Without Her, fatHER (=man) is just fat


ఇవాళ మదర్స్ డే కి స్నేహితులం పంచుకున్న మెసేజెస్‌లో ఒక జోక్ మెరిసింది. అది ఇలా సాగింది –
Today is mothers day and rest of the days in the year are father’s days
దీనికి వచ్చిన సరదా రెస్పాన్స్ –
Without her, father is just fat 😆
కరెక్టే కదా, FATHERలో Her వుంది. MOTHERలోనూ Her యే వుంది.
ఆమె లేకుండా (ఆమెని తల్లిగా గౌరవించని అని చదువుకోండి, ప్లీజ్ 🙂 ) ఫాదర్లో ఫాట్ కాక ఇంకేమున్నట్టు?

And, now, on a more serious note —

ఓ “మహాప్రస్థానం” రాసే క్రమంలో ఒక కవీ,
తన భావానికి కాన్వాస్‌పై రూపమిస్తూ ఆర్టిస్టు
ఒక మహాసౌందర్యాన్ని రాతిబండ నుంచి వెలికి తీస్తున్న స్కల్ప్టరూ
ఓ సృష్టిరహస్యాన్ని ఆవిష్కరించబోతున్న సైంటిస్టు
సంఘంలో మంచి మార్పుకోసం ప్రయాస పడుతున్న మానవతావాది
వెండితెర దృశ్యాల్ని కావ్యంగా మలిచే పనిలో ఒక దర్శకుడూ
ప్రపంచానికి సత్యదర్శనం చేయించే బృహత్కార్యంలో తత్వవేత్తా
భవిష్యత్తుకి పునాదులు వేసుకునే దీక్షలో స్టూడెంటూ
తమ ప్రేమకి అమ్మానాన్నల ఆమోదముద్రకై ఆశపడే యువజంటా
చెమటోడ్చే బ్రతుకు నిలుపుకోవాలనే దీక్షలో ఉన్న శ్రామికజీవి
అజ్ఞానపు చీకట్లు తొలగించడమే ధ్యేయమైన టీచరూ
మూఢత్వాన్ని రూపుమాపే యజ్ఞంలో హేతువాదీ

వీళ్ళందరికీ కామన్‌గా వున్న గుణం ఏదీ?
తల్లిదనం.

కాదా?

వాళ్ళందరూ తామనుకున్నది ఆవిష్కరించడంలో, సాధించడంలో పడిన శ్రమకి ఔన్నత్యం కల్పించేందుకు వాడుకునే ఉపమానాల్లో ప్రసవవేదన కంటే గొప్పదైన పదం వుందా?
తెలిసికానీ, తెలీక కానీ ప్రతి వ్యక్తీ తన లక్ష్య సాధనలో తనకి జన్మనిచ్చిన తల్లి పొందిన ప్రసవవేదన పడుతూనే వుంటుంది / వుంటాడు కదా !!
అలాంటప్పుడు అమ్మని గుర్తు చేసుకోవడానికి ఒక డే ఎందుకు?
లక్ష్యం గుర్తున్న ప్రతి మనిషికీ అమ్మ గుర్తుండాలి. అమ్మని ప్రేమించే ప్రతి వ్యక్తికీ మంచి లక్ష్యం వుండాలి.
రెండిట్లో ఏ ఒక్కటి మర్చిపోయినా ఆ మనిషి ఉండీ లేనట్టే.
దేవుడే లేడనే మనిషున్నాడూ, అమ్మే లేదనువాడూ అసలే లేడూ అన్నారు కాదా ఒక కవి.
అసలే లేడూ అనే పరిస్థితి రాకుండా వుంచేందుకే మదర్స్ డే అనేది వుండాలి. ప్రతి కృషిలోనూ, దీక్షలోనూ, సాధనలోనూ, శ్రమలోనూ, పీల్చే ప్రతి శ్వాసలోనూ, వేసే ప్రతి అడుగులోనూ మాతృత్వ భావన, అమ్మ ప్రసవవేదన మరో రూపంలో నిండిపోయి వుందనే భావన కలిగించే విద్యావ్యవస్థ రావాలి.
గుడి కట్టి రామరాజ్యం తీసుకు రావడం కాదు, ముందు రాముళ్ళనీ, సీతమ్మలనీ తీసుకొస్తే రామాలయాలూ, రామరాజ్యాలూ అవే వస్తాయి. రావంటారా?

ఈ మాటలు, పెద్దలెందరో ఇంతకు ముందు ఎన్నో సార్లు, ఎన్నో చోట్ల చెప్పినవే అయినా ఈ రోజు ఎందుకో అసంకల్పితంగా నా మదిలో మెదిలాయి. ఎవరైనా చెప్పినప్పుడు వచ్చే ఫీల్ ఒక రకం, ఎవరంతట వాళ్ళు ఫీలైనప్పుడు వచ్చే ఫీల్ ఇంకో రకం. అందుకే పంచుకోవాలనిపించింది.

సృష్టి మొదలైనప్పటి నుంచీ ఈ రోజు దాక, ఈ క్షణంలో నేల మీద కళ్ళు తెరిచిన పసిబిడ్డ నుంచీ ఏ మహామేధస్సులోనో రూపుదిద్దుకున్న కొత్త ఆవిష్కారం దాకా – మూలం, ఆధారం తల్లి లేదా తల్లి ప్రేమ లేదా తల్లి తనలోని ప్రేమనీ, త్యాగాన్నీ ప్రపంచానికి నిరూపించి చూపించే ప్రసవ వేదన.

ఆమె సంకల్పం లేక లేదు ఏ జీవికి జన్మ
ఆమె స్ఫూర్తి నిలపడమే ఇలలో సత్కర్మ
ఆమె చేయిపట్టి దిద్దిస్తే వ్రాస్తాడా బ్రహ్మ
సృష్టిని నడిపించే మహాశక్తి అమ్మ

🌹🌹🌹🌹🌹

11 thoughts on “Without Her, fatHER (=man) is just fat”

 1. గర్భస్థ శిశువు తా కాళ్ళతో తన్నంగ

  నొప్పిని ప్రియముగా నోర్చుకొనును

  అలికిడి కులికి తా నమ్మ పొత్తిళ్లలో

  నొదుగంగ గుండెల కదుము కొనును

  ఆకటి కేడ్చుచు అమ్మపై కెగబ్రాక

  మురిపాన చన్నిచ్చి పరవశించు

  బుడి బుడి యడుగుల పడిలేచి నడయాడ

  బుడుతకు కేలిచ్చి నడత నేర్పు

  అలుపెరుంగక రాత్రింబవలు భరించి

  బిడ్డలే లోకముగ బ్రతుకు ” ఆయమ్మ ” _

  బిడ్డపై అమ్మ కెంతటి ప్రేమ గలదొ ,

  బిడ్డలకు గూడ అమ్మపై ప్రేమ వలద ?

  Like

  1. మాస్టారూ,
   జ్ఞాపకాలు, ఆలోచనలతో బుడిబుడి అడుగులేసిన పద్యాన్ని
   జవాబు దొరకని ప్రశ్న కూడా ఒక పాదమై నడిపింది.
   🙏🙏🙏

   Like

  1. థాంక్ యూ, పవన్! మీ కామెంట్ సడన్ గా చూసి మేష్టారికి పోస్ట్ మేష్టార్ ప్రమోషన్ ఇచ్చేశారనుకున్నా, తరవాత అర్థమైందిలెండి.
   ☺☺☺

   Like

   1. “మేష్టారికి పోస్ట్ మేష్టార్ ప్రమోషన్” కాదు YVR గారూ (అలా అయితే అసలా మేష్టార్ ఎవరు అన్న ప్రశ్న వస్తుంది కదా?). మీరే “పోస్ట్ మేష్టార్” అనిపిస్తుంది అదాటున చదివితే 😀. పంక్చుయేషనండీ, పంక్చుయేషన్ మహిమ.

    Like

    1. అవును సార్, వీఎన్నార్ గారు పంక్చుయేషన్ మహిమే. పంక్చుయేషనూ, పోస్టల్ డిపార్ట్మెంట్లని కాస్సేపు పక్కన పెడితే పోస్టులు రాసే వాళ్లంతా పోస్ట్-మాస్టర్లే. మీకైతే పోస్ట్-మే-స్టార్ అనే honarary post కూడా ఇచ్ఛేసారు పోస్ట్-మేస్టర్లు. 😊

     Like

     1. // “పోస్టులు రాసే వాళ్లంతా పోస్ట్-మాస్టర్లే“ //

      లవ్లీ డెఫినిషన్ 😀😀 👌.
      ఇక నాకేదో పోస్ట్ ఇచ్చారంటున్నారు, థాంక్యూ థాంక్యూ. కాకపోతే అదెవరో గిట్టనివారి పని అని నాకు గట్టి అనుమానం, YVR గారూ 🙁.

      Like

      1. వీయెన్నార్ గారు, మీరు బ్లాగు(పోస్టు)ల్లో స్టార్ కామెంటేటర్ కదా, దాన్నే పోస్ట్(స్)-మే -స్టార్ అన్నాను. 😊

       Like

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s