RawWijdom: నల్లని మబ్బులు🌧🌧గుంపులు గుంపులు మిరేజ్✈జెట్టులు బారులు బారులు అవిగో.. అవిగో..


నేను చెప్పబోయేది – అంటే నా raw wijdom – అర్ధం కావాలంటే ఇవాళ పొద్దున్నే నాకైన చిన్న ఎక్స్పీరియెన్స్ ఒకటి చెప్పాలి –

పొద్దున్న నిద్ర లేవగానే బెడ్రూమ్ విండోలోంచి దట్టంగా పట్టిన వాన మబ్బులు కనిపిస్తే ఆ ఆనందమే వేరు.

నల్లని మబ్బులు గుంపులు గుంపులు

తెల్లని కొంగలు బారులు బారులు

అవిగో అవిగో …

అని మల్లీశ్వరి పాట…

అది కాకపోతే..

మబ్బులో ఏముంది…నా మనసులో ఏముంది.. నా మనసులో ఏముంది?

అని లక్షాధికారిలో పాట

గుర్తొస్తాయి. పొరపాట్న గుర్తు రాకపోయినా మూడ్ హాయిగా అయిపోయి కప్పు కాఫీ కోసం రెడీ అయిపోతుంది.

కదా !!!!!!

.

.

.

.

కాదు.

ఐ మీన్, ఇవాళ్టి నుంచీ కాదు. ఎందుకంటే ఇవాళ పొద్దున్న ఆ👇 మబ్బుల్ని –

చూడగానే మదిలో ఆ పాటలూ, కాఫీకప్పులూ కాదు, రాడార్లకి దొరక్కుండా దూసుకొస్తున్న శత్రుదేశాల ఫైటర్ జెట్ల హోరు వినబడింది. ఏంటా అని కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా నల్లటి మబ్బులు గుంపులు గుంపులు. మళ్ళీ కళ్ళు మూసుకున్నా. తిరిగి యుద్ధవిమానాలు బారులు బారులు హోరులు హోరులు. సమ్ థింగ్ రాంగ్ సమ్ వేర్. అదేంటో కొన్ని క్షణాల్లో అర్ధమైంది, ఇది News Nationకి మోడీగారిచ్చిన ఇంటర్వ్యూ ఎఫెక్ట్ అని.

మోడీసారుగారి Raw Wisdom (ఆయన మాటల్లోనే) గురించి గిట్టనివాళ్ళూ, ముఖ్యంగా కుహనా మేధావులు తెగ జోకులేసేస్తున్నారు. కానీ నా ఉద్దేశం వాళ్ళకి మోడీ మీదున్న అసూయని ఈ రకంగా బైట పెట్టుకుంటున్నారని. అసలాలోచించండి. సామాన్యుడినైన నాకే మబ్బులు చూసి ఇంత భయం పుడుతుంటే ఇమ్రాన్ ఖానూ, పాక్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా, వీళ్ళకి తోడుగా ఉగ్రవాద నాయకులు ఎంతగా బెంబేలెత్తి పోవాలీ?

నా మటుకు నాకు వాళ్ళ పరిస్థితి కళ్ళక్కడుతోంది ఇలా –

మోడీ మేష్టారు తన Raw Wisdom (తెలుగు పేపర్లు అజ్ఞానం కొద్దీ మిడిమిడి జ్ఞానం అని తర్జుమా చేశాయనుకోండీ!! వాట్నీ, ఈ దేశాన్నీ మీరూ, నేనూ బాగుచెయ్యలేం కదా!!) వాడి పాకిస్తాన్ని ఎలా హడలగొట్టి పారేశారో కుహనాలకి ఇప్పటికైనా అర్ధవైందో, లేదో! ఇదే అర్థం అవ్వకపోతే, News Nation ఇంట్రవ్యూలోనే మేష్టారు బకెట్ల కొద్దీ తోడి పోసిన raw wisdom ఎలా అర్థం అవుతుంది నా మొహం?

1988లో డిజిటల్ ఫోటో తీసి అద్వానీగారికి e-mail చేశానని చెప్పారా. అది పట్టుకుని నెటిజన్లు, సోషల్ మీడియా ఒకటే రాద్ధాంతం. ఎందుకో అర్ధం కాదు. 5000యేళ్ళ క్రితం టెస్ట్-ట్యూబ్ బేబీల్ని సృష్టించినవాళ్ళకి e-mail, digital camera ఒక లెక్కలోకి రావని ఎప్పటికర్థం చేసుకుంటారో నె(నే)టిజనులు. మనకర్థంకానివన్నీ అబద్ధాలు అనుకునే జనం ఎక్కువైపోయారు. If there is a will, there is a way అన్నారు పెద్దలు. మనసు పెట్టి ఆలోచిస్తే raw wisdom అనేటటువంటిది అర్ధం కానంత కాంప్లికేటెడ్ మేటరేం కాదు, మనం కూడా rawగా ఆలోచిస్తే…

ఉదాహరణకి ఇలా👇 అర్ధం చేసుకోవచ్చు —

అదీ this week-end’s dose of raw wijdom. Bye4Now 🖐🤓

10 thoughts on “RawWijdom: నల్లని మబ్బులు🌧🌧గుంపులు గుంపులు మిరేజ్✈జెట్టులు బారులు బారులు అవిగో.. అవిగో..”

  1. Raw wisdom అంటే పచ్చి జ్ఞానం అయ్యుంటుంది. ఇంకా పండలేదు, ఎప్పుడు *** పండుతుందో?

    Like

  2. రావిస్డంబనె మోడీ
    యే విదురునివలె గబుక్కు నేమయ్యింద
    ర్రా! వారధిగా యెనభై
    లో వార్నీ ఈమెయిలట లొల్లియిదే పో 🙂

    Like

  3. మోడీ పై నేదేదో
    “మూడి మరైచ్చి” మనుజుడ సమూహంబు‌న బ్లా
    గ్జాడింపుల చేయుదురా
    వేడిగ గనుడీ జిలేబి వేసితి మీకై 🙂

    Like

    1. జిలేబీగారు, పదగుంఫనం ఎక్కువైపోయింది. తోడుగా అరవపదాలొకటి. అర్ధం చేసుకోడానికి నా రా – విజ్-డమ్ సరిపోట్లేదు 😂

      Like

  4. ఔరౌరా “జెలతారుని”
    రోరింగుల్జెట్లు వరుస రువ్వాడగ మా
    స్టారా మోడీ తలపున
    తారాడెనొకో తెలుపుడు తంబీ వైవీ 🙂

    Like

  5. పదగుంఫనమెక్కువయెన్
    మదిలో నెక్కంగలేదు మరి కించిత్తై
    న దరసలర్థంబేమో
    సదనంబున తెలుపుమమ్మ ఛంద జిలేబీ 🙂

    Like

  6. మబ్బులు కనిపిస్తే గుర్తొచ్చే ఇంకో మంచి పాట…”ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు…దేశదేశాలన్ని తిరిగి చూసేవూ!” (from Malliswari)

    Like

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s