ఫిబ్రవరి 14 నుంచీ ఈ రోజు సాయంత్రం వరకు కంటి మీద కునుకు లేదు.
ఎక్కడ మన వాళ్లు పాక్ మీద సర్జికల్ స్ట్రైకులు చేసేస్తారో…
ఎక్కడ ఇండో-పాక్ వార్ వచ్చి పడుతుందో….
ఎక్కడ రెండుదేశాలూ ఆటంబాంబులు విసురుకుని సర్వనాశనం చేసేసుకుంటాయో….
ఒక్కో జెట్టూ 576 కోట్లు లెక్కన వేలకోట్ల ఫైనాన్షియల్ రిస్కూ, మరోపక్క అదో కుంభకోణం అని జనం అనుకుంటే ఎదురయ్యే పొలిటికల్ రిస్కూ వున్నా గుండెల్ని 56 అంగుళాల రాళ్ళు చేసుకుని కొన్న రఫాలే ఫైటర్ జెట్లు వాయుసేనలో చేరకుండానే ఎక్కడ యుద్ధం వచ్చి పడిపోతుందో ….
ఎక్కడ ఇమ్రాన్ ఖాన్ రాంగోపాల వర్మ ట్వీట్లు – – –
– – – తట్టుకోలేక ఆయన బుర్ర మీద తన క్రికెట్ బాల్ తో దీటుగా స్పందించేస్తాడో …
ఇలాంటి టెన్షన్లు వణికిస్తుంటే నిద్రెలా పడుతుంది నాలాంటి సామాన్యుడికి?
కానీ ఇవాళ నిద్ర వచ్చేస్తోంది, యుద్ధప్రాతిపదికన. నిజం! వార్ ఫియర్స్ గాలికెగిరిపోయాయ్!! జస్ట్ రెండు యూట్యూబ్ వీడియోలు చూడగానే ….
అవి ఇవీ 👇😇
మొదటిది, “మోడీ! పాకిస్తాన్-తో యుద్ధం వద్దు. నేను మాట్లాడతా వాళ్ళతో,” అంటున్న K.A.పాల్ గారి అభయహస్తం.
రెండోది, “యుద్ధం ఆపటానికి పాకిస్తాన్ వెళ్తున్నా,” అంటున్న శాంతిదూత ఆశ్వాసన.
ఇంకేం భయం లేదు. ట్రంపుతో సహా ప్రపంచం అంతా – including me – హాయిగా ఫానేసుకుని, దుప్పటి కప్పుకుని నిద్దరోవచ్చు. మీరూ నిద్దరోండి. Good night 🖐😊
😴😴😴😴😴😴😴😴😴😴
భలే భలే కామెడీ, నేను కూడా ఈ రోజు నుంచి హాయిగా నిద్దరోతా
LikeLike
వెరీగుడ్ పవన్ గారు, ప్రజాశాంతిపార్టీకి రెండు వోట్లు కన్ఫర్మ్ ఐపోయినట్టే 😀
LikeLike
😃ha ha .
LikeLike
Thankyou, Swethaji. Welcome to my blog 😊
LikeLiked by 1 person
అయ్యబాబోయ్ ఇదెప్పుడు జరిగిందీ!!
LikeLike
సూర్యగారు, కె.ఏ.పాల్ గారు అంతేనండీ. ఎప్పుడు జరిగిందో తెలుసుకునేంత టైమివ్వరండి.
LikeLike