వోట్ల తాంబూలం ఇచ్చేశాం, ఇంకో ఐదేళ్ళ పాటు పార్టీలు, ప్రభుత్వాలూ తన్నుకు చావడానికి.
ఆ అధ్యాయం మే 23 నుంచీ మొదలయ్యేలోపు మనం ఎంజాయ్ చెయ్యాల్సిన వాటిలో మొదటిది ఆవకాయ సీజను. ఉగాది తరవాత వచ్చే పండగ వినాయక చవితి అనుకుంటాం కానీ మధ్యలో వచ్చే ఆవకాయ సీజన్ కి పండగ అనేంత ఇంపార్టెన్స్ వున్నా ఎందుకో ఆ స్టేటస్ ఇవ్వలేదు ఈ దేశం. తరతరాలుగా ఆంధ్రజాతికి జరిగిన అవమానాల్లో ఇదొకటి. మొదటి అవమానం విశ్వామిత్రుడు తన కొడుకుల్లో కొందరిని మీరు ఆంధ్రభృత్యులై పోతారు పొండి అని శపించడం. (మహాభారతంలో చదివా, మనకి స్పెషల్ స్టేటస్ రాపోడానికి, విశ్వామిత్రశాపానికీ ఏమన్నా లింకుందేమో?). ఇంత జరిగినా మన తెలుగువాళ్ళని తెలుగుతేజాలు అని ఈ రోజు అనగలుగుతున్నామంటే ఆ క్రెడిట్ చాలా మటుకు ఆవకాయకే వెళ్తుంది. ఆంధ్రులకి ఆవేశం వుందనే సంగతి ఏడాది పొడుగునా గుర్తు చేసేందుకు ఆవకాయ తప్ప ఇంకెవరూ కనిపించట్లేదు మరి. అందుకే ఆవకాయకి ఈ పోస్ట్ అంకితం.
ఉగాది రాగానే కోయిల కూతతో మనకి వసంతం వచ్చిన సంగతి తెలుస్తుంది కానీ ఆవకాయ సీజన్‌ని ఆహ్వానించే పక్షి కూత ఏదీ ప్రత్యేకంగా వున్నట్టు లేదు. కానీ, ప్రకృతి మాత్రం కూతలకి బదులు కవితలు అల్లుతుంది, నిశ్శబ్దంగా. అలాంటి కవితలు –
చెవులుండే మనసుకి వినిపించవు.
ౘవులుండే నాలుకకే వినిపిస్తాయి.
అలాంటి కవిత నిన్న నా నాలుకకి “వినబడింది”. అలా👇.
ఎక్కడో విన్నట్టుందే అని కిందామీదా పడక్కర్లేదని వేరే చెప్పట్లేదు. ఎందుకంటే, శ్రీశ్రీగారి విప్లవం ఎంత ఎర్రగా వుంటుందో ఆవకాయ విప్లవం అంత ఎర్రగా, కొంచెం ఎక్కువ ఘాటుగా వుంటుంది కదా? అందుకు!
మనం సామాజిక విప్లవాలు మర్చిపోయి దశాబ్దాలు అవుతున్నట్టు వుంది. ప్రస్తుతానికి ఆవుపాలు, బిప్లబ్ దేబ్ లు, ‘అంబా🐄….’నీలు …. ఇవే మనకి విప్లవాలు. వాటిలోలేని ఫైరూ, పవరూ ఆవకాయలోనే చూసుకోవాలింక. చూసుకోండి, ప్రకృతి తనలోని ఒకో భాగంతో ఒకో విధంగా ఆవకాయ సీజన్‌ని ఎలా ఆహ్వానిస్తోందో –
మామిడిముక్క, మిరపమొక్క, ఆవగింజ, పప్పునూనె, ఉప్పురాయి కాదేదీ కవితకనర్హం అనేది పాతపాట. నిజానికి అవన్నీ దేనికదే ఒకో కవిత. ఆ కవితలన్నీ కలిసిన ఖండకావ్యం ఆవకాయ. ఆనెస్ట్లీ, ఖండకావ్యాలు అనే కావ్యాలుంటాయని తెలుసు, కానీ అవేంటో మనకి తెలీదు. నాకున్న మిడిమిడి జ్ఞానానికి అందినంత మటుకు ఆవకాయకి ఖండకావ్యం అనేపేరు సరిగ్గా సరిపోతుంది. మావిడికాయల ఖండాలు (=ఆవకాయబద్దలు😋) నిండి, శ్రీశ్రీ కవితల్లో వుండే ఫ్లో కి ఇంచుమించు సరిసాటి ఐన ఊట ప్రవహించే కావ్యంలాంటి ఆవకాయని ఖండకావ్యం అంటే తప్పేవుంది? ఏంలేదు.
ఇవాళ్టికి ఇంతే🙂సంగతులు.
బై4నౌ 🤗
అబ్బో! ఎన్ని కవీతలో! మీలో ఈ కవితావేశం కలిగించిన ఆవకాయకి నమోనమః!
LikeLike
లలితగారూ, కవితావేశాన్ని ఆవకాయ కలిగించింది, రాజారావు మాస్టారి ఆవకాయ పోస్టు దాన్ని రగిలించింది. మీరు ఆవకాయ పెట్టాక మా పోస్టుల్ని తలుచుకుంటారని ఆశిస్తున్నా. 😊
LikeLike
భలే ఉంది మీ ఆవకాయ పురాణం YVR గారు.
LikeLike
పవన్, చదివినందుకు నెనరులు. ఆవకాయ పురాణం అంటే ఘాటు తగ్గిందండీ, ఆవకాయ విప్లవం అందాం 😊.
LikeLike
వై వీ యార్ , యల్ వీ యార్
భావించిరి ఆవకాయబద్ద ఘనతలన్
సేవించి రాంధ్ర జనములు
భూవినుతంబయ్యె రుచిని భోజ్యేషు నహో !
LikeLike
మాస్టారు, పద్యవ్యాఖ్యకి నెనరులు🙏. మీ పద్యాలతో ఆవకాయకి ఖండకావ్యం స్టేటస్ ఖాయం ఐపోయినట్టే.
LikeLike
ఆవకాయ కంచంలోకి రావాలంటే … ఇవి సైతం 👇 ☝️
* కోసే కత్తి (“కోడి కత్తి” కాదు ☝️ 🙂) (కాయలను ముక్కలుగా నరకడానికి కత్తి)
* తుడిచే బట్ట (ముక్కలను తుడవడానికి)
* నిలవుంచే జాడీ
———————
వెల్లుల్లి వెయ్యలేదు, థాంక్స్ 🙏.
———————
రాజారావు గారు, మీరు కలిసి ఆవకాయకు ఖండకావ్యం స్టేటస్ ఇచ్చారు 👏 (ఖండకావ్యానికి మీరిచ్చిన నిర్వచనం బాగుంది 👌). ఆవకాయ సీజన్ కు పండగగా స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడం మాత్రం అన్యాయం. మేమంతా కూడా ఖండిస్తున్నాం. వెంటనే పోరు మొదలు పెట్టాలని హీరో శివాజీకు చెబుదాం 🙂.
LikeLike
VNR sir, ఆవకాయ పోస్టుకి సీక్వెల్ రాసేందుకు మేటర్ ఇచ్చారు, ధన్యవాదాలు🙏.
//వెల్లుల్లి …. //
మీకసలు వెల్లుల్లే పడదా ? లేక ఆవకాయలో మాత్రమే నిషేధించారా? Nation wants to know, 🤗
LikeLike
సుతరామూ పడదు 😏. Period.
LikeLike
ఆవకాయ సీరీస్ పూర్తయిన తరువాత గోంగూర గురించి వ్రాయాలని … వెల్లుల్లి లేకుండా ☝️😀 … పురజనుల మనవి. కౌరవుల చేత కూడా “ఆంధ్రమాత” అని కీర్తించబడ్డ పచ్చడి (according to పాత “మాయాబజార్” సినిమా. కానీ ఉత్తరభారతీయులైన కౌరవపరివారం చేత చెప్పించిన ఆ డయలాగ్ నాకెప్పుడూ నచ్చదు. సినిమా తీసినది తెలుగువారు కాబట్టి అలా చెప్పించి ఉంటారు. అయిననూ గోంగూర నిస్సంశయంగా మహత్తరమైనదే).
LikeLike
వీఎన్నార్ సర్, వెల్లుల్లి లేని ఆవకాయ రెండో జాడీ రెడీ.😀
LikeLike
ఆహా, సెంటిమెంట్ ప్రయోగించారండి YVR గారు. ఒకప్పుడు (కాలేజ్ హాస్టల్ కు వెళ్ళేటంత వరకు) ఉల్లిపాయ కూడా తినేవాడిని కాదు (వెల్లుల్లి వాడకం అయితే మా ఇంట్లో ఏనాడూ లేదు లెండి). ఏ వంటకంలోనైనా ఉల్లిపాయ వేస్తే (అదీ అరుదుగా), వేసే ముందే మా అమ్మ కొంచెం వేరే గిన్నెలోకి తీసుంచేది …. మా నాన్నగారి కోసం, నా కోసం. వెల్లుల్లి నాకిష్టం లేదని తెలిసి మీరిప్పుడు వెల్లుల్లి రహిత ఆవకాయ తయారు చేసి ఆ పాత రోజులు గుర్తుకు తెచ్చారండి. ధన్యోస్మి YVR గారు 🙏 😛. ఎప్పుడైనా గిప్పుడైనా మీరు మీఇంటికి భోజనానికి గనక పిలిస్తే మా వెల్లుల్లి-వైరి గాంగ్ భయపడకుండా మీ ఇంటికి రావచ్చన్నమాట, గుడ్, ఆనందం 😀.
LikeLike
కల్లా కపటం బెరుగని
వెల్లుల్లితొ వైరమేల వీయెన్నార్ సార్ ?
వొళ్ళంతా తెల్లన , వొహ
కుళ్ళూ కుత్సిత మెరుగదు , కోప యదేలా ?
LikeLike
వైరం అంటే వైరం అని కాదు మాస్టారూ. ముఖ్య పదార్థం యొక్క అసలు రుచిని తొక్కేస్తుందని వెల్లుల్లంటే విముఖత, అంతే.
LikeLike
విన్నకోట సర్, ఆవకాయ నచ్చినందుకు సంతోషం.
ఆవకాయ వరకూ నేను కూడా నాన్-వెల్లుల్లిటేరియే ననండి, మీ పార్టీయే. మీరు మా ఇంటికి వస్తామంటే అంతకంటే సంతోషం ఇంకేముంది. తప్పక రావలసింది.
ఇంతకీ పేరడీ ఎలా వుందో చెప్పలేదు మీరు.
//ఆ పాత రోజులు…. //
మీ anecdotes కోసం మీరు బ్లాగు తెరవాలని, తెరుస్తారని ఎదురు చూస్తున్నాం సార్.
LikeLike
ఆహ్వానానికి థాంక్స్ YVR గారు 🙂. సింగాపురానికి మరొకసారి రావడం జరిగితే (2008లో మొదటిసారి వచ్చాను లెండి) తప్పక మీ ఇంటికొస్తాను 👍.
“నాన్-వెల్లుల్లిటేరియన్” 😀. I like that expression☝️. వెల్లుల్లి తినని వర్గం మొత్తానికి సరైన పేరు 👌.
బ్లాగ్ మొదలెట్టటమా? పార్కలాం.
LikeLike
మున్వచ్చేను తెమాసెకైన నగరమ్మున్జూచి యేండ్లాయెనే!
కన్వెన్గానగ స్కూటునెక్కి త్వరగా కాల్మోపెదన్ విన్న కో
టన్విన్నందుకొనంగ విందునట తట్టంచున్ భలే లేహ్యమా
నాన్వెల్లుల్లియ యూరగాయ రుచులే నాస్వాదనల్జేతునే
LikeLike
జిలేబిగారూ, వీఎన్నార్ గారిని మీ యింటికి తీసుకురావాలి. అడ్రెసో, ఫోన్ నెంబరో ఇవ్వండి మరి 😊
LikeLike
విన్నకోట సర్, ఆవకాయ నచ్చినందుకు సంతోషం.
ఆవకాయ వరకూ నేను కూడా నాన్-వెల్లుల్లిటేరియే ననండి, మీ పార్టీయే. మీరు మా ఇంటికి వస్తామంటే అంతకంటే సంతోషం ఇంకేముంది. తప్పక రావలసింది.
ఇంతకీ పేరడీ ఎలా వుందో చెప్పలేదు మీరు.
//ఆ పాత రోజులు…. //
మీ anecdotes కోసం మీరు బ్లాగు తెరవాలని, తెరుస్తారని ఎదురు చూస్తున్నాం సార్.
LikeLike
// ” త్వరగా కాల్మోపెదన్ ” //
—————
“జిలేబి” గారేగా పైన Anonymous గారు 😎 ?
“జిలేబి” గారూ,
మీ ఇంటికి కూడా వస్తాను ….. ఆహ్వానితుడుగా నైనా సరే, అనాహ్వానితుడుగానైనా సరే 👍 (మీ ఇల్లు ఎక్కడుందో YVR గారికి తెలిసే ఉంటుందిగా 😀).
🦁
LikeLike
వీఎన్నార్ గారూ,
కందము రాసిన ఎనానిమసెవరని
సందియమా? పద్యపు కామెంట్లన్నవి
ఎందెందున కనిపించిన జిలేబియుండు
నందందున V.నరసనాగ్రణి వింటే !!
😀😀😀😀
LikeLiked by 1 person
ఆవకాయకి నువ్వుల నూనె ప్రశస్తమైనది అంటారు. మీరు వేరుశనగ నూనె అంటున్నారు. ఇప్పుడు ఏది వాడాలి మేము. ……… మహా
విన్నకోట నరసింహారావు గారూ ……. వెల్లుల్లి లేని గోంగూర పచ్చడా? అపచారం అపచారం. శాకంబరీ దేవి క్షమించదు. ……. మహా
LikeLike
స్వాగతం సర్. 🙏
//ఇప్పుడు ఏది వాడాలి మేము …//
మీరు టెక్నికల్ డిటైల్స్లోకెళ్తే ఇంక నా పని అంతే సంగతులు 😊. ఖండకావ్యానికి నువ్వులనూనె వల్ల ఒక ఫ్లేవరు, పప్పునూనె వల్ల మరో ఫ్లేవరూ వస్తాయని విన్నట్టు గుర్తు.
LikeLiked by 1 person
పప్పునూనె అంటేనే నువ్వుల నూనె . ఆవకాయకు పప్పు నూనే
వాడతారు .
LikeLike
ఎవరి టెక్నాలజీ వారిది. మేం అస్సాంలో ఉన్నప్పుడు అక్కడ దొరికే మామిడికాయలకి ఆవనూనె వాడాం ఓ బెంగాలీ సలహాతో ఒక మాటు. రుచి తెలిసేటప్పటికి సీసాడు ఆవకాయ అయిపోయింది. ……. మహా
LikeLike
బెంగాలీ సలహాతో అస్సాం మావిడికాయకి ఒరిస్సా ఆవనూనె కలిపి చేసిన ఆంధ్రా ఊరగాయ – అసలు సిసలు fusion cuisine 👌👌👌
LikeLike
ఆవిడెందుకు గానీ బులుసు వారూ …. చూస్తుంటే వెల్లుల్లి తిననివాళ్ళు మైనారిటీలనిపిస్తోంది 🙁. అయినచో ఈ రకపు మైనారిటీల శ్రేయస్సు కోసం డిమాండ్ చెయ్యడం గురించి ఆలోచించాలి, అదే తక్షణ కర్తవ్యం ☝️.
LikeLiked by 1 person
వేదకాలం లోనే వెల్లుల్లి ఆవకాయ ప్రసిద్ధి చెందిందని వెల్లుల్లి మిత్రుల సంఘం ప్రకటించింది. ఒక్కమాటు తిని చూడండి నరసింహారావు గారూ.. ……… మహా
LikeLike
‘ కొత్త రుచుల ‘ వెనక పడే వయసు కాదు బులుసు వారూ😔. ఈసారికిలా పోనివ్వండి 🙂.
LikeLiked by 1 person
గోంగూర పచ్చడికి ఉల్లి కాంబినేషన్ కాని , వెల్లుల్లి కాదే !
LikeLiked by 1 person
తినేటప్పుడు గోంగూర పచ్చడికి ఉల్లి కాంబినేషన్ శ్రేష్టమే సారూ. పచ్చడి చేసేటప్పుడు పోపులో వెల్లుల్లి వేస్తారు. మాలాంటివాళ్ళు ఓ మోతాదు ఎక్కువే వేస్తాం. అప్పుడే గోంగూర పచ్చడికి రుచి వస్తుందని నమ్ముతాం…….. మహా
LikeLike
వెల్లుల్లి లేని ఆవకాయా! వెల్లుల్లి లేని గోంగూరా…అబ్బే. నా వోటు బులుసు గారికే! వెల్లుల్లి వేసిన ఆవకాయ,గోంగూరా ఏమి రుచి ఏమిరుచి ఏమి రుచిరా!
మరో సంగతి, వెల్లుల్లిని పైపొరకూడా తీయకుండా దండగా గుచ్చి ఆవకాయలో వేసి ఊరబెట్టేవారు.కావలసినన్ని మాత్రం తీసుకునే అలవాటూ. వెల్లుల్లి గొప్ప మందు. ఎల్లియంసతీవా,ఎల్లియం సీపా అన్నవి రెండు హోమియో మందులు. అవి వెల్లుల్లి,నీరుల్లి నుంచి తయారు చేసినవే! వెల్లుని తిననివారు మంచి ఏంటీ బయోటిక్ ని కోల్పోతున్నారు.
వెల్లుల్లిని ఆవకాయలో గోమూగర పచ్చడిలో వేసుకుని,నీరుల్లిని నంజుకుంటూ తినడం ఎంత గొప్ప మాట.
LikeLike
వెల్లుల్లి అనగా నే మి ?
LikeLiked by 1 person
వెళ్లి ఉల్లిపాయలు తీసుకునిరా అని అర్థం!
LikeLike
“వెల్లుల్లి అనగా నే మి?” అని అడుగుతున్న పై Anonymous గారు మా మైనారిటీ వర్గంలో మరీ మైనారిటీ గ్రూపులో జేరడానికి అర్హులు. వెల్కం వెల్కం 💐 🙂.
(ఈ Anonymous గారు “జిలేబి” గారు గినా కాదు కదా 🤔? ఇటువంటి ప్రశ్నలడగడంలో వారు అందె వేసిన చెయ్యి ☝️)
LikeLike
విన్నకోటవారు,
గినా అని అనుమానమా! 🙂
LikeLiked by 2 people
🙂.
అంతేననిపిస్తోంది శర్మ గారు 🙂.
LikeLike
లొల్లి లేనిది వెల్లుల్లి.
LikeLike
తెలంగాణాలో ,
ఉల్లిగడ్డ
వెల్లిగడ్డ – అని రెండింటికీ
చక్కని తేడాతో
పేర్లున్నవి .
మా నెల్లూరీయులు
యర్రగడ్డ
తెల్లగడ్డ – అంటారు .
LikeLike
ఉల్లిపాయ – వెల్లుల్లిపాయ ….. పేర్ల మధ్య కూడా తేడా చక్కగానే ఉంది కదా రాజారావు మాస్టారూ?
LikeLike
YVR గారు, ఉల్లి – వెల్లుల్లి గురించి నేను వ్రాసిన వ్యాఖ్య ఒకటి ఇంకా వెలుగు చూడలేదే?
LikeLike
VNRసార్ మీ కామెంటు ఎందుకో Spamలోకి వెళ్లింది. సరిచేశాను.
LikeLike
ఎందుకో ఏముంది లెండి. ఇతనెవరో పసలేని కామెంట్లు మరీ ఎక్కువగా / మరీ తరచుగా పెడుతున్నాడు అనుకుని స్పామ్ కు తరలించుంటుంది, అంతే 😀😀.
ఇంతకీ నా కామెంటేదీ?
LikeLike
VNR సార్! ఈ మధ్య EVMల ఫార్స్ చూశాక ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియట్లేదు 😀.
మీ కామెంటుకి ఇలా అవ్వడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు శ్యామలరావుగారి కామెంటుకి ఒకసారి అయింది, అంతే.
LikeLike
విన్నకోటవారు మీ వ్యాఖ్య ‘వెల్లుల్లి వెయ్యలేదు, థాంక్స్’ చూడగానే నవ్వొచ్చింది :D. చిన్నవ్యాఖ్యలో ఓటపా కట్టేందుకు ఆలోచనలుఇచ్చేసారు !! మీరు మైనారిటీ కానే కాదు. మీకు తోడు ఉన్నాను. టపా పెట్టేస్తాను రెండురోజుల్లో. మెజారిటీ చేసేద్దాం
LikeLike
చంద్రిక గారు,
ఆనందం, మహదానందం 🤓. Yes, may our tribe increase 👍.
LikeLike
YVR గారు, ఎప్పటిలాగే టపా బావుంది!! ఘాటు కూడా వచ్చి ఇండియా నుంచి ప్యాకెట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూపులు మొదలయ్యాయి కూడాను !
LikeLike
విష్ యూ హాపీ ఆవకాయ సీజన్ 😊
LikeLike
// “జిలేబిగారూ, వీఎన్నార్ గారిని మీ యింటికి తీసుకురావాలి. అడ్రెసో, ఫోన్ నెంబరో ఇవ్వండి మరి ” //
———————————-
ప్రయత్నించండి YVR గారూ 👍 but fat chance. మీరు గనక ఈ వివరాలు సంపాదించగలిగితే మీకు “శౌర్య చక్ర” పతక ప్రదానమే ✋ 🙂.
LikeLike
మీకు ఆహ్వానం ఇచ్చే ఉద్దేశం ఉంటే అడ్రస్ వారే చెబుతారుగా, అప్పుడే నాకూ దర్శనభాగ్యం.
LikeLike
అంతే లెండి, ఏదో మీరిద్దరూ ఒకే ఊరి వారు కదా, అడ్రస్ గురించి మీకు తెలిసుంటుంది అనుకున్నాను గానీ … మీరన్నదీ పాయింటే. కాబట్టి ఆ రకంగా “ముందుకు పోదాం.” Let us wait for “Zilebi”’s specific invitation (రాదు, అది వేరే సంగతి 🙂)
LikeLike
మీరిద్దరొకే వూరుక
దా రామయ్యా వడి తను దా యేడుందో
మీరైనా కను గొనుడీ
ధారాళమ్ముగ జిలేబి దక్కున్ చిక్కున్ 🙂
LikeLike
మంది జిలే బని యందురు ,
కందమె మా యడ్ర సార్య ! కనువిందగు నా
సుందర వరూధినీ బ్లా
గందున వివరాలు గలవు కనుల వెదుకుమా .
ఇంతకంటే వారి వద్ద నుండి మీకు సమాధానము రాదు
LikeLiked by 1 person
కందాయ విద్మహే జిలేబ్యాయ ధీమహి, తన్నో వరూధిని ప్రచోదయాత్ 🙏
LikeLike
// “కందము రాసిన ఎనానిమసెవరని ……….. “ //
————————-
మీకు కూడా ఈ విద్య బాగానే అబ్బిందే, YVR గారూ 🙂 !
(నన్ను “దానవాగ్రణి” సరసన నిలబెట్టినా 😀) పద్యం చాలా బాగా కుదిరిందండి … నిజంగా 👌👏.
LikeLike
థాంక్యూ సర్, ఛందస్సులు అవీ అడక్కుండా ఉంటే చాలు.
//“దానవాగ్రణి” సరసన నిలబెట్టినా..// ఆమ్మో అంత సాహసమే. నరసింహ నామధేయులలో మీరు అగ్రణి అని “కవి”హృదయం 🙏
LikeLike
🙏
LikeLike
కలరందురు సింగపురమున
కలరందురు రాణిపేటనందు
కలరందురిరు దేశములను
కలరు కలరనెడి వారెచ్చోట కలరో
(YVR గారు “వరూధిని” బ్లాగ్ లో వ్రాసిన “కలరాజిలేబిగారట ….” స్ఫూర్తితో)
——————-
హేవిటో, మరీ గజేంద్రుడి మొరలా అయిపోయింది 🙁.
🦁
LikeLike
కల రందురు సింగపురిని
కల రందురు రాణిపేట క్రంతల యందున్
కల రందు రిరు దెసల , ఘను
లిలలో కలరనుటె గాని యెచ్చట కలరో ?
పెద్దలు నరసింహరావు గారి అనుమతి కోరుతూ , వారి పద్యానికి చిన్న చంధోబధ్ధ
సవరణ …..
LikeLike
థాంక్స్ రాజారావు మాస్టారూ 🙏. అనుమతెందుకు, తప్పుల్ని సరిజేయటం గురువుల హక్కు. మీరు సవరించిన పద్యం చక్కటి లయతో మరింత సొగసుగా ఉంది.
LikeLike
ఎవ్వరి రచనలలోనూ తప్పులు వెదికే సాహసం
చెయ్యను సార్ , అందులోనూ పెద్దల విషయం
లోనా , నెవ్వర్ , కాకపోతే , మీ రచనను కందప
ద్యంలోకి నెట్టేనంతే . దయయుంచండి . సదా
తమ ప్రేమాభిమానాల ఉంటే చాలు .
LikeLike
నాదే ముందండీ! నే
నేదో పోతన పదముల నింపంగ మసా
లా దోసై వచ్చెనదే
దో! దాసుడ! తప్పు గాన, దోసము నాదే!
మీరు సవరించినది సు
మ్మీ రసగుల్లా, జిలేబి మించారెనయా!
హేరాళముగ కలదయా
సారూ సవరింప రైటు సక్కగ మీకున్
ఎవ్వరి రచనల లోనే
కవ్వించుచు తప్పులన్ సఖా చూడనయా
రవ్వంతగ చందమ్మును
జవ్వాదిగ నబ్బినాను సఖ ! నరసన్నా !
LikeLike
వీఎన్నార్ గారూ,
మీ కందం బావుందండీ
మాలికలో మెరిసిందండీ,
బ్లాగ్లోకం మురిసిందండీ.
LikeLike
థాంక్స్ YVR గారూ. నాదేముందండీ, పోతన గారిని కాపీ కొట్టడమేగా నేను చేసింది 🙄🙂.
LikeLike