పుట్టి జన్మెత్తిన ఇన్నాళ్ళకి రావిశాస్త్రిగారి కధ మొదటిసారి చదివా. ఆఫీసులో ఏలాల్సిన బాసులూ, తోలాల్సిన ఈగలూ లేకపోవడంతో నిన్నా మొన్నా ఆఫీసులో కూచునే చదివేసా గబా గబా. అది రెండొందల యాభై పేజీల అల్పజీవి నవల. చదివాక తెలిసింది అది రావిశాస్త్రిగారి మొదటి ప్రచురిత నవల అని.
నవలకి ఆయన వ్రాసిన ఉపోద్ఘాతం కానీ, చివరిమాట కానీ చదవకుండా డైరెక్టుగా నవలే చదివేసా.
ఇదో సైకలాజికల్ పోర్ట్రైట్లా వుందే అనుకుంటూనే చదివేశా.
ఒక అసమర్ధుడి జీవయాత్రలా కాకుండా కొన్ని సంఘటనల వల్ల తనని తాను అసమర్ధుడిగా ఊహించుకుని అదే ఊహలో లైఫంతా గడిపేసేందుకు సిద్ధమైపోయి (లోపల్లోపల ఆ ఊహతో కాంప్రమైజయ్యేందుకు తెగ ఘర్షణ పడుతూ) కాలం గడిపేస్తున్న ఒక ఆలోచనా సముద్రుడి కధలా అనిపించి ఆత్రంగా చదివేసా.
కధ చివరికి రచయిత సుబ్బయ్యని , అదే, కధలో హీరో పాత్రని భరించిన జీరోని, అంతులేని ఆలోచన్లని కడలి అలలతో పోల్చడంతో ముగుస్తుంది.
ప్రతి మనిషిలోనూ ఒక ఎన్టీయారూ, ఒక ఏఎన్నారూ, ఒక గుమ్మడి, ఓ రావు గోపాలరావు, ఒక గిరిబాబు, ఓ కమలహాసనూ, చార్లీ చాప్లినూ, ఒక మిస్టర్ బీన్ – ఒక్కో సందర్భంలో ఒక్కోరు, ఐ మీన్, వాళ్ళు ధరించిన పాత్రలు – మానిఫెస్ట్ అవుతూ వుంటారని నాక్కొంత అనుమానం. దాని పక్కనే కాస్త అభిప్రాయం కూడా. మరీ పురుష పక్షపాతం ఎక్కువైంది కదా ? పై లిస్టుకి – ఒక సావిత్రీ, ఒక షావుకారు జానకి, ఇంకో విజయశాంతీ, శ్రీదేవీ, జీ.వరలక్ష్మి, …. (ఎగైన్ ఐ మీన్ వాళ్ళు ధరించిన పాత్రలు)లని కూడా యాడ్ చేద్దాం. నిజానికి ఒక గుడిపాటి వెంకటాచలం, ఒక ఆర్జీవీ, ఒక మోడీ, ఒక మన్మోహన్, ఒక రాహుల్, … ఈ పెర్సనాలిటీలని కూడా సామాన్యమానవుడు అని తీసి పారేసే పెర్సనాలిటీల్లో అరుదుగానో, అప్పుడప్పుడో ప్రత్యక్షమయ్యే అవతారాల్లో లెక్కేసుకోవచ్చు. ఇప్పుడీ లిస్టులో సుబ్బయ్యని కూడా చేర్చా. ఈ సుబ్బయ్య రావిశాస్త్రిగారి యుగంలో పుట్టి అందులోనే అంతరించిన ప్రాణి అనిపించట్లేదు. ఆ యుగానికి ఎంతో ముందూ, ఆ తర్వాత వచ్చిన ఈ స్మార్ట్-ఫోన్ యుగంలోనూ కొనసాగుతున్న ఒక రకం ప్రాణులకి ప్రతినిధిలా అనిపించాడు. ప్రస్తుతకాలంలో ఈ “సుబ్బయ్య”(or ఈ “సుబ్బయ్య”ల్లాంటి వాళ్ళు)ల్లో కొందరైనా యాసిడ్ ఎటాకర్స్, పై ఆఫీసర్లని షూట్ చేసే వాళ్ళు, కాంపస్ షూటర్స్, తాగి కార్లు నడిపి యాక్సిడెంట్లు చేసే మైనర్లూ, కార్పోరేట్ కాలేజీల్లో సూసైడ్స్ చేసుకునేవాళ్ళు….etcగా మారతారనిపించింది.
ఈ నవలని శాస్త్రిగారు నడిపించిన విధం – భాషకానీ, శైలికానీ, వ్యక్తిత్వాల స్టడీలో నైపుణ్యం కానీ – భలే వున్నాయి. ఇంతకన్నా కామెంట్ చేసే సాహసం నాలాంటి కాజువల్ రీడర్స్ చెయ్యకూడదు. ఐతే, “సుబ్బయ్య”ని కరెక్టుగానే అర్ధం చేసుకున్నానని శాస్త్రిగారి ముందుమాట, చివరిమాట చదివాక తెలిసి వీపు తట్టుకున్నా.
ఇక్కడో విషయం చెప్పాలి. కధ మధ్యలో ఉండగా శాస్త్రిగారు జులైలో పుట్టివుంటారనిపించింది. ముందు ముందుకి వెళ్తుంటే ఇంకా స్ట్రాంగా అనిపించడం మొదలైంది. ఇంక ఉండబట్టలేక చెక్ చేశా. శాస్త్రిగారు పుట్టింది జులై ముప్ఫైన. ఎలా గెస్ చేశానబ్బా?!?!
వి . నరసింగ మన్న విడమరచ బన్లేదు
సింగపురపు టుగ్ర సింగ మనగ
విడమరించ గోరి వినుతింతు వైవీని
రావి శాస్త్రి కథకు చేవ కలుగ .
LikeLike
మాస్టారూ, ఉగ్రసింగం కాదు Sweet సింగం
విడమరించమన్నారు కదా, మరో ఇషారా –
సింగపురపు స్వీటు కవితా సివంగి. 🤗
LikeLike
శాస్త్రిగారు పుట్టింది జులై ముప్ఫైన. ఎలా గెస్ చేశానబ్బా?!?!
బహుశః హోమ్స్ పుట్టిన నెలలో పుట్టి ఉంటారు 🙂
తీపి సింగాన్ని వదిలేద్దురూ 🙂
LikeLike
– తీపి సింగాన్ని వదిలేద్దురూ 🙂
అంటే తాతగారూ అది మీరేనా ? 🙂
LikeLike
జిలేబి బామ్మా! తీపి సింగం తమరేనని అందర్కి ఎఱుకే 🙂
LikeLike
జూలు విదిలించే “సింగం” జూలైలో కాక మరే నెలలో పుడుతుందీ ? 🙂
LikeLike
ఈ someone ఎవరబ్బా ?!? సింహపురపు sweet🥨సింగమా?
“వి.న.రా”రమ్మనే వి.నర🦁సింగమా?
LikeLike
నాన్ అవళిల్లై 🙂
LikeLike
Someone గారూ, నాకు “అరవ”డం రాదండీ. ట్రై చేస్తాను.
నాన్=నేను, అవళ్= ఆమె, ఇల్లై =కాదు.
నేను ఆమెను కాను
OMG😲, ఎవరండీ మీరు?
LikeLike
ఇది కూడా ప్రయత్నించండి👇:
నాన్ అవనిల్లై
—————–
పైన someone గారు “జిలేబి” గారే అనుకోవడం లేదా మీరు?
btw, “జిలేబి” గారి gender గురించి బ్లాగులోకంలో ఊహాగానాలు జరుగుతుంటాయి కదా అప్పుడప్పుడు. ఇప్పుడు వారే వాడిన “అవళ్” పదంతో స్త్రీ అని రూఢి అయింది😎
——————-
అన్నట్లు Welcome to the world of రావిశాస్త్రి.
LikeLike
నల్లద్దాలిడి కళ్ళకు
జల్లించిన నైన వారి జండ రెరుగుటల్
కల్ల జుమీ నరసన్నా !
వల్లగునా ముసుగు దెఱువ వైవీ కైనన్ ?
LikeLike
//Welcome to the world of రావిశాస్త్రి//
వీఎన్నార్ సర్, అల్పజీవి తరవాత రెండు మూడు కధలు – పిపీలికం, ఆ పాపం ఎవరిది?, అగ్గిపుల్ల – చదివాను. శాస్త్రిగారి world view అద్భుతం.
LikeLike
స్వీటు బొమ్మ పెట్టి చాటింపు వేసినా
ఒట్టి మట్టిబుఱ్ఱ గుట్టు గనను ,
పేరు స్వీటె గాని వారు స్వీటు గాదు
తా విరోధిని , మన తరమ గెలువ ?
LikeLike
YVR,
అలాగే రావిశాస్త్రి గారి “ఆరు సారా(రో) కథలు” కూడా చదవండి. ఆ శైలి అనితర సాధ్యం.
LikeLike
YVR,
పైన “నాన్ అవనిల్లై” అని నేను అన్నది నా గురించే (ఆ someone / Anonymous నేను కాదు అని).
అయినా సింగపూరులో నివసిస్తూ అరవం రాదంటారేమిటండీ మీరు, అపచారం?. మీ టీవీలో తమిళులకు ప్రత్యేక చానెల్ కూడా పెట్టించుకున్నట్లున్నారు?
LikeLike
రాజారావు మాస్టారు,
ఆ నల్లద్దాలు మన సినిమా వాళ్ళు ఇంటిలోపలా, సభావేదిక మీదా కూడా పెట్టుకున్నట్లన్నమాట. డిటెక్టివ్ లాగా కనపడాలని పెట్టాను. అయినా గుట్టు విప్పలేం అంటారా? అంతేనేమోలెండి 😦
LikeLike
రావి శాస్త్రిని ఇంతకాలం చదవలేదా? 🙂
తెనుగులో చదవ వలసినవాళ్ళు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, రావి శాస్త్రి, పతంజలి,విశ్వనాథ ఆ పై మీ చిత్తం. మరి రాజు మహిషి ఎప్పుడు చదువుతారు? రావి శాస్త్రి దిండు కొనేశారా? మరో సారి ఆ పుస్తకం తీసి వ్యాసపీఠం ఎక్కించాలి 🙂
LikeLike
//రావిశాస్త్రిని ఇంతకాలం చదవలేదా? //
ఆంధ్రజ్యోతిలో రత్తాలు-రాంబాబు సీరియల్ వచ్చినప్పుడు పిల్లలు సీరియల్స్ చదవకూడదంటూ ఇంట్లో మోరల్ పోలీసింగ్ ఉండేది గురువుగారు. అంచేత కుదరలేదు. విశ్వనాధ “హాహాహూహూ” మాత్రం చదవనిచ్చారు. కాలేజీకొచ్చాక జోనర్ ప్రిఫరెన్స్ మారింది. ఇప్పుడే “కధానిలయం” – మీ టీ-వాలా కధ” ద్వారా దొరికింది – లో ఆదర్శయుగపు రచయితల్ని చదువుతున్నాను. అప్పుడప్పుడే అనుకోండి. శ్రీపాదవారి అనుభవాలూ-జ్ఞాపకాలూ కొంత మేరకి చదివానంటే ఆ క్రెడిట్ మీదే 🙏
LikeLike
YVR గారు,
మీ బ్లాగులో కాస్త పెద్ద కామెంట్ పెడుతున్నాను (మీ టపాకు సంబంధం లేనిది), ఏమనుకోకండి. ఈ ఉద్యమంలో అందరూ పాల్గొనాలని నా ఆశ. సంగతేమిటంటే —
— 2014 విభజనానంతరం మిగిలిన ఏపీ రాష్ట్రం యొక్క అవతరణ దినోత్సవం పాతలాగానే నవంబర్ 1 న జరిపారు. అది సబబు కాదనీ, ఒరిజినల్ ఆంధ్ర రాష్ట్రం 1953 లో ఏర్పడిన అక్టోబర్ ఒకటి సమంజసమనీ నా అభిప్రాయం. అలాగే తెలంగాణాతో కూడిన ఆంధ్రప్రదేశ్ అనే పేరు కూడా ఇంక ఇప్పుడు అనవసరమనీ, కాబట్టి కేంద్రంతో మాట్లాడి మొదటి పేరైన ఆంధ్ర స్టేట్ (Andhra State) అని తిరిగి మార్చాలనీ కూడా నా అభిప్రాయం . దీని మీద AP CM గారికి మెయిళ్ళు పంపాలని నా ప్రతిపాదన.
ఇదే సంగతి నేను 02-11-2019న “వరూధిని” బ్లాగులో పెట్టాను, అందరూ చూస్తారని. మరింత మంది చూడాలని మీ బ్లాగులో కూడా పెడుతున్నాను. నిన్న (04-11-2019) నెను AP CM గారికి నా ఇ-మెయిల్ పంపించాను cm@ap.gov.in. నాతో ఏకీభవించేవారు కూడా ఆ రకంగా ఇ-మెయిల్ ఇస్తే ఫలితం ఉంటుందని నా నమ్మకం. ఎంత ఎక్కువ మంది మెయిల్ ఇస్తే అంతగా CM గారి దృష్టిలో పడుతుందని ఆశ.
నా మెయిల్ content ని ఇక్కడ ఇస్తున్నాను. నాతో ఏకీభవించేవారు దాన్ని కాపీ & పేస్ట్ చేసుకుంటే, దాంట్లో తేదీ వేసి, చివర్లో తమ పేరు వ్రాసి CM గారికి మెయిల్ చెయ్యడానికి వీలుగా ఉంటుంది cm@ap.gov.in
వీలయినంత మంది (including you, if you agree with me) మెయిల్ పంపించమని నా విన్నపం. అందరికీ ధన్యవాదాలు.
================================================================
To
The Hon. Chief Minister garu, Date : -11-2019
Andhra Pradesh
via e-mail to cm@ap.gov.in
Sir,
Sub : Request for changing the date of present AP Formation Day and the State Name (consequent upon bifurcation of the composite state)
ఇప్పటి AP రాష్ట్రావతరణ దినం తేదీ (ప్రస్తుతం నవంబర్ 1న పాటిస్తున్నారు) గురించి పునరాలోచించవలసిన అవసరం ఉందని నా అభిప్రాయం
(2). 2014 జూన్ 2న ఉమ్మడి ఏపీ విభజన జరిగి తెలంగాణా వేరే రాష్ట్రం అయింది; వారికి జూన్ 2 బాగానే ఉందేమో. కానీ విభజన తరువాత ఏపీ రాష్ట్రావతరణ దినం ఏది అవుతుందీ? 1956లో నవంబర్ 1న తెలంగాణాను కలుపుకుని అప్పటికే ఉన్న “ఆంధ్ర రాష్ట్రం” ఆంధ్రప్రదేశ్ అనే ఉమ్మడి రాష్ట్రంగా మారింది కాబట్టి 2014 విభజన తరువాతి ఆంధ్రప్రదేశ్ (అసలు విభజనలో ఆ పేరు అలా ఉంచెయ్యడం అనవసరం) రాష్ట్రానికి కూడా అదే నవంబర్ ఒకటిని పాటిద్దాం అన్న అభిప్రాయం బహుశః “ఆంధ్రప్రదేశ్” అనే పేరు వలన కలిగినట్లుంది ?
(3). కానీ 1st of October అయితే ఇంకా సబబని నా అభిప్రాయం. ఎందుకంటే 1956 నవంబర్ 1నాటి తెలంగాణాతో కూడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకన్నా చాలా ముందే “ఆంధ్ర రాష్ట్రం” 1953 అక్టోబర్ ఒకటిన ఏర్పడింది కదా. 2014 లో తెలంగాణా వెళ్ళిపోయింది. దాంతో మళ్ళీ 1953 నాటి పాత ఆంధ్ర రాష్ట్రమే మిగిలింది … ఒరిజినల్ గా అది ఏర్పడింది 1953 Oct 1న కదా (పొట్టి శ్రీరాములు గారు అమరుడైన ఫలితంగా). అందువల్ల ఉమ్మడి ఆం.ప్ర. ను సూచించే నవంబర్ ఒకటి అనే తేదీ historical గా తప్ప ఇతరత్రా irrelevant అయింది కదా? కాబట్టి తిరిగి అక్టోబర్ ఒకటే సబబని నా ఉద్దేశం.
(4). అసలు 2014 విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ పేరు తీసేసి “ఆంధ్ర” రాష్ట్రం అన్న ఒరిజినల్ పేరుని పునరుద్ధరించినట్లయితే అవతరణదినం గురించిన ఈ సందిగ్ధానికి ఆస్కారం ఉండేది కాదేమో? ఇప్పుడైనా మీరు కేంద్రంతో మాట్లాడి AP పేరు ఆంధ్ర రాష్టం గా మార్చడం గురించి విభజన చట్టానికి సవరణ చేయించే ప్రయత్నం చెయ్యమని మనవి.
(5). అతకని తేదీ, అతకని పేరుతో కొనసొగడం పూర్తిగా అనవసరం . కాబట్టి :—
(a). రాష్ట్ర అవతరణ దినం (State Formation Day) తేదీని వచ్చే సంవత్సరం నుండైనా అక్టోబర్ 1 కు (October 1) మార్చమని;
(b). అలాగే కేంద్రంతో మాట్లాడి రాష్ట్రం పేరు “ఆంధ్ర స్టేట్” గా (Andhra State) మార్పించమనిన్నూ —
మీకు విన్నపం చేస్తున్నాను.
సానుకూలంగా స్పందిస్తారని, తగిన చర్యలు తీసుకుంటారనీ ఆశిస్తున్నాను.
Thanking you Sir,
Yours faithfully,
======================================================
LikeLike
ఆమధ్య ఒక డాట్టారు రావిశాస్త్రి కథలు చదివాక ఏదో పిచ్చి పిచ్చిగా రాయడం మొదలుపెట్టారు. ఇపుడు మీరు కూడా మాకు దక్కకుండా పోతారా?! వా… వా…(దొంగ ఏడుపు)
LikeLike
సూర్యగారూ, దొంగ ఏడుపని చెప్పి రక్షించారు. లేకపోతే ఝడుసుకునే వాణ్ణే.
/పిచ్చి పిచ్చి/ ఆ మాట వింటే భానుమతి పాటొకటి గుర్తుకొస్తాంది 😇 (JK)
LikeLike
ఆ “డాట్టారు” విసుగు చెంది బ్లాగుల నుండి తప్పుకున్నారు, అంతే గానీ పిచ్చి పట్టలేదు. మంచి బ్లాగర్. నష్టం పాఠకులది
LikeLike
థాంక్యూ VNR సర్! ఆ డాట్రారి బ్లాగు చదవడం మొదలెట్టిన కొన్నాళ్ళకే ఆయన తప్పుకున్నారు. తప్పుకోవద్దని రిక్వెస్ట్లు పెట్టినవాళ్ళలో నేనూ వున్నాను.
LikeLike
నేనూ ఉన్నానండి YVR గారు. ఎంతమంది చెప్పినా వారు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. బాగా హార్ట్ అయినట్లున్నారు .
LikeLike