ఇదేం ఈక్వేషన్రా  వెంకటేశా!! దీని భావమేమి తిరుమలేశా!!


మట్టి+నీళ్ళు=అండా+దండా అట.

ఆహహా!! అలా అని ఎవరో అంటుంటేనూ!! ఇదేం

ఈక్వేషన్రా వెంకటేశా!! దీని భావమేమి తిరుమలేశా!! అనుకుంటున్నా 🤔

అంతే 🤗ఇంకేంలేదు🙏🤓.

తాడు ఒకటి తక్కువైందని ఎవరో అంటేనూ ….

ఆ పైన పిట్ట రెట్ట శాస్త్రాన్ని గుర్తు చేస్తేనూ….

👇👇👇

ఇంతే సంగతులు. బై4నౌ 🖐🤓

31 thoughts on “ఇదేం ఈక్వేషన్రా  వెంకటేశా!! దీని భావమేమి తిరుమలేశా!!”

 1. ఎప్పుడో ఒకప్పుడు జాదూ బాబాయ్ ప్రకృతిలో యోగా చేస్తూ దొరకడా, పిట్ట రెట్ట వెయ్యకపోతుందా? చూద్దాం.

  Like

 2. అబ్బా. క్రియేటివిటీ తో చించేసారు మాస్టారూ!
  సింబాలిక్ గా తాడు వెయ్యడం మరిచిపోయారు.
  ఎందుకంటారేమిటి?
  “మీ చేతిలో ఓ గాడిదా కా అండా, మీ ఫోటోకో దండా వేయడానికి మేం “కట్టుబడి” ఉన్నాం” అనే కదా అప్పుడూ ఇప్పుడూ కూడా జాదూ బాబాయ్ చెప్పింది.

  Like

  1. సూర్యగారూ, తాడునీ, పిట్టనీ భలే గుర్తు చేశారు. రెండూ యాడ్ చేసాను, మీరనుకున్నట్టు వచ్చిందేమో చూసి చెప్పండి . 🙂

   Like

 3. కొండొక సందేహమె నిజ
  మండా దండా జగనుడి కందుటపై , ఆ
  గండా గొండీ జాదూ
  మొండి ఘటము , నమ్మరాదు , ముందేమగునో !

  ఆంధ్ర ప్రజలు బాబు కరుదైన తీరున
  గొంతు కురి భిగించి కూల్చినారు ,
  కారణ ‘ మొక ‘ టేని కనిపించ లేదట !
  ఓట మెటుల వచ్చె నోరి దేవ్డ !

  పరి పరి విథముల వెదికితి ,
  ఉరి ముందా ? రెట్ట ముంద ? ఊహించుటకై ,
  వరుసలు తిక మక యయ్యెను ,
  సరసమతినిగాను , మీరు స్పష్ట పరచుడీ .

  Like

  1. మాస్టారూ, మీ పద్యాలు చదువుతుంటే శ్రీశ్రీ గారి సి.ప్రా.లి చదివినట్టు వుంటుంది. 🙏🙏🙏🙏

   ఇంతకీ ఉరి ముందా? రెట్ట ముందా? అన్నారు, ముందు వెనకల సమస్య లేదండి. ఏదో ఒకటి “(తీసు)కొంటే” రెండోది ఫ్రీ Buy one, Get one FREE 😉

   Like

 4. మరీ ఉరేసుకుంటున్నవాడి నెత్తి మీద రెట్ట అంటే … ధర ఖర్వాటుడొకండు … అన్నట్లుంటుందేమో?
  (పద్యం సరిగ్గా గుర్తు లేదు. పూర్తిపాఠం రాజారావు మాస్టారు చెప్పాలి)

  Like

  1. @VNRగారు,
   రెట్ట పడ్డాక, ఉరి తప్పదు.
   ఉరేసుకునే వరకూ రెట్టలు తప్పవు.
   రెట్ట నిరంతర ప్రక్రియ.
   ఉరి ఐదేళ్ళకోసారి.

   Like

  2. ధర ఖర్వాటు డొకండు సూర్య కర సంతప్త ప్రధానాంగుడై
   త్వరతోడన్ బరువెత్తి చేరి నిలిచెన్ దాళద్రువచ్ఛాయద
   చ్ఛిరముం దత్ఫల పాత వేగమున్ విచ్చెన్ శబ్ద యోగంబుగా
   బొరి దైవోపహతుండు వోవుకడకుం బోవుంగదా యాపదల్

   Like

   1. పూర్తి పద్యం ఇక్కడ పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు రాజారావు మాస్టారూ.
    రచయితెవరో కూడా గుర్తు రావడంలేదు. భర్తృహరి సుభాషితమా?

    Like

    1. వెద్దలు నరసింహరావుగారికి నమస్సులు .
     భర్తృహరి సుభాషితమే , ఏనుగు లక్ష్మణకవి
     రచన . ఒక్కపద్యంలోనే కథ చెప్పి , దైవోపహతు డెక్కడ దాక్కున్నా ఆపదలు వెతుక్కుంటూ వస్తాయంటాడు .
     ధన్యవాదాలు .

     Like

     1. అవును మాస్టారూ . ధన్యవాదాలు🙏.

      Like

 5. YVR గారూ, చెంబు మతలబు ఏమిటో బోధపడలేదు. చంబా చెంబట్టుకుపోయాడనడం మీ ఉద్దేశ్యమయితే ఆయన చంచాలు మీమీద పడి గొడవ పెట్టడం ఖాయం. అసలే మీరు జయభేరి సైడు హీరో బాబాయి పెర్మిషన్ తీసుకోకండానే వెంకటేశా తిరుమలేశా అంటూ copyright violation చేసారు!

  Like

  1. జై గారూ! ఎవరి మేజిక్ షోలకి మొదటి ప్రేక్షకుడు వెంకటేశుడు అలియాస్ తిరుమలేశుడో; చెంబు, నీళ్లు, మట్టి, అండా, దండా అన్నీ ఎవరి మాజిక్ టోపీలోంచి తీసినవో, సూర్యగారు కనిపెట్టేశారు.

   ఇంక ఉరేసుకోడానికి సాధారణంగా సీలింగ్ ఫానూ / దూలం / చెట్టు + స్టూలూ / టేబులూ/ సైకిలూ / కారూ ఏవైనా పర్లేదు. తాడు ఒకటీ వుంటే ఎలాగైనా ఉరేసుకోవచ్చు. అందుకే అదొక్కటీ మేజిక్ టోపీలోంచి తీసిస్తున్నారు.

   Like

    1. జైగారూ, నేను విన్నదేంటంటే ‘ఉప’ అనే ప్రిఫిక్స్ ఎవరికుంటే వారు “ఆరోవేలు”కి సరి సాటి అని.
     మీరు సమస్యని రాష్ట్ర సరిహద్దులు దాటనిచ్చేలా లేరే !! 😀

     Like

  1. KMVగారు, పోస్టు చదివినందుకు నెనరులు. మీ సూచనపై ఆలోచించాను. మిమ్మల్ని కన్విన్స్ చెయ్యగలనో లేదో కానీ నా అభిప్రాయం ఇదీ – “దీనిభావమేమి తిరుమలేశా” అనేది perplexityని వ్యక్తీకరించే ఒక జాతీయంగా వాడబడుతోంది. దేవుడూ, భక్తీ కంటే ఇక్కడ ఎక్స్ప్రెషనే ప్రధానం. దాన్నే కాస్త ఆంగ్లీకరించి, ఇంకో వాక్యం పుట్టించాను, అంతే. అందువల్ల ఆ వాక్యం మార్చనవసరంలేదు. అందులోనూ ఇది దేవుడిపై వ్రాసిన పోస్టు కూడా కాదు.

   Like

   1. చెన్నగునో కాదో ము
    న్నెన్నడు కలుగని “అది” మరి నేరుగ కలుగున్
    హన్నన్నా రా కొట్టకు
    డన్నా వెంకన్న పైన డాబుసరిగనౌ

    నారదా
    జిలేబి

    Like

     1. జిలేబి పద్యములన్ చదివి చదివి పొందిన తర్ఫీదు ఆడిదపు పద్యములన్ బర్ఫీ వలె తినంగ తోడ్పడెన్ 🙂

      జిలేబి

      Like

      1. జిలేబి తర్ఫీదిచ్చినయ
       డిదము బర్ఫీయగు, కూ
       చిమంచి కుల్ఫీయగు, డౌ
       టులేదు, మర్ఫీబేబీకైనన్

       (జిలేబిగారి తర్ఫీదుతో రచించిన ఈ “పద్యము” వారికే అంకితం 🙏🏽😊)

       Like

 6. “జిలేబి” గారికి అంకితమా? సరైన గురుదక్షిణ 👌.
  కానీ పాపం, అడిదం సూరకవి గారు బర్ఫీ అయ్యారు, కూచిమంచి వారు (ఎవరు వారు?) కుల్ఫీ అయ్యారు.

  అల్లు అర్జున్ నటించిన ఒక సినిమాలో (“ఇద్దరమ్మాయిలతో”?) బ్రహ్మానందం పాడిన 👇
  // శంకరాభరణంతో స్నానం చేస్తా // నేను కీరవాణి రాగంతో కూరొండేస్తా // హంసధ్వని రాగంతో హింసించేస్తా //
  పాట గుర్తొచ్చింది.

  Like

  1. వీయెన్నార్ సర్ !!
   //కానీ పాపం, అడిదం సూరకవి గారు బర్ఫీ …. కుల్ఫీ …// కూచిమంచి తిమ్మకవి నన్ను టెంతుక్లాసులో చాలా తిప్పలు పెట్టారు. ఆయన పద్యాలు బట్టీ కొట్టడానికి చాలా కష్టంగా వుండేది. ఆ కసి ప్లస్ జిలేబిగారు అడిదంవారిని అంతకుముందే బర్ఫీ చేయడం చూసి, ఆయనని కుల్ఫీ చేసాను. of course, వాళ్ళ కవిత్వాలనే కానీ వాళ్ళని కాదనుకోండి. “He is an authority on Shakespeare” అనేలాంటి అర్థంలోనే … 😊

   Like

 7. YVR గారు,
  ఇవాళ్టి 03-July-2019 Deccan Chronicle (Hyd) లో వచ్చిన వార్త ప్రకారం మీదేశం సింగపూర్ GST e-Refund విషయంలో మోసం చేసినందుకుగాను ముగ్గురు భారతీయులకు (తమిళ సోదరులట) భారీగా జరిమానా విధించిందిట. మొదటి లింక్ చూడండి 👇. మన వాళ్ళు మహా తెలివైన వారండీ (వక్రంగా).
  http://epaper.deccanchronicle.com/articledetailpage.aspx?id=13305523
  రూల్స్ ప్రకారం (లింక్-2 👇) సింగపూర్ పౌరులు, Permanent Residentలు ఈ రిఫండ్ కు అర్హులు కారట. విదేశీపర్యాటకులు మాత్రమే అర్హులట. కానీ ఫైన్ (fine) పడ్డ ముగ్గురిలో ఒక వ్యక్తి PRట … ఏమిటో విచిత్రం 🤔?
  https://www.visitsingapore.com/en_in/travel-guide-tips/tourist-information/gst-tax-refund/
  స్కీమ్ మంచిదే. పర్యాటకులు షాపింగ్ మీద ఖర్చు పెట్టడానికి ప్రోత్సాహం లాగా పనికొస్తుంది. ఇప్పుడు e-system చేసినట్లున్నారు, క్లెయిమ్ చెయ్యడం
  మరింత సులభతరంగా ఉండుంటుంది.

  Like

  1. ఏ చిన్న అవకాశం ఉన్నా మనవాళ్ళు పన్ను ఎగ్గొట్టడానికి రడీ గా ఉంటారు. ఆ విషయం లో రాష్ట్రాలకు అతీతంగా జాతి యావత్తూ ఒకేలా ఆలోచిస్తుంది. అడ్డంగా దొరికినప్పుడు మాత్రం సరదా తీరుతుంది.

   Like

   1. అలా చెప్పండి. లోకల్ టాలెంట్ తో కుమ్మక్కయ్యారన్నమాట, మరింకేం. ఏమైతేనేం, ఇటువంటి వారు అందరూ కలిసి భారతీయుల పరువు తీస్తున్నారు 🙁.

    ఆ మధ్య స్విట్జర్లాండ్ లో ఓ మూడు నెలలు గడపడం “జరిగింది” (–> తెలుగు రాజకీయ నాయకుల పదజాలం అన్నమాట 🙂). అప్పుడు గమనించాను … మేం వెళ్ళిన ఊరి పొలిమేరని ఒకవైపు దాటితే జర్మనీ దేశంలోకి అడుగుపెడతాం. అటూ ఇటూ ట్రాములు నడుస్తాయి కూడా (మా visa యూరప్ లో చాలా దేశాలకు పనికొచ్చే Schengen Visa లెండి). సరిహద్దు దాటగానే జర్మనీలో ఒక ఊరు, ఆ ఊరిలో ఓ పెద్ద మాల్ ఉన్నాయి. సరిహద్దు నుండి ఆ మాల్ ఓ వంద రెండు వందల గజాల దూరం, అంతే. ఆ మాల్ దగ్గరే ట్రామ్ స్టాప్ కూడా. అక్కడ చేసిన కొనుగోళ్ళ బిల్లులను సరిహద్దులోనున్న జర్మన్ కస్టమ్స్ కౌంటర్లో చూపిస్తే స్టాంప్ వేసి ఇస్తారు. ఆ స్టాంప్డ్ బిల్లు పట్టుకుని వెనక్కి మాల్ లోని ఆ దుకాణానికి వెడితే బిల్లులోని టాక్స్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు. లేదా అప్పుడు టైమ్ లేదని వెళ్ళిపోతే తరువాతసారి ఆ మాల్ కు వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకుని ఆ స్టాంప్డ్ బిల్లు వెంట తీసుకునివెళ్ళి ఆ షాపుల్లోచూపించి లబ్ధి పొందవచ్చు. విధానం సాఫీగానే నడిచేది. వాళ్ళదో పరిశుద్ధాత్మలని నేను అనడం లేదు గానీ … ఇటువంటి చిన్న చిన్న విషయాలకు కక్కుర్తి పడే స్కాండల్స్ జరిగాయని నేను వినలేదు. కానివ్వండి … ప్రపంచంలో రకరకాల వ్యక్తులు. It takes all sorts to make this world అని ఒక ఆంగ్ల నానుడి ఉన్నదే కదా.

    టూర్ వెళ్ళింది చైనాకా, బ్రెజిల్ కా? బ్రెజిల్ కు గనక అయితే అక్కడి “షుగర్ లోఫ్ మౌంటెన్” గురించి చెబుతానని మీరు బ్లాగుముఖతా గతంలో మాటిచ్చారు, గుర్తుందా? (jk 🙂)

    Liked by 1 person

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s