ఫీల్ గుడ్🎞సైన్మ మహర్షి + కొన్ని ఫన్నీ😜హైలైట్స్


నిన్న** మహర్షి సైన్మ చూశాం (గదేదో సైన్మలో కోట శ్రీనివాసరావు సినిమాని సైన్మా అంటడు). సైన్మ బావుంది. బావుంది అంటే యాజ్ ఎ ఫీల్-గుడ్ మూవీ బావుందని.  (** ఆ నిన్న అయిపోయి రేపటికి వారం) 

ఫీల్-గుడ్ మూవీ అనుకోకుండా చూస్తే చివరి అరగంటా బావుంది. ముందు రెండు గంటల సంగతేంటి మేష్టారూ అనడక్కండి. హీరోని ఎస్టాబ్లిష్ చెయ్యడానికి – అతని IQ లెవెల్స్, కండబలం, తనంత IQ లేని హీరోయిన్ని పడేసే (అదే లవ్వులో) విధానం, etc etcలకి – ఆ మాత్రం టైమ్ కావాల్లెండి. ఇది కాక మొదటి రెండు గంటల గురించి పెద్దగా హైలైట్ చెయ్యకపోడానికి వేరే రీజన్ కూడా వుంది.  

అదేంటో చెప్పుకునేముందు ఈ సైన్మలో కొన్ని ఫన్నీ హైలైట్స్ చెప్పాలి –

ఫన్నీ హైలైట్ 1

ఒక ఇంటర్నేషనల్ బాంక్ డైరెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ అందీ, అందక ముందే, పొలిటికల్-బాసులు ఆదేశాలు ఇవ్వకముందే ED ఆఫీసర్లు ఒక కార్పోరేట్ దిగ్గజం మీద రెయిడ్ చేసెయ్యడం ఈ సైన్మలో హైలైట్ చేసి తీరాల్సిన అంశం. ED, CBl, IT … లాంటి సంస్థలు ఇలా పనిచేస్తాయని డైరెక్టర్ మనకి చెప్పదల్చుకున్నాడా లేపోతే సంస్థలు ఇలా పనిచేస్తే బాగుండని కలగంటున్నాడా అనే దాంట్లో మాత్రం క్లారిటీ లేదు. తరవాత సైన్మలో ECని కూడా ఇంక్లూడ్ చేస్తారేమో చూడాలి.

ఫన్నీ హైలైట్ 2

ఒక వర్ల్డ్-క్లాస్ కంపెనీ సీఈఓ తను లీవ్ పెడుతున్నట్టు అనౌన్స్ చెయ్యగానే తక్కిన ఎక్జిక్యూటివ్స్ or  బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రియాక్టైన విధం, ఆ రియాక్షన్‌కి సీఈఓ రియాక్షన్ – బేసికల్లీ ఒకళ్ళ మీదొకళ్లు అరుచుకోడం – మహా ఆర్టిఫిషియల్‌గా, లౌడ్‌గా అనిపిస్తుంది.

ఫన్నీ హైలైట్ 3 

ప్రపంచంలోనే టాప్-రాంక్‌లో వున్న కంపెనీల అధిపతులు రోడ్ల మీద ఎలా ప్రయాణిస్తారో ఎప్పుడూ చూసిన పాపాన కానీ పుణ్యాన కానీ పోలేదు. ఈ సైన్మాలో మాత్రం సీఈఓ కారూ, దాని వెనక పది కార్లూ తిరగడం చూస్తే ఎన్నారై సీఈఓలూ ఫాక్షన్ సైన్మల్లో విలన్లు తిరిగినట్టే తిరుగుతారనుకోవాలి. ఒకటే తేడా, ఫాక్షనిస్టులు సుమోలు వాడితే సీఈఓలు కాడిలాక్ కార్లు వాడతారు.   

Now, లెట్ మీ టాక్ అబౌట్ ది ఫస్ట్ టూ అవర్స్ ఆఫ్ ద మూవీ,

ఇవాళ్టి కమర్షియలైజ్డ్-సామాజిక స్పృహని హైలైట్ చేసే తెలుగు సైన్మలల్లో – e.g. శ్రీమంతుడు, భరత్తనే నేను, జనతా గారేజ్, … …. … అన్ని పేర్లూ గుర్తు రావట్లేదు – రెండు రకాల హీరోలే కనిపిస్తారు. 

Either

ఎ మల్టీ బిలియనీర్ విత్ హైయ్యెస్ట్ IQ లెవెల్స్ ప్లస్ బాహుబలి అంత బలం 

or

ఎ మల్టీ బిలియనీర్ ఎన్నారై విత్ హైయ్యెస్ట్ IQ లెవెల్స్ ప్లస్ బాహుబలి అంత బలం 

ప్రతి సైన్మాలో ఇలాంటి హీరోలనే చూడ్డం చూసే మనకి, తీసే నిర్మాత/దర్శక/రచయితలకీ ఎందుకు బోరుకొట్టదో కానీ నాకు మహాబోరు అనిపిస్తోంది.  

మామూలు మనుషుల్లో, సాదాసీదా దారిన పోయే దానయ్యల్లో హీరోలుండరని మన నమ్మకంవల్లో,

దర్శక/రచయితల్లో క్రియేటివిటీ & కాన్ఫిడెన్స్ లేకో,

సైన్మ-మేకర్ల బాక్సాఫీస్ ఇన్సెక్యూరిటీకి నిదర్శనంగానో,

ఆ క్వాలిటీస్ అన్నీ ఉంటే తప్ప సొసైటీని బావు చేసుకోవాలనిపించదనే అభిప్రాయం వల్లో,

కృతయుగం నుంచీ ఇప్పటివరకూ ప్రజల్ని అవతారపురుషులు తప్ప  ఇంకెవరూ రక్షించలేరనే భావన స్థిరపడిపోయో,

వందో, రెండొందలో పోసి టికెట్ కొనుక్కుని సైన్మకి పోతే అక్కడ కూడా రోజూ చూసే రియాలిటీనే చూయిస్తే జనం తట్టుకోలేరనే సైన్మ-మేకర్ల జాలి వల్లో – 

(ఏ రాయైతేనేం పళ్లూడగొట్టుకోడానికీ, ఏ సుత్తయితేనేం కాసులు కురిపిస్తుంటే)

మొత్తమ్మీద తెలుగుసైన్మలు ఇలాంటి హీరోల కబంధ హస్తాలనించి బయటపడలేక పోతున్నాయి.

అందుకే సైన్మలో మొదటి రెండుగంటలూ సృజనాత్మక బోర్-డమ్ అనిపిస్తే మన తప్పులేదు.

లాస్ట్ హాఫెనవర్లో మాత్రం మల్టిప్లెక్స్ ప్రేక్షకుడి నుంచీ “C”సెంటర్ వీక్షకుడి వరకూ అందరికీ టచ్ అయ్యేలా రైతు బాధలని, వాటికి సొల్యూషన్నీ చూపించారు. ఆ సొల్యూషన్ ప్రాక్టికలా కాదా అనేది కాసేపు పక్కన పెడదాం. బట్, దాన్ని ప్రాక్టికల్ గా మార్చి రైతుని ఆదుకోవచ్చేమో అనే ఆలోచన, ఆశ, ఇప్పటికిప్పుడు పల్లెటూర్లో స్థిరపడి ఏదో..ఓ..ఓ… చేసెయ్యాలనే ఆవేశం కలక్క మానదు.

కలిగింది, కలిగి ఈ టపా రాసేవరకూ మిగిలింది;

సినిమాలో విలన్‌లాంటి  విలన్ లు నిజజీవితంలో వుండరనీ, రైతుల పాలిటి అసలు విలన్లని (ఎవరో అందరికీ తెల్సుగా) కంట్రోల్ చేసే శక్తీ, యుక్తీ, ఆసక్తీ ఎవరికీ లేవనీ గుర్తొచ్చేవరకూ రగిలింది.

తరవాత ఈ టపా  మిగిలింది.

కూడా అరగంట కోసం 51 డాలర్లు ఖర్చు పెట్టామనే తృప్తీ మిగిలింది.

ఇంతేసంగతులు. బై4నౌ.

 

9 thoughts on “ఫీల్ గుడ్🎞సైన్మ మహర్షి + కొన్ని ఫన్నీ😜హైలైట్స్

 1. Zilebi

  యాభై పైడాలర్లన
  రాభస గోల సినిమాని రాద్ధాంతములన్
  లాభంబేమియు లేకన్
  నాభీదపు రొచ్చు చూసి నా పని లేకన్ !

  Like

  Reply
 2. విన్నకోట నరసింహారావు

  సినిమాను “సైన్మా” అనడం తెలంగాణా మాండలికం. ఆ మాండలికాన్ని తను గట్టిగా పట్టేసుకోగలిగానని కోట శ్రీనివాసరావు గారి నమ్మకం. దాని వల్ల తను నటించిన సినిమాల్లో కొన్నింటిలో ఆ యాసని జొప్పించే ప్రయత్నం చేశాడు (ఒక్కోసారి అతకక పోయినా కూడా).

  ఈ చిత్రరాజం గురించి నేను చదివిన బెస్ట్ రివ్యూ ఇది. మీరు చెప్పిన “ఫన్నీ హైలైట్” లు మీ పోస్టుకే హైలైట్స్ 👌. ఇవన్నీ “వాళ్ళ” హీరోల్ని lionize చేసే తాపత్రయమేనండీ. అఫ్కోర్స్ లాభాలు అన్నది foremost లెండి – తప్పు లేదు, కానీ దాని కోసమని సినిమా కథను, విలువలను భ్రష్టు పట్టిస్తున్నారు / పట్టించేశారు. Irreversible stage కు చేరిందా అనిపిస్తుంది చాలా సార్లు. ఈ అర్థంపర్థం లేని హీరోయిజాలు, హీరోయిన్ తో antics ప్రేక్షకులను titillate చెయ్యడానికే పనికొస్తాయి. వెర్రి అభిమానుల వల్ల నడుస్తాయి.

  కంపెనల సి.యి.వో ల గురించి బాగా చెప్పారు. “జయ జానకీ నాయకా” అనే చిత్రరాజంలో ఓ కంపెనీ ఛైర్మన్ గారు, డైరెక్టర్లు వీధిరౌడీల్లాగా వీధుల్లోపడి ఫైట్లు చెయ్యడం. హీరో గారిని, వారి ఫామిలీని elevate చేస్తాయని ఆ దర్శకుడి అపోహ.

  “కమర్షియలైజ్డ్ సామాజిక స్పృహ” – హ్హ హ్హ హ్హ హ్హ భలే పేరు పెట్టారండి. ఈ హీరోలు చూపించే పరిష్కారాలు కూడా over simplified గా ఉంటాయి. ఈ పేరు వినగానే నాకు వెంటనే గుర్తొచ్చిన ఉదాహరణ – ప్రతి దానికీ awareness అంటూ ఓ 5-k Run నిర్వహించెయ్యడం, ఎక్కువగా కార్పొరేట్ ఉద్యోగాలు చేసే కుర్రకారు వెర్రివాళ్ళలాగా దాంట్లో పాల్గొనడం. ఈ సో కాల్డ్ awareness తరువాత ఏమాత్రం కార్యాచరణలోకి తర్జుమా అవుతుందో తెలియదు. ఈ పరుగు మాత్రం ఓ ఈవెంట్ లాగా తయారవుతుంది.

  “ఏదో చేసెయ్యాలనే ఆవేశం …. ఈ టపా రాసేవరకు మిగిలింది”. హ్హ హ్హ హ్హ హ్హ,

  Mindless violence చేస్తేనే హీరోయిజం అనే భ్రమలో ఇరుక్కుపోయింది భారతీయ సినిమా. ఉదాత్తమైన పనులు చేసి హీరో అనిపించుకోవడం కనిపించడం లేదు. ఇప్పుడు సినిమాలు ఇలా senseless ఫార్ములా లాగా తయారయ్యాయి గానీ ఒకప్పుడు సినిమాలో హీరో పాత్రలు సాధారణ వ్యక్తుల లాగానే ఉండేవి. మంచి పనులు చేసినట్లు ,సాటివారిని ఆదుకున్నట్లు సంస్కారవంతంగా చూపించేవారు. అధికశాతం సినిమా కథలు అలానే ఉండేవి. అక్కినేని, ఎన్టీఆర్ లు కూడా చాలామటుకు అటువంటి పాత్రలే చేసేవారు …. ఆ రోజుల్లో. మరి వారు హీరోలుగానే వెలిగారు, వారి అటువంటి సినిమాలు శతదినోత్సవాలు చేసుకోవడం కూడా తరచూ జరిగేది (తరువాత తరువాత కొంచెం వెర్రితలలు వేశాయి లెండి వారి సినిమాలు కూడా).

  51 డాలర్లు … అయ్యయ్యో జేబులో డబ్బులు పోయెనే అనిపించినట్లున్నా (చివరి అర్థగంట బాగుందనిపించడం small consolation)…. మొత్తానికి మంచి పోస్ట్ చదివించారు.

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   సర్, వీయెన్నార్ గారూ, చదివించడమే కాదు మీ చేత మాంఛి కామెంట్ రాయించిన ఘనత కూడా నేనే తీసేసుకుంటున్నాను. (JK)
   నెనరులు సార్ 🙏

   Like

   Reply
  1. YVR's అం'తరంగం' Post author

   థాంక్ యూ పవన్’జీ !! సరదాగా రాశానంతే. రివ్యూ అంత స్థాయి లేదులెండి, రివ్యూలంటే 24 శాఖల మీద అవగాహనలు, గట్రా వుండాలి; రేటింగులివ్వాలి. అదీ సినిమా రిలీజైన రోజే ఇవ్వాలి కదా. 😀

   Like

   Reply
 3. bonagiri

  ఇందులో ఒక టిక్కెట్ తో రెండు సినిమాలు చూపించారు. ఈ సినిమాకి నేను పెట్టే పేరు – ఇడియట్ శ్రీమంతుడు. మొదటి సగం 3 ఇడియట్స్, రెండో సగం శ్రీమంతుడు సినిమాల్లా ఉంది. మీరు వ్రాసినట్టు చివరి అర్థగంట బాగుంది.
  నాకు తెలిసినంతవరకు, గాస్ పైప్ లైన్ వెయ్యటానికి ఊళ్ళు ఖాళీ చెయ్యక్కర్లేదు, ఇళ్ళు పడగొట్టక్కర్లేదు. వ్యవసాయం మానుకోనక్కర్లేదు. అవన్నీ అండర్ గ్రౌండ్ లో పొలాల కింద వేస్తారు. నిర్వహణ కోసం అక్కడక్కడ కొన్ని స్టేషన్లు ఉంటాయి. ఒకోసారి ఏదైనా పైప్ లైన్ లీకైతే గాస్ బయటకి వస్తుంది. డ్రిల్లింగ్ రిగ్ వద్ద సమస్య వస్తే బ్లో అవుట్ అవుతుంది. కాని ఈ సినిమాలో అందుకు విరుద్ధంగా చూపించారు.

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   బోనగిరిగారూ, నెనర్లు. మీ టపాల్లాగే మీ వ్యాఖ్యలూ ఆలోచనాస్త్రాలే.
   //ఇడియట్ శ్రీమంతుడు//
   టైటిల్ బావుంది.
   ఇడియట్ (=చూసేవాళ్ళు) శ్రీమంతుడు(డబ్బులు దండుకున్న నిర్మాత, దర్శకుడు, యాక్టర్లూ)

   Like

   Reply
  2. సూర్య

   అది గ్యాస్ టైపు బట్టి ఉంటుంది మాస్టారూ. నలుగురు కూర్చుని కబుర్లు చెప్పుకునే చోట ఒక్కడు గ్యాస్ లీక్ చేస్తే అందరూ టేబుల్ ఖాళీ చెయ్యరూ?!!

   Like

   Reply

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s