🌿వన🌳🌱విహారం🌊 – సుంగైబులో అడవిలో “అలోలములాలోచనలేవేవో నాలోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ, కోరాడగ…”


మొన్నా మధ్య సుంగైబులో మడఅడవిలో కనిపించిందీ దృశ్యం.

సముద్రంలో పోటు వచ్చినప్పుడు నీళ్ళు అడవిలోకి ప్రవహించి పల్లపు ప్రదేశం అంతా నిండిపోతుంది. పోటు తగ్గగానే నీరంతా సముద్రంలోకి జారిపోతుంది. పోటులో అడవిలోకి కొట్టుకొచ్చి, పాటుతో పాటుగా తిరిగి కడలికి చేరలేక బురదనేలపై చిక్కుకుపోయిన జలజీవాల మీద ఆధారపడి వలస నీటిపక్షులు, మొసళ్ళు, ఆటర్స్, … జీవనయానం సాగిస్తుంటాయి.

జలప్రవాహపు ప్రకంపనలే ఇరుసుగా తిరిగే జీవనచక్రం ఈ మడ అడవి.

ఒక ఉదయం పోటు వచ్చిన సమయంలో వనదేవతల సాంగత్యం కోరి సుళ్ళు తిరుగుతూ వస్తున్న సాగరుడు

నా కళ్ళను ఆకర్షించాడు,

కాళ్ళను నిలువరించాడు.

ఆ సుడులలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ దినకరుడేమనుకుంటున్నాడోననే స్ఫురణ నా మానస సరోవరంలో అలలు రేపగా —

అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడి, కోరాడసాగాయి.

కాలప్రవాహంలో అలలా తేలివచ్చే ప్రతి ఉదయం,

సాయం‘కాలగర్భం’లో కలిసిపోయే ఒక కల అనుకుంటున్నాడా ప్రభాతభానుడు?

కావచ్చు.

ఆయన మనసులో ఏమున్నా, నేల మీద, కాలప్రవాహపు ప్రకంపనలే ఇరుసుగా తిరిగే జీవనచక్రం నాకు చెబుతున్నది ఆ సత్యాన్నే. అంతరంగ తరంగాల్లో ప్రతిఫలిస్తున్న ఏ అంతఃస్సూర్యుడో లోపలి చీకట్లని ఛేదించి చూపిస్తున్నది ఆ అనాది జీవనవేదాన్నే 👇

లోకాస్సమస్తాస్సుఖినోభవంతు.

12 thoughts on “🌿వన🌳🌱విహారం🌊 – సుంగైబులో అడవిలో “అలోలములాలోచనలేవేవో నాలోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ, కోరాడగ…””

 1. సుంగైబులో …. మీ దేశంలోనే ఉందా? నాకన్నీ తెలుసని నేననుకోవడంలేదు గానీ ఆ పదం చైనీస్ కన్నా మలయా లాగా ధ్వనిస్తోంది.
  మీ దగ్గర సముద్రం అంటే సౌత్ చైనా సీ యే కదా? సమర్సెట్ మామ్ గారి ఫేవరైట్.
  విడియోలో వినిపించే ‘వీల’ మీదేనా 👌?
  మీ జీవనవేదం బాగుందండీ👏. మనలో మాట 🤫…. మీకు అప్పుడప్పుడు వేదాంతపు / వైరాగ్యపు ఆలోచనలు వస్తుంటాయని మీ ఇంట్లోవారికి తెలుసా 😉?

  Like

  1. వీఎన్నార్ గారు, సుంగైబులో మలాయ్ పేరేనండి. అర్ధం Bamboo river(ట), మీరు అడిగాకే గూగిలించాను. ఇక్కడ మలాయ్ వాడకం ఎక్కువే.
   సౌత్ చైనా సీలో భాగమైన Strait of Malacca & Strait of Singapore లే ఇక్కడ సముద్రం. సోమర్సెట్ మామ్(తెలుగులో మాఘం)కి ఇష్టమా? అందుకేనేమో ఇక్కడో స్టేషన్ పేరు సోమర్సెట్ అని పెట్టారు.
   “వీల” కాపీరైట్స్ నావే సర్ 😊.
   //వేదాంతపు / వైరాగ్యపు ఆలోచనలు వస్తుంటాయని..// ఆలోచనల వరకే అని వాళ్లకి తెలిసిపోయింది 🤣

   Like

   1. మీ ఊరిలోని Raffles Hotel కూడా మామ్ కు ఇష్టమైనదే(ట).
    మాఘం😀😀 . డిగ్రీలో poetry లో మాకు Henry Vaughan గారి poems కొన్ని ఉండేవి. మొదటిరోజు క్లాస్ లోనే లెక్చరర్ భాస్కరరావు‌ గారు (మీకు గుర్తున్నారా?) క్లాస్ వైపు వేలు చూపించి మరీ చెప్పారు (ఇంగ్లిష్ లో) …. వాఘన్ కాదు, వాహన్ కూడా కాదు, వాన్ అని పలకాలి …. అని 😀. గుర్తుండిపోయింది 🌝.

    Like

    1. మామ్ కి మన దేశంలో మాఘమాసం, సోమవారం ఇష్టం అయ్యుంటాయి 🙂.
     //Henry Vaughan// హ!హ! భాస్కరరావుగారు ఎంత విసిగిపోయి వుంటారో అర్థం అవుతోంది. కొందరు Psychologyని పలకడం విన్నపుడు మరీ బాగా అర్థమౌతుంది🤗.
     //భాస్కరరావుగారు// మాది 1983 బాచ్ సర్. మాకు సురేశన్, రాజేశ్వర్రావు, “కీట్స్”రెడ్డి, గోపయ్యగార్లు ఇంగ్లీషు చెప్పారు. భాస్కరరావుగారిని ఎరగను.

     Like

   2. “అందుకేనేమో ఇక్కడో స్టేషన్ పేరు సోమర్సెట్ అని పెట్టారు”

    వలస సామ్రాజ్యవాదులు తాము “కనుగొన్న” ప్రాంతాలకు తమ “పుట్టింటి పేరు” పెట్టుకోవడం (with or without “New” prefix) ఒక రకమయిన ఆనవాయితీ. ఉ. ఉత్తర ఇంగ్లాండ్ యార్క్ నగరం పేరు అమెరికాలో ఒక చిన్న కుగ్రామానికి (ఇప్పటి న్యూయార్క్) పెట్టారు, స్కాట్లాండ్ పెర్త్ పేరు ఆస్ట్రేలియాలో స్థాపించిన ఊరికి పెట్టారు.

    సోమర్సెట్ అన్నది ఇంగ్లాండులో ఒక కౌంటీ పేరు. ఇదే పేరుతో అనేక దేశాలలో డజన్ల కొద్దీ ఊళ్లు ఉన్నాయి. I suspect Somerset Singapore was similarly named by some colonialist after his own home town.

    Like

    1. Colonial pastని గుర్తు చేసేవి చాలానే వున్నాయి జై గారు. కామన్వెల్త్ కంట్రీ కదా ఆ లెగసీ కంటిన్యూ చేశారు స్వతంత్రం వచ్చాక. ఐతే ఏ మాటకామాటే చెప్పుకోవాలి. సోమర్సెట్ పక్క స్టేషను, posh Central business districtకి దోబీఘాట్ అని పెట్టారు 🤗.

     Like

     1. ధోబీఘాట్ 🙂🙂.
      బహుశః బట్టలను అక్కడ ఉతికేవారేమో? అందుకని ఆ ప్రాంతాన్ని ఆ పేరుతో పిలిచేవారేమో (చెన్నైలో సెంట్రల్ స్టేషన్ వెనకనున్న “Washermenpet” ప్రాంతం లాగా. కానీ చెన్నైలో స్టేషన్ కు ఆ పేరు పెట్టలేదు లెండి). స్టేషన్ కట్టిన తరువాత తేలికని ఆ పేరే స్టేషన్ కు కూడా పెట్టేసుంటారు 🙂.

      Like

      1. ధోబీ ఘాటంటా ! నర
       రే బూగిస్సంట! బాపురె జిలేబీ! సుం
       గైబులొ! కామన్వెల్తు! జ
       గా! బై ఒన్ గెట్ టు ఫ్రీ! నగరమదె వినరా!

       Like

 2. హా తెలిసెన్ …..
  షాపింగ్ ఏరియా అనే బదులు “బూగిసు” అన్నారుగా, అంటే మీరు సింగపూర్ నివాసేనని … తెలిసెన్. అంతవరకు రూఢి అయ్యింది Anonymous “జిలేబి” గారూ 😎.

  http://www.singapore-guide.com/singapore-shopping/bugis-street-maket.htm

  Like

 3. ఈ పోస్ట్ కు సంబంధం లేదు గానీ అందరూ ఆస్వాదిస్తారని ఈ క్రింద ఓ విడియో లింక్ ఇస్తున్నాను.
  ————————
  సంతూర్ సబ్బు వ్యాపారప్రకటన మనందరికీ బాగా పరిచయమేగా ….. తనే సుమారు స్కూల్ (పోనీ కాలేజ్) స్టూడెంట్ లాగా ఉన్న అమ్మాయి దగ్గరకు మమ్మీ అంటూ చిన్నపిల్ల పరిగెత్తుకుని రావడం, మమ్మీనా అంటూ చూసేవాళ్ళంతా ఆశ్చర్య పోవడం 🙂 (స్కూల్ స్టూడెంట్స్ వయసు వారి మధ్య ప్రేమ అని చూపించే ట్రెండ్ మొదలెట్టిన తెలుగు సినిమాలు గుర్తొస్తాయి). ఆ మమ్మీ ad మీద డాడీ అంటూ పేరడీ చేస్తూ వచ్చిన ఈ విడియో చూడండి👇. వాట్సప్ లో తిరుగుతోంది. నాకు బాగా నచ్చింది 👌. Well, why not a “daddy” ad too 😀😀?

  Daddy parody on Santoor soap ad (courtesy : WhatsApp / Youtube) 👇

  ————————-

  A regular “mummy” ad of Santoor soap (courtesy : Youtube) 👇

  Like

 4. సంతూర్ సబ్బు ad గురించి పైన నా వ్యాఖ్యలో నేను ఆ విడియోల లింకులు మాత్రమే టైప్ చేశాను. కానీ వ్యాఖ్య ప్రచురించేటప్పటికి లింకుల బదులు సదరు విడియోలే భూతాల్లా ప్రత్యక్షమయ్యాయేమిటి? వర్డ్-ప్రెస్ మహిమా?

  ******https://m.youtube.com/watch?v=O_XmtlvJybE******
  సంతూర్ సబ్బు “మమ్మీ” ప్రకటన మీద “డాడీ” అంటూ పేరడీ 😀 (courtesy : WhatsApp / Youtube)
  ———————-

  ******https://m.youtube.com/watch?v=hQPzCfqReGM******
  A regular “mommy” ad of Santoor soap (courtesy : Youtube)

  Like

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s