అవును ఆయన స్వీపరే.
ఈ దేశం ప్రపంచానికిచ్చిన మహాస్వీపరు.
ఈ దేశపు మెమరీలో ఆయనొక స్వీపరు మహాత్ముడుగా మిగిలిపోతాడేమోనని అపుడపుడు అనిపిస్తుంటుంది. ఎందుకయ్యుంటుందబ్బా!?! పేపర్ న్యూసు, లీడర్ల వ్యూసూ చూస్తుంటేనేమో. మధ్యలో ఈ ట్రంపు మహాశయుడొకడు.
కానీ, ఆయన పట్టిన చీపురు మామూలు, అల్లాటప్పా చీపురుకట్ట కాదని, మనసుల్నీ, హృదయాల్నీ, ఆత్మలనీ శుభ్రంచేసే మహాత్మ్యంగల “చీపురుకట్ట”ని ప్రపంచం ఇంకా మర్చిపోలేదనీ గుర్తొచ్చి ధైర్యం వస్తుంటుంది.
ఎప్పుడో ఒకప్పుడు – దేశం సంగతెలా వున్నా – ప్రపంచమైనా, ప్రపంచంలో ఎవరో కొందరైనా ఆయన బ్రాండ్ “చీపురు”ని, అదే –
సత్యం
అహింస
అపరిగ్రహం
అస్తేయం
బ్రహ్మచర్యం
అనే పుల్లలతో కట్టిన చీపుర్ని పట్టకపోరు. పట్టి మనసులలో, మస్తిష్కాలలో చేరిన దుమ్ము దులపకపోరు.
ఇక్కడో రెండు 150th birthday Special breaking newsలు చెప్పుకోవాలి.
ఈలోపు జాతిపిత పదవి మోడీకిచ్చి ట్రంపుగారు గాంధీజీకి 150వ పుట్టిన్రోజు సన్మానం చేసేశారు. “పాపం, ముసలాయన ఆ భారం ఎన్నాళ్ళు మోస్తాడు?,” అనుకున్నాడో ఏమో మోడీసారు కూడా ఆనందంగానే ఆ బరువూ బాధ్యతా స్వీకరించేసినట్టున్నారు (subject to correction, of course).
రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్టోబరు ఒకటినే ప్ర.సా.దు.లని స్టేటంతటా తెరిచి మహాస్వీపరాత్ముడి 150 వ బర్త్ డేని జనం “ఆనందోత్సాహాల”తో జరుపుకునేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంది(ట)
ఇంతే సంగతులు.బై4నౌ🙏😊
ஒரு நாள் முன்னாடியெ கொன்டாட்டமா 🙂
LikeLike
ఎవరదీ!! జిలేబీగారేనా!?! 😄
LikeLike
Any doubt ?
LikeLike
మీ ఆశావాదం మెచ్చుకోదగినదే.
“ప్ర.సా.దు” లను తెరవడం గురించి మీరన్నది కరక్టే.
అక్టోబర్ 2 సెలిబ్రేట్ చెయ్యడానికి “ఊపు” కావాలిగా,
సెలిబ్రేట్ చేసిన తరువాత “సేద దీరాలిగా”. అందుకన్నమాట ఆ టైమింగ్. అందుకన్నమాట మీది ఆశావాదం అన్నది.
అక్టోబర్ 2 సౌతాఫ్రికా వారు తమ దేశంలో కూడా సెలవు దినం అని ప్రకటిస్తే చాలా సబబుగా ఉంటుంది కదూ? ఆ పని చేస్తే గీస్తే మండేలా చేసుండాల్సింది, కానీ చెయ్యలేదు, ప్చ్.
LikeLike
వీఎన్నార్ సర్! సౌతాఫ్రికా వాళ్ళు ఏమైనా చేస్తే అక్కడి ఇండియన్ల కోసం, వాళ్ళ వోట్ల కోసం చెయ్యాలి. ఇప్పుడక్కడి ఇండియన్లకి అంత సీన్ లేదనుకుంటా.
LikeLike
29-09-2019 ఆంధ్రజ్యోతి దినపత్రిక (Hyd) వారి Sunday Magazine లో కళ్యాణం అనే ఆంతరంగికుడు “నేను నా బాపు” అని గాంధీ గారి గురించి వ్రాసిన వ్యాసం ఈ క్రింది లింక్ లో చదవండి వీలయితే.
https://epaper.andhrajyothy.com/m5/2349632/Sunday-Andhra-Pradesh/29-09-2019#page/7/1
అసలు ఆ Sunday Magazine మొత్తం గాంధీ గారి గురించిన స్పెషలే. ఆసక్తికరంగా ఉంది.
LikeLike
సర్! నెనరులు. తప్పక చదువుతాను.
LikeLike
ఇవాళ్టి (02-10-2019) ఆంధ్రజ్యోతి దినపత్రిక మొదటి పేజీ మీద మీరన్న “స్వీపరాత్ముడి” బొమ్మే వేశారండీ.
https://epaper.andhrajyothy.com/m5/2354036/Andhra-Pradesh/02-10-2019#page/1/1
LikeLike
ఈ రోజు వచ్చిన ఒక వాట్సప్ మెసేజి –
“I lay no claim to superhuman powers. I want none. I wear the same corruptible flesh that the weakest of my fellow beings wears and am liable to err as any. My services have many limitations, but God has up to now blessed them in spite of the imperfections.
For, confession of error is like a broom that sweeps away dirt and leaves the surface cleaner than before. I feel stronger for my confession. And the cause must prosper for the retracing. Never has man reached his destination by persistence in deviation from the straight path.”
Mahatma Gandhi
(Source: Mahatma, Life of Mohandas Karamchand Gandhi, by D. G. Tendulkar , II, 113)
LikeLike
Attenborough’s “Gandhi” movie in English 👇
https://youtu.be/98UvGDwKKVc
LikeLike
ప్రతి అక్టోబర్ 2న నేను తప్పక చూసే ఆటెన్-బరుడి magnum opus “గాంధీ” చిత్రం 👇
LikeLike