మామిడిముక్క, మిరపమొక్క, ఆవగింజ, పప్పునూనె, ఉప్పురాయి కాదేదీ కవితకనర్హం
పాతబడిన ఆవకాయ అస్సలు బావుండదు, చల్లారిన ఆవేశం ఎందుకూ పనికిరాదు.
అందుకే మొన్నటి ఆవకాయ పోస్టు రగిలించిన ఆవేశాలు చల్లారిపోకుండా దానికి సీక్వెల్ ఇప్పుడే పెట్టేస్తున్నా. ఎందుకోగానీ ఈ యేడు ఆవకాయావేశానికి శ్రీశ్రీ భావావేశం తోడయ్యింది. మనకి ఆవకాయ ఎంతిష్టమైతే మాత్రం? ప్రపంచం బాధని తన బాధ చేసుకున్న మహాకవి భావాలకి కనీసం లిప్-సర్వీస్ చెయ్యకుండా ఆయన కవితలకి పేరడీలు రాయడం ఏఁవన్నా బావుంటుందా? చాలా బాగోదు. అందుకే చల్లారిపోయిన మనిషి ఆవేశాలపై కాస్త ఆక్రోశం, మధ్య మధ్య ఆవకాయ నంజుకుంటూ –
మనం, ఇండియన్లం – అందులోనూ ఆంధ్రేండియన్లం – ఆవకాయని తీసుకున్నంత సీరియస్‌గా కొన్ని ఆవేశాల్ని తీసుకోం.
ఆవకాయని ఉంచుకున్నంత ఫ్రెష్‌గా అవసరమైన ఆవేశాల్ని వుంచుకోం.
👇నంజుకోడానికి నవావకాయ👇
కాయని ముక్కలు చేసే కత్తీ
ఆరారగ గ్లాసెడు కాఫీ
మధ్యమధ్య మరదళ్ళతొ సరసం**
కావాలోయ్ నవావకాయకి
** శ్రీశ్రీగారిది భావావేశం, కొత్తల్లుళ్ళది బావావేశం
రైట్స్ కోసం మాట్లాడతాం,
రెస్పాన్సిబిలిటీస్ గురించి పోట్లాడలేం.
ఏదో ఒక పార్టీ వెనకో, లీడర్ పక్కనో కళ్ళు మూసుకుని పోలరైజ్ అవుతాం,
పార్టీల్తో పని లేకుండా సమస్యలపై యునైట్ అవడంలో నిద్రపోతాం.
వెధవ వెస్టర్న్ కల్చరని అరుస్తాం,
దానికి సందిచ్చిన సోషల్ లూప్‌హోల్స్ మనలో ఏఁవున్నాయని సిన్సియర్ డిబేట్ పెట్టం.
👇నాలుక మీదకి నవావకాయ👇
జీడిరసం తుడిచేందుకు బట్టా
గుంటురుకారం దంచే రోకలి
ఆవురావురనిపించే ఆకలి
కావాలోయ్ నవావకాయకి
రాజకీయాలు తగలడిపోయాయని తల్లడిల్లిపోతాం,
అవెందుకిలా తగలడ్డాయో చెప్పి, బాగుచేస్తానన్నవాడికి ఛస్తే వోట్లెయ్యం.
ఇంకాపైగా, కొందరు వోట్లకి డబ్బులిస్తే తీసుకుంటాం, ఛా, పొమ్మనం.
విభజించి పాలిస్తున్నారని ఓవరాక్షన్ చేస్తాం,
లైట్లార్పి, తలుపులేసి విభజిస్తుంటే ఏ యాక్షన్ తీసుకోం.
టీవీలూ, సినిమాలూ చెత్త చూపిస్తున్నాయని వాపోతాం,
చెత్త టీవీల్ని, సినిమాల్ని ఒక్కరోజైనా బాయ్-కాట్ చేసి ఆపెయ్యం. 👇కొసరుగ కాస్త కొత్తావకాయ👇
పిండి కలిపే పేద్ద బేసిను
కలగలిపే గాజుల చేతులు
ఊరెయ్యగ పింగాణీ జాడీ
కావాలోయ్ నవావకాయకి
ఇదండీ ఈనాటి* ఆవకాయావేశం. నవావకాయకి ఇన్స్పిరేషన్ ఇచ్చిన శ్రీశ్రీ నవకవితని కూడా పోస్ట్ చెయ్యాలనిపించి దాన్నొకసారి మళ్ళీ చదువుకున్నా. చదువుతుంటే ఎప్పుడో ఏళ్ళ కిందట విన్న ఘంటసాల నోట పలికిన దాశరధి పాట గుర్తొచ్చింది. ఆ పాత ఆవేశాలు** (= పాట రూపంలో వున్న ఆవకాయలు) రెండూ ఇక్కడ వుంచుతున్నా ఆవకాయ తిన్నప్పుడల్లా గుర్తు రావాలని. ఘంటసాల “ఆవేశం రావాలీ..” అనేప్పుడు ఆ ని ఒకరకంగా నొక్కి పలుకుతారు. ఆ నొక్కు నాకు చాలా ఇష్టం.
(*ఈనాడు మాట చూసి ప్రియా పచ్చళ్ళు గుర్తొస్తే అందుకు నా పూచీ ఏంలేదు, సరేనా? ** పాత ఆవేశం అంటుంటే ఇక్కడ “ఆవకాయలో వెల్లుల్లి” అనే బ్లాగ్లోకంలో వైరల్ అవుతున్న సబ్జెక్టు కొంచెం డిస్కస్ చెయ్యాలనిపించింది. వీఎన్నార్ సర్ గోంగూర మీద టపా రాయమన్నారు. ఆ టపాలో డిస్కస్ చేస్తా. )

బై ద వే, కొత్తల్లుళ్ళు ముక్కలు కొడుతుంటే , అమ్మమ్మలు ఆవకాయ పిండి కలుపుతుంటే చూసిన దృశ్యకావ్యాలు మనసులో ఉండిపోయి ఈ “ఖండకావ్యం” తయారైంది, అంతేకాని ఒక్కసారైనా ఆవకాయ పెట్టిన పాపాన పోయికాదు. అంచేత టెక్నాలజీలో పొరపాట్లుంటే ఆవకాయలో కరగకుండా ఉండిపోయిన ఉప్పురాళ్ళనుకుని ఆస్వాదించెయ్యండి. బై4నౌ ✋🏼🤓.
వీఎన్నార్ సార్ వ్యాఖ్యతో (నవావకాయకి inputs ఆయన ఇచ్చినవే) వచ్చిన ఐడియాలోంచి పుట్టిన ఈ ఆవకాయ సీక్వెల్ కబుర్లు ఈసారికి సమాప్తం. ThankYou, VNR Sir _/\_ , మీ కోరిక మీద వెల్లుల్లి తగలకుండా చేసిన ఈవకాయ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా.
ఇదె ఆవకాయ రెండో
దిదె జాడీ నరసరాయ తిందాం రండీ
కుదిరెను శ్రీశ్రీ దాశర
థి దాని కారమ్ము పెంచి ధీంధీం యనగా 🙂
LikeLike
“జిలేబి” గారూ, మిత్రుడు YVR మా వెల్లుల్లి – వైరి గాంగ్ యెడల ప్రత్యేక అభిమానంతో వెల్లుల్లి లేకుండా తయారుచేయించిన ఆవకాయ జాడీడూ … వెల్లుల్లి తినని వారిదే ☝️.
LikeLike
YVR గారూ, ఆవకాయ కోసం ముక్కలు కొత్తల్లుళ్ళ చేత కొట్టిస్తారా 😳 ? మీరు మరీ నిరంకుశుల్లా ఉన్నారే 😡.
LikeLike
VNR sir, అల్లుడు అనేమాట అనుకోడానికైనా ఇంకో పదేళ్ళు పడుతుంది. అప్పటికి ఆవకాయ ఇష్టపడే అల్లుడు దొరికితే, అతనికి ముక్కలు కొట్టే ఇంట్రెస్టుంటే అప్పుడు ఆలోచించాలి. still a long way to go. 🙂🙂
LikeLike
YVR గారూ, మీరంత అభిమానంతో తయారు చేయించిన నవావకాయ నచ్చకపోయే ప్రశ్నే లేదు. థాంక్స్ 🙏.
ఈ “వైరల్” సబ్జెక్టు గురించి మాట్లాడడానికి ఒక పోలిక తీసుకొస్తాను … మీరు కాఫీప్రియులు కదా, పంచదార కలుపుకోకుండా కాఫీ తాగారా ఎప్పుడైనా? అప్పుడే కాఫీ యొక్క అసలైన రుచి ఆస్వాదించగలుగుతాం కదా. అవ్వింధబునే వెల్లుల్లి వగైరాలు కలపకుండా చేసిన ఆవకాయ యొక్క అసలు సిసలు ఘాటు, రుచి. అందుకు … అందుకు … ఆవకాయలో వెల్లుల్లికి నేను ఎగస్పార్టీని (నేను వెల్లుల్లసలే తినను అన్నది వేరే సంగతి 🙂).
నా మాట మన్నించినందుకు మరోసారి థాంక్స్.
LikeLike
మూడ్ ని బట్టి Black Coffee, sugarIess coffee with milk, మామూలు కాఫీ – ఈ మూడో ఇష్టమేనండి, అదీ ఫిల్టర్ కాఫీ అయితేనే. మీకు వెల్లుల్లి ఎలాగో నాకు ఇన్స్టెంట్ కాఫీ అలాగ. 🙂
LikeLike
మీ aavakkaya ఆవేశం బాగుంది మేష్టారు
LikeLike
థాంక్యూ పవన్ 😊
LikeLike
కొత్తావకాయ, ముద్దపప్పు, వెన్న కనిపిస్తే చాలు మాకు ఆకలి పుట్టుకు వచ్చేస్తుంది. ……….. మహా
LikeLike
మాకైతే తలచుకుంటే చాలండి … 😊
LikeLike
హ్హ హ్హ హ్హ, అదృష్టవంతులు 😀😀😀
LikeLike
YVR గారు, ఈ ఆవకాయ విప్లవంలో ఇద్దరు కవులు క్రొత్తగా బ్లాగ్లోకానికి పరిచయం అయ్యారు. ఇది సంతోషకరమైన విషయం. జిలేబిగారు, రాజారావు గారు ఇతోధికంగా ప్రోత్సహిస్తున్నారు.
VNR గారు, వెల్లుల్లి అసలు గిట్టదు అంటే సరే కానీ ఆవకాయలో ఊరిన/నానిన వెల్లుల్లి నాకైతే అవకాయలానే ఉంటుంది. అది తినకపోవడం ఆహారపరంగా ఒక అదృష్టం చేజారిపోవటమే. గోంగూరలో వెల్లుల్లి నాకంత పరిచయం లేని విషయం.
LikeLike
కొంతమంది అదృష్టవంతులు “అన్యగామి” గారూ.
ధన్వంతరి యౌషధము తేగా
భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్
వెల్లుల్లి మొక్కై జన్మించెను
వెల్లుల్లి తిననివారు తమ నష్టమును తెలియగలేరు
(గురజాడ వారికి క్షమాపణలతో 🙏)(ఛందస్సు సంగతి మనకు తెలియదు 🙁)
LikeLike
మొగి ధన్వంతరి యోషధి
భుగభుగమని పొంగి చుక్క భూమిం బడగా
దిగ దిగ వెల్లుల్లి మొలిచె
జగతిన్ తిన నిష్టపడని జనులకు నష్టమ్ .
LikeLike
మాస్టారు, నాకు పద్యవిద్య తెలియకపోయినా, మీ పద్యాల్లో వుండే ఏదో గమ్మత్తు, లయ, రిధంలని నిఝ్ఝంగా ఆస్వాదిస్తున్నాను.
LikeLike
థన్యవాదాలు రాజారావు మాస్టారూ. మీరు సరిదిద్దిన పద్యం మనోహరంగా ఉంది. శంఖంలో పోస్తేనే తీర్థం 🙏.
LikeLike
సర్, రోజురోజుకీ మీ పద్యాలు ఆవకాయలో ఊరిన వెల్లుల్లిలా రసవంతంగా తయారౌతున్నాయి👌👌👌 😊
LikeLike
తెలుగు మాస్టారు వ్రాసిన పద్యాలు బాగుండకేం చేస్తాయి YVR గారూ ☝️.
LikeLike
సర్! నేనన్నది మీ పద్యం గురించి 🙂😀
LikeLike
ఓ, అలాగా? వెల్లుల్లి వడ్డిస్తేనూ … నాకోసం కాదేమోననుకున్నాను 🙄 . ఏమైనా, అనుకరణ పద్యాలేగా 🙂. Anyway (ఆధునిక పరిభాషలో Anyway”s” అనాలేమో😬?) థాంక్యూ థాంక్యూ YVR గారూ 🙏.
LikeLike
🙏🙏🙏
LikeLike
అన్యగామిగారు, ఆవకాయని, కొత్త “విప్లవ కవు”ల్ని ఆదరించి ప్రోత్సహించిన మీకు అనేక నెనరులు. ఈ “కవిత్వా”నికి పద్యం స్టాంపు వేసే బాధ్యత మాస్టారు, జిలేబిగార్లు “స్వఛ్ఛందో”బద్ధంగా తీసుకున్నారు😊
LikeLike
“స్వచ్ఛందో”బద్ధం …. ఆహా, ఏమి “పన్నా”రండి YVR గారూ 👌.
LikeLike
మాదండీ స్వచ్ఛందో
సాదా దోసండి! రాజ సారుది ఛందో
పాదాన్వితమైన మసా
లా దోసై కాంతిమయపు లావణ్యమయా!
LikeLike
దోశెను దోసయనుట బాసా దోసమేమో కదా!
“దోసమటంచెరింగియును దుందుడుకొప్పగ” దోసలు వేసితిరా, ఏమి? 🙂
LikeLike
దోసమటం చెఱింగియును ‘ దోసె ‘లు వేసె జిలేబివర్యు లా
దోసము తన్ది గాదనుచు దుందుడు కొప్పగ వైవియారుకో ,
భాసిలు విన్నకోట బుధ వర్యులకో , తగ నాకొ , తెల్వి రా
జేసెద రంటగట్ట , విరచింతురు కందపు మేడ గట్టిగా .
LikeLike
ఐతే, మాస్టారి వోటు దోశెకే, దోస దోసమేననమాట.
LikeLike
దోశె అనాలి కదా దో
సేసారేమిటి జిలేబి ? సెప్పండమ్మా !
దోశెయెదోసయ! పైగ
స్తీ సారూ! ఆంధ్రభారతిని చూడండీ 🙂
LikeLike
//దోశెయెదోసయ! //
ok, అర్ధమైందండీ. దోశె – ప్రకృతి, దోస – వికృతి అనమాట.
LikeLike
దోసె యన్నా, దోశ యన్నా … మజా మజా టిఫినూ ఒకటేనన్నా … అనుకుంటే పోలా ఎన్.టి.ఆర్. పాటను గుర్తు చేసుకుని 🙂.
“ష” పలకడం ఫాషనో, రోగమో(?) అయిపోయిన ఈ కాలంలో “దోష” / “దోషె” అని పిలుచుకుంటే మరీ ఉత్తమం …. చాలా చోట్ల మెనులో కూడా అలాగే వ్రాస్తున్నారుగా 😡.
అసలు ఆ మాటకొస్తే తెలుగు పేర్లుండగా ఈ అరవ పేర్లు మనకెందుకండీ? మా కాలంలో తెలుగులో చక్కగా “అట్టు” అనే వాళ్ళం …. మినపట్టు, రవ్వట్టు, పెసరట్టు (ఇది పెసరదోసె అవలేదెందుకనో? 🤔). హోటళ్ళలో మెనూబోర్డు మీద “అట్టు” అనే వ్రాసుండేది; ఏమున్నాయి అని అడిగితే ‘సర్వారావు’ కూడా తను గడగడా చదివే జాబితాలో “అట్టు” అనే అనేవాడు …. at least మెజారిటీ కోస్తా ఊళ్ళల్లో. మరి అరవదేశ సరిహద్దు జిల్లాలయిన నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఏమన్నా “దోసె” అని ఆ కాలంలోనే అనేవారేమో … నాకు తెలియదు. క్రమేణా కోస్తాలో కూడా ఆ పేరు మాయమైపోయి “దోసె” వచ్చింది, వచ్చి స్థిరపడిపోయింది. ఇప్పుడు “అట్టు / మినపట్టు” అంటే ఈ తరం వారికి అసలర్థమవదేమో?
హోటల్ కు వెళ్ళి కూర్చున్న తరవాత అట్లు తిందామా అని అడిగిన స్నేహితుడితో “అట్లే కానియ్యి” అన్న శ్రీశ్రీ గారి అద్భుతమైన శ్లేషప్రయోగాల వంటి చమత్కారాలకు ఇక ఆస్కారం లేకుండా పోయింది … దోసె ప్రభావం వలన 🙁.
కాబట్టి బుధజనులారా, మన మాట “అట్టు” మాయమైపోయిన తరువాత ఇంక …. దోసె అన్నా, దోశ అన్నా …. ఏమున్నదక్కో, తేడా ఏమున్నదక్కా 🙁.
LikeLike
ఇంకా నయం దోశె అని కాస్త ఛందోబద్దంగా అంటున్నారండి. మావూళ్ళో అరవ్వాళ్ళైతే “తోసెయ్” (thosai) అంటారు. మీరూ వినే వుంటారు 2008లో😊.
LikeLike
“తోసెయ్” 😀😀.
అరవలు “త”, “ద” శబ్దాలకు ఒకే అక్షరం వాడతారనుకుంటాను, పలకటంలో కూడా అదే అలవాటయ్యుంటుంది బహుశః (jk) 😀.
LikeLike
అరవలు త ద శబ్దాలక
రరే ఒకే అక్షరమును రాస్తారుగదా
మరి పలకడమ్ము కూడా
సరళంపు జిలేబిగా పొసగుడు గనిరకో?
LikeLike
జిలేబిజీ, subject to correction అరవ గ్రామర్‌లో పరుషములే కానీ సరళములు లేవని విన్నాను. నిజమేనా? అయ్యర్ సార్నడిగి చెప్తారా? మీరే చెప్తానన్నా Okనే 🙂
LikeLike
ఎవరన్నారండీ 😦
கோபால்
కో బాల్ 🙂
గోపాల్ 🙂
LikeLike
గరికపాటివారు అన్నట్టు గుర్తు(మళ్లీ subject to correction). మా (మన??) వూళ్లో గోపాల్ ని గోబాల్ అని, సుబ్బయ్యని సుప్పయ్య అనీ అనే, రాసేవాళ్ళు కోకొల్లలు.
LikeLike
పరుషము లేను జిలేబీ
సరళమ్ములు లేవటా !మసాలా తోసై 🙂
అరె! గోపాలా ; కోబా
లరె! పూకిసు బూగిసున్ను లరె యొకటేనా 🙂
LikeLike
ష పలకడము దోసంబో ?
తపనయెలేదు తెలుగు జనతకు తమ ఫలహా
రపు పేర్లను కాపాడుకొ
న పరిణితియు లేదు నేటి నవతకు సుమ్మీ 🙂
LikeLike
పలకవలసిన చోట “ష” పలికితే దోషమని ఎవరూ అనరండీ “జిలేబి” గారూ. “శ” గాని, “స” గానీ తగిలితే చాలు దాన్ని “ష” గా మార్చేసి పలికడమే దోషం అని చెప్పడం నా భావం. శంకరాభరణం శంకర శాస్త్రి గారన్నట్లు మన తెలుగులో “శ”, “స”, “ష” అని మూడు నిర్దిష్టమైన శబ్దాలు ఉన్నాయి. దేనికదే ముఖ్యమైనది. ఇతరభాషల వాళ్ళని అనుకరించే దురదతో అలవాటు చేసుకుని మరీ “ష” పలికితేనే వినేవారికి అపశృతిలా ధ్వనిస్తుంది.
LikeLike
మన తెల్గున సూవె స శ ష
లని నిర్దుష్టముగ మూడు లావణ్యంబొ
ప్పు నిఘుష్టమ్ములు గలవ
మ్మ! నివేదించితి జిలేబి మరువగ రాదే!
LikeLike
// “దోశె – ప్రకృతి, దోస – వికృతి అనమాట.” //
ఊహ బాగానే ఉంది YVR గారూ 👌. మరీ సాగదీయడం కాదు గానీండి …. “జిలేబి” గారి హస్తభూషణమైన “ఆంధ్రభారతి” నిఘంటువులో … దోశ, దోసె మాత్రమే ఉన్నాయి. “దోశె”, “దోస”(ఈ టిఫిన్ అర్థంలో) కనబడవు 🙁.
LikeLike
ర,ళయోరబేధః అని గరికపాటిగారు అంటే తెలిసిం దండి, ఇప్పుడు సె,స,శయోరబేధః అనేసుకోవచ్చు. దోశ,దోసె,దోస, మినపట్టుయోరబేధః అనుకుంటే మరీ మంచిది.
LikeLike
దోశ దోసెల కత త్రోవను కనలే జి
లేబి వచ్చె తెచ్చె లెస్స యాంధ్ర
భారతిని నడుమ సెబాసనగ తిరిగె
చర్చ శ సె ల పైన చాళి గనుచు 🙂
LikeLike
ఆవకాయ చర్చ నరవదోశెగ మార్చి
దోశె కావకాయ దోస్తి గూర్చె
తిరిగి చూడ నింత తెలివిడి గలుగు జి
లేబి గార్కి మ్రొక్కులిడుదు వొగిడి .
LikeLike
రాజారావు మాస్టారు,
ఏ చర్చనయినా ఎటయినా తిప్పగల సమర్థులయిన మన “జిలేబి” గారికి ఆవకాయ నుండి దోసెలకు వెళ్ళడం ఎంతలో పని? పోనీలెండి, ఈ చర్చ పుణ్యమా అని దోసె, దోశ పేర్లు కరక్ట్ గా వ్రాయడం తెలిసింది 😀😀😀.
మీరన్న దోశ – ఆవకాయ (నాకయితే వెల్లుల్లి లేకుండానండోయ్ ☝️🙂 ) జోడీ మహత్తరం కదా 😋 .
LikeLike
ఏ చర్చనైన నరరే
తా చక్కగ తిప్పునయ్య తనవైపు జిలే
బీ చాతురి యన్ననిదే
గాచారమ్ము మనమే టకాల్మని చిక్కేం 🙂
LikeLike
దోస+ఆవకాయ= దోసావకాయ
దోశ+ఆవకాయ= దోశావకాయ
Gourmet grammarలో రెండూ లాలాజలాదేశ సంధులే మాస్టారూ!!🤗🙂
LikeLike
గుంటూరుని గుంటురు అన్నారంటే మీరు ఖచ్చితంగా గుంటూరువాళ్ళే, అవునా?
LikeLike
బోనగిరి గారూ, ఒకరకంగా గుంటూరువాణ్ణే. నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ తీసుకున్నందుకు. 🙂
LikeLike