స్వఛ్-భారత్ సక్సెస్ – డీమానిటైజేషన్ డిజాస్టర్ – GST =గబ్బర్ సింగ్ టాక్స్


స్వఛ్-భారత్ సక్సెస్ అవ్వలెదనీ
డీమానిటైజేషన్ పేద్ధ డిజాస్టరనీ
జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ టాక్స్ అనీ
రాఫెల్ జెట్ల కొను ‘గోల’ అంబానీల లీల అని
.
.
ఇంకా చాలా చాలా అనీ ఎంతెంత (దుష్-)ప్రాపగాండా చేసినా వోటర్లంతా కలిసి మోదీ మేష్టారికి మళ్ళీ కిరీటం పెట్టేశారు. ప్రతిపక్షనేతల్లా మొహాలు వేళ్ళాడేసుకుని ప్రజాతీర్పుని స్వాగతిస్తున్నాం, శిరసావహిస్తున్నాం అనడం తప్ప ఇంకేమన్నా చెయ్యగలమా?
ఎందుకు చెయ్యలేం? చేస్తాం.
మోడీవేవ్, మోడీవేవ్ అని మనం తెగ సెలబ్రేట్ చేసేసుకుంటున్న వేవ్‌ని అర్ధం చేసుకోడం ఎలా అని ఆలోచిస్తాం.

అది ఆలోచించే లోపు రాష్ట్రంలో అసెంబ్లీ & పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ ని విశ్లేషించేందుకు చిన్న బ్రేక్ తీసుకుందాం.

ఈ విశ్లేషణని ట్రెడిషనల్ గా, ప్రొఫెషనల్ గా చేస్తే మనకీ , మేధావులకీ తేడా ఏవుంటుందీ? అందుకని అప్పటికప్పుడు గుర్తొచ్చిన సినిమాపాటల ఆధారంగా చేశా, సరదాగా .

మేధావులూ, ఎనలిస్టులూ ఎలాగూ వోటర్ల తెలివితేటల గురించీ, ప్రతిపక్షాల అనైక్యత గురించీ, సరైన ఆల్టర్నేటివ్ ప్రైమ్మినిస్టర్ కాండిడేట్ లేకపోవడం గురించీ, బీజేపీ వ్యూహాలు + వాళ్ళ కోడ్ ఉల్లంఘనల గురించీ, …. ఇలా బీజేపీ విజయానికి చాలా కారణాలు చెప్పచ్చు. ఒక నట్‌షెల్‌లో ఇలా అనేస్తారు –

 • Lack of opposition unity
 • Lack of an alternative PM personality
 • “Modi-is-personally-clean” image
 • “Hinduism-is-in-danger” propaganda
 • Tough & determined leader image
 • “No-scams-during-last 5 years” image (నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యాలని యూపీఏ ఎకౌంట్లో వేసేసినట్టున్నారు జనం)
 • Lack of a viable program on opposition side.
 • Hindi belt’s love for BJP’s Hindutva agenda
 • Stupidity of oppn. (Bashing Modi without showing alternative)

అవన్నీ కరెక్టైనా కాకపోయినా 2014లో కూడా వున్న ఫాక్టర్సే. మరి ఈసారి 21 సీట్లు ఎగస్ట్రా రావడానికి కొత్తగా ఏం ఫాక్టర్స్ కలిసొచ్చాయీ అని ఆలోచిస్తే ఒక మూడు పాయింట్లు కనిపిస్తున్నాయి. మరీ 21 సీట్లకీ కాకపోయినా అందులో కొన్నిటికైనా – ఎగస్ట్రా సీట్లు కాకపోయినా ఎగస్ట్రా వోట్లయినా సంపాదించడంలో – ఈ మూడు పాయింట్లూ దోహదం చేసుంటాయనిపిస్తోంది. ఒప్పుకోడం/కోకపోవడం మీ ఇష్టం. ఆ మూడు పాయింట్లూ – – –

పాయింట్ 1: ఫైటర్ జెట్లు రాడార్‌కి దొరక్కుండా బాలాకోట్ దాడి చెయ్యడంలో మబ్బుల్ని వాడుకోవడం అనే మోడీ-బ్రాండ్ టెక్నాలజీ ఇండియన్స్‌లో చాలామందికి నచ్చినట్టుంది.

పాయింట్ 2 : 1988లోనే డిజిటల్ కెమెరాలూ, ఈ-మెయిల్ ఫెసిలిటీ ఇండియాకి వచ్చేశాయని కూడా పైవర్గం ఒప్పుకుందని అనుకోవాలి.

పాయింట్ 3 : ఎలక్షన్లకి ఒక నెల ముందు వాట్సప్‌లో ఒక మెసేజ్ చాలామందిని నవ్వించింది. అది ఇదీ – Dear voters, we have two alternatives before us to choose from . One who thinks we are all stupids and the one we all think is a stupid. ఇది చూసి నవ్వుకున్నవాళ్ళున్నారు, ఆ రెండోవాడికి కాస్త బెనిఫిట్-ఆఫ్ -డౌట్ ఇచ్చి అందరం అనుకున్నట్టు కాక కాస్త తెలివిగా ఉంటాడేమో అనే ఆశాభావం వున్నవాళ్లూ వున్నారు. దీన్నిబట్టీ –
మన దృష్టిలో తెలివితక్కువగా కనిపించే వాడికంటే మనని వాజమ్మలూ, దద్దమ్మలుగా చూసేవాడినే నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తామని అర్ధమౌతోంది. దీన్నే కొంచెం పాజిటివ్ గా మన నాయకుడు మనకంటే తెలివైనవాడై వుండాలని మనం కోరుకుంటాం అని చెప్పుకోవచ్చు. అందులో తప్పేం లేదు కదా. ఆ ప్రకారమే నాయకుణ్ణి ఎన్నేసుకున్నాం కూడా. మన తెలివితేటలు- కలెక్టివ్ విజ్-డమ్ అందాం – ఏ పాటివో వచ్చే ఐదేళ్లూ తేల్చి చెప్పేస్తాయి. మొత్తమ్మీద 2019 మోడీ వేవ్ లో ఒకటి కాదు రెండు వేవ్స్ ఉన్నాయని అనుకుంటే మంచిదేమో. ఒకటి మోడీ కోసం, మోడీ వైపు ప్రవహించిన వోట్ల కెరటం. ఇంకోటి ప్రతిపక్షాలకి దూరంగా పారిపోయిన వోటర్ల అల.

ఏదేమైనా ఈరోజు ప్రమాణ స్వీకారాలు చేస్తున్న పాత పీఎంగారికి, కొత్త సీఎంగారికీ శుభాకాంక్షలు మరియు వోటర్ మారాజులకు ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ 5 ఇయర్స్. బై4నౌ.

12 thoughts on “స్వఛ్-భారత్ సక్సెస్ – డీమానిటైజేషన్ డిజాస్టర్ – GST =గబ్బర్ సింగ్ టాక్స్”

 1. మేధావి అంటే జనసామాన్యం ఏది నమ్ముతుందో దానికి వ్యతిరేక ప్రతిపాదన చేసే వ్యక్తి అని నిన్న ఎక్కడో చదివాను. అందుకని మేధావులు చెప్పినవి ఒక చెవితో విని మరో చెవితో వదిలేయడం మంచిది.

  Like

  1. అన్యగామిగారూ, మేధావికి మీ డెఫినిషన్ రైటే . జనం రైటా, మేధావి రైటా అనే ప్రశ్న రానంత వరకూ.

   Like

 2. పాటలు బాగా ‘పేరడిం’చారండీ 👌. మీకూ, మన “కాంగరూ” మిత్రుడు పవన్ కుమార్ కూ సినిమా రచయితలుగా మంచి భవిష్యత్తు ఉంటుంది, ప్రయత్నించరాదూ 👍 ?

  మేధావులు చేసే విశ్లేషణల మీద …… “అన్యగామి” గారి అభిప్రాయమే నా అభీప్రాయమున్నూ. వాళ్ళేదో మైలేజ్ పొందాలని వాళ్ళ తాపత్రయం అనిపిస్తుంది.

  Like

  1. //వాళ్ళేదో మైలేజ్ పొందాలని …//
   వీయెన్నార్ గారు, పార్టీల ఆస్థానమేధావులకీ, ఆర్మ్-ఛైర్ జనరల్స్ లాంటి సోషల్ మీడియా మేధావులకీ ఇది తప్పకుండా వర్తిస్తుందండి.

   Like

 3. జారిందోయ్ ఆ చైనూ
  పారిందోయ్ పాదయాత్ర ప్రభుతపు‌ గద్దెన్
  హోరుగ జోరుగ నెక్కన్
  రారండోయ్ మోడి జగను రాజ్యము చూద్దాం 🙂

  జిలేబి

  Like

  1. జిలేబిగారూ, పద్యం బావుంది, అర్ధం అయింది కూడా😉.
   ఇప్ పుడో దత్తపది ఇస్తున్నాను, పద్యం కట్టండి –
   చెవిలో పువ్వు-చేతికి చిప్ప – నెత్తిన ఫాను- సైకిలుకి బ్రేకు-గ్లాసొక జోకు

   Like

 4. చెవిలో పువ్వును చేతిలోన భళిరా చిప్పన్ జనుల్ బెట్టిరే
  పవనంబివ్వక ఫ్యాను నెత్తిన బడెన్ పక్కా ఫెయిల్యూరవన్
  జవసత్వంబులు బోవ బ్రేకుపడకన్ సైకిల్ ఢమాలాయె! వై
  వి! వినండయ్యరొ గ్లాసు జోకు కతలే భేతాళ గాధల్ సుమా!

  జిలేబి

  Like

  1. సూపర్👌👌👌 మాస్టారూ, పార్టీగుర్తులని చక్రం తిప్పిన బాబుగారి తీపిగుర్తులుగా మార్చిన తీరు భలే వుంది.

   Like

 5. YVR గారు! మీ పేరడీ పాటలు, పైన తెలుగు మాష్టారు రాసిన పద్యం ఒకదానికొకటి సరికి సరి!

  Like

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s