Chandrayaan2 – చందమామకి కాసిని చక్కిలాలు, జిలేబీలు + కంద ఫ్రై, ఘాటుగా గోంగూరా …


ఇవాళ సాయంత్రం కాలవొడ్డున షికారుకెళ్ళా …. అప్పుడు తీసిన ఫొటోలే ఈ టపాకి దారి తీశాయి.

చంద్రన్న అంటే మళ్లీ పాలిటిక్స్ గుర్తొస్తాయి. చందమామలో వున్న హాయి చంద్రన్నలో వుంటుందా? నెలరాజులో వున్న చల్లదనం రాజన్నలో దొరుకుతుందా? ఏమో మరి? ప్రస్తుతం మన టాపిక్ వేరు.

చందమామని నా P900 తో క్లోజప్ షాట్ తీశా….

నల్ల కళ్ళజోడు పెట్టుకుని వాళ్ళక్కయ్య, అదే మన పుడమితల్లి వైపు చూస్తున్నట్టు అనిపించాడు, మావయ్య. ఆయన మనసులో మాటలు కూడా వినిపిస్తున్నట్టు అనిపించాయి.

పాపం, మావయ్య!! మన కోసం గోగుపూలు, బంతిపూలు, పారిజాతాలు, తేనెపట్లు పట్టుకొచ్చి వ్వడమే కానీ పాపం ఇక్కణ్ణుంచి ఏమీ తీసుకెళ్లినట్టు లేదు, అప్పుడప్పుడూ నీలాపనిందలు తప్ప.

ఘటోత్కచుడికి ఆవకాయతో కలిపి నవకాయ పిండివంటలు పెట్టిన వాళ్ళం చందమామకి కాసిని చక్కిలాలు, తియ్యటి జిలేబీలు + కంద ఫ్రై, ఘాటుగా గోంగూరా (వెల్లుల్లి కలిపి ఒకటి, కలపకుండా ఒకటి)…. పంపించలేమా?

తప్పకుండా పంపిస్తాం. మన ISRO తల్చుకుంటే మన Manned Moon Mission నాటికి మన Astronauts చంద్రుడి మీద land అయ్యాక తినేందుకు అవే కారేజీలో సర్ది పంపించెయ్యగలరు.

ఈ నా ఆలోచన్లు గ్రహించినట్టున్నాడు, మరీ ధగధగలాడిపోతున్నాడు చూడండి, చందమావయ్య 😍.

With Best Wishes for

Chandrayaan-2

ఇంతేసంగతులు.బై4నౌ 🖐😀

30 thoughts on “Chandrayaan2 – చందమామకి కాసిని చక్కిలాలు, జిలేబీలు + కంద ఫ్రై, ఘాటుగా గోంగూరా …

  1. YVR's అం'తరంగం' Post author

   జిలేబిగారు, నా ఉద్దేశం ఈ టపా చదివాకే లాంచ్ పోస్ట్-పోన్ చేశారని. పనిలో పనిగా కారేజీ సర్దేసి లాంచ్ చేస్తే పిండివంటలు చందమామ మీద ఎన్నాళ్ళు నిలవుంటాయనే ఎక్స్పెరిమెంట్ కూడా చేసేయ్యచ్చు కదా!!

   Like

   Reply
 1. విన్నకోట నరసింహారావు

  ఆధా హై చంద్రయాన్ / యాన్ ఆధీ / హోజానే దో మెరీ యాన్ పూరీ / ములాఖాత్ పూరీ

  (లిరిక్స్ స్వల్ప అడ్జ‌్టస్ట్ మాడుకొళ్ళి 🙂)

  త్వరగా launch అవుతుందని ఆశిద్దాం – ఇజ్జత్ కా సవాల్ హై. మీరు goodies డబ్బాలు సర్దే‌సి ఉంచండి YVR గారూ.

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   వీఎన్నార్ సర్, పేరడీ సూపర్ 👌.
   మా ఫ్రెండు సలహా ఇచ్చాడు, టిఫిన్ కారీర్-తో పాటు అరిటాకు చుట్టి పంపించమని.😊

   Like

   Reply
   1. విన్నకోట నరసింహారావు

    అరిటాకు … గుడ్ ఐడియా.
    మరి కంద ఫ్రై, గోంగూర తినటానికి అన్నం కూడా కావాలిగా .. సో కొంత మామూలు అన్నం, కొంత ఈ కాలపు fad అయిన బ్రౌన్ రైస్ కూడా (ఆయనేం డైటింగ్ చేస్తున్నాడో తెలియదు కదా).

    Like

    Reply
  1. YVR's అం'తరంగం' Post author

   మాస్టారూ, మీరన్నది కరెక్టే కానీ ఇస్రో ఛైర్మన్ గారు Lunar టిఫిన్ కారీర్ వెజిటేరియన్ వెంకన్నకి నైవేద్యం పెట్టాలి కదా? కుదురుతుందా మరి?

   Like

   Reply
   1. Jai Gottimukkala

    “వెజిటేరియన్ వెంకన్న”

    అంత మాట అనేసారేమిటండీ. జయభేరి సైడు హీరో గారు తిరుమల వెంకన్న కులం ఎప్పుడే నిర్ధారించేసారు. అందరూ శాఖాహారులు అయితే రొయ్యల వేపుడేంకావాలి?

    Like

    Reply
    1. విన్నకోట నరసింహారావు

     …… రొయ్యల బుట్ట ఏమయింది? … అన్నది ఆ నానుడి అని గుర్తు.

     Like

     Reply
    2. YVR's అం'తరంగం' Post author

     జైగారూ, మీరు టాపిక్కుని స్వామివారి నుంచి జ.భే.సై.హీ. మీదకి మళ్ళిస్తున్నారు. జయభేరిపై జైగారి యుద్ధభేరి మోగిస్తున్నారు. 🙂

     Like

     Reply
    3. సూర్య

     ఆయన నిర్ధారించేశాననగానే నమ్మేయడమేనా?

     Like

     Reply
    1. YVR's అం'తరంగం' Post author

     మాస్టారూ! రాజుగారమ్మాయికి వంట ఏం చేస్తుందిలెండి. వకుళమాతే కందమూలాలు వడ్డించి వుంటుంది. ఇంక అలివేలమ్మకి సవతిపోరు తల్చుకుని వంట ధ్యాసే వచ్చివుండదు. బీబీగారు వంట మొదలుపెట్టేలోపు ఆవిడకి నామాలూ, శంఖచక్రముద్రలు వేసేసి వుంటారు. అంచేత స్వామివారు నాన్వెజ్ జోలికి వెళ్ళివుండరు. పోక పోక వేటకి పోతే అక్కడా ప్రేమలో పడి వేట మర్చిపోయారు. అయినా నాన్వెజ్ కావాలంటే చెల్లెలింటికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోయే ఛాన్సుంది కదా! రామావతారంలో ఏ నిర్భంధాలు, మొహమాటాలు లేవు కూడా. (సరదాగా🙏)

     Like

     Reply
  1. YVR's అం'తరంగం' Post author

   మాస్టారు, మన “వీరభక్తు”లు స్వామివారికి ఇష్టమైనవి ఎప్పుడు ఏం చేశారండి? నామాలు V షేపులో వుండాలా? U షేపులో వుండాలా?లాంటి రాధ్ధాంతాలు, పింక్ డైమండ్ వివాదాలు, తప్ప? ఆయనకేం కావాలో అడుగుతారా? చెప్పింది వింటారా? అడిగింది పెడతారా?

   Like

   Reply
 2. విన్నకోట నరసింహారావు

  YVR గారు,
  దేవుళ్ళు మాంసాహారులే అనుకుంటానండీ. సందేహం ఉంటే … వనవాసంలో సీతాదేవి మాంసం వరుగులు పెడుతోందని రంగనాయకమ్మ గారు “విషవృక్షం”లో చెప్పారు చూడండి 🙂.
  ఇంకా (పాత) “అందాలరాముడు” సినిమాలో … బామ్మ గారూ, మీరు అంతగా పూజించే రాముడు మీ కులం వాడు మాత్రం కాదండి … అని అక్కినేని నోట పలికిస్తారు ముళ్ళపూడి.
  ఏతావాతా చెప్పేదేమిటంటే నాన్-వెజ్ వంటకాలు కూడా వేరే కారేజీలో కట్టించండి. పెద్దలు రాజారావు మాస్టారు గారి మాట మన్నించాలిగా.
  చివరి పాయింట్ … దేవుళ్ళు మందుప్రియులు కూడా కదా. ఆ రెండు కారేజీలతో బాటు మాంఛి స్కాచ్ సీసా కూడా పెట్టండి. ఆ వంటకాలు, పిండివంటలు నిలవ ఉన్నా ఉండక పోయినా ఈ ఆఖరి ఐటెం మాత్రం ఖచ్చితంగా నిలవుంటుంది☝️🙂.

  Like

  Reply
  1. Jai Gottimukkala

   “దేవుళ్ళు మందుప్రియులు కూడా కదా”

   పెద్దలు విన్నకోట నరసింహారావు గారు ఉజ్జయిని కాలభైరవ భక్తులనుకుంటా 🙂

   మహాశివుడు చిల్లం కూడా కొడతాడట. అగ్గిపెట్టె వెంట తీసుకెళ్లడం మరువరాదు. (అన్నట్టు ఆక్సిజెన్ లేని చోట పుల్ల వెలుగుతుందా? ఎందుకయినా మంచిది “తంబాకు” జర్దా/నశ్యం బెటరేమో)

   “రొయ్యల బుట్ట ఏమయింది? … అన్నది ఆ నానుడి అని గుర్తు”

   అవునండీ కాకపొతే చంద్రుని మీద కుంపటి దొరుకుతుందని నమ్మకం లేదు కనుక ready-to-cook బదులు MRE ration అంటూ మార్చడం “జరిగింది”.

   గిరీశం అన్నట్టు “అప్పడుప్పుడూ literary allusions మారిస్తే తప్ప wordsmith కానేరడు”

   On a more serious note, please see the following links. Both the DC & Virginia museums are worth a visit if you are in the neighborhood. Please note the Udvar-Hazy Center is
   not accessible by public transport: get a ride if you do not drive (conditions apply: under some circumstances you may need a ride even if you hold a valid driver’s license!)

   https://airandspace.si.edu/
   https://airandspace.si.edu/collection-objects/lunar-module-2-apollo

   Like

   Reply
   1. విన్నకోట నరసింహారావు

    రోదసీ టిఫిన్ కారేజీ కోసం మీరు ఇచ్చిన సూచనలు బాగున్నాయండి జై గారు. వాటిని ఫాలో అయిపోవచ్చు వై.వి.ఆర్ గారు 🙂.
    స్పేస్ మ్యూజియాల లింక్ లిచ్చినందుకు థాంక్స్. లింకులలోని సమాచారం ఆసక్తికరంగా ఉంది. ఆ వైపులకు వెళ్ళే అవకాశాలు తక్కువ. Washington DCకు చాలా దగ్గరలో Virginia రాష్ట్రంలో నా క్లాస్మేట్, చిరకాల మిత్రుడు నివసిస్తుండేవాడు. ఈ మధ్య కాలం చేశాడు. కాబట్టి వర్జీనియా వైపు వెళ్ళడానికి ఇక ఇప్పుడు ప్రేరణ ఏమీ లేదు. మన బ్లాగరొకరు ఆ రాష్ట్ర నివాసే, అయినా నేను అటువైపు వెళ్ళే అవకాశాలు చాలా చాలా తక్కువ.
    Ohio రాష్ట్రంలోని డేటన్ నగరంలో (Dayton) US ఎయిర్ ఫోర్స్ మ్యూజియం ఒకటి ఉంది. అది చూశాను. రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నగరం మీద అణుబాంబు వెయ్యడానికి వాడిన విమానం కూడా ఉంది.

    Like

    Reply
   1. విన్నకోట నరసింహారావు

    భారతదేశపు మొట్టమొదటి రాకెట్ కోన్ ను సైకిల్ వెనకాల కట్టుకుని తీసుకువెడుతున్ళ (తుంబా కేంద్రం, కేరళ) ఫొటో “ఇలా మొదలైంది” అని పైన పెడితే మిత్రులెవరూ గమనించినట్లే లేదే, ప్చ్ 😕.

    Like

    Reply
 3. lalithats

  చందమామకి చక్కిలాలూ
  జాబిల్లికి జిలేబీలూ
  బాగు బాగు మీ బ్లాగు బహుబాగు!

  Like

  Reply
 4. విన్నకోట నరసింహారావు

  YVR గారు,
  మీ రోదసీ టిఫిన్ కేరేజీని శ్రీహరికోటకు పంపించారా? ఎగరడం ఈ రోజే 👍.

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   సార్, మా స్పేస్(టిఫిన్)కారేజీ లాంచింగ్ సెపరేట్-గా చెయ్యాలని డిసైడ్ చేసాం. త్వరలో విడుదల … 😊😊😊

   Like

   Reply
   1. విన్నకోట నరసింహారావు

    అలాగా? ఓకే.
    ఫ్యూయల్ పంప్ నాణ్యమైనది పెట్టుకోండి 😀. ఆల్ ది బెస్టూ 👍.

    Like

    Reply
 5. సూర్య

  @”చందమామలో వున్న హాయి చంద్రన్నలో వుంటుందా? నెలరాజులో వున్న చల్లదనం రాజన్నలో దొరుకుతుందా? ఏమో మరి? ”
  “గ”గణంలో ఉండే ఆనందం”జ”గణం లో ఉంటుందా? అని కూడా రాసేయ్యాల్సింది. అటు రాజకీయాలని ఇటు వ్యాకరణాన్ని కూడా పూర్తిగా కలుపుకున్నట్లవుతుంది.

  Like

  Reply

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s