Neil Arm💪strong (అనే) నీల బాహు🏋️‍♂️బలి


ఇవాళ ఈనాడులో ఒక ఐటమ్ చూశాక పాత టపా ఒకటి తిరగదోడాలనిపించింది. ఆ ఐటమ్ ఇదీ –

https://www.eenadu.net/cinema/newsdetails/2/2019/08/09/138828/Doctor-Strange-director-Scott-Derrickson-is-all-praises-for-THIS-scene-from-Baahubali

ఒక్క ‘ఈగ’ తప్ప తక్కిన రాజమౌళి సినిమాలన్నీ అరవ్వాళ్ళకీ, శివాజీగణేశన్తో సహా అతి అంటే ఏంటో పాఠాలు చెప్తున్నట్లు అనిపిస్తాయి (నాకు). మీకలా అనిపించకపోతే మీ తప్పుకానీ, అందుకు నా పూచీ కానీ ఏం లేవండోయ్. 133 కెమెరాలు పెట్టి తీసిన బెన్-హర్ ఛారియట్ రేసూ, మిట్టమధ్యాహ్నం వెన్నెల కురిపించిన మార్కస్-బార్ట్లే ” లాహిరి లాహిరి లాహిరిలో …” చూసిన కళ్ళు రబ్బర్ లా ఒంగిపోయే సాగిపోయే గ్రాఫిక్ తాటిచెట్లకి, వాటి మీదెక్కి కోటగోడల్ని దూకేసే కాన్సెప్టుకీ ఇంకా అలవాటు పళ్ళేదు మరి.

అందుకేనేమో స్కాట్ డెరిక్సన్ అనే ఆ హాలీవుడ్ డైరెక్టర్ కి ఆ తాటిచెట్టు-బేస్డ్ లాంచింగ్ సీన్ చూసి ఒళ్ళు పులకరించి పోయిందంటుంటే ఇక నా కాన్సెప్టు చూస్తే అమాంతం ఆనందబాష్పాలు కురిపిస్తాడనిపించి మళ్ళీ పోస్టు చేస్తున్నా, డెరిక్సన్ కి తెలిసినవాళ్ళెవరైనా ఇవి చూసి ఆయనకి పంపి పుణ్యం కట్టుకుంటారనే ఆశ కూడా ఎక్కడో ఓ మూల లేకపోలేదు. ఇంతకీ ఇదుగో నా కాన్సెప్టు,

NASA, ISRO లాంటి సంస్థలకి కావాలంటే సరసమైన ధరలకి ఇలాంటి కాన్సెప్టులు చాలా సరఫరా చేస్తాం, డైరెక్టుగా ఓ ఈ-మెయిలు కొట్టండి చాలు 😉

(Btw, చిన్న వివరణ, రాజమౌళి స్టైలుని comparison కోసం అరవ అతిని వాడుకున్నా నిజానికి ఈయన స్టైలుని అతి అనేకంటే subtility తక్కువ, boldness & loudness ఎక్కువ అంటే యాప్ట్. అరవ అతి is in its own class & is incomparable.)
ఇంతే సంగతులు, బై4నౌ🙏😉

21 thoughts on “Neil Arm💪strong (అనే) నీల బాహు🏋️‍♂️బలి

 1. విన్నకోట నరసింహారావు

  పాటకి నేనూ, అందానికి మా అప్పా .. అన్నదట ఓ గాడిద. వీళ్ళు తీసే సినిమాలని పరస్పరం పొగుడుకోవలసిందే.

  చెత్త తీసి చిన్నపిల్లల్ని వెర్రెక్కిస్తున్నారు. ఈ కొండ మీద నుండి ఆ కొండ మీదకు పెద్ద జలపాతాన్ని దాటేట్లు దూకడం అదో హీరోయిజం అన్నట్లు హైప్ ఇవ్వడం బాధ్యతారాహిత్యం కాదా? అది చూసి ప్రభావితమై అదిలాబాద్ జిల్లాలో ఒక కుర్రాడు ఒక జలపాతాన్ని దూకబోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడనే వార్త చదివినా వీళ్ళకు పశ్చాత్తాపం కలగదా అని? Most probably కలగక పోవచ్చు లెండి …. అనుకరించడానికి ప్రయత్నించద్దు అనే ఓ పనికిమాలిన disclaimer పారేసి చేతులు దులుపేసుకుంటారు … సినిమా అయినా, సాఫ్ట్ డ్రింక్ అడ్వర్టైజ్మెంట్ అయినా.
  గ్రాఫిక్స్ రావడం కోతికి కొబ్బరికాయ దొరికినట్లైంది.

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   VNR sir, సామెత సూపరు.
   ఆ మధ్య చైనాలో కొందరితో మాటల్లో మన సినిమాల ప్రస్తావన వచ్చి వాళ్ళు మన సినిమాలు చూస్తూ వుంటామని అన్నారు. తప్పక బాహుబలిని మెన్షన్ చేస్తారనుకున్నా. కానీ దంగల్‌, 3 ఇడియట్స్…. గురించి చెప్పారు. 😊

   Like

   Reply
   1. విన్నకోట నరసింహారావు

    “3 ఇడియట్స్” కన్నా “దంగల్” ok (నాకు). But on the whole … sensible people మీ చైనీయులు.

    Like

    Reply
 2. విన్నకోట నరసింహారావు

  మీ ‘కిట్టాట్టమి” పోస్ట్ రాలేదేమని చూస్తున్నాను. ఈ లోగా మా తరఫు నుండి కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

  “జయ జనార్థనా కృష్ణా రాధికా పతే” పాటను ఆస్వాదించండి 👇.

  Like

  Reply
   1. విన్నకోట నరసింహారావు

    అవున్లెండి, లేట్ నైట్ వీరుడు కదా, మరీ తెల్లవారుఝామునే లేవటం కష్టమే. “తెల్లవార వచ్చె తెలియక నా స్వామి మళ్ళీ పరుండేవు లేరా” పాట వినిపించకపోయారా, పోనీ 👇? 🙂
    https://youtu.be/U3OFrKoo0JU

    Like

    Reply
 3. Anonymous

  మా కృష్ణుని కిప్పుడె రా
  యా కొంచెమిక తెలవారె! యవనారి యిదే
  మీ కొరకువచ్చె నరస
  న్నా! కానుకలిచ్చి వందనమ్మనుడయ్యా!

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   జిలేబిగారూ, వాటర్లూ స్ట్రీట్ కృష్ణన్ టెంపుల్లో వుండగా మీ పద్యాలు చేరాయి. అవే ఆయనకి కానుకలు 😊

   Like

   Reply
   1. విన్నకోట నరసింహారావు

    ఆ పద్యాలను కృష్ణుడి ముందర పెట్టి .. ఇదే ఫలం, ఇదే పుష్పం, ఇదే తోయం .. అనుకోమని నివేదించారా వైవీ 🙂‌?

    Like

    Reply
    1. YVR's అం'తరంగం' Post author

     VNRగారు, పత్రం, పుష్పం, ఫలం, తోయాల్లో ‘కంద’మూలాలు (జిలేబిగారి పద్యాలు) ఏ కేటగిరీయో తేల్చుకునే పని ఆయనకే వదిలేశాను. అసలే ‘నారదు’లవారి ఆఫరింగ్ కదా! 😊

     Like

     Reply
   2. Anonymous

    వాటర్లూ స్ట్రీట్ కృష్ణుని
    పాటల తోడు కొనియాడి వైభవముగ సా
    పాటు ప్రసాదము గొని క్రాం
    జీ టేషనుకిదె జిలేబి జీ బై బై బై 🙂

    Like

    Reply
 4. Anonymous

  చూడుమదే చెలియా యని
  పాడుచు కృష్ణాష్టమిని ప్రభలు వెలుగంగన్
  వేడుచు యవనారిన్ మన
  వాడిన్ రారమ్మని పిలువవయా వైవీ 🙂

  Like

  Reply
 5. వెంకట రాజారావు . లక్కాకుల

   

  శిరముపై కమనీయ శిఖి పింఛముల వాడు

  చెవుల కుండల దీప్తి చెలువు వాడు

  నుదుటిపై కస్తూరి మృదు తిలకముల వాడు

  ఉరమున కౌస్తుభం బొలయు వాడు

  నాసాగ్రమున గుల్కు నవ మౌక్తికము వాడు

  కరమున వేణువు మెరయు వాడు

  చర్చిత మైపూత హరి చందనము వాడు

  గళమున ముత్యాల కాంతి వాడు

   

  తరుణ గోపికా పరి వేష్ఠితముల వాడు

  నంద గోపాల బాలు డానంద హేల

  లీల బృందావనము రాస కేళి దేల

  వచ్చు చున్నాడు కన్నుల భాగ్య మనగ .

   

   

   

   

   

   

   

   

   

  శిరముపై కమనీయ శిఖి పింఛముల వాడు

  చెవుల కుండల దీప్తి చెలువు వాడు

  నుదుటిపై కస్తూరి మృదు తిలకముల వాడు

  ఉరమున కౌస్తుభం బొలయు వాడు

  నాసాగ్రమున గుల్కు నవ మౌక్తికము వాడు

  కరమున వేణువు మెరయు వాడు

  చర్చిత మైపూత హరి చందనము వాడు

  గళమున ముత్యాల కాంతి వాడు

   

  తరుణ గోపికా పరి వేష్ఠితముల వాడు

  నంద గోపాల బాలు డానంద హేల

  లీల బృందావనము రాస కేళి దేల

  వచ్చు చున్నాడు కన్నుల భాగ్య మనగ .

  Like

  Reply
   1. విన్నకోట నరసింహారావు

    ఆనాటి “జయ కృష్ణా మూకుందా మురారీ” పాటలోని “కస్తూరీ తిలకం” భాగాన్ని అత్యంత సరళమైన పదజాలంతో అద్భుతంగా వివరించారు రాజారావు మాస్టారు 👏🙏.

    Like

    Reply
    1. విన్నకోట నరసింహారావు

     Correction :- జయ కృష్ణా ముకుందా మురారీ

     Like

     Reply
 6. Anonymous

  ఇమ్ముగ మనసున కింపుగ
  తెమ్మర వీచిన విధముగ తేవె చెలి‌ ప్రసా
  దమ్ము‌ను కృష్ణాష్టమి నా
  డమ్ముని యోగీశ్వరుని కెడ నిడ జిలేబీ !

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   జిలేబిగారు, వాటర్లూ స్ట్రీట్ వాసుడు మంచి వెన్నలాంటి పద్యం అనుకుంటున్నాడు 🙏😊

   Like

   Reply
    1. Anonymous

     బొప్ప లెన్ని గట్టినను గబుక్కు కంద
     ముల సమర్పించు కొనెనుగా ముగుద యేను
     తప్పు లెన్నక తలదాల్తు! తరుణి భాగ్య
     ముల సదా కాచెదనిక సముచిత రీతి !

     Like

     Reply

Leave a Reply to Anonymous Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s