ఆ అమ్మాయి మూగప్రశ్నలకి కొవ్వొత్తులూ, వీరాలాపాలూ సెలబ్రిటీ-తొడచరుపులూ ఎన్నికల సంవత్సరపు ఎక్స్-గ్రేషియోల కంటే అర్ధవంతమైన జవాబులున్నాయా?


photo courtesy : Eenadu

కన్నతండ్రికి కడసారి కన్నీటి సెల్యూట్ చేస్తున్న ఆ 👆 అమ్మాయి కళ్ళలో కనిపించే ప్రశ్నల్ని ప్రపంచం పసిగట్టిందా? కనీసం ఊహించిందా?
ఆ ప్రశ్నలకి –
కొవ్వొత్తుల ప్రదర్శనలూ
నాయకుల వీరాలాపాలూ
సెలబ్రిటీల తొడ చరుపులూ
ఎన్నికల సంవత్సరపు ఎక్స్-గ్రేషియోల —
కంటే అర్ధవంతమైన జవాబు ఇవ్వగలదా ?

ఇప్పుడే సోషల్-మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక వీరవనిత ఉపన్యాసం చూశా. ఆవిడ లేవనెత్తిన పాయింట్ ఏంటంటే – ఆటల్లో కప్పులు, మెడల్స్ గెల్చుకొచ్చిన క్రీడాకారులకి ఉద్యోగాలూ, కోట్ల కోట్ల రివార్డులూ, బ్రాండ్-అంబాసిడర్ షిప్పులూ, ఇళ్ళూ, స్థలాలూ… అందించే ప్రభుత్వాలు అమర జవాన్లకి ఇస్తున్నదేంటి అని .
అవును. ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన విషయమే ఇది. కానీ ప్రభుత్వం కంటే ముందు ప్రజలు ఆలోచించాల్సిన, స్పందించాల్సిన విషయం కూడా. ప్రజలు స్పందించకుండా ప్రభుత్వం యాక్షన్ తీసుకునే విషయం కాదు కూడా. ఎందుకంటే –
డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ చేసింది మహాత్యాగం అని ఒక పక్క కన్నీరు కారుస్తూ, వాళ్ల కుటుంబాలకి సహాయం చేసే విషయంలో సర్వీస్ రూల్స్ దాటని / దాటలేని అశక్తత / అసమర్ధత/ ఆలోచనా రాహిత్యం ప్రభుత్వాలదే. అదే సెలబ్రిటీల దగ్గరకొచ్చేసరికి రూలింగ్ పార్టీ ప్రచార కాంక్ష + పబ్లిక్ క్రేజు + బడా బడా కంపెనీల అడ్వార్టైజ్మెంట్ బడ్జెట్లు అన్నీ కలిసొస్తాయి. కానీ ఈ పరిస్థితికి బాధ్యత ప్రజలదే. కొవ్వొత్తులతో ప్రదర్శన అయ్యాక ఎవరైనా ఎక్కడైనా వాళ్ళ ఎంపీలని పార్లమెంటులో డిస్కస్ చెయ్యమని, ఇప్పటివరకూ ఎందుకు చేయలేదనీ నిలదీస్తున్నారా? లేదు కదా !! లేదు అనడానికి ఒకటే ఒక్క ఆధారం, పార్లమెంట్ చర్చలూ, రికార్డులే.

Military men’s patriotism/sacrifice are rewarded by employment contract.

Celebrities’ rewards are covered by –
Rulers’ hunger for publicity +
Public Craze +
Advertisement budgets of big businesses

Finally,
People do not press their MPs to discuss it in Parliament.

ఈ చర్చంతా ఒక ఎత్తూ, అసలీ చర్చలకి చోటిచ్చే సమస్యల మూలాలు వెతకడం మరో ఎత్తు. మూలచ్ఛేదం చెయ్యకుండా కబుర్లు చెప్తూ కూచునే నాయకత్వాలు – అవి దేశానివి కావచ్చు, ప్రపంచానివి కావచ్చు – అందరూ చేస్తున్నది వ్యాపారం తప్ప ఇంకోటి కాదు. ఈ సమస్యకి పరిష్కారం వుంది, దొరుకుతుంది అనుకోడం అత్యాశే, దురాశే. మనిషి మైండు యొక్క డిజైన్ అలాంటిది. ప్చ్!! ఆ డిజైన్ మార్చుకోవాల్సింది మనిషే. ఆ మార్పుకి నాందిగా, మారాల్సిన మానవజాతిలో భాగంగా 2015లో ఇలాంటి సందర్భంలోనే, తండ్రిని కోల్పోయి కుములుతున్న ఆ 👇 చిన్నారిని చూసి రాసుకున్న వాక్యాలనే మళ్ళీ గుర్తు చేసుకుంటున్నా 👇

ఈ దుఃఖానికి కారణమెవరు?ఈ గాయానికి బాధ్యులు ఎవరు?
మనుషుల మధ్యన మంటలు పెట్టే మతమా?మతం పేరుతో నాటకమాడే రాజకీయమా?
ఈ దుఃఖానికి కారణమెవరు?ఈ గాయానికి బాధ్యులు ఎవరు?
చేతికొచ్చిన తలరాతలు రాసే దేవుళ్ళా? దేవుడి పేరిట ద్వేషం నేర్పే మనుషులా?
ఈ దుఃఖానికి కారణమెవరు?ఈ గాయానికి బాధ్యులు ఎవరు?
అమాయకంగా ప్రాణాలొడ్డే దేశభక్తులా? అధికారంకై ఎత్తులు వేసే దేశభోక్తలా?
ఈ దుఃఖానికి కారణమెవరు?ఈ గాయానికి బాధ్యులు ఎవరు?
జిహాద్ ముసుగులో మూఢులు చేసే రక్తపాతమా? చేతకానితనపు ఆయుధం పట్టిన శాంతికపోతమా?
ఈ దుఃఖానికి కారణమెవరు? ఈ గాయానికి బాధ్యులు ఎవరు?
విభజించి పాలించే సామ్రాజ్యవాద స్వార్ధపరత్వమా? వ్యాపారానికి ఆదర్శాల్ని బలిచేసే బడుగుదేశాల నిస్సహాయత్వమా?
కులమతవర్గ ప్రాంతవర్ణజాతిబేధాలను పాటించనివి తీరని దుఃఖాలూ, మానని గాయాలే, మనుషులు కాదు !!
సరిహద్దులు, అంతస్తులు, ఆచారాలకి అతీతమైనవి వ్యాపారం, దురహంకారం, అధికార దాహం అంతే, మానవత్వం కాదు !!
మనుషులందర్నీ ఒకటి చేసేది మంచి మనసు, కానీ దేవుళ్ళని విడగొట్టేది మనసు చచ్చిన మతం
తెలుసుకో పిచ్చితల్లీ, ఏడవకు మళ్ళీ మళ్ళీ
గాయాలు, దుఃఖాలు, మతమౌఢ్యాలు, సిద్ధాంతాల్లో తేడాలు, మనుషుల మధ్య గోడలు, అవి రాజకీయాల పంచ ప్రాణాలు
రాజకీయం, దురహంకారం, వ్యాపారం, అధికారం, అతివ్యామోహం ఇవి స్వార్ధానికి పంచశిరస్సులు
రాజకీయాల పంచప్రాణాలు పోతేనే నీ దుఃఖానికి అంతు
స్వార్ధం పంచశిరస్సులు తెగిపడితేనే ఈ గాయానికి మందు
స్వార్ధం, రాజకీయం ఉన్నన్నాళ్ళూ సరిహద్దులకటూఇటూ నీ దుఃఖం పంచుకునే అమాయకులుంటూనే ఉంటారు.

తెలుసుకో పిచ్చితల్లీ, ఏడవకు మళ్ళీ మళ్ళీ
నాన్న చేసిన త్యాగం వ్యర్ధం కాదు, “మనిషి”ని మనిషిగా మార్చే ప్రేమై ఆ శౌర్యం, ధైర్యం మళ్ళీ అవతరిస్తాయి.

తెలుసుకో పిచ్చితల్లీ, ఏడవకు మళ్ళీ మళ్ళీ

🌹 🌹 🌹 సర్వే జనాః స్సుఖినో భవంతు 🌹 🌹 🌹

14 thoughts on “ఆ అమ్మాయి మూగప్రశ్నలకి కొవ్వొత్తులూ, వీరాలాపాలూ సెలబ్రిటీ-తొడచరుపులూ ఎన్నికల సంవత్సరపు ఎక్స్-గ్రేషియోల కంటే అర్ధవంతమైన జవాబులున్నాయా?

 1. kastephale

  ప్రజల, ప్రభుత్వాల స్పందనలో చాలా తేడా కనపడ్తోంది చూడండి.

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   చూశాను గురువుగారు. చట్టసభలు సమావేశమైన ప్రతిసారీ వాకౌట్లు, రభసలు చెయ్యకుండా పార్టీలకతీతంగా MPలు అందరూ అమర జవాన్లకై, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకై, ఆడపిల్లల రక్షణకై తీర్మానాలు / చర్చలు చేసే రోజు వస్తుందని ఆశ. 🙏

   Like

   Reply
 2. bonagiri

  వినోదాన్ని ఇచ్చే హీరోలకి అభిమానులు ఉంటారు కాని, ప్రాణత్యాగం చేసే సైనికులకి అభిమానులు ఉండరు.

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   బోనగిరిగారు థాంక్యూ. Economics & priorities of human race are weird కదా! 90% ఊకదంపుడు వినోదం అందించే సినీహీరోలకి ఈజీగా కోట్లలో రెమ్యునరేషన్లు, ప్రాణాలు పణంగా పెట్టిన సైనికుల కుటుంబాలకి దక్కేది మహా అయితే కొన్ని లక్షలు 🤔😇

   Like

   Reply
 3. Zilebi

  పద! రిపువుల నడచంగ ! మ

  న దేశ భద్రత కొరకు మనమళుకరియె కా

  దు!దువాడించుచు పుల్వము

  గ దునిమి గిరికవలె తిరిగి కసి రివ్వుమనన్ !

  వందేమాతరమ్

  Like

  Reply
 4. వెంకట రాజారావు . లక్కాకుల

  ఇలాంటి పరిస్థితుల ఏర్పడి జవాన్లు అమరులైనప్పుడు వారికుటుంబాలకు ,
  ఆజవాన్లు సర్వీసులో ఉన్నట్లుగానే భావించి ,
  ప్రమోషన్లతోపాటు వచ్చే జీతభత్యాలను రిటైరయ్యేదాకా ఆపకుండా ఇవ్వవలసిన బాధ్యతను తీసుకుని ప్రభుత్వం అమలుచేస్తే బావుణ్ణు .

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   ఐడియా బావుంది మాస్టారూ! ప్రజా ప్రతినిధులు పార్లమెంటులో బిల్లు పెట్టడమే సందేహం! 🙏🤔

   Like

   Reply
   1. jaigottimukkala@blogspot.com

    “సర్వీసులో ఉన్నట్లుగానే భావించి”

    లక్కాకుల వారి సలహా బాగుంది కాకపోతే జవాన్లకు మొత్తం సర్వీస్ కాలం 15-17 ఏళ్ళు మాత్రమే. ఏ 18-19 ఏళ్లకో కొలువు చేరి ముప్పై ఏళ్లకే కాలం చేసిన జవాన్లకు ఇంకా ఐదారేళ్ళు మాత్రమే వయోపరిమితి మిగిలి ఉంటుంది.

    జై జవాన్ జై కిసాన్ నినాదం గూడార్ధం ఏమిటంటే సైన్యం/CRPF జవాన్లలో సింహభాగం జవాన్లు అర్ధాకలితో అలమటించే సన్నకారు రైతు/భూమిహీన రైతు కూలీ నేపధ్యానికి చెందిన వారే. Our army is primarily (in the case of enlisted men & NCO’s) a peasant army.

    సర్వీసులో చేరిన రోజే జవాన్లకు వారి స్వగ్రామంలోనే మూడు ఎకరాల మాగాణి పొలం ఇస్తే వారి జీవితాలకు భద్రత ఏర్పడుతుంది. ఈ భద్రతాభావన కొండంత మనోబలాన్ని ఇస్తుంది. రిటైర్ అయ్యాక చాలీచాలని సెక్యూరిటీ గార్డు తరహా కొలువులు వెతుక్కోవాల్సిన గత్యంతరం తప్పడమే కాక విధినిర్వహణలో అమరులయితే వారి కుటుంబాలకు ఆసరా లభిస్తుంది.

    Like

    Reply
    1. YVR's అం'తరంగం' Post author

     జై గారు, వెల్కమ్ టు మై బ్లాగ్ 🙏😊

     //జవాన్లలో సింహభాగం జవాన్లు అర్ధాకలితో అలమటించే సన్నకారు రైతు/భూమిహీన రైతు కూలీ నేపధ్యానికి చెందిన వారే.// అంటే పేదరికం తప్పించుకోడానికి పేట్రియాటిజాన్ని నెత్తికెత్తుకుంటున్నట్టు కదా?🤔. వాళ్లకి దేశభక్తి లేదని కాదు, కానీ డబ్బులుంటే వాళ్లలో చాలామంది సైన్యంలో చేరేవారు కాదేమో కదా!! మన సైన్యమే కాదు బీదదేశాలన్నిటి సైన్యాల పరిస్థితి ఇదే అయ్యుంటుంది. ఇంతకంటే చెప్పడానికి నా నాలెడ్జి సరిపోదు, So, ఒక్క కోట్‌తో సరిపెడతాను –
     “They wrote in the old days that it is sweet and fitting to die for one’s country. But in modern war, there is nothing sweet nor fitting in your dying. You will die like a dog for no good reason.” – Ernest Hemingway

     Like

     Reply
     1. Jai Gottimukkala

      కొటేషన్ బాగుంది. I broadly concur.

      “పేదరికం తప్పించుకోడానికి పేట్రియాటిజాన్ని నెత్తికెత్తుకుంటున్నట్టు”

      Sorry but this looks too cynical. అమర వీరుల త్యాగాన్ని అంత తేలిగ్గా కొట్టేయడం సరికాదని నా ఉద్దేశ్యం.

      మన కోసం జీవితాన్ని పణంగా పెట్టిన వారి జీవితాలను బాగు చేయడానికి మనమేమి చేస్తున్నామన్నదే నా ప్రశ్న. నా . సైనికులు కేవలం cannon fodder కాదు, వారి మనోబలం & స్థైర్యమే ప్రజలకు శ్రీరామరక్ష అన్న వాస్తవాన్ని నాయకులు గుర్తించాలని నా ఆవేదన.

      Like

      Reply
      1. YVR's అం'తరంగం' Post author

       అవునండి నా మాటలో కొంత cynicism నిజంగానే వుంది. సరిగ్గా వ్యక్తీకరించలేకపోయాను. సైన్యంలో లేనివాళ్ళందరూ దేశభక్తులు కారని అనలేం. అలాగే సైన్యంలో చేరడానికి దేశభక్తి ఒక్కటే కారణం కానవసరం లేదని అనుకుంటున్నాను. ఒకడి స్థితిగతులు తన దేశభక్తిని సైంటిస్టుగా చూపించే అవకాశం ఇస్తే, మరొకరికి యుద్ధభూమిలో తప్ప దేశభక్తి ప్రదర్శించలేని పరిస్థితులు వుండొచ్చని చెప్పడమే నా ఉద్దేశం.

       //వారి మనోబలం & స్థైర్యమే ప్రజలకు శ్రీరామరక్ష అన్న వాస్తవాన్ని నాయకులు గుర్తించాలని నా ఆవేదన// 100% ఏకీభవిస్తున్నాను. USAలో నాయకులకి యుద్ధభూమి నుంచి సైనికులు Body bagsలో తిరిగిరావడం అనే విషయాన్ని ఊహించుకోడానికిక్కూడా భయపడతారని, అది జరిగితే రాజకీయంగా పుట్టగతులు ఉండవని భావిస్తారనీ విన్నాను. వాళ్లలో ఆ భయాన్ని పుట్టించే ఫాక్టర్ ఏంటో అది మన నాయకులు ఎవరూ పెద్దగా ఎదుర్కోలేదేమో.

       Like

 5. bonagiri

  ఇప్పుడు ఏం చేద్దాం? అని ఎవరూ ఆలోచించడం లేదు.
  చరిత్రని నిందిస్తే మన చేతికి మట్టి అంటదు కదా! అని అనుకుంటున్నారు.

  Liked by 1 person

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   అఖిలపక్ష సమావేశం తీర్మానం కూడా వీలైనంత చప్పగా చేశారని విన్నాను😇.
   గవర్నమెంట్ వారు ఏం చెయ్యాలో అది చెయ్యమని ఆర్మీకి చెప్పేశాం అంటున్నారు. ఆర్మీవాళ్ళు ఏం చేశారు, ఎంత బాగా చేశారు అనేది ఎటాకులు ఆగితేగానీ తెలీదు. అవి ఆగకపోతే ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేది ఉండనే వుంది. ఇంతలో గవర్నమెంట్ మారిపోతే గొడవే లేదు. అన్నీ పాత గవర్నమెంట్ ఎకౌంట్లో వేసెయ్యచ్చు.

   Like

   Reply

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s