పిట్ట🐥రెట్టాలజీ ప్రిడిక్షన్స్ ఫర్ సెంటర్-స్టేట్ రిలేషన్స్ & ఇండో-పాక్ రిలేషన్స్ ఆఫ్టర్ 23 మే 2019


ఈ పోస్ట్ పబ్లిషయ్యే టైముకి ఆంధ్రాలో ఎలక్షన్ హడావిడి – సారీ, వోటింగ్ హడావిడి పూర్తై పోవచ్చు. టపా పూర్తి చెయ్యగలనో లేదోననే భయం లేకుండా మహిమగల ఎన్నికల కమిషన్ వారు తమకంటే మహిమగల EVM లు

Ennoచోట్ల

Voటు యంత్రాల

Moరాయింపులు – ఏర్పాటు చేసి, ఇంకోరోజు కూడా వోటింగ్ జరిగే అవకాశం కల్పించారు. {పిట్టరెట్టాలజీ గురించి ఏమైనా మిస్సైనట్టు అనిపిస్తే ఇదిగో ఇది చదవండి ద సైన్స్ ఆఫ్ పిట్టరెట్ట జోస్యం & ద ఇంపాక్ట్ ఆఫ్ ఎ పొలిటికల్ పిట్టరెట్ట.} సరే!ఎన్నికల(ల) ఫలితాలు బైటికొచ్చేలోపు –

పార్టీల ప్రగల్భాలు, పరస్పర నిందారోపణలతో

ఎగ్జిట్ పోల్స్ తో

ఎగ్జిట్ పోల్స్ మీద ‘ఛా’నెళ్ళ డిబేట్లు, మేధావుల ఎనాలిసిస్సులతో

పైవాటన్నిటిని కలిపి ఎనలైజ్ చెయ్యగా అనిపించిన దాన్ని తమ తమ ప్రియతమ పార్టీల విజయాల్ని సూచించేలా మలిచి అందుకు  తగ్గట్టు గవ్వలనీ, గువ్వలనీ, గ్రహాల్నీ కిట్టించి మొత్తమ్మీద దేశ+రాష్ట్ర భవిష్యత్తుల్ని తేల్చి పారేసే future – gazerల భవిష్యవాణులతో మనకి మంచి కాలక్షేపం.

ఈ 2019 ఎన్నికల స్పెషాలిటీ ఏంటంటే పైన చెప్పిన ఫ్యూచర్ ప్రిడిక్షన్ టెక్నాలజీలన్నిటికంటే ఎక్యురేట్-గా ప్రజా తలరాతలని చదవగల పిట్టరెట్ట శాస్త్రం మనకి అందుబాటులోకి వచ్చింది. ఈ శాస్త్రం ప్రకారం వచ్చే ఐదేళ్ళలో ఏ పార్టీ / ఏ స్టేటు / ఏ దేశం / etc etc etc నెత్తిన పిట్టరెట్ట పడనుందో పరిశీలించడమే ఈ టపా యొక్క లక్ష్యం.
ముందుగా మనం మూడు సినేరియోలు పరిశీలించాలి.

ఒకటి – సెంటర్లో BJP, ఏపీలో రూలింగ్ TDP అప్పోజిషన్ YCP & జనసేన .
రెండు – సెంటర్లో BJP, స్టేట్లో రూలింగ్ YCP, అప్పోజిషన్ TDP & జనసేన
మూడు – సెంటర్లో BJP, స్టేట్లో రూలింగ్ జనసేన, అప్పోజిషన్ TDP &  YCP

(ప్లీజ్ నోట్, BJP అంటున్నాం, NDA కాదు. సపోజ్, ఫర్ సపోజ్, BJPకి 2014లోలాగా ఫుల్-మెజారిటీ వచ్చేసి మళ్ళీ 56 అంగుళాల ఛాతీ విరుచుకుంటూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే నేపధ్యంలో ఆనమాట.)
ఒకటో సినేరియో ఏంటంటే మళ్ళీ చెంబుడు నీళ్ళు, గుప్పెడు మట్టే. పవర్లో వున్న TDP నెత్తిన, దేర్ ఫోర్, ఏపీ నెత్తిన పిట్టరెట్ట తప్పదు. ఆస్థాన జోతిష్కులు ఏం చెప్పినా గ్రహాలన్నీ పడనున్న పిట్టరెట్టకి తగ్గట్టు తమ తమ స్థానాలని జాతకచక్రంలో ఎడ్జస్ట్ చేసుకోవాల్సిందే. తప్పదు ☝️ .
ఈసారి YCP వారు అసెంబ్లీ ఎగ్గొట్టి పాదయాత్రలు చేసుకోడం ఆపేసి TDP ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు షురూ చేస్తే కేంద్రలోవున్న BJPట్ట సరైన టైములో సరైన _ట్ట వేసి సహకరించే అవకాశాలు బాగా వున్నాయి. అంతేకాక, ఇప్పటికే ఐదేళ్ళనుంచీ BJPట్టరెట్టల్లో ఉక్కిరిబిక్కిరౌతున్న TDPట్టలు కొన్నైనా ఇటుపక్కకి వాలచ్చు. గ్రహాలని ఆ ప్రకారం ఎడ్జస్ట్ చేసే వ్యవహారం కేంద్రానికి, కేసీఆర్-గారికీ అప్పచెప్పవచ్చు. ఇవన్నీ కుదరవు అనుకుంటే అసెంబ్లీ బాయ్-కాట్ చేసి పాదయాత్రలు చేసుకునే ఆప్షన్ ఉండనే వుంది.
YCP వారు TDP ప్రభుత్వాన్ని పడగొడతామంటే మరి జనసేనాని చూస్తూ వూరుకుంటారా? అంటే ఆయనది ఒరిజినల్లీ పంచవింశతి వర్ష ప్రణాళిక (అంటే పంచ-పంచవర్ష ప్రణాళికకి 5×5, నెహ్రూగారిని మించిపోయారు కదా PKగారు.) కాబట్టి బ్రేక్ తీసుకుని సినిమాలు చేస్తారా? ఇంకేమన్నా చేస్తారా? అనేదానిపై పిట్టరెట్ట శాస్త్రానికి ఇంకా అంచనా రాలేదు.

Let us now look at సినేరియో రెండు. స్టేట్‌లో YCP రూలింగ్ . అప్పోజిషన్ TDP & జనసేన. ఇన్నాళ్లూ వైసీపీకి వోటేస్తే బీజేపీకి, టీఆరెస్సుకీ వోటేసినట్టే అని జరుగుతున్న ప్రచారం నిజమో కాదో తేల్చేసే సినేరియో ఇది. ప్రచారం నిజమైతే (నిజమైతేనే సుమీ!!) మళ్ళీ ఏపీ నెత్తిన ఒకటి కాదు రెండుపిట్టలు – BJPట్ట & TRSPట్ట – వేస్తాయి రె _ లు. ఆ రె _లు ఏ రూపంలో పడతాయంటే –

యూట్యూబులో, వాట్సప్పులో, బ్లాగుల్లో, గూగుల్లో ఎందెందు వెతికి చూచిన అందందే గలదిన్ఫర్మేషను వినే/చూచేవారుంటే.

🤣

ప్రచారం నిజం కాకపోతే? మూడు విధాలుగా ఏపీ మీద రె _ లు పడచ్చు. సెంటర్ పిట్ట, పొరుగురాష్ట్రపు పిట్ట ఎవరి ఎజెండా వాళ్ళు కంటిన్యూ చేసి యధాశక్తి ఏపీ ప్రజల నెత్తిన పి.రె.లు కురిపించే అవకాశాలు మస్తు. ఇంకోపక్క, BJPట్ట, YSRCPట్టని మింగేసి (అంటే విలీనం చేసేసుకుని) ఏపీ మీద ఇన్-డైరెక్టుగా రెట్టలేసే ప్లానులో కూడా ఉన్నట్టు పిట్టరెట్టలజీ అనుమానిస్తోంది. ఇలాంటి రకరకాల పి.రె.లన్నిట్నీ వుడ్-బి సి.ఎం. తట్టుకుంటాడో, తిప్పికొడతాడో వెండితెరపై చూడాల్సిందే. కానీ వుడ్-బి సి.ఎం. కి వున్న క్వాలిఫికేషన్ and/or అమ్యునిషన్ ఏంటంటే మడమ తిప్పని మొండితనం. మొండివాడు రాజుకంటే బలవంతుడు. మొండివాడే రాజైతే? ఇంకా ఊహించద్దు. ఇప్పుడే ఊహించేస్తే వచ్ఛే ఐదేళ్లూ సస్పెన్స్ ఉండద్దూ?

నెక్స్ట్,,,, సినేరియో మూడు. ప్రస్తుతానికి ఈ సినేరియోని అలా వదిలెయ్యండని గవ్వలూ, గ్రహాలూ, అంకెలూ, … కాళ్లావేళ్లాపడి – “మీరు ప్రిడిక్షన్ ఇచ్చేశాక పడబోయే పి.రె.లకి తగ్గట్టు అంత ఫాస్టుగా, అన్నిసార్లు మా పొజిషన్లు మార్చుకోలేం, ఈసారికి మమ్మల్ని వదిలెయ్యండి. అనుకున్న పాతికేళ్లలో ఇంకా ఇరవై మిగిలేవున్నాయి కదా,”అంటూ వేడుకుంటున్నాయి. “సరే! ఇప్పుడైనా అర్థమైందా పి.రె.శాస్త్రం పవరేంటో? ఇంత వేడుకుంటున్నారు కాబట్టి గ్లాసుకి పవరొచ్చే వరకూ ప్రిడిక్షన్స్ హోల్డ్ లో వుంచుతాను. వచ్చాక మాత్రం ఒక్క క్షణం కూడా ఆగ,”నని గ్రహాలకి మాటిచ్చేశా. ఐనా ఆ మాట కొంచెం తప్పి కింగ్-మేకర్ కానీ వోట్-చీల్చర్ కానీ అవుతాడనుకుంటున్న PKగారు అనుకోకుండా ఎవరి సపోర్టు అవసరంలేకుండానే సి.ఎం. ఐపోతే ఏ.పి. మీద చాలా పి.రె.లు పడతాయని అనుకోడానికి పెద్దగా గ్రహాలూ/శాస్త్రాలతో కుస్తీ పట్టక్కర్లేదు. రాజకీయాల్లో కానీ, ఎడ్మినిస్ట్రేషన్ లో కానీ అస్సలు ఎక్స్పీరియెన్స్ లేదు కనక, ఆయన తన చుట్టూ JD, JP,లాంటి వారిని పెట్టుకుని, వాళ్ళని హర్ట్ చెయ్యకుండా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు పాలిస్తే BJPట్ట, TDPట్ట, YSRCPట్ట, TRSPట్ట, అభయ✋ హస్తం పిట్టలు ఎన్ని రెట్టలేసినా PKని ఏం పీకలేవని పెద్ద ఎన్ఠీఆర్ ఎదుర్కున్న ఆగస్ట్’84 వెన్నుపోటు ఎపిసోడ్ ని బట్టీ అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పుడో చిన్న ట్విస్టు. సపోజ్, ఫర్ సపోజ్, బీజేపీకి ఫుల్ మెజారిటీ రాక, మోడీగారు నిన్నో మొన్నో అన్నట్టు ఒక్క ఎంపీ వున్న పార్టీతోనైనా పవరుకోసం చేతులు కలుపుతాం అన్న మాటకి తధాస్తు దేవతలు తధాస్తు అనేశారనుకోండి. అప్పుడు ఎన్.డి.య్యే. సంకీర్ణ ప్రభుత్వమే వచ్చిందనుకోండి. లేదా గడ్కరీ పీ.ఎమ్. అయ్యారనుకోండి. అప్పుడు పి.రె. ప్రిడిక్షన్స్ లో డ్రాస్టిక్ ఎడ్జస్టుమెంట్లు చేయాల్సి వస్తుంది. చేద్దాం. మోస్ట్ ప్రోబబ్లీ, ఆ సిట్యుయేషన్ రాదు.

పైవన్నీ కాక కేంద్రంలో యూ.పీ.యే. వచ్చేసి – కాంగ్రెస్ సొంతంగా వస్తుందేమో అనే మాట తలచుకుంటేనే పిట్టలకి constipation వచ్చేసి శాస్త్రం ఈ.వీ.ఎం.లా మొరాయిస్తోంది, సో, యూ.పీ.ఏనే పవర్లోకి వస్తే అన్న సినేరియోనే కన్సిడర్ చేస్తున్నాం. అప్పుడు కూడా ఎడ్జస్టుమెంట్లు చెయ్యాలి. అప్పుడు ఏ.పీ. ప్రజల మీద కాకుండా టీడీపీ మీదే పడేలా అభయ✋ హస్తం పి.రె.లని టీడీపీ వైపు తోస్తూ ఉంటుంది. అంతకంటే ఏమైనా ఘనకార్యం చేస్తుందనుకుంటే పప్పులో, కాదు నిప్పులో, కాదు కాదు కాదు పి.రె.లో కాలేసినట్టే. స్టేట్లో ఒక్క సీటైనా లేకుండా, బాబు కొన్ని సీట్లైనా ఇస్తారనే నమ్మకం లేకుండా కాంగ్రెస్ టీడీపీకి క్రెడిట్ రానిస్తుందా? నివ్వదుగాక నివ్వదు.

ఇహపోతే, సెంటర్లో యూపీయే/కాంగ్రెస్, స్టేట్లో వైసీపీ వస్తే? TDPట్ట, చేతి✋వాటంపిట్ట కలిసి YCPట్ట మీద పడాల్సిన పి.రె.లని మేనేజ్ చేస్తాయి. అంటే బీజేపీ హయాంలో స్టేటు మీద ఏవైతే పి.రె.లు పడ్డాయో ఇంచుమించుగా అవే పడే అవకాశాలు మస్తు. కొసరుగా పొరుగు తెలుగు రాష్ట్రానికీ ఇవే “బెనిఫిట్స్” అందేలా చూడడం TDPట్ట, చేతి✋వాటంపిట్టల ప్రయారిటీ అవుతుంది. లాజికల్ గా లేదూ?
ఇవండీ పిట్ట 🐥 రెట్టాలజీ ప్రిడిక్షన్స్ ఫర్ సెంటర్-స్టేట్ రిలేషన్స్ ఆఫ్టర్ 23 మే 2019.

ఇప్పుడు స్పెషల్ గా చెప్పాల్సిన ప్రిడిక్షన్స్ కొన్ని వున్నాయి. మొదటగా ప్రజాశాంతి గురించి. వీరికి ఏ పిట్టరెట్టల భయమూ లేదు. ఎప్పటికీ. అందుకేగా ఏ పిట్టకీ దొరక్కుండా వాటికి పైన హెలికాప్టర్లో విహరిస్తూ వుంటారు. నిజానికి స్టేటు మీద కానీ, స్టేట్-రూలర్స్ మీదకానీ ఏ రెట్టలూ పడకుండా నిరంతరం ట్రంప్ తో, ఆ ప్రభువుతో చర్చలు జరుపుతూ స్టేటునీ, కంట్రీని కూడా నిరంతరం రక్షిస్తూ వుంటారు. పిట్టరెట్టాలజీకి అందనంత మహిమ కలవారు. వారికి భవిష్యత్తు చెప్పే సాహసం ఈ శాస్త్రం చెయ్యదు.

Next, ఇప్పుడు విదేశాలపై పిట్టరెట్టల ప్రభావం ఎలా ఉండబోతోందో చూద్దాం. ఇప్పుడు విదేశాల అధ్యక్షులందరూ మళ్ళీ ఇంకో ఐదేళ్లపాటు భారత ప్రధాని కౌగిలింతలు భరించడం లేదా తప్పించుకోడం ఎలాగా అని హడిలి ఛస్తున్నారనీ, ఎమర్జెన్సీ మీటింగ్స్ పెట్టి చర్చించుకోవడం మొదలుపెట్టారని, మే 23 లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకు తీరుతారని శాస్త్రం సూచిస్తోంది. ఈ చర్చల్లో భాగంగా గడ్కరీ పీ.ఎమ్. అయితే ఆయన గ్రీటింగ్ మెథడ్స్ ఎలా వుంటాయనే దానిమీద కూడా దేశాధినేతలంతా సమాచారం సేకరిస్తున్నారట. నిజానికి వాళ్లకి ఇంకో కన్సర్న్ కూడా ఉందిట, రాహుల్ మహాశయుడు ప్రధాని అయిపోతే (కొంపదీసి) ఆయన విదేశీ నేతలకి కన్ను😉కొట్టి, ముద్దులు 😚 పెట్టే ఉద్దేశాలేమైనా ఉన్నాయా అని కూడా ఆరా తీస్తున్నారని కూడా శాస్త్రం పసిగట్టింది. ఒక్క పాక్- ప్రధాని మాత్రం ఈ విదేశీనేతలతో ఏకీభవించట్లేదు.

Lastly, నిజానికి ఇమ్రాన్-ఖాన్ మన పీ.ఎమ్.ని ఘాఠ్ఠిగా కౌగిలించేసుకోవాలని డిసైడ్ అయ్యారనీ, లేకపోతే ఇండియా పంపే మిసైల్ పిట్టల రెట్టలు తట్టుకోడం తనవల్ల కాదనీ పాక్ మిలట్రీకి తేల్చి చెప్పేశారని కూడా శాస్త్రం కుండబద్దలు కొట్టింది. అసలు నిన్న మోడీ వస్తేనే ఇండియా-పాక్ శాంతి చర్చలకి మంచి అవకాశం ఉంటుందని ఇమ్రాన్-ఖానులవారు సెలవిచ్చిన కారణం కూడా మిసైల్ పిట్టరెట్టలకి ఝడుసుకునే అని పిట్టరెట్టాలజీ చెబుతోంది. ఇప్పటివరకూ టెర్రరిస్ట్ ఎటాక్స్ జరిగినప్పుడే సర్జికల్ స్ట్రైక్స్ చేస్తూ వచ్చిన పొరుగు ప్రభుత్వం ఇంకొంచెం రాటుదేలి తమకి దేశంలో అప్రూవల్ రేటింగ్స్ తగ్గినప్పుడూ, అలాగే రఫాలే విమానాలు దేశంలో దిగాక వాటి గొప్పతనాన్నీ, ఆ విమానాల రిపేర్లకీ, మెయింటెనెన్స్ కీ కాంట్రాక్టు తీసుకున్న అ.అం.గారి పనితనాన్నీ నిరూపించడానికి సర్జికల్ రెట్టలు వేసే అవకాశం పుష్కలంగా ఉందనీ, పాక్ గూఢచారి వర్గాలు బేజారెత్తిస్తున్నాయని, హడలగొడుతున్నాయనీ పిట్టలు ఘోషిస్తున్నాయి.

అవీ బ్లాగ్-వీక్షకులారా 2019 ఎన్నికల ఫలితాలు. ఏ.పీలో ఎన్నికలు అయిపోయాయి కాబట్టీ, ఏ.పీ. కన్న ఎన్ని కలలు నిజమౌతాయో ఇప్పటికీ క్లారిటీ లేదు కాబట్టీ పై ప్రిడిక్షన్స్ చూసి ఝడుసుకున్నా, భోరుమన్నా, తిట్టుకున్నా ఇంకో ఐదేళ్ల వరకూ ఏం లాభం లేదు. సో, ప్రస్తుతానికి జరిగినవాటికీ, మే 23లోపు జరగబోయేవాటికీ నవ్వుకుందాం. మళ్ళీ 2024లో తడాఖా💪🏻 చూపిద్దాం.

పిట్టరెట్టాలజీ గురించి ఏమైనా మిస్సైనట్టు అనిపిస్తే ద సైన్స్ ఆఫ్ పిట్టరెట్ట జోస్యం & ద ఇంపాక్ట్ ఆఫ్ ఎ పొలిటికల్ పిట్టరెట్ట

ఇంతే🤗సంగతులు✍🏽. బై4నౌ✋🏻😎.

Published by YVR's అం'తరంగం'

These little thoughts are the rustle of leaves; they have their whisper of joy in my mind...

5 thoughts on “పిట్ట🐥రెట్టాలజీ ప్రిడిక్షన్స్ ఫర్ సెంటర్-స్టేట్ రిలేషన్స్ & ఇండో-పాక్ రిలేషన్స్ ఆఫ్టర్ 23 మే 2019

  1. నా ఉహాగానం follows below.
    ఆంధ్రాలో ఇంచుమించు 2014 ఫలితాలే రావచ్చు.
    టిడిపి కి 100, వైసీపీ కి 70 రావచ్చు. బిజెపి కి వచ్చిన 4 ఈసారి జనసేన కి రావచ్చు.
    గతంలో బిజెపి కి వచ్చిన విశాఖపట్నం, నరసాపురం లోకసభ నియోజకవర్గాలు జనసేన కి రావచ్చు.
    కేంద్రంలో బీజేపీ కి మెజారిటీ రాదు. కాబట్టి మోది బదులు రాజనాథ్ సింగ్ ప్రధానమంత్రి అవ్వచ్చు.

    Like

    1. థాంక్యూ బోనగిరిగారూ. మీ ఊహాగానం బట్టీ స్టేటులో స్టేటస్-కో. సెంటర్లో రాజనాధుల వారొస్తే మానేజ్ చెయ్యగలరంటారా? మోడీ, షా ద్వయం గడ్కరీ చెక్ పెట్టే పనిలో ఉన్నారని ఆంధ్రజ్యోతి వార్త.

      Like

      1. రాజ్‌నాథ్‌సింగ్ పాత బిజెపి మనిషి. ఇంత ద్వేషం ఉండదు. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి అవుతాడు.
        గడ్‌కరి అవినీతిలో కాంగ్రెసుకి తక్కువేమీ కాదు.

        Like

        1. ఒకవేళ పొరబాటున (1% చాన్సు) మోడీ తిరిగి రాకపొతే శివరాజ్ సింగ్ చౌహాన్ బెస్ట్ చాయిస్.

          Like

        2. బోనగిరిగారు,
          //గడ్‌కరి అవినీతిలో కాంగ్రెసుకి తక్కువేమీ కాదు.//
          2015లో అరుణ్ శౌరీ BJP ప్రభుత్వాన్ని విమర్శిస్తూ Congress plus a cow అన్నాడని చదివాను. ఈ లెక్కన అవినీతికి, ఆవు-నీతికి మధ్య ఛాయిస్ అంటే …. ….. …. 🤔😃

          Like

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Keyakinan Anggun Charisma Ratika

Situs yang perlu Anda simak dan perhatikan. A great and best site.

vedika

your forum for critical and constructive writings

మీ వెంకట్

నాలోని భావాలు, భావోద్వేగాలు

నా కుటీరం

సమాజం, సాహిత్యం, సౌందర్యం

Kadhana Kuthuhalam

మరపురాని కథలను మళ్ళీ చదువుదాం.!

🌿🐢YVR's 👣Walks🐾With🌾Nature🐌🍄

🌻Look deep into nature, and then you will understand everything better 🌹 👨‍🔬Albert Einstein👨‍🏫

ఉహల ఊసులు

కవిత్వం, వంటా - వార్పు, మనసులో మాటలు, అక్కడ - ఇక్కడ

Prasad Oruganti

“I've learned that people will forget what you said, people will forget what you did, but people will never forget how you made them feel”— Maya Angelou

A Birder's Notebook

"Learning to bird is like getting a lifetime ticket to the theater of nature".

SEEN ALONG THE TRAIL

"I am at home among trees." -J.R.R. Tolkien

BUDGET BIRDERS

birding the world on a budget

Mike Powell

My journey through photography

Birder's Journey

"If you want to see birds, you must have birds in your heart." -- John Burroughs

Singapore Bird Group

The blog of the NSS Singapore Bird Group

MORGAN AWYONG

little truths . little deaths

Animals in South-East Asia

By Andrew Rhee (http://blog.daum.net/fantasticanimals)

Keyakinan Anggun Charisma Ratika

Situs yang perlu Anda simak dan perhatikan. A great and best site.

vedika

your forum for critical and constructive writings

మీ వెంకట్

నాలోని భావాలు, భావోద్వేగాలు

నా కుటీరం

సమాజం, సాహిత్యం, సౌందర్యం

Kadhana Kuthuhalam

మరపురాని కథలను మళ్ళీ చదువుదాం.!

🌿🐢YVR's 👣Walks🐾With🌾Nature🐌🍄

🌻Look deep into nature, and then you will understand everything better 🌹 👨‍🔬Albert Einstein👨‍🏫

ఉహల ఊసులు

కవిత్వం, వంటా - వార్పు, మనసులో మాటలు, అక్కడ - ఇక్కడ

Prasad Oruganti

“I've learned that people will forget what you said, people will forget what you did, but people will never forget how you made them feel”— Maya Angelou

A Birder's Notebook

"Learning to bird is like getting a lifetime ticket to the theater of nature".

SEEN ALONG THE TRAIL

"I am at home among trees." -J.R.R. Tolkien

BUDGET BIRDERS

birding the world on a budget

Mike Powell

My journey through photography

Birder's Journey

"If you want to see birds, you must have birds in your heart." -- John Burroughs

Singapore Bird Group

The blog of the NSS Singapore Bird Group

MORGAN AWYONG

little truths . little deaths

Animals in South-East Asia

By Andrew Rhee (http://blog.daum.net/fantasticanimals)

Singapore Birds Project

Singapore birds information for birders by birders

Life is a poetry

Life is a beautiful journey. Live, discover, feel and fall in love with it

Why watch wildlife?

A site dedicated to watching wildlife

Discover

A daily selection of the best content published on WordPress, collected for you by humans who love to read.

Gangaraju Gunnam

What I love, and mostly, what I hate

చిత్రకవితా ప్రపంచం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

సాహితీ నందనం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

బోల్డన్ని కబుర్లు...

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

SAAHITYA ABHIMAANI

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

లోలకం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

zilebi

Just another WordPress.com site

కష్టేఫలే

సర్వేజనాః సుఖినోభవంతు

అంతర్యామి - అంతయును నీవే

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

ఎందరో మహానుభావులు

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

వరూధిని

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

హరి కాలం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

The Whispering

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

Satish Chandar

Journalist. Poet. Writer

పిపీలికం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

పని లేక..

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

గురవాయణం

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

పక్షులు

🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

ఆలోచనలు...

అభిమానంతో మీ ప్రవీణ.....

Vu3ktb's Blog

Just another WordPress.com weblog

ఆలోచనాస్త్రాలు

............... ప్రపంచంపై సంధిస్తా - బోనగిరి

abhiram

album contains photos of my thoughts & feelings

%d bloggers like this: