సైకిలేసుకుని🚲 చాయ్ కొట్టుకెళ్ళి గాజుగ్లాసు🥛లో లోటస్🌸 బ్రాండ్ చాయ్ పోసుకుని ఫాన్🔆 కింద కూచుని టీ తాగాలని సామాన్యుడి కల.
మూడువారాల క్రితం, పొద్దున్నే ఆఫీసుకి పోతుంటే అనుకోకుండా ఆ 👆 లైను మనసులో అవతరించింది. తెల్లార్లూ వింటున్న పొలిటికల్ డిబేట్ల, మేధావుల విశ్లేషణల ఎఫెక్ట్ అయ్యుంటుంది. చదవడానికి బానేవుంది కదా అనిపించి –
“ఎవరైనా ఈ పొలిటికల్ పొడుపు కధని విప్పండర్రా,” అంటూ మా వాట్సప్ గ్రూపులో పెట్టా. ఆఫీసులో, సీట్లో హాయిగా కూచుని కాఫీ☕️ సిప్ చేస్తూనే పెట్టినా, అక్కడ బొమ్మలేసి మరీ పోస్టు చేసేంత తీరికా, ధెైర్యం, ప్రైవసీ వుండవు కదా! అందుకే ఆ👇 కాసిని లైన్లతో సరిపెట్టా. (బొమ్మలు ఇప్పుడే నా Note8 సాయంతో బరికా.)
అందరూ పెద్దపెద్ద ఉద్యోగాల్లో వున్నా, నా గ్రూపు ఫ్రెండ్సంతా సామాన్యుడిని ప్రేమించేవాళ్ళూ, వాడి సాదాసీదా లైఫ్-స్టైలుని మించిన లైఫ్-స్టైలు లేదనుకునే వాళ్ళూ, వీలైనప్పుడల్లా రోడ్డు పక్క బడ్డీలో మిర్చిబజ్జీనో, ఓ గ్లాసు చెరుకు రసమో, కప్పు ఇరానీ చాయినో ఓ పట్టు పట్టాలనుకునే వాళ్ళు. బిర్యానీలు, బీర్లు, బర్గర్లు, ఫైవ్ స్టార్ కంఫర్ట్లు ఎంత చేరువలో వున్నా ఆవకాయ-పెరుగన్నం చూస్తే – కాదు – గుర్తొస్తే చాలు లొట్టలేసి, చాప మీద చెయ్యే తలగడ చేసుకుని మధ్యాన్నం చిన్న కునుకు తియ్యడాన్ని మిస్సవుతున్నవాళ్ళూను. అంచేత నేను పెట్టిన పొడుపు కథ చూడగానే వెంఠనే రియాక్టయారు. అమెరికానించీ, ఇండియానించీ!
‘S ‘ అన్నాడు, “Helicopter missing?,” అని.
దానికి నేను, “సామాన్యుడు కదా, cannot afford flying in KA పాల్’స్ helicopter 🚁s & KCR’s Cars🚗 🤗,” అన్నా.
అటు పక్కనుంచి ఆనందభాష్పాలు, ఇలా 👉 😂
ఈసారి US నుంచి, “M.D” అంటూ NR ట్వీటాడు.
“You must solve the riddle fully, NR!😀,” అన్నాను.
“😀🤪M.D is the answer for everything. He has been friendly with all 4 political parties of AP/TS,” అని NR రెస్పాన్సు.
గ్రూపులో నవ్వులు
😀😀😀😀
నర్మగర్భపు నవ్వులు
😊😊😊😊
కళ్ళలో నీళ్ళొచ్చేలా పకపక నవ్వులు
😂😂😂😂
[ ఇక్కడ కాస్త పిడకల వేట అవసరం –>
M.D. మేస్టారి మీద నాకు చాలా నమ్మకం. ఎంత నమ్మకవంటే రాముడికి హనుమంతుడి మీదున్న నమ్మకానికి ఈజీగా హండ్రెడ్ టైమ్స్ ఎక్కువుంటుంది.
“జస్ట్, చూసిరా, హనుమా!,” అని రాముడంటే కాల్చి వచ్చే రకం హనుమ. చూడకుండానే కాల్చేసే రకం M.D.గారు. ఉ.పటేలూ, ర.రా.రాజనూ, పాకిస్తానూ, ఇమ్రాన్-ఖానూ సాక్ష్యం ఇస్తారు కావాలంటే. అందుకే నాకు సార్ అంటే అంత నమ్మకం.
ఈ నమ్మకమే M.D.మేస్టార్ని పి.ఎమ్.ని చేస్తుందని, అప్పుడింక మేష్టారు ప్రధాని పదవితో ప్రయోగాలు ఆపి ప్రజలకి ప్రయోజనం వున్న పనులు కూడా చేస్తారని నా ఉద్దేశం. అంటే ము_ _ _నీ, అ _ _ _నీల పనులే కాకుండా సామాన్య ప్రజలకి పనికొచ్చే పనులు కూడా అని. Of course, ము_ _ _నీ, అ _ _ _నీలు కూడా పాపం ప్రజలే అనుకోండి😉.
“ఏం? ఇప్పుడాయన సామాన్యుల కోసం ఏం చెయ్యట్లేదా?,” అనడక్కండి. చేస్తున్నారో, లేదో సామాన్యుణ్ణి నాకేం తెలుస్తుంది? ఆల్ సెడ్ అండ్ డన్, నా కోరిక మాత్రం ఆయన స్లైట్ మెజారిటీతో గెలిచి, నాలుగైదు పార్టీల Coalition governmentకి లీడర్ అవ్వాలని. డెమోక్రసీలో అబ్సొల్యూట్ మెజారిటీ అస్సలు మంచిది కాదని సోషల్ & పొలిటికల్ సైంటిస్టుల అభిప్రాయం. ఎమర్జెన్సీలకీ, డిక్టేటర్-షిప్పులకీ బీజం అబ్సొల్యూట్ మెజారిటీలోనే ఉంటుందంట. పిడకలవేట సమాప్తం.]
ఇంతలో ‘R’ పంచ్👊 విసిరాడు, “సామాన్యుడు ఉన్నాడక్కడ, M.D .పేరు చెబితే చీపురు పడతాడు,” అని. ఆబ్వియస్లీ,’R’ చెబుతున్నది హిందీలో ఆమ్-ఆద్మీ అని మనం పిల్చుకునే సామాన్యుడి చీపురు గురించే. (స్వచ్ఛ భారత్ పుట్టకముందే చీపురు పట్టిన ఆమ్-ఆద్మీకి కుదరట్లేదు కానీ తన చీపురుని ఎప్పుడెప్పుడు ఎవరి వీపు మీద తిరగేద్దామా అని తహతహలాడుతున్నాడయ్యే)
“పంచ్ అదిరిందన్నా,” అన్నా, ఇలా 😄 పగలబడి నవ్వుతూ.
Scholary humourకి కేరాఫ్ అడ్రస్ మా R. 😀😀
ఇంతలో మా ‘P’కి ఏమైందో తెలీదు, “నవ్వు నాలుగు విధాల రైటు,” అనే, జంధ్యాలగారిదనుకుంటా,ఆ కోట్ ని పెదాల మీద రాసుకుని, అందుకు తగ్గట్టు హంగామా చేసేవాడు కాస్తా ఆత్రేయ మాస్టార్లా, “కొన్ని కలల్లోనే బాగుంటాయి. ఏది ఏమైనా చివరికి మిగిలేది సామాన్య ప్రజల వ్యధలు మాత్రమే,” అంటూ కబ్జా చేసిన లారీడు తడి ఇసుకంత బరువైన డైలాగు వదిలాడు.
సడన్లీ గ్రూపు సైలెంటై పోయింది. సామాన్యుడి రియాలిటీ ఒక్కసారిగా అందర్నీ ఆవరించింది.
పైన బొమ్మలో పగటికలలు కంటున్న సామాన్యుడు, “కలలే మనకు మిగిలిపోవు కలిమి చివరకూ…. ఆ కలిమి కూడ దోచుకునే దొరలు ఎందుకూ…??,” అంటూ మన “సు”కవి పాటని భారమైన ధరహాసంతో హమ్ చేస్తూ మనోనేత్రంలో మెదిలాడు. “పిండేశావయ్యా,’P’!! 🤣 అంటూ ఆనందభాష్పాల ఎమోజీతో పాట కోట్ చేసి వాతావరణాన్ని తేలిక చేద్దామని ప్రయత్నించా.
ఉహూ!! నో రెస్పాన్స్! అందరూ పనుల్లో బిజీ ఐపోయారు.
సామాన్యుడి కలకి నా భాష్యం నేనే చెప్పుకున్నా, ఇలా –
“నా పేరు చెప్పుకుని పవరు కోసం, పదవుల కోసం పందెంకోళ్ళల్లా కొట్టుకు చావకుండా ప్రజాతీర్పులో ఎవరికి ఏ స్థానం దక్కితే ఆ స్థానంలో మీరు చెయ్యాల్సిన పని తిన్నగా చెయ్యండ్రా నాయనా! స్వతంత్రం వచ్చి డెబ్భైయ్యేళ్ళెైపోయిందప్పుడే. రూలింగ్ పార్టీ, అప్పోజిషన్ – ఈ రెండూ ప్రజాప్రభుత్వం అనే ఒకే నాణేనికి రెండు పక్కలు అనేది మీరు అర్ధం చేసుకుంటే మీరు తన్నుకు చచ్చి, నన్ను చంపరు.” అనుకుంటున్నాడు, సామాన్యుడు. సైకిలు మీద టీకొట్టుకెళ్లి గాజు గ్లాసులో టీ పోయించుకుని ఫాను కింద కూచుని టీ తాగడం అంటే కేంద్రప్రభుత్వం – రాష్ట్రప్రభుత్వం – ప్రతిపక్షం ఒకరిమీదొకళ్ళు దుమ్మెత్తి పోసుకునే బదులు ప్రజల కోసం విలువలు పాటిస్తే ఎంత బాగుండు …. అని వాడి కలకి అంతరార్ధం.
Note: సైకిలుకి అధికారం, గ్లాసు, ఫేన్లకి ప్రతిపక్షం అని కాదులెండి. సందర్భానికి / ఆ వస్తువుకి తగ్గట్టు కల్పించానంతే.
(ధర్మవరపు సుబ్రమణ్యం స్టైల్లో,👉 లిటరల్ మీనింగులొద్దు బాబూ😎!! ok?)
Photo courtesy : Google
బై ద వే, కాకతాళీయమో, కోయిన్సిడెంటలో కానీ ఈ టపా రాసీ రాయగానే యూట్యూబ్ లో ఈ 👇 వీడియో చూడ్డం జరిగింది. సామాన్యుడు తన భావాల్ని స్పష్టంగా చెప్పగలిగితే ఇలాగే ఉంటుందనిపించింది.
ఇంతే🤗సంగతులు. బై4నౌ🙏😁 –
పాలకులకి వాళ్ళు మనుషులే అన్న స్పృహ పోయింది. అందుకనే మిగిలిన వాళ్ళ ఆశలు వాళ్ళకి అర్థం కావనుకొంటా. సామాన్యులను ఉద్ధరించే వాడు ఎవరో ఒకరు వస్తారని ఆశించటంలో తప్పులేదేమో?
LikeLike
థాంక్ యూ అన్యగామిగారు.
//సామాన్యులను ఉద్ధరించే వాడు…//
ఉద్ధరించడం అనే కాన్సెప్టే సామాన్యుడి కొంప తీస్తోందనుకుంటా. మమ్మల్ని మేము ఉద్ధరించుకుంటాం, అవకాశాలు కల్పించడానికి మీ పని మీరు చెయ్యండనే స్టెర్న్-మెసేజ్ సామాన్యుడి నుంచి నాయకులకి అందడం లేదు. Of course, ఇందుకు చాలా కారణాలున్నాయనేది కూడా నిజం.
LikeLike
మీ టైటిల్ చూడగానే నాకు కూడా హెలికాప్టర్ మిస్ అయిందనిపించింది.
“ఫాను కింద కూర్చుని టీ తాగుతూ ఆకాశంలో వెళ్తున్న హెలికాఫ్టర్ మీద పిట్ట రెట్టని చూసి నవ్వుకోవాలని” అనిపించొచ్చుగా.
నాకు కూడా coalition govt అయితేనే మంచిదనిపిస్తోంది.
LikeLike
@సూర్య ,
హ! హ! 🤣. హెలికాఫ్టర్ మీద కాకపోయినా వారి బోయింగ్ మీదంతా పిట్ట రెట్టలేనంట.
LikeLike
ఇంతకీ ము—నీ లు అ—నీలు ఎవరండీ
LikeLike
సూర్యగారు, అది క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. 🤐
LikeLike
మీ సామాన్యుడి కోరిక తీరాలంటే ‘ చేయి ‘ సహకరించాలిగా .
LikeLike
మాస్టారూ, అందరూ సామాన్యుడికి చివర్లో హేండిచ్చే వాళ్ళే కదా , అందుకే ‘హస్తం’వారిని ప్రత్యేకంగా చూపించలేదు.
LikeLike
మీ సృజనాత్మకత భలే !! 😀 అందరూ అందరే !!
LikeLiked by 1 person
థాంక్ యూ, “someone” గారూ🙏😊. నిజానికి మీ మెచ్చుకోలు నా మిత్రులకే ఎక్కువగా చెందుతుంది. మా కబుర్లు అలా evolve అయ్యాయి 😊
LikeLike
సైకిలు ఫానూ కమలం హస్తం
తేడా చూచుట చాదస్తం,
రాజకీయ చరిత్ర సమస్తం
ఎంత చదివినా ఆస్తవ్యస్తం
LikeLike
సైకిలు ! ఫ్యానూ హస్తం
బా కమలము! బుర్ర తిరిగె వాటి అజెండా
బాకాల చూడగ జిలే
బీ! కానిది కాక నిన్ను విడుచునకొ సఖా 🙂
LikeLike
జిలేబీగారూ, ఈ మధ్య మీ పద్యాలు బాగా లేటుగా వస్తున్నాయి. 😒
LikeLike
పోలింగ్ ముగిసింది కాబట్టి సరదాగా రెండు పేరడీ పాటలు.
పాకాలి జగన్, దేకాలి జగన్, పీకాలి జగన్. మన జగన్.
పెట్టాలి (ముద్దులు) జగన్, నిమరాలి (బుగ్గలు) జగన్, మన జగన్.
నీ సహనం చూస్తుంటే EVM కైనా కన్నీళ్ళు,
చంద్రన్న, ఓ చంద్రన్నా, ఆంధ్ర జాతికిక నీ అవసరమే లేదన్నా…
Just kidding…
LikeLike
బోనగిరి వారూ, పేరడీలు సూపర్ 👌👌👌
నేనూ రెండు రాస్తా-
1)దండాలయ్యా 🙏మోడీ భయ్యా, మాతోనే నువ్వుండాలయ్యా😭
2) కొట్టాలి రాహుల్ 😉కన్ను కొట్టాలి, ఇవ్వాలి రాహుల్😚 ముద్దులివ్వాలి
LikeLike
నాడు
నేడు
ఎన్నడూ
చెప్పలేని
యెన్నికల
వేదన 🙂
LikeLike
ఓటులేని కథ సినిమా నుంచి.
ఈసీయే ఇచ్చాడు ఓటు ఒకటీ…. ఇక వెయ్యేల… రెండువేలేల ఓ నాయకా..
ఏల ఈ దురద.. ఏంది ఈ బురద..
LikeLiked by 1 person
మళ్ళీ వహవ్వా!వహవ్వా!
2024లో పార్టీ ప్రచారాల వీడియోలు / పాటల కాంట్రాక్టులు మనకే సూర్యగారు 🤗
LikeLike
వీవీ (“జేడీ”) లక్ష్మీనారాయణ: ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను
పవన్ కళ్యాణ్: గాజువాక పిల్లా మేము గ్లాసులోళ్ళం కాదా?
లోకేష్ బాబు: వద్దంటే వెళ్లాను మందలగిరికి
బాలయ్య బాబు: నీకూ నాకూ రెండు ఇష్టాలు ఉంటాయా బావా?
జేసీ దివాకర్: దంచు దంచు బాగా దంచు
బోయపాటి శీను: పాలిచ్చే ఎద్దుకు పసుపు కుంకుం
LikeLike
జైగారు, గొట్టిముక్కలవారు గట్టి ముక్కల (పంచ్ లు) వారే 🤗😀
LikeLike
సంగీత విభావరితో
రంగస్థలమయ్యె బ్లాగు రామూజీ ! , చే
రంగ మహామహులు మనో
ఙ్ఞంగ వినోదాలు పండె గంగాఝరియై .
పాట(ఠ)క దిగ్గజాలకు అభినందనలు .
LikeLike
నెనరులు మాస్టారు
మీ పద్యం వచ్చాకే రంగస్థలం అయింది. 🙏🙂
LikeLike
🌸అందరికీ🌸
🌸శ్రీరామ🕉⚖ 🏹నవమి🌸 🌸శుభాకాంక్షలు🌸
LikeLike