What YOU THINK you are
What OTHERS THINK you are
What you REALLY are
ఒక వ్యక్తిలో పై మూడు పార్శ్వాలు వుంటాయి. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా.
ఎంతటి
త్రిలోకసుందరుడు,
నవమన్మధుడు,
వెండితెర వీరుడు,
ఐనా సరే! పై మూడు పార్శ్వాలు వుండి తీరతాయి.
ఒకవేళ లేకపోయినా ఆయన జీవితంతో ఏదో రకంగా ముడిపడి ఆ కారణంగా లాభమో, నష్టమో పొందిన, ఇంకా పొందాలనుకుంటున్న వాళ్ళంతా ఎవరికి తోచిన పార్శ్వాన్ని వాళ్ళు చూపిస్తారు.
నోరు తెరుచుకుని; చెవులు, కళ్ళు అప్పగించి చూసేవాళ్ళు వున్నంత వరకూ.
ఆ చూపించడం కూడా మళ్ళీ రకరకాలు. ఎవరి శక్తి (కు)యుక్తులకి తగినట్టు వాళ్ళు.
చూపించేవాళ్ళు ఎలా చూపిస్తారో, అందులో తమ పాత్ర మీద ఏం బురద చల్లుతారో అని తమ సొంత వెర్షన్ చూపించే వాళ్ళు కొందరంటారు.
ఇప్పుడూ, సూర్యుడున్నాడు. ఆయన పని వెల్తురు వెదజల్లడం. ఆ వెలుతురు అద్దంలో పడినా, మురికిగుంటలో పడినా అది ప్రతిఫలిస్తుంది. సూర్యుడికి అదేం పట్టదు.