాలకు పాల్పడితే ఈనాడు సామాన్యులు కూడా క్రూరమైన నేరాలకి పాల్పడుతున్నారు.
   గడచిన శతాబ్దాల చరిత్ర తిరగేస్తే మానవత్వానికి మచ్చ తెచ్చే సంఘటనలు ఎన్నో జరిగాయి. గత వందేళ్ళలోనే ఎన్నో జరిగి ఉంటాయి కూడా. కాకపోతే అప్పుడు విస్తృత మీడియా లేకపోవడం తో జనాలు ధైర్యంగా బ్రతికేసేవారు. ఇప్పుడు చీమ చిటుక్కుమన్నా ప్రపంచానికి తెలుస్తోంది కనుక ప్రజలలో రాను రాను నేరస్థుల పట్ల వ్యతిరేకతకి బదులు భయం పెరిగిపోతోంది.
   కాని ఇలా భయపడుతూ కూర్చుంటే మనం ఈ పరిస్థితిని మార్చలేం. మన న్యాయ ప్రక్రియ ని ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. ఏల్ల తరబడి విచారణలు ఆ తరవాత కూడా శిక్షల అమలులో జాప్యాలే నేటి దారుణ పరిస్థితికి కారణం.
   ఇవాల అన్నింట్లోనూ అత్యుత్తమ, వేగవంతమైన సేవని కోరుకుంటున్న మనం పోలీసు/న్యాయ వ్యవస్థనుంచి మాత్రం అదే విధమైన సర్వీసు ఎందుకు కోరుకోకూడదు. దీనికోసం కొన్ని లక్షలమంది సంతకాలతో కూడిన పిటిషన్ వేస్తే బావుంటుందని నా ఉద్దేశ్యం.

   Like

   1. సూర్యగారూ, మీ భావోద్వేగం సహజంగా, సహేతుకంగా వుంది. గవర్న్‌మెంట్ కదిలే వరకూ పిటిషన్లు వెయ్యాలి, సిటిజన్ కమిటీలు ఏర్పడి లోకల్ MLAలు1MPలపై వత్తిడి తేవాలి. ప్రతి విషయానికి ఐ.కా.సలు వుంటాయి కానీ “దిశ”,”నిర్భయ”ల కోసం ఐ.కా.సలు వుండవు. ఎందుకో. జైగారు చెప్పిన రూట్-కాజెసే అసలు సమస్య. కానీ ఈ విషయంలో వాటిని అధిగమించడం కష్టం కాకపోవచ్చు.

    Like

    1. జైగారి రూట్ కాజ్ తో ఏకీభవించలేను. ఇప్పటివరకూ ఒక్కొక్కరూ ఒక్కొక్క కారణం చెప్పారు.
     సినిమాలని, స్మార్ట్ ఫోన్లని , పిల్లల పెంపకమని , మతాచారాలని ఇంకా అమావాస్య తరవాత “ఎవరో ఎంగిలిచేసి వదిలేసిన అప్పడం ముక్క”లా కనిపించే చంద్రుడని, కొన్ని వేల సంవత్సరాల క్రితం తన జాతకం తగలడ్డ మూలాన ఇప్పటికి సిద్దాంతిగారికి కనిపిస్తున్న నక్షత్రానిదనీ ఇలా చెప్పుకుపోయారు.

     అఫ్కోర్స్ మానవ ప్రవర్తన మీద ఆయా అంశాల ప్రభావం ఉంటుంది కాని జీవితం లో జరిగే సంఘటనలకి వాటినే బాధ్యుల్ని చేస్తూ మనిషి తప్పించుకోలేడు. “Everything begins with a choice” అని మార్ఫియస్ చెప్పినట్లు మంచైనా చెడు అయినా చివరకు మనిషి ఎంచుకునే ఎంపికపైనే ఆధారపడుతుంది.
     ఎటువంటి పరిస్థితిలోనైనా మనిషి చెడు చేయాలంటే చెడు చేయగలడు, మంచి చేయాలంటే మంచి చేయగలడు.

     Like

 4. వీయెన్నార్ సార్,
  మాస్టారు,
  మీ ఆలోచనలు పంచుకున్నందుకు నెనరులు.
  లాయర్లు ఈ మృగాల తరఫున వాదించవద్దనీ, వాళ్ళని encounter చేసెయ్యమనీ, ఉరిశిక్షలు పడాల్సిందేననీ – మినిస్టర్ల నించీ మూవీస్టార్ల వరకూ స్పందిస్తున్నారు. రొటీన్ రిపీటవుతోంది.
  ఒకే ఒక్క అమ్మాయి ఢిల్లీలో పార్లమెంట్ ఎదురుగా “‘‘నా దేశంలో నాకు భద్రత ఎందుకు లేదు’’ అంటూ నినాదాలు చేస్తుంటే పోలీసులు ఆపారు.
  ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు, ప్రసార సాధనాలూ చెయ్యని పనేంటో ఆ అమ్మాయి చెప్పక చెప్పింది.
  https://m.eenadu.net/latestnews/A-woman-protests-alone-outside-of-Parliament-Police-detained/1600/119050674

  Like

 5. ఆడపిల్లలు అణిగి మణిగి ఉండాలని తల్లితండ్రులు. పరాయి కుర్రపిల్లలను “ఏడిపించడమే” హీరోయిజం అనుకునే “కథా”నాయకులు. పాతివ్రత్యాన్ని మించిన సుగుణం లేదని బోధించే “ప్రవచన”కర్తలు.

  ఈ “పవిత్ర” సంకెళ్లు ఇంకెన్నాళ్లు? మనిషిని మనిషిగా గుర్తించలేని మతాలు, మఠాలు & ముఠాలు ఇంకా ఎందుకు? ఆకాశంలో సగాన్ని పాతాళానికి అదిమేసే వ్యవస్థలకు మంగళం ఎన్నడు? సీత రాముడికి భార్య మాత్రమే కాదు తానూ ఒక మనిషేనన్న సత్యం ఎప్పుడు అవగతం అవుతుంది?

  Like

  1. జైగారూ, మీ ప్రశ్నలు సహేతుకమైనవి. మీరు చెప్పిన అన్ని వర్గాల వాళ్ళూ ఎవరి కంఫర్ట్ జోన్లో వాళ్ళు జవాబులు వెతుక్కుని సమాధానపడిపోతున్నారు. వాళ్ళందరి సంగతెలా వున్నా ప్రజాప్రతినిధులు (అన్ని పార్టీల వాళ్ళూ) ప్రతీ పార్లమెంట్ / అసెంబ్లీ సెషన్లలో ఈ సమస్యని తప్పనిసరిగా చర్చించాలనే నియమం పెట్టుకుంటేగానీ ఈ హత్యాచారాలు ఆపే మొదటి అడుగు పడదు. ఆ అడుగు పడ్డాకే ఇంకే చర్యలైనా పని చేస్తాయని నా హంబుల్ ఒపీనియన్.

   Like

   1. YVR గారూ,

    నా ఉద్దేశ్యంలో ఎన్నుకోబడిన రాజకీయనాయకులు వ్యవస్థకు అద్దాల లాంటి వారే తప్ప అందుకు అతీతంగా ఎన్నడూ ఉండలేరు. They can at maximum be the symptoms of systemic disease, not the root cause. సామాజిక రుగ్మతలకు మూలకారణాలు వేరే, కాస్తయినా లోతుకు వెళ్తే తప్ప అవేంటో తెలుసుకోజాలము.

    వ్యవస్తీకృతమయిన వివక్ష చట్టాలు చేస్తే పోదు. చట్టాలు సఫలం కావాలంటే వాటికి బహుళ సాంఘిక ఆమోదం ఉండాల్సిందే. Law can only codify widely accepted practice.

    వరకట్నాలు, ముట్టు గుడిసెలు, పుస్తెలు కళ్ళకద్దుకొనే ఆచారాలు, పాతివ్రత్య “విలువలు” వగైరాలు ఉన్నంత కాలం సమానత రానేరదు. సతీ సక్కుబాయి ఆదర్శంగా ఉన్న “పవిత్ర” దేశంలో కీచకులను రూపుమాపడం జరిగేనా?

    Like

    1. జైగారూ, సమాజంలో రావల్సిన మార్పుల విషయంలో – to be more precise మీ వ్యాఖ్యలో చివరి పేరాతో – మీ వాదనతో 100% ఏకీభవిస్తాను.
     రాజకీయ నాయకులు సొసైటీకి అద్దంలాంటి వాళ్లు అనేది కూడా ఒప్పుకుంటాను. ఐతే, ఎంత fratured & antiquated society ఐనా సరైన Coordination, continuity వుంటే law&order కాపాడుకోవడానికి ఒక త్రాటిపైకి రావడం, ప్రజాప్రతినిధుల చేత అత్యవసరమైన పనులు చేయించడం అసాధ్యం కాదని నాకనిపిస్తోంది. ఎందుకంటే “దిశ”లాంటి దుర్ఘటనల్లో అందరూ ఫీలయ్యే pain ఒకటే, అవి మళ్ళీ జరగకూడదనుకోవడంలో అందరి సిన్సియారిటీ ఒకటే. చట్టసభలు సమావేశమైన ప్రతిసారీ “దిశ”, “నిర్భయ”లని రాజకీయాలకి అతీతంగా చర్చించేలా చెయ్యడం అనుకున్నంత కష్టం కాదనే నా నమ్మకం. చట్టాలు రావాలి, వాటితోపాటూ enforcement కావాలి. అందుకు Keeping the debate alive is the first step towards addressing the problems effectively. సరైన లీడర్షిప్పూ, కోఆర్డినేటెడ్ & కంటిన్యువస్ ఎఫర్టూ కావాలి. మీరనే broad-based, radical changes వచ్చే వరకూ ఈ ప్రయత్నం ఆగనవసరంలేదు.

     Like

 6. @సూర్య:
  “Everything begins with a choice”
  I agree with you fully.
  “అఫ్కోర్స్ మానవ ప్రవర్తన మీద ఆయా అంశాల ప్రభావం ఉంటుంది కాని జీవితం లో జరిగే సంఘటనలకి వాటినే బాధ్యుల్ని చేస్తూ మనిషి తప్పించుకోలేడు”
  నేను ఒక్కడినీ ఏమీ చేయలేననుకోవడం నకారాత్మక అశక్తత, పలాయనవాదం & ఆత్మవంచన. నేను కనీసం మొదటి అడుగయినా (ఉ. ఆడపిల్లలూ మనుషులే అని మగపిల్లలకు బోధించడం) వేయడం విజ్జ్యత.
  ఫోన్లు గట్రా కేవలం పరికరాలు, మంచికీ చెడుకూ పనికి వస్తాయి. Tools are value neutral.
  ఇక జాతకాల ఘాతుకాలంటారా వాటి గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది.
  ప్రత్యక్ష (సమీప) & మూల (దీర్ఘకాలిక) కారణాలు & వాటి పరిష్కారాలు రెంటి పైనా చర్చ & చర్య జరగాలని నా అభిమతం. ప్రస్తుత చర్చంతా చర్యారహితం & హ్రస్వ దృష్టితో కూడుకున్న armchair myopic exercise అవుతుందన్నదేమో అన్నదే నా ఆవేదన.
  @YVR’s అం’తరంగం’:
  “Keeping the debate alive is the first step towards addressing the problems effectively”
  I agree with you fully.
  In a long battle, stamina is even more important than strength. A battle for minds is by definition a long excruciating struggle.
  భావజాల వ్యాప్తి వలన ఐడియా యొక్క “మార్కెట్ సైజ్” పెరుగుతుంది, ఎకానమీ స్కేల్స్ మెరుగు పడితే ఇక తిరుగుండదు.
  కొన్ని రోజులలో పతాక శీర్షికలు మారడం ఖాయం, అప్పుడు అత్యధిక జనం దృష్టి మరలించడమూ అంతే నిక్కము. ఈ మధ్యకాలంలో ఏ కొంతమందయినా అదనంగా కూతుళ్లను కొడుకుతో సమానంగా చూడడం మొదలెత్తితే మహిళా సాధికారత ప్రగతి సాధించినట్టే. నేతాజీ అన్నట్టు ఢిల్లీ దగ్గరవుతుంది.

  Like

  1. @ “ప్రత్యక్ష (సమీప) & మూల (దీర్ఘకాలిక) కారణాలు & వాటి పరిష్కారాలు రెంటి పైనా చర్చ & చర్య జరగాలని నా అభిమతం. ”
   నేనూ అంగీకరిస్తాను. అయితే చర్చల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి.
   “మద్యం వల్లే అన్నీ జరుగుతున్నాయి. దాన్ని నిషేదిస్తే సమస్య తీరుతుంది” అంటారు కొందరు.
   “అలా అయితే మద్యం పుషకలంగా దొరుకుతున్న దేశాల్లో ఇన్న్ని ఘోరాలు జరగట్లేదే “అంటారు ప్రతివాదులు. తల్లిదండ్రుల పెంపకం కారణమంటారు కొందరు.
   “18 ఏళ్ళకే రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్చతో తమకు నచ్చినట్లు వెల్లిపోతున్నవాల్లు తప్పు చేసేసరికి మాత్రం తల్లిదండ్రుల మీద నింద వెయ్యడం సమంజసమేనా” అనేది ప్రతివాదం.
   ఇలా భిన్నాభిప్రాయాలతో ఒకరినొకరు తిట్టుకుంటూ సోషల్ మీడియాని, చానెల్స్ ని నింపేస్తున్నారు కాని ఉమ్మడిగా అంగీకరించే అంశాలపైన కనీసం చర్యలు మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. నేరస్తులకి త్వరితగతిన శిక్షలు అమలు జరగకపోవటం వల్లే నేర స్వభావం కలిగిన వాల్లకి భయం లేకుండా పోతుందనేది అందరూ అంగీకరించే విషయం. కనీసం అందరూ ఒప్పుకునే ఈ విషయం పైన అయినా పోరాటం మొదలు పెట్టాలి. ఇపుడు మనకి కావలసింది కొత్త చట్టాలు కాదు. ఉన్న చట్టాలని సక్రమంగా అమలు జరపటం. అందుకోసం నిరంతరంగా ఏలికలని ప్రశ్నిస్తూనే ఉండాలి.

   Like

   1. “ఉమ్మడిగా అంగీకరించే అంశాలపైన కనీసం చర్యలు మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది”

    “కావలసింది కొత్త చట్టాలు కాదు. ఉన్న చట్టాలని సక్రమంగా అమలు జరపటం”

    సూర్య గారూ, మీరు రాసిన పై రెండు వాక్యాలు అక్షర లక్షలు (ప్రస్తుత ఆర్ధిక మాంద్యంలో కోట్లు అనాలేమో!) చేసేటివి.

    Like

    1. జైగారు, సూర్యగారు, మీ ఆలోచనలు పంచుకున్నందుకు నెనరులు. కీచకుల ఎన్-కౌంటర్ మీద మరో పోస్ట్ పెడతాను. let us continue discussion there. 🙏

     Like

   2. సూర్యగారు, మీ ఆలోచనలు పంచుకున్నందుకు నెనరులు. కీచకుల ఎన్-కౌంటర్ మీద మరో పోస్ట్ పెడతాను. let us continue discussion there. 🙏

    Like

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

vedika

your forum for critical and constructive writings

నా కుటీరం

chinaveerabhadrudu.in

Kadhana Kuthuhalam

మరపురాని కథలను మళ్ళీ చదువుదాం.!

🌿🐢YVR's 👣Walks🐾With🌾Nature🐌🍄

🌻Look deep into nature, and then you will understand everything better 🌹 👨‍🔬Albert Einstein👨‍🏫

ఉహల ఊసులు

కవిత్వం, వంటా - వార్పు, మనసులో మాటలు, అక్కడ - ఇక్కడ

Kavana Sarma Kaburlu

All Rights Reserved

Prasad Oruganti

“I've learned that people will forget what you said, people will forget what you did, but people will never forget how you made them feel”— Maya Angelou

A Birder's Notebook

"Learning to bird is like getting a lifetime ticket to the theater of nature".

SEEN ALONG THE TRAIL

"I am at home among trees." ~ J.R.R. Tolkien

BUDGET BIRDERS

birding the world on a budget

Mike Powell

My journey through photography

Singapore Bird Group

The blog of the NSS Singapore Bird Group

MORGAN AWYONG

little truths . little deaths

Animals in South-East Asia

By Andrew Rhee (http://blog.daum.net/fantasticanimals)

Singapore Birds Project

Singapore birds information for birders by birders

Life is a poetry

Life is a beautiful journey. Live, discover, feel and fall in love with it

cindyknoke.wordpress.com/

Photography and Travel

vedika

your forum for critical and constructive writings

నా కుటీరం

chinaveerabhadrudu.in

Kadhana Kuthuhalam

మరపురాని కథలను మళ్ళీ చదువుదాం.!

🌿🐢YVR's 👣Walks🐾With🌾Nature🐌🍄

🌻Look deep into nature, and then you will understand everything better 🌹 👨‍🔬Albert Einstein👨‍🏫

ఉహల ఊసులు

కవిత్వం, వంటా - వార్పు, మనసులో మాటలు, అక్కడ - ఇక్కడ

Kavana Sarma Kaburlu

All Rights Reserved

Prasad Oruganti

“I've learned that people will forget what you said, people will forget what you did, but people will never forget how you made them feel”— Maya Angelou

A Birder's Notebook

"Learning to bird is like getting a lifetime ticket to the theater of nature".

SEEN ALONG THE TRAIL

"I am at home among trees." ~ J.R.R. Tolkien

BUDGET BIRDERS

birding the world on a budget

Mike Powell

My journey through photography

Singapore Bird Group

The blog of the NSS Singapore Bird Group

MORGAN AWYONG

little truths . little deaths

Animals in South-East Asia

By Andrew Rhee (http://blog.daum.net/fantasticanimals)

Singapore Birds Project

Singapore birds information for birders by birders

Life is a poetry

Life is a beautiful journey. Live, discover, feel and fall in love with it

cindyknoke.wordpress.com/

Photography and Travel

Why watch wildlife?

A site dedicated to watching wildlife

Discover WordPress

A daily selection of the best content published on WordPress, collected for you by humans who love to read.

Gangaraju Gunnam

What I love, and mostly, what I hate

చిత్రకవితా ప్రపంచం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

సాహితీ నందనం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

బోల్డన్ని కబుర్లు...

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

SAAHITYA ABHIMAANI

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

లోలకం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

కష్టేఫలే(పునః ప్రచురణ)

సర్వేజనాః సుఖినో భవంతు

కష్టేఫలి

సర్వేజనాః సుఖినోభవంతు

zilebi

Just another WordPress.com site

కష్టేఫలే

సర్వేజనాః సుఖినోభవంతు

అంతర్యామి - అంతయును నీవే

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

ఎందరో మహానుభావులు

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

వరూధిని

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

హరి కాలం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

The Whispering

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

Satish Chandar

Editor. Poet. Satirist

పిపీలికం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

పని లేక..

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

గురవాయణం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

పక్షులు

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

ఆలోచనలు...

అభిమానంతో మీ ప్రవీణ.....

Vu3ktb's Blog

Just another WordPress.com weblog

ఆలోచనాస్త్రాలు

............... ప్రపంచంపై సంధిస్తా - బోనగిరి

abhiram

album contains photos of my thoughts & feelings

%d bloggers like this: