స్టేట్ లెవెల్లో తిరుమలేశ్వరుడికే తిరునామాలు పెట్టడంలో…..
జాతీయస్థాయిలో రాములవారి పేర రాజకీయాలు చెయ్యడంలో ….
ఆరితేరిపోయారు నాయకులు…
గుళ్లో దేవుడు మాట్లాడక ఊరుకుంటాడని వీళ్ళకి ధైర్యమో? నమ్మకమో? 🤔
ప్రజల గుండెల్లో దేవుడు కూడా అంతే అనుకుంటారా?
ఏమో మరి 🤔 😇
వోటరు దేవుళ్ళే తేల్చాలి మరి 🤗
బై 4నౌ
తిరుమలేశుడి సాక్షిగా అని వాళ్ళు క్లియర్గా చెప్పారా?
లేక తిరుపతిలో చెప్పారని మనం అలా అనేసుకుంటున్నామా?
LikeLike
బోనగిరి గారూ,
నిజంగా దేవుడి పేరు చెప్పి ప్రమాణం చెయ్యడానికీ, అమాయక నమ్మకంతో వున్న ప్రజలకి వాగ్దానం చెయ్యడానికీ పెద్ద తేడా వుండదని నా ఉద్దేశం. రెండిట్లో ఏదైనా, ఇచ్చిన మాట నిలబెట్టుకోపోతే దేవుడికి టోకరా ఇచ్చినట్టే.
LikeLike
సమస్యని నాన్చడంలోనూ, సాగతీయటంలోనే మజాఉందని రాజకీయులకి తెలిసినట్టు మరొకరికి తెలియదు. పాపం భగవంతుడు మౌన సాక్షిగానే ఉండటం ఉత్తమం.
LikeLike
అన్యగామిగారూ, నెనరులు.
//భగవంతుడు మౌన సాక్షిగానే …. //
ఆయనకి ఒరిగేదీ తరిగేదీ ఏం వుండదుగా ఆయన మౌనంగానే వుంటాడు. “దేవుడికేం హాయిగా కూచున్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు,” అని సినిమాపాట కూడా వుందికదా !!
LikeLike
జగతిని సమస్యలను నా
న్చగ నేతల కచ్చివచ్చు చక్కగ సుమ్మీ!
భగవంతుడా జగత్సా
క్షిగ మౌనముగాను తా వసించిన మేలౌ
జిలేబి
LikeLike
బావమరిది బావమరిదే , పేకాట పేకాటే.
దేవుడు దేవుడే, వోట్లాట వోట్లాటే
LikeLike